Monthly Archives: August 2015

కూర నారాయణ జీయర్

తిరునక్షత్రం- మార్గశీర్ష(మార్గళి) – ధనిష్ఠా నక్షత్రం 

అవతార స్థలం- శ్రీరంగం

ఆచార్యులు- కూరత్తాళ్వాన్, పరాశర భట్టర్ 

పరమపదం అలకరించిన స్థలం- శ్రీరంగం

గ్రంధరచనలు- సుదర్శన శతకం, స్తోత్రరత్న వ్యాఖ్యానం, శ్రీసూక్తభాష్యం, ఉపనిషద్ భాష్యం, నిత్య గ్రంథం(తిరువారాధన క్రమం) మొదలైనవి

శిష్యులు- శేమమ్ జీయర్, తిరుక్కురుగై పిళ్ళాన్ జీయర్, సుందర పాడ్య దేవుడు మొదలైన వారు.

ఎంబార్  సోదరులగు శిరియ గోవింద పెరుమాళ్ కు మార్గళి మాస ధనిష్ఠా నక్షత్రమున శ్రీరంగమున అవతరించిరి. సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత వీరు కూరనారాయణ జీయర్ గా, నలం తిఘళ్ నారాయణ జీయర్ గా, నారాయణముని గా, పెరియ జీయర్ గా మరియు శ్రీరంగనారాయణ జీయర్ గా వ్యవహరింపబడేవారు.

emperumanar-azhwan-bhattar ఎంపెరుమానార్ , కూరతాళ్వాన్ మరియు పరాశర భట్టర్

వీరు సన్యాసాశ్రమం స్వీకరించక మునుపు వీరికి “ఎడుత్త కై అళిగియ నాయనార్” అనే కుమారులుండేవారు. వీరు మొదట కూరతాళ్వాన్ శిష్యులుగా ఉండి పిమ్మట ఆళ్వాన్ తిరుక్కుమారులగు పరాశర భట్టర్ శిష్యులై వీరి వద్ద సాంప్రదాయమును అధిగమించిరి.

వీరు బాహ్యంగా శ్రీరంగమున పార్థసారథి సన్నిధి మరియు గరుడాళ్వార్ సన్నిధి మొదలైనవి నిర్మింపచేశారు. ఇంకా పెరియ పెరుమాళ్ కు ఆంతరంగిక కైంకర్యములు ఎన్నో చేశారు.

కూరనారాయణజీయర్ తరువాతి కాలంలో వేంచేసి ఉన్న వేదాంతాచార్యులు వీరిని తమ గ్రంథములలో పెరియ జీయర్ గా పేర్కొన్నారు. ( కూరనారాయణ జీయర్ అను పేరు గల ఇంకొకరు వేదాంతాచార్యుల తర్వాతికాలంలో కూడ ఉన్నారని తెలుస్తుంది) వేదాంతాచార్యులు తమ సొంత  స్తోత్రవ్యాఖ్యానములో కూరనారాయణజీయర్  స్తోత్రవ్యాఖ్యానమును ఉట్టంకించారు.

ఇంకను కూరనారాయణ జీయర్ కృత శ్రీసూక్త భాష్యం మరియు నిత్యగ్రంథములను వేదాంతాచార్యులు తమ రహస్యత్రయ సారంలో పేర్కొన్నారు. కూరత్తాళ్వాన్ శిష్యులైన  కూరనారాయణజీయర్ ఆ కాలంలో వేంచేసి ఉన్ననఙ్ఞీయర్ కన్నా వయస్సులో పెద్దవారు కనుక  వీరి మధ్య వ్యత్యాసమును తెలియపరచుటకు  వేదాంతాచార్యులు,  కూరనారాయణ జీయర్ ను పెరియ (పెద్ద) జీయర్ గా వ్యవహరించారు.

మామునులు తమ ఈడుప్రమాణతిరట్టులో (నంపిళ్ళై యొక్క ఈడు మహావ్యాఖ్యానములో నుండి సేకరించిన ప్రమాణాలు) కూరనారాయణజీయర్ కృత ఉపనిషద్ భాష్యం ను ఉట్టంకించారు. అలాగే మామునులు , కూరనారాయణ జీయర్ ను  “శుద్ధ సంప్రదాయ నిష్ఠులు” (సాంప్రదాయము విషయములందు దృఢమైన ఆచరణ కలవారు) అని పేర్కొన్నారు.

