శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
గత సంచికలో మనము పరాశర భట్టర్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల గురించి తెలుసుకొందాం.

నంజీయర్ – తిరునారాయణపురం
తిరు నక్షత్రం : ఫాల్గుణ మాసము, ఉత్తరా నక్షత్రము
అవతారస్థలం : తిరునారాయణపురం
ఆచార్యులు : పరశర భట్టర్
శిష్యులు : నంపిళ్ళై, శ్రీ సేనాధి పతి జీయర్ మరి కొందరు కలరు
పరమపదించిన ప్రదేశము : శ్రీ రంగం
శ్రీ సూక్తి గ్రంధములు: తిరువాయ్మొళి 9000 పడి వ్యాఖ్యానము, కణ్ణినుణ్ శిఱుత్తాంబు వ్యాఖ్యానము, తిరుప్పావై వ్యాఖ్యానము, తిరువందాది వ్యాఖ్యానములు, శరణాగతి గద్య వ్యాఖ్యానము, తిరుపల్లాండు వ్యాఖ్యానము, రహస్య త్రయ వివరణ గ్రంధము (నూఱెట్టు 108) – ఈ గ్రంధములలో చాల వరకు మనకు అందుబాటులో లేవు.
శ్రీ మాధవర్ అను నామధేయముతో జన్మించి అద్వైత సిద్ధాంతమున గొప్ప తత్వవేత్తగ ప్రసిద్ధి పొందారు. తరువాత భట్టర్ వారికి నంజీయర్ అని నామకరణము చేసారు. వారికి నిగమాంత యోగి మరియు వేదాంతి అను పేర్లు కూడ కలవు.
మాధవాచార్యులు గొప్ప అద్వైత తత్వవేత్తగా తిరునారాయణ పురము నందు నివసించిరి. ఎమ్పెరుమానార్లు వారిని మన సంప్రదాయమునకు సంస్కరింపదలచిరి. అద్వైత సంప్రదాయమునకు చెందినవారు అయినప్పటికిని; ఎమ్పెరుమానార్లకు వారి యందు గౌరవము కలదు. వారిని సంస్కరించు బాధ్యత భట్టర్లకు అప్పగించిరి.
భట్టర్ వైభవమును అప్పటికే తెలుసుకున్న మాధవచార్యులు వారిని కలుసుకొను సమయము కొరకు వేచివున్నారు. ఎమ్పెరుమానార్ల కోరిక మేరకు భట్టర్లు తిరునారాయణ పురమునకు వెళ్ళెను. పిదప భట్టర్లు వారిని వాదనలో జయించి వారిని శిష్యులుగా స్వీకరించెను. (ఆ వృత్తాంతమును మీరు ఇక్కడ చదవవచ్చు). భట్టర్ ఒక సాధారణ వేషముతో వారి దగ్గరకు వచ్చి వారిని ఓడించిన సంగతి; వాదన ముగిసిన అనంతరం భట్టరుతో వచ్చిన శ్రీ వైష్ణవ బృందం మాధవాచార్యుల ఇంటికి వచ్చినప్పుడు తెలుసుకున్నారు. ఆ శ్రీ వైష్ణవ బృందం యొక్క ఆనందమునకు సంతసించిన మాధవాచార్యులు భట్టర్ వైభవమును కళ్ళారా చూసి గ్రహించెను. భట్టర్లు శ్రీ రంగము నుంచి ఎంతో ప్రయాసకోర్చి; వారి వైభవమును పక్కకు పెట్టి; సాధారణ వ్యక్తిగా వచ్చి మాధవాచార్యులను సంస్కరించి వారికి శాస్త్రార్ధములను బోధించిన భట్టర్లకు ఏ విధముగ ఋణము తీర్చుకోవాలో తెలియ చేయవలసిందిగా భట్టర్లను అడిగెను. భట్టర్లు చాల సులువుగ అరుళిచ్చెయల్ మరియు ఇతర సాంప్రదాయ గ్రంధములను పఠించి వాటిలో నిష్ణాతులు కావలసిందిగా ఆదేశించెను. శ్రీ రంగమునకు రావలసినదిగా కూడా ఆదేశించెను.
