వడక్కు తిరువీధి పిళ్ళై

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

గత  సంచికలో మనం నంపిళ్ళై  వారి గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

వడక్కు తిరువీధి పిళ్ళై – కాంచీపురము

తిరునక్షత్రము: స్వాతి – ఆషాడమాసము

అవతార స్థలముశ్రీ రంగము

ఆచార్యులు: నంపిళ్ళై

శిశ్యులు: పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ మొదలైన

పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగం

శ్రీ సూక్తులు: ఈడు 36000 పడి

శ్రీ క్రిష్ణ పాదరులుగా జన్మించిరి, వడక్కు తిరువీధి పిళ్ళైగా ప్రసిద్దికెక్కిరి. నంపిళ్ళై ముఖ్య శిశ్యులలో ఒకరు వీరు.

వడక్కు తిరువీధి పిళ్ళై గృహస్తాశ్రమములో ఉన్నప్పడికినీ పిల్లలకు జన్మనిచ్చుటకు ఇష్టంలేక పూర్తిగా ఆచార్య నిష్ఠయందు ఉండెను. వారి అమ్మగారు అది చూసి కలత చెంది నంపిళ్ళై వద్దకు వెళ్ళి వడక్కు తిరువీధి పిళ్ళైల స్వభావమును గూర్చి చెప్పెను. అది విని, నంపిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళై మరియు అతని భార్యని రమ్మని, అతడి భార్యని తన  కృపచే దీవించి వడక్కు తిరువీధి పిళ్ళైలను పిల్లలకు జన్మనిచ్చుటకు ప్రయత్నము చేయవలెనని ఆఙ్ఞాపించిరి. ఆచార్యుల ఆఙ్ఞను అంగీకరించి వడక్కు తిరువీది పిళ్ళై అలానే చేసిరి, తొందరగానే వడక్కు తిరువీధి పిళ్ళైల భార్య ఒక శిశువుకు జన్మ నిచ్చెను. వడక్కు తిరువీధి పిళ్ళై ఆ శిశువుకు పిళ్ళై లోకాచార్య అనే నామమును పెట్టిరి, నంపిళ్ళై (లోకాచార్య) కరుణ వలన జన్మించాడు కావున. అదివిని, నంపిళ్ళై ఆ శిశువుకు అళగియ మణవాళన్ అనే పేరు పెడుదామనుకొన్నామనిరి. నమ్పెరుమాళ్ కూడా విని వడక్కు తిరువీధి పిళ్ళైలకు మరియొక శిశువు జన్మించేలా దీవించిరి, వారికి అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ అనే పేరును పెట్టిరి, వీరు అళగియ మణవాళన్ (నమ్పెరుమాళ్) కృపతో జన్మించిన కారణముగా. ఆ విధముగా వడక్కు తిరువీది పిళ్ళై రెండు రత్నములను మన సంప్రదాయమునకు ఇచ్చిరి. వీరిని పెరియాళ్వార్లతో పోల్చుదురు:

  • ఆళ్వార్ మరియు వడక్కు తిరువీధి పిళ్ళై ఇద్దరూ ఆషాడమాసము స్వాతిన జన్మించిరి.
  • ఆళ్వార్ తిరుపల్లాండు మరియు పెరియాళ్వార్ తిరుమొళి ఎమ్పెరుమాన్ కృపతో వ్రాసిరి. వడక్కు తిరువీధి పిళ్ళై ఈడు 36000 పడి నంపిళ్ళై కృపతో వ్రాసెను.
  • ఆళ్వార్ ఆండాళ్ ను మన సంప్రదాయమునకు ఇచ్చిరి మరియు వారు క్రిష్ణానుభవముతో ఆమెను పెంచిరి. వడక్కు తిరువీధి పిళ్ళై పిళ్ళై లోకాచార్య మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు భగవత్ అనుభవము ద్వార పెంచి ఇచ్చిరి.

