Monthly Archives: July 2014

పిళ్ళై లోకమ్ జీయర్

శ్రీ:

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్వరవరమునయే  నమః

శ్రీ వానాచల మహామునయే నమః

pillailokam-jeeyar

పిళ్ళై లోకమ్ జీయర్ – తిరువల్లిక్కేని

తిరు నక్షత్రము ~:చైత్ర మాసము, శ్రవణ నక్షత్రము

అవతారస్థలము~:–కాంచీపురము

ఆచార్యులు~:శఠకోపాచార్యులు

రచనలు~: తనియన్ వ్యాఖ్యానములు,  రామానుజ  దివ్య చరిత్ర ,  యతీంద్ర ప్రవణప్రభావము,రామానుజ నూత్తందాది వ్యాఖ్యానము,  కొన్ని మామునుల శ్రీసూక్తుల వ్యాఖ్యానము ,  కొన్ని రహస్యగ్రంథముల వ్యాఖ్యానము, శెయ్య తామరై తాళినై వ్యాఖ్యానము( మామునుల వాళి తిరునామములు) ,శ్రీవైష్ణవ సమయాచార నిష్కర్షము.

మామునుల అష్టదిగ్గజములలో ఒకరైన పరవస్తు పట్టర్పిరాన్జీయర్ మునిమనవలుగా   కాంచీపురములో మేషమాసములో  శ్రవణా నక్షత్రము నాడు అవతరించారు.వీరికి జన్మ నామము వరదాచార్యులు. తరువాతికాలములో  పిళ్ళై లోకమ్ జీయరనీ,  పిళ్ళైలోకాచార్య జీయరనీ ప్రసిధ్ధి  గాంచారు.

తిరుక్కడల్ మల్లై(మహాబలిపురము) లోని కోవెలను పునరుధ్ధరించి నిత్యకైంకర్య పధ్ధతిని పునర్వ్యవస్థీకరించారు.    ఆకాలపు రాజు సంతోషముతో వీరిని సన్మానించారు.ఈనాటికి వీరి వంశస్తులకు అక్కడ ప్రత్యేక మర్యాదలు అందుతున్నాయి.

వీరి జీవిత విశేషాలు ఎక్కువగా లభ్యమవటములేదు. కాని వీరి రచనల ద్వారా వీరు గొప్ప ఙ్ఞాని అని తెలుస్తున్నది.వీరి గ్రంథములు మన సంప్రదాయమునకు  చాలా విలువైనవి.

కొన్ని శిలాశాసనముల ద్వారా దివ్యదేశాములకు వీరు అందించిన కృషిని  తెలుస్తుంది

1. క్రీ.శ.1614 లో తిరుక్కడల్మల్లై దివ్యదేశాము లో వేయబడ్డ రాగి శాసనములో  యతీంద్ర ప్రవణ ప్రభావమ్  పిళ్ళై లోకమ్ జీయరని వీరి  ప్రస్తావన కనపడుతుంది.(వీరు అప్పటికే రచించిన మణవాళ మామునుల చరిత్ర  ద్వారా ప్రఖ్యాతి గాంచి , అదే పేరు తో పిలవబడుతున్నారని తెలుస్తుంది )

2.క్రీ.శ.1614 లో శ్రీరంగము కోవెలలో రెండవప్రాకారము లో  వేయబడ్డ శిలా శాసనములో వీరిశిష్యులు ఒక్కరు ఎమ్పెరుమానార్ ఉత్సవము కొరకు  చక్కరపొంగలి కోసము 120 బంగారు నాణెములు ఇచ్చినట్లు చెక్కబడినది.

చాలా దివ్య ప్రబంధ తనియన్ లకు వ్యాఖ్యానములు చేసారు.తనియన్ వ్యాఖ్యానము ద్వారా ఆ ప్రబంధములో ఆళ్వార్ల మానసిక స్థితి గురించి అవగాహన అవుతుంది.

ramanujar-sriperumbudhur

ఎమ్పెరుమానార్ – శ్రీ పెరుమ్బుదూర్

ఎమ్పెరుమానార్ జీవిత చరిత్రము సుందరముగా రామానుజార్య చరిత్ర రచించారు. వారి అనేక యాత్రలు , వారి శిష్యుల తో కూడిన వారి చరిత్రము చక్కగా రాసారు.

srisailesa-thanian

నమ్పెరుమాళ్ మణవాళ మామునులకు శ్రీ శైలేశ తనియన్ అందిచు దృశ్యము

యతీంద్ర ప్రవణములో మామునుల జీవిత విశేషాలు, ఉపదేశాలతో పాటు పెరియవాచ్చాన్ పిళ్ళై, వడక్కు తిరువీధి  పిళ్ళైపిళ్ళై లోకాచారియర్, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, తిరువాయి మొళి  పిళ్ళైల జీవిత విశేషాలను  మనస్సుకు హత్తుకునేలాగ వివరించారు.

పై రెండు ప్రబంధాలలో చాలా  పాశురాలను  ఉదహరించారు.వాటి ద్వారా తమిళ భాష లో వారికి గల పాండిత్యము తెలుస్తుంది.

కొన్ని రహస్య గ్రంథములకు వ్యాఖ్యానము చేసారు

విళాంచోలై పిళ్ళై  అనే ఆచార్యులు రచించిన  ” సప్తగాథ”   కు చక్కటి వ్యాఖ్యానము చేసారు. సప్తగాథ  పిళ్ళై లోకాచార్యులు రచించిన శ్రీవచన భూషణమున యొక్క సారార్థము- ఆచార్య నిష్ఠను వేలువడచేస్తుంది.

