Author Archives: pradeepbhattar

తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

తిరునక్షత్రం: ఆశ్వీజం, పూర్వాషాడ (ఆవణి/మార్గశీర్షం)
అవతార స్థలం: ఆళ్వార్ తిరునగరి
ఆచార్యులు: ఎంపెరుమానార్
రచనలు: తిరువాయ్ మొళి ఆరాయిరప్పడి వ్యాఖ్యానం

భగవద్రామానుజుల ఆచార్యులైన పెరియతిరుమలనంబి గారి ఉత్తమ కుమారుడు  తిరుక్కురుగై ప్పిరాన్ ప్పిళ్ళాన్. వీరిని కురుగేశర్ లేదా కురుగాదినాథులు అని కుడా పిలుస్తారు. సాక్షాత్తు  భగవద్రామానుజులు వీరికి కురుగాదినాథులు అని తిరునామాన్ని ప్రసాదించి, తిరువాయ్ మొళి కి వ్యాఖ్యానం  వ్రాయమని ఆఙ్ఞాపించారు. దీనినే  ఆరాయిరప్పడి వ్యాఖ్యానం (6000)అంటాము.

పిళ్ళాన్ ను  ఎంపెరుమానార్ తమ మానసపుత్రుని గా భావించి అభిమానించారు. ఒక సారి భగవద్రామానుజుల శిష్యులందరు కలిసి పిళ్ళాళ్  దగ్గరకు వెళ్ళి  రామానుజులు తిరువాయ్  మొళి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించాలని ఆఙ్ఞాపించారని చెపుతారు. పిళ్ళాన్,  ఎంపెరుమానార్ల ని కలిసి ఇలా అంటారు “స్వామివారు దేశము నలు మూలల సంచరించి విశిష్ఠాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు, శ్రీభాష్యాన్ని అనుగ్రహించారు, అలానే తిరువాయ్  మొళికి కూడా  వ్యాఖ్యానాన్ని అనుగ్రహించడం చేత వాటికి సరైన అర్థాలు లోకానికి అందుతాయి” అని వారి భావాన్ని వ్యక్త పరుస్తారు. రామానుజులు వీరితో ఏకీభవించి వారు వ్రాయటము చేత దివ్య ప్రబంధాలకు ఇదివరికే అర్దము తరువాతి తరాలు చెప్పుకుంటారేమో అని భావించి  అలా చేయడం చేత ఆచార్య పురుషులు వీటిలో ఉన్న లోతైన అర్థాలు భవిష్యత్తు లో అందించటానికి సాహసించరేమో అని పిళ్ళాన్ ను వీటికి వ్యాఖ్యానాన్ని ఏర్పాటు చేయమని ఆదేశిస్తారు. విష్ణుపురాణములో ఉన్న 6000 శ్లోకములకు సమానము గా 6000 ల పడి ఉన్న వ్యాఖ్యానాన్ని అందించవలసినది గా కోరుతారు. ఇలా రామానుజుల ఆదేశానుసారం పిళ్ళాన్ 6000 పడిని  అందిస్తారు, దీనిని అనుసరించే భట్టరులు,  నంజీయర్ కు తిరువాయ్  మొళి అర్థములను వివరిస్తారు.

055_4762658378_lఎంపెరుమానారులు పిళ్ళాన్  గారి వివాహన్ని చూసి వారిని అనుగ్రహిస్తున్నారు

పిళ్ళాన్ కు శ్రీభాష్యం మరియు భగవద్విషయం మీద మంచి అవగాహన పట్టు కలవు. ఒకసారి పిళ్ళాన్ గారు శ్రీవిల్లి పుత్తూర్ లో ఉన్నప్పుడు, సోమాసియాణ్దాన్ గారు వీరి దగ్గర శ్రీభాష్యాన్ని మూడు మార్లు అధ్యయనం చేశారు. సోమాసియాణ్దాన్ ,  పిళ్ళాన్ కు  దాసోహం చేసి కొన్ని సూక్తులు అనుగ్రహించమనగా పిళ్ళాన్ ఇలా అన్నారు ” ఇతర సాంప్రదాయాల లోని విషయాలు గ్రహించి, విశిష్ఠాద్వైత సిద్ధాంతాన్ని చాటి చెప్పే ఘనత మీకు ఉన్నది,  ఎటువంటి గర్వాన్ని దరిచేరనీయక రామానుజుల పాద పద్మములను ఎల్లప్పుదు మనసున ధరించి ఆశ్రయించుము ”