వడక్కు తిరువీధి పిళ్ళై తిరువాయ్మొళి ప్రవచనములను నంపిళ్ళై వద్ద వింటూ, పగటి వేళలో ఆచార్యుల వద్ద గడిపి, రాత్రి వేళలో మఱ్ఱి ఆకులపై వారు చెప్పినది వ్రాసేవారు. ఆ విధముగా వారు ఈడు 36000 పడి వ్యాఖ్యానమును నంపిళ్ళైల ప్రవచనములు గ్రహించి నంపిళ్ళైలకు తెలియకుండా వ్రాసిరి. ఒకసారి వడక్కు తిరువీధి పిళ్ళై నంపిళ్ళైను తదియారాధనము కొరకై వారి తిరుమాళిగైకు ఆహ్వానించగా నంపిళ్ళై అంగీకరించి వారి తిరుమాళిగైకు వచ్చిరి. నంపిళ్ళై  కోయిలాళ్వార్నందు తిరువారాధనమును చేయుటకు వెళ్ళగా, కోయిలాళ్వార్లో మఱ్ఱి ఆకులపై వ్యాఖ్యానమును చూసిరి. దాని యందు ఆసక్తి కలిగి, వాటిలో కొన్ని చదివి వడక్కు తిరువీధి పిళ్ళైని ఏమిటివి అని అడిగిరి. వడక్కు తిరువీధి పిళ్ళై నంపిళ్ళైల ప్రవచనములను వ్రాయుచుంటిమని వివరణ ఇచ్చిరి. నంపిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళైని తిరువారాధనము చేయమని ఆదేశించి, వారు  మిగిలినవి చదవడము ప్రారంభించిరి. వారు పెరియ వాచ్చాన్ పిళ్ళై మరియు ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళను వ్రాయమని అప్పటికే చెప్పిరి, వారు పెరియ వాచ్చాన్ పిళ్ళై మరియు ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళతో ఆ వ్యాఖ్యానమును చదివించిరి, వారు అది చాల వైభవముగా ఉందని ప్రశంసించారు నంపిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళైలను ఈ విధముగా తమ అనుమతి లేకుండా ఎందుకు వ్రాసారు, పెరియ వాచాన్ పిళ్ళైల వ్యాఖ్యానమునకు పోటిగా వ్రాస్తున్నారా అని అడిగిరి. వడక్కు తిరువీధి పిళ్ళై తన వలన జరిగిన  అపరాధనమునకు చింతించి, నంపిళ్ళై పాద పద్మములందు సాష్టాంగ నమస్కారం చేసి భవిష్యత్తు కాలములో పరిశీలించుటకు వీలుగా వ్రాసెనని వివరణ ఇచ్చిరి. వారి వివరణకు సంతృప్తి చెంది, నంపిళ్ళై ఆ వ్యాఖ్యానమును స్తుతించి ఈ విధముగా అనిరి వడక్కు తిరువీధి పిళ్ళై అవతార విశేషముచే ఇలా నా ప్రవచనముల నుండి ఏమియును తప్పకుండా వ్రాసిరి. నంపిళ్ళై ఈ వ్యాఖ్యానమును ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళకు ఇవ్వమనిరి (నంజీయరుల పూర్వాశ్రమము పేరును పెట్టుకొనిరి – మాధవర్) దానిని తన తదుపరి తరమునకు ఉపదేశించడము వలన, కడకు మణవాళ మామునిగళ్ళచే వెలువడబడుతుంది. ఎమ్పెరుమానుల కృపచే, నంపిళ్ళై భవిష్యత్తు కాలములో మాముణుల అవతారమును ముందుగానే గుర్తించి ఆ విషయమును ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళకి చెప్పి, వారి తదుపరి తరముల ద్వారా, అది మాముణులకి చేరి సరి యగు సమయములో మొత్తము ప్రపంచమునకే తెలియునని చెప్పిరి.

నంపిళ్ళై పరమపదమునకు చేరిన తదుపరి వడక్కు తిరువీధి పిళ్ళై మన సంప్రదాయమునకు నాయకుడిగా ఉండెను. వారు అన్ని అర్థములను పిళ్ళై లోకాచార్యులు మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లకు ఉపదేశించిరి. శ్రీవచన భూశణ దివ్య శాస్త్రములో పిళ్ళై లోకాచార్యులు వడక్కు తిరువీధి పిళ్ళైల ఆదేశములను కొన్ని చోట్ల ప్రస్తావించెను:

సూత్రం 77 లో, ఈ విధముగా చెప్పబడెను అహంకారమును వదిలిన, ఆ ఆత్మను మాత్రమే అడియేన్ అని పిలువబడును. ఇది యతీంద్ర ప్రవణ ప్రభావములో వడక్కు తిరువీధి పిళ్ళైచే వివరించబడినది.

సూత్రం 443 లో, పిళ్ళై లోకాచార్యులు వడక్కు తిరువీధి పిళ్ళై ఈ విధముగా వివరిస్తారని చెప్తారు, అనాదియైన కాలము నుండి స్వ స్వాతన్త్రియము నిండి ఉన్న జీవాత్మలు సంసారము నుండి బయటపడుటకు ఒకే ఒక్క దారి సదాచార్యున్ని ఆశ్రయించడమే.

తదుపరి కొంత కాలమునకు వడక్కు తిరువీధి పిళ్ళై తమ ఆచార్యులైన నంపిళ్ళైలని తలుచుకొని తమ యొక్క చరమ తిరుమేని వదిలి పరమపదమునకు చేరిరి.

ఎమ్పెరుమానార్లతో మరియు మన ఆచార్యులతో మనకూ అలాంటి అనుబంధము కలిగేలా మనము వడక్కు తిరువీధి పిళ్ళైల శ్రీ చరణములను ప్రార్థించుదాము.

వడక్కు తిరువీధి పిళ్ళైల తనియన్ :

శ్రీ క్రిష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా !
యత్ ప్రసాద ప్రభావేన సర్వ సిద్దిరభూన్మమ !!

మన తదుపరి సంచికలో పిళ్ళై లోకాచార్యుల వైభవమును చూద్దాము.

రఘు వంశీ రామానుజ దాసన్

మూలము: https://guruparamparai.wordpress.com/2012/09/17/vadakku-thiruveedhi-pillai/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

7 thoughts on “వడక్కు తిరువీధి పిళ్ళై

  1. Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu

  2. Pingback: నమ్పిళ్ళై | guruparamparai telugu

  3. Pingback: పిళ్ళై లోకాచార్యర్ | guruparamparai telugu

  4. Pingback: 2014 – July – Week 2 | kOyil

  5. Pingback: ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ | guruparamparai telugu

  6. Pingback: అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ | guruparamparai telugu

  7. Pingback: తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ | guruparamparai telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s