మాధవాచార్యుల భార్యలు వారి కైంకర్యములకు అడ్డుగా ఉండుట చూసి; ఆచార్యని ఎడబాటు సహించలేక శ్రీ రంగమునకు వెళ్ళి వారి ఆచార్యుల సేవ చేసుకొనుటకు సన్యాస అశ్రమమును స్వీకరించ దలచెను. వారి అపారమయిన సంపదను 3 భాగములుగా చేసి; 2 భాగములు వారి ఇద్దరి భార్యలకు (శాస్త్ర ప్రకారము సన్యసించ దలిచిన; భార్య యొక్క సంరక్షణ భారము పూర్తి గావించిన పిదప తీసుకోవలెను) పంచి సన్యాసాశ్రమమును స్వీకరించెను. పిమ్మట వారు శ్రీ రంగమునకు బయలుదేరెను. దారిలో అనంతాళ్వాన్లు కలసి వారిని సన్యాసాశ్రమమును స్వీకరించ దలచిన కారణమును అడిగెను. వారు భట్టరు దగ్గరకు వెళ్ళి; వారిని సేవ చేసుకుంటే (గురువు సేవ) ఎమ్పెరుమాన్లు మోక్షమును ప్రసాదించునని బదులు చెప్పిరి. అప్పుడు ఆళ్వాన్లు “తిరు మంత్రములో జన్మించి (ఆత్మ స్వరూపము) ద్వయ మంత్రములో పెరిగమని (పెరుమాళ్ళకు మరియు పిరాట్టికి కైంకర్యమును చేసుకుంటు) దీవించెను. భట్టర్లు మాధవాచార్యుల ఆచార్య నిష్టను గమనించి వారిని నమ్ జీయర్ అని పిలిచెను. ఆ నాటి నుండి వారు నంజీయరుగా ప్రసిద్ధి పొందెను.
భట్టర్లు మరియు నంజీయర్లు ఉత్కృష్టమయిన ఆచార్య – శిష్య సంబంధమును అనుభవించెను. నంజీయర్ వారి ఆచార్యుల కోసము; అన్నింటిని త్యజించి వారి ఆచార్యులతో ఉండెను. భట్టర్లు వారికి తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ వారి 6000 పడి వ్యాఖ్యానము ప్రకారము తిరువాయ్మొళిని నేర్పించెను. భట్టర్లు నంజీయర్లకు తిరువాయ్మొళికి వ్యాఖ్యానమును అనుసంధించమనగా వారు 9000 పడి వ్యాఖ్యానమును రచించెను. తిరువాయ్మొళి కాలక్షేపమును వారు జీవించిన 100 ఏండ్ల కాలములో 100 మార్లు చెప్పిన ఘనత నంజీయర్లకే సొంతము.
నంజీయర్ల వారి ఆచార్య భక్తి వర్ణనాతీతం. వారి ఆచార్య భక్తిని కొన్ని సంఘటనల ద్వారా తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము.
- ఒకనాడు భట్టర్లు పల్లకిలో వెళుతుండగా నంజీయర్లు ఒక చేతితో త్రిదండమును ధరించి ఒక భుజముపై వారి పల్లకిని మోయుటకు ప్రయత్నించెను. అది గమనించిన భట్టర్లు వారిని పిలచి; వారికి ఇది తగదు అని, సన్యాసాశ్రమమున ఉండు వారు ఇలా పల్లకిని మోయరాదు అని చెప్పెను. నంజీయర్లు “మీ సేవకు ఈ త్రిదండము అడ్డుగా ఉన్న ఎడల దానిని విరిచి; సన్యాసాశ్రమమును త్యజించును” అని బదులిచ్చెను.
- ఒకనాడు నంజీయర్ల పరిచారకులు భట్టర్ల రాకతో వారి తోటలో కొద్దిగ అల్లరి జరుగుతుందని వారు అడ్డుగా ఉన్నారని ఫిర్యాదు చేసెను. అప్పుడు నంజీయర్లు ఆ తోట భట్టర్ల కైంకర్య రూపముగా ఉన్నదని; నంపెరుమాళ్ళ కోసము కాదు అని వారిని మందలించిరి.