భగవద్రామానుజులు అవతార అవసానమున కిదాంబి ఆచ్చాన్, కిడాంబి పెరుమాళ్, ఎంగళాళ్వాన్, నడాదూర్ అమ్మాళ్ , మొదలగు వారిని పిలిచి పిళ్ళాన్ ను ఆశ్రయించమని, పరాశరభట్టర్ ను సాంప్రదాయ  వారసుడిగా బాధ్యతలను నిర్వహించమని ఆఙ్ఞాపిస్తారు. భగవద్రామానుజులు, పిళ్ళాన్ పుతుడిని తమ పుత్రుడిలా భవించెడివారు, అందువలన పిళ్ళాన్ భగవద్రామానుజుల చరమ కైంకర్యాన్ని నిర్వహించారు.

పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానముల లో, తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్  వైభవాన్ని కొంత ఆస్వాదిద్దాము.

  • నాచ్చియార్ తిరుమొళి 10.6 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం – ఆణ్డాళ్  ఈ పాశురం లో కృష్ణుని వలె నాట్యమాడు నెమలిని సేవిస్తుంది. అమ్మణియాల్వాన్  ( ఒక ఆచార్య పురుషులు ) తన శిష్యుడికి  దాసోహం సమర్పించేవారు. ఇదేమని శిష్యుడు వారిని అడుగగా, ‘ శ్రీ వైష్ణవులందరూ పూజనీయులు కదా,  గురువుకి శిష్యుడి గురించి తెలిసినప్పుడు వారిని ఆ విధముగా సేవించడము ఉచితమే కదా’ అని  అన్నారు. నంజీయర్  అభిప్రాయము లో , ఒక వేల శిష్యుడికి  బుద్ధి పరిపక్వత లేనప్పుడు అది అహంకారమునకు దారి తీయునని సెలవిచ్చారు. కాని పిళ్ళాన్ ఈ విధముగ దానిని అందముగా విశదీకరిస్తారు – అమ్మణియాళ్వాన్ వంటి ఆచార్యుల అనుగ్రహముతో   శిష్యులు ఎటు వంటి హేయ గుణములుకు పోకుండ,  పరిపక్వతా బుద్ధి కలిగి ఆచార్యునికి   పరికరముగ మెదులుతారు అని అందంగ వివరిస్తారు.
  • పెరియ తిరుమొళి 2.7.6 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం – ఇందులో పరకాల నాయకి ( తిరుమంగై ఆళ్వార్లు ప్రియుని విరహతాపములో ఉన్న ప్రేయసీభావములో  ఉంటారు) తల్లి తన కుటుంబాన్ని పరకాలనాయకి పరివారముగా గుర్తిస్తారు. ఇక్కడ తల్లిగారు తన కుటుంబం అని అనకుండ ఉండడాన్ని మనము గమనించాలి. పిళ్ళాన్ స్వామి ఈ విషయాన్ని ఇలా పోల్చి చెప్తారు. నంపెరుమళ్ (శ్రీరంగనాథుడు) స్వయంగా  శ్రీ వైష్ణవ సాంప్రదయన్ని “ఎంపెరుమనార్ దర్శనం” అని కీర్తించి ‘ శ్రీరామానుజులను–   ఉడయవర్ గా(లీలా మరియు నిత్య విభూతులకు నాయకునిగా)  చేసి జనులందరిని  తరింప చేస్తాను’ అని చెపుతారు. పెరుమాళ్ తనకి స్వయముగ శరణాగతి చేసేవారి కంటే రామానుజుల శ్రీపాద  సంబంధీకులుగా ఉన్నవారి యందు ఎక్కువ ప్రీతిని ప్రదర్శిస్తారని  తెలుసుకోవాలి. ఎలాగైతే ఒక అందమైన ముత్యాల హారానికి మధ్యలో అమర్చబడ్డ  మణి చేత ఆ హారానికి మరింత  అందము చేకురునో అలాగే  శ్రీ వైష్ణవ గురుపరంపర  (https://guruparamparaitelugu.wordpress.com/2013/09/01/introduction-2/)
    లో భగవద్రామానుజుల ప్రత్యేక స్థానం  వల్ల  విశేషమైన అందమును సంతరించుకున్నది అని పెద్దలు కీర్తించారు.
  • తిరువాయ్ మొళి 1.4.7 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానం – ఈ పాశురం లో నమ్మాళ్వారులు భగవంతుడు తనని వీడి ఉన్న భావనతో ఒక చోట  పెరుమాళ్  ను  “అరుళాత తిరుమాలార్” అని సంబోధిస్తారు. ఆ పదానికి అర్థం నిర్దయుడు, కాని అమ్మవారి తో కలిసి ఉన్న స్వామి దయాసాగరుడు. కాని నిర్దయుడెట్లా?  నంజీయర్ దీనిని ఈ విధముగా వివరిస్తారు “కరుణ, దయా వంటి గుణములతో నిండి ఉన్న అమ్మ తో కలిసి ఉన్న స్వామి దాసుడి కి సాక్షాత్కారము ఇవ్వడం లేదు” అని ఆళ్వారుల  పరితాపాన్ని, ఆర్తి ని తెలియచేస్తారు. అయితే పిళ్ళాన్  దీనికి ఈ విధముగ అందంగా చెపుతారు,  శ్రీమన్నారాయణుడు అమ్మవారి సౌందర్యన్ని చూస్తు మైమరిచి పోవడం చేత స్వామి వారు తన కన్నులను, ఆలోచనలను అమ్మవారి నుంచి మరల్చకుండడం చేత ఆళ్వారులను అనుగ్రహించలేరని  అంతరార్థాన్ని వివరిస్తారు.
  • తిరువాయ్ మొళి 6.9.9 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానం – ఈ పాశురం లో నమ్మాళ్వారులు  భగవంతుని తో సంసారములో ని బాధలను తొలగించి, పరమపదానికి తీసుకొని వెళ్ళవలిసినదిగా వేడుకుంటారు. పిళ్ళాన్ కూడ వారి చివరి రోజులలో ఆళ్వారులు చెప్పిన ఈ పాశురములను సేవిస్తూ పెరుమాళ్ ను  ప్రార్థిస్తారు. ఇది చూసి నంజీయర్ దు:ఖించగా పిళ్ళాన్  ఇలా అంటారు “ఎందుకు ఏడుస్తున్నారు ! ఇక్కడ ఉన్న జీవితం కంటే పరమపదములో పొందే అనుభవము తక్కువ అని అనుకుంటున్నారా, దుఖించటం మానేసి సంతోషించు”

