శ్రీః
శ్రీమతేరామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచలమునయే నమః
తిరునక్షత్రం-ఆషాడ , పూర్వఫల్గుణి(ఆడి, పూరం)
అవతార స్థలం -శ్రీవిల్లిపుత్తూర్
ఆచార్యులు – పెరియాళ్వార్
అనుగ్రహించిన గ్రంథములు – తిరుప్పావై మరియు నాచ్చియార్ తిరుమొళి.
పెరియవాచ్చాన్పిళ్ళై తన తిరుప్పావై ఆరాయిరప్పడి వాఖ్యానములో మిగితా ఆళ్వారుల కన్నా అధికంగా ఆండాళ్ గొప్పతనమును స్థాపించినారు. వివిధ స్తరములలో జీవాత్మ యొక్క వివిధ గుణములను వర్ణిస్తూవాటి మధ్యన ఉన్న వ్యత్యాసాన్నివర్ణించారు.
- సంసారులకు(దేహాత్మఅభిమానులు)ఆత్మ స్వరూపమును గ్రహించిన ఋషులకు గల మధ్య భేధాన్ని ఒక రాయి మరియు పెద్ద పర్వతము వలె ఉండునని
- ఋషులకు (తమ స్వప్రయత్నముచే ఙ్ఞాన సముపార్జన చేసినవారు మరియు తమ స్థానము నుండి చ్యుతులవతారు)ఆళ్వారులకు (భగవంతుని కృపచే అనుగ్రహింపబడిన ఙ్ఞానము కలవారు)మధ్య వ్యత్యాసము ఒక రాయి మరియు పెద్ద పర్వతము వలె ఉండునని
- ఆళ్వారులకు( ఒకసారి స్వానుభవం పై దృష్ఠి మరియొకసారి మంగళాశాసనముపై దృష్ఠి సారించెడి వారు) మరియు పెరియాళ్వారులకు (కేవలం మంగళాశాసనము పైననే దృష్ఠి సారించెడి వారు) మధ్య వ్యత్యాసము ఒక రాయి మరియు పెద్ద పర్వతము వలె ఉండునని
- పెరియాళ్వారులకు, మరియు ఆండాళ్ కు మధ్య వ్యత్యాసము కూడ ఒక రాయి మరియు పెద్ద పర్వతము వలె ఉండునని దానికి కారణాలు ఇలా తెలిపినారు.
- ఆళ్వారులందరు మొదట భగవంతుని అనుగ్రహము పొంది పిమ్మట ఈ సంసారులను వారి బద్దనిద్ర నుండి లేపి, వారికి భగవంతుని యందు ఙ్ఞానాన్నికలిగించారు. కాని భూదేవిగా అవతరించిన ఆండాళ్ తాను నిద్రనుండి లేచి భగవంతుని సన్నిధికి వెళ్ళి అతనికి సర్వులను రక్షించే భాధ్యతను గుర్తుచేసింది. నంపిళ్ళై తన తిరువిరుత్తం, తిరువాయ్మొళి వాఖ్యానములో , ఆళ్వారులందరును నిజమైన సంసారులై జన్మించి భగవంతునిచే అనుగ్రహింపబడిన వారు, కాని ఆండాళ్ స్వతహాగా నిత్యసూరిత్వము కలిగిన భూమాదేవి అవతారము మరియు స్వయంగా భగవంతుని పట్టపుమహిషి అని విశదీకరించినారు.పెరియవాచ్చాన్పిళ్ళై కూడా ఈ విషయాన్నే నిర్థారిస్తారు.
- సహజముగా ఆండాళ్ స్త్రీ ,ఇది ఆమె స్వరూపానికి స్వతహాగా భగవంతునితో భార్య/భర్తు సంభంధము కలిగి ఉన్నది(ఆళ్వారులందరూ కూడా స్త్రీ ప్రాయత్వమునే ప్రదర్శించిన పురుష దేహము కలవారు ) కావున ఆండాళ్ కు భగవంతుని యందు ప్రేమ ఆళ్వారుల ప్రేమ కన్నా ఎక్కువ .
