Monthly Archives: June 2014

శ్రీ పెరుమ్బుదూర్ ఆది యతిరాజ జీయర్

శ్రీ

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్ వరవర మునయే నమః

శ్రీ వానాచల మహామునయే  నమః

జై శ్రీమన్నారాయణ

తిరు నక్షత్రము~: ఆశ్వయుజ మాసము,పుష్యమి.

అవతారస్థలము~:  తెలియదు

ఆచార్యులు~: మణవాళమామునులు.

పరమపదము చేరిన ప్రదేశము~: శ్రీపెరుమ్బుదూర్.

ఆది యతిరాజ జీయర్ గారే యతిరాజ జీయర్ ముఠము, శ్రీపెరుమ్బూతూర్ (ఎమ్పెరుమానార్ యొక్క అవతార స్థలము ) స్థాపించారు.

srIperumbUthUr yathirAja jIyar mutt

యతిరాజ జీయర్ ముఠము, శ్రీపెరుమ్బూతూర్

యతిరాజ జీయర్ ముఠమునకు ఒక ప్రత్యేకత కలదు. అది ఏమనగా, కోవెల లో కైంకర్యము చేయుటకు మరియు కైంకర్య నిర్వహణ చూచుటకు గాను ఆళ్వార్/ఆచార్యులు స్థాపించిన కొద్ది మఠములలో  ఇది ఒకటి. ఎమ్పెరుమాన్ మరియు ఎమ్పెరుమానారు సంవత్సరము మొత్తము ఇక్కడికి వేంచేస్తారు.

AdhiyathirAjajIyar

యతిరాజ జీయర్ ముఠము, శ్రీపెరుమ్బూతూర్

వీరు మామునులు, పొన్నడిక్కల్ జీయర్(వానమామలై), కోయిల్ కందాడై అన్నన్, దొడ్డయాచార్యులు మొదలైన వారి తో  సత్సంబంధాలు కలిగివున్నారని వీరి తనియన్ ద్వారా తెలుస్తున్నది. వీరందరి శ్రీ చరణాలవద్ద శాస్త్ర అర్థాలను నేర్చుకున్నారు.

వీరి వాళి తిరునామము లందు శ్రీమద్రామానుజుల మీద వీరికి గల అప్పారమైన భక్తి తెలుస్తుంది.వీరి వాళి తిరునామము  మామునుల వాళి తిరునామము పోలి వుంటుంది.

పరమస్వామి (తిరుమాలిరుంచోలై కళ్ అళగర్) ఆదేశముల మేరకు, మామునిగళ్ వారి ఒక్క ఆంతరంగిక కైంకర్యపరుల లో ఒక్కరైన యతిరాజ జీయర్ ని తిరుమాలిరుంచోలై కోవెల ను పునరుద్దరించి, సంస్కరించుటకు పంపారని యతీన్ద్ర ప్రవణ ప్రభావమ్ లో చెప్పారు. కొందరు యతిరాజ జీయర్ ని శ్రీపెరుమ్బూతూర్ ఆది యతిరాజ జీయర్ గా  పరిగణిస్తారు, మరి కొందరు ఆ యతిరాజ జీయర్ వేరని , వీరె తదుపరి కాలము లో తిరుమాలిరుంచోలై జీయర్ ముఠమునకు మొదటి జీయర్ అయ్యరాని భావిస్తారు.పెద్దల వద్ద దీని గురించి మరింత తెలుసుకొవచ్చును.

వీరిని గురించి మనకు ఇంతవరకే తెలుస్తున్నది. భగవత్,భాగవత,ఆచార్య కైంకర్య ప్రాప్తి కోసము మనము వారి శ్రీచరణాలను ఆశ్రయించి తరించుదాము.

తిరుమాలిరుంచోలై జీయర్ తనియన్:

శ్రీమత్ రామానుజాంగ్రి ప్రణవ వరమునే: పాదుకమ్ జాతభ్రుంగమ్
శ్రీమత్ వానాద్రి రామానుజ గణగురు సత్వైభవ శోత్రదీక్షమ్
వాదూల శ్రీనివాసార్య చరణశరణమ్ తట్ కృపా  లబ్ద భాష్యమ్
వందే ప్రాఙ్ఞమ్ యతీంద్రమ్ వరవరదగురో;ప్రాప్త భక్తామృతార్థమ్

అడియేన్ చూడామణి రామానుజదాసి

Source

కోయిల్ కన్దాడై అప్పన్

శ్రీ:

శ్రీ మతే రామానుజాయ నమః

శ్రీ మద్ వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః

జై శ్రీమన్నారయణ

కోయిల్ కన్దాడై అప్పన్- కాంచిపురమ్ అప్పన్ స్వామి తిరుమాలిగై

తిరునక్షత్రము        :    భాద్రపద మాసము, మఖ నక్షత్రము

తీర్థము              :   వృశ్చికము,శుక్ల పంచమి

ఆచార్యులు            :    మణవాళ మామునులు

రచనలు             :    వరవమురముని వైభవవిజయము

వీరు ముదలిఆండాన్( ముదలిఆండాన్ యతిరాజ పాదుకగా ప్రసిద్ది గాంచారు)  వంశములోని కోయిల్ కందాడైఅన్నన్ సోదరుడిగా,దేవరాజ తొళప్పర్కు కుమారులుగా జన్మించారు .తల్లి దండ్రులు వీరికి పెట్టిన పేరు శ్రీనివాసన్.తరవాతికాలములో మామునుల ప్రియశిష్యులైనారు.

మామునులు ఆళ్వార్ తిరునగరి నుండి  శ్రీరంగము వెంచేసినప్పుడు , శ్రీ రంగనాథుడు వారిని  సత్సంప్రదాయమునకు మూల స్థానమైన శ్రీ రంగము లో ఉండి సంప్రదాయాన్ని ప్రవృద్ధి పరచాలని ఆదేశించారు. మామునులు శ్రీరంగములో వేంచేసి సత్సాంప్రదాయ ప్రవర్తము చేస్తూ,పూర్వాచార్య గ్రంథములను సేకరించిభద్రపరిచటమే కాక నిత్యము గ్రంథ కాలక్షేపము చేసేవారు.వారి ఙ్ఞాన సంపదకు,వాక్పటిమకు ఆకర్షితులై ఎందరో మహాచార్యులు కూడా వారి శ్రీచరణాలను ఆశ్రయించారు.

క్రమములోనే అప్పటికే ప్రముఖ ఆచార్యపురుషులుగా ప్రసిద్ది గాంచిన కోయిల్ కందాడై అన్నన్ సపరివారముగా మామునుల శిష్యులై తరవాతి కాలములో అష్టదిగ్గజములలో ఒకరై వెలుగొందారు.(మామునులు సత్సాంప్రదాయ ప్రవర్తము కోసము ఎనిదిమంది మహాచార్యులను నియమిచారు. వారినే అష్ట దిగ్గజములని అంటారు.) కోయిల్ కందాడై అప్పన్ కూడా తమ అన్నగారితో మామునుల  వద్దకు వచ్చినవారే.వీరు చరమపర్వ నిష్ఠను(భాగవత్ మరియు ఆచార్య కైంకర్యం) పాటించి తరించినవారని వారి తనియన్ ద్వారా తెలుస్తుంది.

ఎరుమ్బి అప్పా తన పూర్వదినచర్య(మామునుల దినచర్య)లో వీరిని ఈక్రింది విధముగా కీర్తించారు.

పార్శ్వాతః పాణిపాదాభ్యామ్ పరిగ్రుహ్యభవాత్ప్రియౌ

విన్యశ్తన్యం సనైరంగ్రి మృదులౌ మేధినీతలే

అర్థము:ఎరుమ్బి అప్పా మామునుల తో  –   తమ(మామునుల) గొప్పతనము తమ  ప్రియ శిష్యులిరువురూ(కోయిల్ అన్నన్,కోయిల్ అప్పన్)ఇరు వైపులా చేరగా , వారిని  మీ సుతిమెత్తని చేతులతో గట్టిగా పట్టుకొని , ఈ మేదిని పై మీ చరణ కమలము మోపి నడవటము.

mAmunigaL-aNNan-appan

ఇరు వైపులా తమ ప్రియ శిష్యులిరువురూ (కోయిల్ అన్నన్,కోయిల్ అప్పన్) తో మామునులు – కాంచిపురమ్ అప్పన్ స్వామి తిరుమాలిగై

తిరుమళిశై అణ్ణావప్పన్గార్,దినచర్యకు వ్యాఖ్యానము లో ఇక్కడ శిష్యులంటేకోయిల్ అన్నన్,కోయిల్ అప్పన్అన్నారు.ఆ కాలములో మామునులు పాంచరాత్ర ఆగమము ప్రకారము ఎల్లవేళలా త్రిదన్డము చేత ధరించటము లేదని ఒక సందేహము ప్రజలలో ఉండేది. దానికి అణ్ణావప్పన్గార్ చక్కటి సమాధానము చెప్పారు.

* ఎవరైతే సన్యాశి ధర్మములు బాగా తెలిసి ప్రఙ్ఞ కలిగి వుంటారో వారు కారణాంతరముల వలన త్రిదండము చేత పట్టకున్నా తప్పు లేదు.

* ఏ సన్యాసైతే నిరంతరము భగవద్యానములో కాలము గడుపుతారో, ఆచార్యముఖముగా శాస్త్రవిషయములను విన్నారో, భగవద్విషయములో పరిపూర్ణ అధికారము కలిగి వుంటారో, బాహ్య అంతర్గత ఇంద్రియ నిగ్రహము కలిగి వుంటారో వారికి త్రిదండముతో పని లేదు.

*పరమాత్మకు సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించే సమయములో  త్రిదండము అడ్డుగా వుంటుంది. అందువలన అలాంటి సమయములలో త్రిదండము ధరించకున్నను పరవాలేదు.

ఈ విధముగా కొయిల్ కందాడై అన్నన్ ప్రభవమును గురించి తెలుసుకున్నాము.వారి శ్రీచరణములను ఆశ్రయించి తరించుదాము రండి.

 కోయిల్ కందాడై అన్నన్ తనియన్:

వరదగురు చరణమ్ వరవరమునివర్య ఘనకృపా పాత్రమ్

ప్రవరగుణ రత్నజలధిమ్ ప్రణమామి .శ్రీనివాసగురువర్యమ్.

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి.

Source

తిరుక్కోష్ఠియూర్ నంబి

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్ వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః

 thirukoshtiyur-nambi

తిరునక్షత్రము~: వైశాఖ మాసము,రోహిణి

అవతార స్థలము~: తిరుక్కోష్ఠియూర్

ఆచార్యులు~: శ్రీ ఆళవన్దార్

శిష్యులు~: రామానుజులు (గ్రంథ కలక్షేప శిష్య)

పెరియళ్వార్లు వారి పెరియళ్వార్ తిరుమొళి 4.4 – నావ కారియమ్ పదిగమున తిరుక్కోష్ఠియూర్ ను అద్భుతముగా స్తుతించిరి.తిరుక్కురుగై పిరాన్ గా ఈ దివ్య దేశమున జన్మించి,తిరుక్కోష్ఠియూర్ నంబి గా ప్రఖ్యాతిగాంచి, . శ్రీ ఆళవన్దార్ల ప్రధాన శిష్యుల లో ఒకరైయారు. వీరిని గొష్ఠీపూర్ణులు,గొష్ఠీపూర్ల్సర్ అని కూడా వ్యవహరించెదరు.
శ్రీ ఆళవన్దార్లు వారి అయిదు ప్రధాన శిష్యులుకు సంప్రదాయములోని విభిన్న విషయములను ఎమ్పెరుమానర్లకు ఉపదేశించమని ఆజ్ఞా పించారు.వాటి లో తిరుక్కోష్టియూర్ నంబి గారికి రహస్య త్రయ అర్థములను -తిరుమంత్రము, ద్వయ మరియు చరమ స్లోక అర్థములును రామానుజులు వారికి అనుగ్రహించమన్నారు.

