తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

తిరు నక్షత్రం: ఆశ్వీజం, పూర్వాషాడ (ఆవణి / మార్గశీర్షం)
అవతార స్థలం: ఆళ్వార్ తిరునగరి
ఆచార్యులు: ఎంపెరుమానార్
రచనలు: తిరువాయ్మొళి ఆరాయిరప్పడి వ్యాఖ్యానం

భగవద్రామానుజుల  ఆచార్యులైన పెరియ తిరుమల నంబి గారి ఉత్తమ కుమారుడు  తిరుక్కురుగై ప్పిరాన్ ప్పిళ్ళాన్. వీరిని కురుగేశర్ లేదా కురుగాది నాథులు అని కుడా పిలుస్తారు. సాక్షాత్తు  భగవద్రామానుజులు వీరికి కురుగాది నాథులు అని తిరునామాన్ని ప్రసాదించి, తిరువాయ్మొళికి వ్యాఖ్యానం వ్రాయమని ఆఙ్ఞాపించారు. దీనినే ఆరాయిరప్పడి వ్యాఖ్యానం (6000) అంటాము.

పిళ్ళాన్ ను  ఎంపెరుమానార్ తమ మానస పుత్రునిగా భావించి అభిమానించారు. ఒక సారి భగవద్రామానుజుల శిష్యులందరు కలిసి పిళ్ళాళ్ దగ్గరకు వెళ్ళి రామానుజులు తిరువాయ్మొళి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించాలని ఆఙ్ఞాపించారని చెపుతారు. పిళ్ళాన్,  ఎంపెరుమానార్ల ని కలిసి ఇలా అంటారు “స్వామివారు దేశము నలు మూలల సంచరించి విశిష్ఠాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు, శ్రీభాష్యాన్ని అనుగ్రహించారు, అలానే తిరువాయ్మొళికి కూడా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించడం చేత వాటికి సరైన అర్థాలు లోకానికి అందుతాయి” అని వారి భావాన్ని వ్యక్త పరుస్తారు. రామానుజులు వీరితో ఏకీభవించి వారు వ్రాయటము చేత దివ్య ప్రబంధాలకు ఇదివరికే అర్దము తరువాతి తరాలు చెప్పు కుంటారేమో అని భావించి అలా చేయడం చేత ఆచార్య పురుషులు వీటిలో ఉన్న లోతైన అర్థాలు భవిష్యత్తులో అందించటానికి సాహసించరేమో అని పిళ్ళాన్ను వీటికి వ్యాఖ్యానాన్ని ఏర్పాటు చేయమని ఆదేశిస్తారు. విష్ణు పురాణములో ఉన్న 6000 శ్లోకములకు సమానముగా 6000 ల పడి ఉన్న వ్యాఖ్యానాన్ని అందించవలసినదిగా కోరుతారు. ఇలా రామానుజుల ఆదేశానుసారం పిళ్ళాన్ 6000 పడిని అందిస్తారు, దీనిని అనుసరించే భట్టరులు,  నంజీయర్ కు తిరువాయ్మొళి అర్థములను వివరిస్తారు.

055_4762658378_lఎంపెరుమానారులు పిళ్ళాన్  గారి వివాహన్ని చూసి వారిని అనుగ్రహిస్తున్నారు

పిళ్ళాన్ కు శ్రీభాష్యం మరియు భగవద్విషయం మీద మంచి అవగాహన పట్టు కలవు. ఒకసారి పిళ్ళాన్ గారు శ్రీవిల్లి పుత్తూర్ లో ఉన్నప్పుడు,  సోమాసియాణ్దాన్ గారు వీరి దగ్గర శ్రీభాష్యాన్ని మూడు మార్లు అధ్యయనం చేశారు. సోమాసియాణ్దాన్ , పిళ్ళాన్ కు దాసోహం చేసి కొన్ని సూక్తులు అనుగ్రహించమనగా పిళ్ళాన్ ఇలా అన్నారు” ఇతర సాంప్రదాయాలలోని విషయాలు గ్రహించి, విశిష్ఠాద్వైత సిద్ధాంతాన్ని చాటి చెప్పే ఘనత మీకు ఉన్నది, ఎటువంటి గర్వాన్ని దరిచేరనీయక రామానుజుల పాద పద్మములను ఎల్లప్పుదు మనసున ధరించి ఆశ్రయించుము”.

