పరాశర భట్టర్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలొ  మనము ఎంబార్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

పరాశర భట్టర్ ( తిరువడియందు నంజీయర్) – శ్రీ రంగం

తిరునక్షత్రము: వైశాఖ మాసం, అనూరాధ నక్షత్రము

అవతార స్థలము: శ్రీ రంగం

ఆచార్యులు : ఎంబార్

శిశ్యులు: నంజీయర్

పరమపదం చేరిన స్థలము: శ్రీ రంగం

శ్రీ సూక్తులు: అష్టశ్లోకి, శ్రీరంగరాజ స్తవము, శ్రీ గుణ రత్న కోశమ్, భగవద్ గుణ దర్పణమ్ (విష్ణు సహస్రనామ వ్యాక్యానమ్), శ్రీరంగరాజ స్తోత్రమ్.

కూరత్తాళ్వాన్ మరియు ఆండాళ్ అమ్మన్గార్లకు ప్రసిద్దులైన కుమారుడు పరాశర భట్టర్. వీరు మరియు వీరి తదుపరి సోదరులైన వేద వ్యాస భట్టర్ ఆణ్డాల్ అమ్మన్గారికి, శ్రీ రంగనాదుల ప్రసాదము తీసుకోవడముచేత ఙన్మించిరి.

ఇద్దరు భట్టరులు ఆళ్వాన్ మరియు ఆండాళ్ కి పెరియ పెరుమాళ్ (శ్రీ రంగనాదన్) ప్రసాదము వలన ఙన్మించిరి.ఒకసారి ఆళ్వాన్ మరియు ఆండాళ్ ఏమి ప్రసాదము తీసుకోకుండా క్రింద పడుకొని ఉండగా (ఆళ్వాన్ బిక్షాటనము చేసేవారు,ఆరొజు వర్షము వలన వారు ధాన్యము సేకరించలేకపొయిరి), కోవెలలో చివరి నైవేద్యము గంట శబ్ధమును వినిరి. ఆండాళ్ ఎమ్పెరుమాన్తో మనసులో ఇలా అన్నది “ఇక్కడ నీ భక్తుడైన ఆళ్వాన్ ప్రసాదము తినకుండా ఉంటే మీరు మంచి భోగములను అనుభవిస్తున్నార అక్కడ”. అది గ్రహించిన పెరియ పెరుమాళ్ వారి ప్రసాదమును ఉత్తమ నంబి ద్వార ఆళ్వాన్ మరియు ఆండాళ్ కి పంపిరి. ప్రసాదమును చూసి లోపలకి వచ్చి, ఆళ్వాన్ భీతిల్లెను.వెంటనే,ఆండాళ్ వైపు తిరిగి ఎమ్పెరుమాన్ కి చెప్పావా అని అడిగిరి, ఆండాళ్ తనే కోరేనని ఒప్పుకొనెను. ఆళ్వాన్ తమకు ప్రసాదము కావలెనని ఎమ్పెరుమాన్ ని అడగడము చూసి కలతచెందినవాడై, తన రెoడు చేతులనిండా ప్రసాదము తీసుకొని, తాను కొద్దిగా తీసుకొని మిగిలినది ఆండాళ్ కి ఇచ్చివేసెను. వారు తీసుకోబడిన ఆ రెండు చేతుల ప్రసాదము వరముగ మారి ఇద్దరు అందమైన కుమారులు ఙన్మిచింరి.

ఎంబార్ ద్వయ మహా మంత్రోపదేశమును పరాశర మరియు వేద వ్యాస భట్టరుల ఇద్దరికి పూర్తిచేసిరి.వారిద్దరికి 11 రోజుల వయస్సులోనే ఎమ్పెరుమానార్ వారికి ఆచార్యులుగా ఉండమని ఆఙ్ఙాపించిరి. అలానే ఎమ్పెరుమానార్ కూరత్తాళ్వాన్లకి పరాశర భట్టర్లను పెరియ పెరుమాళ్ళకు దత్త పుత్రుడిగా ఇవ్వమని ఆఙ్ఙాపించిరి, ఆళ్వాన్ అలానే చెసేను. శ్రీ రంగ నాచ్చియార్ భట్టర్ చిన్న వయస్సులో ఉన్నప్పుడు స్వయముగా తన సన్నిధిలో వారిని సంరక్షించెను.

అప్పుడు భట్టర్ చిన్న వయస్సులో ఉన్నపుడు, ఒకసారి పెరియ కోవెలకి మంగళాశాసనము చేయుటకై వచ్చిరి.ఆ సమయములో భట్టర్ పెరియ పెరుమాళ్ళని సేవించి, బయటకి వెళ్ళిన తదుపరి ఎమ్పెరుమానార్, అనంతాళ్వాన్ మరియు ఇతర శ్రీ వైష్ణవులకి,వారిని తమ మాదిరి చూడమని చెప్పిరి.

భట్టర్ తన చిన్న వయస్సు నుండి చాలా చురుకుగా ఉండేవారు. చాలా సంఘటనలు అది నిజమని రుఙువు చేయును.