- ఆచార్యులు వారి శిష్యుల ఒడిలో తల పెట్టుకొని విశ్రాంతి పొందుట సాధారణము.
ఒకనాడు భట్టర్లు పడుకొన దలచి నంజీయర్ల ఒడిలో తన తలను పెట్టుకొని విశ్రాంతి పొందుచుండెను. భట్టర్లు చాల సేపటి తరువాత మెలుకువ వచ్చి చూడగా నంజీయర్లు ఆ సమయమున కదలకుండ ఉండెనన్న విషయమును గ్రహించి; వారి ఆచార్య కైంకర్య నిష్టకు ప్రీతి చెంది వారికి ద్వయ మంత్ర అర్ధమును ఉపదేశించెను. (ఆచార్యులు వారి శిష్యుల నడవడి నచ్చిన పిదప వారికి అర్ధములను బోధించును.) - నంజీయర్లు అరుళిచెయల్ అన్నింటిలోను నిష్ణాతులు అయ్యిరి. భట్టర్లు నంజీయర్లు అరుళిచ్చెయల్ పాశురములను పారణ (అనుసంధించు) సమయమున వాటికి అద్భుతమయిన అర్ధములను చెప్పేవారు. ఒకనాడు నంజీయర్లు తిరువాయ్మొళి 7.2.9 “ఎన్ తిరుమగళ్ చేర్ మార్వనే ఎన్ఱుమ్ ఎన్నుడైయావియే ఎన్ఱుమ్” పాశురము పారణ చేయుచుండగ – వారు ఆ పాశురములోని వాక్యము పూర్తిగా కలిపి విడమరచకుండ చదివెను. అది విని భట్టర్లు వెంటనే మూర్చ పోయెను. తెలివి వచ్చిన పిమ్మట భట్టర్లు ఆ వాక్యమును అలానే చదవవలెనని; అప్పుడు మాత్రమే మనకి పరాంకుశ నాయకి యొక్క హృదయము అర్ధమవుతుంది అని చెప్పెను. ఆ వాక్య అర్ధము కలిపి చడివితే ఈ విధముగ ఉండును “శ్రీ రంగ నాచ్చియార్లను హృదయము నందు కల శ్రీ రంగనాధుడు నాకు చాల ప్రియం” అని ఆళ్వార్ల భావన. అదే వాక్యమును విడ మరచి చదివితే “శ్రీ రంగనాధుడి మది యందు శ్రీ రంగ నాచ్చియార్లు కలరు. అలాంటి రంగనాధులవారు నాకు చాల ప్రియం అని అర్ధము వచ్చును.
- భట్టర్లు తమిళ దేశము కాని మరియు సంస్కృత వేదాంతి యగు నంజీయర్లను వారి అరుళిచ్చెయల్ తత్వ జ్ఞానమును పలు మార్లు ప్రశంసించెను.
భట్టర్లు మరియు నంజీయర్ల మధ్య అనేక ఆసక్తికరమగు సంభాషణలు జరిగెను. ఎంత పెద్ద పండితుడు అయినప్పటికి నంజీయర్లు వారికి వచ్చిన సందేహాలను భట్టర్ల యదుట ఉంచి వాటిని వివరించమని కోరుటలో ఎన్నడూ సంకోచించలేదు. వారి మధ్య సంభాషణలు కొన్ని ఇప్పుడు చూద్దాము.
- నంజీయర్లు ఒకనాడు భట్టర్లను ఎందు వలన ఆళ్వార్లు కృష్ణ పరమాత్మ యందు ఎక్కువ ప్రియంగా ఉండేవారు అని అడిగెను. ఇటీవల జరిగిన విషయములను గుర్తు పెట్టుకోవడము సహజమని; అందువలన కృష్ణావతారము ఎమ్పెరుమాన్ల ఇటీవల (ఇతర అవతారములు ఎప్పుడో స్వీకరించడము వలన) అవతారము కావున వారిని కలవడము ఆళ్వార్లకు కుదరకపోవడము వలన కృష్నుడి యందు ప్రేమని వ్యక్తపరిచెనని చెప్పెను.
- కృష్ణావతారమున ఎమ్పెరుమాన్లు గోప కులము నందు జన్మించెను. వారు ఎక్కడికి వెళ్ళినను; కంసుని సేవకులు (అసురులు) వారిని చంపటానికి సిద్ధముగా ఉండేవారు. కాని రామావతారమున (ఇతర అవతారముల యందు కూడా) వారు అస్త్ర విద్యలు నేర్చుకున్నారు. మరియు వారి తండ్రి దశరధుడు చాల గొప్ప యోధుడు. (ఇంద్రునికి సహాయము చేయగల సమర్ధుడు). వారి సోదరులు కూడ చాల ధైర్యవంతులు మరియు శక్తి వంతులు. అందువలన పెరియాళ్వార్లు కృష్ణ భగవానుని యందు భయముతో వారికి కాపు గాచెను అని భట్టర్లు వివరణ ఇచ్చెను.
- కలియన్ ఆళ్వార్లు తిరుమొళి “ఒరు నల్ సుఱ్ఱమ్” పదిగము (తిరుమొళి చివర పాశురములు) నందు అనేక దివ్య దేశ పెరుమాళ్ళకు మంగళాశాసనము చేసెను. నంజీయర్లు ఇదే విషయము విన్నవించి ఎందుకు అలా చేసారు అని అడుగగా; ఒక ఆడ పిల్ల పెళ్ళి చేసుకొని తన భర్త ఇంటికి పోవు సమయమున ఏ విధముగా వారి స్నేహితుల ఇండ్లకు త్వరగా వెళ్ళి పలకరించునో అదే విధముగా ఆళ్వార్లు పరమపదమునకు బయలుదేరుటకు సిద్ధముగనుండుట వలన భూలోకమున ఉన్న ఎమ్పెరుమాన్లందరికి ఒక సారి త్వరగా మంగళా శాసనమును చేసెను అని వివరించెను.
- ప్రహ్లాదుడు వారి మనమడు అయిన మహాబలి ఎమ్పెరుమాన్లను గౌరవించుట లేదని తన సంపదను కోల్పోవుగాక అని శపించెను. ధనము/సంపద యందు ఏ విధమయిన కోరిక మరియు ఆసక్తి లేని ప్రహ్లాదుడు ఎందువలన ఈ విధముగ శపించెనో అని అడుగగా; ఒక కుక్కను (సరిదిద్దుటకు) శిక్షించుటకు అది తినెడి మట్టిని ఏ విధముగ దాని దగ్గర నుండి తీసి వేయుదుమో; అదే విధముగా ప్రహ్లాదుడు మహాబలికి ప్రియమైన సంపదను తీసి వేసెను అని వివరణ ఇచ్చెను.
- వామన చరిత్ర యందు మహాబలి పాతళమునకు మరియు శుక్రాచార్యులు తన కన్ను కోల్పోవునకు కల కారణమును నంజీయర్లు అడుగగా; శుక్రాచార్యులు మహాబలి యొక్క ధర్మమును చేయుటకు అడ్డుపడినందుకుగాను వారి కన్నును; మరియు ఆచార్యుల మాట విననందుకు మహాబలి పాతాళమునకు వెళ్ళెనని వివరించెను.
- దశరధుడు పెరుమాళ్ళని విడిచి ఉండలేక వెంటనే ప్రాణములను విడచినప్పటికి స్వర్గమునకు వెళ్ళెను ఎందువలన అని నంజీయర్లు అడుగగా; దశరధుడు సామాన్య ధర్మమునకు (సత్యవాక్ పాలనకు) కట్టుబడెనని; అందువలన వారు ఎమ్పెరుమాన్ల శ్రేయస్సు (రక్షణ) కోరలేదని అందువలన వాస్తవముగ నరకమునకు వెళ్ళవలసినది అని చెప్పి. పెరుమాళ్ళ తండ్రియగుటచే వారి దయ వల్లన నరకమును తప్పించి స్వర్గమునకు పంపెనని చెప్పెను.
