Monthly Archives: May 2015

విళాఞ్జోలైపిళ్ళై

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

viLAnchOlai piLLai

తిరునక్షత్రం: ఆశ్వీజ(తులామాసం) ఉత్తరాషాడ నక్షత్రం .

అవతారస్థలం : తిరువనంతపురం దగ్గర ‘ఆఱనూర్’ అనే గ్రామం.ఇది కరైమనై అనే నదీ తీరాన ఉన్నది.

ఆచార్యులు: పిళ్ళైలోకాచార్యులు

కాలక్షేప ఆచార్యులు: విళాఞ్జోళైపిళ్ళై  ఈడు ను మరియు శ్రీభాష్యమును, తత్త్వత్రయమును  మిగిలిన రయస్య గ్రంథములను శ్రీపిళ్ళైలోకాచార్యుల తమ్ముడగు శ్రీ అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనారాచార్యుల వద్ద  అధ్యయనం చేశారు.

గ్రంథరచనలు: శ్రీ వచనభూషణమునకు సారమగు  ‘ సప్తగాథై’

పరమపదించిన స్థలం: తిరువనంతపురం

పిళ్ళైలోకాచార్యుల శిష్యుల్లో  విళాఞ్జోళైపిళ్ళై ఒకరు. వీరి దాస్య నామం నలం తిఘళ్ నారాయణ దాసులు.

వీరు ఈజవ(తాటి చెట్ల నుండి మద్యం సేకరించేవారు) కులములో పుట్టారు. కావున ఆలయములోకి రావడం నిషిద్ధముగా ఉండేది. కావున తమ గ్రామం నుండి ‘విలాం’ అనే వృక్షాలను ఎక్కి  తిరువనంతపుర పద్మనాభస్వామి దేవాలయ గోపురం దర్శించి  స్వామికి మంగళాశాసనం  చేసేవారు.

 శ్రీలోకార్య పదారవింద మఖిల శ్రుత్యర్థ కోశమసతాం

గోష్ఠీం చ తదేక లీన మనసా సంచితయంతమ్ సదా|
శ్రీనారాయణ దాసమార్యమమలం సేవే సతాం సేవధిం
శ్రీవాగ్భూషణ గూడభావ వివృతిం యస్య  సప్తగాథాం వ్యాధత||

విళాఞ్జోళైపిళ్ళై ఈడు, శ్రీభాష్యమును, తత్త్వత్రయమును మరియు  మిగిలిన రహస్య గ్రంథములను శ్రీపిళ్ళైలోకాచార్యుల తమ్ముడగు శ్రీ అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనారాచార్యుల వద్ద  అధ్యయనం చేశారు.

శ్రీవచనభూషణమును తమ ఆచార్యులగు శ్రీపిళ్ళైలోకాచార్యుల వద్ద అధ్యయనం చేశారు. వీరు దాని అర్థములు తెలిసిన ఒక నిపుణుడిగా(అధికారి) భావించేవారు.

వీరు తమ ఆచార్యులకు ఒక గొప్ప కైంకర్యమును చేశారు. అది తమ ఆచార్యులు చరమదశలో ఉన్నపుడు వారు చెప్పిన నిబంధనలను పాటించారు- శ్రీపిళ్ళైలోకాచార్యులు తమ శిష్యులగు తిరువాయ్ మొళిపిళ్ళై (తిరుమలైఆళ్వార్)ను సాంప్రదాయ సిద్ధంగా తయారు చేసి తమ ఉత్తరాధికారిగా చేయాలని మరియు   శ్రీవచనభూషణ విశేషాలను తిరువాయ్ మొళి పిళ్ళైకు అందించమని విళాఞ్జోళైపిళ్ళై కు ఆదేశించారు.

విళాఞ్జోళైపిళ్ళై మరియు తిరువాయ్ మొళి పిళ్ళై:

తిరువాయ్ మొళి పిళ్ళైను తిరువనంతపుర దేవాలయ అర్చకులగు నంబూద్రిలు అనంతపద్మనాభస్వామికి మూడు ద్వారముల నుండి మంగళాశాసనములు అనుగ్రహించమని ఆహ్వానించారు. అప్పుడు తిరువాయ్ మొళిపిళ్ళై ను విళాఞ్జోళైపిళ్ళై చూశారు.

వారు రాగానే  ఒక ఆశ్చర్యమును చూశారు. విళాఞ్జోళైపిళ్ళై తమ ఆచార్యులగు పిళ్ళైలోకాచార్యుల తిరుమేని మీద యోగధ్యానములో ఉన్నారు. ఆ రోజుల్లోవారి గొప్ప శిష్యులందరు శ్రీరంగములో  ఉన్నప్పుడు ఇలాంటివి జరిగేవి. విళాఞ్జోళైపిళ్ళై తిరుమేని (దివ్య శరీరం)సాలె గూడులతో కప్పబడింది.

తిరువాయ్ మొళిపిళ్ళై వారి పాదాల  పై పడి వారి ముందు మౌనంగా ఉండి పోయారు. విళాఞ్జోళైపిళ్ళై వెంటనే నేత్రాలను తెరచి తమ కృపను వారిపై అనుగ్రహించారు. విళాఞ్జోళైపిళ్ళై వీరికోసం చాలా కాలంగా ఎదురుచూడడం వల్ల వీరిని చూడగానే  చాలా ఆనందించారు.

విళాఞ్జోళైపిళ్ళై శ్రీవచనభూషణం యొక్క రహస్యార్థాలను తిరువాయ్ మొళిపిళ్ళై కి అనుగ్రహించారు. ఇంకా అదనంగా శ్రీవచనభూషణ సారమైన సప్తగాథై అను 7పాశురముల గ్రంథమును కూడ తిరువాయ్ మొళిపిళ్ళై కి ఉపదేశించారు.

ఇది తొండరడిపొడి ఆళ్వార్ అనుగ్రహించిన ‘కొడుమిన్ కొణ్మిన్’ కు ఒక ప్రముఖ ఉదాహరణ- ఈజవ  కులమునకు చెందిన విళాఞ్జోళైపిళ్ళై  అనుగ్రహంచారు, బ్రాహ్మణ కులానికి చెందిన తిరువాయ్ మొళిపిళ్ళై స్వీకరించారు. ఇదే శ్రీవైష్ణవ సిద్ధాంతపు సారతమము.

కొంతకాలం తర్వాత  తిరువాయ్ మొళిపిళ్ళై ,   విళాఞ్జోళైపిళ్ళై దగ్గర సెలవు తీసుకొని శ్రీరామానుజ దర్శనమునకు (సిద్ధాంతమునకు) దర్శనస్థాపక ఆచార్యులుగా ప్రకాశించిరి.

విళాఞ్జోళై పిళ్ళై చరమదశ

ఒక రోజు నంబూద్రీలు అనంతపద్మనాభస్వామికి తిరువారాధనం చేస్తున్నారు, ఆ సమయాన విళాఞ్జోళైపిళ్ళై  తూర్పు ద్వారం గుండా దేవాలయం లోకి ప్రవేశించారు. ధ్వజస్తంభమును దాటి, శ్రీ నరసింహున్ని దర్శించి , ఉత్తరద్వారం ద్వారా గర్భగృహం దగ్గరకు ప్రవేశించారు, ‘ఓర్రై కాల్ మండప’ మెట్లు ఎక్కారు, పెరుమాళ్ దర్శనమిచ్చు మూడు ద్వారముల స్థలములోకి వచ్చారు, దానిలో ఎంపెరుమాన్ దివ్యపాదారవిందములు దర్శనమిచ్చు   గవాక్షం దగ్గర నిల్చున్నారు.

దీనిని గమనించిన నంబూద్రీలు ,విళాఞ్జోళైపిళ్ళై కులము కారణంగా, దేవాలయ ఆచారవ్యవహారాలనుసరించి వారిని గర్భగృహములోనికి రానీయకూడదని సన్నిధి తలుపులను మూసి బయటకు వెళ్ళిపోయారు.

అదే సమయంలో విళాఞ్జోళైపిళ్ళై శిష్యులు కొందరు దేవాలయమును సమీపించి ఇలా తెలిపారు- తమ ఆచార్యులగు విళాఞ్జోళైపిళ్ళై వారి ఆచార్యులగు పిళ్ళైలోకాచార్యుల తిరువడిని చేరారు, కావున వారి చరమతిరుమేనికి అలంకరించుటకు పెరుమాళ్ ‘తిరు పరివట్టం(తలకు చుట్టు పెరుమాళ్ వస్త్రం) , శేషమాల’ ఇవ్వమని అభ్యర్థించారు. వారు దేవాలయ ముఖద్వారం వద్ద నిల్చుని రామానుజనూట్ర్రందాది ఇయళ్ ను అనుసంధించసాగారు.

విళాఞ్జోళైపిళ్ళై  అనంతపద్మనాభస్వామి తిరువడి ని చేరారు.