ఏ మాత్రము నిబంధనలు లేకుండా , ఆశ ఉన్న వారందరికి చరమ శ్లోక అర్థములను నిస్వార్థముగా పంచినందుకు తిరుక్కోష్ఠియూర్ నంబి గారు రామానుజులు ని ఎమ్పెరుమానార్ అనే తిరునామమును అనుగ్రహిస్తారు.తిరుక్కోష్ఠియూర్ నంబి గారు వారి ఆచార్యులు అయిన శ్రీ ఆళవందార్లు అనుగ్రహించిన తిరుమంత్ర, ద్వయ,చరమ శ్లోకముల దివ్య అర్థములు తో ఎమ్పెరుమాన్ ని ధ్యానము చేసుకుంటూ ఒంటరిగ ఉండేవారు.అందు చేత తిరుక్కోష్ఠియూర్ లో ఉన్న ప్రజలికి కుడా నంబి గారి గొప్పతనము తెలియదు.నంబి గారి గొప్పతనము ఎరిగిన రామానుజులు వారు, నంబి గారి దగ్గర చరమ శ్లోకము యొక్క నీఘుడమైన అర్థములను నేర్చుకునుటకు 18 సార్లు శ్రీ రంగము నుండి తిరుక్కోష్ఠియూర్ వెళ్ళారు. 18 వ సారికి నంబి గారు రామానుజులుకి చరమ శ్లొక యొక్క రహస్య అర్థములను తెలుపుటకు నిశ్చయించుకున్నారు.అర్హత లేని వారికి , కష్టపడి తెలుసుకోవలని అనుకోనివారికి ఈ అర్థములను ఉపదేశించరాదని  రామానుజలను వాగ్దానుము చేయమని కోరుతారు. శ్రీ రామానుజల అంగీకరించి , వాగ్దానము చేస్తారు.తిరుక్కోష్ఠియూర్ నంబి గారు పరమ గోప్యమైన చరమ శ్లోక అర్థమును రామానుజులుకి ఉపదేశిస్తారు.చరమ శ్లోకమ్ – గీతాచార్యుని “సర్వ ధర్మాన్ పరిత్యజ్య” శ్లోకమ్ (గీత – 18.66).ఈ శ్లోకమున, అత్యంత ముఖ్యమైన సిద్దాంతమును  ఏకమ్ అనే పదము ద్వారా ప్రతిపాదించబడినది- భగవనుడే మనకు ఏకైక ఉపాయము.మరి ఇంక ఏ సాధనములు అయిన  కర్మ, ఙ్యాన, భక్తి యోగములు, మనము చేసిన ప్రపత్తి కాని మనకి ఉపాయములు కావు.ఈ భావ గుహ్యమైన చరమ శ్లోకమును అందరికి అందించిన ఇతరులు వారి కర్మలును మానివేసే ప్రమాదమున్నందున రామానుజులు వరుకు వచ్చిన ఆచార్యులు ఈ విషయమును చాలా గోప్యము గా ఉంచినారు.రామానుజులు నంబి గారి దగ్గర నేర్చుకున్న వెంటనే చరమ శ్లొక అర్థమును తెలుసుకోవలన్నా ఆశ ఉన్న వారందరికి ఉపదేశం చేసారు. అది తెలుసుకున్న వెంటనే నంబి గారు రామానుజులు ని పిలిపిస్తారు.రామానుజులు నంబి గారి తిరుమాళిగై చేరుతారు.రామానుజులు తో జరిగిన విషయము గురించి విచారిస్తారు, వారి అజ్ఞాను ఉల్లంఘించినారని రామానుజులు ఒప్పుకుంటారు. ఎందుకు అలా చేసారు అని అడుగగా  “నేను మీ అజ్ఞాని ఉల్లంఘించినందున నాకు నరకము కలిగినప్పటికి విన్న వారు అందరు మొక్షము పొంది, ఉజ్జివించేదరు” అని చెప్తారు.ఇతరులకు నిజమైన ఆధ్యాత్మిక ఙ్ఞానమును ఇవ్వాలనే రామానుజులు వారి యొక్క పెద్ద మనస్సును చూసి నంబి సంతసించి, వారికి “ఎంబెరుమానార్”  అని పిలిచారు.ఎమ్పెరుమాన్ అనగా నా స్వామి(భగవానుడు), ఎమ్పెరుమానార్ అనగా భగవంతుని కన్నా ఎక్కువ కారుణ్యము కల వారు.ఈ విధముగా రామానుజులు చరమ శ్లోకము యొక్క నిఘూఢమైన అర్ధములను చాటి ఎంబెరుమానార్ గా మారారు. ఈ చరిత్రము మనకు ముముక్షుప్పడి వ్యాఖ్యాన అవతారికన (పరిచయము) మణవాళ మామునులు గారి చేత చరమ శ్లోక ప్రకరణమున అతి స్పష్టంగ ,సుందరంగా వివరించబడినది , గమనిక ~:6000 పడి గురు పరమపరా ప్రభావమ్ అందు శ్రీ రామానుజులు తిరుక్కోష్టియూర్ నంబి గారి వద్ద తిరుమంత్ర అర్థమును తెలుసుకుని తరువాత అందరికి చాటి, ఎమ్బెరుమానార్ అని నంబి గారి చేత తిరునామము గ్రహించి , అటు పిమ్మట చరమ శ్లోక అర్థములను తెలుసుకున్నారని చెప్పబడినది.కాని మణవాళ మామునులు ,రామానుజులు చరమ శ్లోక అర్థమును వ్యక్త పరిచారని స్పష్టంగ తెలిపినందువల్లను, మరియు వ్యాఖ్యానములో అనేక చోట్ల “ఏకమ్” అను పదము యొక్క అర్థము అత్యంత రహస్యమైనదని చెప్పునందు వల్ల ,ఇదే  ప్రమాణమని(ఆచార్యులు చెప్పిన ప్రకారముగా) తీసుకుంటిమి.

తిరుక్కోష్ఠియూర్ నంబి గారి వైభవమును అనేక చోట్ల వ్యాఖ్యానముల లో చెప్పబడినది.

 • నాచ్చియార్ తిరుమొళి 12.2 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానమ్,
  • ఇందు ఆండాళ్ ని తిరుక్కోష్ఠియూర్ నంబి గారి తో పోల్చడం జరిగింది. ఎందుకు అనగా నంబి గారు కూడా వారి భగవద్గుణ అనుభవమును ఎవరికీ తెలియజేయలేదు. మన ఆండాళ్ కుడా తనకి కలిగిన భగవత్ విరహమును ఎవరికి చెప్పుటకు ఇష్టపడలేదు.
  • తిరుక్కోష్ఠియూర్ లో ఉన్న ప్రజలి కూడా నంబి గారి గొప్పతనము తెలియదు. రామానుజులు తిరుక్కోష్ఠియూర్ చేరుకోగానే అక్కడ వున్న వారిని   తిరుక్కురుగై పిరాన్ ( నమ్మళ్వార్ పేరు మీదు గా నంబి గారి నిజ నామధేయము)గారి ఇంటి దారి చెప్పమన్నారు. చూపిన వెంటనే ఆ ఇంటి దిక్కుకి సాష్టంగ నమస్కారమును చేసారు. సాక్షాత్ యతిరాజులు వీరికి నమస్కారము చేయుట చూసి అక్కడ ఉన్న స్థానికులు నంబి గారి విలువను తెలుసుకున్నారు.
  • ముదలియాణ్డాన్ మరియు కూరత్తాళ్వానులు శ్రీ నంబి గారి వద్ద 6 నేలలు పాటు వుండి సంప్రదాయ రహస్యాలను తెలుసుకున్నారు.
 • తిరువిరుత్తమ్ 10 – నంపిళ్ళై స్వాపదేశము~: నంబి గారు శ్రీరంగమునకు వచ్చిన ప్రతిసారి రామానుజులు మరచ్చిపురం అనే ఊరు వరుకు సాగనంపేవారు. అలా ఒక సారి రామానుజులు నంబి గారితో “ధ్యానము చేసుకోనుటకు యోగ్యమైన ఒక సంఘటనను చెప్పండి” అని అడుగగా అందుకు నంబి గారు వెంటనే “మా ఆచార్యులు అయిన యామునాచార్యులు స్నానము కై నదిలో మునిగినప్పుడు వారి వీపు భాగము కుర్మాసనము వలే”కనిపించేదని ,వారు లేకపొయినా తాను అదే ఎప్పుడూ ధ్యానము చేస్తానని, రామానుజులుని కుడా అదె ధ్యానము చేయమన్నారు. దీని వలన మనకు తెలిసినది ఏమనగా శిష్యుడు ఆచార్యుని ఉపదేశములకు మరియు జ్ఞాననమునకు ఎంతటి ప్రాముఖ్యత ఇస్తాడో , వారి దివ్య తిరుమేని కూడా ఇవ్వవలెనని తెలుస్తునది.
 • తిరువిరుత్తమ్ 99 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానమ్ ~:ఆళ్వార్, వారు జ్ఞానపిరానుల నే ఉపాయము గా స్వీకరించుదురని అని చెప్పారు.ఈ విషయము ద్వారా చరమ శ్లోకము యందు ఏకం పదము యొక్క అర్థము – మిగిలిన ఉపాయములు తొలగించి భగవంతుడు ఒక్కడే ఉపాయము అనుటకు వివరణనిస్తునది. ఇది సంప్రదాయమునందు చాలా రహస్యమైన అర్థము, దీనినే నంబి గారు రామానుజులకు ఉపదేశించినారు.ఒకసారి, శ్రీ రంగమునకు ఉత్సవము సేవించుటకు వచ్చినప్పుడు, నంబి గారు రామానుజులుని శ్రీ రంగము కోవెల  లో   జనసంచరము లేని ప్రదేశమునకు తీసుకువచ్చి ఏకమ్ అనే పద వివరణ చేయ సాగారు .నంబిగారు చెప్పనారంబించినప్పుడు ఆ మూలన నిద్రపోతున్న ఒక కైంకర్యపరుడిని చూసి వారు చెప్పడం ఆపివేసారు.వెంటనే ఇక్కడ ఎవరో ఉన్నారని అర్థమును చెప్పరు.తరువాత నంబి గారు రామానుజులు అర్థ విశేషములను తెలిపి , ఈ అర్థములను అర్హత ఉన్న వారికే అనుగ్రహించ వలెనని చెప్తారు. మండుట యెండను లెక్క చేయక  తెలిసిన అర్థములు తెలిసినట్టుగా వెంటనే కురత్తాళ్వాన్ యెడకి వెళ్ళి  ఏ ప్రతిఫల ఆపేక్ష లేకుండా  ఉపదేశిస్తారు,ఈ విధంగా, అర్థములను తెలుసుకునుటకు ఆళ్వాన్ ఎటువంటి శ్రమను చేయకున్నను, ఎమ్పెరుమానార్ ఆళ్వాన్ తో అర్థ విశేషములను పంచుకుని  సహకారి నైరపేక్ష్యమ్ ని (మనము చేసిన ఉపకారమునకు ప్రతి స్పందన ఆశించకుండా)  ఇక్కడ చాటి చెప్తున్నారు.
 • తిరువిరుత్తమ్ 95 – (యాతానుమ్ ఓర్ ఆక్కయిల్ పుక్కు పాశురమ్) నంబి గారికి ఈ పాశురమ్ చాలా ఇష్టమైనదని వారి శిష్యులలో ఒకరు నంజీయరు గారికి తెలుపుతారని ఈ వ్యాఖ్యానము యందు చెప్తారు .జీవాత్మ నిరంతరము లౌకిక విషయములలో మునిగి తేలుతున్నను ఎమ్పెరుమాన్ జీవాత్మ పై చూపించే నిర్హేతుక కృపను ఈ పాశురమున చెప్పబడినది.
 • తిరువాయిమొళి 1.10.6 – నమ్పిళ్ళై వ్యాఖ్యానమ్ –ఆళ్వారులు వారికి కలిగిన భగవద్ అనుభవమును వారి మనస్సుతో చెప్పుకునేవారు . ఈ విషయమును వివరించుటకు,నమ్పిళ్ళై గారు నంబి గారి ఉదాహరణ ఇస్తు చేస్తారు. ఎమ్పెరుమాన్ విషయము చాల గొప్పది, దానిని అందరు అర్థము చేసుకోలేరు.అందుకే నంబి గారు ఒంటరిగా భగవద్ అనుభవములో ఉంటారు , అదే విధంగా ఆళ్వారులు వారి మనస్సుతో చెప్పుకునేవారు
 • తిరువాయిమొళి 8.8.2 — రామానుజులు ప్రసంగిస్తున్నప్పుడు జీవత్మ సహజ స్వరూపమును గూర్చి ప్రశ్న తలెత్తుంది “ఙ్ఞాతృత్వమా లేక శేషత్వమా (పరమాత్మ కి శేషుడా)”? అని, అప్పుడు రామానుజులు కూరత్తాళ్వాన్ ని తిరుకోష్ట్టియూర్ నంబి గారి దగ్గర తెలుసుకునుటకు పంపించారు. కూరత్తాళ్వాన్ నంబి గారి కి ఆరు నేలలు శుశ్రుష చేస్తారు.నంబి వారు వచ్చిన కారణము అడుగుతారు.రామానుజులు కి కలిగిన ప్రశ్న గురించి వారికి విన్నవిస్తారు కూరత్తాళ్వాన్. వెంటనే నంబి గారు మన ఆళ్వారులు వారి ప్రబంధమ్ లో “అడియేన్ ఉళ్ళాన్” అనగా జీవత్మ దాసుడు అని చెప్పారు. మరి వేదాంతము జీవుడు ఙ్ఞానం కలిగిన వాడని ఎందుకు చెప్తుంది అని అడుగగా.ఇక్కడ ఙ్ఞాతృత్వము ఏమనగా పరమాత్మ కి జీవుడు దాసభూతుడనే ఙ్ఞానం కలిగి ఉండుట.” ఆళ్వారులు మరియు నంబి గారు వివరించినట్టుగా ఎమ్పెరుమాన్ కి శేషుడనే ఙ్ఞానం కలిగిన వాడే జీవాత్మ.