 • ఒకసారి వారు వీధిలో ఆడుకొనుచుండగా, ఒక పండితుడు వారి నామధేయము సర్వజ్ఞ భట్టన్ పల్లకిలో వచ్చిరి. భట్టర్ శ్రీ రంగములో ఒకరు పల్లకిలో రావడము చూచి, నేరుగ వారి వద్దకు వెళ్ళి వాదమునకు రమ్మని సవాలు చేసిరి. సర్వజ్ఞ భట్టన్ భట్టర్లని చిన్నపిల్లవాని వలె భావించి, మీరు ఏ ప్రశ్న అడిగినా మేము సమాధానము చెప్పెదమని చెప్పిరి. భట్టర్ ఒక పిడికెడు ఇసుకను తీసుకొని, చేతిలో ఎంత ఇసుక ఉన్నదని అడిగిరి . సర్వజ్ఞ భట్టన్ మాటలు రానివాడై తనకి తెలియదని చెప్పెను. భట్టర్ “ఒక పిడికెడు” ఉన్నదని సమాధానము చెప్పిరి.భట్టర్ తెలివికి ఆశ్చర్యుడై , సర్వజ్ఞ భట్టన్ పల్లకి దిగి భట్టర్లని పల్లకిలో మోస్తూ తన తల్లిదండ్రుల వద్దకి తీసుకెళ్ళి వారిని స్తుతించెను.
 • ఒకసారి వారి చిన్నతనములో గురుకులములో ఊన్నసమయములో, భట్టర్ వీధులలో ఆడుతున్నారు.ఆ సమయములో, ఆళ్వాన్ వచ్చి ఎందుకు పాఠమునకు వెళ్ళకుండా ఆడుకుంటున్నావని భట్టర్ని అడిగిరి. భట్టర్ ఇలా చెప్పిరి “ప్రతి దినము చెప్పిన సంతై (పాఠము) మళ్ళీ మళ్ళీ చెపుతున్నరాని చెప్పిరి” – సాదారణముగా ఒక సంతని 15 దినములు వల్లెవేయుదురు. కాని భట్టర్ మొదటి దినమే గుర్తుపెట్టుకొనెడివారు. ఆళ్వాన్ ఒక పాశురమును అడుగగా భట్టర్ చాలా సులువుగా దానిని పఠించెను.
 • ఒకసారి ఆళ్వాన్ తిరువాయ్ మొళిలోని నెడుమార్క్కడిమై పదిగమ్ చెప్పుతుండగా, ఒక పదము “శిరుమా మనిశర్” దగ్గర అడ్డుపడెను – భట్టర్ ఇలా అడిగిరి “ఒకే వ్యక్తి చిన్నగా మరియు పెద్దగా ఉన్నారనడము అసంగతముగా లేదా?”. దానికి ఆళ్వాన్ వివరణ ఇలాచెప్పెను ముదలిఆండాన్, అరుళాళపెరుమాళ్ ఎమ్పెరుమానార్, మొదలగువారు.,కొందరు శ్రీ వైష్ణవులు శారీరకముగా చిన్నవారైనప్పడికిని,వారి హృదయము మరియు వివేకములో చాలా పెద్దవారు. భట్టర్ న్యాయమైన సమాధానమునకు సంతృప్తిచెందెను.

భట్టర్ పెద్దవారైన తరువాత సాంప్రదాయమునకు దర్శన ప్రవర్తకర్ గా మారిరి. భట్టర్ చాలా గొప్ప గుణములు కలిగిఉండెను. ఉదా: వినయ విధేయము, ఉదారత్త్వము మొదలగునవి. ప్రభందార్థములలో(అరుళిచెయల్) వీరు గొప్ప రసికులు.చాలా వ్యాఖ్యానములందు, నమ్పిళ్ళై మరియు ఇతరగు ఆచార్యులు భట్టరుల ఆలోచనే ఉత్తమమైనదిగా చెప్పుదురు.

అలానే,ఆళ్వాన్ మాదిరి, భట్టర్ కూడా తిరువాయ్ మొళి మరియు వాటి అర్థములందు మునిగిపోయిరి . వాటిలో చాలా సంఘటనలు మనకు వ్యాఖ్యానములందు కనబడును. చాలా సమయములలో ఆళ్వార్ పరాంకుశ నాయకి భావనతో పాడిరి – భట్టర్ “ఎవరు ఇప్పుడు ఆళ్వారుల మనస్సు లో ఎముందో తెలుసుకొనుట సాధ్యము కాదు ” అని చెప్పేవారు .

చాలా సఘంటనలు భట్టరుల వినయమును,ఉదారత్త్వమును,వివేకమును మొదలగు గుణములను వర్ణించును. భట్టరుల ఉదారత్త్వమును మణవాళ మామునిగళ్ యతిరాజ వింశతి యందు ఆళవందార్ల మరియు ఆళ్వాన్ల ఉదారత్త్వముతో పోల్చిరి. యదార్థముగా వ్యాఖ్యానములు అన్ని ఈదిహ్యములు (సంఘటనలు) మరియు నిర్వాహములు (ఉపదేశములు/ముగింపులు) భట్టరులచే సంపూర్ణముగా రాయబడెను.