తిరువాయ్ మొళి పిళ్ళై ఈ వార్తను  విని ఆచార్యునికి ఒక శిష్యుడు చేయవలసిన చరమ కైంకర్యమును మరియు తిరువధ్యయనమును  సాంప్రదాయాన్ని అనుసరించి చేశారు. ఈ ఘటన మారినేరినంబిగారికి పెరియనంబిగారు చేసిన బ్రహ్మమేధాసంస్కారమును  గుర్తుచేస్తుంది.

తిరువాయ్ మొళి పిళ్ళై అంతటివారే విళాఞ్జోళైపిళ్ళై యందు ఆచార్యభావనను ఉంచేవారు. దీనిని దృష్ఠిలో ఉంచుకొని వారి శిష్యులు ఇలా చెప్పారు.

పట్ఱాద ఎంగళ్ మణవాళ యోగి పదమ్ పణిన్దోన్

నర్ఱేవరాస – నలంతిఘళ్ నారణ తాదరుడన్
కఱారెన్  కూరక్కులోత్తమ తాదన్ కళల్ పణివోన్

మఱారుమ్ ఒవ్వా తిరువాయ్ మొళి పిళ్ళై వాళియే

 తిరువాయ్ మొళిపిళ్ళై గారు అనుగ్రహించిన  విళాఞ్జోళైపిళ్ళై  వాళి తనియన్:

వాళి నలన్తికళ్ నారణతాతనరుళ్

వాళి యవనముద వాయ్ మొళికళ్, -వాళియే
ఏఱు తిరువుడైయాన్ ఎన్దై యులకారియన్ శొల్,
తేఱు తిరువుడైయాన్ శీర్

వీరి తనియన్:

తులాహిర్బుధ్న్య సంభూతం శ్రీలోకార్య పదాశ్రితం |
సప్తగాథా ప్రవక్తారం నారాయణ మహం భజే ||

తులా మాసమున ఉత్తరాషాడ నక్షత్రమున అవతరించి,  శ్రీ పిళ్ళైలోకాచార్యుల శ్రీపాదపద్మములను ఆశ్రయించి, ‘సప్తగాథై'( శ్రీ వచనభూషణ సారము)  ప్రవర్తకులైన శ్రీ నారాయణ గురువులను/ విళాఞ్జోళైపిళ్ళై ను భజిస్తున్నాను.

ఆధారములు:

1. “మన్ను పుగళ్ మణవాళమామునివన్ ” రంగరాజన్ 2011.

2. “నిత్యానుసంధానం”- శ్రీవైష్ణవశ్రీ; శ్రీసుదర్శన ట్రస్ట్.

3.. పిళ్ళైలోకం జీయర్  యతీంద్ర ప్రవణ ప్రభావం- శ్రీ ఉ.వే డా|| వి.వి.రామానుజన్ ద్వారా ముద్రితం  1992, 2000, 2006

4. మూలం సప్తగాథై – http://acharya.org/sloka/vspillai/index.html అక్టోబర్ 27, 2012.

5. శ్రీ రామానుజ E – జర్నల్ ‘http://www.docstoc.com/docs/2437367/Sri-Ramanuja-E-Journal – అక్టోబర్ 27, 2012.

6. చిత్ర రూపకల్పన   శ్రీ సారథి తోతాద్రి స్వామి.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

Note: mUlam for saptha gAThai is available in Sanskrit, English, and Thamizh at: http://acharya.org/sloka/vspillai/index.html

సూచన:  సప్తగాథై కు  శ్రీ పిళ్ళైలోకం జీయర్ అనుగ్రహించిన ద్రావిడ వ్యాఖ్యానమునకు  డా||ఉ.వే ఈ.ఏ.శింగరాచార్య స్వామి వారు తెలుగు అనువాదంతో అనుగ్రహించిన కోశము ఉన్నది . కావలసిన వారు  శ్రీరామానుజ సిద్ధాంతసభ,  సికింద్రాబాద్,     నల్లా శశిధర్ రామానుజ దాసున్ని సంప్రదించగలరు.  9885343309

Source: https://guruparamparai.wordpress.com/2015/05/29/vilancholai-pillai/ (originally from http://acharyar.wordpress.com/2012/10/26/vilancholai-pillai-vaibhavam/)

కూర కులోత్తమ దాసులు

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

తిరునక్షత్రము:తులా(ఆశ్వీజ) మాసము, ఆరుద్రా నక్షత్రము

అవతార స్థలము: శ్రీరంగం

ఆచార్యులు: వడక్కు తిరివీధిపిళ్ళై( కాలక్షేప ఆచార్యులు పిళ్ళైలోకాచార్యులు మరియు అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్

పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగమ్

కూరకులోత్తమ దాసులు శ్రీరంగమున అవతరించిరి వారి నిత్యనివాసం కూడా శ్రీరంగమే. వీరు కూరకులోత్తమ నాయన్ గా కూడ వ్యవహరింపబడేవారు.

కూరకులోత్తమ దాసులు , తిరుమలై ఆళ్వార్(తిరువాయ్ మొళిపిళ్ళై ) ని సాంప్రదాయములోనికి తిరిగి తీసుకరావడానికి కారణమైనవారు. వీరు పిళ్ళైలోకాచార్యుల కు అత్యంత సన్నిహితంగా ఉండే సహచరులు. వీరు పిళ్ళైలోకాచార్యుల తో కలిసి  శ్రీరంగమున నంపెరుమాళ్ కు జరగు ఉలా(నంపెరుమాళ్ కలాబకాలమున జరుగు  యాత్ర) ఉత్సవానికి  వెళ్ళేవారు. జ్యోతిష్కుడి యందు  పిళ్ళైలోకాచార్యులు తమ అవసాన కాలమున  తాము అందించిన సాంప్రదాయ విశేషఙ్ఞానమును  తిరువాయ్ మొళిపిళ్ళై/తిరుమలై ఆళ్వార్  (అతిపిన్న వయస్కులుగా ఉన్నప్పుడు పిళ్ళైలోకాచార్యుల వద్ద పంచసంస్కారములు పొందిన) కి అందించి వారిని సాంప్రదాయ అధికారిగా చేయమని  కూరకులోత్తమ దాసులను, తిరుకణ్ణంగుడి పిళ్ళైను , తిరుపుట్కులి జీయర్ ను, నాలూర్ పిళ్ళై మరియు విలాంశోలై పిళ్ళైను నిర్ధేశించారు.

మొదట కూరకులోత్తమ దాసులు  మధురై కు మంత్రి అయిన తిరుమలై ఆళ్వార్  ను కలవాడానికి వెళ్ళారు. ఎందుకనగా  తిరుమలై ఆళ్వార్   పరిపాలన యంత్రాంగములో మరియు తమిళ   సాహిత్యమున బహు నైపుణ్యం కలవారు.  మధురై రాజు పిన్నవయసులో నే మరణించడం వల్ల ఆ రాజు బాధ్యతలను మరియు యువరాజు పోషణా బాధ్యతలు వహించెడి వారు.

కూరకులోత్తమదాసులు మధురై నగరమునకు ప్రవేశించి నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువిరుత్త ప్రబంధమును అనుసంధించసాగిరి. ఆ సమయాన తిరుమళైఆళ్వార్  నగరమున పల్లకిలో విహారానికి వెళుతూ వీరిని గమనించారు.

తిరుమలైఆళ్వార్ పల్లకి దిగకుండానే కూరకులోత్తమదాసులను దీనికి అర్థమును చెప్పమనిరి దానికి దాసులు వీరిపై ఉమ్మివేసిరి. దీనిని గమనించిన తిరుమలైఆళ్వార్ భటులు ఆగ్రహించి కూరకులోత్తమదాసులను  శిక్షించడానికి ముందుకు వచ్చిరి. తిరుమలైఆళ్వార్ కూరకులోత్తమదాసుల గొప్పదనమును తెలిసిన వారు కనుక భటులను నిరోధించిరి.

తిరుమలై ఆళ్వార్  తిరిగి తమ భవనానికి వెళ్ళి తమకు మార్గదర్శనం చేయు  మారుటి (సవతి) తల్లికి ఈ సంఘటనను చెప్పగా ఆవిడ కూరకులోత్తమదాసులకు , పిళ్ళైలోకాచార్యులకు ఉన్న సంబంధమును ఎరిగి కూరకులోత్తమదాసులను కీర్తించిరి. వారి గొప్పదనము గ్రహించిన  తిరుమలైఆళ్వార్ తాము కూరకులోత్తమదాసులను వెతక సాగిరి.

తిరుమలైఆళ్వార్ తాము ఏనుగు అంబారిపై అధిరోహించి వెళ్ళిరి,  కూరకులోత్తమ దాసులు తాము కనబడాలని ఒక ఎత్తైన ప్రదేశమునకు ఎక్కిరి. దీనిని గమనించిన తిరుమలైఆళ్వార్ వెంటనే తమ అంబారిని దిగి కూరకులోత్తమదాసుల తిరువడిపై పడి వారిని స్తుతించిరి.

కూరకులోత్తమదాసులను ,తిరుమలైఆళ్వార్ తమ రాజభవనమునకు తీసుకెళ్ళి పిళ్ళైలోకాచార్యుల చే అనుగ్రహించబడిన అమూల్యమైన నిర్ధేశ్యములను శ్రవణం చేశారు. ఆ నిర్థేశ్యములను అనుసరించ దలచి తిరుమలైఆళ్వార్ , కూరకులోత్తమదాసులను ప్రతిరోజు ప్రాతః  కాలమున తమ అనుష్ఠాన సమయమున వచ్చి సాంప్రదాయ రహస్యములను అనుగ్రహించాలని ప్రార్థించారు. మరియు కూరకులోత్తమదాసులకు వేగై నదీ తీరాన ఒక నివాసగృహమును ఏర్పాటు చేసి వారి జీవనమునకు అవసరమగు వస్తుసామాగ్రిని సమకూర్చారు.

కూరకులోత్తమదాసులు ప్రతిరోజు తిరుమలై ఆళ్వార్  దగ్గరకు వెళ్ళసాగిరి. తిరుమలైఆళ్వార్ ప్రతిరోజు తాము తిరుమణ్ కాప్పు (స్వరూపం) చేసుకొనేసమయాన(మనం తిరుమణ్ కాప్పు చేసుకొనే సమయాన గురుపరంపరను అనుసంధిస్తాము కదా) పిళ్ళైలోకాచార్యుల తనియన్ ను అనుసంధించుటను   కూరకులోత్తమదాసులు  గమనించి చాలా ఆనందించిరి.   కూరకులోత్తమదాసులు వారికి  సాంప్రదాయ విషయాలను బోధించసాగిరి. ఒక రోజున కూరకులోత్తమదాసులు రానందున తిరుమలైఆళ్వార్ తమ సేవకున్ని పంపారు అయినా  ఏ స్పందన లేదు.

ఆచార్య సంబంధమువల్ల తామే స్వయంగా వెళ్ళిరి.  కూరకులోత్తమదాసులు వారిని కొంత సమయం వేచిఉండేలా చేసిరి. చివరకు తిరుమలైఆళ్వార్  తాము కూరకులోత్తమదాసుల శ్రీపాదములపై పడి తమ తప్పిదమును మన్నించమని వేడుకొనగా వారు మన్నించిరి.

ఆనాటి నుండి తిరుమలైఆళ్వార్ తామే స్వయంగా కాలక్షేప సమయానికి ఉపస్థితులై ప్రతిరోజు కూరకులోత్తమదాసుల శ్రీపాదతీర్థమును మరియు శేషప్రసాదాన్ని స్వీకరించసాగిరి. భాగవత్తోత్తముల శ్రీపాద తీర్థము మరియు శేషప్రసాదం తీసుకొన్నవాళ్ళు పవిత్రులవతారు. అలాగే తిరుమలైఆళ్వార్ లో గొప్ప మార్పు వచ్చినది. వీటి ప్రభావం వల్ల తిరుమలై ఆళ్వార్          “కూరకులోత్తమ దాస నాయన్  తిరువడిగళే శరణం” అని అనుసంధిస్తు తమ రాజ్యవిషయముల యందు మరియు ప్రాపంచిక విషయాలయందు నిరాసక్తతను   ప్రదర్శించ సాగిరి.

కూరకులోత్తమదాసులు తిరిగి శిక్కిళ్ గ్రామానికి (తిరుపుళ్ళాని కి సమీపమున ఉన్నది) వెళ్ళిపోయిరి. తిరుమలైఆళ్వార్ తమ రాజ్యభారాన్ని అప్పచెప్పి తాను రాజ్యాన్ని వదలి కూరకులోత్తమదాసుల తో సహవాసం చేస్తు వారికి సమస్త సేవలు చేయనారంభించిరి.

కూరకులోత్తమదాసులు తమ అవసానమున తిరుమలైఆళ్వార్ కు తరువాతి సాంప్రదాయవిషయాలను విలాంశోలై పిళ్ళై మరియు తిరుకణ్ణంగుడిపిళ్ళై వద్ద సేవించమని నిర్థేశించిరి. ఒకనాడు కూరకులోత్తమదాసులు పిళ్ళైలోకాచార్యుల తిరువడిని స్మరిస్తూ తమ చరమ శరీరాన్ని వదిలి పరమపదం వేంచేశారు.

మామునులు , కూరకులోత్తమదాసులను “కూరకులోత్తమ దాసం ఉదారం”(వీరు చాలా ఉదార స్వభావులు మరియు కృపాలురు) అని కీర్తించారు. కారణం వీరి నిరంతర కృషి మరియు నిర్హేతుక కృపవల్ల తాము పిళ్ళైలోకాచార్యుల వద్ద సేవించిన సాంప్రదాయ విషయాలన్నింటిని తిరుమలైఆళ్వార్ కు బోధించి వారు మళ్ళీ సాంప్రదాయములోనికి  వచ్చేలా శ్రమించిరి.  వీరు మన సాంప్రదాయమున రహస్యగ్రంథ కాలక్షేప పరంపరలో ఒక ప్రముఖ స్థాన్నాన్ని ఆక్రమించారు. మరియు చాలా రహస్య గ్రంథములలో పెక్కు తనియన్ల తో కీర్తంచబడ్డారు.

శ్రీవచనభూషణ దివ్యశాస్త్రము  ప్రతి శిష్యునికి ” ఆచార్య అభిమానమే ఉత్తారకం” (ஆசார்ய அபிமானமே உத்தாரகம்) అని నిర్థేశించినది. దీనికి  వ్యాఖ్యానమును చేస్తు మామునులు ఇలా అనుగ్రహించారు “ప్రపన్నునకు అన్నీ ఉపాయములకన్నా ఆచార్యుని నిర్హేతుక కృప మరియు వారు ‘ఇతను నా శిష్యుడు’ అని తలంచిన అదే శిష్యునకు ముక్తి (మోక్షం) ని ప్రసాదించును’

ఈ విషయాన్ని మనం పిళ్ళైలోకాచార్యుల, కూరకులోత్తమదాసుల మరియు తిరువాయ్ మొళిపిళ్ళై చరితమున స్పష్ఠంగా దర్శించవచ్చును. కూరకులోత్తమదాసుల మరియు తిరువాయ్ మొళిపిళ్ళై యందు పిళ్ళైలోకాచార్యుల అభిమానం మరియు ఉత్తమ ఆచార్యులగు తిరువాయ్ మొళిపిళ్ళై యొక్క అలుపెరుగని శ్రమవల్ల  క్రమంగా ఆ అభిమానం అళిగియ మణవాళ మామునుల ద్వారా మనకు సంక్రమించినది.

ప్రతి నిత్యం పిళ్ళైలోకాచార్యుల ను ధ్యానించు కూరకులోత్తమ దాసులను ధ్యానము చేద్దాం.

కూరకులోత్తమ దాసుల తనియన్ :

లోకాచార్య కృపాపాత్రం కౌణ్డిన్య కుల భూషణం |
సమస్తాత్మ గుణావాసం వందే కూర కులోత్తమం ||

పిళ్ళైలోకాచార్యుల కృపకు పాత్రులై కౌణ్డిన్య కుల భూషణుడై అనేక కల్యాణ గుణములకు ఆవాస్యయొగ్యుడైన కూరకులోత్తమ దాసులకు వందనం చేయుచున్నాను.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.in/

Source: http://guruparamparai.wordpress.com/2012/11/02/kura-kulothama-dhasar/

నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

తిరునక్షత్రము:  సింహ(శ్రావణ)మాస రోహిణీ నక్షత్రం 
(యతీంద్ర ప్రవణ ప్రభావం లో చిత్తా నక్షత్రం గా తెలుపబడింది)
అవతార స్థలము: శ్రీరంగం
ఆచార్యులు: పెరియవాచ్చాన్ పిళ్ళై 
శిష్యులు: వాది కేసరి అళగియ మనవాళ జీయర్, శ్రీరంగాచార్యులు, పరకాలదాసులు మొదలైన వారు
పరమపదించిన స్థలం : శ్రీరంగం

రచనలు: చరమోపాయ నిర్ణయం  (http://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html), అణుత్వ పురుషాకారత్వ సమర్థనం, ఙ్ఞానార్ణవం, ముక్తభోగావళి,  ఆళవందార్ కృత చతుఃశ్లోకికి వ్యాఖ్యానం, పెరియవాచ్చాన్ పిళ్ళై కృత విష్ణుశేషి అను శ్లోకమునకు వ్యాఖ్యానం, తత్త్వత్రయ నిర్ణయం, కైవల్య నిర్ణయం మొదలైనవి.

పెరియవాచ్చాన్ పిళ్ళై గారికి దత్తపుత్రుడు నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై. వీరి అసలు పేరు అళిగియ మణవాళ పెరుమాళ్  నాయనార్(సుందర వరరాజాచార్యులు). వీరి శిష్యులగు పరకాల దాసులు రచించిన పరకాల నల్లాన్ రహస్యం అను గ్రంథమున  వీరు సౌమ్యవరేశులు గా వ్యవహరింపబడ్డారు. “రంగరాజ దీక్షితులు” గా మరియు  మహా పండితులుగా కూడ వ్యవహరింపబడే వారు. వీరు  సత్సాంప్రదాయ స్థాపనకై ప్రామాణికమైన  ఎన్నో గ్రంథములను, శ్రీసూక్తులను  రాశారు. వీరు పిళ్ళైలోకాచార్యులకు , అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ల సమకాలీనులు.

వీరి రచనలు మన సాంప్రదాయ విషయాలకు సారంగా ఉంటాయి. వీరి చరమోపాయ నిర్ణయం సాంప్రదాయానికి పరాకాష్ఠ, దీనిలో ఎంపెరుమానార్ కు మన సాంప్రదాయమున ఉన్న విశేష స్థానము తెలుపబడింది. వీరి చతుఃశ్లోకి వ్యాఖ్యానములో పెరియపిరాట్టి(శ్రీరంగనాయకి) యొక్క పురుషాకార స్వభావమును విస్పష్ఠముగా తెలిపినారు.

ప్రమేయరత్నం లో (వాది కేసరి అళగియ మనవాళ జీయర్ శిష్యులగు యామునాచార్యుల కృతం) నాయనారాచ్చాన్ పిళ్ళై అనుగ్రహించిన ముక్తభోగావళి ని వీరు యుక్తవయస్సులో ఉన్నప్పుడు వ్రాసి పెరియవాచ్చాన్  పిళ్ళై కు నివేదించారు అని ఉన్నది. దీనిలోని విశేషములను గ్రహించిన పెరియవాచ్చాన్  పిళ్ళై దీనిని ప్రశంసించి వీరికి సాంప్రదాయ రహస్యములన్నింటిని విశేషముగా అనుగ్రహించారు.

వాది కేసరి అళగియ మనవాళ జీయర్, శ్రీరంగాచార్యులు, పరకాలదాసులు మొదలైన వారు పెరియవాచ్చాన్ పిళ్ళై గారి శిష్యులు అయినను భగవద్విషయాన్ని నాయనారాచ్చాన్  పిళ్ళై గారి వద్ద సేవించారు.

ఇంతవరకు మనం నాయనారాచ్చాన్ పిళ్ళై గారి వైభవమును తెలుసుకున్నాము. వీరు బహుముఖప్రఙ్ఞాశాలి మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై గారికి అతి సన్నిహితులు. వీరి చరణారవిందముల యందు భాగవతనిష్ఠ మనకు అబ్బాలని ప్రార్థనచేద్దాం.

వీరి తనియన్:
సృత్యర్తసారజనకం స్మృతిబాలమిత్రం
పద్మోల్లసద్ భగవదన్ఘ్రి పురాణబందుం |
ఙ్ఞానాదిరాజం అభయప్రదరాజ సూనుం
అస్మత్ గురుం పరమకారుణికం నమామి ||

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/

Source: http://guruparamparai.wordpress.com/2013/04/21/nayanarachan-pillai/

అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

nayanarతిరునక్షత్రం : మార్గళి(మార్గశీర్షం)ధనిష్ఠ

అవతార స్థలం: శ్రీరంగం
ఆచార్యులు: వడక్కు తిరువీధిపిళ్ళై
పరమపదించిన స్థలం- శ్రీరంగం
రచనలు: తిరుప్పావై ఆరాయిరప్పడి వ్యాఖ్యానం, కణ్ణినుణ్ శిరుతాంబు వ్యాఖ్యానం, అమలనాది పిరాన్ వ్యాఖ్యానం, అరుళిచ్చెయళ్ రహస్యం, (ఆళ్వారుల పదవిన్యాసం తో రహస్యత్రయ వివరణ)ఆచార్యహృదయం, ఆచార్య హృదయం- ఒక స్వయం వ్రాతప్రతి- ప్రస్తుతం ఇది అలభ్యం.

అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ,నంపెరుమాళ్ అనుగ్రహం వల్ల శ్రీరంగమున వడక్కు తిరువీధిపిళ్ళై గారికి జన్మించిరి. (దీనిని క్రితమే వడక్కుతిరువీధిపిళ్ళై ఐతిహ్యమున తెలుసుకున్నాము – https://guruparamparaitelugu.wordpress.com/2013/09/25/vadakku-thiruvidhi-pillai/ ). వీరును వీరి అన్నగారగు పిళ్ళైలోకాచార్యులు  అయోధ్యలో రామలక్ష్మణుల్లాగా, గోకులాన శ్రీకృష్ణ బలరామునివలె ఆప్యాయంగా శ్రీరంగమున పెరిగిరి.

వీరిద్దరు మన సాంప్రదాయమున గొప్పవారగు నంపిళ్ళై, పెరియవాచ్చాన్ పిళ్ళై మరియు వడక్కుతిరువీధిపిళ్ళై మొదలగు ఆచార్యుల కృపాకటాక్షములచే మరియు మార్గదర్శనమున  నడవసాగిరి. వీరిద్దరు తమ తండ్రియగు వడక్కుతిరువీధిపిళ్ళై పాదపద్మముల వద్ద సాంప్రదాయ రహస్యములను అధికరించారు. మరియు విశేషముగా ఈ ఆచార్య సింహములు సాంప్రదాయ అభివృద్ధికై ఆజన్మాంతము నైష్ఠిక బ్రహ్మచర్యమును స్వీకరిస్తామని ప్రతిఙ్ఞ పూనినారు .

మామునులు తమ ఉపదేశరత్నమాలలో 47వ పాశురమున నాయనార్ ను మరియు వారి రచనలను కీర్తించారు.

నంజీయర్ శెయ్ ద వియాక్కియైగళ్ నాలిరణ్డుక్కు|
ఎంజామై యావైక్కుం  ఇల్లైయే| తం శీరాల్
వైయగురువిన్ తంబి మన్ను మణవళముని|
శెయ్యుమవై తాముమ్ శిల|

సంక్షిప్త  అనువాదం:

నంజీయర్ అరుళిచ్చెయల్ లోని కొన్ని ప్రబంధములకు  వ్యాఖ్యానమును అనుగ్రహించారు (పెరియవాచ్చాన్ పిళ్ళై కన్నా ముందు). పెరియవాచ్చాన్ పిళ్ళై అనంతరం పిళ్ళైలోకాచార్యుల సోదరుడు మహాఙ్ఞాని అయిన అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్  అరుళిచ్చెయళ్ లోని కొన్ని ప్రబంధములకు  క్రమంగా వ్యాఖ్యానాలను అనుగ్రహించారు.

పిళ్ళై లోకం జీయర్ తమ వ్యాఖ్యానములో నాయనార్ వైభవాన్ని కీర్తించారు దానిని మనం అనుభవిద్దాం.

 • “తమం శీర్” లో  జీయర్, నాయనార్ ప్రభావమును విశేషముగా  ప్రకటించారు.  అరుళిచ్చెయళ్ లో ఇతర ఆచార్యుల కన్నా వీరికి అధిక ప్రావీణ్యం ఉన్నదని గుర్తించారు.  మనం దీనిని వారి ‘ఆచార్య హృదయం’ నందు అరుళిచ్చెయళ్ లో ని పదాల వినియోగాన్ని  బట్టి వీరికి అరుళిచ్చెయళ్ లో (కొన్ని పదములను ఇతిహాసపురాణముల నుండి కూడా)  ఉన్న ప్రావీణ్యత తెలుస్తుంది.
 • “వైయ గురువిన్ తంబి” అను వాక్యమున , నాయనార్ గొప్పదనం పిళ్ళైలోకాచార్యులకు తమ్మునిగా అవతరించడమే అని ఉద్ఘాటించారు. వీరు “జగద్గురువరానుజ”(జగద్గురువగు  పిళ్ళైలోకాచార్యులకు సోదరులు ) అను నామధేయముతో కీర్తింపబడేవారు.

నాయనార్  తిరుప్పావై, కణ్ణినుణ్ శిరుత్తాంబు మరియు అమలనాది పిరాన్ ప్రబంధములకు వ్యాఖ్యానాలను అనుగ్రహించారు. ఆచార్యహృదయం అను గ్రంథము వీరి విశేష కృతి.

వీరి వ్యాఖ్యానములు/రచనలు.

 • వీరి తిరుప్పావై ఆరాయిరప్పడి వ్యాఖ్యానం చాలా విస్తృతమైనది మరియు విశేషమైనది కూడా. ఈ వ్యాఖ్యానమునందు సాంప్రదాయ సారమును అందముగా వర్ణించారు. ఎంపెరుమాన్ యొక్క ఉపాయత్వం/ఉపేయత్వం, నిర్హేతుక కృప, పిరాట్టి (అమ్మవారు)యొక్క పురుషాకారం, పరగత స్వీకారం మరియు  కైంకర్యమున విరోధం మొదలైన విశేషములను  తమ తిరుప్పావై వ్యాఖ్యానమున చాలా  అనర్గళంగా నాయనార్ వివరించారు.
 • వీరి అమలనాదిపిరాన్  వ్యాఖ్యానం మన సాంప్రదాయమున విశేషమైనది. ఎంపెరుమాన్ ఒక్క దివ్య తిరుమేని అనుభవం చాలా విశేషంగా వర్ణించబడింది, మనం క్రితమే ఈ అనుభవాలను తిరుప్పాణాళ్వార్ అర్చావతార విషయమున చూశాము.
 • http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-thiruppanazhwar.html.
 •  కణ్ణినుణ్ శిరిత్తాంబు వ్యాఖ్యానం లో వీరు పంచమోపాయము(ఆచార్యుడే  సర్వస్వం అని నమ్మి ఉండుట) మరియు ఆచార్య వైభవములపై విశేష వ్యాఖ్యానమును   అనుగ్రహించారు.
 • అరుళిచ్చెయళ్  రహస్యం లో వీరు రహస్యత్రయం, తిరుమంత్రం, ద్వయమత్రం మరియు చరమశ్లోకములను అరుళిచ్చెయళ్ లోని పదబంధములను ప్రయోగిస్తు వివరించారు. అరిళిచ్చెయళ్ నిపుణులలో సాంప్రదాయ రచనలు చేసేవారిలో నాయనార్ అత్యంత సామర్థ్యం కలవారు.
 • ఆచార్యహృదయం వీరి గ్రంథ రచనలలో అత్యంత విశేషణమైనది. నమ్మాళ్వార్ యొక్క మానసిక భావలను ప్రతిబింబింప చేశారు మరియు  తిరువాయ్ మొళి  దివ్యప్రబంధ రహస్యములను ఆళ్వార్ హృదయానుసారం వెలికి తీశారు. ఈ గ్రంథం పిళ్ళైలోకాచార్యుల శ్రీవచనభూషణం లోని శ్రీసూక్తులను సవివరంగా విశదీకరించినది. మనం క్రితమే నాయనార్ అర్చావతార అనుభవమును ఆచార్యహృదయం ద్వారా తెలుసుకున్నాము.
 • http://ponnadi.blogspot.in/2012/11/archavathara-anubhavam-nayanar-anubhavam.html.

ఒకరి గొప్పదనం తెలుసుకోవాలన్న వేరొక గొప్పవ్యక్తి యొక్క వాక్కులద్వారా మాత్రమే తెలుసుకోవాలి. నాయనార్ తాను  పిళ్ళైలోకాచార్యుల కన్నా మునుపే  అతి పిన్న వయసులో తమ తిరుమేనిని వదలి పరమపదం చేరుకున్నారు. పిళ్ళైలోకాచార్యులు తమ ఒడిలో నాయనార్ తలను ఉంచుకొని శోకసముద్రంలో మునిగి ఇలా విలపించారు.

మాముడుంబై మన్ను మణవాల అణ్ణాలొదు

శేమముదన్ వైకుంఠం చెన్ఱక్కాల్

మామెన్ఱు తొతురైత్త శొల్లుం తుయం తన్నినళ్  పొరుళుం

ఎత్తెజుత్తుం ఇంగురైప్పారార్

 సంక్షిప్త అనువాదం:

నాయనార్ విశేష వైభవం ద్వారా పరమపదమును  అలంకరించిరి, ప్రస్తుతం  రహస్యత్రయం- తిరుమంత్రం , ద్వయమంత్రం మరియు చరమశ్లోకములను ఎవరు ప్రవచిస్తారు(ఎంపెరుమాన్ తాను వారి హృదయ స్పందనను చూచి = మామ్ -నేను  రక్షకుడను అన్నారు )

ఇలా పిళ్ళైలోకాచార్యులు  నాయనార్ వైభవాన్ని కీర్తించారు.

ఎంపెరుమానార్ మరియు  మన ఆచార్యుల అనుగ్రహం పొందాలని అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ పాదపద్మముల యందు  ప్రార్థించుదాం.

అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తనియన్:

ద్రావిడామ్నాయ హృదయం గురుపర్వక్రమాగతం|
రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా||

అళిగియa మణవాళ పెరుమాళ్ నాయనార్ ను కీర్తించుపాశురం (సాధారణంగా  ఆచార్య హృదయ సమాప్తినందు పఠిస్తారు)

తన్దదరుళ వేణుమ్  తవత్తోర్ తవప్పయనాయ్ వన్దముడుమ్బై మణవాళా- శిన్దైయినాళ్
నీయురైత్త మాఱన్ నినైవిన్  పొరుళనై త్తెన్  వాయురైత్తు వాళుమ్ వకై

వీరి అర్చావతార వైభవమును ఇక్కడ పఠించవచ్చు:

http://ponnadi.blogspot.in/2012/11/archavathara-anubhavam-nayanar-anubhavam.html.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/

Source: http://guruparamparai.wordpress.com/2012/12/15/azhagiya-manavala-perumal-nayanar/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
srIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీవానాచల మహామునయే నమ:

nampillai-goshti1

నంపిళ్ళై కాలక్షేపగోష్ఠి లో ఎడమ నుండి మూడవవారు నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్

తిరునక్షత్రము: ఆశ్వీజ మాస ధనిష్ఠా నక్షత్రం
అవతార స్థలము: శ్రీరంగం
ఆచార్యులు: తమ తండ్రిగారు మరియు   నంపిళ్ళై 
శిష్యులు: వళామళిగియర్
పరమపదించిన స్థలం: శ్రీరంగం
గ్రంథములు/రచనలు: తిరువాయ్ మొళి 125000 పడి వ్యాఖ్యానం , పిష్ఠపసు నిర్ణయం, అష్ఠాక్శర దీపిక, రహస్య త్రయం, ద్వయ పితకట్టు, తత్త్వ వివరణం, శ్రీవత్సవింశతి మొదలైనవి.

పరాశరభట్టర్ కి కుమారులని లేదా పౌత్రులని ఐతిహ్యం. వీరు ఉద్ధండ భట్టర్ అని కూడా వ్యవహరింపబడేవారు క్రమంగా  నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ అను నామధేయంతో  స్థిరపడ్డారు.

సూచన: పెరియ తిరుముడి అడైవు లో వీరు పరాశరభట్టర్ పుత్రులని  ,  ఆరాయిరప్పడి గురుపరంపరా ప్రభావంలో కూరత్తాళ్వాన్ పౌత్రులని చెప్పబడింది. మరియు ఒక వ్రాతప్రతి (manuscript) యందు  వేదవ్యాస భట్టర్ కు ప్రపౌత్రులని (great grand-son) పేర్కొనబడింది. వీరి గుర్తింపునకు సరైన స్పష్ఠత దొరకడం లేదు, కాని ఎట్టకేలకు నంపిళ్ళై ప్రియ శిష్యులని మాత్రం  చెప్పవచ్చు.

నంపిళ్ళై వేంచేసి ఉన్న సమయంలో శ్రీరంగమున శ్రీవైష్ణవసాంప్రదాయానికి   మరియు భగవత్ అనుభవమునకు సువర్ణ కాలమని చెప్పవచ్చు.  ఆ కాలమున సాంప్రదాయమునకు ఏ ఆటంకము రాక  అవిచ్ఛిన్నముగా కొనసాగినది. నంపిళ్ళై గారికి అనేక మంది శిష్యులు మరియు  అనుచరులుండి వారి కాలక్షేపమునకు క్రమం తప్పకుండా హాజరు అయ్యేవారు . మొదట నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ వీరితో అనుకూలమైన వైఖరితో ఉండేవారు కాదు. నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ పరంపరగా ఉన్నత(ధనవంతుల) కుటుంబములోని వారు కావున అహంభావముతో నంపిళ్ళై గారికి మర్యాద ఇచ్చేవారు కాదు.

ఒకసారి నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ రాజ భవనానికి వెళుతున్నారు. దారిన  పిన్బళిగియ పెరుమాళ్ జీయరు కనబడగా వారిని కూడ తమతో రాజసభకు రావాలని  ఆహ్వానించారు. జీయర్ వీరి ఉన్నత పరంపరను దృష్ఠిలో ఉంచుకొని గౌరవించి వీరిని అనుసరించిరి. రాజు వీరిద్దరిని మర్యాదగా ఆహ్వానించి ఉచిత ఆసన్నాని ఏర్పరిచారు. రాజు    స్వతహాగా ఙ్ఞాని, తాను భట్టర్  ఙ్ఞానమును పరీక్షించదలచి శ్రీమద్రామాయణము నుండి ఒక ప్రశ్నను అడిగారు.

“శ్రీరాముడు తాను సామాన్య మానవునిగా, దశరాథాత్ముజిడిగా చెప్పుకున్నాడు కదా , కాని జటాయువుకు మోక్షమునిచ్చి శ్రీవైకుంఠమునకు పంపాడు. ఇది తన స్వభావమునకు విరుద్ధము కదా?” భట్టర్ కు ఆ ప్రశ్న వినగానే నోటమాటరాలేదు.  ఆ ప్రశ్నకు తగిన సమాధానమివ్వలేక పోయిరి.  ఆ సమయాన మహారాజు రాజకార్య వ్యాకులతతో ఉండిరి. ఆ సమాయమున భట్టర్  తాను  జీయర్ వైపు తిరిగి “ఈ ప్రశ్నను నంపిళ్ళై ఎలా వ్యఖ్యానించారు” అని అడిగారు.

జీయర్ ఇలా సమాధనమిచ్చారు,  నంపిళ్ళై దీనికి ఈ శ్లోకం చెప్పారు ‘సత్యేన లోకాన్    జయతి ‘  – అర్థం సత్యమును పలుకువారు లోకమున తన ఆధీనం లో ఉంచుకుంటారు- కావున  తన సత్యవాక్ పరిపాలనచే లోకమును జయించగలిగారు. భట్టర్  తాను ఙ్ఞానిగా ఆ సమాధానమును రాజు  ఈ విషయంలోకి మరలగానే చెప్పారు.

రాజు ఈ స్వతాహాగా ఙ్ఞాని కావున ఈ సమాధానానికి సంతసించి భట్టర్ ను విశేషముగా సన్మానించిరి. భట్ఠర్ తాను  నంపిళ్ళై గారి మీద కృతఙ్ఞతా/ భక్తి భావముచే తనను వారితో కలుపమని జీయరును ప్రార్థించి నంపిళ్ళై గారి నివాసమునకు వెళ్ళి రాజుచే పొందిన ఆ సంపదనంతటిని వారి శ్రీచరణాల వద్ద సమర్పించిరి.

 భట్టర్ తాను నంపిళ్ళై తో ” ఈ సంపదనంతా నేను మీరు వ్యాఖ్యానించిన ఒక చిన్న సమాధానము మాత్రముచే పొందాను” అని తనను తాను నంపిళ్ళై గారికి సమర్పించుకున్నారు.  ఇంకా ”  నేను అన్నింటా చాలా విలువైన మీ సాంగత్యాన్ని / మార్గదర్శకత్వమును కోల్పోయ్యాను, ఈ నాటి నుండి నేను సాంప్రదాయ రహస్యాలు, వ్యాఖ్యానాలను తమ సన్నిధిన నేర్చుకుంటానని నిర్థారించుకున్నాను ” అని అనిరి. దీనికి నంపిళ్ళై తాను భట్టర్ ను ఆలింగనం చేసుకొని తనకి సాంప్రదాయ రహస్యాలను, వ్యాఖ్యాలను బోధించారు.

నంపిళ్ళై తిరువాయ్ మొళి ని భట్టర్ కు ఉపదేశించారు. భట్టర్  ప్రాతః కాలమును శ్రవణం చేసి  దానిని ధ్యానించి/మననం చేసి  రాత్రిన ఆ శ్రవణం చేసిన దానిని విషదంగా  గ్రంథస్థ పరిచేవారు. ఆ వ్యాఖ్యానం పూర్తవగానే  ఆ గ్రంథస్థ భాగాన్ని నంపిళ్ళై శ్రీపాదముల్లో సమర్పించేవారు.

నంపిళ్ళై 125000 పడి(మహాభారత శ్లోక సంఖ్యకు సమానమైన)  గ్రంథస్థభాగాన్నిపరిశీలించారు. ఈ విస్తారమైన గ్రంథమును చూసి   రాబోవు కాలమున ఆచార్య-శిష్య పరంపరగావచ్చు  ఉపదేశ/అభ్యాస పద్ధతిని విస్మరించి కేవలం  పఠించి   దానికి తన సొంత  నిర్ణయాలు తీసుకుంటారు అని భావించి భీతిచెందారు నంపిళ్ళై.

పిళ్ళాన్ తాను ఆరాయిరప్పడి (విష్ణు పురాణ శ్లోక సంఖ్యకు సమానమైన)వ్యాఖ్యానం రాసేముందు ఎంపెరుమానార్ఙ్ఞ ను తీసుకున్నారని నంపిళ్ళై ,  భట్టర్ కు తెలిపారు. కాని ఇక్కడ భట్టర్ వ్యాఖ్యానం రాసేందుకు నంపిళ్ళై ఆఙ్ఞ దొరక లేదు. దీనికి భట్టర్ తమరు ఏది ప్రవచించారో అదే వ్రాశాను స్వతాహాగా  ఏదీ వ్రాయలేదన్నారు. చివరకు నంపిళ్ళై  ఈ గ్రంథ విడుదల కు ఒప్పుకోలేదు కదా దానిని భిన్నం చేశారు.

 ((సూచన- యతీంద్ర ప్రవణ ప్రభావం లో , ఎప్పుడైతే ఆచార్యులు పరమపదిస్తారో శిష్యులు /సంతానం శిరోముండనం మిగిలిన వారు   ఆశ్రయిలు(అప్రత్యక్ష శిష్యులు )  ముఖ  ముండనం చేయించుకోవాలి

ఎప్పుడైతే నంపిళ్ళై  పరమపదించారో  శిష్యులు చేయవలసిన కర్మయగు శిరోముండనం చేయించుకున్నారు  నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్. నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ సోదరుడు ఈ చర్యకు బాధపడి అతనితో ఎవరైన కూరేశుల వంశమున జన్మించారా అని ప్రశ్నించారు. దానికి పిళ్ళై భట్టర్ “హో ! నేను కూరత్తాళ్వాన్ వంశమును అగౌరపరిచానా? అని వ్యంగముగా  మీరు ఎలా చెప్పుతున్నారు దీనిని?సమాధానమిచ్చారు.  భట్టర్ సోదరులు  ఈ వ్యంగపు మాటలు వినలేక నంపెరుమాళ్ సన్నిధికి వెళ్ళి   భట్టర్ మీద ఫిర్యాదు చేశారు. నంపెరుమాళ్ , భట్టర్ కు సమన్లు పంపి అర్చకముఖతగా ఇలా అడిగారు “మేము  బతికే ఉన్నా మీరు ఈ చర్యకు పాల్పడ్డారేలా? “(నంపెరుమాళ్ తమకు తాము పరాశరభట్టర్ మరియు వారి వారసులకు తండ్రిగా వ్యవహరించుకుంటారు). దానికి భట్టర్    ” ఈ చర్యకు తాము మమ్మల్ని క్షమించాలి” అన్నారు

వారు ఇంకా ” వాస్తవానికి మేము నంపిళ్ళై కు ఆధీనులమయ్యాము, కూరేశుల(శ్రీవైష్ణవులకు ఆధీనులగుట) వంశములో వచ్చు వారికి అగు సహజ స్వభావం ఇది, కావున ముఖముండనం చేయించుకున్న. కనీస అనుష్ఠానం ఆచరించుటకు శిష్యులు/ సంతానం చేయు కర్మ యగు శిరోముండనమునకు బదులు మీరు ఈ కనీస మర్యాదకు  కూడా చింతిస్తున్నారా?” ఈ సమాధానానికి నంపెరుమాళ్ ఈ భట్టర్ కు నంపిళ్ళై పై ఉన్న అంకిత భావానికి   సంతృప్తి చెంది వారికి తమ  మాలా . శఠారి, వస్త్ర మర్యాదను చేయించారు. ఇదీ  నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ యొక్క వైభవం.

ఈ క్రింది వ్యాఖ్యానాలలో కొన్ని సంఘటనలు   నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ యొక్క  వైభవమును కీర్తిస్తాయి, వాటిని చూద్దాము.

 • తిరువాయ్ మొళి 9.3/ నంపిళ్ళై ఈడు అవతారికలో- ఈ పదిగంలో నమ్మాళ్వార్ తాను నారాయణ నామ (మంత్రం ను కూడా) కీర్తిస్తున్నారు. సాధారణముగా మూడు వ్యాపక మంత్రాలు ఉన్నవి(ఈ మంత్రాలు భగవానుని  వ్యాపకాన్ని/ఉనికిని తెలుపుతాయి) అవి అష్ఠాక్షరి(ఓం నమో నారాయణాయ) షడాక్షరి(ఓం నమో విష్ణవే)ద్వాదశాక్షరి(ఓం నమో భగవతే వాసుదేవాయ). ప్రణవార్థాన్ని, నమః అర్థాన్ని మరియు భగవానుని ఉనికిని మొదలైనవి ఈ మూడు మంత్రాలు చెపుతున్నా ఆళ్వార్  మనసు నారాయణ మంత్రం మాత్రమే తలచును అని నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్   అనుగ్రహించారు
 • సూచన-  ఈ నారాయణ మంత్రం యొక్క ప్రాధాన్యతను  పిళ్ళైలోకాచార్యులు తమ ముముక్షుపడి ఉపోద్ఘాతమున ఉద్ఘటించారు

వార్తామాలై గ్రంథమున రెండు సంఘటనలు  నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ గురించి ఉన్నవి, వాటిని తెలుసు కుందాం.

 • 216- లో నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్  , నంపిళ్ళై మరియు పిన్బఅళిగియ పెరుమాళ్ జీయర్ ల మధ్య జరిగిన ఒక సంభాషణను ఉట్టంకించారు. జీయర్ ” ఆళ్వార్( ఎంపెరుమానే సర్వస్వము గా భావించడం మరియు కేవలం ఎంపెరుమాన్ గురించి మాత్రమే ధ్యానించడం) మాదిరి ఉండాలి   ప్రతి ముముక్షువు, కాని  మేము ఇంకా లౌకిక విషయాలపై ఆసక్తి కలిగి ఉన్నాము.  మరి మేము ఆళ్వార్ మాదిరి ఫలమును(పరమపద కైంకర్య ప్రాప్తి )ఎలా పొందాలి?” అని అడిగిరి.   దీనికి నంపిళ్ళై సమాధానం ” మేము కూడా ఆళ్వార్ మాదిరి  పురోగతిని పొందలేక పోతున్నాము ఈ శరీరం ద్వారా, కాని పవిత్రులైన మన ఆచార్యుల అనుగ్రహం వల్ల భగవానుడు చనిపోయు పరమపదాన్ని చేరుకొనేటప్పుడు    అలాంటి మానసిక స్థితిని అనుగ్రహిస్తాడు. కావున పరమపదం చేరుకొని మనం పవిత్రులమై కేవలం ఎంపెరుమాన్ కు నిత్యకైంకర్యము  చేయుటలో నిమగ్నమై ఉంటాము ” అని అనిరి.

410 నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్   శ్రీవైష్ణవుడు ఎలా ఉండాలో వివరిస్తున్నారు.

 • సంసారులలో దోషములు చూసినప్పుడు  వాటిని మనం భగవానుడిలా సంస్కరించలేము కదా, కావున వాటిని వదిలివేయాలి.
 • ఎప్పుడైతే భగవానుని పై భారం వేసిన  సాత్వికులలో(శ్రీవైష్ణవవులు) దోషములు గమనించినప్పుడు వారు తమ దోషములను భగవంతుని కృపచే నశింపచేసుకుంటారు, వారిని కూడ వదిలివేయాలి.
 • ఒకవ్యక్తి అగ్ని నుండి తన శరీరానికి హాని కలగకుండా ఒంటి నిండా ఎలాగైతే రసాయనాలను లేపనం చేసుకుంటాడో అలాగా మనం కూడా భగవద్ ఙ్ఞానముచే లేపనం చేసుకొని ఈ భౌతిక విషయాల నుండి రక్షింపబడాలి.
 • ఙ్ఞానము రెండు అంశములను కలిగి ఉండును1)సంపూర్ణంగా ఆధ్యాత్మిక వాతావరణమును  కలిగిన   పరమపదానికి వెళ్ళాలని ధృడసంకల్పముతో ఉండుట 2) ఈ సంసారము(అఙ్ఞానాంధకారముతో నిండిన) నుండి పూర్తిగా బంధ విముక్తులమవ్వాలనే ధృడసంకల్పముతో ఉండుట. అయినను అఙ్ఞానాంధకారముతో నిండిన  ఈ సంసారఙ్ఞానం  మనకు తప్పని సరి అవసరము, ఒకవేళ మనం సంసారచ్ఛాయా మాత్రము కలిగి ఉన్న అది మనలను నశింపచేయును.

ఇంతటివరకు మనం నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ వైభవమును అనుభవించాము. వీరు గొప్ప పండితులుగా ఉండి నంపిళ్ళైకు కు సన్నిహితులుగా ఉండేవారు.

నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ తనియన్:

లోకాచార్య పదాసక్తం మధ్యవీధి నివాసినం|
శ్రీవత్సచిహ్న వంశాబ్ధిసోమం భట్టార్యమాశ్రయే||

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/

Source: http://guruparamparai.wordpress.com/2013/04/20/naduvil-thiruvidhi-pillai-bhattar/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
srIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

పిన్భళగియ పెరుమాళ్ జీయర్

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీవానాచల మహామునయే నమ:

nampillai-goshti1

నంపిళ్ళై  కాలక్షేప గోష్ఠి – ఎడమ వైపు నుండి 2వ వారు పిన్భళగియ పెరుమాళ్ జీయర్ 

nampillai-pinbhazakiya-perumal-jeer-srirangam

నంపిళ్ళై శ్రీచరణములందు పిన్భళగియ పెరుమాళ్ జీయర్ , శ్రీరంగము

తిరునక్షత్రం : తులామాసము, శతభిష నక్షత్రము

అవతార స్థలము :  తిరుప్పుట్కుళి

ఆచార్యులు : నంపిళ్ళై

పరమపదించిన స్థలము: శ్రీరంగము

రచనలు : ఆరాయిరప్పడి గురు పరంపరా ప్రభావం. “వార్థా మాలై” కూడా వీరే రాశారని అంటారు. కాని సరి అయిన ఆధారాములు లభించుట లేదు.

పిన్భళగియ పెరుమాళ్ జీయర్ , నంపిళ్ళై ప్రియ శిష్యులు. ఆరాయిరప్పడి గురు పరంపరా ప్రభావములో మన పూర్వాచార్యుల, ఆళ్వార్ల గురించిన విశేషాలను చక్కగా పొందు పరచారు. అందులో నంజీయర్ సన్యాసులై వుండి, గృహస్తులైన భట్టరును సేవించినట్లుగా,పిన్భళగియ పెరుమాళ్ జీయర్ సన్యాసులై వుండి గృహస్తులై నంపిళ్ళైని సేవించారని తెలిపారు.

ఒక సారి పిన్భళగియ పెరుమాళ్ జీయర్ అనారోగ్యము పాలైనారు. అప్పుడు వారు తన శిష్యులను చూసి తను త్వరగా కోలు కోవాలని పెరుమాళ్ళను ప్రార్థించమని అడిగారు. శ్రీవైష్ణవులేవరూ అలా కోరుకోరు. ఇది తెలిసి నంపిళ్ళై శిష్యులను పంపి విషయమేమిటో తెలుసుకోవాలనున్నారు. నంపిళ్ళై మొదట సకల శాస్త్ర పారంగతులైన ఎంగళాళ్వాను యొక్క అభిప్రాయమును తెలుసుకోవాలని శిష్యులను వారి దగ్గరికి పంపారు. ఎంగళాళ్వాన్ దానికి “వారు బహుశా శ్రీరంగముతో ఉన్న సంభందము వలన అలా అన్నరేమో” అని తన అభిప్రాయాన్ని తెలియజేసారు. నంపిళ్ళై శిష్యులను తిరునారాయణపురతు అరయర్ దగ్గరికి పంపారు. దానికి – అరయర్ “పూర్తి కావలసిన పనులేవైనా మిగిలిపోయాయేమో! అందుకనే వారు ఈ లోకములో ఇంకా కొంతకాలము ఉండాలనుకుంటున్నారేమో” అన్నారు. నంపిళ్ళై ఈ సారి అమ్మంగి అమ్మాళ్ దగ్గరికి శిష్యులను పంపారు. వారు “నంపిళ్ళై కాలక్షేప గోష్టిని వదల లేక అలా అన్నారేమో” అని బదులిచ్చారు. నంపిళ్ళై, పెరియ ముదలియార్ దగ్గరికి శిష్యులను వెళ్ళమన్నారు. నంపెరుమాళ్ళతో ఉన్న అనుబంధము వలన వారిని వీడి వెళ్ళటానికి ఇష్టపడటం లేదేమో” అన్నారు . నంపిళ్ళై చివరగా జీయరునే కారణమడగగా, “పైవేవీ కారణాలు కావు .తమరికే తెలుసు. అయినా కృపతో అడుగుతున్నారు. తమరు ప్రతి రోజు స్నానము చేసిన తరువాత తమ దివ్య దర్శనము చేసుకొని వీవెన వీయటము ఇత్యాది కైంకర్యములను చేస్తూ వుంటాను కదా? పరమ పదము కోసము వాటిని ఎలా వదులుకోగలను?” అన్నారు.పిన్భళగియ పెరుమాళ్ జీయర్  ఉత్తమ శిష్యులు తమ ఆచార్యుల పట్ల చూపవలసిన అభిమానమును ఈ విధముగా ఆచరించి చూపారు.ఇది విన్న వారందరూ జీయరుకున్న ఆచార్య భక్తికి మురిసి పోయారు.

వీరి పురుషకారముతోనే నడువిల్ తిరువీది పిళ్ళైభట్టరు నంపిళ్ళై శిష్యులైనారు. ఈ విషయాలను ఇంకా వివరముగా https://guruparamparaitelugu.wordpress.com/2015/05/07/naduvil-thiruvidhi-pillai-bhattar/  అనే లింకు ద్వారా చూడవచ్చును.

ప్రబంధ వ్యాఖ్యానములలో,పిన్భళగియ పెరుమాళ్ జీయర్కు సంభంధించిన మరి కొన్ని అంశాలను తెలు స్తున్నాయి. అవేమిటో చూద్దాము.