చరమోపాయ నిర్ణయం (http://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html),లో ఉన్న ఒక సంఘటన. ఒకనాడు శ్రీరామానుజులు తిరువాయ్ మొళి లో “ పొలిగ పొలిగ” అనే పాశురనికి అర్థాలు పిళ్ళాన్ కు వివరిస్తున్నారు. పిళ్ళాన్ణ్ (శ్రీరామానుజులకు అభిమాన పుత్రుడు) శ్రీరామానుజుల దగ్గర వింటు పులకితులైపోతారు. అది చూసిన రామానుజులు, పిళ్ళాన్  ను ప్రశంసించగా దానికి పిళ్ళాన్ ఇలా సమాధానం ఇస్తారు ‘ఆళ్వారులు అనుగ్రహించిన విధముగ ” కలియుం కెడుం కణ్దు కొణ్మిన్” అంటే మీ అవతార విశేషం వలన కలి దరిదాపులోకి రాడు అని భావిస్తారు. ఇదే విధముగ మీ దగ్గర నుండి తిరువాయ్  మొళి సేవిస్తున్న ప్రతిసారి మాకు ఈ విషయం గుర్తుకొస్తుంది. ఈ విషయాలు తలుస్తున్న ప్రతిసారి ఆనందంతో పులకరించిపొతున్నాను, మీతో గల సంబంధ భాగ్యం మరియు సాక్షాత్తుగా మీ నుంచి తిరువాయ్  మొళి సేవిస్తున్నందుకు మేము ధన్యులమయ్యాము’  అని రామానుజులకు విన్నవిస్తారు. ఇది విన్న రామానుజులు  ప్రసన్నులవుతారు. ఆ రాత్రి పిళ్ళాన్ ని తన తిరువారాధన పెరుమాళ్ ని తన దగ్గరికి తెమ్మాన్నారు మరియు తమ శ్రీ పాదాలను పిళ్ళాన్ తలపైన ఉంచి ‘ఈ పాదాలను ఎల్లప్పుడు ఆధారముగ తలచి, మిమ్మల్ని ఆశ్రయించిన వారికి కూడా వీటిని చూపుము’అన్నారు. తెల్లవారున తిరువాయ్ మొళి వ్యాఖ్యానము విష్ణుపురాణ రీతి లో (6000 ప్పడి )  ప్రారంభము చేయమని సూచన ఇచ్చి తమ ఉదారతను  స్వయముగ పిళ్ళాన్ కు తెలియ చేస్తారు.