పిళ్ళైలోకాచార్యులు తమ ‘శ్రీవచన భూషణము’ లో ఆండాళ్ వైభవమును కొన్ని సూత్రాలలో తెలిపినారు. వాటిని క్రమంగా అనుభవిద్దాము.
- 238సూత్రము(ப்ராஹ்மணோத்தமரான பெரியாழ்வாரும் திருமகளாரும் கோபஜந்மத்தை ஆஸ்தாநம் பண்ணினார்கள்).బ్రాహ్మణోత్తతమరాన పెరియాళ్వారుమ్ తిరుమగళారుం గోపఙ్ఞానమత్తై ఆస్థాణం పణ్ణినార్గళ్,ఈ ప్రకరణములో పిళ్ళైలోకాచార్యులు భాగవత(వర్ణ భేధముతో పనిలేకుండా) వైభవమును వర్ణిస్తున్నారు. దీనిలో వీరు గొప్ప వ్యక్తుల వివిధ జన్మముల గురించి సహాయకారిగా ఉండు భగవత్ అనుభవము/కైంకర్యము ను తెలిపిరి. ఈ సూత్రములో పిళ్ళై , పెరియాళ్వార్ మరియు ఆండాళ్ ఇద్దరు సద్భ్రాహ్మణుల వంశములో జన్మించినప్పటికి తమకు తాము బృందావనములోని గొల్లపిల్లవలె అనునయిం చు కొన్నారు. భగవంతుని కృపను పొందుటకు కావల్సిన కైంకర్యమును అనుష్ఠించినారు.
- 285సూత్రము-కొడుత్తుక్ కొళ్ళాతే కొండత్తుత్తుక్కుక్ కైక్కులి కొడుక్కవ నెణ్ణుం(கொடுத்துக் கொள்ளாதே கொண்டத்துக்குக் கைக்கூலி கொடுக்கவேணும்).285సూత్రం- ఈ ప్రకరణములో పిళ్ళైలోకాచార్యులు, ప్రతిఒక్కరు చేయవల్సిన కైంకర్యమును గురించి తెలిపినారు. భగవంతుని కృపకు పాత్రులవుటకు చేయు కైంకర్యమును తెలిపిరి. పైని సూత్రములో పిళ్ళైలోకాచార్యులు ఫలము ఆశించని కైంకర్యమును గురించి తెలిపినారు. కాన మనము ఏదీ ఆశించని కైంకర్యమును చేయాలి. ఈ సూత్రములో మనం భగవంతునికి కైంకర్యమును చేసి అతని దయకు పాత్రులై, ఇంకా కైంకర్యమును తనకి చేయాలని తెలిపిరి. మామునులు ఈ విషయాన్ని స్వీకరించి ఆండళ్ సూక్తిని అందముగా వివరించిరి. ఆండాళ్ తన నాచ్చియార్ తిరుమొళి 9.7 లో “ఇన్ఱువందు ఇత్తనైయుం అముదుశెతయ్ దిడ ప్పెఱిళ్ ,నాన్ ఒన్ఱు నూరాయిరమాక కొడుత్తు పిన్నుం ఆళుం శెయ్ వన్ ‘’(இன்று வந்து இத்தனையும் செய்திடப்பெரில், நான் ஒன்று நூறு ஆயிரமாகக் கொடுத்து பின்னும் ஆளும் செய்வன்).ముందరి పాశురములో తిరుమాళిరుంశోలై అళగర్ (సుందరబాహు పెరుమాళ్) కు నూరుపాత్రల వెన్న, నూరుపాత్రల అక్కారివడిశల్ (పరమాన్నం) ను సమర్పించుకోవాలని అనుకొన్నది. ఈ పాశురంలో తాను సమర్పించిన వాటిని స్వామి స్వీకరిస్తే (మరేతర దానిని ఆశించకుండా కేవలము భవంతుని ముఖోల్లాసమునే ఫలితముగా భావించినది) తన కృతఙ్ఞతను తెలిపి దానికి రెట్టింపు భోగములను సమర్పిస్తానని తెలిపినది. ఈ విధంగా ఆండాళ్ ఈ పాశురం ద్వారా తాను సాంప్రదాయ శిఖరమును అధిరోహించినది.