తిరుకోష్ఠియూర్ నంబిగారు ఎంబెరుమానారుల వైభవమును స్థాపించుట చరమోపాయ నిర్ణయము అను గ్రంథము లోను చూపబడినది.ఈ క్రింది లింకున పొందుపర్చడమైనది.

http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujars-acharyas.html

తిరుమాలై ఆండాన్ రామానుజులుకి తిరువాయిమొళి కాలక్షేపమును అనుగ్రహించు సమయమున వారి ఇరువురికి కలిగిన చిన్న విభేధము కారణమున కాలక్షేపము అగిపోయినది.అప్పుడు నంబి గారు అండాన్ తో రామానుజులు అవతార పురుషులు , ఙ్ఞానులని అని తెలియజేసి కాలక్షేపము కొనసాగేల చేసిరి.
ఒక సారి రామానుజులు కు గిట్టని వారు వారికి భిక్ష లో విషమును కలిపిరి.ఈ విషయమును తెలుసుకున్న రామానుజులు ఆహరము మాని ఉపవసించారు. ఈ విషయమును తెలుసుకున్న నంబి గారు శ్రీరంగమునకు బయలుదేరిరి.నంబి గారిని స్వాగతించుటకు రామానుజులు ఎదురువెళ్ళి మండుటెండలో సాష్టాంగ ప్రణామము చేసిరి. నంబి గారు రామానుజులుని లేవమని అనక అలానే చూసిరి. అప్పుడు రామానుజులు శిష్యుడు అయిన కిడామ్బి ఆచ్చాన్ అను వారు రామానుజులుని పైకి లేపి నంబిగారిని సవాల్చేస్తారు. అప్పుడు నంబి గారు రామానుజుల తిరుమేని పై ఎవరికి అభిమానము ఉన్నదని తెలుసుకునుటకు ఆ విధంగా ప్రవర్తించానని చెప్పి, కిడామ్బి ఆచ్చాన్ను ఎమ్పెరుమానార్ కు రోజు ప్రసాదమును చేయమనిరి.ఈ విషయము ద్వారా నంబి గారికి రామానుజులు అంటే చాలా ప్రీతి అని , వారి బాగు కోరే వారని తెలుస్తుంది.

ఇలా తిరుకోష్ఠియూర్ నంబిగారు వైభవమును తెలుసుకున్నాము శ్రీ రామానుజులుకి ఎంబెరుమానార్ అనే తిరునామము వచ్చుటకు కారణమై,అదే పేరు మీదుగా నంపెరుమాళ్ ద్వారా మన సంప్రదాయమునుకు ఎంబెరుమానార్ దర్సనం అని పేరు వచ్చుటకు దోహదపడ్డారు.ఈ విషయమును మణవాళమామునులు వారి “ఉపదేశ రత్నమాల” అను గ్రంథమున చెప్పిరి.
యామునాచార్యులు, రామానుజులు పై అపారమైన ప్రేమ కలిగి వున్న తిరుకోష్ఠియూర్ నంబిగారి శ్రీపాదములుకు మనం అందరమూ సాష్ఠాంగ ప్రణామములను అర్పిద్దాము.

తిరుక్కోష్ఠియూర్ నమ్బి తనియన్:

శ్రీవల్లభ పదామ్భోజ దీభక్త్యామ్రుత సాగరమ్ |
శ్రీమద్గోష్ఠీపురీపూర్ణమ్ దేసికేంద్రమ్ భజామహే ||

తెలుగు అనువాదము~: సురేశ్ కృష్ణ రామానుజ దాస

source

పెరియ తిరుమలై నంబి

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్ వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః

periya-thirumalai-nambi

తిరునక్షత్రము: వైశాఖ మాసము,స్వాతి

అవతార స్థలము: తిరువేంకటము

ఆచార్యులు: శ్రీ ఆళవన్దార్

శిష్యులు: రామానుజులు (గ్రంథ కాలక్షేప శిష్య) ,మలైకునియ నిన్ఱ పెరుమాళ్, పిళ్ళై తిరుక్కులముడైయార్, భట్టారియరిల్ శఠగోపదాసులు.

శ్రీ తిరుమల నంబి గారు శ్రీ వేంకటనాథుని కృప తో తిరుమలలో జన్మించారు. వీరు శ్రీ ఆళవన్దార్ శిష్యులలో ప్రధానులు. వీరికి ఆ వేంకటనాథుని పైన ఉన్న ప్రేమ చేత ఆ భగవంతుడే వీరిని “పితామహ” అని పిలిచి బిరుదు ఇచ్చినారు.

 శ్రీ ఆళవన్దార్లు వారి అయిదు ప్రధాన శిష్యులుకు అయిదు ప్రధాన బాధ్యతలను ఉడయవర్ విషయము లో అప్పగించిరి.తిరుమల నంబి గారిని మన సాంప్రదాయములో శరణగాతి శాస్త్రమైన రామాయణమును రామానుజులు కి అనుగ్రహించమనిరి.

భగవత్ రామానుజులు కి వీరు స్వయముగా మేనమామ అవుతారు. వీరు రామానుజులు కి “ఇళయాళ్వార్” అని నామకరణమును చేసిరి. వీరు తిరుమలలో నిత్య కైంకర్యపరులు.తిరువేంకటనాథునికి నిత్యము ఆకాశ గంగ తీర్థమును తెచ్చేవారు.

భగవత్ రామానుజులు వారి పిన్ని కొడుకు అయిన గోవిందుడుని మరల శ్రీ వైష్ణవ సంప్రదాయము లోకి తీసుకు రావలనే ఆకాంక్షతో (గోవిందుడు తాను కాశీ యత్ర లూ ” ఉళ్ళన్గై కొణర్న్త నాయనార్ ” గ పిలువబడి శ్రీ కాళహస్తి లో దేవతాన్తరమును పూజిస్తు వుండి పోయారు). వారి వద్దకు వెళ్ళి వారిని మార్చే బాధ్యతను తీసుకోవలసిందని తిరుమల నంబి గారికి ఒక శ్రీ వైష్ణవుడి ద్వారా విన్నవిన్చినారు.

గోవింద్ పెరుమాళ్ ని చూడడానికి తిరుమల నంబి గారు వారి శిష్యులు మరియు శ్రీ వైష్ణవుల(వారు మరల శ్రీ రంగమ్ చేరి ఎమ్పెరుమానార్ల్ తో జరిగిన సంఘటన తెలియజెస్తారు ) తో కలిసి శ్రీ కాళహస్తి కి వేంటనే తరలి పోతారు, గోవిందుడు ప్రతిరోజు వెళ్ళే దారి లో ఉన్న చెట్టు నీడన కుర్చున్నారు నంబి గారు.గోవిందుడు అక్కడి శివ భక్తునిల విభుతి రేఖల తో రుద్రాక్ష మాల తో శరీరమంతా మూడు నామముల తో రుద్రుడిని స్తుతిస్తూ అక్కడికి వచ్చేరు. నంబి గారు వెంటనే ఎమ్పెరుమాన్ ని స్తుతించారు, గోవింద్ పెరుమాళ్ వారిని ఆశక్తి తో చూస్తూ ఉండిపోయారు . కొన్ని రోజులు తరువాత , శ్రీ తిరుమల నంబి గారు,అదే స్థలమునకు, అదే సమయములో వచ్చి శ్రీ ఆళవందారుల స్తొత్రరత్నము లోని 11 వ శ్లోకమును(ఎమ్పెరుమాన్  యొక్క స్వాభావికమైన పరతత్వము , ఇతర దేవతల పరాధీనత్వము తెలుపునది) ఒక తాటిపత్రము పై వ్రాసి అక్కడ జార విడుస్తారు.వస్తున్న దారి లో, ఆ పత్రమును కనిపించగా తీసి, చదివి మరల దానిని క్రింద పార వేస్తారు గోవింద్ పెరుమాళ్. తన తిరిగి ప్రయాణములో,ఆ పత్రమును వెతికి పట్టుకుంటారు.దాని అర్థమును నెమరువేసుకుంటు,నమ్బి గారి వద్దకు చేరి ఆ పత్రము తనదా అని అడిగిరి.ఇరువురి మధ్య సంభాషణము మొదలయి, గోవింద్ పెరుమాళ్ కు శ్రీ మన్నారయణుని పరత్వము పై గల అన్ని సందేహములును తీర్చిరి నంబి. నంబి గారు చెప్పిన సమాధానములుకు కొంతవరకు సంతుష్టి చెంది గోవిందుడు పయనమవుతారు.తరువాత గోవిందుడు రుద్రునికి పూజ చేయుటకు పూవ్వులును కోస్తూ వున్నప్పుడు, శ్రీమన్నారాయణుని పరత్వమును చెప్పు పదిగమైన ” తిణ్ణన్ వీడు (తిరువాయ్ మొళి 2.2)” ను నంబి గారు ఉపన్యాసము చేస్తారు. ఆ పదిగమ్ లోని నాలుగవ పాశురములో నమ్మాళ్వార్ స్తాపించిన అర్థమును మిక్కిలి అందముగా ప్రసంగిస్తు,పూవ్వులు మరియు ప్రార్ధనలు ఎమ్పెరుమాన్ కు మాత్రమే తగును అని అనుగ్రహించారు.ఈ అర్థములను విన్న గోవిందుడు వెంటనే చెట్టు దిగి శ్రీ నంబి గారి పదములు పైన పడి, ఆర్తి తో కంట్ నీరు తో, తాను ఇన్ని రోజులు మాయచే కప్పబడి వున్నానని తనని ఉద్దరించమని సాష్టాంగ నమస్కారము చేసారు .నంబి వారిని ఓదార్చి స్వీకరించిరి.గోవిందుడు కళహస్తి తో తనకు ఉన్న బంధుత్వమును వదులుకొని , ధనాగరము తాళము చెవులను అక్కడ వున్న రుద్ర భక్తులుకి అప్పగించారు.వారికి మునపటి రాత్రి స్వప్నమున రుద్రుడు సాక్షాత్కరించి రామానుజులు ఈ భుమి పై నిజమైన జ్ఞానమును అందరికి ఇచ్చుటకు వచ్చారు అని అందు చే గోవిందు వారి పట్ల అనుబంధమును వదిలివేసుకుంటునప్పుడు అడ్డు చెప్పవద్దని చెప్పారని స్వప్న వృత్తాంతమును చెప్పినారు.వారందరు సంతోషముగా గోవిందుడుని పంపిస్తారు.

తిరుమలై తిరిగి వచ్చిన తరువాత నంబి గారు గోవిందునికి ఉపనయన సంస్కారదులు,పంచసంస్కారాలు చేసి ఆళ్వారుల ప్రభందములును నేర్పిరి.