 • శ్రీ రంగరాజ స్తోత్రమందు,వారు ఒక సన్నివేశమును గుర్తించిరి. ఒకసారి ఒక శునకము పెరియ కోవెలకు ఏ విధముగానో లొపలకి వచ్చెను.అప్పుడు అర్చకులు ఒక లఘు సంప్రోక్షణము చేయదలచిరి.అది విని భట్టర్ పెరియ పెరుమాళ్ళ వద్దకి వెళ్ళి, ప్రతీ దినము మేము(భట్టర్) ఆలయమునకు వస్తున్నాము కదా మరి మేము వస్తే లేని సంప్రోక్షనము ఒక శునకము వస్తే ఎందుకని అడిగిరి. అది వారి నిగర్వము – వారు ఒక గొప్ప పడింతులైనప్పటికిని ఒక శునకముకన్నా తక్కువగా వారిని భావించుకొనిరి.
 • అదే శ్రీ రంగరాజ స్తోత్రమునందు, వారు ఈ విధముగా చెప్పిరి దేవలోకమునందు దేవుడిగా జన్మించుటకన్నా, శ్రీరంగము వీధులలో శునకముగానైనా జన్మించవలెను అనిరి.
 • ఒకప్పుడు నమ్పెరుమాళ్ళ ముందు, కొందరు  కైంకర్యపరులు భట్టర్లని చూడకుండా వారిమీద అసూయతో వారిని దూషించసాగిరి.అదివిని భట్టర్ వారికి గొప్ప ఆభరణములు మరియు శాలువాని బహుకరించిరి.వారికి కృతజ్ఞతలు చెప్పి ఈ విధముగా అన్నారు“ప్రతీ శ్రీ వైష్ణవులు తప్పక రెండు పనులు చేయవలెను అనిచెప్పిరి–  ఎమ్పెరుమానుల కీర్తిని పాడడము మరియు తమయొక్క స్వపరాధములను గుర్తించడము. మేము ఎమ్పెరుమానుల గుణాణుభవములో మునిగి నా కర్తవ్య నిర్వహణలో చేసిన అపరాధములను గుర్తించలేకపోతిమి. ఇప్పుడు మీరు నాకు నా బాధ్యతని గుర్తుచేసి చాలా ఉపకారము చెసినారు, అందుకే మీకు నేను తప్పక ప్రతిఫలమును ఇవ్వవలెను.”. అది వారి యొక్క ఔదార్యము.
 • చాలామంది శ్రీ వైష్ణవులు భట్టరుల కాలక్షేప గోష్టికి వచ్చేవారు. ఒకసారి భట్టర్ ఒక శ్రీ వైష్ణవుడిగురించి ఎదురుచూడసాగిరి,వారు శాస్త్రము నేర్చుకోకపొయినప్పడికిని. గోష్టిలోని మిగిలిన పండితులు ఎందుకు ఆలస్యము అని అడుగగా భట్టర్ ఈ విధముగా ఆ శ్రీ వైష్ణవుడికి పండితుడు కాకపొయినను అసలైన సత్యము మాత్రము తెలుసు అని అన్నారు. ఆ విషయము నిరూపించుటకై ,ఆ పండితులలో ఒకరిని పిలచి ఈ విధముగా అడిగిరి “ఉపాయము అనగా ఏమి?” వారు ఈ విధముగా చెప్పెను“శాస్త్రములో చాలా ఉపాయములు చెప్పబడినవి- కర్మ, ఙ్నాన, భక్తి యోగము, మొదలగునవి”. అప్పుడు వారు “ఉపేయమ్ అనగా ఏమి?”అని అడుగగా ఆ పండితుడు ఈ విధముగా చెప్పెను “గమ్యములు చాలా ఉండెను – ఐశ్వర్యము, కైవల్యము, కైంకర్యము, మొదలగునవి”. భట్టర్ అన్నారు,ఎంత పెద్ద పండితులమైనప్పడికిని – ఆ విషయమందు స్పష్టత లేదు. అప్పుడు ఆ శ్రీ వైష్ణవుడు రాగా భట్టర్ వారిని అవే అడుగగా వారు తిరిగి ఈ విధముగా చెప్పెను“ఎమ్పెరుమానులే ఉపాయము మరియు ఎమ్పెరుమానులే ఉపేయము”. శ్రీ వైష్ణవులకు సరియగు నిష్ట ఇదిమాత్రమే అని భట్టర్ చెప్పిరి, అందుకే వారి గురించి మేము ఎదురుచూసామని చెప్పిరి.
 • అప్పుడు సోమాసియాన్డాన్ తిరువారాధన క్రమము గురించి అడుగగా, భట్టర్ వారికి వివరణతో ఉపదేశించిరి. ఒకసారి సోమాసియాన్డాన్ దర్శనార్ధమై భట్టరుల వద్దకు రాగా, భట్టర్ ప్రసాదమును స్వీకరించుటకై ఉపక్రమించి, హఠాత్తుగా తిరువారాధనము చేయడము మరిచిపోయారని గ్రహించి,వారి తిరువారాధన పెరుమాళ్ అక్కడకి తీసుకురమ్మని వారికి ఆ సిద్ధము చేసిన ఆహారమును నివేదించి ఆవెంటనే ప్రసాదమును స్వీకరించిరి. అప్పుడు  సోమాసియాన్డాన్ అంత పెద్ద తిరువారాధనము మాకు ఎందుకు అని అడుగగా, భట్టర్ ఈ విధముగా చెప్పెను, లఘు తిరువారాధనము అయిననూ చాలును (ఆ సమయములో తిరువారాధనము మొదలు పెడితే,ఆ సమయములో వాటిపై మోహము మరియు కోరికలతో మునిగిపోవును) మరియు సోమాసియాన్డాన్లకు తిరువారాధనము పెద్దదైననూ చాలదు(ఎందుకనగా ఆ వ్యక్తి సోమ యాగమును చాలా గొప్పగా జరిపించిరి – అందువలన అదైననూ వారికి చిన్నదిగా కనబడి సంతృప్తి చెందరు).
 • శ్రీ రంగమునందు ఉరియాడి పురప్పాడు జరుగుచుండగా, భట్టర్ వేద పారాయణ గోష్టి నుండి పక్కకు జరిగి ఇదయర్ (గొల్లపిల్లల) గోష్టిలో చేరిరి. ఏమని అడుగగా, ఎమ్పెరుమానుల కటాక్షము ఈ రోజున గొల్లపిల్లలందు ఉండును(ఎందుకనగా ఈ పురప్పాడు ప్రత్యేకముగా వారి గురించి) అలానే మనకి కూడా కటాక్షము ఎక్కడ ఉంటే అక్కడ ఉండడమే ముఖ్యము అని చెప్పిరి.
 • ఒకప్పుడు అనంతాళ్వాన్ భట్టరులని పరమపదనాధుడు రెండు హస్తములు కలిగి ఉండునా లేక నాలుగా అని అడిగిరి. భట్టర్ ఈ విధముగా చెప్పిరి ఆ రెండిటిలో ఎదైననూ ఒకటి,ఒకవేళ రెండు హస్తములు ఉంటే పెరియ పెరుమాళ్,కానిచో నాలుగు హస్తములు ఉంటే నమ్పెరుమాళ్.
 • అమ్మణిఆళ్వాన్ చాలా దూరము నుండి వచ్చి ఎదైన ఒక విలువైన సలహా చెప్పమని అభ్యర్ధించిరి,భట్టర్ వారికి తిరువాయ్ మొళిలోని నెడుమార్క్ డిమై పదిగమ్ చెబుతూ ఎమ్పెరుమాన్ గురించి తెలుసుకోవడము కొద్దిగా భుజించినట్టు,భాగవతుల గురించి తెలుసుకోవడము కడుపునిండా భోజనము చేసినట్టని చెప్ప్పిరి.
 • ఒకప్పుడు ఒక రాజు భట్టరుల కీర్తి తెలుసుకొని వారివద్దకి వచ్చి, భట్టరులకు ఏ విధమైన ధన సహాయము కావాలంటే మా దగ్గరికి రమ్మని చెప్పిరి. భట్టర్ ఈ విధముగా అన్నారు, ఒకవేళ నమ్పెరుమాళ్ళ అభయ హస్తము (రక్షించే మాదిరి ఉండును) వేరే దిక్కు తిరిగిననూ,వేరెవరి సహాయార్ధమై మేము ఎక్కడికి వెళ్ళమని చెప్పిరి.
 • ఒకసారి అముదనార్,భట్టర్ తమకన్నా తక్కువగా భావించేవారు, కారణము ఆళ్వాన్ తో వారికి ఆచార్య-శిష్య సంబంధము వలన(భట్టరులకు తండ్రి-కుమారుల సంబంధము), భట్టర్ చాలా సులభముగా “అది అంగీకరించదగినదే,కానీ అముదనార్ తమకు తాముగా ఎప్పుడు చెప్పినట్టు లేదే అనిరి.”.
 • అప్పుడు ఒకరు భట్టరులను ఈ విధముగా అడిగిరి “శ్రీ వైష్ణవులు దేవతాంతరములతో ఏ విధముగా ప్రవర్తించవలెను?”, భట్టరులు వారికి బదులుచెబుతూ ఆ ప్రశ్నను ఆ విధముగా అడగడమే సరిగా లేదు, మీరు ఈ విధముగా అడుగవలెను “దేవతాంతరములు శ్రీ వైష్ణవులతో ఏ విధముగా ప్రవర్తించవలెను?”. వారు ఈ విధముగా బదులు  చెప్పిరి, దేవతాంతరములు రజో/తమో గుణములతో కూడి ఉందురు మరియు శ్రీ వైష్ణవులు సత్వ గుణముతో ఉందురు, సహజముగా దేవతాంతరములు శ్రీ వైష్ణవులకు సహాయకులుగా ఉందురు. (ఈ ఈదిహ్యమ్ వివరంచబడెను ఆళ్వాన్ లకు గల సంబంధముతో).
 • భట్టరుల కీర్తి హద్దులేనిది, వారి స్వంత తల్లి (తానే గొప్ప పండితురాలు) అయిననూ తన కుమారుని శ్రీపాద తీర్ధమును స్వీకరించే వారు. ఆ విషయము అడుగగా , వారు ఈ విధముగా చెప్పెను ఒక శిల్పకారుడు శిల్పమును చెక్కును,ఒకసారి ఆ శిల్పములో పెరుమాళ్ళ తిరుమేని చేరిన తదుపరి దానిని పూజించవద్దు అనడము భావ్యము కాదు.అలానే భట్టరులు వారికి జన్మించినా,అతను చాలా గొప్పవాడు మరియు తప్పక పూజించదగురు.
 • ఒకసారి దేవతాంతరపరుడి ధోతి అనుకోకుండా భట్టర్ వారికి తగిలినది. వారు గొప్ప పడింతులైనప్పటికినీ, భట్టర్ ఆ చిన్న సంఘటనకు కొద్దిగా కదలి సౌమ్యముగా ఆ దేవతాంతరపరునితో సంభాషించిరి.వారి అమ్మ వద్దకి పరిగెత్తి ఏమి చేయవలెనని అడిగిరి. వారి అమ్మగారు ఈ విధముగా చెప్పెను,ఒక బ్రహ్మణుడుకాని శ్రీ వైష్ణవుని శ్రీపాద తీర్ధమును స్వీకరించమని చెప్పెను. భట్టర్ అలాంటి ఒక శ్రీ వైష్ణవుడి దగ్గరికి  వెళ్ళి అతనియొక్క శ్రీపాద తీర్ధమును ఇవ్వవలసినదిగా అభ్యర్థించిరి. ఆ శ్రీ వైష్ణవుడు భట్టరులకు సమాజములో ఉన్న స్ధాయిని గ్రహించి శ్రీపాద తీర్ధము ఇచ్చుటకు నిరాకరించిరి కాని భట్టర్ వారిని మరీ మరీ అభ్యర్థించి స్వీకరించిరి.
 • ఒకసారి భట్టర్ తిరువాలవట్ట (చామరము) కైంకర్యమును కావేరి నదీ వద్ద గల మండపములో చేయుచున్నారు. సూర్యుడు అస్తమించె వేళ అప్పుడు,కొందరు శ్రీ వైష్ణవులు భట్టరులకు సంధ్యావందనము గురించి గుర్తుచేసిరి. మేము ఎమ్పెరుమానులకు ఆంతరంగ కైంకర్యము (నమ్మకమైన సేవ) లో ఉన్నాము , చిత్రగుప్తుడు (యముడి పరిపాలనను నిర్వహంచేవారు) దీనిని పాపముగా పరిగణించరు. అళగియ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయములో ఈ సూత్రమును గురించి ఇలా వివరించిరి “అత్తాణి చేవగత్తిల్ పొతువానతు నజువుమ్” (அத்தாணிச் சேவகத்தில் பொதுவானது நழுவும்). వీటిని సాకుగా చూపి మనము నిత్య కర్మములను తప్పరాదు.
 • ఒకసారి అద్యయన ఉత్సవము జరుగుచుండగా, ఆండాళ్ అమ్మన్గార్ భట్టరులకు ద్వాదశి పారణమ్ గురించి గుర్తుకు చేసెను. దానికి భట్టరులు ఈ విధముగా సమాధానము చెప్పెను, “పెద్ద ఉత్సవము జరుగుతుండగా మనము ఏలా ఏకాదశి/ద్వాదశిలను గుర్తుపెట్టుకొందుము?”.దాని అర్థము భగవద్ అనుభవము సేవించునపుడు ఆహారమును గురించి ఆలోచించరాదు (దీనిని తప్పుగా అర్థము చేసుకొని కొందరు మనము ఏకాదశి రోజున ఉపవసించరాదు అని చెప్పుదురు,కాని ఇది మనకు కర్తవ్యము).
 • ఒకసారి భట్టర్ తమ శిష్యులకు శరీరము మరియు వాటి అలంకరణపై వ్యామోహమును వదిలివేయమని చెప్పిరి.కాని మరు దినమే,వారు మంచి పట్టు వస్త్రమును,ఆభరణములను మొదలైనవి ధరించి వచ్చెను.అప్పుడు అతని శిష్యులు మీరు చెప్పినవి మీరు ఆచరించడములో అసంగతముగా ఉన్నవి అని అడుగగా , భట్టర్ చెప్పెను, మేము మా శరీరమును కోయిల్ ఆళ్వార్ – ఎమ్పెరుమానుల వాసస్థలము (నివసించే ప్రదేశము)గా భావించుదుము.అందువలన వారు కొద్దిసమయము ఇక్కడ నివసించుదురు కావున మేము కొద్దిసమయము మండపముగా అలంకరించుకొందుమని చెప్పిరి,మనకు గనుక అతవసాయమ్ (గట్టి నమ్మకము)ఎర్పడిన మనమూ మన దేహమును చాలా విధములుగా అలంకరించుకొనవచ్చును.
 • అప్పుడు వీరసుందర బ్రహ్మ రాయన్, ఆ దేశమునకు రాజు మరియు ఆళ్వాన్లకు శిష్యులు, వారు ఒక మదిళ్ ను నిర్మించదలచిరి, దానికొరకై  పిళ్ళై పిళ్ళై ఆళ్వానుల తిరుమాళిగను కూల్చివెయదలచిరి. భట్టరులు ఆ రాజును అలా చేయవద్దని ఆజ్ఞాపించగా వారు వినలేదు.అప్పుడు భట్టర్ శ్రీ రంగమును వదిలి తిరుక్కోష్టియూర్ కి వెళ్ళి అక్కడ కొంత కాలము నివసించిరి. ఆ సమయములో, భట్టర్ శ్రీ రంగనాధులని విడచి ఉండలేక బాధలో మునిగిపోయిరి.చివరకు ఆ రాజు చనిపోయాకా, భట్టర్ శ్రీరంగమునకు తిరిగి వచ్చిరి,శ్రీ రంగమునకు వచ్చే దారిలో శ్రీరంగరాజ స్తవమును రచించిరి.
 • ఒకప్పుడు భట్టర్ వాదములో కొందరిని ఓడించిరి. వారు ఒక కుయుక్తి ప్రకారముతో ఒక కుండలో సర్పము పెట్టి అందులో ఏ మున్నదని అడిగిరి. భట్టర్ అందులో సర్పము ఉన్నదని తెలుసుకొని, ఈ విధముగా చెప్పెను “లోపల ఒక గొడుగు ఉన్నది” – ఆ పండితులు సమాధానముతో కలవరపడగా,భట్టర్ ఈ విధముగా వివరించిరి పొయ్ గై ఆళ్వార్ చెప్పెను “శెన్న్ఱాల్ కుడైయామ్” – సర్పము (ఆదిశేషన్) అనగా మరియొక విధముగా గొడుగు.