మామునుల “ఉపదేశరత్నమాల, తిరువాయి మొళి నూత్తందాది, ఆర్తి ప్రబంధము   సంగ్రహ వ్యాఖ్యలను రాసారు.

శ్రీవైష్ణవ సమయాచార నిష్కర్ష అనే   గ్రంథములో ఎమ్బెరుమానార్ దర్శనములోని ప్రధాన విషయాలను క్రోడీకరించారు. దీనిలో వీరు చూపిన ప్రమాణాలను చూడగా వీరి అఘాద ఙ్ఞాన సంపద ద్యోతకమవుతుంది.

పై విషయాల ద్వారా పిళ్ళై లోకమ్ జీయరు సంప్రదాయ పరిరక్షణ కోసము చేసిన కృషి  తెలుసుకున్నాము.పూర్వాచార్యుల శ్రీ సుక్తులకు వ్యాఖ్యానములు  మరియు ఎమ్పెరుమానార్ , మణవాళ  మామునుల  అద్భుత జీవిత చరిత్రము రచించి శ్రీ  వైష్ణవ సంప్రదాయమునకు మహా ఉపకారము చేసారు. మనకు కూడా  పూర్వాచార్యుల మీద భక్తి ,ప్రపత్తి కలగాలని వారి శ్రీ చరణాలను ఆశ్రయించుదాము.

పిళ్ళై లోకమ్ జీయరు తనియన్  ( యతీంద్ర ప్రవణము)

శ్రీ శఠారి గురోర్దివ్య శ్రీ పాదాబ్జ మధువ్రతమ్

శ్రీమత్ యతీంద్ర ప్రవణమ్ శ్రీ లోకార్య మునిమ్ భజే

అడియేన్  చక్రవర్తుల చూడామణి దాసి.

Source

అప్పాచ్చియారణ్ణా

జై శ్రీ మన్నారాయణ

శ్రీమతే రామానుజాయనమ:

శ్రీమద్వరవర మునయే నమ:

శ్రీవానాచలమహామునయే నమ:

appachiyaranna

అప్పాచ్చియారణ్ణా

తిరునక్షత్రము~:   శ్రావణ మాసము హస్తము

అవతారస్థలము~: శ్రీరంగము

ఆచార్యులు~: పొన్నడిక్కాల్ జీయర్

శిష్యులు~:  అణ్ణావిలప్పన్ (వీరి కుమారులు)

వాదూల గోత్రోద్భువులైన ముదలియాన్డాన్ వంశములో తొమ్మిదవతరమునకు చెందినవారు ఆన్డాన్ కుటుంబీకులు.వీరు శిర్రణ్ణార్రెరి సుపుత్రులుగా శ్రీరంగములో అవతరించారు.వీరి నాన్న గారు వీరిని వరద రాజులగా నామకరణం చేసారు.వీరి  తల్లి గారు ఆయ్చియార్ తిరుమన్జనమప్పా కుమార్తె. వీరి పరమాచార్యులైన మణవాళ మామునులు ప్రేమతో వీరికి అప్పచియారణ్ణా అని పేరు పెట్టారు.”నమ్ అప్పాచియాణ్ణవో”(వీరేనా మన అప్పాచియాణ్ణ ?) అని సంభోదన చేసారు.    ). వీరు పొన్నడికాల్ జీయర్ ప్రియ శిష్యులు . ఎలాగైతే పొన్నడికాల్ జీయర్ ను మణవాళ మామునుల యొక్క పాద పద్మములు గా భావించదరో , వీరిని పొన్నడికాల్ జీయర్ యొక్క పాద పద్మములు గా భావిస్తారు.

వీరి మాతామహులైన తిరుమన్జనమప్పా శ్రీరంగము పెరియ కోయిల్ లో  నిస్వార్థ కైంకర్య పరులు మరియు మామునుల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండేవారు .మామునుల గొప్పతనము ఎరిగిన వారై , వారు స్నానమాడు సమయమున వారి వెనుక వీరు కూడా వెళ్ళేవారు.  .మామునులు దిగిన గట్టుకు పై గట్టులో దిగి .మామునులను తాకి పవిత్రమై వస్తున్న ప్రవాహములో తాను స్నానము చేసి నిశ్చలమైన జ్ఞానము తో ప్రసాదింపబడ్డారు. తరువాతికాలములో మామునుల మఠములో చేరి వారి కైంకర్యములో తరించారు.

ఒక సారి మామునులు కావేరిలో స్నానం చేయడంకోసం బయలుదేరారు.సరిగ్గా అప్పుడే వాన మొదలైంది. ఆ దగ్గర లో వున్న ఇంటి చూలు కింద నిలబడ్డారు.  ఇంటి గృహిణి బయటకు వచ్చి మామునులను చూసి వారు కూర్చోవటానికి ఆసనము ఏర్పాటు చేసి వారి పాదుకలను శిరస్సుపై వుంచుకొని ఆనందించి తరవాత తన కొంగుతో పాదుకలను తుడిచి  ఎంతో భక్తి తో కళ్ళక్కద్దుకొంది. ఆ స్పర్శ వల్ల జ్ఞాన ప్రాసాదిత్ అయి మణవాళ మామునులను తన ఆచార్యులుగా స్వీకరించవలెనని ఆశించింది  మామునులు  ఆమెను చూసి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు.తిరుమంజనమప్పా కుమార్తెనని,కన్దాడై సిర్రన్నార్( ముదలియాణ్దాన్ వంశం) ఇళ్లాలినని తనను ఆచ్చి అంటారని చెప్పింది.వర్షం ఆగిన తరువాత అక్కడి నుండి మామునులు కావేరి కి బయలుదేరుతారు. ఆమెకు ఆరోజే  మామునుల అనుగ్రహము  లభించింది.