- విభీషణుడు భక్తుడు అయినప్పటికి; సుగ్రీవుడు ఎందు వలన తమ కూటమిలో చేర్చుకొనుటకు ఇష్టపడలేదని నంజీయర్లు అడుగగా; ఏ విధముగా పెరుమాళ్ వారి భక్తులను రక్షించుటకు సిద్ధ పడెనో అదే విధముగా సుగ్రీవుడు కూడ తనకి శరణాగతి చేసిన (రాముడు ఒకనాడు సుగ్రీవుడిని సహాయము కోరుతాడు) వారిని కాపాడు కొనుచున్నాడు. విభీషణుడు పెరుమాళ్ళకు హాని చేయునేమో అని సుగ్రీవుడి భయమని వివరణ ఇచ్చెను.
- కృష్ణుడు దేవకిని మరియు వసుదేవులను కంసునిని చంపి వారిని విడిపించగా; దేవకి యందు తల్లి తనము/పుత్ర వాత్సళ్యము వలన తన స్ధనముల యందు పాలు పుట్టగా; కృష్ణుడు చిన్నవాడు కానప్పటికి పాలును తాగెను. అది ఎట్లు కుదురును అని నంజీయర్లు అడుగగా; అది తల్లి కొడుకుల మధ్య విషయము మనము ఎవరము అడుగటానికి అని సరదాగ చెప్పిర్ఇ. అసలు తల్లి కానటువంటి ప్రేమ లేనటువంటి పూతన పాలు ఇచ్చినప్పుడు ఎమ్పెరుమాన్లు తాగెను; తనను కన్న తల్లి తన యందు అమితమైన ప్రేమ కలదై వారికి పాలు పడితె; వారు తాగరు అని అర్ధముచేసుకోవడములో కష్టమేమిటి అని ప్రశ్నించి సమాధనమునిచ్చెను.
- భట్టర్లు ఒకనాడు యయాతి చరిత్రమును ఉపన్యాసములో భాగముగ చెప్పెను. యయాతి 100 అశ్వమేద యాగములను చేసి; స్వర్గమునకు చేరి ఇంద్రుని పదవిలో భాగము కోరెను. పదవి పంచుకొనుటకు ఇష్టము లేని ఇంద్రుడు యయాతిని తప్పు చేయు విధముగా ప్రణాలికను రూపుదిద్ది; వారిని క్రిందకి పడవేసెను. నంజీయర్లు ఈ వృత్తంతమును ఎందుకు చెప్పెనో అని అడుగగా; ఈ చరిత్ర మనకు ఎమ్పెరుమాన్ల గొప్ప తనమును; ఇతర దేవతలలోని లేనిది తెలియచేయునని చెప్పెను. ఎమ్పెరుమాన్లు వారికి శరణాగతి చేసిన వారి అందరికి సామ్యాపతి మోక్షమును ప్రసాదించునని; అదే ఇతర దేవతలు 100 అశ్వమేద యాగములు చేసినప్పటికి కూడా వారితో సమానముగ చుసుకొనుటకు ఇష్ట పడరు అని క్రిందకు పడివేయును అని చెప్పి వివరణ ఇచ్చెను.
ఇలాంటి సంభాషణలు ఎన్నో మనకు అరుళిచ్చెయల్ మరియు శాస్త్ర రహస్యములు తెలియచేయును. ఈ సంభాషణలు అన్ని నంజీయర్ల అరుళిచ్చెయల్ ప్రావీణ్యతను వారి శిష్యులకు అర్ధములు చెప్పుటకు త్రోవవేసెను.
నంజీయర్లు ఒకనాడు తమ 9000 పడి వ్యాఖ్యానమును లిఖించదలచి నంబూర్ వరదాచారియర్ మిక్కిలి ప్రావీణ్యుడని గ్రహించి వారికి ఆ బాధ్యతను అప్పగించిరి. వారు పని పూర్తి చేసిన పిమ్మట నంజీయర్లు వారిని ప్రశసించి వారిని నంపిళ్ళై అను నామమును బిరుదుగా ఇచ్చి వారిని మన దర్శన ప్రవర్తకుడిగా చేసెను. నంజీయర్ల కన్నా మంచి వ్యాఖ్యానమును చెప్పినప్పుడు నంపిళ్ళైను నంజీయర్లు ప్రశంసలతో ముంచేసేవారు. అటువంటి గొప్ప మహనీయుడు నంజీయర్లు.