ఆయ్ జనన్యాచార్యులు తమ వ్యాఖ్యాన అవతారికలో తిరుప్పావై వైభవమును(ఆండాళ్ గురించి) అందముగా వర్ణించిరి. ఇరండారాయిరప్పడి మరియు నాలాయిరాయిరప్పడి అను ఉభయ వాఖ్యానములను ప్రసాందించిరి . వాటి అవతారికలో శ్రీరామానుజులు “ మీరు తిరుపల్లాండు కోసం(మనన శ్రవణములకు) మనుష్యులు దొరకరు కాని తిరుప్పావై కి అలా కాదు” అని సెలవిచ్చిరి. దీనర్థం పెరియాళ్వార్ పాడిన తిరుపల్లాండు భగవంతునుకు మంగళాశాసనము(ప్రథమ పర్వం) , ఆండాళ్ చే కృపచేయబడిన తిరుప్పావై భాగవతులకు మంగళాశాసనములు(చరమ పర్వం) కావున దానికి తక్కువగా దీనికి విశేషంగా జనులుందురు అని వచనం. ఇంకా ఇలా అన్నారు “ పురుషులు తిరుప్పావై మననశ్రవణములకి అనర్హులు” దీనర్థం భగవంతునికి ప్రతివారు పరతంత్రులై ఉండాలి ఎలాగైతే స్త్రీ తన భర్తకు సర్వ పరతంత్రురాలుగా ఉండునో అలా” ఆండాళ్ శ్రీ సూక్తులను మరియు తిరుప్పావై అర్థమును గ్రహించాలి. మరియు “ స్త్రీ రూపురాలైన ఆండాళ్ (భూదేవి వలె) తదేకంగా గ్రహించిన భగవానుని అనుభవమును తిరుప్పావైలో చేర్చినది. ఆండాళ్(ఆళ్వారుల దివ్యాంశములను ప్ర తిబింబించే) మాత్రమే పరిపూర్ణ భగవదనుభవమును తెలుసుకొనుటకు అర్హురాలు ,ఈవిషయాలని తన తిరుప్పావైలో కూర్చినది. అదే ఆండాళ్ మరియు తన తిరుప్పావై యొక్క వైభవము
మామునులు తమ ఉపదేశరత్నమాల లో ఆండాళ్ వైభవాన్ని 22,23,మరియు 24పాశురములలో కీర్తించారు.
- 22 పాశురములో ,మామునులు భావోద్వేగముతో ఇలా అంటారు, ఈ సంసారుల ను కాపాడుటకు పరమపద భోగములన్నీ వదిలి ఇలలో శ్రీ భట్టనాథుల కుమార్తెగా జన్మించినది. ఎలాగైతో నూతిలో పడ్డ తన పిల్లావాణ్ణి రక్షించుటకు తల్లి తానే నూతిలో దూకునో అలా. ఆండాళ్ మనందరికి జనని వంటిది కావున పరమపదము నుండి ఈ సంసారులను ఉద్దరించుటకు ఈ సంసారసాగరములోకి దూకినది.
- . 23వ పాశురంలో , ఆండాళ్ పుట్టిన ‘ తిరువాడి పూరం ’ కు సమానమైన రోజే లేదు అని అంటారు అలాగే ఆండాల్ కు సమానమైన వారు లేరే లేరు అని సెలవిచ్చారు.