    కొంత కాలము తరువాత తన మనసులోని మాటను తండ్రి గారికి వివరిస్తుంది .మామునుల దగ్గర పంచసంస్కారము చేయుటకు  అతి  రహస్యముగా ఏర్పాటు చేస్తారు (స్వయమాచార్యపురుష వంశములో కోడలు కావడము వలన బహిరంగంగా చేసుకునుటకు జంకిన కారణమున ). మామునులు ఆచ్చికి గల  సంబంధములు చూసి  పంచసంస్కారము చేయుటకు ముందుగా సంకోచిస్తారు , కాని ఆచ్చి భక్తి ని చూసి, సంస్కరనముల ను గావిస్తారు. 

ఎమ్పెరుమాన్ యొక్క దివ్యమైన అనుగ్రహము చేత కందాడై వంశము లో ని ఆచార్యులు అందరు మామునిగళ్ శరణు పొందుతారు.  కోయిల్ కందాడై అన్నన్ స్వామికి ఒక అద్భుతమైన కల వచ్చిందిపెరుమాళ్ళే ఆ కల లో పొన్నడిక్కాల్ జీయర్ పురుషకారముతో మామునుల శ్రీపాదములను ఆశ్రయించమని ఆదేశించారు. తన తో పాటు కందాడై వంశము లో ని ఆచార్యులు అందరిని తీసుకుని వచ్చి మామునిగళ్ ఆశ్రయం పొందుతారు .

కోయిల్ కందాడై అన్నన్ పరివారమునకు పంచ సంస్కారము చేసిన తరవాత మామునులు తనకు మరియు పొన్నడిక్కాల్ జీయర్కు  గల అద్వితీయ సంబంధమును గురించి వివరించారు. “వారు శుభశ్రేయస్కులు మరియు తనకు ఊపిరి వంటివారని.తనకు గల వైభవములన్ని వారికి లభించాలని చెప్పారు.ముదలియాన్డాన్ వంశస్తులు తనకు శిష్యులైనట్లు గానే ఆ వంశము లో కొందరైనా  వారికి శిష్యులు గా ఉండాలని అన్నారు.కోయిల్ కందాడై అన్నన్ మామునుల మనస్సును అర్థము  చేసుకుని “మీరు ముందు గానే పొన్నడికాల్ జీయర్ స్వామి యొక్క పాద పద్మములు మాకు చూపించినట్లైతే , మేము వారి శ్రీ పాదములను ఆశ్రయించి ఉండే వారము”అని చెప్పారు. దానికి మామునులు “మేము చేయ గలిగే పనిని , ఎలా వదులు కో గలము ? ” అని బదులు ఇచ్చారు. కోయిల్ అణ్ణన్ చుట్టూ తన బంధువుల వైపు చూస్తారు , అప్పాచ్చియారణ్ణ లేచి  “మన స్వామి  వానమామలై రామానుజ జీయర్ యొక్క శ్రీ పాదముల శరణము తనకు ఇవ్వ వలెనని ” విన్నవిస్తారు. జీయర్ సంతోషించి , “నమ్ అప్పాచియాణ్ణావో” ( వీరేనా మన అప్పాచియాణ్ణ ?) అని సంభోదన చేస్తారు.తాను ఆసనము నుండి లేచి పొన్నడిక్కాల్ జీయరును కూర్చో మన్నారు. శంఖచక్రములనిచ్చి అప్పాచ్చియారణ్ణాకు పంచసంస్కారము చేయమన్నారు.
పొన్నడిక్కాల్ జీయరు వినమ్రత తో ముందు వెనకాడుతారు , అప్పుడు మామునులు వారు పంచ సంస్కారములు ఖచ్చితంగా చేయవలెనని , అది తనకు ప్రీతి కరమైనదని చెప్తారు.అప్పుడు అంగీకరించి అప్పాచ్చియారణ్ణాకు పంచసంస్కారము చేసి ,శిష్యులు గా స్వీకరిస్తారు . అప్పటినుంచి, అప్పాచ్చియారణ్ణ శ్రీరంగములోనే ఉండి నిరంతరాయంగా మామునుల ను మరియు పొన్నడిక్కాల్ జీయరును  కైంకర్యము చేస్తూ ఉండిపోయారు.

mamuni-ponnadikkaljiyar-appachiyaranna

శ్రీ రంగం- మామునులు , వానమామలై – పొన్నడి కాల్ జీయర్ , అప్పాచ్చియారణ్ణా

ఒకసారి మామునులు తిరుమల యాత్ర  వారి శిష్యులు అందరి తో యాత్ర చేసారు.  దారిలో కాంచిపురములో ఆగి దేవపెరుమాళ్ళను సేవించుకున్నారు.అవి వైశాఖమాసములో గరుడోశ్చవము జరుగుతున్న రోజులు.గరుడ వాహనము మీద ఉన్న ఎమ్పెరుమాన్ ను మంగళ శాసనము చేసారు.