భగవత్ రామానుజులు తిరుమలకి వేంచేసినప్పుడు శ్రీ తిరుమల నంబి గారు స్వాగతించుటకు తిరుమల కొండ స్వాగత ద్వారము కడకి వచ్చిరి.రామానుజులు ” ఈ దాసుడు ని స్వాగతించుటకు మీరు రావలా ? ఇంక ఎవరినైన చిన్న వారిని పంపించ కూడాదా” అన్న రామానుజుల మాటలకు నంబి గారు యెంతో వినమ్రత తో తాను బాగా వేతికి చూస్తే తనకంటే చిన్నవారు తన లేరు అని పలికారు. రామానుజులు శ్రీవేంకటనాథునికి మంగళాశసనము చేసి కొండ దిగారు.

ptm-ramayana-goshti

periya thirumalai nambi’s srI rAmAyaNa kAlakshEpa gOshti

శ్రీ రామానుజులు నంబి గారి దగ్గర శ్రీరామాయణమును నేర్చుటకు తిరుపతి వచ్చి అక్కడనే ఒక సంవత్సర కాలము ఉన్నారు. నంబి గారు శ్రీరామాయణమును అంతా వివరించిన తరువాత ,శ్రీ రామానుజులు ని వారి దగ్గర నుంచి ఏమైన స్వీకరించమని అడిగారు. దానికి శ్రీ రామానుజులు
గోవిందుని తనతో పంపమని అడిగిరి. నంబి గారు సంతోషముగా పంపించినారు. కాని గోవిందుడు వారి ఆచార్యులుని విడిచి వుండలేక తిరిగి నమ్బి గారి యెడకి వచ్చినాడు.అప్పుడు నమ్బి గారు గోవిందునితో మాటలాడక ఇప్పుడు గోవిందుడు శ్రీ రామానుజులుకి చెందిన వాడని,వెళ్ళిపోవలెనని చెప్పారు. ఈ వృత్తాంతమును ఈ క్రింది వెబ్ లింకున పొందుపర్చబడినది.
http://ponnadi.blogspot.com/2013/01/embars-acharya-nishtai.html

అటు తరువాత గోవిందుడు సన్యాస ఆశ్రమును స్వీకరించి ఎంబార్ అని పేరు గాంచిరి.

నంబి వైభావము మరియు వారి వివరణములు వ్యాఖ్యానములో చాలా చోట్ల ప్రసంగించబడ్డాయి , వాటిలో కొన్నింటిని ఇక్కడ చూద్దాం

 • తిరుప్పావై.14 తిరుప్పావై అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ – నంబి గారు తిరుప్పావై నందు “చెన్గల్ పొడిక్కూఱై వెణ్పల్ తవత్తవర్” అను దానికి ఈ విధముగా చెప్పినారు. గోపికలును నిదుర లేపుతున్న సమయమున కాషాయ బట్టలును ధరించి తెల్లని దన్తకాంతి కలవారై ఉన్న సన్యాసులు ఆలయమునుకు పోవుచున్న దాన్ని బట్టి అక్కడ చాలా పవిత్రమైన వాతావరణము నెలకొల్పబడిన విషయమును చెప్పినారు.
 • నాచ్చియార్ తిరుమొళి 10.8 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానమ్ -పాశురమ్ (మళైయే మళైయే) దాని తరువాత వచ్చు పాశురం అయిన (కడలే కడలే) అనునది నంబి గారికి చాల ప్రియమైనవి.ఈ పాశురం న ఆండాళ్ తాను అనుభవిస్తున్న భగవద్ విరహాన్ని మేఘము ద్వార తిరువేంకటముడైయాన్ కి తన వర్తమానమును పంపినది.ప్రతిసారి ఈ పాశుర విన్నపమున నంబి గారు తథాత్మ్యత ని చెందేవారు. ఈ కారణమున మన పుర్వాచర్యులు అందరికి ఇవి చాలా ప్రియమైనవి.
 • తిరువిరుత్తమ్ 3 – నమ్పిళ్ళై వ్యాఖ్యానమున-ఆళ్వార్లు వారికి కలిగిన భగవద్ అనుభవము మానసిక సాక్షాత్కరముగా ఉండిపోతుందా లేకుంటే బాహ్య సాక్షాత్కరము కలిగి, అనుభవము కలుగున అని వాపోతున్న మనస్సును -తిరుమల నంబి గారు అవిష్కరించారని పిళ్ళై తిరునరైయూర్ వివరించారు.
 • .తిరువాసిరియమ్ 1 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానమ్– ఆళ్వారులు పెరుమాళ్ యొక్క సౌందర్యమును “పచ్చని దుప్పటి పర్చిన కొండ వలే తాను పడుకుని ఉన్నాడు. ” అని వర్ణించారు. వారు “తూన్గువతు”(పడుకునివున్నాడు) అనే సాధారణ పదప్రయోగమును చేయక “కణ్వళర్వతు”(శయనించివున్నాడు) అనే చక్కటి పదప్రయోగము చేసి వారి పదప్రయోగ విన్యాసము తెలియపరిచారు. ఎమ్పెరుమానర్ తో ఒకరిని పోల్చె సమయములో ” బంగారపు కుండలాలును ఇచ్చిన పెట్టుకోలేని వారు” అని నంబి సంభోదిస్తారు. ఇక్కడ నంబి ఎవరు ఎంత మంచి మాటలు చెప్పిన వినని వారి గురించి చెప్తున్నారు.చాలా సుతిమెత్తని మాటల తో వారు యెత్తిచూపిన విధానము బట్టి శ్రీవైష్ణవులు ఆవలి వారి లో దోషములును తప్పక చెప్పవలిసి వస్తే ఇలా అందముగా చెప్పాలి అని నిరూపించారు.
 • తిరువాయ్మొళి 1.4.8 – నమ్పిళ్ళై వ్యాఖ్యానమున—– ఆళ్వార్లు యొక్క భగవద్ విరహమును (నాయికా భావమున) ఒక పక్షికి చెప్పుతారు (తన స్థితిని పెరుమాళ్ కి విన్న వించమంటారు) ఇంక తన శరీరమున శక్తి మరియు అందము పోయి, ఆయన విరహమున తాను సుష్కించిపోయాను అని చెప్పమనిరి.అందుచేత ఆళ్వార్లు ఆ పక్షి యొక్క ఆహార విషయము తననె వెత్తుకోవలెనని, తాను ఏమీ సహాయము చేయలేకపోతున్నానని విలపించిరి. నంపిళ్ళై గారు, తిరుమలనంబి గారి జీవిత విషయమును గుర్తుతెచ్చుకుంటు, తిరుమలనంబి గారు చరమ దశ లో వారి నిత్య తిరువారాధన పెరుమళ్ అయిన వెణ్ణైక్కాడుమ్ పిళ్ళై (వెన్న కోసమ్ నాట్యమ్ చేసే కృష్ణుడు) తో ఇంకా వారికి ఒపిక లేనందున పెరుమాళ్ని వేరు ఎవరినైన ఆరాధన చేయుట కొరుకు వెత్తుక్కోమని చెప్పినట్టు విన్న వించారు.

తిరుమలనంబి గారు ఎమ్పెరుమానర్ల గుణగణములను కీర్తించిన విధానము
చరమోపాయ నిర్ణయమ్ అను గ్రంథము లోను చెప్పబడినది.ఈ క్రింది లింకున పొందబర్చినది.

http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujars-acharyas.html

ఈ విధముగా , తిరుమల నంబిగారి గొప్పతనమును తెలుసుకున్నాము.

యామునాచార్యులు, రామానుజులు మిక్కిలి ప్రేమ వున్న తిరుమలనంబి గారి శ్రీపాదములుకు మనం అందరమూ సాష్ఠాంగ ప్రణామములు అర్పిద్దాము.

గమనిక~: వీరి తిరునక్షత్రము 6000పడి గురు పరంపరా ప్రభావమున మరియు తిరుముడి అడైవు అనుసరించి చైత్రమాసము స్వాతి నక్షత్రము గా పెర్కొనబడినది. కాని వాళి తిరునామమున వైశాఖ మాసము స్వాతి నక్షత్రము గా చెప్పబడినది , ఆరోజే జరుపుకుంటున్నాము.

పెరియ తిరుమలై నంబి తనియన్:
పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేచపలప్రదాయ
శ్రీభాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమ: స్తాత్

source

అడియెన్
సురేశ్ కృష్ణ్ రామనుజ దాస

అప్పిళ్ళార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
OLYMPUS DIGITAL CAMERA
తిరునక్షత్రము; తెలియదు
అవతారస్థలము; తెలియదు
ఆచార్యులుమనవాళమామునులు
వారు అనుగ్రహించిన గ్రంధములు; సాంప్రదాయ చంద్రికై, కాల ప్రకాశికై

అప్పిళ్ళార్ గొప్ప ఙ్ఞాని.వీరిని అప్పిళ్ళాన్  అని కూడా అంటారు.వీరు ఎంబెరుమానార్ శిష్యులైన కిడాంబి ఆచ్చాన్  పరంపరవారు.మనవాళమామునుల శిష్యులై అష్టదిగ్గజాలలో ఒకరయ్యారు

శ్రీరంగనాధుఙ్ఞ మేరకు మామునులు  శ్రీరంగములో వేంచేసి మన సంప్రదాయ పరిమళాలను నాలుగుదిశల వ్యాపింపచేస్తున్న కాలంలో ఎందరో ఆచార్యపురుషులు వీరి ఉత్తరభారతంలోని ఎందరో పన్డితులను అవలీలగా గెలిచారు.ఆ గర్వంతో ఎరుమ్బి అప్పాతో వాదుకు వచ్చారు.కాని ఎరుమ్బి అప్పాను చూడగానే వారికి దాసోహమన్నారు. వారి దగ్గర కొత్త కొత్త అర్ధాలను తెలుసుకులున్నారు .కొంతకాలం తరవాత వారు శ్రీరంగనకుము బయలు దేరుతూ ఎరుమ్బి అప్పా ధగ్గరకు వెళ్ళి మామునులతో వాదుకు బయలుదేరుతున్నానని  సెలవుతీసుకొరారు.అలా ఎప్పటికి చేయకండి.వారు మహా పండితులు.కాంచేపురములో కిడాంబి ఆచ్చాన్ దగ్గర శ్రీభాష్యము సేవించినవారు.ఆరోజులలో ఒకసారి  కిడాంబి ఆచ్చాన్ మామునులను పాతపాఠాలలో .పరీక్షించమని కోరారు మామునుల అపారమైన ఙ్ఞాపక శక్తికి,ఙ్ఞానమునకు నేను ఆశ్చర్యపోయాను.వారు సన్యాసులందరికి నాయకులు.మన సంప్రదాయాన్ని పునరుజ్జీవింప చేస్తున్నారు.  వారిని మనం  గౌరవించాలి కాని వాదులాడరాదు. ముందు ముందు వారి గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలియజేస్తాను అన్నారు. ఇది విన్న అప్పిళ్ళార్ మామునుల గురించి ఓ మేరకు తెలుసుకొని ఎరుమ్బి అప్పా నుండి సెలవు తీసుకొని వెళ్ళారు.