శ్రీవచనభూషణ దివ్యశాస్త్రం లో పిళ్ళైలోకాచార్యులు ఈ విధముగా తన సూత్రాలను పిళ్ళాన్  అనుగ్రహించిన వాటిని ఆధారముగ చేసుకొని బలపరుస్తారు. అందులో కొన్ని చుద్దాము

సూత్రం 122 – భక్తి యోగానికి ఉన్న కొరువ – జలముతో ఉన్నబంగారపు బింద లో పొరపాటున ఒకేఒక్క విషపు చుక్క పడినచో అది త్రాగడానికి ఎలా యోగ్యము కాదో, అలానే జీవాత్మ ని బంగారపు బింద అని, మంచి నీటిని ని భక్తి తో పొలిస్తే విషపు చుక్క వంటి లేశమైన అహంకారము స్వరూపనాశనం కలిగిస్తుంది. ఇలా చెప్పినప్పుడు భక్తిలో అహంకారానికి తావు రాకుండా చూడ వచ్చు కదా అని కొందరు అభిప్రాయపడవొచ్చు, కాని భక్తియోగంలో అహంకారానికి చాలఎక్కువ శాతం ఆస్కారము ఉన్నది. ఎందుకనగా భక్తి కలిగిన వాడు ఒకడు ఉండాలి, వాడు నేను భగవంతుడికి ప్రీతి ని కలిగిస్తున్న అనే భావన ఉంటుంది. అందు వలన పిళ్ళాన్ భక్తియోగం జీవాత్మకు స్వరూప విరుద్ధం, ప్రపత్తి (భగవంతుడే మనకు ఉపాయము అని స్వీకరించటం) మనకు సహజ లక్షణము అని నిర్ధారిస్తారు.

సూత్రం 177 – పరగత స్వీకారము ఒక్క గొప్పతనము – భగవంతుడు స్వయముగ తన నిరహేతుక జాయమాన కాటాక్షము వలన జీవాత్మలను ఉద్ధరించి కైంకర్యము అనడి ఫలమును ప్రాసాదిస్తాడు. జీవాత్మ తన స్వయం క్రుశి వలన విపరీతమైన ఫలమును మాత్రమే పొందుతాడు. జీవాత్మ స్వరూపము సహజముగ పారతంత్ర్యము. దీనిని మనము ఈ ద్రుస్టాంతముతో తెలుసుకో వచ్చు. జీవాత్మ భగవంతుడిని పొందడం అనేది పాలను బయట కొని తెచ్చుకోటం లాంటిది. అదే భగవంతుడు తనకు తాను జీవాత్మను అనుగ్రహం చేత దెగ్గరికి తెచ్చుకోవటం తల్లి తన స్థనం నుంచి బిడ్డకు పాలు పత్తడం లాంటిది. పరగత స్వీకారము కూడా తల్లి పాల వలె సహజముగ పోషనమును కలిగిస్తుంది.