varadhan-garudavahanam-mamunigaL

గరుడ వాహనము పై దేవ పెరుమాళ్ ,మామునులు

కాంచి పురములోని శ్రీ వైష్ణవులు మామునిగళ్ దగ్గర చేరి , వారిని కీర్తిస్తారు. మామునిగళ్ వారికి శ్రీ వైష్ణవ సిద్ధాంతము గురించి , మరియు సంప్రదాయము లో కృత్యాకృత్య ములను చెప్పి , దివ్య ప్రబంధము లో ప్రావిణ్యులవమని చెప్పారు .దానికి వారు ఆనందముగా అంగీకరించి తమకు మార్గ నిర్దేశము చేయటానికి ఒక ఆచార్యులను అనిగ్రహించమని కోరారు.మామునిగళ్ పొన్నడి కాల్ జీయర్ స్వామిని  అప్పాచ్చియారణ్ణాను పిలవమని కోరగా, వారు కబురు చేస్తారు. అప్పుడు  ఆ  శ్రీ వైష్ణవుల తో  అప్పాచ్చియారణ్ణ ను తనని గా భావించమని చెప్పారు. అప్పచ్చియారణ్ణాను పిలిచిమీరు మొదలియాన్డాన్ వంశస్తులు.మీరు మా నిర్వాహకులు గా, మీపూర్వీకులైన మొదలియాన్డాన్ ,కందాడై తోళప్పన్ లను సంతృప్తి పరుచునట్లుగా దేవపెరుమాళ్ళను మంగళా  శాసనము చేస్తూ ,ఇక్కడి శ్రీ వైష్ణవులకు మార్గనిర్దేశము చేస్తూ కంచిలో వుండిపొమన్నారు. వారు కూడా ఆచార్యుల ఆఙ్ఞను శిరసావహించి కంచిలో వుండటానికి అంగీకరించారు.అయితే అప్పుడు మాత్రము మామునులతో తిరుమల ఇత్యాది దివ్యదేశ యాత్రకు వెళ్ళి ఆఖరికి శ్రీరంగము చేరుకున్నారు.

అప్పుడు మామునులు అప్పాచ్చియారణ్ణాను పిలిచి కర్తవ్యమును గుర్తు చేసారు.అప్పాచ్చియారణ్ణా శ్రీరంగములో మామునుల శ్రీ పాద పద్మముల యందు గల గోష్ఠిని విడిచి వెళ్ళలేని తన అశక్తతను తెలియజేసారు. అప్పాచ్చియారణ్ణా యొక్క భావోద్వేగములను అర్థము చేసుకొని , వారిని తన పెరుమాళ్ సన్నిధి కి తీసుకువస్తారు. తన రామానుజమనే చెమ్బును పొన్నడిక్కాల్ జీయరుకిచ్చారు . వారు ఆచార్య ప్రసాదముగా దానిని నిత్యము తన బుట్ట లో పెట్టుకొని , భక్తి తో పూజించేవారు . దానిని తెప్పించి, అప్పాచ్చియారణ్ణా కు అప్ప గిస్తూ “దీనిపైన చెక్కబడిన శంఖచాక్రదులు అరిగిపోయినవి , దీనిని కరిగించి ఆలోహముతో తన విగ్రహములు రెండు తయారుచేసి ఒకటి మీ ఆచార్యులైన పొన్నడిక్కాల్ జీయరునకిచ్చి  ఒకటి నీ తిరువారాధనము కొరకు పెట్టుకునుము” అని అన్నారు. దానితో పాటు తన తిరువారాధనములోని మరొక పవిత్రమైన విగ్రహము ఇచ్చారు.ఆ విగ్రహము పేరు “ఎన్నై తీమనమ్ కెడుత్తార్”(నామనసును సుధ్ధి చేసినవారు) ఇది తిరువాయి మొళిలో2.8లో నమ్మాళ్వార్  పెట్టిన పేరు.

ennaitheemanamkeduthar

ఎన్నై తీమనమ్ కెడుత్తార్ – మొదలి ఆండాన్ స్వామి తిరుమాలిగై -శింగ పెరుమాళ్ కోయిల్

ఈ విగ్రహము ఎమ్పెరుమానార్ల శిష్యులైన ఆట్కొండవల్లి జీయరు మరియు వారి ప్రియులైన  కందాడై ఆండాన్ (మొదలి ఆండాన్ యొక్క  సుపుత్రులు ) ఆరాదించేవారు.మామునులు వారి తో “మీరునూ కందాడై ఆండాన్ వంశీయులు , ఈ ఎమ్పెరుమాన్లను పూజించుటకు తగ్గ వారు , మీ తిరువారధనములో వీరిని వేంచేప చేసి ,తిరువారధనము గావించండి. “అని చెప్పారు. వారి పై గల మిక్కిలి ప్రీతి విశేషము చేత , వారు దేవపెరుమాళ్ళ యొక్క  అంశము  అనే రహస్యమును  వెల్లడి చేసారు. మామునుల ఆజ్ఞ మేరకు కంచిలో స్థిర నివాసము ఏర్పరచుకుని , అక్కడి శ్రీ వైష్ణవుల కు మార్గ దర్శకులు అయ్యారు.

ఈ విధముగా మనము అప్పాచ్చియారణ్ణా యొక్క గొప్ప జీవితం లోని కొన్ని మచ్చు తునకలను చూసాము  వీరు మామునుల కు మరియు వారి ఆచార్యులైన పొన్నడిక్కాల్ జీయరు కు అత్యంత ప్రీతి పాత్రులు . మనకు కూడా వారి వలె ఆచార్య అభిమానము సిధ్ధించ వలెనని వారి శ్రీ పాదముల దగ్గర ప్రార్థన చేద్దాం .

