సోమాసియాండాన్

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమధ్వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

తిరు నక్షత్రం : చిత్రై  (మేష మాసము), ఆరుద్ర నక్షత్రము

అవతార స్థలం : కారాంచి

ఆచార్యులు : ఎంపెరుమానార్

రచనలు : శ్రీ భాష్య వివరణం, గురు గుణావళి (ఎంపెరుమానారుల గుణ గణములు వర్ణించబడినవి), షడర్థ సంక్షేపము

వీరు సోమ యాగము చేసె వారి కుటుంబములో జన్మించారు. వీరిని శ్రీ రామ మిశ్రులు అని కూడ అంటారు. రామానుజాచార్యులు స్థాపించిన 74 సింహాసానాధిపతులలో (ఆచార్యులు)  వీరు ఒకరు. వీరు సోమయా జీయర్గా ప్రసిద్ధి చెందారు. మొట్ట మొదటిగా శ్రీ భాష్య వ్యాఖ్యానం సాయించిన ఘనత వీరికి దక్కింది. ఇప్పటి వరకు కుడా తరతరాలుగ వీరి కుటుంబము శ్రీరంగములోని పెరియ కోయిల్లో వాక్య పంచాంగం ప్రచురణ కైంకర్యం చేస్తు వస్తున్నారు. శృత ప్రకాశికా భట్టర్, నాయనారాచ్చాన్ పిళ్ళై మరియు వేదాంతాచార్యుల అనుగ్రహించిన గ్రంథములలో వీరి శ్రీ సూక్తులు అనేకములు కనబడుతాయి.

నాయనారాచ్చాన్ పిళ్ళై అనుగ్రహించిన “చరమోపాయ నిర్ణయమ్” గ్రంథములో సోమాసి యాణ్డాన్ గారి “గుణావళి” శ్లోకములను ఉదాహారణములుగా చూపి కృపా మాత్ర  ప్రసన్నాచార్యుల ఘనతను లోకమునకు వివరించారు. (మంచి విషయాలను తెలుసుకోవలెననే ఉత్సుకత ఉన్నవారందరిని కేవలము వారికి గల కృప మరియు దయ గుణముల చేత ఉద్ధరించాలనుకునే అచార్యులను కృపా మాత్ర ప్రన్నాచార్యులు అని అందురు.)

యస్స్యాపరాదాన్ స్వపదప్రపన్నాన్ స్వకీయకారున్ణ్య గునేణ పాతి
స ఏవ ముక్యో గురురప్రమేయాస్ తదైవ సద్భిః పరికీర్త్యదేహి

ఆచార్యులు అనే వారు కేవలము వారి కృపా విశేషముచేత చేత తనకి శరణాగతి చేసిన శిష్యుడిని రక్షించి శ్రీవైకుంఠమును ప్రసాదిస్తారు. అంతటి ముఖ్య మైన వారు ఆచార్యులు, ఇటువంటి మంచి విషయాలు మనకు నమ్మకమైన భాగవతోత్తములు తెలియచేస్తారు.

“చరమోపాయ నిర్ణయము” లోని ఒకానొక సన్నివేశము ద్వారా సొమాసి ఆండన్ గారికి మన భగవత్ రామానుజుల పై ఉన్న భక్తి ప్రేమలు తెలుసుకోవచ్చును.