భగవద్రామానుజుల  అవతార అవసానమున కిదాంబి ఆచ్చాన్, కిడాంబి పెరుమాళ్, ఎంగళాళ్వాన్, నడాదూర్ అమ్మాళ్, మొదలగు వారిని పిలిచి పిళ్ళాన్ ను ఆశ్రయించమని, పరాశరభట్టర్ ను సాంప్రదాయ వారసుడిగా బాధ్యతలను నిర్వహించమని ఆఙ్ఞాపిస్తారు. భగవద్రామానుజులు, పిళ్ళాన్ పుతుడిని తమ పుత్రుడిలా భవించెడివారు, అందువలన పిళ్ళాన్ భగవద్రామానుజుల చరమ కైంకర్యాన్ని నిర్వహించారు.

పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానము లో, తిరుక్కురుగై ప్పిరాన్ పిళ్ళాన్  వైభవాన్ని కొంత ఆస్వాదిద్దాము.

 • నాచ్చియార్ తిరుమొళి 10.6 –  పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం – ఆణ్డాళ్  ఈ పాశురంలో కృష్ణుని వలె నాట్యమాడు నెమలిని సేవిస్తుంది. అమ్మణియాల్వాన్  (ఒక ఆచార్య పురుషులు) తన శిష్యుడికి  దాసోహం సమర్పించేవారు. ఇదేమని శిష్యుడు వారిని అడుగగా, ‘శ్రీ వైష్ణవులందరూ పూజ నీయులు కదా, గురువుకి శిష్యుడి గురించి తెలిసినప్పుడు వారిని ఆ విధముగా సేవించడము ఉచితమే కదా’ అని  అన్నారు. నంజీయర్  అభిప్రాయములో , ఒక వేల శిష్యుడికి  బుద్ధి పరిపక్వత లేనప్పుడు అది అహంకారమునకు దారి తీయునని సెలవిచ్చారు. కాని పిళ్ళాన్ ఈ విధముగ దానిని అందముగా విశదీకరిస్తారు – అమ్మణియాళ్వాన్ వంటి ఆచార్యుల అనుగ్రహముతో  శిష్యులు ఎటు వంటి హేయ గుణములుకు పోకుండ,  పరిపక్వతా బుద్ధి కలిగి ఆచార్యునికి   పరికరముగ మెదులుతారు అని అందంగ వివరిస్తారు.
 • పెరియ తిరుమొళి 2.7.6 – పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం – ఇందులో పరకాల నాయకి (తిరుమంగై ఆళ్వార్లు  ప్రియుని విరహతాపములో ఉన్న ప్రేయసీభావములో ఉంటారు) తల్లి తన కుటుంబాన్ని పరకాలనాయకి పరివారముగా గుర్తిస్తారు. ఇక్కడ తల్లిగారు తన కుటుంబం అని అనకుండ ఉండడాన్ని మనము గమనించాలి. పిళ్ళాన్ స్వామి ఈ విషయాన్ని ఇలా పోల్చి చెప్తారు. నంపెరుమళ్ (శ్రీరంగనాథుడు) స్వయంగా శ్రీ వైష్ణవ సాంప్రదయన్ని “ఎంపెరుమనార్ దర్శనం” అని కీర్తించి ‘శ్రీరామానుజులను ఉడయవర్ గా(లీలా మరియు నిత్య విభూతులకు నాయకునిగా)  చేసి జనులందరిని  తరింప చేస్తాను’ అని చెపుతారు. పెరుమాళ్ తనకి స్వయముగ శరణాగతి చేసేవారి కంటే రామానుజుల శ్రీపాద సంబంధీకులుగా ఉన్నవారి యందు ఎక్కువ ప్రీతిని ప్రదర్శిస్తారని  తెలుసుకోవాలి. ఎలాగైతే ఒక అందమైన ముత్యాల హారానికి మధ్యలో అమర్చబడ్డ మణి చేత ఆ హారానికి మరింత  అందము చేకురునో అలాగే  శ్రీ వైష్ణవ గురుపరంపరలో  (https://guruparamparaitelugu.wordpress.com/2013/09/01/introduction-2/)
  భగవద్రామానుజుల ప్రత్యేక స్థానం  వల్ల  విశేషమైన అందమును సంతరించుకున్నది అని పెద్దలు కీర్తించారు.
 • తిరువాయ్మొళి 1.4.7 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానం – ఈ పాశురంలో నమ్మాళ్వారులు భగవంతుడు తనని వీడి ఉన్న భావనతో ఒక చోట  పెరుమాళ్ను “అరుళాత తిరుమాలార్” అని సంబోధిస్తారు. ఆ పదానికి అర్థం నిర్దయుడు, కాని అమ్మవారి తో కలిసి ఉన్న స్వామి దయాసాగరుడు. కాని నిర్దయుడెట్లా? నంజీయర్ దీనిని ఈ విధముగా వివరిస్తారు “కరుణ, దయా వంటి గుణములతో నిండి ఉన్న అమ్మ తో కలిసి ఉన్న స్వామి దాసుడికి సాక్షాత్కారము ఇవ్వడం లేదు” అని ఆళ్వారుల పరితాపాన్ని, ఆర్తిని తెలియచేస్తారు. అయితే పిళ్ళాన్  దీనికి ఈ విధముగ అందంగా చెపుతారు, శ్రీమన్నారాయణుడు అమ్మవారి సౌందర్యన్ని చూస్తు మైమరిచి పోవడం చేత స్వామి వారు తన కన్నులను, ఆలోచనలను అమ్మవారి నుంచి మరల్చకుండడం చేత ఆళ్వారులను అనుగ్రహించలేరని  అంతరార్థాన్ని వివరిస్తారు.
 • తిరువాయ్మొళి 6.9.9 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానం – ఈ పాశురంలో నమ్మాళ్వారులు  భగవంతునితో సంసారములోని బాధలను తొలగించి, పరమపదానికి తీసుకొని వెళ్ళవలిసినదిగా వేడుకుంటారు. పిళ్ళాన్ కూడ వారి చివరి రోజులలో ఆళ్వారులు చెప్పిన ఈ పాశురములను సేవిస్తూ పెరుమాళ్ను ప్రార్థిస్తారు. ఇది చూసి నంజీయర్ దుఃఖించగా పిళ్ళాన్  ఇలా అంటారు “ఎందుకు ఏడుస్తున్నారు! ఇక్కడ ఉన్న జీవితం కంటే పరమపదములో పొందే అనుభవము తక్కువ అని అనుకుంటున్నారా, దుఖించటం మానేసి సంతోషించు”.

చరమోపాయ నిర్ణయం (http://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html), లో ఉన్న ఒక సంఘటన. ఒకనాడు శ్రీరామానుజులు తిరువాయ్మొళి లో “ పొలిగ పొలిగ” అనే పాశురనికి అర్థాలు పిళ్ళాన్ కు వివరిస్తున్నారు. పిళ్ళాన్ (శ్రీరామానుజులకు అభిమాన పుత్రుడు) శ్రీరామానుజుల దగ్గర వింటు పులకితులైపోతారు. అది చూసిన రామానుజులు, పిళ్ళాన్ను ప్రశంసించగా దానికి పిళ్ళాన్ ఇలా సమాధానం ఇస్తారు ‘ఆళ్వారులు అనుగ్రహించిన విధముగ ” కలియుం కెడుం కణ్దు కొణ్మిన్” అంటే మీ అవతార విశేషం వలన కలి దరిదాపులోకి రాడు అని భావిస్తారు. ఇదే విధముగ మీ దగ్గర నుండి తిరువాయ్మొళి సేవిస్తున్న ప్రతిసారి మాకు ఈ విషయం గుర్తుకొస్తుంది. ఈ విషయాలు తలుస్తున్న ప్రతిసారి ఆనందంతో పులకరించి పొతున్నాను, మీతో గల సంబంధ భాగ్యం మరియు సాక్షాత్తుగా మీ నుంచి తిరువాయ్మొళి సేవిస్తున్నందుకు మేము ధన్యులమయ్యాము’ అని రామానుజులకు విన్నవిస్తారు. ఇది విన్న రామానుజులను ప్రసన్నులవుతారు. ఆ రాత్రి పిళ్ళాన్ని తన తిరువారాధన పెరుమాళ్ని తన దగ్గరికి తెమ్మాన్నారు మరియు తమ శ్రీ పాదాలను పిళ్ళాన్ తలపైన ఉంచి ‘ఈ పాదాలను ఎల్లప్పుడు ఆధారముగ తలచి, మిమ్మల్ని ఆశ్రయించిన వారికి కూడా వీటిని చూపుము’ అన్నారు. తెల్లవారున తిరువాయ్మొళి వ్యాఖ్యానము విష్ణుపురాణ రీతిలో (6000 ప్పడి)  ప్రారంభము చేయమని సూచన ఇచ్చి తమ ఉదారతను స్వయముగ పిళ్ళాన్కు తెలియ చేస్తారు.

శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రంలో పిళ్ళై లోకాచార్యులు ఈ విధముగా తన సూత్రాలను పిళ్ళాన్  అనుగ్రహించిన వాటిని ఆధారముగ చేసుకొని బలపరుస్తారు. అందులో కొన్ని చుద్దాము.

 • సూత్రం 122 – భక్తి యోగానికి ఉన్న కొరువ – జలముతో ఉన్నబంగారపు బిందలో పొరపాటున ఒకే ఒక్క విషపు చుక్క పడినచో అది త్రాగడానికి ఎలా యోగ్యము కాదో, అలానే జీవాత్మని బంగారపు బింద అని, మంచి నీటిని ని భక్తి తో పొలిస్తే విషపు చుక్క వంటి లేశమైన అహంకారము స్వరూపనాశనం కలిగిస్తుంది. ఇలా చెప్పినప్పుడు భక్తిలో అహంకారానికి తావు రాకుండా చూడ వచ్చు కదా అని కొందరు అభిప్రాయపడవొచ్చు, కాని భక్తి యోగంలో అహంకారానికి చాల ఎక్కువ శాతం ఆస్కారము ఉన్నది. ఎందుకనగా భక్తి కలిగినవాడు ఒకడు ఉండాలి, వాడు నేను భగవంతుడికి ప్రీతి ని కలిగిస్తున్న అనే భావన ఉంటుంది. అందు వలన పిళ్ళాన్ భక్తి యోగం జీవాత్మకు స్వరూప విరుద్ధం, ప్రపత్తి (భగవంతుడే మనకు ఉపాయము అని స్వీకరించటం) మనకు సహజ లక్షణము అని నిర్ధారిస్తారు.
 • సూత్రం 177 – పరగత స్వీకారము ఒక్క గొప్పతనము – భగవంతుడు స్వయముగ తన నిరహేతుక జాయమాన కాటాక్షము వలన జీవాత్మలను ఉద్ధరించి కైంకర్యము అనడి ఫలమును ప్రాసాదిస్తాడు. జీవాత్మ తన స్వయం క్రుశి వలన విపరీతమైన ఫలమును మాత్రమే పొందుతాడు. జీవాత్మ స్వరూపము సహజముగ పారతంత్ర్యము. దీనిని మనము ఈ ద్రుస్టాంతముతో తెలుసుకో వచ్చు. జీవాత్మ భగవంతుడిని పొందడం అనేది పాలను బయట కొని తెచ్చుకోటం లాంటిది. అదే భగవంతుడు తనకు తాను జీవాత్మను అనుగ్రహం చేత దెగ్గరికి తెచ్చుకోవటం తల్లి తన స్థనం నుంచి బిడ్డకు పాలు పత్తడం లాంటిది. పరగత స్వీకారము కూడా తల్లి పాల వలె సహజముగ పోషనమును కలిగిస్తుంది.

మణవాళ మాముణులు అనుగ్రహించిన ఉపదేశ రత్తినమాలై (పాశురం 40, 41) లో ఈ విధముగ తెలియచేస్తారు. తిరువాయ్మొళిలోని అతి గహనమైన విషయాలను పూర్వచార్యులు అనుగ్రహించిన ఐదు వ్యాఖ్యనముల ద్వారానే తెలుసుకోవచ్చు అని స్పష్ఠ పరుస్తారు. “తెళ్ళారుం జ్ఞాన తిరుక్కురుగై ప్పిరాన్ పిళ్ళాన్” అని పిళ్ళాన్ వైభవాన్ని ప్రకటిస్తారు, దాని అర్థం పిళ్ళాన్కు భగవద్విషయంలో అతిగహనమైన అర్థాలను తాను స్పష్ఠముగ తెలుసుకొని వాటిని మధురమైన వ్యాఖ్యానం ద్వారా మనము తెలుసుకొని తరించేలా చేసారు. వారి తరువాత నంజీయర్ 9000( ఒన్బదారాయిర) ప్పడి వ్యాఖ్యానాన్ని భట్టర్ సూచనల మేరుకు అనుగ్రహిస్తారు, తరువాత నంపిళ్ళై కాలక్షేపాన్ని అనుసరిస్తూ వడక్కు తిరువీధి పిళ్ళై 36000 ప్పడి అనుగ్రహించారు, అలాగే పెరియ వాచ్చాన్ పిళ్ళై 24000 ప్పడిని అనుగ్రహించి ఉన్నారు, ఆపైన వాదికేసరి అళగియ మణవాళ జీయర్ 12000 ప్పడిలో తిరువాయ్మొళి ప్రతి పదానికి గల అర్థాలను అనుగ్రహించారు.

ఈ విధముగ ఆచార్య పురుషులైన తిరుక్కురుగై ప్పిరాన్ పిళ్ళాన్ వైభవాన్ని కొద్దిగా తెలుసు కున్నాము. వారు ఎల్లప్పుడు భాగవతనిష్ట కలిగి ఉండి శ్రీరామానుజుల  అభిమానానికి పాత్రులు అయ్యారు. మనందరము కూడా వీరి శ్రీ పాదాల యందు భాగవత నిష్ట కలిగేలా  అనుగ్రహించమని ప్రార్థిద్దాము.

తిరుక్కురుగై ప్పిరాన్ పిళ్ళాన్స్ తనియన్ (భగవద్విషయం కాలక్షేప ప్రారంభంలో అనుసంధిస్తారు):

ద్రావిడాగమ సారఙ్ఞం రామానుజ పదాశ్రితం |
సుధియం కురుకేశార్యం నమామి శిరసాన్వహం ||

ద్రావిడ వేదములో లోతైన ఙ్ఞానము కలిగి శ్రీరామానుజులు పాదారవిందములను ఆశ్రయించి ధీమంతులైన కురుకేశులను నమస్కరిస్తున్నాను.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాసన్

మూలము: http://guruparamparai.wordpress.com/2013/04/14/thirukkurugaippiran-pillan/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

4 thoughts on “తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్

 1. Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu

 2. Pingback: ఎంగళాళ్వాన్ | guruparamparai telugu

 3. dharmapuri lakshmi narasimha swamy

  adiyen
  atyatbhutam
  bhagavath gita ramanujavari vyakhyanam lo bhakti gurunchi teliyachesaru. srivachana bhushanam lo prapathi gurinchi teliya chesaru

  adiyen ramanuja dasan

  Reply
 4. Pingback: kurugEsa (thirukkurugaippirAn piLLAn) | guruparamparai – AzhwArs/AchAryas Portal

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s