- 24 వ పాశురంలో ఆండాళ్ ‘అంజుకుడి’(భయముతో వణుకు నేత్రములు గల వారు(పది మంది ఆళ్వారులు))వారికి ఒకే ఒక్క కూతురు. ఆళ్వారులందరికన్నా చాలా వైభవమును కలది ఆండాళ్ . అతి పిన్నవయస్సులో భగవంతుని యందు తన ప్రేమను అభివృద్ధి చేసుకొన్నది. పిళ్ళైలోకం జీయర్ తన వ్యాఖ్యానములో ‘అంజుకుడి’అంటే ఏమిటో తెలిపిరి ఇలా
- ఆళ్వారుల వంశానికి ఒకే ఒక వారసురాలు ఎలాగైతో పరీక్షిత్తు పంచపాండవులకు ఒకే ఒక వారసుడో.
- ప్రపన్న కులమునకు చెందిన ఆళ్వారులకు ఒకే ఒక వారసురాలు.
- భగవంతునికి దృష్టిదోశం తగులునో అని భయపడి మంగళాశాసనములు చేయు పెరియాళ్వార్ అను ఒకే ఒక వారసురాలు.
ఆండాళ్ శుద్ధమైన ఆచార్యునిష్ఠ కలిగినది. ఎందుకనగా పెరియాళ్వార్ భగవానునకు గల సంభందము, ఆండాళ్ కూడా అలాంటి భగవానునకు గల సంభందము పెంచుకున్నది.
వీటిని దీనిలో చూడవచ్చు
- తన నాచ్చియార్ తిరుమొళి లో 10.10 వ పాశురములో విల్లిపుతువై విట్టు శిత్తర్ తఙ్గళ్ తేవరై వల్ల పరిశు వరువిప్పరేల్అదుకాణ్డుమే (வில்லிபுதுவை விட்டுசித்தர் தங்கள் தேவரை வல்லபரிசுவருவிப்பரேல் அதுகாண்டுமே) ఒకవేల పెరియాళ్వార్ తన ఒప్పిచ్చినచో వచ్చిన ప్రియ భగవానుని ఆరాధింతును.
- మామునులు తన ఉపదేశరత్నమాలలో పదుగురు ఆళ్వార్ లను కీర్తించి , ఆండాళ్, మధురకవి ఆళ్వార్, శ్రీరామానుజులను వర్ణిస్తూ ఈ ముగ్గురు ఆచార్యులనిష్ఠ బాగా కలిగిన వారని తెలుపుతారు.
వీటిని స్మరిస్తూ ఆండాళ్ చరితమును తెలుసుకుందాము.
గోదాదేవి శ్రీవిల్లిపుత్తూర్ లోని తులసివనం (ప్రస్తుతం నాచ్చియార్ కోవలలో చూడవచ్చు)లో లభించినది. ఎలాగైతే జనకరాజు తన యాగభూమిని నాగలితో దున్నుతుండగా సీతాదేవి(నాగలి కి పేరు) లభించినదో అలాగే పెరియాళ్వార్ కు భూదేవి అవతారమైన గోదాదేవి తులసి వనంలో లభించినది. ఆమెకు కోదై/కోద (పూమాల) అని నామకరణం చేశారు.
పెరియాళ్వార్ లేనప్పుడు పెరుమాళ్ కి కట్టిన మాలలను తాను ధరించి తాను పెరుమాళ్ కి సరిపోతానో లేదో అని బావిలో తన సౌందర్యాన్ని చూసుకొనేది ఆండాళ్ . పెరియాళ్వార్ తిరిగి వచ్చి ఆండాళ్ ధరించి వదిలిన మాలలను పెరుమాళ్ కు సమర్పించేవారు. ఇలా కొంతకాలంగా జరిగింది. ఒకనాడు పెరియాళ్వార్ ఆ మాలలను పెరుమాళ్ కు సమర్పించక ముందు ఆండాళ్ ధరించుటను గుర్తించారు. పెరియాళ్వార్ చాలా ఆశ్చర్యపోయి ఆనాడు ఆ మాలలను పెరుమాళ్ కు సమర్పించలేదు. ఆ రోజు రాత్రి ఎంపెరుమాన్, పెరియాళ్వార్ కలలో కనిపించి ఈ రోజు మాలలను ఎందుకు సమర్పించలేదు అని అడిగారు. దానికి పెరియాళ్వార్ ఆ మాలలను మీకు సమర్పించక మునుపే మా అమ్మాయి గోద ధరించి విడచినది కావున అవి ఉచ్ఛిష్టములు అయ్యాయి కాన సమర్పించలేదు అన్నారు. దానికి ఎంపెరుమాన్ నాకు గోద ధరించి విడచిన మాలలనే సమర్పించుము వాటికి గోదాదేవి యొక్క భక్తి సువాసన తగిలినది అని అన్నాడు. దీనికి పెరియాళ్వార్చాలా ఆశ్చర్యపడి ఆమెతో గల విశేష సంభందముచే ఆనాటి నుండి ‘ఆండాళ్(నన్ను రక్షించడానికి వచ్చిన ఆమె)’ అని సంభోదించసాగారు. ఇక ప్రతిరోజు ఆండాళ్ ధరించి విడచిన శేషమాలలనే పెరియాళ్వార్ , ఎంపెరుమాన్ కు సమర్పించసాగిరి.