అప్పాచ్చియారణ్ణా తనియన్:

శ్రీమతే వానమహాశైలరామానుజ మునిప్రియామ్

వాదూల వరదాచార్యమ్ వందే వాత్సల్య సాగరమ్

source

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మాఱనేఱి నంబి

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్ వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః

alavandhar-deivavariandan-maranerinambi

ఆళవందార్ (మద్యలో) దైవవారి ఆణ్డాన్ మరియు మాఱనేఱి నంబి – శ్రీ రామానుజుల సన్నిది, శ్రీ రంగము

తిరునక్షత్రము~: ఆని, ఆశ్లేష(ఆయిలము)

అవతార స్థలము~: పురాన్తకము (పాండ్యనాడులో చిన్న పట్టణము)

ఆచార్యులు~: శ్రీ ఆళవందార్

పరమపదించిన చోటు~: శ్రీ రంగం.

మాఱనేఱి నంబి గారు శ్రీఆళవందార్లకి ప్రియమైన శిష్యులలొ ఒకరు. వీరికి ఉన్న ఆచార్యనిష్ఠను చూసి మరియు ఆ పెరియపెరుమళ్ పై ఉన్న భక్తి కి శ్రీరంగమున అందరిచే చాలా గౌరవించబడేవారు.

వీరు నమ్మళ్వారుల(మారన్) వలె ఎప్పుడూ భగవత్ భక్తి లో ఉండుట చేత వీరిని మాఱనేఱి నంబి అని పిలిచేవారు.

వీరు ఎప్పుడు సదా వారి ఆచార్యుల అయిన ఆళవందారుల కాలక్షేపములును వింటూ సదా శ్రీరంగ ప్రాకారమున నివసిస్తూ ఉండేవారు.

మాఱనేఱి నంబి గారి అంత్యదశలో ఉన్నప్పుడు వారికి అత్యంత అప్తులైన పెరియనంబి గారిని పిలిచి వారి తిరుమేనిని(శరీరంను) వారి శరీరబందువులు అవైష్ణవులు అవ్వుట చేత వారికి ఇవ్వవద్దు అని చెప్పినారు. మాఱనేఱి నంబి గారు వారి శరీరము హవిస్సు లాంటిదని అది ఒక్క భగవానునికే చందవలిసినది అని దానిని ఇతరులు తాకరాదు అని భావించారు.మాఱనేఱి నంబి  గారు పరమపదించిన తరువాత పెరియనంబి గారు మాఱనేఱి నంబి గారికి అంత్యసంస్కారములను చేసినారు.మాఱనేఱి నంబి గారు చతుర్థవర్ణము చెందిన వారు కావడము వలన అక్కడ నివసించే వైష్ణవులు పెరియనంబి గారి చేసిన పనిని తప్పుబట్టేరు.ఈ విషయమును రామానుజులుకి చేప్పినారు అప్పుడు రామానుజులు పెరియనంబి గారి నోటి ద్వారా మాఱనేఱి నంబిగారి వైభవమును తెలియచెప్పాలని నిర్ణయించుకున్నారు.రామానుజులు పెరియనంబి గారిని పిలిచి మేము శాస్త్రము పై విశ్వాసమును పెంచుటకు ప్రయత్నము చేస్తుంటే మీరు ఇలా శాస్త్ర విరుద్దముగా చేయుచున్నారేమి అని అడిగిరి ?అప్పుడు పెరియనంబి గారు “భాగవతులకి కైంకర్యము చేయుటలో ఇంకొకరికి అప్పగించుట తగదు అని, మనమే దగ్గర ఉండి చేయాలని చెప్పుట చేత అలా చెసాను అని ” శ్రీరామచంద్రుడు జటాయుకి దగ్గర ఉండి తానే చరమ కైంకర్యమును చేసెను అని అందుచే తాను శ్రీరామచంద్రుడు కంటే గొప్పవాని కాను అని,మాఱనేఱి నంబి గారు జటాయు కంటే తక్కువ కాదు అని “ అందుచే ఈ కైంకర్యమును చేసినామని అని చెప్పినారు.పయిలుమ్ చుడరొళి (తిరువాయ్ మొళి 3.7) మరియు నెడుమాఱ్కడిమై (తిరువాయ్ మొళి 8.10) పదిగమున నమ్మాళ్వారుల భాగవత శేషత్వమును గూర్చి చెప్పినారు.అందుచే మనము అళ్వారుల హృదయ భావమును తేలుసుకొవాలని పెరియనంబి గారు చేప్పినారు. ఇది విన్న శ్రీరామానుజులు చాల సంతొషించి రామానుజులు, పెరియనంబి గారిని అభినందించారు. శ్రీరంగములో వున్న శ్రీవైష్ణవులు అందరూ సంతోషించారు. పిళ్ళైలోకాచార్య స్వామి వారి శ్రీవచనభూషణముకి భాష్యము వ్రాసిన మణవాళ మహామునులు 234 సూత్ర వ్యాఖ్యానము లో ఈ విషయమును వివరించారు.

మాఱనేఱి నంబిగారి వైభవమును తెలుపు కొన్ని వ్యాక్యానములును చుద్దాము.