మణవాళమామునులు అనుగ్రహించిన ఉపదేశరత్తినమాలై (పాశురం 40,41) లో ఈ విధముగ తెలియచేస్తారు. తిరువాయ్ మొళి లోని అతి గహనమైన విషయాలను పూర్వచార్యులు అనుగ్రహించిన ఐదు వ్యాఖ్యనముల ద్వారానే తెలుసుకోవచ్చు అని స్పష్ఠపరుస్తారు. “తెళ్ళారుం జ్ఞాన తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్” అని పిళ్ళాన్ వైభవాన్ని ప్రకటిస్తారు, దాని అర్థం పిళ్ళాన్ కు భగవద్విషయం లో అతిగహనమైన అర్థాలను తాను స్పష్ఠముగ తెలుసుకొని వాటిని మధురమైన వ్యాఖ్యానం ద్వారా మనము తెలుసుకొని తరించేలా చేసారు. వారి తరువాత నంజీయర్ 9000(ఒన్బదారాయిర)ప్పడి వ్యాఖ్యానాన్ని భట్టర్ సూచనల మేరుకు అనుగ్రహిస్తారు, తరువాత నంపిళ్ళై కాలక్షేపాన్ని అనుసరిస్తూ వడక్కుతిరువీధి పిళ్ళై 36000 ప్పడి అనుగ్రహించారు, అలాగే పెరియ వాచ్చాన్ పిళ్ళై 24000ప్పడిడి అనుగ్రహించి ఉన్నారు, ఆపైన వాదికేసరి అళగియ మణవాళ జీయర్ 12000 ప్పడిలో తిరువాయ్ మొళి ప్రతిపదనికి గల అర్థాలను అనుగ్రహించారు.

ఈ విధముగ ఆచార్య పురుషులైన తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ వైభవాన్ని కొద్దిగా తెలుసుకున్నాము. వారు ఎల్లప్పుడు భాగవతనిష్ట కలిగి ఉండి శ్రీరామానుజుల అభిమానానికి పాత్రులు అయ్యారు. మనందరము కూడా వీరి శ్రీ పాదాల యందు భాగవత నిష్ట కలిగేలా  అనుగ్రహించమని ప్రార్థిద్దాము.

తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్స్ తనియన్ (భగవద్విషయం కాలక్షేప ప్రారంభం లో అనుసంధిస్తారు):

ద్రావిడాగమ సారఙ్ఞం రామానుజ పదాశ్రితం |
సుధియం కురుకేశార్యం నమామి శిరసాన్వహం ||

ద్రావిడవేదములో లోతైన ఙ్ఞానము కలిగి శ్రీరామానుజులు పాదారవిందములను ఆశ్రయించి ధీమంతులైన కురుకేశులను నమస్కరిస్తున్నాను.

అడియేన్ సారథి రామానుజ దాసన్

archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/

Source: http://guruparamparai.wordpress.com/2013/04/14/thirukkurugaippiran-pillan/

సోమాసియాణ్డాన్

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ~:
శ్రీమధ్వరవరమునయే నమ~:
శ్రీ వానాచల మహామునయే నమ~:

 

తిరునక్షత్రం~: చిత్రై(మేష మాసము), ఆరుద్ర నక్షత్రము

అవతార స్తలం~: కారాంచి

ఆచార్యులు: ఎంపెరుమానార్

రచనలు~: శ్రీ భాష్య వివరణం, గురు గుణావళి (ఎంపెరుమానారుల గుణ గణములు వర్ణించబడినవి ),షడర్థ సంక్షేపము

వీరు సోమ యాగము చేసె వారి కుటుంబము లో జన్మించారు. వీరిని శ్రీ రామ మిశ్రులు అని కూడ అంటారు. రామానుజాచార్యులు స్థాపించిన 74 సింహాసానాధిపతులలో(ఆచార్యులు)  వీరు ఒకరు. వీరు సోమయా జీయర్ గా ప్రసిద్ధి చెందారు. మొట్టమొదటిగా   శ్రీ భాష్య వ్యాఖ్యానం సాయించిన ఘనత వీరికి దక్కింది. ఇప్పటివరకు కుడా తరతరాలుగ వీరి కుటుంబము శ్రీరంగములోని పెరియకోయిల్ లో వాక్య పంచాంగం ప్రచురణ కైంకర్యం చేస్తు వస్తున్నారు.శృతప్రకాశికా భట్టర్, నాయనారాచ్చాన్ పిళ్ళై మరియు వేదాన్తాచార్యుల అనుగ్రహించిన గ్రంథములలో వీరి  శ్రీ సూక్తులు అనేకములు కనబడుతాయి.