మామునులు శ్రీరంగనాధుని ఆఙ్ఞ మేరకు శ్రీరంగములో నివాసముండిమన సంప్రదాయ ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియచెప్పేవారు.ఎరుమ్బి అప్పా శ్రీరంగము వచ్చి మామునుల శిష్య వర్గములో చేరిపోయారు.కొంతకాలము అక్కడే వుండిపోయారు. తమ స్వస్థలమైన ఎరుమ్బి వెళ్ళదలచి బయలుదేరారు.అంతలో కొన్ని దుశ్శకునాలు కనపడినవి.వెంటనే మామునులను చూసి చెప్పారు అందుకు వారు ఒక వింత జరగబోతున్నది.మీరు ఇక్కడే ఉండి దానినిచూడండి అన్నారు.
ఆ సమయములో అప్పిళ్ళార్,అప్పిళ్ళై ఇద్దరూ సకుటుంబముగా శ్రీరంగము వచ్చారు.మామునుల గురించి విని యున్నప్పటికి వారికి ఆ విషయములో అంతగా ఆసక్తి లేకపోయింది.అప్పటికే వారు ఙ్ఞాన సంపన్నులగుటచే తమశిష్య.బృందముతో కావేరి తీరములో విఢిది చేసారు మామునుల ప్రాభవమును కళ్ళారా చూసి చేవులారా విని ఆశ్చర్యపోయారు.అప్పటికే ఙ్ఞాన,భక్తి వైరాగ్య సంపన్నులైన కందాఢై అన్నన్,ఎరుమ్బియప్పా వంటివారు మామునులను ఆశ్రయించివున్నారు.అప్పిళ్ళార్ ఎరుమ్బిఅప్పా ఙ్ఞాన సంపదను గురించి తెలిసినవారు.మామునులలో ఎదో గొప్పతనము వుందని గ్రహించారు. అప్పిళ్ళార్ మామునుల మఠములోపలికి వెళ్ళగల స్వామితో  వాకిలిదాక కలసి వెళ్ళిమఠములోకి వెళ్ళి  అప్పిళ్ళార్ వచ్చారని చెప్పమన్నారు.వారు లోపల్ల్లికి వెళ్ళి ఎరుమ్బి అప్పాను చూసి అప్పిళ్ళార్ వచ్చారని చెప్పారు. అది విన్న ఎరుమ్బిఅప్పా ‘ఆహా అప్పిళ్ళార్ మంచికాలము ఆసన్నమైనది అని సంతోషించి  వెంటనే బయటకు   వచ్చి అప్పిళ్ళార్ను కలుసుకున్నారు.ఎరుమ్బిఅప్పా భుజములమీద ఉన్న శంఖ ,చక్రముల గుర్తులను చూసిన అప్పిళ్ళారుకు ఎరుమ్బిఅప్పా ఈ మధ్యనే మామునుల శిష్యులైయ్యారని అర్థమైంది పరస్పర నమస్కారములు,ఉభయకుశలముల తరవాత ఎరుమ్బిఅప్పా తాను మామునులను ఆశ్రయించిన విధమును వివరించారు.
ఇంతలో వానమామలై జీయరు మామునుల దగ్గరకు వెళ్ళి మహా ఙానవైరాగ్య సంపన్నులైన అప్పిళ్ళార్,అప్పిలై వేంచేస్తున్నరని తెలియజేసారు.అంతే కాదు వారు మామునుల తో ఆచార్య సంభందము కోరి వస్తున్నారని తెలియజేసారు. దీనిలో 6సూత్రాలు ఇమిడి వున్నాయి.అవి ఈ క్రింది శ్లోకములో తెలుసుకోగలము.
ఈశ్వర్శ్చ సౌహార్ధం యత్రుచ్చా సుహృదమ్ తతా విషఃణో కటాక్షం ,అధ్వేషమ్ ఆబిముఖ్యమ్ చ సాత్వీక; సమ్భాషణమ్ షటేతాని
1 పరమాత్మ దయార్దహృదయుడు,సమస్తజీవరాసుల సంక్షేమం ఆయనే చూసుకుంటాడు.
2. పరమాత్మ కటాక్షం కావాలనే కోరిక
3.జీవాత్మలమీద పరమాత్మ క్రృపా కటాక్షం .
4.పరమాత్మ కృపకు అడ్డుపడకుండుట/అద్వేషము లేకుండా వుండుట.
5..జీవాత్మ. పరమాత్మ పట్ల ఆభిముఖ్యము కలిగివుండుట.
6.భాగవతులతో సాత్విక సంభాషణం.
అందువలన వారు ఇప్పటికే ఎరుమ్బి అప్పాతో సంభాషించి వున్నందున తమరి శిష్యరికము చేయడానికి అన్ని అర్హతలు పొందివున్నారు.తమరు కూడా నిరంతరం జీవాత్మల ఉన్నతి కోసమే కృషి చేస్తున్నవారు. మీరు దయతో వారిని తమ శిష్యులుగా చేసుకోవాలని ఎరుమ్బి అప్పా ఈ దాసుడు కోరుకుంటున్నామని పొన్నడిక్కాల్ జీయర్మామునులను లకు విన్నవించుకున్నారు
ఉభయకుశలముల తరవాత జీయరు వీరందరిని కొయిల్ అన్నన్ తిరుమాళిగకు తీసుకు వెళ్ళారు.అక్కడ కొయిలన్నన్ మామునుల ప్రభావమును గురించి వివరముగా చెప్పారు.మామునులు మరెవరో కాదు. రామానుజుల అవతారమే అని చెప్పటంతో అప్పిళ్ళై,అప్పిళ్ళార్ మామునులను ఆశ్రయించాలని ఆతృత పడ్డారు.అందరూ కలసి పళ్ళు ,తాంబూలాదులతో మఠమునకు చేరున్నారు.మఠములో తిరుమలై ఆళ్వార్ మండపములో మామునులు ఆశీనులై వున్నారు.ఎగుభుజములు,విశాలవక్షము,కరుణపొంగుకన్నులు కాషాయాంభరము చేతిలో త్రిదండము లతో మామునులు తేజరిల్లుతున్నారు.చిరునగవుతో అందరిని ఆహ్వానించారు. అప్పిళ్ళై,అప్పిళ్ళార్ సాష్టాంగ నమస్కారాలు సమర్పించి మామునుల ఆనతి కొసము వేచి వున్నారు.మామునులు ఎంతో ఆదరముతో అంగీకారము తెలిపిముఖ్య సూత్రాలను తెలియజేసారు. పంచసంస్కారము చేసి శిష్యులుగా చేసుకున్నారు.మామునులు వారందరినీ శ్రీరంగనాధుల సన్నిధికి తేసుకువెళ్ళారు.క్రమముగా ఆండాళ్ఎంబెరుమానార్నమ్మాళ్వార్సేనైముదలియార్, గరుడాళ్వార్, శ్రీరంగనాధులు,శ్రీరంగనాచ్చియార్,పరమపద నాధులను సేవించుకున్నారు.మఠమునకు తిరిగివచ్చిన తరవాత మమునుల శేషమును స్వీకరించి ఆచార్య నిష్ఠనుపాటించారు.
జీయర్ మఠ నిర్వహణ భాద్యతను అప్పిళ్ళార్ కి అనుగ్రహించారు.కిడాంబి ఆచ్చాన్ లాగా వీరు కూడా జీయర్ మఠ నిర్వహణతో పాటు ఎమ్బెరుమానార్లకు కైంకర్యము చేసేవారు. అప్పిళ్ళార్,జీయర్ నరాయణన్(పూర్వాశ్రమములో మామునుల మనవడు) మామునుల నిత్యారాధనకొరకు అర్చా విగ్రహముఅనుగ్రహించమని కోరారు.అప్పుడు మామునులు తన చెంబును వారిద్దరికి ఇచ్చి దానిని రెండు విగ్రహాలుగా చేసుకొని చెరొకటి తీసుకొమన్నారు.దీనివలన అప్పిళ్ళార్ మామునులకు ఎంత ప్రీతి పాత్రులో మనకు భోద పడుతుంది.
అప్పిళ్ళార్ తనియన్ ~:
కాంతోపాయంత్రు యోగీంద్ర సర్వ కైంకర్యదూర్వహమ్ తదేక దైవతమ్ సౌమ్యమ్ రామానుజగురుమ్ భజేఅడియేన్ చూడామణి రామానుజదాసి

తిరువరంగప్పెరుమాళ్ అరయర్

 

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః

thiruvarangaperumal-arayar

తిరువరంగప్పెరుమాళ్ అరయర్ శ్రీరంగం

తిరునక్షత్రము~: వైకాశి, కేట్టై

అవతార స్తలము~: శ్రీ రంగము

ఆచార్యులు~: మణక్కాల్ నమ్బి, ఆళవన్దార్

శిష్యులు~: ఎమ్పెరుమానార్ (గ్రంథ కాలక్షేప శిష్యులు)

పరమపదించిన చోటు ~: శ్రీరంగము

తిరువరంగప్పెరుమాళ్ అరయర్, వీరు శ్రీ అళవందార్లకు తొలి సంతానము. ప్రథమ శిష్యులు.
అరయర్లు ఆళ్వార్ల ప్రభందాలకు చక్కటి అభినయము చేస్తు శ్రావ్యముగా పాడగల నైపుణ్యము కలవారు.

ఎప్పటిలాగానే శ్రీరంగంన అధ్యయన ఉత్సవములు జరుగుచుండగ తిరువరంగ పెరుమాళ్ అరయర్ (అరయర్ అనగా శ్రీరంగంన పెరుమాళ్ళకి అళ్వార్ పాశురములును శ్రుతి లయ భద్దముగ పాడుతూ అభినయము చేశేవారు).నమ్మాళ్వారుల తిరువాయ్ మొళి (10.2) లో ఉన్న తిరువనంతపురమున పద్మనాభ స్వామి పై పాశురమును పాడిరి. “నడమినో నమర్గళుళ్ళీర్ నాముమక్కు అఱియచ్ చొన్నోమ్” ఓ భక్తులరా మనం అందరము తిరువనంతపురమునకు నడిచి పోదాము అనే అర్దము వచ్చే పాశురమును అరయర్ పాడిరి.
ఇది విన్న శ్రీ ఆళవందార్లు పరవశించి అది పెరుమాళ్ళ అనుఙ్ఞ గా భావించి తిరువనంతపురమునకు వెళ్ళిరి. అచట శ్రీ పద్మనాభ స్వామి కి మంగళాశాసనమును చేసిరి.

శ్రీ ఆళవందార్ సూక్తులు బట్టి అరయర్లు నంపెరుమాళ్ ,తిరుప్పాణాళ్వారులపై భక్తి ని కనబరిచిరి.
శ్రీ ఆళవందార్ చివరి రొజులలో వారు స్వయముగా లోకాన్తమున అరయార్లు కి నంపెరుమాళ్ ,తిరుప్పాణాళ్వారులపై భక్తిని గురించి బాహాటముగ అందరి సమక్షమున చెప్పిరి. ఇది అరయార్లు భక్తి భావములకు నిదర్శనము.

శ్రీ ఆళవందారుల తరువాత రామనుజులు శ్రీరంగం వచ్చుటకు అరయర్లు ప్రధాన కారణము అని చెప్పవచ్చును. శ్రీవైష్ణవులు అందరూ రామానుజులని కంచీపురం నుంచి శ్రీరంగంనకు స్థిరంగా రావాలని
కోరుకుంటూ నంపెరుమాళ్ళని వేడుకొంటిరి. పెరియ పెరుమాళ్ శ్రీ వరదరాజ స్వామికి రామానుజులని శ్రీరంగం పంపించమని వర్తమానమును పంపిరి. కాని అందుకు శ్రీ వరదరాజ స్వామి రామనుజులు తనకి చాల ప్రియమైన శిష్యుడు అని నిరాకరించిరి.అందుకు శ్రీ పెరియ పెరుమళ్, శ్రీ వరదరాజ స్వామికి సంగీతము చాల ప్రియము కావున ఈ పనిని అరయర్లకి అప్పగించిరి.

varadhar-arayar-ramanujar
మన అరయర్లు వెంటనే కాంచీపురంనకు ప్రయాణమయ్యిరి.అక్కడ కాంచీపురంనకు చెరుకొగానే
వరమ్ తరుమ్ పెరుమాళ్ అరయర్ ( కంచీపురం అరయర్లు) వారికి స్వాగతం పలికి వారి తిరుమాళిగై (ఇల్లు) నకు తీసుకువెళ్ళిరి. అరయర్లు రాక తెలుసుకున్న తిరుకచ్చి నంబి గారు అచటకి వచ్చి వారి కుశలమును అడిగిరి. అరయర్లు నంబి గారిని పెరుమాళ్ దర్శనమునకు తెసుకువెళ్ళమనరి.(స్థానిక కైంకర్యపరులు తో అచటి అలయమును దర్శించుట ఉత్తమము. ) మన అరయర్లు శ్రీ వరదరాజ స్వామి ని దర్శంచి ఈ విధమున స్తొత్రము చేసిరి.“కదా పునస్ శంక రతాన్గ్ కల్పక ద్వజ అరవిన్ద అన్గుచ వజ్ర లాంచనమ్; త్రివిక్రమ త్వచ్చరణామ్భుజ ద్వయమ్ మదీయ మూర్ద్దానమ్ అలన్కరిశ్యతి”దాని అర్దము ఏమనగ “ఓహ్ త్రివిక్రమ! శంక రతాంగ కల్పక ద్వజ అరవిన్ద అన్గుచ వజ్ర లాంచనముల ముద్రలు కలిగిన నీ పాదములను నా శిరస్సు పై వుంచు తండ్రీ. మన అరయర్లుకు శఠారి తీర్థమును ఇచ్చిన తరువాత మన అరయర్లును పాడమనిరి.అరయర్లు ఎంతో మృదు మధురముగా అళువారుల శ్రీసూక్తులను పాడుతూ అభినయము చేసిరి.అది విన్న వరదరాజ స్వామి ఎంతో ఆనందించి మన అరయర్లును ఏమి కావలో కోరుకోమనగ అందుకు మన అరయర్లు నిరాకరించిరి.వరదరజస్వామి తనకి ఎదైనా ఇస్తాను అని మరల చెప్పగా,మన అరయర్లు తిరిగి “ఎది అడిగిన ఇస్తారు కదా ?” అని అడిగిరి. అందుకు వరదరాజస్వామి తనను తన దేవేరులును తప్పించి ఏమైన ఇస్తాను అని చెప్పిరి! వెనువెంటనే మన అరయర్లు రామనుజులిని చూపించి వారిని శ్రీరంగంనకు పంపమనిరి. అందుకు వరదరాజస్వామి నిరాకరించిరి వెంటనే మన అరయర్లు వరదరజస్వామిని చూసి “నువ్వు సాక్షాత్తు శ్రీ రామచంద్రుడివి ఇచ్చిన మాట తప్పరాదు అనిరి” వరదరజస్వామి అందుకు అంగీకరించి రామానుజులని త్యాగము చేసిరి(ఎందరో ఆచార్యులని వరదరజస్వామి సంప్రదాయమునకు త్యాగం చేసిరి అందుకనే కంచిని త్యాగ మండపము అనిరి.) రామానుజులు అందరికి నమస్కరించి వారి మఠం లో ఉన్న వరదరజస్వామి తిరువారాదన మూర్తులని తీసుకుని మన అరయర్లతో కూడి రామనుజులు శ్రీరంగంనకు వెడలిరి.రామానుజులిని శ్రీరంగంనకు తీసుకువచ్చుట లో కీలక పాత్ర మన అరయర్లు పొషించి సంప్రాదాయమునకు ఎంతో మేలు చేసిరి.