తిరుప్పావై 29 – ఆయి జననాచార్యర్ వ్యాక్యానము:

ఈ పాశుర వ్యాఖ్యానమున పెరియనంబి గారికి రామానుజులుకి జరిగిన సంభాషణములును చెప్పబడినది.మాఱనేఱి నంబిగారు వారి చివరి దశలో చాలా శరీర బాదకి లోనవుతారు. అందుచే చివరి సమయమున భగవంతుని స్మరించలేదు అని అందుచే వారికి మోక్షము వస్తుందా ? అని పెరియనంబి గారు రామానుజులుని అడిగేరు .అప్పుడు రామానుజులు, వరహపెరుమాళ్ యొక్క చరమశ్లోకమును గుర్తు చేసి అయినని స్మరణ చేయుట చేతను మోక్షము ఇస్తాను అన్న వరాహపెరుమాళ్ చేప్పిన వ్యాక్యనములును గుర్తుచేసారు. దానికి పెరియనంబిగారు అంగీకరించక భుమిదేవి యొక్క సంతోషము కొసం వరాహస్వామి అలా చేప్పివుంటారు అని పెరియనంబి గారు రామానుజులుతో అన్నారు.రామానుజులు” తన తో ఎప్పుడు వున్న భుదేవి కి వరహస్వామి అలా సరదాకి చేప్పరు” అని అన్నారు. అయినా పెరియనంబి గారు అంగీకరించక ప్రమాణమును చూపమన్నారు.భగవద్గీత 4.10 – “జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవమ్ యో వేత్తి తత్వత~: త్యక్త్వా దేహమ్ పునర్ జన్మ నైతి మామేతి సోర్జున” శ్లొకమున పరమాత్మ తన గురించి,తన దివ్య జన్మను గురించి యతార్థముగా తేలుసుకున్న వారికి మరల జన్మ వుండదు అని ,వారు పరమపదమును చేరుతారు అని చెప్పగ పెరియనంబి గారు చలా సంతోషించారు

పెరియ తిరుమొళి 7.4 – పెరియవాచాన్ పిళ్ళై వ్యాక్యానము ఉపొత్ఘాతమున– (కణ్సోర వెన్కురుతి) అను పదిగమున తిరుమంగై ఆళ్వార్లు, “తిరుచ్చేరై అను దివ్యదశమున వేంచేసి వున్న సారనాథ పెరుమాళ్ కి శరణాగతి చేసిన శ్రీవైష్ణవుల భాగ్యమును కొనియాడేరు.” ఈ పాశుర వ్యాక్యానమున పెరియనంబి గారు మాఱనేఱి నంబి గారికి చేసిన చరమకైంకర్యమును ప్రస్తావించారు.

ముదల్ తిరువందాది 1 – నమ్పిళ్ళై వ్యాక్యానము –ఈ పాశురము వ్యాఖ్యానమున ఎవరొ ఒకసరి మాఱనేఱి నంబిగారిని “భగవంతుని సదా మరవక ఎప్పుడూ ఆయన స్మరణ చెయుట ఎట్లు?” దానికి మాఱనేఱి నంబిగారు అసలు భగవంతుని మరచుట యెట్లొ మీరు చెప్పండి అని అడిగారు అట.(మాఱనేఱి నంబి గారు సదా ఆ భగవంతుని ధ్యానములొ ఉండుట చేత ,వారు భగవంతుని మరుచుట జరగదు. )

శ్రీవచన భూషణము 324 – పిళ్ళై లోకాచార్యస్వామి అనుగ్రహితము–ఒక వర్ణములో పుట్టుట ద్వారా శ్రీవైష్ణవుల వైభవము ముడిపడదు అని ,ఆచరణా ప్రయమైన మారనేరి నంబి గారి వైభవము చెప్పడము అయినది. ఇక్కడ పెరియ నంబి గారు మాఱనేఱి నంబి గారికి చేసిన చరమ కైంకర్యమును వర్ణించారు.మనవాళమామునులు కుడా తమ యొక్క వ్యాక్యానములలోఈ చరమ కైంకర్యము యొక్క సారమును గురించి వర్ణించారు.

ఆచార్య హృదయము 85 – అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, తమ యొక్క అన్నగారైన (పిళ్ళై లోకాచార్యర్) బాటలోనే నడచి, మాఱనేరి నమ్బి యొక్క వైభవమును తమ యొక్క చూర్ణికలో ఈ వృత్తాంతమును వివరించిరి.

ఆ విదముగా , మనము మాఱనేరి నమ్బి గారి కొన్ని వైభవములను తెలుసుకుంటిమి.

మనము మాఱనేరి నమ్బిగారికి ఆళవందారులకు గల సంభందమును కలుగు విదముగా వారి యొక్క శ్రీ చరణములను ఆశ్రయించి.

గమనిక~: నంబిగారి తిరునక్షత్రము పెరియ తిరుముడి అడైవులో ఆడి – ఆయిలము అని ఉండినది కాని ఆని – ఆయిలము అని వారి యొక్క వాజి తిరునామములో చెప్పబడినది.

మాఱనేరి నమ్బిగారి తనియన్

యామునాచార్య సచ్చిష్యమ్ రంగస్థలనివాసినమ్
ఙ్ఞానభక్త్యాదిసమ్పన్నం మాఱనేరిగురుమ్ భజే

யாமுநாசார்ய ஸச்சிஷ்யம் ரங்கஸ்தலநிவாஸிநம்
ஜ்ஞாநபக்த்யாதிஜலதிம் மாறனேரிகுரும் பஜே

 

అంగ్ల అనువాదము- సారథి రామానుజ దాస

తెలుగు అనువాదము- సురేష్ కౄష్ణ రమానుజ దాస.