నంజీయర్లకు సాంప్రదాయ విషయముల యందు గొప్ప అవగాహన కలదు. ఒక శ్రీ వైష్ణవుడు మరి ఒక శ్రీ వైష్ణవుడి బాధను చూసి తమ బాధగా భావిస్తాడో వారు నిజమయిన శ్రీ వైష్ణవుడని శ్రీ సూక్తమును మనకు అందించిరి. వారు వారి కాలములో ఉన్న శ్రీ వైష్ణవుల యందు మరియు ఇతర ఆచార్యుల యందు గొప్ప గౌరవము కలిగి యుండెడివారు.
వారు తిరుమంగై ఆళ్వార్ల పెరియ తిరుమొళి 3.6 (తూవిరియ మలరుళక్కి పదిగము) పాశురములను పెఱ్ఱి అని అరయరు స్వామి పారణ చేయుచున్నప్పుడు వారు ఆ అమృత ధారలో నిమఘ్నునులయ్యేవారు.
వారి చరమ దశలో వారు ఎమ్పెరుమాన్లను స్వయం తిరుమేనిని దర్శనము కోరగా ఎమ్పెరుమాన్లు వారి కొరకు మాత్రమే దర్శనమును ఇచ్చెను. ఆ దివ్య మంగళ విగ్రహమును చూసిన పిమ్మట; వారు వారి శిష్యులకు అనేక చరమ సూచనలను ఇచ్చి; వారి చరమ తిరుమేనిని వదలి పరమపదమునకు చేరుకొనెను.
మనము కూడా వారిలా ఆచార్య నిష్ట; ఎమ్పెరుమాన్ల యందు భక్తి భావన కలుగచేయమని వారిని ప్రార్ధించుదాము.
నంజీయర్ల తనియన్
నమో వేదాన్త వేద్యాయ జగన్ మన్గళ హేతవే
యస్య వాగామృతాసార భూరితం భువన త్రయం
సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాస
మూలము: https://guruparamparai.wordpress.com/2012/09/11/parasara-bhattar/
పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu
Pingback: నమ్పిళ్ళై | guruparamparai telugu
Pingback: వడక్కు తిరువీధి పిళ్ళై | guruparamparai telugu
Pingback: శ్రీవైష్ణవ తిరువారాధనము | srIvaishNava granthams – Telugu
Pingback: తిరుక్కోష్టియూర్ నంబి | guruparamparai telugu
Pingback: ముదలియాణ్డాన్ | guruparamparai telugu
Pingback: 2015 – Apr – Week 1 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc
Pingback: అనంతాళ్వాన్ | guruparamparai telugu
Pingback: ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ | guruparamparai telugu
Pingback: పిన్భళగియ పెరుమాళ్ జీయర్ | guruparamparai telugu
Pingback: అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ | guruparamparai telugu
Pingback: తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ | guruparamparai telugu
Pingback: కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 1 – కణ్ణినుణ్ | dhivya prabandham
Pingback: కణ్ణినుణ్ శిరుతాంబు – 3 – తిరితంతాగిలుం | dhivya prabandham
Pingback: ఎంగళాళ్వాన్ | guruparamparai telugu
Pingback: తిరుప్పళ్ళి యెళుచ్చి – 10 – కడిమలర్ | dhivya prabandham
Pingback: కూర నారాయణ జీయర్ | guruparamparai telugu
Pingback: కణ్ణినుణ్ శిరుతాంబు – 4 – నన్మైయాల్ | dhivya prabandham
Pingback: కణ్ణినుణ్ శిరుతాంబు – 6 – ఇన్ఱు తొట్టుం | dhivya prabandham
Pingback: కణ్ణినుణ్ శిరుతాంబు – 5 – నంబినేన్ | dhivya prabandham
Pingback: కణ్ణినుణ్ శిరుతాంబు – 7 – కణ్దు కొణ్దు | dhivya prabandham
Pingback: కణ్ణినుణ్ శిరుతాంబు – 8 – అరుళ్ కొణ్డాడుం | dhivya prabandham