శ్రీ ఆళవందార్లు వారి అయిదు ప్రదాన శిశ్యులకి అయిదు ప్రదాన బాద్యతలను ఉడయవర్ విశయములొ అప్పగించిరి.పెరియ నంబి గారిని రామనుజులు కి పంచ సంస్కారములుని ప్రసాదించమనిరి.
పెరియ తిరుమలై నంబి గారు శ్రీ రామాయణమును రామనుజులు కి అనుగ్రహించమనిరి.
తిరుక్కోష్టియూర్ నంబి గారిని తిరుమంత్ర చరమ శ్లోక అర్ధములును రామనుజులు కి అనుగ్రహించమనిరి.
తిరుమాలై ఆణ్డాన్ గారిని తిరువాయ్ మొళిని రామనుజులు కి అనుగ్రహించమనిరి.
మన తిరువరన్గప్పెరుమాళ్ అరయరును ,శ్రీ ఆళవన్దార్లు, అరుళిచెయల్ అను గ్రంధము మరియు చరమోపాయము ( ఆచార్య నిష్టయే చరమోపాయము అని) రామనుజులకి అనుగ్రహించమనిరి.
తిరుమాలై ఆణ్డాన్ గారి దగ్గెర తిరువాయ్ మొళిని పరిపూర్ణంగా నేర్చిన తరువాత పెరియనంబి గారి ఆఙ్ఞ అనుసారము రామానుజులు మన అరయర్ల దగ్గర సంప్రదాయ రహస్యములును అభ్యసించిరి. అప్పుడు రామానుజులు శాస్త్ర నిర్ణయమును పాటిస్తూ ముందుగా ఆరు నెలలు అరయర్ గారికి కైంకర్యముని చెసిరి. రామానుజులు మన అరయర్లుకు ప్రతీ రొజూ వెచ్చటి పాలు కాచి,పసుపు అరగతీసి మన అరయర్లుకు అవసరమైనప్పుడు దానిని లేపనమ్ చేసిరి.

namperumal-arayar-ramanujar

ఒక రోజున మన అరయర్లకై రామానుజులు పసుపు ను అరగతిసిరి. కానీ అది అరయర్లకి ఆనందమును ఇవ్వని కారణమున రామానుజులు మరి కొంచెం పసుపు ను అరగతిసిరి. అందుకు మన అరయర్లు సంతశించిరి. అప్పుడు మన అరయర్లు రామానుజులకి చరమోపాయము (అంతిమ లక్ష్యము) అనగా ఆచార్య కైంకర్యముగా ఏవిదముగా గుర్తించాలని ఉపదేశించిరి.”క్షీరాబ్ది యందు శయనించి యున్న భగవంతుడు ఆచార్యుని గా మన ముందు ఉన్నారు అని విశ్వసించాలని చెప్పిరి.”

మన అరయరుల ఘనతని చాటి చెప్పే కొన్ని ఐతిహ్యములును చుద్దాము.

 

 • ఈడు వ్యాక్యానమున 1.5.11, వివరిస్తుండగ “పాలేయ్ తమిళర్ ఇశైకారర్” ఇందు ఇశైకారర్ అనిన సంగీత విద్వాంసుడు, నంపిళ్ళై గారు మన అరయర్లుని( తిరువరన్గప్పెరుమాళ్ అరయర్) ఇశైకారర్ అని ఆళ్వారులు ముందుగానే పాడిరి అని వ్యాఖ్యనించిరి.
 • ఈడు వ్యాఖ్యానమున 3.3.1, వివరిస్తుండగా నంపిళై గారు మన అరయర్ల గొప్పతనమును వివరించిరి.ఒకసారి మన అరయర్లు “ఒళివిల్ కాలమెల్లామ్” అను ఆళ్వారులు పాశురమును గానము చేస్తు ఆ పాశురమును ఉన్న కాలమెల్లామ్ అనె పదము దగ్గర ఆగి “ తిరువేంకటముడయాన్ కాలమెల్లామ్ కాలమెల్లామ్” అంటు ఉండిపొయిరి. ఈ పాశురమున ఆళ్వారులు తమకి తిరువేంకటముడయాన్ కైంకర్యము ఎల్లప్పుడు (కాలమెల్లామ్) కోరిరి. ఈ పాశురముని ద్వయ మంత్రపు వివరణమున కైంకర్య ప్రార్దన గా చెప్పెదరు.

మనము తిరువరంగప్పెరుమాళ్ అరయర్ గారి పాదములకు దాసోహములు సమర్పించి వారికి కలిగిన ఆచార్య నిష్ట, భగవద్ భక్తి ని మనకును ప్రసాదించమని కొరుకుందాము.

తిరువరన్గప్పెరుమాళ్ అరయర్ గారి తనియ

శ్రీరామమిశ్ర పద పంకజ చంచరీకం  శ్రీయామునార్య వర పుత్రం అహం గుణాఢ్యం |
శ్రీ రంగరాజ కరుణా పరిణామదత్తం శ్రీ భాష్యకార శరణం వరరంగమీడే||

శ్రీరామమిశ్రుల (శ్రీమణక్కాల్ నంబి) శ్రీపాదతామరలయందు తుమ్మెదవలె సంచరించే, , శ్రీరంగనాథుని కరుణచే జన్మించి, శ్రీయామునాచార్యుల సత్పుత్రులై, కల్యాణ గుణములను కలిగి శ్రీ రామానుజులకు ఆచార్యులైన  తిరువరంగపెరుమాళ్ అరయర్  ను ఆశ్రయుస్తున్నాను.

ఆంగ్ల అనువాదము- సారథి రామానుజ దాస

తెలుగు అనువాదము- సురేష్ కౄష్ణ రమానుజ దాస.

Source:

 

మధురకవి ఆళ్వార్

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః
madhurakavi

తిరునక్షత్రము: చిత్తా నక్షత్రము

మాసము: చైత్రమాసము (చిత్తిరై/మేష)

అవతార స్థలము: తిరుక్కోళూర్(ఆళ్వార్ తిరునగరి నవ తిరుపతులలో ఒకటి)

ఆచార్యులు: నమ్మాళ్వార్

శ్రీ సూక్తులు: కణ్ణినుణ్ శిరుత్తాంబు

పరమపదము చేరిన ప్రదేశము: ఆళ్వార్ తిరునగరి

మధురకవిఆళ్వార్

నమ్పిళ్ళై తమ అవతారికా వ్యాఖ్యానంలో మధురకవి ఆళ్వార్ల కీర్తిని అతి వైభవంగా వివరించారు. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాము. మహాఋషులందరు తమ దృష్టిని సామాన్యశాస్త్రము నిర్ణయించే ఐశ్వర్యం, కైవల్యం, మరియు పురుషార్థమైన (ఆత్మ పొందవల్సిన లక్ష్యం) భగవత్ కైంకర్యం పై కేంద్రీకరించారు. కాని ఆళ్వారులు తమ దృష్టిని శ్రీమన్నారాయణునకు ప్రీతిని కలిగించే ఉత్తమపురుషార్థము (అంతిమ లక్ష్యం)పై కేంద్రీకరించారు.  మధురకవిఆళ్వార్ మాత్రం తమ దృష్టిని అత్యుత్తమస్థితి అయిన భాగవత కైంకర్యం పై కేంద్రీకరించారు. భగవంతుడు తన కన్నా తన భక్తులకు చేయు కైంకర్యమే విశేషమని ప్రశంసించాడు. దీనిని మనం శ్రీరామాయణం లో చూడవచ్చు. శ్రీరామాయణం వేదోపబృహ్మణం(వేదం యొక్క క్లిష్టమైన అర్థాలని వివరించేది). ఇది వేదప్రధాన అంశాలని నిర్ణయుంచును.

 • శ్రీరాముడు వేదస్వరూపుడు- కావున తాను సామాన్యధర్మమైన పితృవాక్ పరిపాలనను నిరూపించినాడు.
 • ఇళయపెరుమాళ్(లక్ష్మణుడు) – విశేషధర్మమైన శేషత్వమును నిరూపించినాడు. అనగా శేషుడు(దాసుడు) సదా శేషిని(ప్రభువు/యజమానిని) అనుకరించడం. లక్ష్మణుడు, “అహం సర్వం కరిష్యామి”(మీ కోసం నేనన్నింటిని చేయుదును) అనే దానిని శ్రీరాముని యందు అనుష్ఠించి చూపినాడు.
 • భరతుడు – విశేషధర్మమైన పారతంత్ర్యమును నిరూపించినాడు. ఇది జీవాత్మల అసలైన స్వరూపం. తన స్వాతంత్ర్యం లేకుండా ప్రభువు/యజమాని ఇచ్ఛను అనుసరించి నడుచు కొనుటయే పారతంత్ర్యం. కాని శ్రీరాముడు భరతున్ని అయోధ్యానగరంలోనే ఉండి రాజ్యాన్ని సంరక్షించాలని కోరినాడు. భరతుడు నిర్భంధముగా శ్రీరాముని ఆఙ్ఞను ఒప్పుకొని తను 14సంత్సరములు అయోధ్యానగరం వెలుపల అదే స్వరూపంతో శ్రీరామునికై  ఎదురుచూసాడు.
 • శత్రుఘ్నుడు – సంగ్రహంగా తన స్వరూపమునకు తగిన భాగవతశేషత్వమును నిరూపించినాడు. ఇతను ఇతర వ్యాపకముల యందు శ్రద్ధచూపక కేవలం భరతుని యందు కైంకర్యమునే ఆసక్తితో అనుష్ఠించినాడు.

ఇక్కడ నంప్పిళ్ళైగారు శ్రీభాష్యకారుల(శ్రీరామానుజుల) వచనమును ఉట్టంకిస్తు, శ్రీరాముడు తన ఇద్దరి సోదరులైన లక్ష్మణుని మరియు భరుతుని కన్నా సర్వపారతంత్రుడైన శత్రుఘ్నునియందే అధికమైన ప్రీతిని కలిగిఉండేవారని తెలిపారు. మధురకవిఆళ్వార్ భాగవతకైంకర్యనిష్ఠ నిరూపించిన శత్రుఘ్నుని యందు అధికమైన ప్రీతిని కలిగి ఉండేవారు. మధురకవిఆళ్వార్ కూడా నమాళ్వార్ కు పరిపూర్ణదాసుడై వారికి నిత్యకైంకర్యమును చేసెడివారు. మధురకవిఆళ్వార్ కు నమ్మాళ్వారే లక్ష్యం(ఉపాయం) మరియు దానిని పొందించేవారు(ఉపేయం) కూడా ఆళ్వారే. దానినే మధురకవిఆళ్వార్ తమ దివ్యప్రబంధము యందు నిరూపించారు.