భగవంతునితో సహజ సంబంధము కలిగిన భూమాదేవి పరమభక్తితో ఇలలో ఆండాళ్ నాచ్చియార్ గా అవతరించినది. ఈ విశేష సంబంధము ఆళ్వార్ల సంబంధము కన్నా చాలా ఎక్కువ. ఆ సంబంధ విశేషముచే విరహము భరించలేక ఎంపెరుమాన్ వివాహమాడుటకు దారిని వెతకనారంభించినది ఆండాళ్. క్రిందట గోపికలు కృష్ణుని పొందుటకు ఆచరించిన రాసక్రీడను అనునయించినటుల, గోద కూడ వటపత్రశాయిని శ్రీ కృష్ణునిగా, అతని కోవెలను నందగోపుని గృహముగా, శ్రీవిల్లిపుత్తూర్ ను గోకులముగా , తన స్నేహితురాండ్లను గోపికలుగా భావించి ‘తిరుప్పావై’ వ్రతమును ఆచరించినది.
తిరుప్పావై లో ఆండాళ్ ఇలా అందముగా వర్ణించినది:
- ప్రాప్యము(పొందవలసినది) ప్రాప్యకం(పొదించేవాడు) భగవంతుడే అని స్థాపించినది.
- పూర్వాచార్యుల అనుష్ఠానముననుసరించి (శిష్ఠాచారము) ఏవి చేయదగినవో ఏవి చేయదగనివో నిరూపించినది.
- భగవదనుభవము స్వానుభవముకన్నా గోష్ఠిగా సేవించుట విశేషమని తాను పదిమంది గోపికలను లేపి కృష్ణుని సన్నిధికి తీసుకెల్లినది.
- మనము భగవంతున్ని, అతని దాసులతో అనగా ద్వారపాలకులు, బలరామ,యశోద,నందగోప మొదలైన వారితో ఆశ్రయించవలెను.
- భగవంతున్ని, పిరాట్టి(లక్ష్మీదేవి)పురుషాకారముతో ఆశ్రయించవలెను.
- సదా భగవంతునికి మంగళాశాసనములు చేయవలెను.
- అతనికి కైంకర్యమును చేయవలెనని ఆశించవలెను-కైంకర్యము జీవాత్మ యొక్క స్వరూపము కావున భగవంతుడు మన కైంకర్యమును మన్నిస్తాడు.
- కైంకర్యమునకు అతనే ఉపాయమని(చేయించేవాడు) తలవాలి కాని మన ప్రయత్నమే కైంకర్యమునకు కారణమని తలవరాదు.
- వాని ఆనందముకై కైంకర్యమును ఆచరించాలి కాని ప్రతిఫలమును ఆశించరాదు.