నాయనారాచ్చాన్ పిళ్ళై అనుగ్రహించిన “చరమోపాయ నిర్ణయమ్” గ్రంథములో సోమాసియాణ్డాన్ గారి “గుణావళి” శ్లోకములను ఉదాహారణములుగా చూపి కృపా మాత్ర  ప్రసన్నాచార్యుల ఘనతను లోకమునకు వివరించారు. (మంచి విషయాలను తెలుసుకోవలెననే ఉత్సుకత ఉన్నవారందరిని కేవలము వారికి గల కృప మరియు దయ గుణముల చేత ఉద్ధరించాలనుకునే అచార్యులను కృపా మాత్ర ప్రన్నాచార్యులు అని అందురు.)

యస్స్యాపరాదాన్ స్వపదప్రపన్నాన్ స్వకీయకారున్ణ్య గునేణ పాతి
స ఏవ ముక్యో గురురప్రమేయాస్ తదైవ సద్భి~: పరికీర్త్యదేహి

ఆచార్యులు అనే వారు కేవలము వారి కృపా విశేషముచేత చేత తనకి శరణాగతి చేసిన శిష్యుడిని రక్షించి శ్రీవైకుంఠమును ప్రసాదిస్తారు. అంతటి ముఖ్య మైన వారు ఆచార్యులు, ఇటువంటి మంచి విషయాలు మనకు నమ్మకమైన భాగవతోత్తములు తెలియచేస్తారు.

“చరమోపాయ నిర్ణయము” లోని ఒకానొక సన్నివేశము ద్వారా సొమాసిఆండన్ గారికి మన భగవత్ రామానుజుల పై ఉన్న భక్తి ప్రేమలు తెలుసుకోవచ్చును.

సోమయాజియార్ (సోమాసియాణ్దాన్) గారు భగవత్ రామానుజుల పాద పద్మములకు శరణాగతి చేసి వారిని కొద్ది కాలము సేవ చేసుకొని అటు పిమ్మట తిరిగి వారి స్వస్ఠలానికి(కారాంచి) చేరిరి. వీరి మనసు మాత్రము ఆచార్యుల వద్దనే ఉండిపోయింది. కొన్ని రోజులు తరువాత వీరు భగవత్ రామానుజులను చూడకుండ ఉండలేక తిరిగి ఆచార్యులను సేవించుకోడానికి సిద్ధము అవుతారు, కాని వీరి భార్య అడ్డుచెప్పేటప్పటికి రామానుజుల మూర్తిని ఏర్పాటు చేసుకొని ఆరాధనము చేసుకుందామని శిల్పిని పిలిపిస్తారు. అలా ఏర్పాటు చేయబడ్డ మూర్తిని చూసి సంత్పప్తి చెందక మరల ఇంకా అందమైన మూర్తిని చేయుటకు నిర్ణయించుకొంటారు. ఆరోజు రాత్రి నిద్ర లో భగవత్ రామానుజులు ప్రత్యక్షమయి “నా విగ్రహాన్ని పాడుచేసి తిరిగి కొత్త విగ్రహము ఎందుకు ఎర్పర్చుకోవాలని అనుకుంటున్నావు ? నీవు ఎక్కడ ఉన్నను నా అభిమానము మాత్రమె నీకు ఉద్ధారకము అని అచంచల విశ్వాసము లేనిచొ తిరిగి కొత్త విగ్రహము ఎర్పర్చుకున్నను దాని మీద భక్తి కలుగదు.” అదివినిన వెంటనె వారి మూర్తి ని భద్రపరిచి, తన భార్యను విడిచి శ్రీరంగానికి ప్రయాణము చేసి భగవత్ రామానుజుల పాదముల మీద పడి జరిగిన స్వప్నాన్ని విన్నవిస్తాడు. రామానుజాచార్యులు చిరు నవ్వుతో “నీ అఙ్ఞానమును దూరము చేయుటకు, భార్యను అనుసరించుకుంటు ఆధారపడకుండ ఉండేలా చెయుటకు అలా చేసాను. నాపట్ల నీకు గురి లేకున్నను, నా అభిమానము చేత నీవు ఉధ్ధరింప పడతావు, మోక్షము తప్పనిసరిగ ప్రాప్తిస్తుంది, అన్ని రకాల భయాలను, భాదలను వీడి సంతొషము గా ఉండు” అని చెప్తారు .ఈ సంఘటమును మనకు పెరియవాచ్చాన్ పిళ్ళై గారు తెలియ చేస్తారు.

పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానముల లో సోమాసియాణ్దాన్ వైభవము తెలిపే అనేక ఐతిహ్యములు కనిపిస్తాయి, అందులో కొన్ని ఇక్కడ చూద్దాము

1.తిరునెడుంతాణ్డగం 27 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం – తిరుమంగై ఆళ్వార్ (పరకాల నాయకి భావముతో) ఒక కొంగ ను వీరి దూత గా తిరుక్కణ్ణపురానికి పంపి అక్కడ వేంచేసిన పెరుమాళ్ళకు తన హృదయములో ఉన్న ప్రేమని తెలియచేస్తారు. పెరియవాచ్చాన్ పిళ్ళై గారు తన వ్యాఖ్యానం లో తిరుమంగై ఆళ్వారులు “తిరుక్కణ్ణపురము” లో వేంచేసిన స్వామి నామాన్ని ఉచ్చరించే విధానము ఇతరులు ఎవ్వరు అనుకరించలేరు, అట్టి ప్రేమ రసాన్ని మదిలో నింపుకొని స్వామి నామాన్ని గానం చేసెవారు అళ్వారులు. అదే రీతిలొ అనంతాళ్వాన్ “తిరువేంకటముడయాన్” అని వేంకటేశుడుని పలికే తీరు, పరాశర భట్టర్ గారు “అళగియ మణవాళ పెరుమాళ్” అని శ్రీ రంగనాథుని పిలిచే తీరు, అలాగే మన సోమాసియాందాన్ గారు “ఎంపెరుమానారే శరణం” అని పలికే విధానము చాల గొప్పది. ఇవే నామాలను మరి ఎవ్వరు పలికిననూ వారు పలకగా పొందే ప్రేమ భావన, తీయదనము, మాధుర్యము కలగవు.

2. తిరువాయ్ మొళి 6.5.7 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానం – పైన వివరించిన తీరు లోనె వీరు కుడా తెలియ చేస్తారు కాని ఇక్కడ నమ్మాళ్వర్లు పరాంకుశ నాయికి భావముతో పెరుమాళ్ళను వీడి ఉండకుండ ఉండేలా చెయమని “తులైవిల్లిమంగలం ఎంపెరుమాన్” అని పిలిచే తీరు కేవలం వీరికే సొంతం. ఈ విశయాన్ని గుర్తించి నంపిళ్ళై గారు, ఆళ్వార్లు ప్రయోగించిన నామాల అర్ఠాన్ని, అందులో ఉన్న ప్రాముఖ్యతలను వివరించారు. ఇందులో వీరు ఉపయోగించిన భగవంతుని నామములకు ఒక ప్రత్యేకత సంతరించుకున్నాయి.ఎలాగైతే అనంతాళ్వాన్, భట్టర్, సోమాసియాణ్దాన్ పెరుమాళ్ళను తిరువేంకతముడయాన్, అళగియ మణవాళ పెరుమాళ్, ఎంపెరుమానార్ అని పిలిచిన విధానము మనలో పులకింతలు తెప్పిస్తాయి అని నంపిళ్ళై మనకు వివరిస్తారు.