పిళ్ళైలోకాచార్యులు తమ మహత్తరమైన శ్రీవచనభూషణంలోని చివరి ప్రకరణలో మధురకవిఆళ్వార్ వైభవమును మరియు వారికి నమ్మాళ్వార్ యందు ఉన్న భక్తిభావమం, ఆచార్య అభిమాననిష్ఠ (ఆచార్య అభిమానమే ఉత్తారకంగా భావించుట)కు ఉదాహరణగా తన సూత్రములో సవివరంగా వివరిస్తారు.

8వ ప్రకరణలో భగవంతుని నిర్హేతుకకృప వర్ణించబడినది. భగవంతుడు జీవాత్మకు ఫలితమునలను వారి కర్మానుసారంగా ఇవ్వడానికి బద్ధుడై ఉంటాడు. కాని మనను భగవంతుడు ఆమోదిస్తాడా లేడా అని సందేహం కలవచ్చు.

9వ ప్రకరణములో (చివరన) పిళ్ళైలోకాచార్యులు, ఆచార్యునిపై ఆధారపడిన చరమోపాయము(అంతిమోపాయము)మరియు ఆ చరమోపాయము వలన జీవాత్మ ఎలా అప్పగించబడునో తెలిపినారు.

407 సూత్రమును పరిశీలించిన, సర్వ సతంత్రుడైన భగవతుండు మనను స్వీకరిస్తాడా లేదా నిరాకరిస్తాడా అని సందేహం కలుగవచ్చు ఇది శాస్త్రానుసారము( ఫలితములు వారివారి కర్మానుసారంగా ఇవ్వబడేవి)గా అతని మీద లేదా భగవానుని  కారుణ్యం మీద ఆధారపడి ఉంటుంది.

మణవాళమామునులు తమ వ్యాఖ్యానంలో- ఎప్పుడైతే మనం పారతంత్రుడైన (సర్వం భగవంతుని మీదనే ఆధారపడిన వారు) ఆచార్యుని ఆశ్రయిస్తామో ఇక మనకు ఏ సందేహము లేదు విమోచనము(మోక్షము) కలుగును. కారణం ఆచార్యుడు జీవాత్మ ఉద్ధరణకై నిరంతరం కృషి చేయు కరుణామూర్తి.

408వ సూత్రంలో ఇలా వివరించబడినది-  సర్వం భగవంతునిపై ఆధారపడిన పదుగురు ఆళ్వార్లు తమ పాశురాలలో దీనిని నిరూపించలేదు. ఈ ఆళ్వార్లు ఏ లోపం లేని ఙ్ఞానమును భగవంతుని ద్వారా పొందారు. వారు భగవదనుభవంలో  నిమగ్నమైనప్పుడు భాగవతులను కీర్తిస్తారు. భగవంతునితో సంశ్లేషము కలిగినపుడు భాగవతుల విషయంలో కలతచెంది తీరని ఆశతో ఉండేవారు (మణవాళమామునుల వాఖ్యానములో చాలా పాశురములలో ఈ విషయం పేర్కొనబడినది). మనము ఆచార్యవైభవాన్ని పదుగురి ఆళ్వార్ల పాశురాలలో నిర్ణయించలేము కాని మధురకవిఆళ్వార్(ఆండాళ్ పాశురాలలో కూడా) పాశురాలలో ఈ వైభవమును పరిశీలించవచ్చని మామునుల  కృపచేశారు.

409వ సూత్రంలో, మిగిలిన పదుగురు ఆళ్వార్ల కన్నా మధురకవి ఆళ్వార్ చాలా గొప్పవారు అనడానికి కారణం, వారి దృష్టి అంతా ఆచార్యవైభవము పైననే ఉండును.  కాని మిగిలిన ఆళ్వారులంతా ఒకసారి భాగవతులను కీర్తిస్తారు మరొకసారి విస్మరిస్తారు. మధురకవిఆళ్వార్ వచనములను బట్టి మనము ఆచార్య వైభవమును సిద్ధాంతీకరించవచ్చు. మామునులు తమ ‘ఉపదేశరత్నమాల’లో 25వ మరియు 26వ పాశురములలో మధురకవిఆళ్వార్ ను మరియు వారి ప్రబంధమైన ‘కణ్ణిణున్ శిరుత్తాంబును’ కీర్తిస్తారు. 25వ పాశురంలో మధురకవిఆళ్వారులు అవతరించిన చైత్రమాస చిత్తానక్షత్ర దివసం ప్రపన్నుల స్వరూపానికి తగిన రోజని, ఇది మిగిలిన ఆళ్వారుల అవతారదివసం కన్నావిశేషమయినదని వివరించారు.

ఎరార్ మధురకవి | ఇవ్వులగిల్ వన్దుఉదిత్త,

శీరారుం శిత్తిరైయిల్ | శిత్తిరైయిల్ , పారులగిల్

మర్ట్రుళ్ళ ఆళ్వార్ గళ్ | వందుదిత్తనాళ్ గళిలుమ్

ఉర్ట్రదు ఎమక్కెన్ఱు | నెఙ్జే ! ఓర్. (25)

 

వాయ్ త్త తిరుమన్దిరత్తిన్ |మత్తిమమాం పదంపోల్

శీర్తమధురకవి |శెయ్ కలైయై – ఆర్తపుగళ్

ఆరియర్ గళ్ తాఙ్గళ్ |అరుళిచ్చెయల్ నడువే,

శేర్విత్తార్ | తాఱ్పరియం తేర్ న్దు(26)

పిళ్ళైలోకం జీయర్ ఈ పాశురానికి విశేషమైన వివరణ అనుగ్రహించారు: కణ్ణినుణ్ శిరుత్తాంబును తిరుమంత్రములోని ‘నమ:’ పదానికి ఉదాహరణగా స్వీకరించారు. తిరుమంత్రము  మననము చేసేవారిని ఈ సంసారబంధము నుండి విముక్తి చేయునదిగా ప్రసిద్ధిచెందినది. తిరుమంత్రములో ‘నమ:’ పదం చాలా ప్రాధాన్యత కలిగినది. మన రక్షణాభారములో మన ప్రమేయమే ఉండదు, మన రక్షణాభారమంతా స్వామిదే (ఎమ్పెరుమాన్) అనే విషయాన్ని ఇది ధృడీకరించును. ఈ సూత్రమునే మధురకవిఆళ్వార్ (పరమ ఆచార్యనిష్ఠులు) తమ ప్రబంధములో పొందుపరిచారు. దీని ఆధారంగానే మన రక్షణాభారమంతా ఆచార్యులదే అని తెలియును. ఈ విషయ వాస్తవికతయే శాస్త్రసారాంశము, కావుననే మన పూర్వాచార్యులు వీరి ప్రబంధమును నాలాయిరదివ్య ప్రబంధములో చేర్చినారు. మధురకవిఆళ్వార్ అవతరించిన చిత్తానక్షత్రము 27 నక్షత్రములలో సరిగ్గా మధ్యన ఉండును, అలాగే వీరి ప్రబంధము కూడ దివ్యప్రబంధ రత్నహారమునకు నాయక రత్నం వలె మధ్యలో విరాజిల్లుతున్నది. ఎంబెరుమానార్  (రామానుజులు), నంప్పిళ్ళై,  పిళ్ళైలోకాచార్యులు, మామునులు మరియు పిళ్ళైలోకం జీయర్ మొదలైన వారందరు ఈ విషయాన్నే వివిధ కోణములలో చాలా అందముగా వివరించారు. వీటిని ఆధారంగాచేస్కొని మనము మధురకవిఆళ్వార్ చరితమును తెలుసుకుందాము.

మధురకవిఆళ్వార్ చైత్రమాసంలో చిత్తా నక్షత్రమున తిరుక్కోళూర్ అనే దివ్యదేశములో(ఆళ్వార్ తిరునగరి నవ తిరుపతులలో ఒకటి) అవతరించిరి. సూర్యునికి ముందే కిరణముల కనిపించినటుల నమ్మాళ్వార్ అవతారమునకు ముందే వీరి అవతారం జరిగినది. వీరి వైభవమును గరుడవాహన పండితుని ‘దివ్యసూరిచరితం’ లో అవలోకించిన, వీరు కుముదగణేశుని లేదా గరుడుని(ఆళ్వారులందరు ఈ సంసారము నుండి పెరుమాళ్ చే ఉద్ధరింపబడి వానిచే ఆశీర్వదింపబడినవారు) అంశ అని తెలుస్తున్నది. వీరు సామవేదీయ పూర్వశిఖా బ్రాహ్మణ వంశములో జన్మించిరి. తగిన వయస్సులో వీరికి జాతకకర్మ, నామకరణ, అన్నప్రాసన, చౌల, ఉపనయనాది వైదికసంస్కారములన్నీ జరిగాయి. క్రమంగా వేదవేదాంతములు, ఇతిహాసపురాణములను అధికరించినారు. పెరుమాళ్ ను తప్ప ఇతరములను పరిత్యజించి ఉత్తరభారతావని లోని అయోధ్య,మధుర మొదలైన దివ్యదేశాలను సేవించుటకు యాత్రను చేసిరి.

nammazhwar-madhurakavi-nathamuni

మధురకవిఆళ్వార్, నమ్మాళ్వార్, నాథమునులు – కాంచీపురం

మధురకవిఆళ్వార్ తరువాత అవతరించిన నమ్మాళ్వార్ ఇతరములయందు అనాసక్తితో, తల్లిపాలను కూడ స్వీకరించక, నిశబ్దతతో(పూర్తిగా శబ్దము లేకుండా) ఉండిరి. వీరి తల్లిదండ్రులైన ఉడయనంగైకారిలు, అవతరించిన 12వ దివసమున వీరి బాల్యప్రవర్తనకు ఆతృతచెందిరి. ఆళ్వార్ తిరునగరి తామ్రపర్ణినదీ దక్షిణతీరాన అందమైన గోపురములను కలిగిన, అందమైన దివ్యశంఖచక్రములతో అలరారుతున్న, పద్మములవంటి నేత్రములను కలిగిన, అభయ హస్తముతో(మనను రక్షించెదను అను నిర్థారించు హస్తము కలిగిన స్థితి) కూడిన, దివ్యమహిషిలైన శ్రీభూనీలా దేవేరులతో కూడిన  ‘పొలిన్దునిన్ఱపిరాన్’ వద్దకు తీసుకవచ్చిరి. పెరుమాళ్ సన్నిధిన ఆ బాలునకు ‘మారన్’ (ఇతరుల నుండి వ్యత్యాసముతో ఉండువాడు)అని పేరుంచి దివ్యచింతచెట్టు సన్నిధిన వదిలి దివ్యునిగా భావించి ఆరాధించసాగిరి.

పరమపదనాథుడు నమ్మాళ్వారులకు పంచసంస్కారములను చేసి ద్రావిడవేదమును (ఈ వేదం అనాదిగా ఉన్నదని నాయనార్లు తమ ‘ఆచార్యహృదయము’ లో తెలిపిరి) మరియు అన్నీ రహస్య మంత్రములు,వాటి అర్థములను ఉపదేశించమని విష్వక్సేనులను నిర్దేశించగా విష్వక్సేనులవారు ఆ బాధ్యతను నెరవేర్చిరి. నమ్మాళ్వార్ 16 సంవత్సరములు ఆ తిరుపుళిఆళ్వార్(దివ్య చింతచెట్టు)క్రింద ఉన్నారు. ఆ గొప్పదనమును ఆళ్వారుల తల్లిదండ్రులు గమనించినారు కాని వారి వైభవమును గుర్తించలేకపోయినారు. అలా తిరుక్కురుంగుడి నంబిని ప్రార్ధన చేస్తు ఉండిపోయినారు. మధురకవిఆళ్వార్ కూడా ఈ వింతవిషయాన్ని విన్నారు. ఒకనాడు వారు రాత్రి సమయాన నదీతీరానికి వెళ్ళినప్పుడు దక్షిణదిశవైపు పెద్దవెలుగు అగుపించినది వారికి. మొదట వారు ఏదో ఊరు తగలబడి పోతుందని భావించినారు, కాని అదే వెలుగు వారికి మరుసటిరాత్రి కూడ కనబడినది. సరే దీనిని కనిపెడదామని నిశ్చయించుకొని దినభాగములో నిద్రించి రాత్రిభాగాన ఆ దిశ(దక్షిణ)వైపు పయనించసాగిరి. ప్రయాణంలో ఎన్నో దివ్యదేశాలను పరిశీలనగా సందర్శిస్తూ చివరకు శ్రీరంగమును చేరుకొనిరి.