కూరనారాయణజీయర్ సుదర్శన ఉపాసకులుగా తెలుపబడ్డారు. ఒకసారి కూరత్తాళ్వాన్ , కూరనారాయణ జీయర్ తో ఇలా అన్నారు ” మనం శ్రీవైష్ణవ కుంటుంబములో జన్మించిన వారము, ఈ సాంప్రదాయమున ఉపాసనలు చేయుట తగదని పరిగణింపబడుతుంది. మనం  సంపూర్ణంగా భగవంతుని పై ఆధారపడిన వారము,  స్వప్రయోజనాలను చేకూర్చు ఈ ఉపాసనలను చేయుట అనుచితము కదా “. దీనికి కూరనారాయణ జీయర్ “ఈ ఉపాసన నా ప్రయోజనమునకు కాదు, భగవానునికి మరియు భాగవతుల సేవార్థం మాత్రమే” అని విన్నవించారు. ఈ మాటకు సంబంధించిన రెండు సంఘటనలు ఈ  ఇక్కడ మనం తెలుసుకుందాము.

  • పూర్వము నంపెరుమాళ్ కు కావేరీ నదిలో తెప్పోత్సవము జరుగుతుండేది. ఒక సారి ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆకస్మికంగా వరద రావడంచేత తెప్పం(పడవ) వరదలోకి నెట్టబడింది. ఆ సమయాన కూరనారాయణజీయర్ తమ ఉపాసన శక్తి వలన తెప్పమును జాగ్రత్తగా ఒడ్డునకు చేర్చారు.  ఆనాటి నుండి శ్రీరంగములోనే ఒక పెద్ద తటాకం(tank) ఏర్పరచి దానిలో  తెప్పోత్సవము సురక్షితంగా జరుపవలెనని కైంకర్యపరులకు ఆఙ్ఞాపించారు జీయర్.

namperumal-theppam                                                       ఉభయ దేవేరీలతో కూడిన నంపెరుమాళ్ తెప్పోత్సవం

  • ఒక సారి తిరువరంగ పెరుమాళ్ అరైయర్ వ్యాధితో బాధపడుతుండెడివారు, దీనివలన పెరియపెరుమాళ్ కైంకర్యమునకు ఆటంకం కలిగేది. అప్పుడు కూరనారాయణజీయర్ సుదర్శన శతకమును రాసి,  స్తోత్రం చేయుట వలన అరైయర్ వ్యాధి నుండి  విముక్తులయ్యారు. ఈ విషయం సుదర్శన శతక తనియన్ లో స్పష్ఠంగా తెలుపబడింది.

thiruvarangapperumal arayar                                                                తిరువరంగ పెరుమాళ్ అరైయర్

 

శ్రీరంగమున ఎంపెరుమానార్ తర్వాత వారి మఠము కూరనారాయణజీయర్ కు సమర్పించబడింది. ఆ మఠమునకు “శ్రీరంగ నారాయణ జీయర్ మఠం” గా నామకరణం చేయబడింది. ఆనాటి నుండి క్రమంగా జీయర్లు పరంపరగా వస్తు శ్రీరంగ దేవాలయమునకు కైంకర్యం చేస్తున్నారు.

ఇంతవరకు కూరనారాయణ జీయర్ వైభవమును అనుభవించాము. వారి శ్రీపాదములయందు భగవత్/భాగవత/ఆచార్య కైంకర్యం చేయాలని ప్రార్థన చేద్దాం.

కూరనారాయణ జీయర్ తనియన్

శ్రీపరాశరభట్టార్య శిష్యం శ్రీరంగపాలకమ్ |
నారాయణమునిం వందేఙ్ఞానాధి గుణసాగరం ||

సముద్రము వంటి విశాలమైన  ఙ్ఞాన  భక్తి  వైరాగ్యముల కలిగి శ్రీరంగపాలకులై, శ్రీపరాశరభట్టరుల శిష్యులైన కూరనారాయణ జీయర్ కు వందనము చేయు చున్నాను.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

archived in https://guruparamparaitelugu.wordpress.com, also visithttp://srivaishnavagranthams.wordpress.com/, http://sriperumbuthur.blogspot.com

మూలం: https://guruparamparai.wordpress.com/2013/12/30/kura-narayana-jiyar/