ఇలా చాలా సంఘటనలు వారి జీవితమునందు ఉండెను,అవి మనము ప్రతీ క్షణము మరియు ప్రతీ సారీ ఆనందించే విధముగా మరలా మరలా చదువాలనిపించును.

భట్టర్ శ్రీరంగ నాచ్చియారులతో ప్రత్యేక అనుబంధము,ఎందుకనగా వారికి ఆమె అమ్మ. పెరియ పెరుమాళ్ళకన్న ఎక్కువ అనుబంధము వారితో . ఒకసారి నమ్పెరుమాళ్ నాచ్చియార్ తిరుక్కోలములో ఉండగా వారితో, మేము శ్రీ రంగ నాచ్చియార్ వలె ఉన్నమా అని అడిగిరి – భట్టర్ ఈ విధముగా చెప్పిరి అంతా బాగానే ఉంది,కాని ఎమ్పెరుమాన్ నేత్రములలో కరుణ మాత్రము అమ్మ కళ్ళలో మాదిరి లేదు అనిరి.ఇది మనకు ఎలా హనుమాన్ రాముడు మరియు సీతతో పోల్చెనో గుర్తుకుతెచ్చును,చివరగా సీతా దేవి అసితేక్షణ (అందమైన నేత్రములు) అవి రామ ఎమ్పెరుమాన్ కనులకన్నా బాగుండెను అని చెప్పిరి. శ్రీగుణ రత్న కోశములో శ్రీరంగ నాచ్చియారులతో గల అనుబంధమును చెప్పెను.