సోమయాజియార్ (సోమాసియాణ్దాన్) గారు భగవత్ రామానుజుల పాద పద్మములకు శరణాగతి చేసి వారిని కొద్ది కాలము సేవ చేసుకొని అటు పిమ్మట తిరిగి వారి స్వస్ఠలానికి (కారాంచి) చేరిరి. వీరి మనసు మాత్రము ఆచార్యుల వద్దనే ఉండిపోయింది. కొన్ని రోజులు తరువాత వీరు భగవత్ రామానుజులను చూడకుండ ఉండలేక తిరిగి ఆచార్యులను సేవించుకోడానికి సిద్ధము అవుతారు, కాని వీరి భార్య అడ్డుచెప్పేటప్పటికి రామానుజుల మూర్తిని ఏర్పాటు చేసుకొని ఆరాధనము చేసుకుందామని శిల్పిని పిలిపిస్తారు. అలా ఏర్పాటు చేయబడ్డ మూర్తిని చూసి సంత్పప్తి చెందక మరల ఇంకా అందమైన మూర్తిని చేయుటకు నిర్ణయించుకొంటారు. ఆరోజు రాత్రి నిద్రలో భగవత్ రామానుజులు ప్రత్యక్షమయి “నా విగ్రహాన్ని పాడుచేసి తిరిగి కొత్త విగ్రహము ఎందుకు ఎర్పర్చుకోవాలని అనుకుంటున్నావు? నీవు ఎక్కడ ఉన్నను నా అభిమానము మాత్రమె నీకు ఉద్ధారకము అని అచంచల విశ్వాసము లేనిచో తిరిగి కొత్త విగ్రహము ఎర్పర్చుకున్నను దాని మీద భక్తి కలుగదు.” అదివినిన వెంటనె వారి మూర్తి ని భద్రపరిచి, తన భార్యను విడిచి శ్రీరంగానికి ప్రయాణము చేసి భగవత్ రామానుజుల పాదముల మీద పడి జరిగిన స్వప్నాన్ని విన్నవిస్తాడు. రామానుజాచార్యులు చిరు నవ్వుతో “నీ అఙ్ఞానమును దూరము చేయుటకు, భార్యను అనుసరించుకుంటు ఆధారపడకుండ ఉండేలా చెయుటకు అలా చేసాను. నాపట్ల నీకు గురి లేకున్నను, నా అభిమానము చేత నీవు ఉధ్ధరింప పడతావు, మోక్షము తప్పనిసరిగ ప్రాప్తిస్తుంది, అన్ని రకాల భయాలను, భాదలను వీడి సంతోషముగా ఉండు” అని చెప్తారు. ఈ సంఘటమును మనకు పెరియ వాచ్చాన్ పిళ్ళై గారు తెలియ చేస్తారు.

పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానములలో సోమాసియాణ్దాన్ వైభవము తెలిపే అనేక ఐతిహ్యములు కనిపిస్తాయి, అందులో కొన్ని ఇక్కడ చూద్దాము.

 • తిరునెడుంతాణ్డగం 27 – పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం – తిరుమంగై ఆళ్వార్ (పరకాల నాయకి భావముతో) ఒక కొంగను వీరి దూతగా తిరుక్కణ్ణపురానికి పంపి అక్కడ వేం చేసిన పెరుమాళ్ళకు తన హృదయములో ఉన్న ప్రేమని తెలియచేస్తారు. పెరియ వాచ్చాన్ పిళ్ళై గారు తన వ్యాఖ్యానంలో తిరుమంగై ఆళ్వారులు “తిరుక్కణ్ణపురము” లో వేంచేసిన స్వామి నామాన్ని ఉచ్చరించే విధానము ఇతరులు ఎవ్వరు అనుకరించలేరు, అట్టి ప్రేమ రసాన్ని మదిలో నింపుకొని స్వామి నామాన్ని గానం చేసెవారు అళ్వారులు. అదే రీతిలో అనంతాళ్వాన్ “తిరువేంకటముడయాన్” అని వేంకటేశుడుని పలికే తీరు, పరాశర భట్టర్ గారు “అళగియ మణవాళ పెరుమాళ్” అని శ్రీ రంగనాథుని పిలిచే తీరు, అలాగే మన సోమాసియాందాన్ గారు “ఎంపెరుమానారే శరణం” అని పలికే విధానము చాల గొప్పది. ఇవే నామాలను మరి ఎవ్వరు పలికిననూ వారు పలకగా పొందే ప్రేమ భావన, తీయదనము, మాధుర్యము కలగవు.
 • తిరువాయ్మొళి 6.5.7 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానం – పైన వివరించిన తీరు లోనె వీరు కుడా తెలియ చేస్తారు కాని ఇక్కడ నమ్మాళ్వర్లు పరాంకుశ నాయికి భావముతో పెరుమాళ్ళను వీడి ఉండకుండ ఉండేలా చెయమని “తులైవిల్లిమంగలం ఎంపెరుమాన్” అని పిలిచే తీరు కేవలం వీరికే సొంతం. ఈ విశయాన్ని గుర్తించి నంపిళ్ళై గారు, ఆళ్వార్లు ప్రయోగించిన నామాల అర్ఠాన్ని, అందులో ఉన్న ప్రాముఖ్యతలను వివరించారు. ఇందులో వీరు ఉపయోగించిన భగవంతుని నామములకు ఒక ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఎలాగైతే అనంతాళ్వాన్, భట్టర్, సోమాసియాణ్దాన్ పెరుమాళ్ళను తిరువేంకతముడయాన్, అళగియ మణవాళ పెరుమాళ్, ఎంపెరుమానార్ అని పిలిచిన విధానము మనలో పులకింతలు తెప్పిస్తాయి అని నంపిళ్ళై మనకు వివరిస్తారు.