వార్తామాలై గ్రంథములో సోమాసియాణ్డాన్ కు సంభందించిన కొన్ని సన్నివేశములను చూద్దాము

1. 126 – ఇక్కడ సోమాసియాణ్దాన్ ప్రపన్నులకు ఎంపెరుమానారే ఉపాయమని అందంగ విశద పరిచారు. స్వ ప్రయత్నము మానేసి భగంతుడిని ఆశ్రయించినప్పుడు మాత్రమే మన రక్షకత్వ భారాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. భక్తి లేక శరణాగతి ఏది మార్గము కాదు, కేవలం భగంతుడే మనకు ఉపాయము అని గుర్తించడము చాల ముఖ్యము.
2. 279 – అప్పిళ్ళై(వయసు లో వీరు సోమాసియాణ్డాన్ కంటే చిన్న వారు కని ప్రసిద్ధమైన శ్రీ వైష్ణవులు) వీరు సోమాసియాణ్డాన్ గారితో ఇలా అంటారు “మీరు ఙ్ఞానము లో, వయసులో పెద్దలు , అంతే కాకుండ పూర్వాచార్యుల అడుగు జాడలలో నడిచే వారు, ఐననూ మీ వస్త్రానికి ఒక ముడి వేసుకొని పెట్టుకోండి, దీనిని చూచిన ప్రతిసారి భాగవత అపచారము చేయకూడదని గుర్తు చేస్తుంది.”
ఇలా చెప్పడానికి కారణం ఎంతటి గొప్ప వారైననూ భాగవత అపచారము చేయటం వల్ల పతనము అవుతారు. ఇది స్వరూప నాశనానికి తోడ్పడుతుంది.
3. 304 – సోమాసియాణ్దాన్, మనము లౌకిక మైన విషయ భోగాల కొరకు ప్రాకులాడకూడదని, వాటి చే పొందే సంతోశములకు దూరము గా ఉండవలను అని కొన్ని కారణములు చెప్తారు
. మన స్వస్వరూపము భగవంతునికి దాసుడిగా ఉండటం
. మనకు లభించిన జీవితం భగవంతునికి కైంకర్యము చేసుకొనుటకు మాత్రమే
. విడతీయరానిది మరియు ఎల్లప్పుడూ కలిసి ఉండే సంబంధము భగవంతుని తో మనకు ఉంటుంది
. చివరిగ మన శరీరము తాత్కాలిక మైనది, నశించునది
అవుట చే మనము ప్రాపంచమైన సంతోషములకు ప్రాకులాడ కూడదు లేద ఇంద్రియాలను భోగ పరిచే విధముగ ప్రవర్తించ కూడదు.
4. 375 – పాలు పెరుగు దొంగలించాడని గోపాలుడిని దండించారు అని విని మన సోమాసియాణ్దాన్ స్వామి మూర్చపొతారు. యశోదమ్మ చేత శిక్షించ పడ్డ శ్రీ కృష్ణుడిని తలచుకొని పులికించి పొయారు అని ఇక్కడ తెలియచేస్తారు.

ఇలా మనము సోమాసియాణ్దాన్ ఆచార్యుల దివ్య మైన జేవితములొ కొన్ని సన్నివెశములను గురించి తెలుసుకున్నాము. వీరికి ఉన్న భాగవత నిష్ట ప్రశంస నీయమైనది. ఎంపెరుమానార్లకు సన్నిహితులు. ఇటువంటి వీరి పాదపద్మ ములను స్మరిస్తూ మనకు కుడా వీరికు ఉన్న భాగవత నిష్ట లో ఎంతొ కొంత అలవర్చింప చేయ మని ప్రర్థిద్దాము.

సోమాసియాణ్దాన్ తనియన్:

నౌమి లక్ష్మణ యోగీంద్ర పాదసేవైక ధారకమ్
శ్రీరామక్రతునాధార్యమ్ శ్రీభాష్యామృత సాగరమ్

நௌமி லக்ஷ்மண யோகீந்த்ர பாதஸேவைக தாரகம்
ஸ்ரீராமக்ரதுநாதார்யம் ஸ்ரீபாஷ்யாம்ருத ஸாகரம்

అడియేన్ ప్రదీప్ రామానుజ దాసన్

archived in https://guruparamparai.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/

Source