*ఉపధేశ రత్న మాల 65,66 – పిళ్ళై లోకం జీయర్ వ్యాఖ్యానం –ఆచార్యుల పట్ల సంపూర్ణ శరణాగతి చేసే అంశము గురించి పిళ్ళై లోకాచార్యుల శ్రీవచన భూషణ దివ్య శాస్త్రము లోని 333 సూత్రములోను, మణవాళ మామునుల ఉపధేశ రత్న మాల 65,66 పాశురముల లోను తెలుపడినది. 66వ పాసురములో,పిన్భళగియ పెరుమాళ్ జీయర్ కు  నంపిళ్ళైతో గల అనుబంధము వారికి పరమపధం కూడ వద్దనుకునేటంత గొప్పదని పేర్కొన్నారు. పిళ్ళై లోకం జీయర్ పిన్భళగియ పెరుమాళ్ జీయర్లకు నంపిళ్ళై మీద కల ఆచార్య నిష్టను మదురకవి ఆళ్వార్లు నమ్మాళ్వార్, ఆణ్దాళ్పెరియాళ్వార్, వడుగ నంబి ఎంపెరుమానార్ ,మామునులుతిరువాయిమొళి పిళ్ళైతో పోల్చారు. వీరంతా ఆచార్య నిష్టకు గొప్ప ఉదాహరణ. అప్పిళ్ళై యతిరాజ వింశతికి వ్యాఖ్యానము చేస్తూ పిళ్ళై లోకం జీయరు,పిన్భళగియ పెరుమాళ్ జీయర్, నంపిళ్ళైను తన యజమానిగా భావించి వారినే సదా ఎకాగ్రతతో స్మరిస్తూ వుండే వారని పేర్కొన్నారు.

*వార్త మాలలో, పిన్భళగియ పెరుమాళ్  జీయరుకు సంబంధించిన కొన్ని సంఘటనలను చూద్దాము.

• 2 లో – పిన్భళగియ పెరుమాళ్ జీయర్ ఒక సారి నంపిళ్ళైని స్వరూపం, ఉపాయం , ఉపేయం గురించి అడిగారు. దానికి నంపిళ్ళై జీవాత్మయొక్క ఇచ్చ స్వరూపము, భగవంతుని దయ ఉపాయం, ఆనందము ఉపేయమని చెప్పారు. జీయరు నేను మరొక విధముగా అనుకున్నానన్నారు. నంపిళ్ళై ఆశ్చర్యపోయారు. వీరు ఇంకా గొప్పగా ఆలోచించారా అనుకుని మీ అభిప్రాయమేమిటో చెప్పండని అడిగారు. శ్రీవైష్ణవులకు దాసులవుట స్వరూపము, వారితో సంబంధము ఉపాయము, వారి ఆనందము నా లక్ష్యము అని వివరించారు. నంపిళ్ళై జీయరు మాటలు విని మహదానందపడ్డారు. “భాగవత శేషత్వము”ను తమ ఆచార్యుల వద్ద జీయర్ ఈ విధముగా నిరూపించారు.

• 69 లో– జీయరు, నంపిళ్ళైని ద్వయ మహా మంత్రము యొక్క వివరణను కోరారు. నంపిళ్ళై మొదటి భాగమైన “శ్రీమన్ నారాయణ …” సంపూర్ణ శరణాగతి, ద్వితీయ పాదములో ఉభయులకు కైంకర్య ప్రాప్తి (పెరుమాళ్ మరియు పిరాట్టి) కోరుతూ అది కూడా ఆ శ్రీమన్నారాయణుని ముఖోల్లాసము కొరకే చేయాలి. అదే చేతనుడికి అత్యుత్తమ లక్ష్యము కావాలి. దీనికి సంపూర్ణ ఆచార్య అనుగ్రహము శిష్యులపై ప్రసరించాలి అన్నారు.జీయరు, పిరాట్టి ఎప్పుడు ఎంపెరుమాన్ సేవలో నిమగ్నమై వుంటారు కదా! జీవాత్మలను ఎలా ఉద్దరిస్తారు? అని అడిగారు. దానికి నంపిళ్ళై, భగవంతుడు ఎల్లప్పుడు పిరాట్టి అందమును చూస్తూ ఆనందిస్తున్నా చేతనుల సమ్రక్షణ విడువనట్లుగానే ఆ తల్లి కూడా చేతనులకు సదా సహకరిస్తుంది. ఆమె సహజముగానే పురుషకార భూత అని వివరించారు.

• 174 – పిన్భళగియ పెరుమాళ్ జీయరు తమ ఆచార్యులైన నంపిళ్ళై కైంకర్యార్దము తాము త్వరగా కోలుకోవాలని పెరుమాళ్ళను ప్రార్థించిన సంఘటన ముందే చూసాము.

• 216 – నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్, నంపిళ్ళై మరియు పిన్భళగియ పెరుమాళ్ జీయరుల మధ్య జరిగిన ఒక అందమైన సంభాషణను చెప్పారు. అది చూద్దాము.“ప్రతి ముముక్షువు ఆళ్వార్ల లాగా ఎంపెరుమానునే పూర్తిగా విశ్వసించి, ఆయన మీదే ఆధార పడాలి. కాని సామాన్యులకు ఇంకా లౌకికమైన కోరికలు ఉంటూనే వుంటాయి కదా? మరి ఆళ్వార్ల లాగా పరమపదములో నిత్య కైంకర్య ప్రాప్తి ఎలా దొరుకుతుంది?” అని నంపిళ్ళైని అడిగారు జీయరు. దానికి నంపిళ్ళై “మనకు ఆళ్వార్లంత వైరాగ్యము ఈ శరీరములో ఉన్నప్పుడు లేకున్నా, మన ఆచార్యుల ఔన్నత్యము వలన భగవంతుడు ఆళ్వార్లకున్న కోరికనే మనకు కలిగేలా చేస్తాడు.(ఈ శరీరమును వీడి పరమపదము చేరే లోగా). అందువలన మనము పరంపదము చేరే సరికి ఎంపెరుమాన్ కైంకర్య మొకటే మన లక్ష్యముగా వుంటుంది.”అన్నారు.

• 332 – పిన్భళగియ పెరుమాళ్ జీయరు, నంపిళ్ళైని “ఎవరికైనా కష్ఠము కలిగినప్పుడు శ్రీవైష్ణవులను ఆశ్రయించి నివారణ పొందుతారు కదా!. అది భగవంతుడి ప్రభావమా లేక శ్రీవైష్ణవుల ప్రభావమా?” అని అడిగారు.

దానికి నంపిళ్ళై, “అది నిస్సంకోచముగా భగవంతుడి ప్రభావమే”అన్నారు.

జీయరు మళ్ళీ “అలా అయితే మన కష్ఠ నివారణకు నేరుగా భగవంతుడినే ఆశ్రయించ వచ్చు కదా!”అన్నారు.

నంపిళ్ళై “కూడదు, మనము అలా చేయకూడదు. ఎప్పుడైనా శ్రీవైష్ణవుల ద్వారా మాత్రమే భగవంతుడిని ఆశ్రయించటము క్రమమైన పద్దతి.” అన్నారు.

జీయరు “భగవంతుడు శ్రీవైష్ణవుల మాటను మన్నించిన సంఘటనలేవైనా వున్నాయా?”.

నంపిళ్ళై, “ అర్జునుడు భారత యుధ్ధములో సూర్యాస్తమము లోపల జయద్రదుడిని చంపి తీరుతానని శపథము చేశాడు. సర్వేశ్వరుడు యుధ్ధములో ఆయుధమును పట్టనని తాను చేచిన శపథమును పక్కకు పెట్టి, నీటిలో దాగిన జయద్రదుడుని బయటకు రప్పించటము కోసము సుధర్శన చక్రమును సూర్యుడికి అడ్డు వేసి చీకటి పడినట్లు భ్రమ కల్పించాడు. అది నిజమని నమ్మిన జయద్రదుడు బయటకు రాగానే చక్రమును తొలగించి అర్జునుని శపథమును నెరవేర్చేను.ఈ సంఘటనలేవైనా వలన ఎంపెరుమాన్ శ్రీవైష్ణవుల మాటను మన్నిస్తాడని నిరూపణ దొరుకుతున్నది.

పిన్భళగియ పెరుమాళ్ జీయరు జీవితములోని కొన్ని విషయములను తెలుసుకున్నాము. వీరు మహా ఙ్ఞాని,విరాగియే కాక నంపిళ్ళై ప్రియ శిష్యులు. వారి శ్రీ పాదములను ఆశ్రయించటము ద్వారా మనలో కూడ కొంత భాగవత నిష్ట కలగాలని ప్రార్థన చేద్దాము.

పిన్భళగియ పెరుమాళ్ జీయరు తనియను:

ఙ్ఞాన వైరాగ్య సంపూర్ణం పస్చాద్ సుందర దేశికం
ద్రవిడోపనిషధ్ భాష్యదాయినం మద్గురుం భజే

అడియేన్ చూడామణి రామనుజ దాసి

archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/

Source: https://guruparamparai.wordpress.com/2013/04/21/pinbhazhagiya-perumal-jiyar/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
srIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org