 

Source

వాది కేసరి అళగియ మణవాళ జీయర్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

vadhi-kesari-azhagiya-manavala-jiyar

తిరునక్షత్రము~:జ్యేష్ఠ మాసము స్వాతి నక్షత్రం

అవతార స్థలము~: అంబ సముద్రం వద్ద మన్నార్ కోవిల్ (బ్రహ్మ దేశం)

ఆచార్యులు~: పెరియవాచ్ఛాన్ పిళ్ళై(సమాశ్రయణం) మరియు నాయనారచ్ఛాన్ పిళ్ళై(గ్రంథ కాలక్షేపం)

శిష్యులు~: యామునాచార్యర్ (తిరుమలై ఆండాన్ యొక్క వంశస్తులు, తత్వ భూషణం మరియు ప్రమేయ రత్నం రచించారు), పిన్ సేన్ఱవల్లి ఇతరులు

పరమపదించిన చోటు ~: శ్రీరంగము

రచనలు~: తిరువాయ్ మొళి 12000 పడి వ్యాఖ్యానము (ప్రతి పదార్థము ), తిరువిరుత్తమ్ స్వపదేశ వ్యాఖ్యానం ,ధ్రమిడోపన్సిశధ్ సంగతి – తిరువాయ్ మొళి సంగతి శ్లోకము , ఆధ్యాత్మ చింతై, రహస్యత్రయ వివరణం , దీప సంగ్రహం , తత్వ దీపం , దీప ప్రాకాశికై , తత్వ నిరూపణం , భగవత్ గీతై వెంబ – శ్రీ భగవత్ గీత లో ని ప్రతి శ్లోకమునకు తమిళ్ లో ఒక పాశురము ,శ్రీ భగవత్ గీత వ్యాఖ్యానము వగైరా …

తల్లి దండ్రుల చే వరదరాజర్ అనే పేరు తో అనుగ్రహింపబడ్డారు. యౌవన వయస్సులోనే పెరియ వాచ్ఛాన్ పిళ్ళై గారి శిష్యులై , తిరుమడ పళ్ళి కైంకర్యమును చేస్తూ వారి సేవ చేసారు . 32 సం॥ వయస్సులో ఉన్నప్పుడు కొందరు పండితులు తత్వ శాస్త్రం చర్చ చేస్తుండగా చూసారు . ఆత్రుత తో వారి వద్ద కు వెళ్లి చర్చింకునే విషయమును గురించి అడిగారు . వరదరాజులు అజ్ఞానుడని తలచి , వ్యంగ్యంగా వారి తో ముసలకిసలయం (లేని గ్రంథము ) గురించి చర్చిస్తున్నాము అని చెప్పారు . అక్షర జ్ఞానము లేనందున శాస్త్రము అర్థము అవదని చివాట్లు పెట్టారు . పెరియ వాచ్ఛాన్ పిళ్ళై వారి దగ్గరు కు వెళ్లి జరిగిన సంఘటనను వివరించారు . తనకు చదువు రానందున వల్లే తనని వెక్కిరించారని పెరియ వాచ్ఛాన్ పిళ్ళై వారికి వివరిస్తారు . తన పరిస్థతి మీద సిగ్గు పడి వారికి శాస్త్ర జ్ఞానమును ప్రసాదించాలని కోరుతారు .అత్యంత దయ మయులైన పెరియ వాచ్ఛాన్ పిళ్ళై వారు , వారికి శాస్త్రము తో పరిచయము చేసి , వారికి కావ్య , నాటక , అలంకార , శబ్ద , తర్క , పూర్వ మీమాంస , ఉత్తర మీమాంస భోదిస్తారు. ఆచార్యుని కృప కారణంగా , అతి తక్కువ కాలము లోనే వారు శాస్త్రము లో దిట్ట అయ్యి , ముసలకిసలయం అనే గ్రంథము రచించి , తనను వెక్కిరించిన పండితులకు బహుకరిస్తారు . భగవత్ విషయమును నాయనారచ్ఛాన్ పిళై గారి దగ్గర నేర్చుకున్నారు . ఆచార్య కటాక్షము వల్ల ఒక జీవాత్మ ఎంత ఎత్తులకు ఎదగ గలడో తెలుపుటకు వీరు ఒక చక్కని ఉదాహరణ .

అటు పిమ్మట , విరక్తి కలగి , సన్యాస ఆశ్రమమును స్వీకరించి , అళగియ మణవాళ జీయర్(సుందర జామాత్రు ముని ) అను తిరునామమును స్వీకరిస్తారు .ఇతర తత్వముల పండితులతో అనేక వాదములను గెలిచి , వాది కేసరి అనే తిరునామమును సంపాదించు కుంటారు.

మన సంప్రదాయము కొరకై అనేకమైన మహా గ్రంథముల రచించారు . తిరువాయ్ మొళి కి ప్రతి పదార్థమును 12000 పడి అను గ్రంథము పేరిట రాసారు (శ్రీ భాగవతము 12000 శ్లోకముల పరిమాణము పోలిన). ఇది చాల గొప్ప గ్రంథము , ఎందులకు అనగా తిరువాయ్ మొళి ఇతర వ్యాఖ్యానములలో నమ్మాళ్వార్ యొక్క దివ్య అనుభవమును మరియు పాశురము యొక్క ప్రవాహము ను వర్ణించారు. కాని ఏ యొక్క గ్రంథము తిరువాయ్ మొళి గ్రంథము ను సుస్పష్టంగా తెలుసుకునేందుకు వీలుగా పాశురము యొక్క ప్రతి పదార్థమును ఇవ్వలేదు. వీరు రాసిన మరి ఒక్క చెప్పుకో తగ్గ గ్రంథము శ్రీ భగవద్ గీత యొక్క ఒక్కొక్క శ్లోకమునకు అరవములో పాశురము రాయుట . శ్రీ భగవద్ గీత శ్లోకముల యొక్క సూత్రములను సులభమైన తమిళ భాషలో రాసారు . అనేకమైన రహస్య గ్రంథములను కూడా రచించారు .

వీరి శిష్యులైన యామునాచార్యర్ (తిరుమలై ఆండాన్ యొక్క వంశస్తులు) అత్యుత్తమమైన రెండు రహస్య గ్రంథములను రాసారు( తత్వ భూషణం మరియు ప్రమేయ రత్నం ) – రెండునూ విలువైన సాంప్రదాయ విషయములతో నిండి ఉన్నవి .
`
మణవాళ మామునులు తిరువాయ్ మొళి కు గల అనేక వ్యాఖ్యానములు గురించి చెప్పు సందర్భములో వాది కేసరి అళగియ మణవాళ జీయర్ ను మరియు వారి 12000 పడి ని చాలా పొగుడుతూ రాసారు .వారి  ఉపదేశ రత్నమాల లోని 45వ సూత్రమును పరిశీలద్దాము రండి

అన్బోడు అళగియ మణవాళ జీయర్
పిన్బొరుమ్ కట్ట్రు అరిన్దు పేచుక్కైక
తామ పెరియ పోతముడన్ మారన్ మఱైయిన్ పొరుళ్ ఉఱైత్తదు
ఏతమిల్ పన్నిరాయిరం

అనువాదం
అళగియ మణవాళ జీయర్ ,భవిష్యద్ కాలము లో అందరు చెప్పుకునుటకున్ను, పాండిత్యము తోను మరియు ఎంతో ప్రేమ తోను తిరువాయ్ మొళి యొక్క అర్థములను(ప్రతి పదార్థమును) , కల్మషము లేని 12000 పడి లో అనుగ్రహించారు.

పిళ్ళై లోకం జీయర్, వారి వ్యాఖ్యానములో ఈ క్రింది వాటిని గుర్తిస్తారు:

1. ఇక్కడ ప్రేమ అంటే – అ) తిరువాయ్ మొళి పట్ల అనుబంధం /భక్తి ఆ) జీవాత్మ పట్ల దయ (జీవాత్ముల ఉజ్జీవనం కాగ వ్యాఖ్యానమును అనుగ్రహించారు )

2. తిరువాయ్ మొళి కి మరి నాలుగు వ్యాఖ్యానములు ఉన్నపటికిని , పాశురము లోని ఏదైనా పదము యొక్క నిజమైన అర్థమును తెలుసుకోవలేనన్న , 12000 పడి పై ఆధార పడ వలసి ఉంటుంది . అందులకే దీనిని చాలా ముఖ్యమైన గ్రంథము గా పరిగణిస్తారు.

3.అళగియ మణవాళ జీయర్ గారి జ్ఞానమును మరియు సామర్థ్యమును చాలా గొప్పగా మణవాళ మామునులు కీర్తిస్తారు, ఎందుకనగా వీరు తిరువాయ్ మొళి నైపుణ్యులు మరియు దాని విలువైన అర్థములను సుస్పష్టంగా రాసారు.

4. ఆళ్వార్ యొక్క దివ్యమైన అనుభవము వీరి వ్యాఖ్యానములో సుందరంగా వర్ణింపబడ్డాయి. ఇతర వ్యాఖ్యానముల తో వీరి వ్యాఖ్యానము సరి సమముగా ఉంటుంది. ఉదాహరణకు , పిళ్ళాన్ 6000 పడి వ్యాఖ్యానము చిన్నగా నున్న , వీరి వ్యాఖ్యానము అక్కడ వివరణము ఇస్తుంది . పెరియ వచ్ఛాన్ పిళ్ళై 24000 పడి వ్యాఖ్యానము లేక నమ్పిళ్ళై 36000 పడి వ్యాఖ్యానము విస్తారముగా నున్న , అక్కడ వీరి వ్యాఖ్యానము చిన్న గా ఉండి వివరణము ఇస్తుంది.

5. ఆళ్వార్ వారి వ్యాఖ్యానమును ఏదమిల్(నిష్కలమషం) అని సంభోదించారు , అదే విధముగా మాముణిగళ్ వీరి వ్యాఖ్యానమును (12000 పడిని) నిష్కలమషమునైనదిగా వివరిస్తారు.

ఈ విధముగా వాది కేసరి అళగియ మణవాళ జీయర్ యొక్క దివ్యమైన జీవిత చరిత్రము లోని కొన్ని ఘట్టములను పరిశీలించాము. భాగవత్ నిష్ఠలో పరిపూర్ణముగా మునిగి,  పెరియవాచ్ఛాన్ పిళ్ళై మరియు నాయనారచ్ఛాన్ పిళ్ళై కి అత్యంత ప్రియ శిష్యులు గా ఉండిరి . వారి యొక్క పాదపద్మము దగ్గర మనలకు అటువంటి నిష్ఠ రావడానికి ప్రార్థన చేద్దాం.

వాది కేసరి అళగియ మణవాళ జీయర్ తనియన్

సుందరజామాత్రుమునే : ప్రపద్యే చరణాభుజం
సంసారార్ణవ సంమ్మజ్ఞ జంతు సన్తారపోతకమ్

source

అడియేన్ ఇందుమతి రామానుజ దాసి