కాని భగవంతుడు గోదకు కనిపించలేదు కాని ఆమెని స్వీకరించాడు. .ఆండాళ్ భరించలేని బాధ తో తన నాచ్చియార్ తిరుమొళి లో వాపోయినది. ఎన్నో విశేషములను ఆండాళ్ తన నాచ్చియార్ తిరుమొళిలో తెలిపినది. ఆండాళ్ తన నాచ్చియార్ తిరుమొళిని ఎవరైతే దీనిని వింటారో/సేవిస్తారో వారు పరమపదమును చేరుతారనిరి “మానిడవర్కెన్ఱు పేశుపడిళ్ వాళకిల్లేన్“ (மானிடவர்க்கென்று பேச்சுப்படில் வாழகில்லேன்) భగవంతున్ని తప్ప నేనితరులెవరిని వివాహమాడ ఒకవేళ జరిగితే నేను బతకను. . తన ‘వారణ మాయిరం’(9.6)లో భగవంతున్ని వివాహమాడినటుల కల కన్నది. పెరియాళ్వార్ , ఆండాళ్ కు అర్చావతార వైభవమును తెలుపగా ఆండాళ్ ‘తిరువరంగత్తాన్’ (శ్రీరంగనాథున్ని) ఇష్ఠపడినది.ఆండాళ్ కోరికను ఎలా తీర్చాలి అని పెరియాళ్వార్ ఆందోలనతో చింతించసాగిరి. ఒకనాడు కలలో శ్రీరంగనాథుడు కనిపించి ఆండాళ్ ను శ్రీరంగమునకు తీసుకరావల్సినది అక్కడ కలుద్దామన్నాడు. ఆ మర్నాడు శ్రీరంగనాథుడు తన పరిచారకులను, అర్చకులను, ఛత్రములను, చామరములను,అందమయిన పల్లకిని, ఆండాళ్ ను కొనిపోవుటకు శ్రీవిల్లిపుత్తూరునకు పంపగా పెరియాళ్వార్ చాలా ఆనందపడెను. పెరియాళ్వార్ శ్రీవిల్లిపుత్తూరు వటపత్రశాయి దగ్గర ఆనతి తీసుకొని పల్లకిలో ఆండాళ్ ను కూర్చుండపెట్టి మేళతాళములతో పెద్ద ఊరేగింపుగా శ్రీరంగమునకు బయలుదేరెను.
శ్రీరంగమునకు చేరుకున్న తరువాత చాలా అందముగా అలంకరించబడిన ఆండాళ్ పల్లకిని దిగి, కోవెలలోకి ప్రవేశించి, శ్రీరంగనాధుని గర్భగృహములోకి వెళ్ళి , శ్రీరంగనాథుని (పెరియ పెరుమాళ్) పాదపద్మములను సేవించి వాటిలో అదృశ్యమయి తన దివ్యధామమైన పరమపదమును చేరుకొన్నది.
ఈ సంఘటనను అందరు చూసి ఆశ్చర్యచకితులై పెరియాళ్వార్ ను కీర్తించసాగిరి. పెరియపెరుమాళ్ అందరి సమక్షాన, సముద్రుడు తనకు మామగారైనట్లు ఈ పెరియాళ్వార్ కూడా ఈనాటి నుండి నాకు మామగారైనారు అని శఠగోప మర్యాదలు చేయించి వటపత్రశాయి పెరుమాళ్ కి కైంకర్యము చేయుటకై శ్రీవిల్లిపుత్తూర్ నకు సాగనంపినారు. ఆండాళ్ యొక్క కీర్తిని మనము మననము మరియు శ్రవణము(కనీసం మార్గలి మాసంలో నైన) సేవించవలెను. ఎన్నో దివ్యమైన ఆచార సంప్రదాయాలు, శ్రీ సూక్తులు మన ఆండాళ్ జీవన చరితము నుండి మరియు తన దివ్యప్రబంధముల నుండి మనం నిత్యము సేవించవలెను.
ఆండాళ్ మరియు తిరుప్పావై ప్రబంధము యొక్క వైభవమును శ్రీ భట్టర్ (పరాశర) శ్రీసూక్తుల వల్ల తెలుసుకొనవచ్చు. శ్రీభట్టర్, అందరు తిరుప్పావై యొక్క 30పాశురములని ప్రతిరోజు తప్పక సేవించవలెనని నియమనం చేసిరి. వీలుకాకపోతే కనీసం “ శిత్తుం శిరుకాలే ” అనే పాశురాన్ని మాత్రమునైనను ప్రతిరోజు తప్పక సేవించవలెనని, అదీకాకపోతే శ్రీభట్టర్ కు తిరుప్పావైకి గల సంబంధమును ఒకసారైనను తలుచుకొనవలెను. అప్పుడే మనం భగవంతుని కృపకు పాత్రులం అవతాము, ఎలాగైతే తల్లిగోవు గడ్డితో చేసిన లేగదూడను చూసి పాలను స్రవించునో అలా. ఆండాళ్ తిరువడికి మరియు తిరుప్పావై సంబంధముగల భట్టర్ తలచినచో భగవంతుడు మనను ఒక పాశురం సేవించినా 30పాశురాలు సేవించినా తన నిర్హేతుక జాయమాన కృపను మనపై ప్రసరింప చేయును. ఆండాళ్(శ్రీభూదేవి) తిరుప్పావై శ్రవణమననము చేసిన వారిపై నిర్హేతుక జాయమాన కృపను ప్రసరింప చేయుమని శ్రీవరాహపెరుమాళ్ ని కోరినది. ఆండాళ్ నిర్హేతుకజాయమాన కృపవలన ఈ సంసార సాగరాన జన్మించి, మనకోసమై తిరుప్పావై ని అనుగ్రహించినది. అలాగే మనం భగవంతుని యొక్క దివ్యమైన కృపకు శాశ్వతంగా పాత్రులమై సంసార తరంగముల నుండి విముక్తిని పొంది పరమపదములో భగవదనుభవమును/కైంకర్యమును పొందుతాము.
ఆండాళ్ తనియ:
నీళా తుఙ్గ స్తనగిరి తటీ సుప్తం ఉద్భోద్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిరసిద్ధం అధ్యాపయన్తీ |
స్వోఛి ష్ఠాయాం స్రజినిగళితం యా బలాత్ కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదం మిదం భూయ ఏవాస్తు భూయః ||
நீளா துங்க ஸ்தனகிரி தடீ ஸுப்தம் உத்போத்ய க்ருஷ்நம்
பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதி சத சிரஸ் சித்தம் அத்யாபயந்தீ
ஸ்வோசிஷ்டாயாம் ச்ரஜிநிகளிதம் யாபலாத் க்ருத்ய புங்க்தே
கோதா தஸ்யை நம இதம் இதம் பூய ஏவாஸ்து பூய:
Her archAvathAra anubhavam is already discussed in here –http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-andal-anubhavam.html.
అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాసః
ఆధారం: వ్యాఖ్యానములు, ఆరాయిరప్పడి గురుపరంపర ప్రభావం
Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu
Pingback: 2014 – June – Week 1 | kOyil
Pingback: appiLLai – అప్పిళ్ళై | guruparamparai telugu
Pingback: అప్పిళ్ళార్ | guruparamparai telugu
Pingback: పెరియ తిరుమలై నంబి | guruparamparai telugu
Pingback: తిరుక్కోష్టియూర్ నంబి | guruparamparai telugu
Pingback: 2014 – July – Week 5 | kOyil
Pingback: ప్రతివాది భయంకరం అణ్ణన్ | guruparamparai telugu
Pingback: పెరియాళ్వార్ | guruparamparai telugu
Pingback: వంగి పురత్తు నంబి | guruparamparai telugu
Pingback: అనంతాళ్వాన్ | guruparamparai telugu
Pingback: పిన్భళగియ పెరుమాళ్ జీయర్ | guruparamparai telugu
Pingback: కణ్ణినుణ్ శిరుత్తాంబు – అవతారిక | dhivya prabandham
Pingback: తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ | guruparamparai telugu
Pingback: gOdhA (ANdAL) | guruparamparai – AzhwArs/AchAryas Portal
Chala samagramga undiswamy. Dhanyavadalu daso
chala Dhannyavadalu Dr.A.Lalitha kumari Garu