భట్టర్ అర్థముచేకొనుటకు కష్టముగా ఉన్న చాలా పాశురములకు అద్భుతమైన వివరణలను చెప్పెను. వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాము.

 • పెరియ తిరుమొజి 7.1.1 కరవా మడనాగు పాశురము, పిళ్ళై అముదనార్ వివరణ ఆళ్వార్ గోవు మరియు ఎమ్పెరుమాన్ దూడ – ఆళ్వార్ ఎమ్పెరుమానుల కొరకై ఆశపడుచుండెను ,ఎలా ఆవు దూడకై ఎదురుచూసునో. కాని భట్టర్ కొంచెము మార్పుతో చూసి వేరే వివరణమును ఇచ్చిరి, అది పూర్వాచార్యులు కూడా అభినందిచిరి. భట్టర్ ఈ విధముగా చెప్పిరి “కరవా మడ నాగు తన్ కన్ఱు” కలిపి చదువవలెను, అందువలన “ఆవుదూడ తన తల్లి కొరకై చూచునో”, ఆళ్వార్ ఎమ్పెరుమాన్ కొరకై ఎదురుచూసిరి.
 • పెరియ తిరుమొళిలోని 4.4.6 వ్యాఖ్యానము ఆప్పాన్ తిరువజున్తూర్ అరయర్ మరియు ఇతర  శ్రీవైష్ణవులు భట్టరులను పాశుర అర్థమును వివరించమని అభ్యర్థించిరి. భట్టర్ వారిని పాశురము చదువమని అడిగి వెంటనే ఆళ్వార్ రావణన్ గురించి చెప్పెను అనెరి. భట్టర్ ఇక్కడ ఈ విధముగా వివరించెను రావణన్ (గర్వముతో) చెప్పాడు “నేను 3 ప్రంపంచములకు రాజుని,కాని సాధారణ మానవుడు, గొప్ప యోధుడైనప్పడికినీ నాతో యుద్ధము చేయుటకై ఆలోచించును” – కాని తుదకు రామన్ ఎమ్పెరుమాన్ చేతిలో ఓడిపోయెను.

భట్టరుల జీవితములో ముఖ్యమైన సంఘటన వారు తిరునారాయణపురమునకు వెళ్ళి వాదములో ఓడించి నంజీయర్ ని తిరిగి మన సంప్రదాయములోనికి తీసుకురావడము.అది ఎమ్పెరుమానారుల దివ్యాజ్ఞ , నంజీయరులను తప్పక సంస్కరించవలెనని. భట్టర్ తిరునారాయణపురమునకు తన పల్లకిలో,గొప్ప శ్రీ వైష్ణవ గోష్టితో మదవాచార్యులతో(నంజీయరుల అసలు నామధేయము)సిద్ధాంత వాదములో పాల్గొనుటకు వెళ్ళుచుండిరి. తుదకు వారిని ఇలా గొప్ప రీతిన వెళ్ళడము తగదని మాదవాచార్యర్ శిష్యులు వారిని ఆపి, కొంత సమయము నిలిపి వారిని ఎప్పడికి కలువకుండా చెసిరి. అప్పుడు వారు సాధారణ వేషమును దరించి మాదవాచార్యర్ తదియారాధన కూటము వద్దకు వెళ్ళిరి.అక్కడ వారు ఆహరమును తీసుకోకుండా వేచిఉండగా మాదవాచార్యులు గమనించి,వారి వద్దకు వచ్చి ఆహారమును తీసుకోపొకవడమునకు గల కారణమును అడిగి, ఏమి కావలెను అని అడిగెను. భట్టర్ మీతో వాదములో పాల్గొనెదమని చెప్పిరి.మాదవాచార్యులు భట్టరుల గురించి విని ఉండడము వలన, వారేనని తెలుసుకొని(ఎందుకనగ తనతో గెలెచే ధైర్యము వేరవరికిని లేదని)భట్టర్ తో వాదములో పాల్గొనిరి. భట్టర్ మొదట  తిరునెడున్తాన్డకమును ఎమ్పెరుమాన్ పరత్వమును తెలుపుటకై మరియు ఆ తదుపరి శాస్త్రము ద్వారా మిగిలిన అర్థములను వివరించిరి. మాదవాచార్యులు ఓటమిని అంగీకరించి భట్టర్ శ్రీ చరణములని ఆశ్రయించి వారిని ఆచార్యులుగా అంగీకరించిరి. భట్టర్ వారికి అరుళిచెయల్ మొదలగునవి నేర్చుకొనుటకు కొన్ని ముఖ్య సూచనలని చెసిరి, మరియు సంప్రదాయ అర్థములను ఉపదేశించిరి. భట్టర్ వారి వద్ద సెలవు తీసుకొని శ్రీ రంగమునకు అధ్యయన ఉత్సవము మొదలవుటకు ఒక రోజు ముందు చేరిరి.శ్రీ రంగములో భట్టర్ కొరకు గొప్ప స్వాగతమును ఏర్పాటు చెసిరి. భట్టర్ పెరియ పెరుమాళ్ళ వద్దకి వెళ్ళి అక్కడ జరిగిన సంఘటనలని విన్నవించిరి. పెరియ పెరుమాళ్ళు చాలా సంతొషపడి భట్టరులని తిరునెడున్తాన్డగమును పఠించమని ఆఙ్ఙాపించిరి, అప్పడినుండి శ్రీ రంగములో ఇది సాంప్రదాయముగా వచ్చుచున్నది – అద్యయన ఉత్సవమ్ మొదలు తిరున్డెన్తాన్డగమ్ ఒక్కటే పఠించుట.

భట్టరులు రహస్య త్రయమును మొట్టమొదట గ్రంధముగా వెలువరించిరి .వారి అష్ట శ్లోకి ఒక దివ్యమైనపని,తిరుమంత్రము, ద్వయమ్ మరియు చరమ శ్లోకమ్ చాలా అద్భుతముగా ఎనమిది శ్లోకములలో వివరింపబడెను.అలానే శ్రీరంగరాజ స్తవములో,వారు చాలా క్లిష్టమైన శాస్త్ర అర్థములను సులభమైన శ్లోకములలో వర్ణించిరి. విష్ణు సహస్రనామ వ్యాఖ్యానములో,వారు ప్రతీ తిరునామమును ఎమ్పెరుమానుల యొక్క ఒక ప్రత్యేక గుణములను తెలిపిరి అలానే వారి వివరణ అందముగా సంపూర్ణించబడినది. శ్రీ గుణ రత్న కోశము శ్రీరంగ నాచియారులకు ఒక నిజమైన అర్పణ, దీనీని మరేదానితో పోల్చలేము.

భట్టర్ సంసారమునందు పూర్వాచార్యులతో పోల్చిచూసిన చాలా తక్కువ కాలము జీవించిరి,వారు 100 సంవత్సరములకు పైగా జీవించిరి. ఒకవేల వారు ఇంకొంత కాలము కనుక జీవించి ఉంటే తప్పక ఇక్కడినుండే పరమపదమునకు నిచ్చెన కట్టును. భట్టర్ నంజీయరులను తిరువాయ్ మొళికి వ్యాఖ్యానమును రాయమని ఆజ్ఞాపించిరి అలానే వారిని దరిశన ప్రవర్తకర్ గా నియమించిరి.

ఒకసారి భట్టర్ కొన్ని పాశురములను వాటి అందమైన అర్థములను పెరియ పెరుమాళ్ళ ఎదుట పఠించిరి,దానితో వారు సంతోషము చెంది ఈ విధముగా చెప్పెను “మీకు మోక్షమును ప్రసాదిస్తున్నాము ఇప్పుడు”. భట్టర్ అదివిని ఆనందపరవశులైరి,కాని నేను నమ్పెరుమాళ్ళను పరమపదములో చూడకుంటే,ఒక రంధ్రమును చేసి దూకి పరమపదమునుండి శ్రీరంగమునకు తిరిగివచ్చెదమని చెప్పిరి.వారి అమ్మ వద్దకి వెళ్ళి ఈ విషయమును తెలిపిరి దానికి వారి అమ్మగారు తన కుమారుడు తమ కన్నా మొదలు మోక్షమును పొందినాడని వారికన్నా ఎక్కువగా సంతోషముచెందిరి (నిజముగా, ఇది మన పూర్వాచార్యుల నిష్ట – మా జివితము యొక్క ఉద్దేశమును వారు పూర్తిగా అర్ధముచేసుకొనిరి). అప్పుడు కొందరు శ్రీ వైష్ణవులు భట్టరులను ఈ విధముగా అడిగిరి “పెరియ పెరుమాళ్ళు సంతోషముతో మీకు మోక్షమును ప్రసాదించినారంటకదా .మీరు ఎందుకు సమ్మతమును తెలిపిరి? మీరు అక్కడకి వెళ్ళి ఏమిచేస్తారు? ఇక్కడ చాలా జీవాత్మలని ఈ సంసారమునుండి సంస్కరించవలెను.ఆ పనిని ఎవరు చేస్తారు?”. భట్టర్ ఈ విధముగా చెప్పిరి, “మేము ఈ సంసారమునందు యిమడలేము.ఎలా మంచి నెయ్యి ఒక శునకము కడుపులో యిమడలేదో –మేము ఈ సంసారమునందు యిమడలేము”.

భట్టర్ అందరు శ్రీ వైష్ణవులని తమ తిరుమాళిగైకి పిలచి గొప్ప తదియారాధనమును చేసిరి.వారు పద్మాసనములో కూర్చొని, తిరునెడున్దాన్టగమును పఠిస్తూ మరియు తిరుముఖమునందు నవ్వుతో తిరుమేనిని వదిలి పరమపదమును చేరిరి.ప్రతీ ఒక్కరు దు:ఖిoచుచూ చరమ కైంకర్యమును ప్రారంభించిరి. ఆండాళ్ అమ్మన్గర్, సంతోషముతో భట్టరుల చరమ తిరుమేని ఆలింగనమును చేసుకొని వారికి వీడుకోలు పలికెను. భట్టరుల జీవితము శిలను కూడ కరిగించే శక్తిని కలదు.

ఎమ్పెరుమాన్ మరియు ఆచార్యులతో మనకు అలాంటి సంబంధము కలిగేలా భట్టరు వారి శ్రీ చరణములను ప్రార్థిస్తాము .

భట్టర్ తనియన్ :

శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత:
శ్రీవత్సాంక సుత: శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే

ஸ்ரீ பராஸர பட்டார்ய ஸ்ரீரங்கேஸ புரோஹித~:
ஸ்ரீவத்ஸாங்க ஸுத~: ஸ்ரீமான் ச்ரேயஸே மேஸ்து பூயஸே

మన తదుపరి సంచికలో, నంజీయర్ వైభవమును చూద్దాము.

అడియేన్ :
రఘు వంశీ రామానుజదాసన్.

source:

Advertisements

20 thoughts on “పరాశర భట్టర్

 1. Pingback: namjeeyar | guruparamparai telugu

 2. Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu

 3. Pingback: శ్రీవైష్ణవ తిరువారాధనము | srIvaishNava granthams – Telugu

 4. Pingback: erumbi appA | guruparamparai telugu

 5. Pingback: ఎరుంబి అప్పా | guruparamparai telugu

 6. Pingback: 2014 – June – Week 2 | kOyil

 7. Pingback: కూరత్తాళ్వాన్ | guruparamparai telugu

 8. Pingback: ముదలియాణ్డాన్ | guruparamparai telugu

 9. Pingback: సోమాసియాణ్డాన్ | guruparamparai telugu

 10. Pingback: కిడాంబి ఆచ్చాన్ | guruparamparai telugu

 11. Pingback: తిరువరంగత్తు అముదనార్ | guruparamparai telugu

 12. Pingback: అనంతాళ్వాన్ | guruparamparai telugu

 13. Pingback: వేదవ్యాస భట్టర్ | guruparamparai telugu

 14. Pingback: పిన్భళగియ పెరుమాళ్ జీయర్ | guruparamparai telugu

 15. Pingback: నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ | guruparamparai telugu

 16. Pingback: అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ | guruparamparai telugu

 17. Pingback: 2015 – June – Week 1 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc

 18. Pingback: తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ | guruparamparai telugu

 19. Pingback: తిరుప్పళ్ళి యెళుచ్చి – 10 – కడిమలర్ | dhivya prabandham

 20. Pingback: కూర నారాయణ జీయర్ | guruparamparai telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s