వార్తామాలై గ్రంథములో సోమాసియాణ్డాన్ కు సంభందించిన కొన్ని సన్నివేశములను చూద్దాము.

 • 126 – ఇక్కడ సోమాసియాణ్దాన్ ప్రపన్నులకు ఎంపెరుమానారే ఉపాయమని అందంగ విశద పరిచారు. స్వ ప్రయత్నము మానేసి భగంతుడిని ఆశ్రయించి నప్పుడు మాత్రమే మన రక్షకత్వ భారాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. భక్తి లేక శరణాగతి ఏది మార్గము కాదు, కేవలం భగంతుడే మనకు ఉపాయము అని గుర్తించడము చాల ముఖ్యము.
 • 279 – అప్పిళ్ళై  (వయసులో వీరు సోమాసియాణ్డాన్ కంటే చిన్నవారు కని ప్రసిద్ధమైన శ్రీ వైష్ణవులు) వీరు సోమాసియాణ్డాన్ గారితో ఇలా అంటారు “మీరు ఙ్ఞానములో, వయసులో పెద్దలు, అంతే కాకుండ పూర్వాచార్యుల అడుగు జాడలలో నడిచే వారు, ఐననూ మీ వస్త్రానికి ఒక ముడి వేసుకొని పెట్టుకోండి, దీనిని చూచిన ప్రతిసారి భాగవత అపచారము చేయకూడదని గుర్తు చేస్తుంది.” ఇలా చెప్పడానికి కారణం ఎంతటి గొప్ప వారైననూ భాగవత అపచారము చేయటం వల్ల పతనము అవుతారు. ఇది స్వరూప నాశనానికి తోడ్పడుతుంది.
 • 304 – సోమాసియాణ్దాన్, మనము లౌకిక మైన విషయ భోగాల కొరకు ప్రాకులాడకూడదని, వాటి చే పొందే సంతోశములకు దూరము గా ఉండవలను అని కొన్ని కారణములు చెప్తారు
 1. మన స్వస్వరూపము భగవంతునికి దాసుడిగా ఉండటం.
 2. మనకు లభించిన జీవితం భగవంతునికి కైంకర్యము చేసుకొనుటకు మాత్రమే.
 3. విడ తీయరానిది మరియు ఎల్లప్పుడూ కలిసి ఉండే సంబంధము భగవంతుని తో మనకు ఉంటుంది. చివరిగ మన శరీరము తాత్కాలిక మైనది, నశించునది అవుటచే మనము ప్రాపంచమైన సంతోషములకు ప్రాకులాడ కూడదు లేద ఇంద్రియాలను భోగ పరిచే విధముగ ప్రవర్తించ కూడదు.
 4. 375 – పాలు పెరుగు దొంగలించాడని గోపాలుడిని దండించారు అని విని మన సోమాసియాణ్దాన్ స్వామి మూర్చపొతారు. యశోదమ్మ చేత శిక్షించ పడ్డ  శ్రీ కృష్ణుడిని తలచుకొని పులికించి పొయారు అని ఇక్కడ తెలియచేస్తారు.

ఇలా మనము సోమాసియాణ్దాన్ ఆచార్యుల దివ్య మైన జేవితములొ కొన్ని సన్నివెశములను గురించి తెలుసుకున్నాము. వీరికి ఉన్న భాగవత నిష్ట ప్రశంస నీయమైనది. ఎంపెరుమానార్లకు సన్నిహితులు. ఇటువంటి వీరి పాదపద్మ ములను స్మరిస్తూ మనకు కుడా వీరికు ఉన్న భాగవత నిష్ట లో ఎంతో కొంత అలవర్చింప చేయ మని ప్రర్థిద్దాము.

సోమాసియాణ్దాన్ తనియన్:

నౌమి లక్ష్మణ యోగీంద్ర పాదసేవైక ధారకమ్
శ్రీరామక్రతునాధార్యమ్ శ్రీభాష్యామృత సాగరమ్

అడియేన్ ప్రదీప్ రామానుజ దాసన్

మూలము: http://guruparamparai.wordpress.com/2013/04/09/somasiyandan/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

5 thoughts on “సోమాసియాండాన్

 1. Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu

 2. Pingback: 2014 – Dec – Week 5 | kOyil

 3. Pingback: తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ | guruparamparai telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s