అయినను వారికి దక్షిణదిశవైపు ఆ దివ్యవెలుగు కనబడసాగినది. చివరకు తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి)చేరిన తర్వాత ఆ వెలుగు కనబడలేదు. ఆ వెలుగు ఈ ప్రదేశము నుండే వచ్చినదని నిర్థారించుకొనిరి. పిమ్మట దేవాలయంలోకి ప్రవేశించిగానే వారికి ఙ్జానపరిపూర్ణులుగా, అందమైన నేత్రాలతో ,16 ఏండ్ల నూతన వయస్కుడైన, పూర్ణిమా చంద్రునివలె, పద్మాసనములో వేంచేసి కూర్చునటువంటి, భగవంతుని గురించి ఉపదేశిస్తున్న ఉపదేశముద్రతో, సమస్త ప్రపన్నులకు ఆచార్యునిగా, సంపూర్ణ భగవదనుభవములో మునిగి ఉన్న నమ్మాళ్వార్ దర్శనమిచ్చిరి. మధురకవిఆళ్వార్ ఒక రాయిని తీసుకొని వారి ముందు పడవేసిరి. ఆళ్వార్ తమ సుందరనేత్రాలను విప్పి మధురకవిఆళ్వార్ ను చూసారు. వారు ఈయన మాట్లాడతారా అని పరీక్షించదలచి ఆళ్వార్ తో ఇలా అనిరి

శిత్తత్తిన్ వయిఱిళ్ శిరియతు పిరన్దై ఎత్తత్తై త్తిన్ఱు ఎంగేకిడక్కుం”

దీనర్ధం – చేతనుడు(జీవాత్మ-అజడము) అచేతనములోకి( జడము) ప్రవేశించగానే ఎక్కడ ఉండును? ఏమి అనుభవించును?. దీనికి ఆళ్వార్ అత్తత్తైతిన్ఱు అంగై కిడక్కుం” “కార్యరూప ఆనందమును దు:ఖములను అనుభవిస్తు అక్కడే శాశ్వతంగా ఉండును” అని అనిరి. ఇది విన్న మధురకవిఆళ్వార్ ఇతనిని సర్వఙ్ఞునునిగా  గుర్తించి ఇక నేను నా ఉజ్జీవనమునకై ఇతనికి సర్వకైంకర్యములను చేయుదును అని నమ్మాళ్వార్ శ్రీపాదపద్మలయందు మోకరిల్లిరి. సదా వారి సేవలోనే ఉంటూ వారి గుణగణాలను కీర్తించసాగిరి.

అన్నింటికి కారణభూతుడైనవాడు, అన్నింటికి అధికారి, అన్నింటిని నియంత్రించే వాడు, సర్వంతర్యామిగా ఉండేవాడు, నల్లని/నీలపు తిరుమేనితో అలరారు శ్రీవైకుంఠనాధుడు నమ్మాళ్వార్ కు దర్శనమిచ్చుటకు సంకల్పించగానే, పెరియతిరువడి(గరుడన్) వాలగా తన దేవేరి మహాలక్ష్మితో అధిరోహించి తిరుక్కురుగూర్(ఆళ్వార్ తిరునగరి) వచ్చి దర్శనమును మరియు అనంతఙ్ఞానమును నమ్మాళ్వార్ కు అనుగ్రహించిరి. శ్రీవైకుంఠనాధునిచే అనుగ్రహింపబడిన నమ్మాళ్వార్ సంపూర్ణంగా భగవదనుభవములో మునిగి తనివితీరా అనుభవించి పొంగి పొరలే ఆ ఆనందానుభవం లోపల ఇముడ్చుకోలేక పాశురాల(పద్యములు) రూపములో గానంచేసిరి.  అవి తిరువిరుత్తం, తిరువాశిరియం, పెరియతిరువన్దాది మరియు తిరువాయ్ మొజి (నాలుగు వేదాల సారమయిన) అనే ప్రబంధములుగా, శ్రీవైకుంఠనాధుని స్వరూపములను, గుణగణములను, అవతారములను కీర్తించిరి. వాటినే నమ్మాళ్వార్ తన శిష్యులగు మధురకవిఆళ్వార్ కు ఇతర శ్రద్ధాలువులకు అనుగ్రహించిరి. అన్నీ దివ్యదేశ పెరుమాళ్ళు నమ్మాళ్వార్ కూర్చున్న తిరుపులిఆళ్వార్ (చింతచెట్టు) దగ్గరకు వేంచేసి ఆళ్వార్ కు ఆశీర్వదించి తాము ఆళ్వార్ చే మంగళాశాసనం చేయించుకున్నారు. నమ్మాళ్వార్ అందరిచే ఆశీర్వదించబడి, అందరికిని మంగళాశాసనములను చేసిరి. అలాగే నిత్యసూరులు(పరమపదవాసులు) శ్వేతదీప వాసులు (క్షీరాబ్ధివాసులు ) రాగా మహిమ గల నమ్మాళ్వార్ చే వారు మంగళాశాసనములను పొందిరి.

నిత్యసూరుల,శ్వేతదీప వాసుల మహిమలో మునిగిన నమ్మాళ్వార్ తమనుతాము విశ్వములో గొప్పవారిగా భావించు కొనిరి( భగవానుని అనుగ్రహము వలన సాత్విక అహంకారం ఉదయించెను). నమ్మాళ్వార్ తాము సదా కణ్ణన్(శ్రీకృష్ణుని) తలుచుకొనేవారు. నమ్మాళ్వార్ అర్ధపంచక ఙ్జానమును (పరమాత్మస్వరూపం, జీవాత్మస్వరూపం, ఉపాయస్వరూపం, ఉపేయస్వరూపం, విరోధి స్వరూపం) మరియు దివ్యమహామంత్రమును(అష్ఠాక్షరి) అమృతమువంటి పెరుమాళ్ ని భక్తులకు తమ తిరువాయ్ మొజి ద్వారా వివరించిరి. చివరకు నమ్మాళ్వార్ తమ 32వ ఏట సంసారమును వీడి పరమపదమునకు భగవానుని దయ వలన చేరుకొనిరి. ఆ సమయాన నమ్మాళ్వార్ (ప్రపన్న జనకూటస్థులు- ప్రపన్నులకు మూలపురుషులు) ప్రధానశిష్యులైన మధురకవిఆళ్వార్ ఆచార్య ప్రభావం గల ‘కణ్ణినుణ్ శిరుత్తాంబు’ను రచించి పంచమోపాయనిష్టులైన (5వ ఉపాయము- మిగితా ఉపాయములు కర్మ, ఙ్జాన,భక్తి మరియు ప్రపత్తి) ముముక్షువులకు అనుగ్రహించినారు. మధురకవిఆళ్వార్, నమ్మాళ్వార్ అర్చావిగ్రహమును ఆళ్వార్ తిరునగరి యందు ప్రతిష్టచేసి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ మొదలైన ఉత్సవములను అతివైభవముగా జరిగేలా ఏర్పాటుచేసిరి.

మధురకవిఆళ్వార్, నమ్మాళ్వార్ లను ఇలా కీర్తించిరి:

వేదం తమిజ్ శెయ్ ద పెరుమాళ్ వందార్, తిరువాయ్ మొజి పెరుమాళ్ వందార్, తిరునగరి పెరుమాళ్ వందార్, తిరువాజుతివళందార్ వందార్, తిరుక్కురుగూర్ నంబి వందార్,కారిమారన్ వందార్, శఠగోపర్ వందార్, పరాంకుశర్ వందార్.

దీనర్ధం : వేదసారాన్ని కృపచేసిన వారు వేంచేస్తున్నారు, తిరువాయ్ మొజి రచయిత వేంచేస్తున్నారు, తిరునగరి అధికారి వేంచేస్తున్నారు, కారి కుమారులు వేంచేస్తున్నారు, శఠగోపులు వేంచేస్తున్నారు, పరాకుంశులు(ఇతర మతస్తులకు అంకుశం వంటివారు) వేంచేస్తున్నారు అహో.

ఒకసారి దక్షినాది నుండి వచ్చిన ‘మధురై తమిళ్ సంఘ’ తమిళపండితులు నమ్మాళ్వార్ గొప్పదన్నాన్ని అంగీకరించలేరు. వారు సంఘఫలకం(సాహిత్య విలువను కొలిచే ఒక పీఠం) వీరి సాహిత్యాన్ని అంగీకరించునో అప్పటివరకు మేము నమ్మాళ్వార్ వేదసారాన్ని అందిచారు అనే దానిని ఒప్పుకోమన్నారు. మధురకవి ఆళ్వార్, మా ఆచార్యులు నమ్మాళ్వార్ ఎక్కడికి వేంచేయరు అని వారు అనుగ్రహించిన తిరువాయ్ మొళి    10.5.1 లోని “కణ్ణన్ కళళినై”  అనే పాశుర ఖండాన్ని ఒక తాళపత్రముపై వ్రాసి ఆ పండితులకు ఇచ్చిరి. ఆ పండితులు ‘ఒకవేళ ఈ పాశురఖండాన్ని సంఘపీఠము అనుమతిస్తే మేము ఆళ్వార్ గొప్ప అని భావిస్తాము’ అనిరి.

ఆ సంఘపీఠ అధికారి ఆ పాశుర తాళపత్రాన్ని 300 మంది మహాపండితులు కూర్చున్న సంఘపీఠముపై నుంచగా ఆ సంఘపీఠం 300మహాపండితులను క్రిందకు పడవేసి ఆళ్వార్ పాశుర తాళపత్రాన్ని మాత్రమే నిలుపుకొన్నది. ఆ సంఘపీఠ అధికారి ఆళ్వార్ వైభవమును ఒప్పుకొని ఒక పద్యాన్ని సమర్పించారు.

“లాదువతో గరుడర్ కీతిరే ఇరావికితిర్ మిన్మనియాదువతో నాయొదువథో యుఱుమిప్పులిమున్ నరికేచరిమున్ నదైయాదువదో పేయదువదో ఎజిలుర్వచిమున్ పెరుమానందిచేర్ వకుళాభరణన్ ఒరాయిరమామఱైయిన్ తమిళ్ ఒరు చొల్ పొరుమో ఉలగిల్ కవియే”

దీనర్ధం నమ్మాళ్వార్ (శ్రీమన్నారాయణునకు ఆధీనుడై ఉండి వేదసారాన్ని 1000పాశురములలో కూర్చిన)యొక్క ఈ పాశురాన్ని లోకములోని కవుల ఏ పద్యములతో కూడ పోల్చలేము పోల్చినా ఇలా ఉండును.

* ఎగిరే సామర్థ్యములో ఈగ కు గరుడన్ కు మధ్యన ఉన్న వ్యత్యాసం
* వెలుతురులో సూర్యునికి మిణుగురుపురుగు కు ఉన్న వ్యత్యాసం
* పులి గాండ్రింపుకు కుక్క మొరగుకు ఉన్న వ్యత్యాసం
*  సింహపు రాచరిక నడకకు నక్క సాధారణ నడకకు ఉన్న వ్యత్యాసం
* దేవ నర్తకి ఊర్వశి నాట్యానికి దయ్యపు నాట్యానికి ఉన్న వ్యత్యాసం
ఇది గననించిన కవులందరూ వారి చేసిన తప్పిదానికి క్షమాప్రార్ధన చేసినారు. మధురకవి ఆళ్వార్ తన జీవితమంతా “గురుం ప్రకాశతే ధీమాన్” అనునట్లుగా ఆచార్య వైభవమునే (ఆళ్వార్ ) కీర్తించడానికే వెచ్చించారు. ఆచార్యుల ప్రభావం వలన అందరు ఉజ్జీవింపబడతారు. కొద్దికాలం తర్వాత మధురకవిఆళ్వార్ తమ ఆచార్యుల(నమ్మాళ్వార్) తిరువడి (పాదపద్మములు)ని చేరుకొని వారికి నిత్య కైంకర్యములు చేయసాగిరి.

వీరి తనియన్:

అవిదిత విషయాంతర శఠారేః ఉపనిషదాముపగాన మాత్ర భోగః|

అపిచ గుణవశాత్తదదైక శేషి మధురకవి హృదయే మమా విరస్తు||

అడియేన్ నల్లా శశిధర్   రామానుజదాస

Source: