Monthly Archives: September 2013

వడక్కు తిరువీధి పిళ్ళై

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలొ మనం నంపిళ్ళైల గురించి తెలుసుకున్నాం , ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

వడక్కు తిరువీధి పిళ్ళై- కాంచీపురము

తిరునక్షత్రము: స్వాతి-ఆషాడమాసము

అవతార స్థలము: శ్రీ రంగము

ఆచార్యులు: నమ్పిళ్ళై

శిశ్యులు:  పిళ్ళై లోకాచార్యర్, అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, మొద,,

పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగమ్

శ్రీ సూక్తులు: ఈడు 36000 పడి

శ్రీ క్రిష్ణ పాదరులుగా జన్మించిరి,వడక్కు తిరువీధి పిళ్ళైగా ప్రసిద్దికెక్కిరి.నమ్పిళ్ళై ముఖ్య శిశ్యులలో ఒకరు.

వడక్కు తిరువీధి పిళ్ళై గృహస్తాశ్రమములో ఉన్నప్పడికినీ పిల్లలకు జన్మనిచ్చుటకు ఇష్టంలేక పూర్తిగా ఆచార్య నిష్ఠయందు ఉండెను .వారి అమ్మగారు అది చూసి కలత చెంది నమ్పిళ్ళై వద్దకు వెళ్ళి వడక్కు తిరువీధి పిళ్ళైల స్వభావమును గూర్చి చెప్పెను.అదివిని, నమ్పిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళై మరియు అతని భార్యని రమ్మని, అతడి భార్యని తన  కృపచే దీవించి వడక్కు తిరువీధి పిళ్ళైలను పిల్లలకు జన్మనిచ్చుటకు ప్రయత్నము చేయవలెనని ఆఙ్ఞాపించిరి. ఆచార్యుల ఆఙ్ఞను అంగీకరించి వడక్కు తిరువీది పిళ్ళై అలానే చేసిరి,తొందరగానే వడక్కు తిరువీధి పిళ్ళైల భార్య ఒక శిశువుకు జన్మనిచ్చెను. వడక్కు తిరువీధి పిళ్ళై ఆ శిశువుకు పిళ్ళై లోకాచార్యన్ అనే నామమును పెట్టిరి,నమ్పిళ్ళై (లోకాచార్యన్) కరుణ వలన జన్మించాడు కావున. అదివిని, నమ్పిళ్ళై ఆ శిశువుకు అజగియ మణవాళన్ అనే పేరు పెడుదామనుకొన్నామనిరి. నమ్పెరుమాళ్ కుడా విని వడక్కు తిరువీది పిళ్ళైలకు మరియొక శిశువు జన్మించేలా దీవించిరి,వారికి అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ అనే పేరును పెట్టిరి,వీరు అజగియ మణవాళన్ (నమ్పెరుమాళ్) కృపతో జన్మించిన కారణముగా. ఆ విదముగా వడక్కు తిరువీది పిళ్ళై రెండు రత్నములను మన సంప్రదాయమునకు ఇచ్చిరి.వీరిని పెరియాళ్వార్తో పోల్చుదురు~:

 • ఆళ్వార్ మరియు వడక్కు తిరువీధి పిళ్ళై ఇద్దరూ ఆషాడమాసము స్వాతిన జన్మించిరి .
 • ఆళ్వార్ తిరుపల్లాణ్డు మరియు పెరియాళ్వార్ తిరుమొజి ఎమ్పెరుమాన్ కృపతో వ్రాసిరి. వడక్కు తిరువీది పిళ్ళై ఈడు 36000 పడి నమ్పిళ్ళై కృపతో వ్రాసెను.
 • ఆళ్వార్ ఆణ్డాళ్ ను మన సంప్రదాయమునకు ఇచ్చిరి మరియు వారు క్రిష్ణానుభవముతో ఆమెను పెంచిరి. వడక్కు తిరువీధి పిళ్ళై పిళ్ళై లోకాచార్యర్ మరియు అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లను భగవత్ అనుభవము ద్వార పెంచి ఇచ్చిరి.

వడక్కు తిరువీధి పిళ్ళై తిరువాయ్ మొజి ప్రవచనములను నమ్పిళ్ళై వద్ద వింటూ, పగటి వేళలో ఆచార్యుల వద్ద గడిపి,రాత్రి వేళలో మఱ్ఱిఆకులపై వారు చెప్పినది వ్రాసేవారు.ఆ విధముగా వారు ఈడు 36000 పడి వ్యాఖ్యానమును నమ్పిళ్ళైల ప్రవచనములు గ్రహించి నమ్పిళ్ళైలకు తెలియకుండా వ్రాసిరి. ఒకసారి వడక్కు తిరువీధి పిళ్ళై నమ్పిళ్ళైను తదియారాధనము కొరకై వారియొక్క తిరుమాళిగైకు ఆహ్వానించగా నమ్పిళ్ళై అంగీకరించి వారి యొక్క తిరుమాళిగైకు వచ్చిరి. నమ్పిళ్ళై  కోయిలాళ్వార్నందు తిరువారాధనమును చేయుటకు వెళ్ళగా, కోయిలాళ్వార్లో మఱ్ఱి ఆకులపై వ్యాఖ్యానమును చూసిరి. దానియందు ఆసక్తి కలిగి,వాటిలో కొన్ని చదివి వడక్కు తిరువీధి పిళ్ళైని ఏమిటివి అని అడిగిరి. వడక్కు తిరువీధి పిళ్ళై నమ్పిళ్ళైల ప్రవచనములను వ్రాయుచుంటిమని వివరణ ఇచ్చిరి. నమ్పిళ్ళై వడక్కు తిరువీది పిళ్ళైని తిరువారాధనము చేయమని ఆదేశించి,వారు  మిగిలినవి చదవడము ప్రారంభించిరి. వారు పెరియవాచ్చాన్ పిళ్ళై మరియు ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళను వ్రాయమని అప్పటికే చెప్పిరి, వారు పెరియవాచ్చాన్ పిళ్ళై మరియు ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళతో ఆ వ్యాఖ్యానమును చదివించిరి, వారు అది చాల వైభవముగా ఉందని ప్రశంసించారు నమ్పిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళైలను ఈ విధముగా తమ అనుమతి లేకుండా ఎందుకు వ్రాసారు, పెరియవాచాన్ పిళ్ళైల వ్యాఖ్యానమునకు పోటిగా వ్రాస్తున్నారా అని అడిగిరి . వడక్కు తిరువీది పిళ్ళై తనవలన జరిగిన దానికి అపరాధనమునకు చింతించి, నమ్పిళ్ళై పాద పద్మములందు సాష్టాంగ నమస్కారం చేసి భవిష్యత్తు కాలములో పరిశీలించుటకు వీలుగా వ్రాసెనని వివరణ ఇచ్చిరి. వారి వివరణకు సంతృప్తి చెంది, నమ్పిళ్ళై ఆ వ్యాఖ్యానమును స్తుతించి ఈ విధముగా అనిరి వడక్కు తిరువీధి పిళ్ళై అవతార విశేషముచే ఇలా నా ప్రవచనములనుండి ఏమియును తప్పకుండా వ్రాసిరి. నమ్పిళ్ళై  ఈ వ్యాఖ్యానమును ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళకు ఇవ్వమనిరి ( నంజీయరుల పూర్వాశ్రమము పేరును పెట్టుకొనిరి – మాదవర్) దానిని తన తదుపరి తరమునకు ఉపదేశించడమువలన,కడకు మణవాళ మామునిగళ్ళచే వెలువడబడుతుంది.ఎమ్పెరుమానుల కృపచే, నమ్పిళ్ళై భవిష్యత్తు కాలములో మామునిగళ్ అవతారమును ముందుగానే గుర్తించి ఆ విషయమును ఈయుణ్ణి మాదవ పెరుమాళ్ళకి చెప్పి,వారి తదుపరి తరముల ద్వారా, అది మామునిగళ్ళకి చేరి సరియగు సమయములో మొత్తము ప్రపంచమునకే తెలియునని చెప్పిరి.

నమ్పిళ్ళై పరమపదమునకు చేరిన తదుపరి వడక్కు తిరువీధి పిళ్ళై మన సంప్రదాయమునకు నాయకుడిగా ఉండెను.వారు అన్ని అర్థములను పిళ్ళై లోకాచార్యర్ మరియు అజగియ మణవాళ పెరుమాళ్ నాయనారులకు ఉపదేశించిరి. శ్రీవచన భూశణ దివ్య శాస్త్రములో పిళ్ళై లోకాచార్యులు వడక్కు తిరువీధి పిళ్ళైల ఆదేశములను కొన్ని చోట్ల ప్రస్తావించెను~:

సూత్రమ్ 77లో, ఈ విధముగా చెప్పబడెను అహంకారమును వదిలిన,ఆ ఆత్మను మాత్రమే అడియేన్ అని పిలువబడును.ఇది యతీన్ద్ర ప్రవణ ప్రభావములో వడక్కు తిరువీధి పిళ్ళై చే వివరించబడినది.

సూత్రమ్ 443లో,పిళ్ళై లోకాచార్యర్ వడక్కు తిరువీధి పిళ్ళై ఈ విధముగా వివరిస్తారని చెప్తారు,అనాదియైన కాలమునుండి స్వ స్వాతన్త్రియము నిండి ఉన్న జీవాత్మలు సంసారము నుండి బయటపడుటకు ఒకే ఒక్క దారి సదాచార్యున్ని ఆశ్రయించడమే.

తదుపరి కొంతకాలమునకు వడక్కు తిరువీధి పిళ్ళై తమ ఆచార్యులైన నమ్పిళ్ళైని తలుచుకొని తమ యొక్క చరమ తిరుమేని వదిలి పరమపదమునకు చేరిరి.

ఎమ్పెరుమానారులతో మరియు మన ఆచార్యులతో మనకూ అలాంటి అనుబంధము కలిగేలా మనము వడక్కు తిరువీధి పిళ్ళైల శ్రీ చరణములను ప్రార్థించుదాము.

వడక్కు తిరువీధి పిళ్ళైల తనియన్ :

శ్రీ క్రిష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా !
యత్ ప్రసాద ప్రభావేన సర్వ సిద్దిరభూన్మమ !!

ஸ்ரீ க்ருஷ்ண பாத பாதாப்ஜே நமாமி ஸிரஸா ஸதா
யத் ப்ரஸாதப் ப்ரபாவேந ஸர்வ ஸித்திரபூந்மம

మన తదుపరి సంచికలో పిళ్ళై లోకాచార్యుల వైభవమును చూద్దాము.

అడియేన్ :
రఘు వంశీ రామానుజ దాసన్.

source:

నమ్పిళ్ళై

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలొ మనం నంజీయరుల గురించి తెలుసుకున్నాం , ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

నమ్పిళ్ళై – తిరువల్లిక్కేణీ

తిరునక్షత్రము: కార్తీక మాసము, కృత్తిక నక్షత్రము

అవతార స్థలము: నమ్బూర్

ఆచార్యులు: నంజీయర్

శిశ్యులు: వడక్కు తిరువీధి పిళ్ళై, పెరియవాచ్చాన్ పిళ్ళై, పిన్భజగియ పెరుమాళ్ జీయర్, ఈయుణ్ణి మాధవ పెరుమాళ్, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్  మొదలగువారు.

పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగమ్

శ్రీ సూక్తులు: తిరువాయ్ మొజి 36000 పడి ఈడు వ్యాఖ్యానము, కణ్ణినున్ శిరుత్తామ్బుకు వ్యాఖ్యానము, తిరువన్దాదులకు, తిరువిరుత్తములకు వ్యాఖ్యానము.

నమ్బూర్ నందు వరదరాజన్ గా జన్మించిరి, నమ్పిళ్ళై గా ప్రసిద్దిగాంచిరి. వారికి గల మరికొన్ని నామధేయములు తిరుక్కలికన్ఱి దాసర్, కలివైరి దాసర్, లోకాచార్యర్, సూక్తి మహార్ణవర్, జగదాచార్యర్ మరియు ఉలగాశిరియర్.

పెరియ తిరుమొజి 7.10.10 ని చూస్తే కనుక,తిరుక్కణ్ణమన్గై ఎమ్పెరుమాన్ తిరుమంగై ఆళ్వారుల పాశురముల అర్థములను కలియన్ నుండే తెలుసుకోదలిచెనని –అందువల్ల కలియన్  నమ్పిళ్ళై ల యొక్క అవతారమును ధరించి ఎమ్పెరుమాన్ పెరియవాచ్చాన్ పిళ్ళై అవతారమ్ ధరించి అరుళిచెయల్ అర్థములని తెలుసుకొనిరి.

నంజీయర్ తమ యొక్క 9000పడి వ్యాఖ్యానమునకు ఒక మంచి గ్రంథమును చేయదలిచెను. అప్పుడు వారు  శ్రీ వైష్ణవగోష్ఠిలో విచారించగా, నమ్బూర్ వరదరాజర్ లను ప్రతిపాదించిరి. వరదరాజర్ నంజీయర్లతో మీ తిరువుళ్ళమ్(భావన) ప్రకారము వ్రాసెదమని చెప్పెను. నంజీయర్ మొదట వరదరాజరునకు 9000 పడి కాలక్షేపమును చెప్పి తదుపరి అసలు ప్రతిని ఇచ్చిరి. వరదరాజర్  కావేరి నదికి అటు వైపు ఒడ్డున ఉన్న తన స్వస్థలానికి చేరి అక్కడ ఎటువంటి ఇబ్బందులు  గ్రంథమును రాసి పూర్తి చేయవలెనని  సంకల్పించిరి.నది దాటే సమయములో, ఒక్కసారిగా వరద రావడముతో వరదరాజర్ ఈదుచూ దాటిరి.ఆ సమయములో, తన చేతులనుండి అసలు గ్రంథము జారి పోయెను. తిరిగి తన స్వస్థలమునకు చేరిన పిమ్మట,వారి ఆచార్యులను మరియు వారు అనుగ్రహించిన అర్థ విశేషములను ధ్యానించి , మరల 9000 పడి వ్యాఖ్యానమును వ్రాయుట మొదలు పెట్టెను. అప్పడికే వారు తమిళ భాష మరియు సాహిత్యములపై పట్టు ఉండడమువలన,వారు ఎక్కడ అందమైన అర్థములను కావలెనో అక్కడ చేర్చి ,చివరికి నంజీయరుల వద్దకి వచ్చి వారికి సమర్పించిరి . నంజీయర్ ఆ వ్యాఖ్యానమును చూసి, అసలు ప్రతికి కొన్ని మార్పులు ఉన్నవని అర్థముచేసుకొని,ఏమైనదని విచారించిరి.వరదరాజర్ జరిగిన సంఘటనను వివరించిరి,నంజీయర్ జరిగినది విని సంతోషముతో వరదరాజర్ సత్యమైన కీర్తిని అర్థము చేసుకొని వారికి నంజీయర్ “నమ్పిళ్ళై” మరియు “తిరుక్కలికన్ఱి దాసర్” అనే నామధేయమును పెట్టిరి.

భట్టర్-నంజీయరుల సంబంధం మరియు సంభాషణల వలె, నంజీయర్-నమ్పిళ్ళై సంబంధం మరియు సంభాషణలు కూడా ఎంతో ఆహ్లాదకరముగా మరియు చాలా అర్థవంతముగా ఉండును.వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాము:

 • నమ్పిళ్ళై,నంజీయరులని ఈ విధముగా అడిగిరి, ఆ కాలములో ఉపాయాంతరములకు (కర్మ, జ్ఞాన, భక్తి) చాలా ప్రమాణములు ఉండగా శరణాగతికి చాలా ప్రమాణములు లేవు ఎందులకు అని అడిగిరి. నంజీయర్ మొదటగా మనకు ప్రత్యక్షముగా అర్థమయ్యే వాటికి ప్రమాణము అవసరములేదని చెప్పిరి – ఏ విధముగానైతే ఒక వ్యక్తి నదిలో మునుగుచుండగా,అతను అలానే మునుగుతాడో లేక మునగని ఒక వ్యకి సహాయము కోరి శరణు వేడుతాడో – మనము సంసారము అనే సముద్రములో మునుగుచుండగా అట్లే సంసారం అనే మహా సాగరం లో మునిగే మనలను ఒడ్డున చేర్పించటానికి మునిగి తేలని ఎమ్పెరుమాన్ ని శరణు వేడటమే ఉత్తమమైన ఉపాయము ,కాని వారు శరణాగతి తత్త్వమును నిరూపించటానికి మరి కొన్ని బలమైన ప్రమాణములను శాస్త్రములో చూపుతారు. వారు అలానే -ప్రమాణముల సంఖ్యను బట్టి ఆ తత్త్వము యొక్క గొప్పతనమును నిరూపణ చేయటము సరికాదని, లోకముల లో అనేక మంది సంసారులు మరియు కొద్ది మంది మాత్రమే సన్యాసులుగా ఉన్నారని అంత మాత్రాన సంసారిగా ఉండడటమే మంచిదని అనుకోలేమని విన్నవించిరి .ఇవి విని నమ్పిళ్ళై చాలా సంతృప్తి చెందెను.
 • నమ్పిళ్ళై నంజీయర్లను ఈ విధముగా అడిగిరి “ఎప్పుడు ఒకరు శ్రీవైష్ణవత్వమును కలిగి౦దని తెలుసుకొందురు?”. నంజీయర్ సమాదానము~:ఎవరైతే పరత్వమును అర్చావతారములో చూస్తారో, ఎవరైతే ఇతర శ్రీవైష్ణవులను తమ భార్య మరియు పిల్లలుగా భావిస్తారో(అదే అనుబంధంను శ్రీవైష్ణవులందు కలిగిఉండవలెను) మరియు ఎవరైతే ఇతర శ్రీవైష్ణవులు తనను అవమానపరచినా సంతోషముగా స్వీకరించ గలుగుదురో వారు శ్రీవైష్ణవత్వమును కలిగి ఉందురు.
 • ఒక్కప్పుడు నమ్పిళ్ళై శ్రీభాశ్యమును నంజీయరుల వద్ద సేవించుచుండగా, నంజీయర్ నంపిళ్ళై ను తమ పెరుమమాళ్ళకి తిరువారాధనమును చేయమని  ఆఙ్ఞాపించిరి. నమ్పిళ్ళై ఎలా చేయాలో తెలియదు అనగా – ఆ సమయములో నంజీయర్ నమ్పిళ్ళై ని ద్వయ మహా మన్త్రమును ( ద్వయములోని మొదట మరియు రెండవ భాగముల మధ్యన “సర్వ మంగళ విగ్రహాయ” అనే వాక్యము చేర్చి తిరువారాధనం చేయటం ద్వారా అర్చావతార రూపము లో ఉన్న ఎమ్పెరుమాన్ యొక్క సౌలభ్యమును చూపుదురు)అనుసంధానం చేసి భోగమును ఎమ్పెరుమానులకు నివేదించమనిరి. ఈ విషయము ద్వారా మన పూర్వాచార్యులు దేనికైనను ద్వయ మహా మంత్రం పై ఆధార పడుదురని తెలుసుకొంటిమి.
 • నమ్పిళ్ళై అడిగిరి“ఎమ్పెరుమానుల అవతారముల ముఖ్య ఉద్దేశము ఏమిటి ?”. నంజీయర్ ఈ విదముగా చెప్పెను “ఎవరైనా భాగవత అపచారమునకు పాల్పడినచో ఎమ్పెరుమాన్ వారిని సరియైన విధముగా శిక్షించుటకు పెద్ద పనులను తీసుకొనును ” (ఉదా:ఎవరైనా భాగవత అపచారమునకు పాల్పడినచో వారిని సరియైన విధముగా శిక్షించుటకుఎమ్పెరుమాన్ ఎటువంటి అసామాన్య పనులు చేయుటకును సిద్ధముగానున్దురు. పూర్వం తన భక్తుల యెడల చాలా అపచారములు చేసినా దుర్యోధనుని సంహరించుటకై ఎన్నో వ్యయ ప్రాయసనలను ఓర్చుకొని తాను కణ్ణన్ ఎమ్పెరుమాన్ గా అవతారమును ధరించిరి).
 • అప్పుడు నమ్పిళ్ళై ఈ విదముగా అడిగెను “ భాగవత అపచారము అనగానేమి?”. నంజీయర్ సమాదానము“మనతో సమానముగా ఇతర శ్రీవైష్ణవులని భావించడము”.ఆళ్వారుల తమ పాశురములలో గొప్ప భాగవతులు వారి జన్మము , జ్ఞానము మొదలగు వాటిని పరిగణలోకి తీసుకోకుండా , భాగవతులు ఎప్పుడు మన కన్నా గొప్పవారు అనే భావన తో శ్రీ వైష్ణవులు ఉండాలని . మన పుర్వాచార్యులు ఎల్లప్పుడు భాగవతులు గొప్పతనాని అనుసంధానం చేస్తు కాలం గడిపేవారని , మనమును అట్లు ఉండుటకు ప్రయత్నం చేయవలెనని చెప్పిరి .
 • నంజీయర్ నమ్పిళ్ళై కి ఎవరైతే భగవద్ గుణానుభవమ్ లో ఉంటారో వారికి లౌకిక విషయముల యగు ఐశ్వర్య , అర్థ ,కామ మొదలగులలో రుచి కూడదని ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధ పాశురములను ఉదాహరణము గా చెప్పిరి. ఎమ్పెరుమాన్ యొక్క దివ్య స్వరూపాన్ని గుర్తించిన తిరుమంగై ఆళ్వార్లు భౌతిక విషయములలో ఆసక్తి ని ఏ విధముగా విదిచిరో తన దివ్య ప్రబంధం లోని మొదటి పాశురములో “వాడినేన్ వాడి…నారాయణ ఎన్నుమ్ నామమ్” (ఎమ్పెరుమాన్ తిరునామము లబించే వరకు మేము సంసారమునందు భాదలను అనుభవించితిమి అని తెలిపిరి) .అదివిని నమ్పిళ్ళై చాలా సంతోషముచెంది నంజీయరులను ఎప్పడికి వదలక వారికి సపర్యలను చేస్తూ కాలక్షేపములను అనుభవించేవారు.
 • నంజీయర్ తిరువాయ్ మొజి కాలక్షేపమమును 100 పర్యాయములు నిర్వహించిరి మరియు నమ్పిళ్ళై నంజీయరులకు శతాభిషేక మహోత్సవమును జరిపించిరి. నంజీయరుల కాలక్షేపముల ద్వారా పూర్వాచార్యుల రహస్యార్థములను అన్ని వారు తెలుసుకొనిరి.

నమ్పిళ్ళై చాలా ప్రత్యేక గుణములను కలిగినవారు మరియు వారి గొప్పతనమును మనము ప్రమాణించలేము. వారికి తమిళ/సంస్కృతము భాష మరియు సాహిత్యములలో మంచి పట్టు ఉండేది. తన ప్రవచనములలో వారు తిరుక్కురళ్, నన్నూల్, కంబ రామాయణము,మొద!!వాటిని మరియు వేదాంతము, విష్ణు పురాణము, శ్రీ వాల్మీకీ రామాయణము మొద!!  వాటిని ఉదహరించేవారు.వారు ఎవరికైనా ఆళ్వార్ అరుళిచ్చెయలందు సందేహము/ప్రశ్న లు తలెత్తినప్పుడు వాల్మీకీ రామాయణమును ఉపయోగించి వారి సందేహములను యుక్తితో సంతృప్తిపరిచేవారు ,కారణము రామాయణము వైదీహులచే ప్రపంచ వ్యాప్తముగా అంగీకరించబడినది. వాటిలో కొన్ని సంఘటనలు మనకు వారి యొక్క గొప్పతనమును మరియు వినయమును తెలియచేయును.

 • నమ్పిళ్ళై సాదారణముగా తమ ప్రవచనములను పెరియ కోవెలలో మూల మూర్తి సన్నిధికి ప్రదక్షిణముగా తూర్పు దిక్కున (పెరియ పెరుమాళ్ళ తిరువడి దిక్కు)చెప్పేవారు .అందువలనే ఈ రోజు కూడా మనము ప్రణామమును సన్నిధి నుండి తిరిగి వచ్చి అక్కడ సమర్పించుదుము. ఒకసారి పెరియ పెరుమాళ్ అక్కడ నుంచొని నమ్పిళ్ళై ఉపన్యాసమును వినదలచిరి. తిరువిళక్కు పిచన్ (సన్నిధిలో దీపకైంకర్యమును చూసే ఒక శ్రీవైష్ణవుడు) పెరియ పెరుమాళ్ నిలబడడము చూసి వారిని క్రిందికి పూర్వం మాదిరిగా పడుకునేలాగా నెట్టి ఈ విదముగా ఆర్చావతారములో వెళ్ళరాదు అని చెప్పిరి. ఎమ్పెరుమాన్ ఇప్పడికి నమ్పిళ్ళై ని చూస్తూ కాలక్షేపం వినాలని ఎమ్పెరుమాన్ తన అర్చావతారం ను లెక్క చేయకుండా అర్చసమాధి ని త్యజించారు.
 • ఆ తదుపరి నమ్పిళ్ళైల ప్రవచనములు చాలా ప్రసిద్దిగాంచెను,అప్పుడు ప్రతీ ఒక్కరు ఇది నమ్పెరుమాళ్ గోష్టియా లేక నమ్పిళ్ళై గోష్టియా అని అడిగేవారు.వారు తన ప్రవచనములతో ప్రజలను ఎలాగైతే నమ్పెరుమాళ్ ప్రజలను తమ పురప్పాడుకు ఆకర్షించేవారో ఆవిదముగా తన ప్రవచనములతో ఆకర్షించేవారు]
 • నమ్పిళ్ళైల వినయము పోల్చలేనిది. వారు శ్రీవైష్ణవత్వమునకు ఉదాహరణముగా జీవించిరి,వారు ఆ గుణములను నంజీయరుల వద్ద నేర్చుకొనిరి. ఒకసారి నమ్పెరుమాళ్ళ ఎదుట, కన్దాడై తోజప్పర్ (ముదలియాణ్డాన్ పరంపరనుండి వచ్చిన వారు) నమ్పిళ్ళై యొక్క కీర్తి ని ఓర్వలేక నమ్పెరుమాళ్ళ ఎదుట,కొన్ని పరుషమైన వాక్యములు పలుకుదురు ,నమ్పిళ్ళై ఆ అవమానమును అంగీకరించి ఒక్క మాటను మాట్లడక గుడిని వదిలి తన తిరుమాళిగైకు వెళ్ళిరి. అప్పుడు తోజప్పర్ వారి తిరుమాళిగకు వెళ్ళిరి, వారి ధర్మ పత్ని ఆ వార్తలను వేరే వారి ద్వారా తెలుసుకొని వారిని గట్టిగా మందలించి నమ్పిళ్ళైల కీర్తి గురించి చెప్పెను. ఆమె వారిని నమ్పిళ్ళై ల దగ్గరికి తప్పకుండా వెళ్ళి వారి పాదముల వద్ద క్షమాపణను కోరమని అడిగెను.చాలా రాత్రి గడిచిన తరువాత చివరకు అతను తన తప్పుని గ్రహించి , నమ్పిళ్ళైల తిరుమాళిగైకు వెళ్ళుదామని నిర్ణయించుకొనెను. అప్పుడు వారు ద్వారం ను తీసి చూస్తే అక్కడ ఒక వ్యక్తి వేచి ఉండడం గమనిస్తారు . పరిశీలించి చూడగా వారు నమ్పిళ్ళై,నమ్పిళ్ళై తోజప్పర్ లను చూసి,వెంటనే క్రిందపడి ప్రణామమును సమర్పించి,మేము మీ యెడల తప్పు చేయడము కారణముగా మీరు బాధపడినట్టున్నారు అని చెప్పెను . తోజప్పర్ నమ్పిళ్ళైల గొప్పతనమును చూసి భీతీల్లినవాడై – తోజప్పర్ తప్పుచేసినప్పడికినీ, నమ్పిళ్ళై ఆ తప్పును తనపై వేసుకొనే పెద్దమనసు ఉన్నవాడై క్షమాపణ చెప్పెను.తోజప్పర్ వెంటనే నమ్పిళ్ళైలకి ప్రణామములు సమర్పించి ఈ విదముగా చెప్పెను, నమ్పిళ్ళై ఈ క్షణమునుండి“లోకాచార్యర్” గా పిలవబడును కారణము – గొప్పవారైనాను వినయముగా ఉండంటం కేవలం కొద్ది మంది కి మాత్రమే సాధ్యమగును , వారిని లోకాచార్యులుగా సంభోధన చేయుదురు . నమ్పిళ్ళై ని ఈ విధముగు పిలువుటకు తగిన వారు.తోజప్పర్ నమ్పిళ్ళైపైన ఉన్న ద్వేషమును వదిలి అతని భార్యతో కూడి నమ్పిళ్ళైకి సేవలు చేయసాగిరి అలానే శాస్త్రమ్ యొక్క రహస్యములను వారి వద్ద నుండి నేర్చుకొనిరి. మామామునిగళ్ తన ఉపదేశ రత్తిన మాలైలో ఈ సన్నివేషమును ఉదహరించిరి అలానే తోజప్పర్ మరియు నమ్పిళ్ళైల ఇరువురి కీర్తిని వర్ణించిరి. దానినుండే మనము నమ్పిళ్ళై ల పవిత్రతను అర్థము చేసుకోవచ్చు. అలానే తోజప్పర్ నమ్పిళ్ళైల సహవాసముతో ఏ విధముగా పవిత్రము చెందిరో ఈ సంఘటన తదుపరి మనము అర్థము చేసుకోవచ్చును.
 • నడువిల్ తిరువీది పిళ్ళై భట్టర్ భట్టరుల తిరువంశముల నుండి వచ్చెను, వారు నమ్పిళ్ళైల కీర్తిని చూసి,నమ్పిళ్ళై పైన కొంత ద్వేషమును పెంచుకొనెను. ఒకసారి వారు రాజుగారి న్యాయస్తానమునునకు పోవుచు, పిన్భజగియ పెరుమాళ్ జీయరులను తమవెంట రమ్మని పిలిచెను. ఆ రాజు వారిరువురిని ఆహ్వానించి, సంభావనను ఇచ్చి ఉచితాసనములను సమర్పించెను.ఆ రాజు భట్టర్ వారిని శ్రీ రామాయణము నుండి ఒక ప్రశ్నను అడిగిరి.రామావతారములో పెరుమాళ్ పరత్వమును చూపను అనెను కదా,మరి ఎలా జటాయునకు “గచ్చ లోకాన్ ఉత్తమాన్” (పెద్దైన ప్రపంచమునకు వెళ్ళుము – పరమపదము)?అని చెప్పిరి,అప్పుడు భట్టర్ సరియగు సమాదానము తెలియక తన యొక్క యశస్సును గురించి కలతచెందుచుండగా,రాజు ఇతర విషములందు ధ్యాస మరిలెను . భట్టర్ జీయరులను నమ్పిళ్ళై ఏ విధముగా చెప్పును అని అడుగగా జీయర్ వేంటనే వారైతే ఈ విధముగా వివరించుదురు “సత్యేన లోకాన్ జయతి” (ఒక సత్యమైన వ్యక్తి ప్రపంచమును జయించును). భట్టర్ ఆ శ్లోకముపై దృష్టి ఉంచి అర్ధమును గ్రహించి రాజుకు ఈ విధముగా చెప్పెను,రామన్ చాలా సత్యవ్రతుడు అయినందున అతను తన యోగ్యతచే సులభముగా ఎవరినైనా ఎక్కడికైనా పంపవచ్చును. రాజు అది విని చాలా సంతోషము చెంది,భట్టరుల  ఙ్ఞానమును పొగిడి వారికి చాలా ధనమును సమర్పించెను. భట్టర్ వెంటనే నమ్పిళ్ళై వివరణ శక్తిని గ్రహించినవాడై, వారి వద్దకు వెళ్ళి మొత్తము ధనమును వారికి సమర్పించి వారి శిశ్యులైరి,అ తరువాత నమ్పిళ్ళైల సేవలో ఎప్పడికిఉండిపోయెను.

చాలా సంఘటనలు నమ్పిళ్ళైల జీవితములో తమ శిశ్యులకు విలువగు పాఠములు మరియు ఉపదేశములను నేర్పిరి. కొన్ని ఇక్కడ చూద్దాము:

 • ఒకసారి నమ్పిళ్ళై తమ శిశ్యులతో కూడి తిరువెళ్ళరై నుండి పడవలో తిరిగి వస్తుండగా, కావేరి నదికి వరదరాగా ,పడవ నడిపే వ్యక్తి గోష్టిని ఉద్దేశించి పడవ నదిలో నిలుచుటకు మరియు నమ్పిళ్ళైను కాపాడుకొనుటకు ఎవరైనా ఒకరు పడవనుండి దూకమని చెప్పెను.అదివిని ఒక వృద్ద స్త్రీ వరదలోకి దూకినది,అదిచూసి నమ్పిళ్ళై చాలా బాధ పడిరి. కాని ఒడ్డుకు చేరగానే ఆ వృద్ద స్త్రీ గొంతు పక్కనే గల దీవిలో వినబడి ఈ విధముగా చెప్పెను,నమ్పిళ్ళై తన ఎదురుగా కనబడి తనని రక్షించెనని చెప్పెను.ఆ వృద్ద స్త్రీ తన జీవితమును పణముగా పెట్టి ఏ విదముగా ఆచార్యులకు సేవ చేయవచ్చునో చూపించి, మరియు నమ్పిళ్ళై- ఆచార్యులు ఆపద సమయములో తన శిశ్యులను ఎలా కాపాడుతారో చూపించిరి.
 • ఒక శ్రీ వైష్ణవ స్త్రీ నమ్పిళ్ళై తిరుమాలిగై పక్కనే ఉండేది, ఆమె దగ్గరికి ఒక శ్రీ వైష్ణవుడు వెళ్ళి ఈ విధముగ అడిగెను ఆమె గృహము నమ్పిళ్ళైల తిరుమాళిగై కుడి పక్కనే ఉన్నమూలముగా,మీరు మీ తిరుమాళిగను నమ్పిళ్ళై వారికి ఇస్తే నమ్పిళ్ళైల తిరుమాళిగను పెద్దగా చేసే అవకాశము ఉండును మరియు శ్రీ వైష్ణవ గోష్టికి ఉపయోగముగ ఉండును. మొదట సంకోచించి తదుపరి నమ్పిళ్ళై వద్దకు వెళ్ళి తనకు పరమపదములో చోటు ఇస్తే తన గృహమును ఇస్తానని చెప్పెను. నమ్పిళ్ళై సంతోషముతో ఒక గుర్తును తను వ్రాసిఇచ్చెను, ఆమె కొన్ని దినముల తదుపరి తన చరమ శరీరమును వదిలి పరమపదమునకు చేరెను.
 • నమ్పిళ్ళై ఇద్దరు భార్యలను కలిగిఉండెను.ఒకసారి వారు తన మొదటి భార్యని నా గురించి నీ ఆలోచన ఏమిటి అని అడిగిరి.ఆమె ఈ విదముగా జవాబు చెప్పెను, మీరు ఎమ్పెరుమానుల అవతారము మరియు నాకు ఆచార్యులుగా భావించెదను . నమ్పిళ్ళై చాలా సంతోషముచెంది తమ కొరకు వచ్చే శ్రీ వైష్ణవుల కొరకై తదియారాదన కైంకర్యములో పాల్గొనమని చెప్పిరి. వారు తమ రెండవ భార్యను అదే విదముగా అడుగగా, ఆమె నమ్పిళ్ళైలను తమ భర్తగా భావించెదను అని చెప్పెను. నమ్పిళ్ళై ఆమెను మొదటి భార్యకు సహాయముగా ఉండమని మరియు శ్రీవైష్ణవుల ప్రసాదమును స్వీకరించమని చెప్పిరి.వారు ఈ విదముగా అనిరి,శ్రీవైష్ణవుల శేషము వలన తను పవిత్రమై,నిష్ట పెరగడము వలన ఆధ్యాత్మికముగా(ఆచార్య-శిశ్యురాలు) పరిణితిచెంది శరీర సంభందమైన భావనను(భర్త-భార్య) మరచిపోవును.
 • అప్పుడు మహాభాశ్య భట్టర్ నమ్పిళ్ళైలను ఒక శ్రీవైష్ణవుడు తన యొక్క చైతన్యమునును(ఙ్ఞానము) గ్రహించిన తదుపరి ఏ విదముగా ఉండును అని అడిగిరి. నమ్పిళ్ళై ఈ విధముగా సమాధానమును చెప్పిరి,ఆ శ్రీ వైష్ణవుడు ఎమ్పెరుమానులే ఉపాయము మరియు ఉపేయము అని తలుచును,సంసారము అనే అనాధియైన వ్యాది నుండి కాపాడినందుకు ఆచార్యులకు క్రృతఙ్ఞుడై ఉండును,తప్పక శ్రీ భాష్యం ద్వారా నిరుపించబడ్డ ఎమ్పెరుమానారుల సిద్ధా౦తము సత్యము అని నమ్మినవాడై ఉండును , తప్పక భగవద్ గుణానుసంధానమ్ శ్రీ రామాయణము తో నిత్యము భగవద్ గుణానుసంధానమ్ చేయు ఉండును మరియు వారి సమయమును ఆళ్వారుల అరుళిచెయల్ నందు పూర్తిగా వినియోగించుతూ ఉండును .చివరగా తప్పక ఈ జీవితము తదుపరి  పరమపదమును చూస్తామని నమ్మకమును  కలిగి ఉండును.
 • కొందరు శ్రీవైష్ణవులు  పాండ్య నాడు నుండి నమ్పిళ్ళైల దగ్గరకు వచ్చి మన సంప్రదాయము యొక్క సారమును తెలుపమని అడిగిరి. నమ్పిళ్ళై వారిని సముద్రము రేవును గురించి అలోచించమనిరి.అప్పుడు వారు దిగ్బ్రమచెంది ఎందుకు సముద్రపు రేవు గురించి ఆలోచించడము అని అడుగగా, నమ్పిళ్ళై ఈ విధముగా వివరించిరి అప్పుడు చక్రవర్తి తిరుమగన్ రావణునితో యుద్దమునకు ముందు సముద్రపు ఒడ్డున నివసించే సమయములో,వారు తమ గుడారములో విశ్రమించే సమయములో వానరములు వారి రక్షణ కొరకై చుట్టుపక్కన కాపలాగా ఉండేవి.కాని శ్రమవలన వానరములు పడుకొనినప్పుడు, ఎమ్పెరుమాన్ స్వయముగా తానే అక్కడ పరిసరములు తిరుగుతూ వారికి రక్షణగా ఉండెను.. నమ్పిళ్ళై ఈ విధముగా వివరించెను ఎమ్పెరుమాన్ మనము పడుకొనినను తానే రక్షించును మేలుకతో ఉన్నప్పడికినీ తానే రక్షించును అందువలన మనము వారి యందు పూర్తి విశ్వాసమును ఉంచవలెను, ఈ విధముగా స్వ రక్షనే స్వ అన్వయమ్  అనగా మనలని మనమే రక్షించుకోగలం అనే భావనను త్యజించ వలెను .
 • దేవతాంతర భజనముల గురించి నమ్పిళ్ళై గొప్ప వివరణమును ఇక్కడ మనము చుద్దాము .ఒక వ్యక్తి నమ్పిళ్ళై వద్దకు వచ్చి అడిగిరి“మీరు  దేవతాన్తరములను  ( ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, సూర్య,మొద,,) మీ నిత్య కర్మలందు ఎందుకు ఆరాధించుదురు,కాని గుడిలో ఎందుకు ఆరాధించరు?”. నమ్పిళ్ళై చాలా తెలివిగా సమాధానమును చెప్పిరి “మీరి అగ్నిని యాగములో ఎందుకు ఆరాధించుదురు మరియు స్మశానములో ఉండే అగ్నికి దూరముగా  ఎందుకు ఉందురు ? అదేవిధముగా, శాస్త్రము లో విధించిన నిత్య కర్మములను భగవద్ ఆరాధనముగా తప్పక చేయవలెను ఎందుకంటే ఎమ్పెరుమానులు దేవతలకు అన్తర్యామిగా ఉండి వాటిని గ్రహించుదురు ,అందువలన మేము చేస్తాము. అదే శాస్త్రమ్ ఈ విధముగా చెప్పినది,మనము ఎమ్పెరుమానులను తప్ప వేరెవరిని ఆరాధించకూడదని,అందువలన వేరే ఆలయములకు వెళ్ళము.అదేవిధముగా,ఆ దేవతాలను ఆలయములలో ప్రతిష్టించడము వలన, వారి యొక్క రజో గుణము పెరిగి మరియు వారికి వారే పరత్వులు అని ఆలోచించుదురు, మేము (శ్రీవైష్ణవులు) సత్వ గుణము కలిగి ఉండడము వలన రజో గుణములు కలిగిన దేవతలను ఆరాధించము”. దేవతాంతర భజనము మనము వదులుకొనుటకి ఈ సమాధానము చాలు కదా?.
 • ఒక శ్రీవైష్ణవుడు నమ్పిళ్ళైల దగ్గరకు వచ్చి ఈ విధముగా చెప్పెను, నేను ఇంతకు ముందుకన్నా చిక్కిపోయాను అనిరి. నమ్పిళ్ళై సమాధానము: ఆత్మ పెరిగినప్పుడు శరీరము దానికదే చిక్కిపోవును
 • అప్పుడు మరియొక శ్రీవైష్ణవుడు నమ్పిళ్ళైలను అడిగిరి,ఎందుకు మేము బలముగా లేము, నమ్పిళ్ళై సమాధానము: ఎమ్పెరుమానులను ఆరాధించే బలము మీకు ఉంది ఇంకా బలముగా ఉండుటకు మీరు యుద్దమునకు పోవుటలేదు. శ్రీవైష్ణవుడు శారీరకముగా చాలా బలముగా ఉండవలెనని చింతిచ అవసరము లేదు అన్న సత్యమును ఇది తెలియచేయును.
 • అప్పుడు నమ్పిళ్ళై అనారోగ్యముతో ఉన్నప్పుడు, ఒక శ్రీవైష్ణవుడు చింతపడుచుండగా, నమ్పిళ్ళై చెప్పిరి, మనము ఏ బాధనైనను మంచిదే అని ఆలోచించవలే,కారణము శాస్త్రము చెప్పెను“ఎవరైతే ఎమ్పెరుమానులకు శరణాగతి చేయుదురో ,వారు మృత్యు దేవతను (చావు) సంతోషముగా వచ్చుటకు  ఆహ్వానించేదురు “.
 • ఒకానొక  సమయములో కొందరు శ్రీ వైష్ణవులు ఎన్గళ్ ఆళ్వాన్ ఆదేశము మేరకు మరియు నమ్పిళ్ళైల మీద ప్రేమచే అనారోగ్యమునుండి త్వరగా కోలుకొనుటకు ఒక రక్షను కట్టదలిచిరి, నమ్పిళ్ళై అంగీకరించకపోతే,శ్రీ వైష్ణవులు  “ఒక శ్రీవైష్ణవుడు తనగురించి వదిలి ఇతరుల అనారోగ్యమును గురించి ఆలోచించుతే తప్పేమి”అని అడిగిరి. నమ్పిళ్ళై ఈ విధముగా చెప్పిరి మనము మన అనారోగ్యమును మనమే నయము చేసుకొనిన, దాని అర్థము మన స్వరూపమును మనము సరిగా అర్థముచేసుకోకపొవడమే,మనము పూర్తిగా ఎమ్పెరుమానులపై ఆదారపడినాము అంతకుమించి వేరేలేదు.అలానే  మనము ఇతరుల అనారోగ్యమును బాగుచేయదలచిన మనము ఎమ్పెరుమానుల జ్ఞానము మరియు శక్తిని అర్థము చేసుకోకపొవడమే,మరలా మనము వారి భక్తులను కాపాడుటకు వారిపై ఆధారపడవలసినదే. అదీ నమ్పిళ్ళైల నిష్ట మరియు అలానే వారి జీవించిరి. ఇంకనూ మనము ఆళవందార్లను బాధపడినపుడూ మారనేరి నమ్బి ఏ విధముగ చేసిరో మనము గ్రహించవలెను ఇతర శ్రీవైష్ణవులు బాధను నయము చేయుటకి మనము ఆ విదముగా మన కర్తవ్యమును నిర్వహించవలెను.
 • నమ్పిళ్ళై ఆ కాలములో గొప్ప శిశ్యులుగా చాలా ఆచార్య పురుష కుటుంబాలనుండి వచ్చినవారిని కలిగిఉండేవారు, వారి సమయములో శ్రీరంగమ్ ప్రతీ ఒక్కరు నల్లడిక్కాలమ్ (మంచి కాలము) అని కీర్తించెడివారు. వారి శిశ్యులు నడువిల్ తిరువీది పిళ్ళై భట్టర్ (125000 పడి) మరియు వడక్కు తిరువీది పిళ్ళై (ఈడు 36000 పడి) వారిరువురు తిరువాయ్ మొజి నకు వ్యాఖ్యానమును వ్రాసిరి కాని నమ్పిళ్ళై పూర్వపు దానిని అంతంచేసిరి కారణము అది చాలా పెద్దది మరియు వివరమైనది, తదుపరి గ్రంథమును తీసుకొని ఈయుణ్ణి మాదవ పెరుమాళ్ళకి ఇచ్చిరి .కాలాంతరములో అజగియ మణవాళ మామునిగళ్ ద్వారా అందరికి ఉపదేశించబడుటకై . అలానే వారు పెరియవాచ్చాన్ పిళ్ళైలను తిరువాయ్ మొజినకు వ్యాఖ్యానమును వ్రాయమని ఆదేశించిరి మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై వారి ఆచార్యుల కోరికను 24000 పడి వ్యాఖ్యానమును వ్రాసిరి అది నమ్పిళ్ళైలచే పొగడబడినది.
 • అప్పుడు నమ్పిళ్ళై పెరియ కోయిల్ వళ్ళలార్ లను “కులమ్ తరుమ్” అర్థము ఏమి అని అడిగిరి, వళ్ళలార్ చెప్పెను “మా కులము జన్మ కులము నుండి నమ్బూర్ కులమునకు (నమ్పిళ్ళైల కులము) మారెను, దాని అర్థమే కులమ్ తరుమ్” – ఇది పెరియాళ్వారుల శ్రీసూక్తి పాణ్డ్య కులమ్ (జన్మతొ వచ్చిన కులము) నుండి తొండ కులము (ఆచార్య సంబందము మరియు కైంకర్యమ్ శ్రీ) మాదిరి ఉండెను. అదీ నమ్పిళ్ళైల గొప్పతనము.

ముగించుటునకు చివరగా, పెరియవాచ్చాన్ పిళ్ళై  నమ్పిళ్ళైల గురించి ఏజై ఏతలన్ పదిగములో, ఓతు వాఇమైయుమ్ పాశురము (పెరియ తిరుమొజి 5.8.7) ఏమి చెప్పారో చూద్దాము. “అన్తణన్ ఒరువన్” (అసమానమైన పండితుడు) పదమును వివరించునప్పుడు, పెరియవాచాన్ తమ ఆచార్యుల కీర్తీని చెప్పుటకు [added – ఈ ] అవకాశము ఉపయోగించుకొని తమ ఆచార్యులు అసమాన పండితుడు అనుటకు ఈ పదములను వాడిరి~: “ముఱ్పడ ద్వయత్తైక్ కేట్టు, ఇతిహాస పురాన్ణన్ఙ్గళైయుమ్ అతిగరిత్తు, పరపక్శ ప్రత్క్శేపత్తుక్కుడలాగ ణ్యాయమీమామ్సైకళుమ్ అతిగరిత్తు, పోతుపోక్కుమ్ అరుళిచెయలిలేయామ్పడి పిళ్ళైయైప్పోలే అతిగరిప్పిక్క వల్లవనైయిరే ఒరువన్ ఎన్బతు” (முற்பட த்வயத்தைக் கேட்டு, இதிஹாஸ புராணங்களையும் அதிகரித்து, பரபக்ஷ ப்ரத்க்ஷேபத்துக்குடலாக ந்யாயமீமாம்ஸைகளும் அதிகரித்து, போதுபோக்கும் அருளிசெயலிலேயாம்படி பிள்ளையைப்போலே அதிகரிப்பிக்க வல்லவனையிரே ஒருவன் என்பது). సాదారణ అనువాదము~: ఎవరు ద్వయమును మొదలు విందురో,అప్పుడు పురాణములు మరియు ఇతిహాసములను నేర్చుకొనుదురు, న్యాయము మరియు మీమాంశలను నేర్చుకొని బాహ్య/కుద్రిశులను ఓడించుదురు మరియు వారి సమయము మొత్తము ఆళ్వారుల అరుళిచెయల్ మరియు అర్థములను నేర్చుకొని ఇతరులకు నేర్పుదురు నమ్పిళ్ళైలాగా అందువలన వారిని అసమాన పండితుడు అని చెప్పబడెను. ఇక్కడ పెరియవాచ్చాన్ పిళ్ళై సాంధీపని మునిని నమ్పిళ్ళై తో పోల్చిరి(నమ్పిళ్ళై సాంధీపని ముని కన్నా చాలా గొప్పవారు నమ్పిళ్ళై భగవత్ విషయమునందు పూర్తిగా మునిగిరి కాని సాంధీపని ముని కణ్ణన్ ఎమ్పెరుమానులు ముకుందుడు అని తెలిసి కూడా(వారే మోక్షమును ఇచ్చునని తెలిసి కూడా) తన చనిపోయిన కుమారుడికి ప్రాణం పోయమని కోరెను ).

తమిళ మరియు సంస్కృతముల సాహిత్యములో లోతైనా ఙ్ఞానము కలిగిఉండే కారణముచే వారి ప్రవచనములను వినుటకు వచ్చే శ్రోతలను మంత్రముగ్దులను చేసేవారు. వీరు చెప్పే అరుళిచెయల్ అర్థములు అందరికి అర్థము అయ్యే కారణముచేత తిరువాయ్ మొజి ఎంతో ఎత్తునకు విస్తరించెను . తిరువాయ్ మొజికి, 6000 పడి వ్యాఖ్యానము తప్ప, మిగిలినమిగిలిన 4 వ్యాఖ్యానములకు నమ్పిళ్ళై సంబంధము ఉంది

 • 9000 పడి అసలు పత్రి [ప్రతి]నంజీయరు వ్రాసిననూ,తిరిగి నమ్పిళ్ళైలచే కొంచెము ముఖ్యమైన అర్థములను వ్రాయబడెను.
 • 24000 పడిని పెరియవాచాన్ పిళ్ళై నమ్పిళ్ళైల ఉపదేశములను మరియు ఆఙ్ఞలచే వ్రాసెను.
 • 36000 పడిని వడక్కు తిరువీది పిళ్ళై నమ్పిళ్ళైల ప్రవచనములచే వ్రాసెను.
 • 12000 పడిని పెరియవాచాన్ పిళ్ళైల శిశ్యుడు వాది కేసరి అజగియ మణవాళ జీయర్ వ్రాసిరి వాటి అర్థములను చూసినట్టయితే మనము సులభముగా అర్థము చేసుకోగలము అది నమ్పిళ్ళైల 36000 పడికి దగ్గరగా ఉండును.

ఇది ఒకటే కాక, నమ్పిళ్ళై అపరిమితమైన కరుణచే,మన సంప్రదాయమునకు రెండు కీర్తిగల స్తంభములను నాటిరి – వారే పిళ్ళై లోకాచార్యర్ మరియు అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు, వారు శ్రీవచన భూషణము మరియు ఆచార్య హ్రుదయమును మన పూర్వాచార్యులచే పొందిన ఙ్ఞానముచే వ్రాసిరి .మనము వారి చరిత్రమును తదుపరి సంచికలో చూద్దాము (వడక్కు తిరువీది పిళ్ళై వైభవము).

nampillai-pinbhazakiya-perumal-jeer-srirangam

నమ్పిళ్ళై తిరువడిలో పిన్భజగరామ్ పెరుమాళ్ జీయర్, శ్రీరంగమ్

నమ్పిళ్ళై తమ చరమ తిరుమేనిని శ్రీరంగములో వదిలి పరమపదమును చేరిరి. నడువిల్ తిరువీది పిళ్ళై భట్టర్ తమ శిరోజములను ఆ సందర్భముగా తీసివేసెను(శిశ్యులు మరియు కుమారులు తండ్రి/ఆచార్యులు పరమపదమునకు చేరినపుడు ఈ విధముగ చేయుదురు) వారి సోదరులు నమ్పెరుమాళ్ కి ఈ విషయం గురించి చెబుతారు . ఆ విధంగా ప్రవర్తించుటకు కారణమేమి అని  ప్రశ్నించగా భట్టర్ తాను కూర కులం లో జన్మించుకంటెను నమ్పిళ్ళై తో తన కున్న అనుబంధమునుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వుదురని చెప్తారు.ఇది విని నమ్పెరుమాళ్ చాలా సంతోషము చెందిరి. 

ఎమ్పెరుమానులతో మరియు ఆచార్యులతో మనకు ఆ విధమైన సంబందము ఏర్పడాలని నమ్పిళ్ళై ల శ్రీ చరణములను ప్రార్థిస్తాము.

నమ్పిళ్ళైల తనియన్:

వేదాన్త వేద్య అమ్రుత వారివారిరాశే
వేదార్త సార అమ్రుత పూరమగ్ర్యమ్
ఆదాయ వర్శన్తమ్ అహమ్ ప్రపద్యే
కారుణ్య పూర్ణమ్ కలివైరిదాసమ్

வேதாந்த வேத்ய அம்ருத வாரிராஸேர்
வேதார்த்த ஸார அம்ருத பூரமக்ர்யம்
ஆதாய வர்ஷந்தம் அஹம் ப்ரபத்யே
காருண்ய பூர்ணம் கலிவைரிதாஸம்

మన తదుపరి సంచికలో వడక్కు తిరువీది పిళ్ళై వైభవమును చూద్దాము.

అడియేన్ :

రఘు వంశీ రామానుజదాసన్.

source:

అజగియ మణవాళ మామునిగళ్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలొ  మనము  తిరువాయ్ మొజి ప్పిళ్ళై గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.  

తిరునక్షత్రము: ఆశ్వయిజ మాసము, మూలా నక్షత్రము

అవతార స్థలము:  ఆళ్వార్ తిరునగరి

ఆచార్యులు : తిరువాయ్ మొజి ప్పిళ్ళై

శిష్యులు: అష్ట దిక్ గజన్గళ్ – పొన్నడిక్కాల్ జీయర్, కోయిల్ అణ్ణన్, పతంగి పరవస్తు పట్టర్పిరాన్ జీయర్, తిరువేంకట జీయర్, ఎఱుమ్బిఅప్పా, ప్రతివాది భయంకరమ్ అణ్ణన్, అప్పిళ్ళై, అప్పిళ్ళార్. నవ రత్నన్గళ్ – సేనై ముదలిఆణ్డాన్ నాయనార్, శఠగోప దాసర్ (నాలూర్ సిట్రాత్తాన్), కందాడై పోరేరేరు నాయన్, యేట్టూర్ సింగరాచార్యర్, కందాడై అణ్ణప్పన్, కందాడై తిరుక్కోపురత్తు నాయనార్, కందాడై నారణప్పై, కందాడై తోళప్పరప్పై, కందాడై అళైత్తు వాళ్విత్త పెరుమాళ్. ఇతర తిరువంశములు, తిరుమాళిగలు మరియు దివ్య దేశముల నుండి చాలామంది శిశ్యులు.

పరమపదం చేరిన స్థలము: తిరువరంగము

శ్రీ సూక్తులు: శ్రీ దేవరాజ మంగళము, యతిరాజ వింశతి, ఉపదేశ రత్తిన మాలై, తిరువాయ్ మొజి నూఱ్ఱన్దాది, ఆర్తి ప్రబంధము. వ్యాఖ్యానములు ~: ముముక్షుపడి, తత్వ త్రయము, శ్రీవచన భూషణము, ఆచార్య హృదయము, పెరియాళ్వార్ తిరుమొజి (పెరియవాచాన్ పిళ్ళైల వ్యాఖ్యానము నుండి తప్పిన ఒక భాగము), రామానుజ నూఱ్ఱన్దాది. ప్రమాణ తిరట్టు (అన్ని శ్లోకములకు సంగ్రహముగా, శాస్త్ర వాఖ్యములకు ఒక ముఖ్యమైన గ్రంథము) ~: ఈడు 36000 పడి, ఙ్ఞాన సారము, ప్రమేయ సారము, తత్వ త్రయము, శ్రీవచన భూషణము.

అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఆళ్వార్ తిరునగరినందు తిగజ కిడన్తాన్ తిరునావీరుడయ పిరాన్ మరియు శ్రీ రంగ నాచ్చియారులకు ఆదిశేషుల అవతారముగా జన్మించిరి మరియు పునర్ అవతారము అనైత్తులగుమ్ వాజప్పిఱణ్త యతిరాజర్ (அனைத்துலகும் வாழப்பிறந்த யதிராஜர்) వీరికి గల తిరునామములు అజగియ మణవాళ మామునిగళ్,సుందర జామాత్రు ముని, రమ్య జామాత్రు ముని, రమ్య జామాత్రు యోగి, వరవరముని, యతీన్ద్ర ప్రవణర్, కాంతోపయంత్రులు, రామానుజన్ పొన్నడి, సౌమ్య జామాత్రు యోగీన్ద్రర్, కోయిల్ శెల్వ మణవాళ మామునిగళ్, మొదలైనవి.వీరికి గల బిరుదులు పెరియ జీయర్, వెళ్ళై జీయర్, విషద వాక్ శిఖామణి, పొయిల్లాద మణవాళ మాముని, మొద,,.

జీవిత చరిత్ర సంగ్రహముగా:

 • పెరియ పెరుమాళ్ళ అనుగ్రహము వలన ఆదిశేషుల అంశావతారముగా ఆళ్వార్ తిరునగరిలో జన్మించిరి.

మామునిగళ్ -ఆళ్వార్ తిరునగరి, తిరువడియందు అష్ట దిక్ గజన్గళ్

 • వీరు అమ్మమ్మ గారి ఊరైన సిక్కిల్ కిడారములో తమ తండ్రిగారి వద్ద సామాన్య శాస్త్రము మరియు వేద అధ్యాయనమును పూర్తిచేసిరి.చదువుతున్న కాలములోనే వీరి వివాహము కూడా అయినది.
 • తిరువాయ్ మొజి పిళ్ళైల వైభవమును విన్నవారై,ఆళ్వార్ తిరునగరికి తిరిగి వచ్చి వారిని ఆశ్రయించిరి. మనము గత సంచికలో చూసి ఉన్నాము.
 • వారి ధర్మపత్ని ఒక బాలునికి జన్మనివ్వగా వారు తిరువాయ్ మొజి పిళ్ళైని సరియగు నామమును సూచించమని అభ్యర్తించిరి. తిరువాయ్ మొజి పిళ్ళై ఈ విధముగా చెప్పిరి, రామానుజన్ 108 మార్లు చెప్పడము వలన( రామానుజ నూఱ్ఱన్దాదిలో), ఆ పేరు చాలా ఉత్తమమైనది,దానిని ఆధారముగా చేసుకొని వారి కుమారులకు“ఎమ్మైయన్ ఇరామానుజన్” అనే నామమును పెట్టిరి.
 • తిరువాయ్ మొజి పిళ్ళై పరమపదమును చేరిన తదుపరి, వీరు దరిశన ప్రవర్తకరులుగా ఉండిరి.
 • వీరు అరుళిచెయల్ నందు ప్రావీణ్యులు,ముఖ్యముగా తిరువాయ్ మొళి మరియు ఈడు 36000 పడి వ్యాఖ్యానములందు. ఈడు వ్యాఖ్యానమునకు ఆధారముగా ఉండే అన్ని ప్రమాణములను సేకరించి గ్రంథికరించిరి .
 • వీరి కీర్తిని గురించి విని, అజగియ మణవాళ పెరుమాళ్ నాయనారులకు అజగియ వరదర్ (వానమామలై నుండి) మొదటి శిష్యులుగా మారిరి మరియు తమ ఆచార్యులకు నిరంతరమైన సేవనుచేయుటకు వెంటనే సన్న్యాసాశ్రమమును స్వీకరించిరి.వానమామలై జీయర్ (స్వస్థలము కావడముచే) మరియు పొన్నడిక్కాల్ జీయర్ (కారణము నాయనారులకు మొదటి శిశ్యులు మరియు ఎంతో మంది ఈ దారిలో నడుచుటకు పునాది వేసిరి – పొన్ అడిక్కాల్ అనగా బంగారు పునాది)అని ప్రసిద్ధికి ఎక్కిరి.
 • ఆచార్యుల నియమనమును గుర్తుచేసుకొని మన సంప్రదాయమును విస్తరించుటకు శ్రీరంగమునకు వెళ్ళుటకు, వారు ఆళ్వారుల వద్దకు వెళ్ళి వారి అనుఙ్ఞను తీసుకొని శ్రీరంగమునకు బయలుదేరిరి.
 • శ్రీరంగమునకు వెళ్ళే దారిలో,శ్రీవిల్లిపుత్తూర్ ఆణ్డాళ్ రంగమన్నారులకు మరియు తిరుమాలిరున్చోలై అజగరులకు మంగళాశాసనమును చేసిరి.
 • శ్రీరంగమునకు చేరిన పిదప, కావేరి ఒడ్డున నిత్యకర్మానుష్టానములను పూర్తిచేసుకొనిరి. శ్రీరంగములోని శ్రీవైష్ణవులందరూ బయటకి వచ్చి వారికి స్వాగతమును పలికిరి,స్థానిక శ్రీవైష్ణవుల పురుషకారముచే  ఎమ్పెరుమానారులకు, నమ్మాళ్వార్, పెరియ పిరాట్టియార్, సేనై ముదలియార్, పెరియ పెరుమాళ్ మరియు నమ్పెరుమాళ్ళకు ఉభయ నాచ్చియారులకు వరుసగా మంగళాశాసనమును చేసిరి.  పెరుమాళ్ ఎమ్పెరుమానారులకు స్వాగతమును పలికిన విధముగా వీరికి పలికి ప్రత్యేక ప్రసాదములను మరియు శ్రీ శఠగోపమును ఇచ్చిరి.
 • తదుపరి పిళ్ళై లోకాచార్యుల తిరుమాళిగైకి వెళ్ళి,  పిళ్ళై లోకాచార్యర్ మరియు వారి సహోదరుడైన అజగియ మణవాళ పెరుమాళ్ నాయనారులను మన సంప్రదాయమునకు చేసిన కైంకర్యములను కీర్తించిరి.
 • వారు కొంతకాలము శ్రీరంగములో నివసించిన తదుపరి ఒకరోజు నమ్పెరుమాళ్ వారిని శ్రీరంగములో నిత్యవాసమును (శాశ్వతముగా) చేయమని మరియు మన సంప్రదాయములోని లోతైన అర్థములను ఉపదేశించమనిరి.దానికి వారు సంతోషముతో అంగీకరించి మహమ్మదీయుల దండయాత్ర తదుపరి మనము కోల్పోయిన గ్రంథములను తిరిగి సేకరించసాగిరి.
 • ఒకసారి పొన్నడిక్కాల్ జీయర్ ఉత్తమ నంబి సేవను గూర్చి వారికి ఫిర్యాదు చేయగా,వారు ఎమ్పెరుమానుల కైంకర్యమును సరిగా చేయు విధముగా సంస్కరించమని జీయరులను ఆఙ్ఞాపించిరి.
 • అప్పుడు వారు తిరువేంగడమును దర్శించాలనే కోరికతో పొన్నడిక్కాల్ జీయర్తో కూడి బయలుదేరిరి. దారిలో, తిరుక్కోవలూర్ మరియు తిరుక్కడిగై దివ్య దేశములను మంగళాశాసనము చేసిరి.
 • తిరుమలైలో, పెరియ కేళ్వి అప్పన్ జీయర్ (ఎమ్పెరుమానారులచే నియమింపబడినవారు)  స్వప్నములో ఈ విధముగా చూసిరి,ఒక శ్రీవైష్ణవడిని (గ్రుహస్తులు) పెరియ పెరుమాళ్ళవలె  పడుకొని ఉండగా వారి యొక్క శ్రీ చరణముల వద్ద ఒక సన్యాసి నిలబడి ఉండిరి.ఆ స్వప్నములోనే వారు అక్కడ నుండి వెళ్ళే వారిని వారు ఎవరు అని అడుగగా, వారు ఈ విధముగా చెప్పెను “తిరువాయ్ మొజి ఈట్టు పెరుక్కర్ అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ మరియు వారియొక్క ప్రాణ సుక్రుత్ (జీవితము యొక్క శ్వాస) మరియు శిష్యులైన పొన్నడిక్కాల్ జీయర్”. మెళుకువ రాగా మంచి శకునముతో వచ్చిన స్వప్నమును గురించి ఆలోచించగా  వారిరువురు త్వరలో తిరుమలై వస్తున్నారని తెలుసుకొనిరి. నాయనార్ తిరుపతికి చేరి,తిరువేంకట మలై, గోవిందరాజర్, నరసింహర్ (కొండ క్రింద)లను ఆరాధించి చివరగా తిరుమలైకి చేరిరి. పెరియ కేల్వి అప్పన్ జీయర్ నాయనార్ మరియు పొన్నడిక్కాల్ జీయరులకు ఘనముగా స్వాగతము పలికి వారిని తిరువేన్కటముడైయానుల వద్దకు మంగళాశాసనము కొరకై తీసుకువెళ్ళిరి. తిరువేన్కటముడైయాన్ వారిద్దరిని చూసి సంతోషముతో,తనయొక్క ప్రసాదమును మరియు శ్రీ శఠగోపమును ఇచ్చిరి.పెరుమాళ్ళ వద్దనుండి వారు శలవు తీసుకొనిరి.
 • వారు కాంచీపురమునకు చేరి దేవ పెరుమాళ్ళకు మంగళాశాసనమును చేసిరి.దేవ పెరుమాళ్ ఎమ్పెరుమానారులవలే వీరు కూడా అని చెప్పి వారియొక్క ప్రసాదమును మరియు శ్రీ శఠగోపమును ఇచ్చిరి.

మామునిగళ్ – కాంచీపురము

 • వారు శ్రీపెరుమ్పూదూరును చేరి పూర్తీగా ఎమ్పెరుమానారుల అనుభవములో మునిగి మంగళాశాసనమును చేసిరి.
 • వారు కాంచీపురమునకు తిరిగి వచ్చి శ్రీ భాష్యమును కిడామ్బి నాయనార్ (కిడామ్బి ఆచాన్ వంశస్తులు)వద్ద సేవించసాగిరి. అప్పుడు శ్రీవైష్ణవులు కొన్ని విషయములలో తర్కము చేయుటకు వచ్చిరి, వారు మొదట వారియొక్క ఆచార్యులు భగవత్ విషయములలోనే ఈడుబడమని ఆదేశించటము చేత నిరాకరించిరి,కాని వారి అనుచరులు నచ్చచెప్పడముతో,వాటికి సరియైన వివరణములతో సమాధానములు ఇవ్వగా వాదమునకు వచ్చిన వారు వారి యొక్క శ్రీ చరణములని ఆశ్రయించి వారిని కొనియాడిరి .
 • కిడామ్బి నాయనార్ అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఙ్ఞానమును చూసి ఆశ్చర్యపడి వారి యొక్క నిజ స్వరూపమును చూపమని అభ్యర్తించిరి. అప్పడికి కిడామ్బి నాయనార్ శ్రీ భాష్యమును ఉపదేశించడమువలన వారు ఆచార్య స్థానములో ఉండడమువలన, అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తమ యొక్క ఆదిశేష స్వరూపమును చూపించిరి. కిడామ్బి నాయనార్ ఆనందభరితులై అప్పడినుండి వారితో గొప్ప అనుబందమును కలిగి ఉండిరి. చివరకు శ్రీభాష్యము కాలక్షేపమును ముగించుకొని,శలవు తీసుకొని శ్రీరంగమునకు బయలుదేరిరి.
 • పెరియ పెరుమాళ్ వారు తిరిగి రావడము చూసి సంతోషపడిరి మరియు ఇంకా ఏ యాత్రలు చేయకుండా శ్రీరంగములోనే ఉండవలెనని చెప్పిరి.
 • ఆ సమయములో,వారి యొక్క బంధువులు ఆశౌచమును గురించి సమాచారమును తెలుపగా దానివలన తన యొక్క కైంకర్యమునకు ఆటంకముగా భావించి, సన్న్యాసాశ్రమమును శఠగోప జీయర్ (తిరువాయ్ మొజి పిళ్ళై శిష్యులు మరియు ఆళ్వార్ తిరునగరిలో సహాధ్యాయి) వద్ద స్వీకరించి వెంటనే పెరియ పెరుమాళ్ళ వద్దకి వెళ్ళి ఈ విషయము గురించిచెప్పగా,పెరియ పెరుమాళ్ ఆహ్వానించి అదే  తిరునామముతో (తన యొక్క భవిష్యద్ ఆచార్యుని పేరు తన యొక్క దివ్య నామము గా పెట్టుకోవలెనని తాను ఆశించినన్దులకు) ఉండమని ఆఙ్ఞాపించిరి. వారికి పల్లవ రాయన్ మఠమును ఇచ్చి అక్కడే ఉంటూ కాలక్షేపములను అనుగ్రహించవలెననిరి.అందువలన అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ అజగియ మణవాళ మామునిగళ్ గా మారిరి. ఉత్తమ నమ్బి శిష్యులుగా ఉన్న అందరూ శ్రీవైష్ణవులు నమ్బితో పాటు వారి మఠమునకు వెళ్ళి చాలా సంతోషముతో “మణవాళ మామునియే ఇన్నుమొరు నూత్తాన్డిరుమ్” అని పాడిరి.
 • వారు తన శిష్యులందరినీ పొన్నడిక్కాల్ జీయర్ల పర్యవేక్షణలో మఠమును పూర్తిగా బాగుచేయమని చెప్పిరి. పిళ్ళై లోకాచార్యుల తిరుమాళిగై నుండి తెచ్చిన ఇసుకతో ఒక అందమైన మండపమును నిర్మించి దానికి తిరుమలై ఆళ్వార్ అనే నామమును పెట్టి క్రమముగా అక్కడ కాలక్షేపములను అనుగ్రహించేవారు. వారు తమ శిష్యులకు మరియు అభిమానులకు రోజు తిరువాయ్ మొజి (ఈడు) మరియు ఇతర ప్రబంధములు, ఎమ్పెరుమానారుల కీర్తిని, శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రములపై ప్రవచనములు అనుగ్రహించేవారు.
 • వారి యొక్క కీర్తి అగ్ని శిఖలవలె అన్నిదిశలా వ్యాపించి ఎంతో మంది శ్రీవైష్ణవులు మామునిగళ్ని ఆశ్రయించిరి. తిర్మన్జనమ్ అప్పా (పెరియ పెరుమాళ్ళకి నిత్య కైంకర్యపరర్), వారి కుమార్తె(ఆయ్చియార్) మరియు పట్టర్ పిరాన్ జీయర్ వారికి శిష్యులుగా మారిరి.
 • సింగరైయర్ అనే ఒక స్వామి  వళ్ళువ రాజేన్ద్రమ్ (దగ్గర గ్రామము) నుండి రోజు కొన్ని కూరగాయలు మామునిగళ్ళ మఠమునకు పంపేవారు,ఎమ్పెరుమాన్ వారి కైంకర్యమును చూసి సంతోషముచెంది అతనికి స్వప్నములో కనబడి “మామునిగళ్ ఆదిశేషుల అవతారము,మీరు వెళ్ళి మామునిగళ్ని ఆశ్రయించండి” అని చెప్పిరి.అందువలన వారు శ్రీరంగమునకు వచ్చి (కోఇల్) కన్దాడై అణ్ణన్ తిరుమాళిగై వద్ద ఉండి ఆ సంఘటనను గురించి అణ్ణన్ తో చెప్పిరి. అణ్ణన్ దీనిని గురించి ఆలోచిస్తూ పడుకొనగ వారి కలలో ఎమ్పెరుమానార్ మరియు ముదలిఆణ్డానులను చూసిరి అక్కడ ఎమ్పెరుమానార్ ఈ విధముగా చెప్పెను మామునిగళ్ ఎవరో కాదు నేనే.ఆ స్వప్నములో, ముదలిఆణ్డాన్ కోఇల్ అణ్ణన్ ను(మరియు ఉత్తమ నమ్బి) మామునిగళ్ళను ఆశ్రయించమని ఆఙ్ఞాపించిరి. నిద్ర నుండి లేచిన తదుపరి , కోఇల్ అణ్ణన్ తన సహోదరులతో కూడి మామునిగళ్ మఠమునకు వెళ్ళి, పొన్నడిక్కాల్ జీయర్ పురుషకారముతో (సహాయముతో) వారే స్వయముగా మామునిగళ్ళ్కి అప్పగించెను. మామునిగళ్ సంతోషముతో అంగీకరించి వారికి పంచసంస్కారములను అనుగ్రహించెను.
 • అప్పుడు ఆయ్చియార్ (తిరుమన్జనమ్ అప్పా కుమార్తె) కొడుకు అప్పాచిఆరణ్ణ మామునిగళ్ళ్ని ఆశ్రయించకోరిరి. మామునిగళ్ అది విని చాలా సంతోషపడిరి,వారు తమయొక్క జీవితమునకు శ్వాసగా మరియు ఆప్తులుగా భావించే పొన్నడిక్కాల్ జీయర్ను పిలచి , తమ యొక్క సింహాసనమును సమర్పించి,తమ యొక్క తిరువాజి(శంఖము) మరియు తిరుచక్రమును ఇచ్చి వారిని పంచసంస్కారము చేయవలసినదిగా ఆదేశించిరి. అప్పుడు పొన్నడిక్కాల్ జీయర్ మొదట నిరాకరించినా,వేరే ప్రత్యాంన్యాయము లేకపోవుటచే వారియొక్క ఆచార్యుల తిరువుళ్ళము ప్రకారము అప్పాచిఆరణ్ణాలకు పంచ సంస్కారములను అనుగ్రహించిరి.
 • ఎమ్మైయన్ ఇరామానుజన్ (పూర్వాశ్రమములో మామునిగళ్ కుమారులు) ఆళ్వార్ తిరునగరిలో నివసించుచుండిరి, వివాహము చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిరి– అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ( మామునిగళ్ళకు గల సంబంధము మరియు అటుపిమ్మట చేసిన కైంకర్యమునకు గాను జీయర్ నాయనార్ అని పిలుచుదురు) మరియు పెరియాళ్వార్ ఐయన్.
 • మామునిగళ్  నమ్మాళ్వారులకు మంగళాశాసనము చేయుటకు వెళ్ళదలచి పెరియ పెరుమాళ్ళ అనుఙ్ఞ తీసుకొని బయలుదేరిరి. వారు ఆళ్వార్ తిరునగరి చేరిన పిదప, తామరభరణి నది ఒడ్డున వారియొక్క నిత్య కర్మానుష్టానములను పూర్తిచేసుకొని,భవిష్యదాచార్యన్ (ఎమ్పెరుమానార్), తిరువాయ్ మొజి పిళ్ళై మరియు వారియొక్క తిరువారాధన పెరుమాళ్ ఇనవాయర్ తలైవన్, నమ్మాళ్వార్ మరియు పొలిన్దు నిన్ఱ పిరాన్లకు మంగళాశాసనము చేసిరి.
 • వారికి ఆచార్య హృదయములోని ఒక చూర్ణికై గురించి సందేహము రాగా, తమ ఆచార్యులైన తిరువాయ్ మొజి పిళ్ళైల స-బ్రహ్మచారి (సహాధ్యాయి) అయిన తిరునారాయణపురతు ఆయి ని కలుసుకొనుటకు నిశ్చయించుకొనిరి. వారు ప్రయాణము మొదలు పెట్టి ఆళ్వార్ తిరునగరిని దాటి బయటకు వెళ్ళగా,అక్కడ ఆయి కూడా తిరునారాయణపురము నుండి బయలుదేరి మామునిగళ్ళను కలుసుకొనుటకు వచ్చిరి. ఇద్దరు సంతోషముతో ఆలింగనముచేసుకొని  ఒకరినొకరు స్తుతించుకొనిరి . ఆ సమయములో మామునిగళ్ ఆయి కీర్తీని గురించి ఒక తనియన్ వ్రాసిరి,బదులుగా ఆయి ఒక పాశురమును వ్రాసిరి అందులో ఈ విధముగా అడిగెను మామునిగళ్ ఎమ్పెరుమానారా లేక నమ్మాళ్వారా లేక ఎమ్పెరుమానులా. కొద్ది కాలమునకు ఆయి  తిరునారాయణపురమునకు తిరిగి వెళ్ళగా ,మామునిగళ్ ఆళ్వార్ తిరునగరిలోనే ఉండిరి.
 • కొందరు ప్రజలు మామునిగళ్ కీర్తిని చూడలేక, వారి యొక్క మఠమునకు నిప్పుపెట్టిరి. కాని మామునిగళ్ తన యొక్క పాము అవతారమును ధరించి మఠము బయటకు వచ్చి తన అవతారమును తిరిగి ధరించి బయట నుండి చూసే శ్రీవైష్ణవుల మధ్యలో నిలబడిరి. అప్పుడు రాజు ఆ దోషులను శిక్షించదలచగా  మామునిగళ్ వారిని వదిలివేయమని చెప్పగా వారి కారుణ్యమును చూసి శ్రీ చరణములను ఆశ్రయించిరి.ఆ దేశపు రాజు మామునిగళ్ళ కీర్తీని చూసి వారి వద్ద పంచ సంస్కారములను పొంది ఆళ్వార్ తిరునగరి మరియు తిరుక్కురుంగుడి దివ్య దేశములలో ఎన్నో  కైంకర్యములను చేసిరి.
 • మామునిగళ్ తిరిగి శ్రీరంగమునకు చేరి వారి కైంకర్యములను చేయుచుండిరి. ఆ సమయములో ఎఱుమ్బిఅప్పా అను వారు ఎఱుమ్బి అనే గ్రామము నుండి మామునిగళ్ గురించి విని అక్కడకు వచ్చిరి.తదుపరి,మామునిగళ్ళ ప్రసాదమును తీసుకోకుండ వెళ్ళెను.వారి గ్రామమునకు వెళ్ళిన తరువాత,వారి ఎమ్పెరుమాన్ చక్రవర్తి తిరుమగనుల సన్నిధి ద్వారమును తీయుటకు ప్రయత్నించగా,అవి తెరుచుకోలేదు. ఎమ్పెరుమాన్ ఈ విధముగా మీరు మామునిగళ్ శ్రీ చరణముల వద్ద అపచారమును చేసిరి,వారు ఆదిశేషుల అవతారమే అని చెప్పి వారిని మామునిగళ్ ని ఆశ్రయించమని,కైంకర్యమును చేసి వారి యొక్క ప్రసాదమును స్వీకరరించుతేనే – ఆ ద్వారములు తెరుచుకోబడును అని చెప్పిరి. ఎఱుమ్బిఅప్పా తిరిగి శ్రీరంగమును చేరి,
  తనను మామునిగళ్ కు సమర్పించుకునెను. వారు ఒక అద్భుతమైన దినచర్య అనే ప్రబంధమును వ్రాసిరి,అవి 2 భాగములు – పూర్వ దినచర్య (మామునిగళ్ ఉదయపు ) మరియు ఉత్తర దినచర్య (మామునిగళ్ సాయంత్రపు ).
 • జీయర్ కన్దాడై నాయన్ ను, అతి చిన్న వయసులో వారి అమోఘమైన ఙ్ఞానమునకు మెచ్చుకొనిరి.
 • అప్పిళ్ళై మరియు అప్పిళ్ళార్ పొన్నడిక్కాల్ జీయర్ పురుషకారముచే  మామునిగళ్ళను ఆశ్రయించిరి. ఎఱుమ్బిఅప్పా మామునిగళ్ వద్ద ఆఙ్ఞను తీసుకొని తిరిగి తన గ్రామమునకు మామునిగళ్ యొక్క కీర్తిని విస్తరించుటకు వెళ్ళెను.
 • ఉత్తమ నంబి అను ఒక్క ప్రముఖ శ్రీ వైష్ణవులు పెరియ పెరుమాళ్ళక్కు ఆంతరంగికముగా ఆలవట్ట కైంకర్యమును చేయుచుండిరి . ఆ సమయములో మాణవాళ మాముణిగళ్ పెరియ పెరుమాళ్ కు మంగళా శాసనము చేయుటకు అక్కడికి వచ్చారు . ఉత్తమ నంబి తనను చూసి వెంటనే అక్కడి నుండి బయలుదేరుమని చెప్పెను , అజ్ఞను శిరాసావహిస్తూ అక్కడి నుండి నిష్క్రమించిరి . అలసట చెంది కొంచం సేపు సేద తీర్చుకోరుటకు కన్నులు ఆర్పగా పెరియ పెరుమాళ్ నంబికి దర్శన మిచ్చి , ఆదిశేషుని వైపు చూపుతూ , మాముణిగళ్ మరిఎవరో కాదు ఆదిశేష అవతారమని చెప్పిరి. మేలుకొని ,మాముణిగళ్ మఠమునకు వెళ్ళి వారిని అపరాధ క్షమాపనము అడిగి , అటు పిమట ప్రేమ తో వారిని సేవించుతూ ఉండి పోయిరి.
 • శఠకోప కొట్ట్రి అను ఒక శ్రీ వైష్ణవ అమ్మాయి ఆయ్చిఆర్ వద్ద అరుళిచెయళ్ నేర్చుకుంటూ ఉంటిరి . మధ్యాన సమయమున మాముణిగళ్ అంతరంగములో ఏకాంతముగా పవళించునప్పుడు వారిని ఆ గది లోని ఒక చిన్న రంధ్రములందు చూడగా వారి స్వరూపముతో (ఆదిశేషుని రూపము)దర్శించినది. బయట శబ్ధములకు మేలుకొని మాముణిగళ్ ఏమైనదో విచారించగా తాను చూసిన దానిని విన్నవించినది . అది విని మాముణిగళ్ చిరుమంద హాసముతో జరిగిన వృతాంతమును ఒక రహస్యముగా ఉంచమని చెప్పిరి.
 • రహస్య గ్రంథములకు వ్యాఖ్యానములు వ్రాయాలని నిర్ణయించు కొనిరి . మొదలుగా ముముక్షుపడి , తత్వ త్రయం , శ్రీ వచన భూషణము లకు వేదం , వేదాంతం, ఇతిహాసం, పురాణము , అరుళిచెయల మొ దలగు గ్రంథముల నుండి విశేష అర్థముల ఆధారముగా వ్రాసిరి. ఆ తరువాత రామానుజ నూఱ్ఱందాది. ,జ్ఞాన సారం మరియు చరమ ఉపాయ నిష్ఠ తెలిపే(ఆచార్యులే మనకు సర్వస్వం) ప్రమేయ సారం ను వ్యాఖ్యానములు వ్రాసిరి.
 • పూర్వాచార్యులు ఇచ్చిన శ్రీ సూక్తులను భద్ర పరచవలెనని శ్రీ వైష్ణవులు కోరగా , ఆళ్వారుల యొక్క తిరునక్షత్రములను ,వారు అవతరించిన దివ్య దేశములు మరియు వారి గొప్పతనమును , ఎమ్పెరుమానారుల యొక్క అపార కారుణ్యమును , తిరువాయ్ మొళి వ్యాఖ్యానము దాని ఒక్క అవతార క్రమము మరియు ఈడు లోకములో ప్రచారము అయిన క్రమమును , పిళ్ళై లోకచార్యర్ యొక్క అవతార విశేషము మరియు వారి మహత్తరమైన శ్రీ వచన భూషణము ను తెలిపి ,తిరువాయ్ మొళి యొక్క సారార్థం శ్రీ వచన భూషణమని నిరూపించి , చివరిలో దాని అర్థ విశేషములు విశదముగా వివరించిరి.
 • కొందరు మాయవాదులు వారి తో వాదన కు వచ్చిరి . వారు ఎప్పటి వలె వివాదము చేయ కూడదు అనే వారి నియమము ప్రకారము వాదన చేయుటకు అంగీకరించలేదు . వారి శిష్యులైన వేదలప్పై ని వారి తో వాదన చేయమని ఆదేశించిన . అజ్ఞానుసారముగా వారితో వాదన చేసి జయించిరి వేదలప్పై. కాని ఆ సంఘటన జరిగిన కొన్ని రోజులకే వారి స్వస్థలానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొనిరి.
 • అదే సమయములో ప్రతివాది భయంకరం అణ్ణా ,కాంచి పుర వాస్తవ్యులు మహా పండితులు అయిన వారు తిరువేంకట ముడైయాన్ మీద అనుబంధము వల్ల తిరుమలై లో తీర్థ కైంకర్యము చేయుచుండిరి.శ్రీ రంగము నుండి ఒక శ్రీ వైష్ణవులు తిరుమలై లో తీర్థ కైంకర్యము చేయుచున్నఅణ్ణాని కలిసి , వారికి మా మునిగళ్ యొక్క గొప్పతనమును వివరించిరి . వారి వైభవము విన్నఅణ్ణా చాల సంతోషించి ,వారిని కలవాలనే కోరిక పెరిగి పోయింది.వారి గురించి ఆలోచిస్తూ ,తీర్థ పరిమళము (లవంగము/ఈలైచి ) ను తీర్థము లో చేర్చుటకు మరిచి దానిని అర్చకరు కు ఇచ్చారు . ఆ తరువాత తీర్థ పరిమళము చేర్చలేదని గుర్తుతెచ్చుకొని తీర్థ పరిమళముతో అర్చకర్ వెనుక పరుగు తీసిరి కాని అర్చకర్ ముందు కన్నాతీర్థం సువాసనను వెదజల్లుతున్నదని చెప్పిరి . అది విన్నఅణ్ణా మామునిగళ్ యొక్క వైభవము ప్రాశస్త్యము ఎటువంటిదంటే వారి గొప్పతనము విన్న మాత్రమునే తీర్థము సువాసనమైయము అయినది . అట్టి మామునిగళ్ దర్శనము చేసుకొనటకు శ్రీ రంగమునుకు చేరిరి.మామునిగళ్ మఠమునకు చేరగా అప్పుడు మామునిగళ్ తిరువాయ్ మొళి(4. 10) లో “ఒన్నమ్ దేవుం” పదిగమును వివరించుచుండిరి.ఆ పదిగము ఏమ్పెరుమాన్ యొక్క పరత్వము ను స్థాపించును. మామునిగళ్ అతి సులభముగా ఎన్నో శాస్త్రముల నుండి దృష్టాంతము ఇస్తూ వివరించ సాగారు. అది గమనించిన అణ్ణా వారి జ్ఞానమునకు మరియు వారి ప్రవచన సామర్థ్యమునకు ఆశ్చర్య చకితులైరి.మామునిగళ్ 3వ పాశురము దగ్గర ఆగి పోయిరి . వారికి ఆళ్వార్ సంబంధం ఉన్నప్పుడే ఈ విశేష అర్థములు సేవించుటకు యోగ్యత కలుగునని చెప్పిరి(ఓరాణ్ వళి ఆచార్య పరంపర ప్రకారం) .అటు పిమ్మట పెరియ పెరుమాళ్ళ కు మంగళా శాసనము చేయుటకు బయలుదేరిరి.పెరియ పెరుమాళ్ అర్చక ముఖేన విలక్షణ సంబంధము పొందుటకు మామునిగళ్ ను శరణు వేడమని చెప్పిరి . పొన్నడిక్కాల్ జీయర్ పురుషకారము చే మామునిగళ్ యొక్క చరణ సంబంధము పొంది అక్కడే కొంత కాలము నివసించిరి.
 • మామునిగాళ్ తిరుమలై యాత్ర చేయుటకు బయలుదేరిరి . దారిన కాంచీపురం దేవపెరుమాళ్ ను మంగళాశాసనము చేసి అక్కడ కొన్ని రోజులు నివసించి , అక్కడి శ్రీ వైష్ణవులను సంస్కరించిరి . అప్పాచియారన్నను తన ప్రతినిధిగా అక్కడే నివసించమని నియమించిరి. ఆ తరువాత తిరుకడిగై , ఎరుమ్బి , తిరుపుట్ట్కుళి మొదలగు దివ్య దేశములను సేవించుకుంటూ తిరుమలై చేరిరి. అక్కడ మంగళా శాసనము చేసి శిరియ కేల్వి అప్పన్ జీయర్ ను పెరియ కేల్వి అప్పన్ (ఎమ్పెరుమానర్ల చే స్వయముగా నియమింపబడ్డ ) జీయర్ ల కైంకర్యము కు సహకారి గా నియమించిరి.తిరిగి వచ్చునప్పుడు , వారు తిరుఎవ్వుళ్ విజయ రాఘవన్ , తిరువల్లికేని వేంకట కృష్ణన మొదలగు దివ్య దేశములను మంగళా శాసనము చేసిరి.మధురాంతకము చేరి అక్కడ పెరియ నంబి రామానుజర్లకు పంచ సంస్కారం చేసిన ప్రదేశమును సేవించిరి.అటు పిమ్మట తిరువాలి తిరునగరి చేరి అక్కడ తిరుమంగై ఆళ్వార్ ను , తిరుమేని (vadivazhugu) సౌందర్య పాశురములను సమర్పించి ,ఆ ప్రదేశములో ఉన్న పెరుమాళ్ళ అందరిని మంగళా శాసనము చేసిరి . ఆ తరువాత తిరుకణ్ణపురమ్ చేరి సర్వాంగ సుందర మైన శౌరిరాజ ఎమ్పెరుమాన్ ను అనుభవించి , అక్కడ తిరుమంగై ఆళ్వార్ కు తిరుమేని సమర్పించిరి.ఇంకను మరి కొన్ని దివ్య దేశముల యాత్ర చేసి , కడకు శ్రీ రంగము చేరి అక్కడ నివసించిరి.
 • ముందుగా ఆదేశించిన విధముగా అప్పచియారన్న ను కాంచిపురమునకు వెళ్ళమని ఆదేశించిరి . అధ్బుతమైన ఆ గోష్టి ని వదిలి వెళ్ళుటకు అప్పచియారన్నచాల విచారం పడ సాగిరి . అది చూసిన మామునిగళ్ తన మర చంబు అయిన రామానుజము తో తన యొక్క రెండు తిరుమేనులను చేయమని ఆదేశించెను.దీనినే పొన్నడిక్కాల్ పొన్నడిక్కాల్ పూజించేవారు. రెండు తిరుమేనులలో ఒకటిని పొన్నడిక్కాల్ జీయర్ కు ఇంకొకటిని అణ్ణా కు సమర్పించారు. (వీటిని ఇప్పుడు కూడా వానామామలై మఠము, వానామామలై లోను మరియు శింగ పెరుమాళ్ కోవెలలోని ముదలియాన్డాన్ తిరుమాళిగై లోను సేవించగలము .) వీరు తన “ఎన్నై తీమనం కేడుతాయ్” తిరువారాధనము ఎమ్పెరుమాన్ ను అణ్ణా కు ఇచ్చిరి(శింగ పెరుమాళ్ కోవెల లో ముదలియాన్డాన్ తిరుమాళిగై లోను సేవించగలము).
 • ప్రతివాది భయంకర్ అన్నా ను శ్రీ భాష్య ఆచార్యర్ గా , కందాడై అణ్ణన్ , శుద్ధ సత్వం అణ్ణన్ ను భగవత్ విషయ ఆచార్యులుగా నియమించిరి .కందాడై నాయన్ ను ముప్పదు ఆరాయిరపడి కి అరుమ్పదం రాయమని ఆదేశించిరి.
 • మామునిగళ్ ముఖేన ఎడ తెరుపు లేకుండా భగవత్ విషయం వినుటకు పెరియ పెరుమాళ్ యొక్క ఆశ పెరిగిపోయింది.తన యొక్క పరిపూర్ణ ఇచ్చతో వారిని తన గురువుగా ఎంచుకోవాలని అనుకొందురు.ఒకనాడు పవిత్రోత్సవ శాత్తుమురై అప్పుడు ,నమ్పెరుమాళ్ తిరుపవిత్రోత్సవ మండపమునకు చేరిరి . వారిని మంగళా శాసనము చేయుటకు మామునిగళ్ అక్కడకు చేరిరి. కైంకర్యపరులు , ఆచార్య పురుషులు , జీయర్లు,శ్రీ వైష్ణవుల సమక్షములో మామునిగళ్ ను నమ్మాళ్వార్ ల తిరువాయ్ మొళి యొక్క కాలక్షేపమును ఈడు ముప్పదు ఆరాయిరపడి వ్యాఖ్యనముతో చేయమని ఆదేశించెను . ఎటువంటి అవరోధాలు లేకుండా కాలక్షేపము పూర్తి అయేంతవరకు నిరంతరాయంగా కొనసాగించాలని ఆదేశించిరి.మామునిగళ్ తనను ఎమ్పెరుమాన్ ఈ కైంకర్యము చేయుటకు ఎంచుకునందుకు వినతి తో కృతజ్ఞ చేసి , అంగీకరించిరి.
 • ఆ మరుసటి రోజున ఉభయ నాచ్చిమార్ల తో కూడిన నమ్పెరుమళ్, తిరు అనంతాళ్వాన్ , పెరియ తిరువడి, సేనై ముదలియార్ , ఆళ్వార్లు , ఆచార్యులు పెరియ తిరుమండపము (పెరియ పెరుమాళ్ సన్నిధి ద్వారా పాలకుల ముందు ) తన కాలక్షేపము కాగా ఎదురుచూస్తూ ఉండిరి .ఇంతటి వారు తన కోసం ఎదురు చూచుటకు చాలా దీవించబడిరని ముప్పదు ఆరాయిరపడి వ్యాఖ్యానమును (6000 పడి ,9000 పడి , 12000 పడి మరియు 24000 పడి ) వ్యాఖ్యానముల తో కాలక్షేపము ఆరంభించిరి . వారు వాటి లోని ఘూడమైన అర్థములను శృతి , శ్రీ భాష్యం , శ్రుతప్రకాషిక , శ్రీ గీత భాష్యం, శ్రీ పాంచరాత్రం ,శ్రీ రామాయణం , శ్రీ విష్ణు పురాణము మొదలగు గ్రంథముల ఆధారము ల తో వివరించిరి . వాటి లో ని ప్రతి పదార్థములను , స్వాపదేశార్థములను మొదలగు చెప్పిరి. ఇలా పది నెలలు గడిచి పోయినవి .చివరికి శాత్తుమురై రోజు రానే వచ్చినది , అది ఆణి తిరుమూల నక్షత్రం . శాత్తుమురై అయిన తరువాత , నమ్పెరుమాళ్ అరంగనాయకమ్ అనే ఒక చిన్న బాలునివలె ఇతరులు అడ్డు పడ్డ గోష్టి ముందుకు వచ్చిరి . అంజలి ఘటిస్తూ , “శ్రీ శైలేశ దయా పాత్రం ” అని చెప్పిరి , ఇంకా చెప్పమనిన “ధీ భక్త్యాది గుణార్నవమ్ “అని మరి కాస్త చెప్పమనిన “యతీంద్ర ప్రవణం వందే రమ్య జా మాతరం మునిం ” అని చెప్పి పరుగు తీసిరి . శిష్యులు ఆ శ్లోకమును మఱ్ఱి ఆకు పై రాసిరి .ఆ బాలుని గోష్టి సమక్షము న తీసుకుని వచ్చి చదవమని చెప్పగా , ఆ బాలుడు ఏమియును చదువలేక పారి పోయెను . నమ్పెరుమాళ్ యే స్వయముగా తన ఆచార్యులకు సమర్పించుటకు వచ్చిరని అందరికి అర్థము అయినది . ఎమ్పెరుమాన్ ఈ తనియను అన్ని దివ్య దేశములకు ప్రచారం చేయుదురు ,అన్ని చోట్ల ఈ తనియన్ ఒక అగ్ని జ్వాల వలె వ్యాపించినది. అదే సమయములో, శ్రీ వైష్ణవుల ఆజ్ఞ మేరకు , అప్పిళ్ళై మామునిగళ్ యొక్క కీర్తిని చాటే ట్టు వాళి తిరునామం వ్రాసిరి.

 • తిరువేంకటముడైయాన్ మరియు తిరుమలిరున్చోలై అళగర్ కూడా ఈ తనియను అరుళిచెయళ్ ముందు మరియు చివరిగా అనుసంధానం చేయవలెనని ఆదేశించారు . బద్రికాశ్రమము మరియు ఇతర దివ్య దేశములకు మామునిగళ్ కీర్తిని ప్రకాశించుటకు ఎమ్పెరుమాన్ యొక్క నియమనము లభించినది. మామునిగళ్ వడ నాడు దివ్య దేశములు మంగళా శాసనము చేయుటకు తలిచేదారు . వారి శిష్యులు వారికి బదులుగా యాత్ర కు బయలుదేరిరి.
 • ఎరుమ్బి అప్పా కు తన యొక్క దివ్య పాదుకలను ప్రసాదిస్తారు .
 • మామునిగళ్ తన తిరువారాధన పెరుమాళ్ అయిన అరంగనగరప్పన్ ను పొన్నడిక్కాల్ జీయర్ కు ప్రసాదించి , వానమామలై కు వెళ్ళి , అక్కడ ఒక మఠమును ఏర్పాటు చేసి ధైవనాయక పెరుమాళ్ ను నిరంతరాయంగా కైంకర్యము చేయమని ఆజ్ఞాపించెను.
 • ఇంకొకసారి పాండ్య నాడు దివ్య దేశ యాత్ర కు బయలు దేరిరి . పోవు మార్గములో , ఆ ఊరి రాజు (మహా బలి వాన నాథ రాయన్ ) మామునిగళ్ కు శిష్యులై , చాలా దివ్య దేశముల కైంకర్యములు వారి ఆదేశముల మేరకు చేసిరి .
 • మదురై కు వెళ్ళే దారి లో సేద తీరుటకు ఒక చింత చెట్టు క్రింద విశ్రమించి , బయలుదేరు సమయములో ఆ వృక్షమును తాకి , దానికి మోక్షమును ప్రసాదిన్చిరి.చాలా దివ్య దేశములను మంగళా శాసనము చేస్తూ , చివరిగా శ్రీ రంగము చేరిరి.
 • వారి శిష్యుల ద్వారా చాలా కైంకర్యములు చేసిరి . తిరుమాలిరున్శోలై అళగర్ ను కైంకర్యము చేయుటకు ఒక జీయర్ స్వామి ని అక్కడికి పంపించెదరు.
 • పెరియ వాచ్చాన్ పిళ్ళై పెరియాళ్వార్ తిరుమొళి కి వ్యాఖ్యానము వ్రాసిరి , కాని అందులో కొంత భాగము చే జారి పోయినందు వల్ల , మామునిగళ్ చే జారి పోయిన భాగమునకు వ్యాఖ్యానమును వ్రాసిరి
 • వారు అస్వస్థత కు గురి అయినను , వ్రాయడము మానలేదు . ఆచార్య హృదయము చాలా కష్టము గా వ్రాయు సమయములో , వారి శిష్యులు ఎందులకు ఇంత కష్టమునకు ఓర్చి వ్రాయడం అని అంటే , అది వచ్చే తరము లోని వారి పిల్లా పాపల ఉజ్జివించ కొరుకుటయే అని సమాధానము ఇచ్చిరి .
 • తన తిరుమేని ని వదిలి పరమపదము చేరుటకు మిక్కిలి ఆశ పెరిగి , ఆర్తి ప్రబంధము వ్రాసిరి . అందులో వారు ఎమ్పెరుమానార్లను, తనను శీఘ్రముగా తన శ్రీ పాదముల దగ్గరకు చేర్చు కోవలెనని,ఈ శరీరము నుండి బయటకు పడ వేయ వలెనని రోదిస్తారు. దీని ద్వారా మనము ఎట్లు ఎమ్పెరుమానార్లను ప్రార్థించ వలేనో చూపిరి . ఎందులకు అనగా వారే స్వయముగా ఎమ్పెరుమానార్లు కాబట్టి
 • చివరిగా వారు ఈ లీల విభూతి లో తన కార్యక్రమములు అన్నింటిని ముగించుకొని పరమపదమునకు తిరిగి వెళ్ళి ఎమ్పెరుమాన్ యొక్క నిత్య కైంకర్యము చేయుటకు నిశ్చయించుకొనిరి. అన్ని అరుళి చెయళ్ ను ఒకసారి వినాలనే ఆశ తెలియజేసిరి . అందరు శిష్యులు ఎంతో ప్రేమ మరియు ఈడుబాటు తో వారి కోరిక మేరకు అట్లే ఏర్పాటు చేసిరి .మామునిగళ్ సంతోషించి ఒక పెద్ద తదియారాధనను నిర్వహించి , వారి శిష్యుల దగ్గర క్షమ ప్రార్థన అడుగుతారు . వారి శిష్యులు వారిని ఏ దోషము లేని వారని , క్షమా ప్రార్థన అడుగవలెదని చెప్పిరి. పెరియ పెరుమాళ్ మరియు నమ్పెరుమాళ్ యొక్క కైంకర్యములు పూర్తి శ్రద్ధా భక్తులతో జరుగునట్టు గమనించ వలెనని అందరి తో విన్నవించిరి.
 • ఆ తరువాత “పిళ్ళై తిరువడిగళే శరణం “, వాళి ఉలగాశిరియన్ ” మరియు “ఎమ్పెరుమానార్ తిరువడిగళే శరణం ” అని చెప్పిరి. వారి కన్నులను బారేడుగా చేసి ఎమ్పెరుమాన్ దర్శనము కొరకు చూడగా ,వెంటనే ఎమ్పెరుమాన్ గరుడారూహూడై ప్రత్యక్షమై తనతో పాటు తీసుకు వెళ్ళిరి. ఈ విధముగా వారి ఒక్క లీలను ఈ విభూతి లో అతి వైభవముగా ముగించిరి .ఇది చూచిన శ్రీ వైష్ణవులు అందరు బాధ తో కన్నీరు మున్నీరు గా ఏడ్చిరి . పెరియ పెరుమాళ్ కు తాను లేని లోటు ఎంతవరకు బాధించింది అనగా వారు భోగములను గై కొనుట ఏ మానుకొనిరి .చివరకు తమలను తామే ఒకరితో ఒకరిని సమాధానము చేసుకొని చరమ కైంకర్యములను మొదలు పెట్టిరి. తిరువధ్యయాన ఉత్సవము పెరియ పెరుమాళ్ యొక్క అజ్ఞానుసారముగా వారి బ్రహ్మోత్సవముల కంటెను గొప్పగా నిర్వహించిరి.
 • పొంనడిక్కాల్ జీయర్ వడ నాట్టు దివ్య దేశముల యాత్ర నుండి వచ్చి మామునిగాళ్ యొక్క చరమ కైంకర్యమును చేయుదురు.

మామునిగళ్ యొక్క సూచనలు (జ్ఞాన /అనుష్టాన పూర్తి ) :

1. ఒక సమయములో రెండు శ్రీ వైష్ణవులు మధ్య భేదాభిప్రాయములు వచ్చాయి .అప్పుడు , రెండు వీధి కుక్కలు వీధి లోపడి ఆ ఇద్దరి శ్రీ వైష్ణవులు ముందు కొట్టుకుంటునవి , వాటిని చూసి “ఇంత అహంకారము ఉండుటకు కారణము మీరు కూడా ఈ ఇరువురు శ్రీ వైష్ణవుల వలె శ్రీ వచన భుశానమును ను నేర్చుకొంటిరా ” అని అడిగెను. వెంటనే వారి తప్పులను తెలుసుకొని , నిష్కల్మశులైరి .

2. వడ దేశము లందు ఎవరైనా ధనము ను ఇచ్చి , ఆ ధనము సక్రమ పద్దతిలో ఆర్జించ్ లేనిచో వారు దానిని తిరిగి ఇచ్చి వెయుదురు. లౌకిక ధనము పై ఏ ఆశ ను చూపించరు . కేవలము శ్రీ వైష్ణవుల నుండి మాత్రమే కైంకర్యమునకు ధనము / వస్తువు సేకరింప బడేల చూచుదురు.

3. ఒకనాడు ఒక వృద్ధ వనిత మఠమునకు వచ్చి , ఆ రాత్రి తను అక్కడ ఉండుటకు అనుమతి ఇవ్వమని కోరినది. ఆవిడ కోరికను నిరాకరించి , “ఒక ముసలి ఉడుత కూడా చెట్టు ఎక్క గలదు ” అని చెప్పిరి అనగా ఒక వృద్ధురాలు మఠము లో ఉన్నను , మామునిగళ్ వైరాగ్యము పై లోకులు సఖించగలరు.వీరి వైరాగ్య నిష్ఠ పై ఎవరికైనా ఏ చిన్న సంధేయము వచ్చెటువంటి పనులను చేయజాలరని చెప్పిరి

4.ఒక్క నాడు ఒక శ్రీ వైష్ణవ అమ్మైయార్ కూర గాయులు తరుగుట లో సహాయము పరిపూర్ణ మైన భక్తి తో చేయనందు వల్ల , తనను 6 మాసములు కైంకర్యమునకు దూరముగా ఉండవలెనని దండన ఇచ్చిరి . ఎందుకంటే , మామునిగళ్ కైంకర్యపరులు వారి పూర్తి భక్తి విశ్వాసములతో భగవత్/భాగవత్ నిష్ఠ లో ఉండవలెనని ఆశించేదురు

5.వరం తరుం పిళ్ళై అనే శ్రీ వైష్ణవుడు మామునిగళ్ దగ్గరకు ఒంటరిగా వస్తదు. అది గమనించి శ్రీ వైష్ణవులు ఎమ్పెరుమాన్ /ఆచార్యులు దగ్గరికి ఒంటరిగా వెళ్ళ రాదని , శ్రీ వైష్ణవులతో గోష్ఠి గా వెళ్లాలని చెప్పిరి

6.ఎన్నో మార్లు భాగవత్ అపచారముల యొక్క కృరత్వము గురించి చెప్పిరి. అదే విధంగా శ్రీ వైష్ణవులు ఒకరి తో మరి ఒక్కరు మర్యాద తో వ్యవహరించ వలెనని భోదించిరి

7.ఒక్క భట్టర్ మామునిగళ్ దగ్గరకు తన శిష్యులు తనని సరిగ్గా గౌరవ మర్యాదలు ఇవ్వట్లేదని చెప్పిరి , అందుకు వారు శిష్యుల తో పెరుమాళ్ మరియు పిరాట్టిమార్ల ఆచార్యులు లో ఉందురని భావిస్తూ వారితో ఎప్పుడు గౌరవ మర్యాదలతో మెలగవలెనని మందలించిరి.

8.వడ నాట్టు నుండి ఒక ధనవంతుడైన శ్రీ వైష్ణవుడు మామునిగళ్ వద్దకు వచ్చి శ్రీ వైష్ణవ లక్షణములను విశదికరించి అడిగిరి . మామునిగళ్ నిజమైన శ్రీ వైష్ణవుని లక్షనమును ఈ విధంగా వివరించిరి

 • ఎమ్పెరుమాన్ నే సర్వస్వం అని ఆశ్రయించిన మాత్రమున సరిపోదు.
 • ఎమ్పెరుమాన్ యొక్క సంబంధమును శంఖ చక్రముల (సమాశ్రయనము) లాంఛనము ద్వారా పొందిన మాత్రమున సరిపోదు.
 • నిత్యము ఎమ్పెరుమాన్ యొక్క కైంకర్యము గా తిరువారాధనము చేయుట మాత్రమున సరిపోదు.
 • తమ ఆచార్యునికి పరతంత్రముగా ఉండుట మాత్రమున సరిపోదు.
 • భాగవతులకు కైంకర్యము చేస్తూ ఉండుట మాత్రమున సరిపోదు.
 • ఇవి అన్నియు కలిగి ఉండవలెను, ఇంకనూ ముఖ్యముగా కొన్ని ఉండవలిసినవి / కావలసినవి /చేయవలసినవి ఉన్నవి
 1. ఎమ్ఫెరుమాన్ ముఖ విలాసము చెందించే ,ఆయా సందర్భములలో తగునట్టి ఉచితమైన కైంకర్యములు చేయవలెను
 2. వారి వారి గృహముల ను శ్రీ వైష్ణవులు తమ ఇష్టనుసారముగా ఉపయోగించుకొనుటకు ఏర్పర్చుకొనవలెను.
 3. పెరియాళ్వార్ శ్రీ సూక్తి “ఎన్ తమ్మై విర్కవుం పెరువార్గాళే ” ప్రకారముగా ఉండవలెను ( శ్రీ వైష్ణవులు మన స్వాములు అయినందున మనలను క్రయ విక్రయము చేయుటకును పరిపూర్ణ అధికారము కలవారు )
 • భాగవత శేషత్వం పెంపొందించుకున్న తరువాత ఎమ్పెరుమాన్ మరియు ఆళ్వార్ ఆచార్యుల అనుగ్రహము చేత మన సాంప్రదాయ అర్థ విశేషములను చాలా సులభముగా నేర్చుకొనగలము. చరమ పర్వ నిష్ఠ అయిన భాగవత శేషత్వమును ఆచరిస్తూ ఉండడము వలన ఇటువంటి శ్రీ వైష్ణవులు మరి ఏ ఇతరమైన విశేష అర్థములను తెలుసుకొనుట అవసరము లేదు
 • మనము ఆచరణ చేయని విషయములను ఇతరులకు ఉపదేశించటము వ్యర్థము. అది ఏ విధముగా ఉండుననగా ఒక వ్యభిచారి పవిత్రత గురించి ఉపదేశించుమాదిరిగా .
 • శ్రీ వైష్ణవుల కైంకర్యము కన్నా మిన్న కైంకర్యము మరి ఒక్కటి లేదు, శ్రీ వైష్ణవుల పట్ల అపచారము కన్నా క్రూరమైన అపచారము ఇంకొకటి లేదు .

ఈ లక్షణములు అన్నింటిని విన్న ఆ శ్రీ వైష్ణవుడు మామునిగళ్ ప్రతి చాలా భక్తి శ్రద్ధలతో ఎల్లప్పుడూ వారినే స్మరిస్తూ ఉండిరి .

మన సంప్రదాయములో మామునిగళ్ కు గల ప్రతేకస్తానము: 

 • ఏ ఆచార్యుల వైభవమునైనా సంగ్రహముగా మాట్లాడగలము కాని మామునిగళ్ వైభవము అపరిమితమైనది.వారు కూడా వారి యొక్క వేయి నాలుకలతో( ఆదిశేశులుగా) కూడా తమ కీర్తిని గురించి చెప్పలేరు,అందువలన మనము ఏ విధముగా పూర్తిగా సంతృప్తిచెందలేము.మనము కాస్తైనా ఈ విధముగా వీరి వైభవమును గురించి మాట్లడడము (చదవడము)చే అపరిమిత లాభము పొందితిమని సంతృప్తి చెందవలసినదే.
 • వీరిని పెరియ పెరుమాళ్ తమ యొక్క ఆచార్యులుగా అంగీకరించి ఆచార్య రత్న హారమును మరియు ఓరాణ్ వజి గురు పరమ్పరైను పూర్తిచేసిరి.
 • పెరియ పెరుమాళ్ వీరికి శిశ్యులుగా ఉండి,వారి యొక్క శేష పర్యంకమును మామునిగళ్ కి సమర్పించిరి,ఇది ఇప్పడికినీ మనము చూడవచ్చు– ఏ ఇతర ఆళ్వార్/ఆచార్యులకు లేని విధముగా ఒక్క మామునిగళ్ కు మాత్రమే శేష పర్యంకము/పీఠము కలిగిఉండెను .
 • పెరియ పెరుమాళ్ తమ యొక్క ఆచార్యుల కొరకు, ఒక తనియన్ వ్రాసి, మామునిగళ్ కి సమర్పించిరి మరియు ఆ తనియన్ ను తప్పక అరుళిచెయల్ గోష్ఠిలో ఏ ప్రదేశములోనైన మొదట మరియు చివర తప్పక అనుసందిచవల్నని ఆదేశించిరి – గుడిలో, మఠములలో, తిరుమాళిగలలో, మొద,,.
 • ఆళ్వార్ తిరునగరిలో,ఐప్పసి తిరుమూలము (మామునిగళ్ తిరునక్షత్రము) రోజున, ఆళ్వార్,తమ తిరుమంజనము తదుపరి,తమ యొక్క పల్లక్కు, కుడై, చామరమ్, వాద్యమ్, మొదలగునవి మామునిగళ్ సన్నిదికి పంపి వారిని తన వద్దకి తీసుకొని వద్దురు.ఒక్క మామునిగళ్ మాత్రమే వచ్చిన పిదప,వారు తిరుమణ్ కాప్పు ని ధరించి ప్రసాదమును మామునిగళ్ కి ఇస్తారు.
 • మన పూర్వాచార్యులలో ఒక్క మామునిగళ్ ఒక్కరికి మాత్రమే తిరువద్యయనమును చేయుదురు.సాధారణముగా తిరువద్యయనమును శిష్యులు మరియు కుమారులు మాత్రమే చేయుదురు.కాని వీరి విషయములో, మామునిగళ్ శిష్యుయులై ఇప్పటికి జీవించి ఉండే శ్రీ రంగ నాథునులు తమ యొక్క ఆచార్యుల తీర్థమును చాలా గొప్పగా చేయుదురు.వారు తమ అర్చకులను, పరిచారకులను, సారెను (తమ యొక్క వట్టిల్, కుడై, చానరమ్, ఎట్c), ఈ మహోత్సవమునకు పంపుదురు. ఈ మహోత్సవము యొక్క విశేషములకొరకు  http://www.kaarimaaran.com/thiruadhyayanam.html చూడగలరు.
 • మామునిగళ్ తమ గురించి ఎటువంటి ఉత్సవములు జరుపుకోకుడదని ఉద్ధేశించిరి –శ్రీరంగము మరియు ఆళ్వార్ తిరునగరిలో, వారు తమ యొక్క అర్చా తిరుమేనిలను చాలా చిన్నగా ఉండవలెనని ,ఎటువంటి పురప్పాడు మొదలగునవి ఉండకూడదని, నమ్పెరుమాళ్ మరియు ఆళ్వారులకే ఎక్కువ ప్రాముఖ్యము వాదిన్చిరి.
 • అందులకే వారిని మనము అందమైన చిన్నతిరుమేనిలో ఇప్పటికిని ఆ రెండు దివ్యదేశములలో చూస్తున్నాము.
 • మామునిగళ్ చాలా వినయ విధేయతలు కలవారు . ఎవరి గురించి కూడా చెడు గా వ్రాయటము చేసేవారు కాదు. మన పూర్వాచార్యుల వ్యాఖ్యానములలో ఎక్కడైనా ఒక చిన్న అర్థ వ్యతిరేకతలు గమనించితే దాని గురించి వ్యర్థమైన మాటలను మాట్లాడక , వాదనమును తప్పు పట్టే వారు కాదు.
 • వారు అరుళిచెయల్ మీద దృష్టి సారించి , వేదాంతమును అరుళిచెయల్ పాశురముల ద్వారా వివరించిరి.వీరి కృషి లేకునచో తిరువాయ్ మొళి మరియు దాని అర్థ విశేషములు నది లో పారపోసిన చింతపండు వలె అయి ఉండేవి అనగా వ్యర్థమై పోయి ఉండేవి.
 • మామునిగళ్ అన్ని గ్రంథములను సేకరించి , వాటికి తానే స్వయముగా అర్థవిశేషములను వ్రాసి, భద్రపరిచిరి . ఈ కారణముగానే ,ఇన్ని తరముల తరువాత కూడా అవి మనకు లభిస్తునవి.
 • వారు అపార కారుణ్యము గలవారు,ఎవరైనా తమని అవమానించినా/కష్టమునకు గురిచేసినా,వారు ఎప్పుడూ కోపమును ప్రదర్శించక,వారిని ఎల్లప్పూడూ గౌరవించి చాలా ఆదరించేవారు.
 • ఈ విధముగా వారి తిరువడిని మన శిరముపై దరించిన, అమానవన్ మన చేతిని పట్టుకొని .ఏ రోజైతే మామునిగళ్ యొక్క శ్రీ చరణములను మన శిరస్సు పై ధరించుటకు సిద్ధముగా ఉన్డుదుమో , అప్పుడు ఆమనవన్ (విరజై నదిని దాటుటకు సహాయముచేయువారు)నిశ్చయముగా మన చేతులను పట్టుకొని ఈ సంసార సాగరము నుండి మనలను బయటకు పడ వేయుదురు
 • ఎమ్పెరుమానారులందు వారికి గల నిబద్దత అసమానమైనది, వారు ఎమ్పెరుమానారులను ఏ విధముగ  ఆరాధించవలెనో  ఆచరణలో చూపిరి.
 • మన పుర్వాచార్యులు వారి గ్రంథముల లో శ్రీ వైష్ణవుడి యొక్క నడ వడికను గురించి చెప్పిన విధమునకు వారి జీవితము ఒక ఉదాహరణము. దీని గూర్చి శ్రీ సారధి స్వామి యొక్క ఈబుక్ శ్రీవైష్ణవ లక్షణములో చూడవచ్చు.Click here to see this series of articles and ebook – http://ponnadi.blogspot.in/p/srivaishnava-lakshanam.html.

మామునిగళ్ తనియన్:

శ్రీశైలేశ దయా పాత్రమ్ ధీభక్త్యాది గుణార్ణవమ్
యతీన్ద్ర ప్రవణమ్ వన్దే రమ్య జామాతరమ్ మునిమ్

ஸ்ரீஸைலேச தயா பாத்ரம் தீபக்த்யாதி குணார்ணவம்
யதீந்த்ர ப்ரவணம் வந்தே ரம்ய ஜாமாதரம் முநிம்

తాత్పర్యము: శ్రీశైలాంశ సంభూతులై ‘తిరుమలై ఆళ్వార్’ అని ప్రసిద్దిచెందిన ‘తిరువాయ్ మొజి పిళ్ళై’ అను శ్రీశైలనాధుల దివ్య నిర్మల కరుణాపూరమునకు ఉత్తమ పాత్రభూతులును, ఙ్ఞాన భక్తి వైరాగ్యాది పరమ కల్యాణ గుణ గణ పరిపూర్ణులగు శ్రీ భగవత్ రామానుజ సంయమింద్రుల దివ్యమంగళచరణ పంకేరుహములందు అత్యన్త ప్రవణులై, తదేకాన్తికాత్యన్తిక పరభక్తి యోగ నిష్ఠులై, ఏకలవ్యునివలె వారికి అనన్యార్హ శిశ్యభూతులైయుండు శ్రీ అజగియ మణవాళమహామునులకు సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందును త్రికరణశుద్దిగా నమస్కరించుచు సేవించుచున్నాను.

దీనితో మనము ఓరాణ్ వజి ఆచార్య పరమ్పరై పూర్తిచేసుకొన్నాము. ఏ విషయమైననూ తీయనైన పద్దతిలో చెప్పమని చెప్పిఉండెను.అందువలన మనము ఓరాణ్ వజి పరమ్పరై కూడా మామునిగళ్ మరియు వారి యొక్క చరితముతో పూర్తిచేసినాము, వీరి చరితము కంటే ఈ రెండు ప్రపంచములలో(నిత్య విభూతి మరియు లీలా విభూతి) ఏది కూడా ఇంత తీయగా లేదు.

మామునిగళ్ తిరునక్షత్ర మహోత్సవమును ఆళ్వార్ తిరునగరి, శ్రీరంగము, కాంచీపురమ్, శ్రీవిల్లిపుత్తూర్, తిరువహింద్రపురము, వానమామలై, తిరునారయణపురము మొదలగు చాలా దివ్యదేశములలో గొప్పగా చేస్తారు. మనమూ కూడా శ్రీ రంగనాతనులకు ప్రియమైన ఆచార్యులు మరియు మనకునూ ఆచార్యులైన వీరి ఉత్సవములో శుద్దమైన మనసుతో సేవించుదాము.

తదుపరి సంచికలలో మనము మన సంప్రదాయములో గల గొప్ప ఆచార్యులను వైభవమును తెలుసుకుందాము. కాని ఇతర ఆచార్యుల అనుభవమును తెలుసుకొనుటకు ముందు,మామునిగళ్ తిరువడి నిలై అని వారిచే గుర్తించబడి మరియు మామునిగాళ్ యొక్క జీవిత శ్వాస అయిన పొన్నడిక్కాల్ జీయర్ వైభవమును తదుపరి సంచికలో చూద్దాము.

అడియేన్ ~:
రఘు వంశీ రామనుజదాసన్

source

పిళ్ళై లోకాచార్యర్

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

క్రితం సంచికలొ మనం వడక్కు తిరువీధి పిళ్ళైల గురించి తెలుసుకున్నాం , ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

పిళ్ళై లోకాచార్యర్ –శ్రీరంగము 

తిరునక్షత్రము: ఆశ్వయుజ మాసము (ఐప్పసి),శ్రవణము (తిరువోణమ్)

అవతార స్థలము: శ్రీరంగము

ఆచార్యులు:  వడక్కు తిరువీధి పిళ్ళై

శిశ్యులు: కూర కుళోత్తమ దాసర్, విళాన్ చోలై పిళ్ళై,  తిరువాయ్మొజి పిళ్ళై, మణప్పాక్కతు నమ్బి, కోట్టుర్ అణ్ణర్, తిరుప్పుట్కుజి జీయర్,  తిరుకణ్ణన్గుడి పిళ్ళై , కొల్లి కావల దాసర్, మొద,,

పరమపదము చేరిన ప్రదేశము: జ్యోతిష్కుడి (మదురై దగ్గర)

శ్రీ సూక్తులు: యాదృచిక్క పడి,ముముక్షుపడి , శ్రియ:పతి పడి,  పరంద పడి, తని ప్రణవమ్, తని ద్వయమ్, తని చరమమ్, అర్థ పంచకము, తత్వ త్రయము, తత్వ శేకరం, సార సంగ్రహము, అర్చిరాది, ప్రమేయ శేకరం, సంసార సామ్రాజ్యము, ప్రపన్న పరిత్రాణము, నవరతిన మాలై, నవ విధ సంబంధం, శ్రీవచన  భూషణము మరియు మొద,, .

పిళ్ళై లోకాచార్యర్ శ్రీరంగము నందు  వడక్కు తిరువీధి పిళ్ళైలకు నమ్పిళ్ళైల అనుగ్రహము తో జన్మించిరి. (వడక్కు తిరువీది పిళ్ళై ఐతిహ్యమునందు ఇదివరకే చూసితిమి). వారు మరియు వారి తమ్ముడైన అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ శ్రీరంగము నందు అయోధ్యలో పెరుమాళ్ మరియు ఇళయ పెరుమాళ్ వలె గోకులములో కణ్ణన్ ఎమ్పెరుమాన్ మరియు నంబి మూత పిరాన్లవలె పెరిగిరి. వీరిరువురు మన సాంప్రదాయముకు పట్టు కొమ్మలైన నమ్పిళ్ళై, పెరియ వాచ్చాన్ ప్పిళ్ళై,వడక్కు తిరువీధి పిళ్ళై మొదలగు గొప్ప ఆచార్యపురుషుల కటాక్షము మరియు ఉపదేశములచే పెరుగుటకు పెట్టి పుట్టిరి.మన సంప్రదాయమును వారి తండ్రిగారైన వడక్కు తిరువీధి పిళ్ళైల శ్రీ చరణముల వద్దనే అభ్యసించిరి. ఆలానే ఈ ఇరువురి ఆచార్య సింహములకు ఒక్క ప్రత్యేక విశేషము ఏమనగా వారు జీవితాంతము నైష్ఠిక బ్రహ్మచారులు గా ఉంటామని ప్రతిజ్ఞ చేసిరి అట్లే ఉండిరి.

పిళ్ళై లోకాచార్యర్ ఈ సంసారమునందు జీవాత్మలు అనుభవించుతున్న బాధలను చూసి వారి అపారమైన కారుణ్యముతో మరియు వారి స్వప్నములో పెరియ పెరుమాళ్ళ ఇచ్చిన ఆఙ్ఞవలన,  మన సాంప్రదాయములోని రహస్యార్థములు ఏవైతే ఆచార్య ముఖేన శిష్యుడు నేర్చుకుంటాడో వాటనింటినికి గ్రంథములు రాసారు.

పిళ్ళై లోకాచార్యర్ మన సంప్రదాయమునకు నాయకుడై వారి శిశ్యులకు శ్రీరంగమునందు ప్రతి నిత్యం పాఠములను నేర్పుచుండిరి.మణప్పాక్కతు నమ్బి అనే ఒక శ్రీవైష్ణవుడు దేవపెరుమాళ్ దగ్గరికి చేరిరి,దేవపెరుమాళ్ అతనికి మన సాంప్రదాయము లోని అమూల్యమైన విషయములను కొన్నింటిని ఉపదేశించి , మిగిలినవి శ్రీ రంగం చేరిన తరువాత ఉపదేశించెదని చెప్పిరి. అప్పుడు నంబి శ్రీరంగమునకు తిరిగిప్రయాణమై కాట్టజగియ శింగర్ గుడి వద్దకు వచ్చి చేరిరి, అక్కడ పిళ్ళై లోకాచార్యుల కాలక్షేప గోష్టిని చూసిరి.ఒక స్తంభము వెనుక దాక్కొని, పిళ్ళై లోకాచార్యుల ప్రవచనమును వింటూ ఆశ్చర్యము చెందిరి,కారణము ఎక్కడైతె దేవ పెరుమాళ్ ఆపివేశారో అక్కడనుండే వారు చెప్పుతున్నారు. స్తంభములందు బయటకి వచ్చి ,పిళ్ళై లోకాచార్యుల శ్రీ చరణములందు సాష్టాంగము నమస్కారం చేసి ఈ విధముగా అడిగిరి “అవరో నీర్” (మీరు దేవ పెరుమాళ్ళా?) పిళ్ళై లోకాచార్యర్ సమాధానము “ఆవతు; యేతు?” (అవును,ఏమి చేయవలెను ఇప్పుడు?).ఆ విధముగా మనము పిళ్ళై లోకాచార్యర్ వేరెవరో కాదు వారే దేవపెరుమాళ్ళు అని తెలుసుకోవచ్చు.

యతీన్ద్ర ప్రవణ ప్రభావములో మరొక సంఘటన ద్వారా దేవ పెరుమాళ్ తానే పిళ్ళై లోకాచార్యులుగా అవతరించెనని రుజువు అవుతుంది. పిళ్ళై లోకాచార్యర్ జ్యోతిష్కుడి లో చివరిదశలో ఉన్నప్పుడు,నాలూర్ పిళ్ళైలను వ్యాఖ్యానమును తిరుమలై ఆళ్వార్లకు (తిరువాయ్ మొజి పిళ్ళై) ఉపదేశించమని ఆఙ్ఞాపించిరి. అప్పుడు తిరుమలై ఆళ్వార్ దేవ పెరుమాళ్ళ మంగళాశాసనము కొరకు వెళ్ళినప్పుడు, దేవ పెరుమాళ్ నాలూర్ పిళ్ళై ప్రక్కన నిలబడి ఉండగా స్వయముగా మాట్లాడి, ఈ విధముగా చెప్పెను “జ్యోతిష్కుడిలో నేను ఆదేశించిన ప్రకారముగా మీరు తిరుమలై ఆళ్వార్లకు అరుళిచెయల్ అర్థములను నేర్పించండి”.

పిళ్ళై లోకాచార్యులు ముముక్షుల( భగవత్ కైంకర్య మోక్షమును కోరుకునే వారు) ఉజ్జీవనము కొరకు ఎన్నో గ్రంథములను వ్రాసిరి.వారు ముఖ్యముగా మన సంప్రదాయము కొరకు 18 రహస్య గ్రంథములను వ్రాసిరి,అవే రహస్య త్రయము, తత్వ త్రయము, అర్థ పంచకము మరియు తిరువాయ్ మొజిని ఆధారముగా చేసుకొని లోతైన సంప్రదాయ అర్థములను వ్రాసిరి. వాటిలో క్రింద చెప్పబడినవి చాలా ముఖ్యముగా పరిగణించబడినవి~:

 • ముముక్షుపడి – రహస్య త్రయము చాలా వైభవముగా ఈ గ్రంథములో వివరించబడెను. మామునిగళ్ ఈ గ్రంథమునకు వివరమైన వ్యాఖ్యానము వ్రాసిరి. ప్రతీ శ్రీవైష్ణవులకి ఇది మూలాధారమైనది ,దీని సహయము లేనిదే మనము తిరుమంత్రము, ద్వయము మరియు చరమ శ్లోకముల గొప్పతనమును అర్థముచేసుకోలేము.
 • తత్వ త్రయము – దీనికి గల మరో పేరు కుట్టి భాశ్యము (చిన్న శ్రీ భాష్యము). పిళ్ళై లోకాచార్యర్ ముఖ్యముగా చిత్, అచిత్ మరియు ఈశ్వరన తత్వమును శ్రీభాష్యము మూలముగా చేసుకొని వివరించిరి.మరలా, మామునిగళ్ల వ్యాఖ్యానము లేనిదే ఈ గ్రంథము యొక్క గొప్పతనమును పూర్తిగా అర్థముచేసుకోలేము.
 • శ్రీవచన భూషణ దివ్య శాస్త్రము – ఈ గ్రంథము పూర్తిగా ఆళ్వారుల మరియు ఆచార్యుల వాక్కుల ఆధారంగా వ్రాయబడెను. ఇది పిళ్ళై లోకాచార్యుల మహత్తరమైన సత్ సాంప్రదాయ అర్థముల వివరణముగా విశదీకరించబడిన గ్రంథము.ఇది సంప్రదాయము యొక్క లోతైన అర్థములను వెలికితీయును,ఈ గ్రంథమునకు మామునిగళ్ దివ్యమైన వ్యాఖ్యానమును వ్రాసిరి. తిరునారాయణపురతు ఆయి కూడా ఈ గ్రంథమునకు వ్యాఖ్యానమును వ్రాసిరి.

శ్రీ వైష్ణవులు మన సాంప్రదాయము యొక్క విశిష్టతను అభినందిచుట కొరకు ఒక్కసారైనను ఈ గ్రంథము యొక్క వ్యాఖ్యానమును వినవలెను.

పిళ్ళై లోకాచార్యుల గొప్పతనము ఏమనగా, ఎవరికైనా దీని యెడల కోరిక ఉన్నట్టైతే చాలు చాలా సులభముగా అర్థము చేసుకొనే విధముగ వారు ఈ గ్రంథమును సులభ తమిళ (మణి ప్రవాళము) భాషలో వ్రాసిరి. ముముక్షువులు సంప్రదాయ అర్థములను తెలుసుకొనుటకు గల అవరోధములను గుర్తించినవారై,వారి ఆచార్యుల ద్వారా వినినది విన్నట్టుగా కరుణతో వ్రాసిరి– ఈ గ్రంథములోని గల అన్ని అర్థములని చూస్తే సూటిగా మనము వాటిని మన పూర్వాచార్య వ్యాఖ్యానములలో , ఈడు 36000 పడి వ్యాఖ్యానములు మరియు ఇతర పూర్వాచార్యుల గ్రంథములలో ( పిళ్ళై లోకాచార్యర్ కు పూర్వము) చూడవచ్చును. వారు కరుణతో అన్నిటినీ చేర్చి గ్రంథములను స్పష్టముగా మరియు సులభమైన భాషలో వ్రాసిరి. ఈ విధముగా మనము వీరిని ప్రమాణ రక్షణము (ఙ్ఞానమును రక్షించి/పెంచే )చేసిన ముఖ్య ఆచార్యులుగా అర్థము చేసుకోవచ్చును .

ఒక ప్రమాణ రక్షణము మాత్రమే కాకుండా,వారు పూర్తిగా ప్రమేయ రక్షణమును (ఎమ్పెరుమానులను రక్షించి/పెంచే) కుడా చేసిరి. శ్రీరంగము చక్కగా విలసిల్లుతునప్పుడు, ఒక్కసారిగా ముస్లిముల దండయాత్ర భయంకరమైన అగ్నివలె వ్యాపించెను.మహమ్మదీయుల రాజులు గుడి లోని సంపదను అపహరించుటలో పేరు మోసినవారు ,ఏమి చేయవలెనో తెలియక అందరు కలత చెందిరి.ఆలస్యము చేయక పిళ్ళై లోకాచార్యర్ (ఆ సమయములో వారే ముఖ్యమైన శ్రీవైష్ణవ ఆచార్యులు) పరిస్థితి ని అదుపులోకి తీసుకోవటానికి ప్రయత్నం చేసిరి .శ్రీవైష్ణవులను పెరియ పెరుమాళ్ళకు ఎదురుగా ఒక గోడను నిర్మించమని చెప్పి వారు నమ్పెరుమాళ్ మరియు ఉభయ నాచియారులతో కూడి దక్షిన భారతమునకు వెళ్ళిరి. వారు వృద్దాప్యమును కూడా లెక్కచేయక నమ్పెరుమాళ్ తో కూడి ప్రయాణమైరి. అప్పుడు వారు అడవుల వెంబడి ప్రాయాణించుచుండగా కొందరు దొంగలు వచ్చి నమ్పెరుమాళ్ళ ఆభరణములను దొంగిలించిరి. పిళ్ళై లోకాచార్యర్ కొంత దూరము వెళ్ళిన తదుపరి ఆ వార్తని విని తిరిగి వెనుకకు రాగా ఆ దొంగలు పిళ్ళై లోకాచార్యర్ లను చూసి మనసు మారి, ఆభరణములను తిరిగి వారికి ఇచ్చివేసెను.

తరువాత జ్యోతిష్కుడి (మదురై దగ్గర– ఆనై మలై ప్రదేశమునకు వెనుక) అనే ప్రదేశమునకు చేరిరి. పిళ్ళై లోకాచార్యర్ వయోతిగమ్ (పెద్ద వయసు) వలన ఆనారోగ్యముచే పరమపదము చేరుటకు నిర్ణయించుకొనిరి. వారి శిష్యులలో ఒకరైన తిరుమలై ఆళ్వార్ లను( తిరువాయ్మొజి పిళ్ళై)సాంప్రదాయమునకు తదుపరి నాయకుడిగా దిద్దుబాటు చేయాలని ఆలోచిస్తారు. వారు వారి శిశ్యులతో (ముఖ్యముగా కూర కులోత్తమ దాసర్),  తిరుమలై ఆళ్వార్ ను తన యొక్క పరిపాలన భాద్యతలనుండి తప్పించి దరిశన ప్రవర్తకర్ గా సంస్కరించమని ఆదేశించిరి.అక్కడే వారు తమ యొక్క చరమ తిరుమేనిని వదిలి పరమపదమునకు బయలుదేరిరి.

జ్యోతిష్కుడి – పిళ్ళై లోకాచార్యర్ పరమపదము చేరిన ప్రదేశము

మణవాళ మామునిగళ్ ఉపదేశ రత్తిన మాలైలో పిళ్ళై లోకాచార్యర్ మరియు వారి యొక్క శ్రీవచన భూషణ దివ్య శాస్త్రముల గొప్పతనమును గురించి వ్రాసిరి. వారు ఆళ్వారుల ఆచార్యుల అవతారముల గురించి, మన సంప్రదాయంను ఆశ కలిగిన వారందిరికి అందేతట్టుగా దానిని విస్తరింపచేసిన మహా నీయులైన ఎమ్ఫెరుమానురుల కృప గురించి , తిరువాయ్ మొజి యొక్క వ్యాఖ్యాన అవతారములను గురించి , మరియు పిళ్ళై లోకాచార్యర్ అవతారము , శ్రీవచన భూషణ దివ్య శాస్త్రము యొక్క గొప్పతనమును,వాటి అర్థ విశేషముల గురించి వివరించారు. చివరగ మనము అందులో చెప్పిన విధముగా మన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి అట్లు జీవించ గలిగితే మనము ఎమ్పెరుమానురుల కృప కు సత్ పాత్రములు కాగలము పూర్వాచార్యుల ఙ్ఞానమ్ మరియు అనుష్టానము నందు పరిపూర్ణమైన విశ్వాసం లేక,తోచిన విధముగా తర్కముచే స్వంత అర్థములను సృష్టించితే ,అట్టి వారులను అవివేకులని పిల్చుదురు
అని చెప్పిరి.మామునిగళ్ ఎప్పుడూ అప శబ్దములను వాడరు(అవివేకి అను పదములు మొద,) అట్టి వారు , కఠినమైన (“మూర్కర్ “- మూర్ఖులు ) పద ప్రయోగం ఇక్కడ చేసారు,ఇది పూర్వాచార్యులందు నమ్మకము లేక నటించడము/మాట్లడడము ఎంతటి కౄరత్వమైన చర్యయో సూచించును.ఇదీ మామునిగళ్ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రము యొక్క సారమును తన అద్బుతమైన ఉపదేశ రత్తిన మాలై ప్రభందమున తెలిపిరి.

వేదాన్తాచార్యర్ (నిగమాన్త మహా దేశికన్) ఒక అద్భుతమైన ప్రబంధమును వ్రాసిరి, లోకాచార్య పంచాశత్ పిళ్ళై లోకాచార్యర్ ల కీర్తిని తెలియచేయును. వేదాన్తాచార్యర్ సుమారు 50 సంవత్సరములు పిళ్ళై లోకాచార్యర్ల కన్నా చిన్నవారు వారిని గొప్పగా ప్రశసించడం, ఈ గ్రంథము ద్వారా మనము సులభముగా అర్థము చేసుకోవచ్చును,ఇప్పటికినీ తిరునారాయణపురములో రోజూ ఈ గ్రంథము పఠించుదురు. సులభమైన ఆంగ్ల అనువాదము కొరకు లోకాచార్య పంచాశత్ శ్రీ U.Ve T C A Venkatesan swamy based on Shri U.Ve V V Ramanujam swamy can be downloaded fromhttp://acharya.org/books/eBooks/vyakhyanam/LokacharyaPanchasatVyakhyanaSaram-English.pdf.

ఈ విధముగా మనము పిళ్ళై లోకాచార్యర్ యొక్క అపారమైన కీర్తిని,తమ జీవితాన్ని ప్రమాణ రక్షణము మరియు ప్రమేయ రక్షణమునకై అర్పించిన విధమును అర్థముచేసుకోవచ్చును. ఎవరైనా ఒకరు మేము శ్రీవైష్ణవులము అని చెప్పుటకు ముందు ఎల్లప్పుడూ పిళ్ళై లోకాచార్యర్లకు వారు తప్పక కృతఙ్ఞతను (ఉపకార స్మ్రితి) చెప్పవలెను, కారణము వారులేకపోతే మనము నమ్పెరుమాళ్ళ్ని కాని ఎమ్పెరుమానార్ దరిశనమ్ యొక్క లోతైన అర్థములను కాని తెలుసుకోలేకపోయేవారము.

మనకు ఎల్లప్పుడు ఎమ్పెరుమానారులందు మరియు మన ఆచార్యులందు ఆ విధమైన సంభందమును కలిగేలా పిళ్ళై లోకాచార్యుల శ్రీ చరణములను ఆశ్రయించుదాము.

పిళ్ళై లోకాచార్యుల తనియన్:

లోకాచార్య గురవే క్రిష్ణ పాదస్య సూనవే!
సంసార భోగి సంతష్ట జీవ జీవాతవే నమ: !!

லோகாசார்ய குரவே க்ருஷ்ண பாதஸ்ய ஸூநவே
ஸம்ஸார போகி ஸந்தஷ்ட ஜீவ ஜீவாதவே நம~:

మంగళాశాసనము పిళ్ళై లోకాచార్యులకు వారి గోష్టికి

వాజి ఉలగాసిరియన్ వాజి అవన్ మన్ను కులమ్
వాజి ముడుమ్బై ఎన్ను మానగరమ్
వాజి మనమ్ చూజ్న్త పేరిన్బ మల్గుమిగు నల్లార్
రిణమ్ శులున్దుమ్ ఇరుక్కుమ్ ఇరుప్పు

మన తదుపరి సంచికలో, తిరువాయ్ మొజి పిళ్ళై వైభవమును చూద్దాము.

అడియేన్ :
రఘు వంశీ రామానుజదాసన్.

Source:

తిరువాయ్ మొజి పిళ్ళై

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలొ  మనము పిళ్ళై లోకాచార్యుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

తిరువాయ్ మొజి పిళ్ళై -కుంతీనగరము (కొంతగై)

తిరునక్షత్రము:వైశాఖ మాసము,విశాఖ నక్షత్రము

అవతార స్థలము: కుంతీనగరము (కొంతగై)

ఆచార్యులు :పిళ్ళై లోకాచార్యర్

శిశ్యులు: అజగియ మణవాళ మామునిగళ్, శఠగోప జీయర్ (భవిశ్యదాచార్యన్ సన్నిది), తత్వేస జీయర్, మొద,,

పరమపదం చేరిన స్థలము: ఆళ్వార్ తిరునగరి

శ్రీ సూక్తులు: పెరియాళ్వార్ తిరుమొజి స్వాపదేశము.

తిరుమలై ఆళ్వార్ గా జన్మించిరి, శ్రీశైలేశర్, శఠగోప దాసర్ గ వ్యవహరింపబడి తుదకు ఆళ్వారులకు తిరువాయ్ మొజిపై గల శ్రద్దకు మరియు దానిని విస్తరించడములో వారు సల్పిన కృషికి ఫలితముగా తిరువాయ్ మొజి పిళ్ళైగా ప్రసిద్దిగాంచిరి.

తిరుమలై ఆళ్వార్ తన చిన్న వయస్సులోనే పిళ్ళై లోకాచార్యుల శ్రీ చరణముల వద్ద పంచ సంస్కారములను పొందెను.వీరు తమిళములో గొప్ప పండితులు మరియు గొప్ప పరిపాలనాధ్యక్షులు .వీరు సంప్రదాయమునుండి వేరుపడి మధురై రాజ్యమునకు ముఖ్య సలహాదారుడిగా నియమించబడెను,ఆ రాజు చిన్న వయస్సులో మరణించడము వలన తన కూమారుల సంరక్షణ భాధ్యతలను తిరుమలై ఆళ్వారులకు అప్పగించెను. పిళ్ళై లోకాచార్యర్ తన చివరి రోజులలో,తన దివ్యమైన కరుణను తిరుమలై ఆళ్వారులపై ప్రసరించి మన సంప్రదాయమునకు నాయకుడిగా నియమించవలెనని కూర కులోతమ దాసర్ మరియు ఇతర శిశ్యులను ఆఙ్ఞాపించిరి. కూర కులోతమ దాసర్ తిరుమలై ఆళ్వారులను కలిసి సంస్కరించుటకు ప్రయత్నం మొదలుపెట్టారు .

ఆ సమయములో(మహమ్మదీయుల దండయాత్ర ముగిసిన కొద్దికాలమునకు), నమ్మాళ్వారులు ఆళ్వార్ తిరునగరి నుండి వచ్చి నమ్పెరుమాళ్ళతో కొంతకాలము కోజికోడ్ లో ఉండెను.కాని అప్పుడు నమ్పెరుమాళ్ళు అక్కడినుండి బయలుదేరపోతే,అక్కడి స్తానిక ప్రజల మద్యన భేదాభిప్రాయంలవలన, ఆళ్వార్ వారి వెంట ప్రయణము చేయలేక పోయెను. ఆ సమయములో, ఆళ్వార్లను తీసుకొని దక్షిణ పడమర  కొండలు గల ప్రదేశమునకు వెళ్ళునప్పుడు దోపిడి దొంగల భయముచే వారిని ఒక పెట్టెలో ఉంచి ఒక చిన్న రాతికొండ క్రింద భద్రపరచిరి. తదుపరి కొంతకాలమునకు , తోజప్పర్ అనే ఒక శ్రీవైష్ణవుడు నమ్మాళ్వారులపై గల అనుభందముచే, తిరుమలై ఆళ్వారుల వద్దకు వచ్చి, నమ్మాళ్వారులను తీసుకురావడము కొరకు రక్షణగా కొందరు సైనికులను తనతోపాటు పంపమని అభ్యర్తించిరి. తిరుమలై ఆళ్వార్ సంతోషముతో వారిని ఏర్పాటుచేయగ తోజప్పర్ ఆ కొండ గల ప్రదేశమునకు దారినిచూపిరి. అప్పుడు అందరూ ఆ కొండక్రిందికి వెళ్ళుటకు భయపడుచుండగా తోజప్పర్ స్వతంత్రముగా తానే క్రిందికి వెళ్ళెను. ఆ సమయములో,ఆళ్వార్ తిరునగరి నుండి వచ్చిన శ్రీవైష్ణవులు  తోజప్పర్ని అభినందించి ఈ విధముగా చెప్పెను మీరు చేసిన కృషికి ఈ దినమునుండి ఆళ్వారుల యొక్క ప్రత్యేక మర్యాద/ప్రసాదము లభించును. వారు ఒక తాడు సహాయముతో క్రిందికి వెళ్ళి, నమ్మాళ్వారులను పదిలముగా పైకిపంపిరి.అప్పుడు రెండవ సారి ఆ తాడును క్రిందికి పంపి తోజప్పరును తీసుకువస్తుండగా ఎలాగో జారి కొండక్రింద పడి వెంటనే పరమపదమును చేరిరి. నమ్మాళ్వారులు వెంటనే తోజప్పరుల కుమారులను సమాధానపరిచి ,తామే తోజప్పరుల కుమారులకు తండ్రిగా ఉంటామనిరి .ఆ విధముగా తోజప్పరుల కృషివలన( తిరుమలై ఆళ్వారుల సహాయముతో) నమ్మాళ్వారులను తిరిగి తిరుక్కనంబికి తీసుకురాగా అప్పడినుండి వారు అక్కడనే ఉండిరి.

ఇప్పుడు తిరుమలై ఆళ్వారుల గురించి.ఒకసారి తిరుమలై ఆళ్వార్ దిన చర్య గా పలకి లో కూర్చోని పరిక్రమణ చేస్తూ వచ్చు చుండగా కూర కులోతమ దాసర్ ఆళ్వారుల తిరువిరుత్తమును సేవించడం  గమనించిరి.పిళ్ళై లోకాచార్యుల దీవెనలు తిరుమలై ఆళ్వార్ పై పరిపూర్ణముగా ఉండడము వల్ల,వారు దాసరుల గొప్పతనము గ్రహించి,పల్లకినుండి దిగి దాసరులను తిరువిరుత్తముల అర్థములను తెలుపమని అభ్యర్తించిరి,కాని దాసర్ ఇప్పుడు ఉపదేశించడము వీలుకాదని చెప్పిరి దానితో కొద్దిగా వాగ్వాదము జరిగెను.అది చూసి వారి సేవకులు దాసరులకి హాని తలపెట్ట పోగా ,తిరుమలై ఆళ్వార్ సాత్వికుడుగా ఉండడమువలన వారిని వారించి అక్కడినుండి వెళ్ళిపోయెను.తదుపరి వారు తమ పెంచిన తల్లికి జరిగిన సంఘటనను తెలుపగా వారు పిళ్ళై లోకాచార్యులతో గల సంబంధమును గుర్తుకుచేసిరి. తిరుమలై ఆళ్వార్ వెంటనే తను ఇంత వరకు ఏమి కోల్పోయినది గ్రహించి దుఖించిరి. మరలా, ఒక నాడు తిరుమలై ఆళ్వార్ ఏనుగుపై ప్రయాణించుచుండగా ,వారు దాసర్ ని చూసిరి.అప్పుడు వెంటనే క్రిందికు దిగి దాసరుల శ్రీ చరణముల వద్ద సాష్టాంగ ప్రణామమును సమర్పించిరి. దాసర్ అప్పుడు వారికి అన్ని అర్థములను ఉపదేశించుటకు అంగీకరించిరి. తిరుమలై ఆళ్వార్ వారి తిరువారాధనము కొరకై ఒక అగ్రహారమును  అన్ని వసతులతో ప్రత్యేకముగా నిర్మించిరి.పరిపాలనయందు తీరిక లేనివాడైనందుకు , దాసరులను తను తిరుమణి కాపు ధరించే సమయములో ప్రతినిత్యము రావలేనని కోరెను. మొదటిసారి దాసర్ వచ్చినప్పుడు తిరుమలై ఆళ్వార్ తిరుమణ్ కాప్పును పెట్టుకొనునప్పుడు పిళ్ళై లోకాచార్యుల  తనియను చదువుతూ పెట్టుకోవడము గమనించి సంతోషము చెందిరి.అప్పడినుండి వారు పిళ్ళై లోకాచార్యుల వద్ద నేర్చుకొన్న ఙ్ఞానమును క్రమము తప్పక తిరుమలై ఆళ్వారులకి ఉపదేశించిరి.ఒకసారి తిరుమలై ఆళ్వార్ పనిలో ఉండడమువలన ఆరోజు పాఠమునకు వెళ్ళలేకపోయెను, దాసర్ కూడా మరుసటి దినము నుండి పాఠము చెప్పుటకు వెళ్ళలేదు. అప్పుడు తిరుమలై ఆళ్వార్ దాసర్ దగ్గరకి వెళ్ళి అపరాద క్షమాపనమును అడుగగా, దాసర్ క్షమించి వారికి తన శేష ప్రసాదమును ఇచ్చిరి.అప్పడినుండి, తిరుమలై ఆళ్వార్ లౌకిక బంధములను విడచి, తన పూర్తి అధికారమును యువరాజునకు అప్పగించి రాజ్యమును వదిలి దాసరులతో తమ పూర్తి సమయమును గడిపిరి.

దాసర్ చివరి దశలో, తిరుమలై ఆళ్వారులను తిరుక్కణ్ణన్గుడి పిళ్ళై వద్దకి వెళ్ళి తిరువాయ్ మొజిని వివరముగా మరియు విళన్చోలై పిళ్ళైల వద్ద రహస్య అర్థములను నేర్చుకోవలసినదిగా ఆఙ్ఞాపించిరి. వారిని మన సంప్రదాయమునకు నాయకుడిగా నియమించిరి.దాసర్ పరమపదమునకి చేరిన తదుపరి పిళ్ళై లోకాచార్యులను ధ్యానిస్తు, తిరుమలై ఆళ్వారులు అన్ని చరమ కైంకర్యములను చాలా గొప్పగా నిర్వహించిరి.

తిరుమలై ఆళ్వార్ తిరుక్కణ్ణన్గుడి పిళ్ళై దగ్గరికి వెళ్ళి తిరువాయ్ మొజిని నేర్చుకోవడము మొదలుపెట్టిరి. పిళ్ళై దాని సారమును మాత్రమే చెప్పుతుండగా, తిరుమలై ఆళ్వార్ ప్రతీ పదమునకు అర్థమును అడుగగా, పిళ్ళై తిరుప్పుట్కుజి జీయర్ వద్దకి వెళ్ళి నేర్చుకోమని చెప్పెను. తిరుమలై ఆళ్వార్ తిరుప్పుట్కుజి వెళ్ళగా,అనుకోకుండా వారు వెళ్ళుటకుమునుపె జీయర్ పరమపదమునకు చేరిరి. తిరుమలై ఆళ్వార్ చాలా బాధపడి దేవ పెరుమాళ్ళకు మన్గళాశాసనము చేయుటకు వెళ్దామని నిశ్చయించుకొనిరి. వారు అక్కడకు వెళ్ళగానే ప్రతీఒక్కరు సాదరముగా ఆహ్వానించిరి, దేవ పెరుమాళ్ తనయొక్క శ్రీ శఠగోపము, మాలై, సాత్తుపడి మొద,, వారికి ఇచ్చిరి.ఆ సమయములో నాలూర్ పిళ్ళై సన్నిదిలో ఉండిరి. (గమనిక~: నమ్పిళ్ళై ఈడు వ్యాఖ్యానమును ఈయుణ్ణి మాదవ పెరుమాళ్ళ్ కి ఇచ్చిరి,వారు తమ కుమారులైన ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ళకి ఉపదేశించిరి. నాలూర్ పిళ్ళై ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ళకు శిశ్యులు,వారు ఈడు వ్యాఖ్యానమును పూర్తిగా తమ కుమారులైన నాలూర్ ఆచాన్ పిళ్ళై లకి ఉపదేశించిరి.) దేవ పెరుమాళ్ స్వయముగా నాలూర్ పిళ్ళైలతో మాట్లాడి ఈ విధముగా చెప్పెను “ జ్యోతిష్కుడిలో నేను చెప్పిన విధముగా ( పిళ్ళై లోకాచార్యుల వలె) మీరు తిరుమలై ఆళ్వారులకు అరుళిచెయల్ మొత్తము అర్థములను తిరువాయ్ మొజి ఈడు వ్యాఖ్యానమును తిరుప్పుట్కుజి జీయర్ దగ్గర నేర్చుకోలేకపోవడము వలన పూర్తిచేయమని ఆఙ్ఞాపించిరి”. అదివిని నాలూర్ పిళ్ళై తన అదృష్టముగా భావించుదునని, కాని తన వృద్దాప్యము వలన తిరుమలై ఆళ్వారులకు సరిగా చెప్పలేనేమోనని అనిరి. అప్పుడు దేవ పెరుమాళ్ ఈ విధముగా అనిరి “మీ కుమారుడు నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై చెప్పిననూ మీరు చెప్పిన విధముగానే ఉండును”. దైవాఙ్ఞగా విని , నాలూర్ పిళ్ళై తిరుమలై ఆళ్వారులను అంగీకరించి చాలా సంతోశముతో నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై వద్దకు తీసుకు పోయి ఈడు మరియు ఇతర అరుళిచెయల్ అర్థములను ఉపదేశించమని వారిని ఆఙ్ఞాపించిరి .

నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై (దేవరాజర్ అనికూడా వ్యవహరించుదురు) అర్థములను ఉపదేశించడము మొదలుపెట్టిరి, ఈ విషయము తెలుసుకొని తిరునారాయణపురతు ఆయి, తిరునారాయణపురతు పిళ్ళై మరియు ఇతరులు  నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై మరియు తిరుమలై ఆళ్వారులను  తిరునారాయణ పురమునకు వచ్చి అక్కడ కాలక్షేపమును చెప్పడము వలన మేము వివరముగా నేర్చుకొనుటకు అవకాశము ఉంటుందని అభ్యర్తించిరి. వారి అభ్యర్తనని మన్నించి తిరునారాయణ పురమునకు చేరి,  ఎమ్పెరుమానారుకు, యదుగిరి నాచ్చియార్, శెల్వ పిళ్ళై మరియు తిరునారణనులకు మంగళాశాసనమును చేసి పూర్తి కాలక్షేపమును అక్కడ నిర్వహించిరి. అక్కడ తిరుమలై ఆళ్వార్ ఈడును పూర్తిగా నేర్చుకొని వారి సపర్యల ద్వారా ఆచార్యులను సంతోశపరిచిరి, నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై తమ తిరువారాదన పెరుమాళ్ళని (ఇనవాయర్ తలైవన్)  తిరుమలై ఆళ్వారులకు ఇచ్చిరి.ఆ విధముగా ఈడు 36000 పడి  నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై ద్వారా 3 గొప్ప పండితులకు విస్తరించెను – తిరుమలై ఆళ్వార్, తిరునారాయనపురతు ఆయి మరియు తిరునారాయనపురతు పిళ్ళై.

తిరుమలై ఆళ్వార్  ఆళ్వార్ తిరునగరికి తిరిగి వెళ్ళి అక్కడే నివసించుటకు నిర్ణయించుకొనిరి.నమ్మాళ్వార్ ఆళ్వార్ తిరునగరి ని విడచి వెళ్ళిపోయినప్పటి నుండి ఆ ప్రదేశము అంతయు ఒక అడవిగా మారిపొయినది. అక్కడికి చేరిన వెంటనే అక్కడ ఉన్న పొదలను , చెట్లను తొలగించి దానిని మరల ఒక సుందరమైన ఆళ్వార్ తిరునగరి గా రూపొందించిన కారణము వలన వారికి కాడు వెట్టి గురు అనే బిరుదు ను ఇచ్చారు (కారణము అడవిని శుభ్రమును చేసిన ఆచార్యులు ). వారు నమ్మాళ్వారులను తిరిగి తిరుక్కణమ్బి ( కేరళలోని) నుండి ఆళ్వార్ తిరునగరికి తెచ్చి గుడిని మరలా నెలకొలిపి ఆరాధించిరి.వారు ఎమ్పెరుమానారులకు (భవిష్యదాచార్యుల తిరుమేని  నమ్మాళ్వారులు చాలా క్రితము ఇచ్చినది)  ఆళ్వార్ తిరునగరి దక్షిణమున గుడిని నిర్మించి,చతుర్వేది మంగలము (4 వీధులు గుడి చుట్టూ) మరియు 10 కుటుంబాలను ఏర్పరిచి,  ఒక శ్రీవైష్ణవ అమ్మైయారును( విధవ) గుడిలో కైంకర్యములకు తదుపరి వారికి సహాయముగా పెట్టిరి. వారు నమ్మాళ్వారుల కీర్తిని పాడటం మరియు తిరువాయ్ మొజిని ఉపదేశించడమువలన తిరువాయ్ మొజి పిళ్ళైగా వ్యవహరింపబడిరి.

కొంతకాలము తరువాత, తిరువాయ్ మొజి పిళ్ళై తిరువనంతపురమునకు వెళ్ళి అక్కడ పిళ్ళై లోకాచార్యుల ముఖ్య శిశ్యుడు విళాన్చోలై పిళ్ళైని కలసి రహస్య గ్రంథములను నేర్చుకోదలచిరి. విళాన్చోలై పిళ్ళై ఎల్లప్పుడూ వారి ఆచార్యులను ధ్యానం చేస్తూ ఉండేవారు,వారు సంతోషముతో తిరువాయ్ మొజి పిళ్ళైని ఆహ్వానించిరి. విళాన్చోలై పిళ్ళై అన్ని లోతైన అర్థములను వారికి ఉపదేశించి వారిని సంపూర్ణముగా ఆశీర్వదించిరి. తదుపరి తిరువాయ్ మొజి పిళ్ళై ఆళ్వార్ తిరునగరికి తిరిగివచ్చిరి. ఆ తరువాత విళాన్చోలై పిళ్ళై తమ చరమ తిరుమేనిని వదిలి నిత్య విభూతిలో ఆచార్యులకు ఎల్లపుడూ సేవచేయుటకు వెళ్ళిరి.అది విని, తిరువాయ్ మొజి పిళ్ళై చరమ కైంకర్యములను వారికి నిర్వహించిరి.

కొంతకాలము తరువాత పెరియ పెరుమాళ్ ఆదిశేశులని సంసారము నుండి జీవాత్మాలను పరమపదమును తెచ్చుటకై మరలా అవతరించమని ఆఙ్ఞ్ఙాపించిరి. తిరువనంతాళ్వాన్ తమ స్వామి యొక్క ఆఙ్ఞను శిరసావహిస్తూ అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ (అజగియ మణవాళ మామునిగళ్) తిగజ కిడన్తాన్ తిరునావీరుడయ పిరాన్ ( గోమడతాళ్వాన్ పరంపర,ఎమ్పెరుమానార్ ఎర్పరచిన 74 సింహాసనాదిపతులలో ఒక వంశము) మరియు శ్రీరంగ నాచియారులకు ఐప్పసి తిరుమూలము నందు ఆళ్వార్ తిరునగరిలో జన్మించిరి. వారు కొంత కాలము వారి అమ్మమ్మ గారి ఊరైన సిక్కిల్ కిడారమ్ లో పెరిగి సామాన్య శాస్త్రము మరియు వేద అధ్యాయనమును వారి తండ్రివద్ద అభ్యసించిరి. తిరువాయ్ మొజి పిళ్ళైల గురించి విని, అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఆళ్వార్ తిరునగరికి తిరిగి వచ్చి, వారికి శిశ్యులుగా మారిరి, సపర్యలు మొదలు పెట్టి వారి వద్ద అరుళిచెయల్ అర్థములను మొత్తము నేర్చుకొనిరి.తిరువాయ్ మొజి పిళ్ళై సలహాల ద్వారా,భవిశ్యదాచార్యులకు అత్యంత భక్తి మరియు ప్రేమతో తిరువారాధనమును చేస్తూ ఎమ్పెరుమానారుల కీర్తి విషయమై యతిరాజ వింశతిని వ్రాసిరి. కొందరు తిరువాయ్ మొజి పిళ్ళై శిశ్యులు ఎందుకు మా ఆచార్యులు అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తో చాలా అనుబంధముగా ఉంటారని ఆశ్చర్యము చెందగా, తిరువాయ్ మొజి పిళ్ళై అది గ్రహించి వారికి ఆదిశేశులే ఈ విధముగా అవతరించిరని వివరించిరి.

వారి చివరి దశలో, తిరువాయ్ మొజి పిళ్ళై, మన సంప్రదాయమునకు తన తదుపరి ఎవరు నిర్వహిస్తారని కలతచెందుచుండిరి.ఆ సమయములో, అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు తానే బాధ్యతలను నిర్వహించుదునని మరియు వారి కోరికలను పూర్తిచేయుదునని వాగ్దానమును చేసిరి.అదివిని చాలా సంతోషముచెంది, తిరువాయ్ మొజి పిళ్ళై వారిని శ్రీభాష్యమును ఒకసారి నేర్చుకోమని కాని తిరువాయ్ మొజి మరియు వాటి వ్యాఖ్యానములపై ఎల్లప్పుడూ ద్యాసను ఉంచవలెనని, మిగిలిన జీవితమును శ్రీరంగములోని పెరియ పెరుమాళ్ళకు మంగళాశాసనమును చేయవలెనని ఆఙ్ఞాపించిరి. తిరువాయ్ మొజి పిళ్ళై తన ఇతర శిశ్యులకు అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లను ప్రత్యేక అవతారముగా గుర్తించి వారితో చాలా గౌరవముగా ఉండమని చెప్పిరి. ఆ తరువాత, పిళ్ళై లోకాచార్యుల తిరువడిని ధ్యానించి, తిరువాయ్ మొజి పిళ్ళై తమ చరమ తిరుమేనిని వదిలి పరమపదమును చేరిరి. అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ మరియు ఇతర శిశ్యులు వారికి చరమ కైంకర్యమును గొప్పగా జరిపించిరి.

ఎమ్పెరుమానారులు ఏవిధముగా పెరియ నమ్బి (పరాంకుశ దాసర్)వద్ద ఆదరువు పొందిరో , అజగియ మణవాళ పెరుమాళ్ నాయనారులు తిరువాయ్ మొజి పిళ్ళై (శఠగోప దాసర్)వద్ద ఆదరువును పొందిరి.వారి కృషి వలన మనము ఆళ్వార్ తిరునగరిని ,ఆతినాథర్ ఆళ్వార్ గుడి మరియు భవిశ్యదాచార్యన్ (ఎమ్పెరుమానార్) గుడిని ప్రస్తుత రూపములో చూస్తున్నాము. వారు తమ జీవితమును పూర్తిగా నమ్మాళ్వారులపై మరియు తిరువాయ్ మొజికి అర్పించిరి,వారు పిళ్ళై లోకాచార్యుల ఆఙ్ఞగా చాలా ప్రదేశములకు వెళ్ళి చాలా మంది ఆచార్యుల ఉపదేశములు సేకరించిరి చివరగా వాటిని అజగియ మణవాళా పెరుమాళ్ నాయనార్ భవిషత్తు లో అజగియ మణవాళ మామునిగా మారబోతున్నారో వారికి ఇచ్చిరి. తిరువాయ్ మొజి పిళ్ళై కృషి వలన మనము ఈడు 36000 పడి వ్యాఖ్యానమును పొందితిమి, తదుపరి అజగియ మణవాళ మామునిచే ఎంతో ఎత్తునకు చేరినది.

ఎమ్పెరుమానారులతో మరియు మన ఆచార్యులతో మనకూ అలాంటి అనుబంధమూ కలిగేలా తిరువాయ్ మొజి పిళ్ళైల శ్రీ చరణములను ప్రార్థిద్దాము .

తిరువాయ్ మొజి పిళ్ళైల తనియన్ :

నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే !
ప్రసాదలబ్ద పరమ ప్రాప్య కైంకర్యశాలినే !!

நம ஸ்ரீஸைலநாதாய குந்தீ நகர ஜந்மநே
ப்ரஸாதலப்த பரம ப்ராப்ய கைங்கர்யஸாலிநே

మన తదుపరి సంచికలో అజగియ మణవాళ మామునిగళ్ వైభవమును చూద్దాము.

అడియేన్ :
రఘు వంశీ రామానుజదాసన్.

source:

పొన్నడిక్కాల్ జీయర్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రిందటి సంచికలో అళగియ మణవాళ మామునిగళ్ గురించి తెలుసుకున్నాము . ఈరోజు వారికి ప్రాణ సుక్రుత్ అయిన వారైన శ్రీ వానమామలై జీయర్ స్వామి వారి గురించి తెలుసుకుందాం .

పొన్నడిక్కాల్ జీయర్ - వానమామలై

పొన్నడిక్కాల్ జీయర్ – వానమామలై

పొన్నడిక్కాల్ జీయర్ - తిరువల్లికేణి

పొన్నడిక్కాల్ జీయర్ – తిరువల్లికేణి

తిరు నక్షత్రం  : భాద్రపద మాసము, పునర్వసు  నక్షత్రము
అవతారస్థలం : వానమామలై
ఆచార్యులు: అళగియ మణవాళ మామునిగళ్
శిష్యులు : చోలసింహపురం మహార్యర్(దొడ్డాచార్యర్), సమరభుంగవాచార్యర్, శుద్ధ సత్త్వం అణ్ణ, జ్ఞానక్కణ్ణత్తాన్, రామానుజం పిళ్ళై, పళ్ళక్కాయ్ సిద్ధర్, గోష్టి పురత్తైయర్ మరియు అప్పాచిఆరాణ్ణా మొదలగు వారు
పరమపదించిన ప్రదేశము : వానమామలై
శ్రీ సూక్తి గ్రంధములు : తిరుప్పావై స్వాపదేశ వ్యాఖ్యానము

అళగియ వరదర్ అను పేరుతో జన్మించి పొన్నడిక్కాల్ జీయర్ అను పేరుతో ప్రసిద్ధి పొందారు. వానమామలై జీయర్, వానాద్రి యోగి, రామానుజ జీయర్, రామానుజ ముని మొదలగు పేర్లతో వీరు కీర్తింపబడురు. వీరు అళగియ మణవాళ మామునిగళ్ వారికి మొట్ట మొదటి మరియు ముఖ్యమయిన శిష్యులు.

అళగియ మణవాళ మామునిగళ్ వారు గృహస్తుడిగ ఉన్నప్పుడు వారికి మొదటి శిష్యులయ్యిరి.అళగియ వరదర్లు వెంటనే సన్యాసాశ్రమమును స్వీకరించి వారి జీవితములో ఎక్కువ భాగము మాముణులతో ఉండేను.పొన్నడిక్కాల్ అనగా బంగారు పాదము. మొట్ట మొదటి శిష్యుడు అయి మామునిగళ్ శిష్య సంపదకు పునాది వేసినందుకు కారణముగా వీరిని పొన్నడిక్కాల్ అను పేరు తో పిలుచుదురు.  వీరు ఎన్నో తొతాద్రి మఠములను భారత దేశము అంతటా స్ధాపించి మన సంప్రదాయమును ప్రచారం చేసారు.

మామునిగళ్ అప్పుడు మొదటిసారి తిరుమలై యాత్రను చేయదలచిరి, పెరియ కేళ్వి అప్పన్ జీయర్ ఒక స్వప్నమును చూసెను,అందులో ఒక గృహస్తర్ పడుకొని ఉండగా వారి పాద పద్మములయందు ఒక సన్న్యాసి నిలబడి ఉన్నారు. జీయర్ అక్కడి ప్రజలను వారిరువురు ఎవరు అని అడుగగా, వారు ఈ విధముగ చెప్పెను ఒకరు “ఈట్టు పెరుక్కర్” అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ మరియు ఇంకొకరు నాయనార్ స్వయంగా పొన్నడిక్కాల్ జీయర్ అని పిలిచే మహానుభావులు.

పొన్నడిక్కాల్ జీయర్ ఎంతో మంది ఆచార్యులను మామునిగాల్ వద్దకు చేరుటకు పురుషకారముగా ఉండెను. యతీన్ద్ర ప్రవణ ప్రభావములో ఎంతో మంది శ్రీవైష్ణవులు పొన్నడిక్కాల్ జీయర్ ద్వారా మామునిగళ్ళకు సంబంధమును పొందిరని మరియు వారిని కైంకర్యమును చేయుటకు సహాయపడిరని చూడగలము.

కన్దాడై అణ్ణన్ మరియు వారి యొక్క బంధువులు మామునిగళ్ కి శిశ్యులుగా చేరిన తదుపరి, మామునిగళ్ పొన్నడిక్కాల్ జీయర్ ను తన యొక్క ప్రాణ సుక్రుత్ అని వారికి తమ వలె ఘనత /గౌరవమ్ చెందాలని చెప్పిరి. అప్పాచిఆరణ్ణా మామునిగళ్ వద్ద్డకు శిశ్యుడిగా మారుటకు రాగా, మామునిగళ్ పొన్నడిక్కాల్ జీయర్ ను పిలచి,వారి ఆసనముపై కూర్చోబెట్టి, వారికి తమ ఒక్క శంఖము మరియు చక్రము ఇచ్చి అప్పాచిఆరాణ్ణాకి సమాశ్రయణమును అనుగ్రహించమని ఆదేశించిరి. పొన్నడిక్కాల్ జీయర్ మొదట వినయం తో నిరాకరించినప్పడికినీ,మామునిగళ్ళ కోరికను చూసి,సమాశ్రయణమును అప్పాచిఆరణ్ణాకు మరియు ఇతరులకు అనుగ్రహించిరి.అలానే మామునిగళ్ పొన్నడిక్కాల్ జీయర్ కు అష్ట దిగ్ గజన్గళ్ ని నియమించిరి (వారికి ఎనిమిది మంది శిష్యుల మాదిరి) – చోలసింహపురం మహార్యర్(దొడ్డాచార్యర్), సమరభున్గవాచార్యర్, శుద్ధ సత్త్వం అణ్ణ, జ్ఞానక్కణ్ణత్తాన్, రామానుజం పిళ్ళై, పళ్ళక్కాయ్ సిద్ధర్, గోష్టి పురత్తైయర్ మరియు అప్పాచిఆరాణ్ణా

ఒక్కప్పుడు మామునుగళ్ అప్పాచిఆరణ్ణాని శ్రీరంగమును వదిలి కాంచీపురమునకు వెళ్ళమని ఆదేశించిరి,అది విని వారు విచారపడిరి.ఆ సమయములో మామునిగళ్ అప్పాచిఆరణ్ణాను తన యొక్క పాత రామానుజన్ (మన సాంప్రదాయములో తీర్త సొమ్బుని రామానుజన్ అని అందురు)తీసుకొమ్మని అడిగిరి,అది చాలా కాలము పొన్నడిక్కాల్ జీయర్చే ఆరాదించబడినది.దానిని తమ యొక్క రెండు చిన్న అర్చా తిరుమేనిలను(మామునిగళ్)చేయమని,ఒకటి అప్పాచిఆరణ్ణా దగ్గర ఉంచుకొని మరొకటి వారి ఆచార్యులైన పొన్నడిక్కాల్ జీయర్కి ఇవ్వమనిరి.

కొంతకాలము తరువాత దైవనాయకన్ ఎమ్పెరుమాన్ (వానమామలై)సేనై ముదలిఆర్ ద్వారా ఒక శ్రీముకమును (ఆదేశమును) మామునిగళ్కి , పొన్నడిక్కాల్ జీయర్ని వానమామలై దివ్య దేశమునకు కైంకర్యములను చూసే నిమిత్తమై పంపమనిరి. మామునిగళ్ పొన్నడిక్కాల్ జీయర్ని వానమామలైకి వెళ్ళమని ఆదేశించగా అది శిరసావహించి వెళ్ళిరి. అప్పుడు మామునిగళ్ ప్రతీ ఒక్కరిని పెరియ పెరుమాళ్ళ ముందు 4000 దివ్య ప్రభన్దమును రోజు 100 పాశురములను క్రమముగా పఠించమనిరి.పెరియ తిరుమొళి సాత్తుమురై రోజున, “అణియార్ పొళిల్ శూళ్ అరన్గనగరప్పా” పాడుచుండగా, ఎమ్పెరుమాన్ చాలా సంతోషముచెంది, తన సన్నిది నుండి అరన్గనగరప్పన్ (లక్శ్మినారయణన్ విగ్రహమును) పొన్నడిక్కాల్ జీయర్కి ఇవ్వగా,వారితో అది వానమామలైకి చేరినది. పెరియ పెరుమాళ్ ప్రత్యేక ప్రసాదమును మరియు శ్రీ శఠగోపమును పొన్నడిక్కాల్ జీయర్కి ఇచ్చి వీడుకోలును పలికిరి.అలానే మామునిగళ్ పొన్నడిక్కాల్ జీయర్ని తన మఠమునకు తీసుకువచ్చి, గొప్ప తదియారాదనను చేసి వారిని వానమామలైకి పంపిరి.

పొన్నడిక్కాల్ జీయర్ వానమామలైలో నివసించి,ఎన్నో కైంకర్యములను వానమామలై మరియు పక్కనే గల నవ తిరుపతి, తిరుక్కురున్గుడి మొదలగు దివ్యదేశములలో మరియు తను యాత్రలు చేసినప్పుడు బదిరీకాశ్రమములో చేసిరి.వారికి ఎంతో మంది శిష్యులు లభించిరి,వారికి కాలక్షేపములను అనుగ్రహించిరి మరియు కైంకర్యములను కొనసాగించమని ఆదేశించిరి.

పొన్నడిక్కాల్ జీయర్ ఉత్తర దివ్యదేశములను దర్శించుటకు పెద్ద యాత్రను చేపట్టిరి.ఆ సమయములో మామునిగళ్ సంసారములో తన లీలలను చాలించుకొని పరమపదమునకు చేరిరి.ఆ సమయములో వారు యాత్రలో తిరుగుప్రయణములో,తిరుమలైకి చేరగానే మామునిగళ్ పరమపదమునకు చేరదలచిరన్న వార్త వినిరి బాధతో తిరుమలైలో కొంచము కాలము నివసించిరి.వారు యాత్ర చేసినప్పుడు వచ్చిన మొత్తము ధనమును శ్రీరంగమునకు వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళి, జీయర్ నాయనార్ని (మామునిగళ్ పూర్వాశ్రమములో మనవడు) మరియు ఇతర శ్రీవైష్ణవులతో కలసి వారి యొక్క ఆచార్యుల ఎడబాటును గురించి బాధపడిరి.ఆ సమయములో,మామునిగళ్ ఆఙ్ఞ ప్రకారము, మామునిగళ్ యొక్క ఉపదణ్డమ్ (మరొక దణ్డమ్),ఉంగరము (తిర్వాజి మోదిరమ్) మరియు పాదుకాలను పొన్నడిక్కాల్ జీయర్కి ఇచ్చిరి. ఇప్పడికినీ ఆ ఉపదణ్డమును వానమామలై జీయరుల త్రిదణ్డములో కట్టుతారు.ఆ విధముగానే, ఈ రోజుకూడా వానమామలై జీయర్లు మామునిగళ్ యొక్క ఉంగరమును ప్రత్యేక సందర్బములలో ధరిస్తారు. వారు తిరిగి వానమామలైకి చేరి తన కైంకర్యమును యదావిధిగా చేసిరి.

ఆ సమయములో,వానమామలైలోని శ్రీవరమన్గై నాచ్చియార్కి ఉత్సవ విగ్రహము లేదు.ఒకసారి పొన్నడిక్కాల్ జీయరుల స్వప్నములో దైవనాయకన్ ఎమ్పెరుమాన్ కనిపించి నాచ్చియార్ తిరుమేనిను (విగ్రహము)తిరుమలై నుండి తీసుకురమ్మని ఆదేశించిరి.అందువలన,వారు ఎమ్పెరుమాన్ యొక్క ఆఙ్ఞను నెరవేర్చుటకై తిరుమలైకి బయలుదేరిరి. వారి కలలో, నాచ్చియార్ కనిపించి ఈ విధముగా చెప్పెను“ప్రియమైన తండ్రీ,వానమామలైకి తీసుకువచ్చి దైవనాయకన్ ఎమ్పెరుమాన్ తో తిరుకళ్యాణము జరిపించుము”. ఆ విధముగానే ఆమె తిరుమలై జీయర్ స్వామికి తన విగ్రహమును పొన్నడిక్కాల్ జీయర్కి ఇవ్వవలసినదిగా ఆదేశించెను.జీయర్ వారి ఆఙ్ఞను అనుగుణముగా నాచ్చియార్ను పొన్నడిక్కాల్ జీయర్తో పంపిరి. పొన్నడిక్కాల్ జీయర్ వారిని వానమామలైకి తీసుకువచ్చి, గొప్పగా తిరుకళ్యాణముకు ఏర్పాటులు చేసి స్వయముగా వారే కన్నికాదానమును చేసిరి. దైవనాయకన్ ఈ విధముగా చెప్పిరి “పెరియాళ్వార్ వలె, పొన్నడిక్కాల్ జీయర్ కూడా మాకు మామగారు” ఇప్పడికీని ఈ సాంప్రదాయము వానమామలై దివ్యక్షేత్రములో ఉన్నది.

తదుపరి చాలా సంవత్సరములు జీవించి విలువైన ఉపదేశములను ప్రతీఒక్కరికిని అందించి, పొన్నడిక్కాల్ జీయర్ తమ ఆచార్యులైన అళగియ మణవాళ మామునిగళ్ని ధ్యానిస్తూ తమ యొక్క చరమ తిరుమేని వదిలి పరమపదమును చేరిరి. వారు తదుపరి జీయరుని వానమామలై మఠమునకు నియమించిరి,ఇప్పడికినీ ఈ ఆచార్య పరమ్పర నడుచుచున్నది. మనకూ ఎమ్పెరుమానార్ మరియు మన ఆచార్యులతో అటువంటి అనుబంధము కలిగేలా పొన్నడిక్కాల్ జీయర్ శ్రీ చరణములను ఆశ్రయించుదాము.

పొన్నడిక్కాల్  జీయర్ తనియన్ (దొడ్డాచార్యర్ సమర్పించిరి)

రమ్య జామాత్రు యోగీంద్ర పాదరేఖా మయమ్ సదా
తతా యత్తాత్మ సత్తాదిమ్ రామానుజ మునిమ్ భజే

ரம்ய ஜாமாத்ரு யோகீந்த்ர பாதரேகா மயம் ஸதா
ததா யத்தாத்ம ஸத்தாதிம் ராமானுஜ முநிம் பஜே

దొడ్డాచార్యర్ పొన్నడిక్కాల్ జీయర్ వైభవమును గురించి సంస్కృతము వ్రాసిన కొన్నింటిని క్రింద చూద్దాము.ఈ రెండు రచనలు పొన్నడిక్కాల్ జీయరుల గొప్పతనమును చాలా అద్భుతముగా వర్ణించెరి.దొడ్డాచార్యుల అసలు ప్రతిని తమిళములో సులభ అనువాదమును శ్రీ ఉ.వే. తెన్ తిరుప్పేరై అరవిన్దలోచనన్ స్వామి వ్రాసెను (http://www.kaarimaaran.com/downloads/PrapathiMangalasasanam.pdf).

వానమామలై జీయర్ మంగళాశాసనము:

 • అజగియ వరదర్ అనే నామముతో తెలియబడి, జన్మతహ వచ్చిన మంచి గుణములతో,శుద్దమైన ఆత్మతో,సముద్రము అంతటి కరుణని కలిగి,మామునిగళ్ యొక్క కరుణని కలిగిన వానమామలై జీయరుని నేను ఆరాదించుదును.
 • మన సాంప్రదాయమునకు మరియు అందరు జీయర్ స్వాములకు నాయకుడిగా ఉండి,మామునిగళ్ యొక్క అన్ని గొప్ప గుణములను కలిగిన రామానుజ జీయరును నేను ఆరాదించుదును.
 • ఎల్లప్పుడూ మామునిగళ్ శ్రీ చరణముల వద్ద తుమ్మెద వలె ఉండి,నా మనసుని నిండు చంద్రుడివలె సంతోషముగా ఉంచిన రామానుజ జీయరును నేను ఆరాదించుదును.
 • మామునిగళ్ తన జీవిత శ్వాసగా భావించే మరియు వాత్సల్యము, శీలము,ఙ్ఞానము వంటి మంచి గుణములను కలిగిన రామానుజ జీయరును నేను ఆరాదించుదును.
 • మిగిలిన రెండు ఆశ్రమములను వదిలి(గృహస్తాశ్రమము మరియు వానప్రస్తమము)నేరుగా బ్రహ్మచర్యము నుండి సన్న్యాసమును స్వీకరించిన వానమామలై జీయరును నేను ఆరాదించుందును.
 • మామునిగళ్ళచే మొదటగా అనుగ్రహముపొంది మన కామము(దురాశ)మొదలగు దోషములను(లోపాలను) నిర్మూలించే వానమామలై జీయరును నేను ఆరాదించుందును.
 • అన్ని సద్గుణములు కలిగి ఉండి , లౌకిక విషయములో ఇష్ట అనిష్ట్ ములు లేకుండ ఉండు మరియు తామర పుష్పముల వంటి కన్నులు కలిగి ఉండు వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను .
 • వైరాగ్యం మొదట హనుమాన్ లో మొదలైనది అటు పిమట భీష్మ పితమహా లో అభివృద్ది చెందింది . ఇప్పుడు వానమామలై జీయర్ స్వామి లో ప్రకాశించునది . అటువంటి కీర్తిని గడించిన స్వామిని చూచుట బహు ఆనందముగా నుండును .

 • ఎవరి ఉభయవేదంతముల వివరణముల మహా పండితులను అయినను ఆకర్షించునో, ఎవరి అనుష్టానము దృష్టాంతము ను గొని సన్యాసులు సైతము ఆచరణ చేయుదురో , మచ్చ లేని వారు మరియు జ్ఞానము ,సద్గుణముల భాండాగారము అయిన వారు ఎవ్వరో , మరియు ఎవరియితే మణవాళ మామునులను ఆశ్రయించిరొ ,అటువంటి వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.
 • ఎవరి కాలక్షేప గోష్టి లో పక్షులు సైతము “శ్రీ మన్నారయణుడె పరాత్పరుడని , వారే శుద్ధ సత్వమని , ఇతర దేవతలందరూ వారికి పరిచారకులని ” కూవుదురో , అటువంటి వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.
 • ఎవరి కటాక్షము యొక్క శక్తి వలన అర్థ పంచక జ్ఞానము సులువుగా స్ఫురించునో , ఎవరి శిష్యులకు కల్ప వృక్షము వంటి వారో మరియు ఎవరైతే వానమామలై లో పెక్కు కైంకర్యములు చేసిరో , అటువంటి వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.

 •  ఎవరైతే వారి నిశ్చలమైన కరుణ తో నన్ను ఉద్ధరించిరో ( భౌతిక విషయములందే ఆశ ఉండు శ్రీ వైష్ణవ సిద్ధాంతములో ఆశక్తి లేని వాడైన నేను ) మరియు వానమామలై దివ్య క్షేత్రమునకు ఐశ్వర్యము వంటి వారైనా వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.
 • జ్ఞాన వైరాగ్యములు సంపూర్ణముగా కలిగి ,ఒక బంగారు ఆభరణముల పెట్టి వలె నుండి , ఎమ్పెరుమానర్ల చే స్థాపించబడిన ఆచార్య పీఠము తీసుకొనుటకు సంసిద్ధముగా నుండు వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.

 • మణవాళ మామునుల కరుణ కు పాత్రమై , జ్ఞానము మొదలగు సద్గుణముల సముద్రమై ,దైవనాయక ఎమ్పెరుమాన్ మీద విడదీయరాని ప్రేమ కలిగిన వారై ఉండు వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను

వానమామలై జీయర్ స్వామి ప్రపత్తి:

1.అప్పుడే విరిసిన తామర పూవ్వు వలె అందముగా నుండు వారున్నూ , సేవించిన వారికి ఆనందము కలిగించు వారున్నూ ,సంసారము అనే దుఃఖ సాగరములో మనలను సహాయము చేయు వారు అయిన వానమామలై జీయర్ స్వామి ని నేను ఆశ్రయించెదను

2. దోషములను నివారించు వారున్నూ , సద్గుణముల సముద్రమున్నూ , శిష్యులకు కల్ప వృక్షము అయినటువంటి వారైనా మణవాళ మామునిగళ్ యొక్క ఆశీర్వాదము చే ప్రఖ్యాతి ని పొందినట్టువంటి వారైనా వానమామలై జీయర్ స్వామి ని నేను ఆశ్రయించెదను

3. మణవాళ మామునిగళ్ ని ఆశ్రయించిన వారై , సంసార సంబంధమును పెంపొందించు నని దాంపత్య జీవితమున చిక్కుకొనని వానమామలై జీయర్ స్వామి ని నేను ఆశ్రయించెదను

4. విరక్తి అనే లతా హనుమానతాళ్వాన్ నుండి మొదలై ఇప్పుడు వానమామలై జీయర్ వరకు పూర్తిగా వ్యాపించి పరిమళించు చున్నది , అటువంటి వానమామలై జీయర్ స్వామి ని నేను ఆశ్రయించెదను .

5. ఏ విధంగా ఆదిశేషుడు ఎమ్పెరుమాన్ యొక్క ప్రీతి కాగా కైంకర్యములు చేసెదరో ఆ విధంగానే తమ ఆచార్యులైన మణవాళ మామునిగళ్ యొక్క ప్రీతి కాగా వానమామలై లో కైంకర్యములు( మండపములు కట్టించుట మొదలగునవి ) చేసిన వానమామలై జీయర్ స్వామి ని నేను ఆశ్రయించెదను.

6. నమ్మాళ్వార్ల చే అనుగ్రహింపబడ్డ లోతైన వేదాంత అర్థములను విశేషంగా విశదపరిచిన వానమామలై జీయర్ స్వామి యొక్క శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.

7. వానమామలై జీయర్ స్వామి యొక్క నామము పలికినంత మాత్రమున సంసారము అనే పాము యొక్క విషము నుండి విమోచనము ను పొంది ఎమ్పెరుమాన్ తో సమముగా జీవత్మాలను ఉజ్జించజేయును. అటువంటి వారి శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.

8. అనాది కాలము నుండి కుడబెట్టుకొన్న పాపములను విముక్తి ని ఇచ్చే , సాధువుల చే పూజింపబడే , స్వచ్చముగా నుండు వానమామలై జీయర్ స్వామి యొక్క శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.

9. వానమామలై జీయర్ స్వామి యొక్క శ్రీ పాద తీర్థమును ఎవరినైను పవిత్రము చేసి తాపత్రయము ను వెంటనే తొలగించును . అటువంటి వారి శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.

10. నిర్మలమైన మరియు సద్గుణముల సాగరము అయినటువంటి అప్పాచియారణ్ణ ఆశ్రయించిన వానమామలై జీయర్ స్వామి యొక్క శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.

11. సద్గుణముల శిఖరమై, సాధువుల చే పూజింపబడే సమరభున్గావచార్యర్ ఆశ్రయించిన వానమామలై జీయర్ స్వామి యొక్క శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.

12. వానమామలై జీయర్ స్వామి కి సాటి సమముగా ఎవరు లేరు . వారి వైరాగ్యము హనుమాన్ , భీష్ముడు మొదలగు వారి కన్నను ఎక్కువ . ఒరాణ్ వళి గురుపరంపరై లో నమ్మాళ్వార్ మొదలగు వారి భక్తి కి సమముగా ఉన్నది. వారి జ్ఞానము నాథమునుల , ఆళవన్దార్ మొదలగు వారి తో సమము . వీటనింటిని పరిశీలించిన పిదప వానమామలై జీయర్ స్వామి కన్నా గొప్పవారు ఎవ్వరైనను ఉందురో ?

13. దైవనాయకన్ ఎమ్పెరుమాన్ ను ఆదిశేషుని వలె సేవించిరి. కులశేఖర్ ఆళ్వార్ మాదిరిగా ఎమ్పెరుమాన్ యొక్క భక్తులను కొని యాడిరి, నమ్మాళ్వార్ ను మధుర కవి ఆళ్వార్ సేవించిన విధముగా వారి ఆచార్యులైన మణవాళ మాముని సేవించిరి,పూర్వాచార్యుల యొక్క అడుగుజాడల లో అనుసరించిరి , మంచి గుణముల భాండాగారము గా ఉండిరి.

14.పూర్వము ఎమ్పెరుమాన్ నారాయణ,నరు లుగా అవతారము ఎత్తినారు . ఇప్పుడు ఎమ్పెరుమాన్ మణవాళ మాముని మరియు వానమామలై జీయర్ స్వామి గా అవతరించిరి.వానమామలై జీయర్ స్వామి యొక్క కీర్తి ఇంత గొప్పది.

మనము తదుపరి సంచికలో తిరిగి గురు పరంపరలోని ఇతర ఆచార్యుల వైభవమును తెలుసుకుందాము.

రామానుజ తిరువడిగళే శరణమ్

జై శ్రీమన్నారాయణ

అడియేన్ .!

రఘు వంశీ రామానుజదాసన్


Source

నంజీయర్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలొ  మనము పరాశర భట్టర్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

నంజీయర్ - తిరునారాయణపురం

నంజీయర్ – తిరునారాయణపురం

తిరు నక్షత్రం                                ~: ఫాల్గుణ మాసము, ఉత్తరా నక్షత్రము
అవతారస్థలం                               ~: తిరునారాయణపురం
ఆచార్యులు                                  ~: పరశర భట్టర్
శిష్యులు                                     ~: నంపిళ్ళై, శ్రీ సేనాదిపతి జీయర్ మరి కొందరు కలరు
పరమపదించిన ప్రదేశము               ~: శ్రీ రంగం

శ్రీ సూక్తి గ్రంధములు ~: తిరువాయి మొళి 9000 పడి వ్యాఖ్యానము, కన్నినున్ శిరుతామ్బు వ్యాఖ్యానము, తిరుప్పావై వ్యాఖ్యానము, తిరువందాది వ్యాఖ్యానములు, శరణాగతి గద్య వ్యాఖ్యానము, తిరుపల్లాణ్డు వ్యాఖ్యానము, రహస్య త్రయ వివరణ గ్రంధము (నూఱెట్టు 108) – ఈ గ్రంధములలొ చాల వరకు మనకు అందుబాటులొ లేవు.

శ్రీ మాధవర్ అను నామధేయముతో జన్మించి అద్వైత సిద్ధాంతమున గొప్ప తత్వ వేత్తగ ప్రసిద్ధి పొందారు. తరువాత భట్టర్ వారికి నంజీయర్ అని నామకరణము చేసారు. వారికి నిగమాంతయోగి మరియు వేదాంతి అను పేర్లు కూడ కలవు.

మాధవాచార్యులు గొప్ప అద్వైత తత్వ వేత్తగా తిరునారాయణపురము నందు నివసించిరి. ఎమ్పెరుమానార్లు వారిని మన సంప్రదాయమునకు సంస్కరింపదలచిరి. అద్వైత సంప్రదాయమునకు చెందినవారు అయినప్పటికిని; ఎమ్పెరుమానార్లకు వారి యందు గౌరవము కలదు. వారిని సంస్కరించు బాధ్యత భట్టర్లకు అప్పగించిరి.

భట్టర్ వైభవమును అప్పటికే తెలుసుకున్న మాధవచార్యులు వారిని కలుసుకొను సమయము కొరకు వేచివున్నారు. ఎమ్పెరుమానార్ల కోరిక మేరకు భట్టర్లు తిరునారాయణపురమునకు వెళ్ళెను. పిదప భట్టర్లు వారిని వాదనలో జయించి వారిని శిష్యులుగా స్వీకరించెను.( ఆ వృత్తాంతమును మీరు ఇక్కడ చదవవచ్చు). భట్టర్ ఒక సాధారణ వేషముతో వారి దగ్గరకు వచ్చి వారిని ఓడించిన సంగతి; వాదన ముగిసిన అనంతరం భట్టరుతో వచ్చిన శ్రీ వైష్ణవ బృందం మాధవాచార్యుల ఇంటికి వచ్చినప్పుడు తెలుసుకున్నారు. ఆ శ్రీ వైష్ణవ బృందం యొక్క ఆనందమునకు సంతసించిన మాధవాచార్యులు భట్టర్ వైభవమును కళ్ళారా చూసి గ్రహించెను.  భట్టర్లు శ్రీ రంగము నుంచి ఎంతో ప్రయాసకోర్చి; వారి వైభవమును పక్కకు పెట్టి; సాధారణ వ్యక్తిగా వచ్చి మాధవాచార్యులను సంస్కరించి వారికి శాస్త్రార్ధములను బోధించిన భట్టర్లకు ఏ విధముగ ఋణము తీర్చుకోవాలో తెలియచేయవలసిందిగా భట్టర్లను అడిగెను. భట్టర్లు చాల సులువుగ అరుళిచెయల్ మరియు ఇతర సాంప్రదాయ గ్రంధములను పఠించి వాటిలొ నిష్ణాతులు కావలసిందిగా ఆదేశించెను. శ్రీ రంగమునకు రావలసినదిగ కూడ ఆదేశించెను.

మాధవాచార్యుల భార్యలు వారి కైంకర్యములకు అడ్డుగా ఉండుట చూసి; ఆచార్యని ఎడబాటు సహించలేక శ్రీ రంగమునకు వెళ్ళి వారి ఆచార్యుల సేవ చేసుకొనుటకు సన్యాస అశ్రమమును స్వీకరించ దలచెను. వారి అపారమయిన సంపదను 3 భాగములుగా చేసి; 2 భాగములు వారి ఇద్దరి భార్యలకు (శాస్త్ర ప్రకారము సన్యసించ దలిచిన; భార్య యొక్క సంరక్షణ భారము పూర్తి గావించిన పిదప తీసుకోవలెను) పంచి సన్యాసాశ్రమమును స్వీకరించెను. పిమ్మట వారు శ్రీ రంగమునకు బయలుదేరెను. దారిలొ అనంతాళ్వాన్లు కలసి వారిని సన్యాసాశ్రమమును స్వీకరించ దలచిన కారణమును అడిగెను. వారు భట్టరు దగ్గరకు వెళ్ళి; వారిని సేవ చేసుకుంటే ( గురువు సేవ)  ఎమ్పెరుమాన్లు మోక్షమును ప్రసాదించునని బదులు చెప్పిరి.  అప్పుడు ఆళ్వాన్లు “తిరుమంత్రములొ జన్మించి ( ఆత్మ స్వరూపము) ద్వయ మంత్రములో పెరిగమని ( పెరుమాళ్ళకు మరియు పిరాట్టికి కైంకర్యమును చేసుకుంటు) దీవించెను.  భట్టర్లు మాధవాచార్యుల ఆచార్య నిష్టను గమనించి వారిని నమ్ జీయర్ అని పిలిచెను. ఆ నాటి నుండి వారు నంజీయరుగా ప్రసిద్ధి పొందెను.

భట్టర్లు మరియు నంజీయర్లు ఉత్కృష్టమయిన ఆచార్య – శిష్య సంబంధమును అనుభవించెను. నంజీయర్ వారి ఆచార్యుల కోసము; అన్నింటిని త్యజించి వారి ఆచార్యులతో ఉండెను.భట్టర్లు వారికి తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ వారి 6000 పడి వ్యాఖ్యానము ప్రకారము తిరువాయి మొళిని నేర్పించెను. భట్టర్లు నంజీయర్లకు తిరువాయిమొళికి వ్యాఖ్యానమును అనుసంధించమనగ వారు 9000 పడి వ్యాఖ్యానమును రచించెను. తిరువాయి మొళి కాలక్షేపమును వారు జీవించిన 100 ఏండ్ల కాలములో 100 మార్లు చెప్పిన ఘనత నంజీయర్లకే సొంతము.

నంజీయర్ల వారి ఆచార్య భక్తి వర్ణనాతీతం. వారి ఆచార్య భక్తిని కొన్ని సంఘటనల ద్వార తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము.

 • ఒకనాడు భట్టర్లు పల్లకిలో వెళుతుండగా నంజీయర్లు ఒక చేతితో త్రిదండమును ధరించి ఒక భుజముపై వారి పల్లకిని మోయుటకు ప్రయత్నించెను. అది గమనించిన భట్టర్లు వారిని పిలచి; వారికి ఇది తగదు అని, సన్యాసాశ్రమమున ఉండు వారు ఇలా పల్లకిని మోయరాదు అని చెప్పెను. నంజీయర్లు ” మీ సేవకు ఈ త్రిదండము అడ్డుగా ఉన్న ఎడల దానిని విరిచి; సన్యాసాశ్రమమును త్యజించును” అని బదులిచ్చెను
 • ఒకనాడు నంజీయర్ల పరిచారకులు భట్టర్ల రాకతో వారి తోటలో కొద్దిగ అల్లరి జరుగుతుందని వారు అడ్డుగా ఉన్నారని ఫిర్యాదు చేసెను. అప్పుడు నంజీయర్లు ఆ తోట భట్టర్ల కైంకర్య రూపముగా ఉన్నదని; నమ్పెరుమాళ్ళ కోసము కాదు అని వారిని మందలించిరి.
 • ఆచార్యులు వారి శిష్యుల ఒడిలో తల పెట్టుకొని విశ్రాంతి పొందుట సాధారణము.
  ఒకనాడు భట్టర్లు పడుకొన దలచి నంజీయర్ల ఒడిలో తన తలను పెట్టుకొని విశ్రాంతి పొందుచుండెను.. భట్టర్లు చాల సేపటి తరువాత మెలుకువ వచ్చి చూడగా నంజీయర్లు ఆ సమయమున కదలకుండ ఉండెనన్న విషయమును గ్రహించి; వారి ఆచార్య కైంకర్య నిష్టకు ప్రీతి చెంది వారికి ద్వయ మంత్ర అర్ధమును ఉపదేశించెను. ( ఆచార్యులు వారి శిష్యుల నడవడి నచ్చిన పిదప వారికి అర్ధములను బోధించును.)
 • నంజీయర్లు అరుళిచెయల్ అన్నింటిలోను నిష్ణాతులు అయ్యిరి. భట్టర్లు నంజీయర్లు అరుళిచెయల్ పాసురములను పారణ (అనుసంధించు) సమయమున వాటికి అద్భుతమయిన  అర్ధములను చెప్పేవారు. ఒకనాడు నంజీయర్లు తిరువాయి మొళి 7.2.9 “ఎన్ తిరుమగళ్ చేర్ మార్వనే ఎన్ఱుమ్ ఎన్నుడైయావియే ఎన్ఱుమ్” పాసురము పారణ చేయుచుండగ  — వారు ఆ పాసురములోని వాక్యము పూర్తిగా కలిపి విడమరచకుండ చదివెను. అది విని భట్టర్లు వెంటనే మూర్చపోయెను.తెలివి వచ్చిన పిమ్మట భట్టర్లు ఆ వాక్యమును అలానే చదవవలెనని; అప్పుడు మాత్రమే మనకి పరాంకుశ నాయకి యొక్క హృదయము అర్ధమవుతుంది అని చెప్పెను.ఆ వాక్య అర్ధము కలిపి చడివితె ఈ విధముగ ఉండును ” శ్రీ రంగ నాచ్చియార్లను హృదయమునందు కల శ్రీ రంగనాధుడు నాకు చాల ప్రియం” అని ఆళ్వార్ల భావన.  అదే వాక్యమును విడ మరచి చదివితె “శ్రీ రంగనాధుడి మది యందు శ్రీ రంగ నాచ్చియార్లు కలరు. అలాంటి రంగనాధులవారు నాకు చాల ప్రియం అని అర్ధము వచ్చును.
 • భట్టర్లు తమిళ దేశము కాని మరియు సంస్కృత వేదాంతి యగు నంజీయర్లను వారి అరుళిచెయల్ యొక్క తత్వ జ్ఞానమును పలు మార్లు ప్రశంసించెను.

భట్టర్లు మరియు నంజీయర్ల మధ్య అనేక ఆసక్తికరమగు సంభాషణలు జరిగెను. ఎంత పెద్ద పండితుడు అయినప్పటికి నంజీయర్లు వారికి వచ్చిన సందేహాలను భట్టర్ల యదుట ఉంచి వాటిని వివరించమని కోరుటలో ఎన్నడూ సంకోచించలేదు.  వారి మధ్య సంభాషణలు కొన్ని ఇప్పుడు చూద్దాము.

 • నంజీయర్లు ఒకనాడు భట్టర్లను ఎందువలన ఆళ్వార్లు కృష్ణ పరమాత్మ యందు ఎక్కువ ప్రియంగా ఉండేవారు అని అడిగెను. ఇటీవల జరిగిన విషయములను గుర్తుపెట్టుకోవడము సహజమని; అందువలన కృష్ణావతారము ఎమ్పెరుమాన్ల ఇటీవల (ఇతర అవతారములు ఎప్పుడో స్వీకరించడము వలన) అవతారము కావున వారిని కలవడము ఆళ్వార్లకు కుదరకపోవడము వలన కృష్నుడి యందు ప్రేమని వ్యక్తపరిచెనని చెప్పెను.
 • కృష్ణావతారమున ఎమ్పెరుమాన్లు గోప కులమునందు జన్మించెను. వారు ఎక్కడికి వెళ్ళినను; కంసుని సేవకులు ( అసురులు) వారిని చంపటానికి సిద్ధముగ ఉండేవారు. కాని రామావతారమున (ఇతర అవతారముల యందు కూడ) వారు అస్త్ర విద్యలు నేర్చుకున్నారు. మరియు వారి తండ్రి దశరధుడు చాల గొప్ప యోధుడు. (ఇంద్రునికి సహాయము చేయగల సమర్ధుడు). వారి సోదరులు కూడ చాల ధైర్యవంతులు మరియు శక్తి వంతులు. అందువలన పెరియాళ్వార్లు కన్నన్ ( కృష్ణ) ఎమ్పెరుమాన్ల యందు భయముతో వారికి కాపు గాచెను అని భట్టర్లు వివరణ ఇచ్చెను.
 • కలియన్ ఆళ్వార్లు తిరుమొళి “ఒరు నల్ సుఱ్ఱమ్” పదిగము ( తిరుమొళి చివర పాసురములు) నందు అనేక దివ్యదేశ పెరుమాళ్ళకు మంగళా శాసనము చేసెను. నంజీయర్లు ఇదే విషయము విన్నవించి ఎందుకు అలా చేసారు అని అడుగగా; ఒక ఆడ పిల్ల పెళ్ళి చేసుకొని తన భర్త ఇంటికి పోవు సమయమున ఏ విధముగా వారి స్నేహితుల ఇండ్లకు త్వరగా వెళ్ళి పలకరించునో అదే విధముగా ఆళ్వార్లు పరమపదమునకు బయలుదేరుటకు సిద్ధముగనుండుట వలన భూలోకమున ఉన్న ఎమ్పెరుమాన్లందరికి ఒక సారి త్వరగా మంగళా శాసనమును చేసెను అని వివరించెను.
 • ప్రహ్లాదుడు వారి మనమడు అయిన మహాబలి ఎమ్పెరుమాన్లను గౌరవించుట లేదని తన సంపదను కోల్పోవుగాక అని శపించెను. ధనము/సంపద యందు ఏ విధమయిన కోరిక మరియు ఆసక్తి లేని ప్రహ్లాదుడు ఎందువలన ఈ విధముగ శపించెనో అని అడుగగా; ఒక కుక్కను (సరిదిద్దుటకు) శిక్షించుటకు అది తినెడి మట్టిని ఏ విధముగ దాని దగ్గర నుండి తీసి వేయుదుమో; అదే విధముగా ప్రహ్లాదుడు మహాబలికి ప్రియమైన సంపదను తీసి వేసెను అని వివరణ ఇచ్చెను.
 • వామన చరిత్ర యందు మహాబలి పాతళమునకు మరియు సుక్రాచార్యులు తన కన్ను కోల్పోవునకు కల కారణమును నంజీయర్లు అడుగగా; సుక్రాచార్యులు మహాబలి యొక్క ధర్మమును చేయుటకు అడ్డుపడినందుకుగాను వారి కన్నును; మరియు ఆచార్యుల మాట విననందుకు మహాబలి పాతాళమునకు వెళ్ళెనని వివరించెను.
 • దశరధుడు పెరుమాళ్ళని విడిచి ఉండలేక వెంటనే ప్రాణములను విడచినప్పటికి స్వర్గమునకు వెళ్ళెను ఎందువలన అని నంజీయర్లు అడుగగా; దశరధుడు సామాన్య ధర్మమునకు ( సత్యవాక్ పాలనకు) కట్టుబడెనని; అందువలన వారు ఎమ్పెరుమాన్ల శ్రేయస్సు (రక్షణ) కోరలేదని అందువలన వాస్తవముగ నరకమునకు వెళ్ళవలసినది అని చెప్పి.  పెరుమాళ్ళ తండ్రియగుటచే వారి దయ వల్లన నరకమును తప్పించి స్వర్గమునకు పంపెనని చెప్పెను.
 • విభీషణుడు భక్తుడు అయినప్పటికి; సుగ్రీవుడు ఎందువలన తమ కూటమిలో చేర్చుకొనుటకు ఇష్టపడలేదని నంజీయర్లు అడుగగా; ఏ విధముగ పెరుమాళ్ వారి భక్తులను రక్షించుటకు సిద్ధపడెనో అదే విధముగా సుగ్రీవుడు కూడ తనకి శరణాగతి చేసిన ( రాముడు ఒకనాడు సుగ్రీవుడిని సహాయము కోరుతాడు) వారిని కాపాడుకొనుచున్నాడు. విభీషణుడు పెరుమాళ్ళకు హాని చేయునేమో అని సుగ్రీవుడి భయమని వివరణ ఇచ్చెను.
 • కృష్నుడు దేవకిని మరియు వసుదేవులను కంసునిని చంపి వారిని విడిపించగా; దేవకి యందు తల్లి తనము/పుత్ర వాత్సళ్యము వలన తన స్ధనముల యందు పాలు పుట్టగా; కృష్నుడు చిన్నవాడు కానప్పటికి పాలును తాగెను. అది ఎట్లు కుదురును అని నంజీయర్లు అడుగగా; అది తల్లి కొడుకుల మధ్య విషయము మనము ఎవరము అడుగటానికి అని సరదాగ చెప్పి. అసలు తల్లి కానటువంటి ప్రేమ లేనటువంటి పూతన పాలు ఇచ్చినప్పుడు ఎమ్పెరుమాన్లు తాగెను; తనను కన్న తల్లి తన యందు అమితమైన ప్రేమ కలదై వారికి పాలు పడితె; వారు తాగరు అని అర్ధముచేసుకోవడములో కష్టమేమిటి అని ప్రశ్నించి సమాధనమునిచ్చెను.
 • భట్టర్లు ఒకనాడు యయాతి చరిత్రమును ఉపన్యాసములో భాగముగ చెప్పెను. యయాతి 100 అశ్వమేద యాగములను చేసి; స్వర్గమునకు చేరి ఇంద్రుని పదవిలో భాగము కోరెను. పదవి పంచుకొనుటకు ఇష్టము లేని ఇంద్రుడు యయాతిని తప్పు చేయు విధముగా ప్రణాలికను రూపుదిద్ది; వారిని క్రిందకి పడవేసెను. నంజీయర్లు ఈ వృత్తంతమును ఎందుకు చెప్పెనో అని అడుగగ; ఈ చరిత్ర మనకు ఎమ్పెరుమాన్ల గొప్ప తనమును; ఇతర దేవతలలోని లేనిది తెలియచేయునని చెప్పెను.ఎమ్పెరుమాన్లు వారికి శరణాగతి చేసిన వారి అందరికి సామ్యాపతి మోక్షమును ప్రసాదించునని; అదే ఇతర దేవతలు 100 అశ్వమేద యాగములు చేసినప్పటికి కూడా వారితో సమానముగ చుసుకొనుటకు ఇష్టపడరు అని క్రిందకు పడివేయును అని చెప్పి వివరణ ఇచ్చెను.

ఇలాంటి సంభాషణలు ఎన్నో మనకు అరుళిచెయల్ మరియు శాస్త్ర రహస్యములు తెలియచేయును. ఈ సంభాషణలు అన్ని నంజీయర్ల అరుళిచెయల్ ప్రావీణ్యతను వారి శిష్యులకు అర్ధములు చెప్పుటకు త్రోవవేసెను.

నంజీయర్లు ఒకనాడు తమ 9000 పడి వ్యాఖ్యానమును లిఖించదలచి నంబూర్ వరదాచారియర్ మిక్కిలి ప్రావీణ్యుడని గ్రహించి వారికి ఆ బాధ్యతను అప్పగించిరి. వారు పని పూర్తి చేసిన పిమ్మట నంజీయర్లు వారిని ప్రశసించి వారిని నంపిళ్ళై అను నామమును బిరుదుగా ఇచ్చి వారిని మన దర్శన ప్రవర్తకుడిగా చేసెను. నంజీయర్ల కన్నా మంచి వ్యాఖ్యానమును చెప్పినప్పుడు నంపిళ్ళైను నంజీయర్లు ప్రశంసలతో ముంచేసేవారు. అటువంటి గొప్ప మహనీయుడు నంజీయర్లు.

నంజీయర్లకు సాంప్రదాయ విషయముల యందు గొప్ప అవగాహన కలదు. ఒక శ్రీ వైష్ణవుడు మరి ఒక శ్రీ వైష్ణవుడి బాధను చూసి తమ బాధగా భావిస్తాడో వారు నిజమయిన శ్రీ వైష్ణవుడని శ్రీ సూక్తమును మనకు అందించిరి. వారు వారి కాలములో ఉన్న శ్రీ వైష్ణవుల యందు మరియు ఇతర ఆచార్యుల యందు గొప్ప గౌరవము కలిగి యుండెడివారు.

వారు తిరుమంగై ఆళ్వార్ల పెరియ తిరుమొళి 3.6 (తూవిరియ మలరుళక్కి పదిగము) పాసురములను పెఱ్ఱి అని అరయరు స్వామి పారణ చేయుచున్నప్పుడు వారు ఆ అమృత ధారలొ నిమఘ్నునులయ్యేవారు.

వారి చరమ దశలో వారు ఎమ్పెరుమాన్లను స్వయం తిరుమేనిని దర్శనము కోరగా’ ఎమ్పెరుమాన్లు వారి కొరకు మాత్రమే దర్శనమును ఇచ్చెను. ఆ దివ్య మంగళ విగ్రహమును చూసిన పిమ్మట; వారు వారి శిష్యులకు  అనేక చరమ సూచనలను ఇచ్చి; వారి చరమ తిరుమేనిని వదలి పరమపదమునకు చేరుకొనెను.

మనము కూడా వారిలా ఆచార్య నిష్ట; ఎమ్పెరుమాన్ల యందు భక్తి భావన కలుగచేయమని వారిని ప్రార్ధించుదాము.

నంజీయర్ల తనియన్

నమో వేదాన్త వేద్యాయ జగన్ మన్గళ హేతవే

యస్య వాగామృతాసార భూరితం భువన త్రయం

రామానుజ తిరువడిగళే శరణమ్
జై శ్రీమన్నారాయణ

అడియేన్ .!

సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాస

Source