Monthly Archives: October 2014

ప్రతివాది భయంకరం అణ్ణన్

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్రీవానాచల మహామునయే నమ:

pb-annan-kanchi

తిరునక్షత్రము: ఆషాడం పుష్యమి

అవతార స్థలము:  కాంచీపురం ( తిరుత్తణ్కా దీప ప్రకాసుల సన్నిధి)

ఆచార్యులు: మణవాళ మామునులు

శిష్యులు: వారి కుమారులు అణ్ణనప్పా, అనంతాచార్యర్, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్

రచనలు:

  •  శ్రీ భాష్యం, శ్రీ భాగవతం, సుభాలోపనిషద్,
  •  భట్టర్  అష్టశ్లోకీ మొదలగువానికి వ్యాఖ్యానము
  •   శ్రీ  వరవరముని శతకం (సంస్కృతములో 100 శ్లోకములు)
  •   వరవరముని మంగళం
  •   వరవరముని సుప్రభాతం
  •  చెయ్య తామరై తాళిణై వాళియే…” –మనవాళమామునుల వాళితిరునామం                                 
  •   వేంకటేశ్వర సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి,మంగళాశాసనము(మామునుల ఆనతితో)  http://acharya.org/books/eBooks/index-all.html   
  • ఇతర శ్లోకములు/స్తోత్ర గ్రంధములు

  ప్రతివాదిభయంకరంఅణ్ణన్ ముడుంబై నంబి తిరువంసములో హస్తిగిరినాధులుగా అవతరించారు. అణ్ణాగా, రువాతికాలములో ప్రతివాధి భయంకర అణ్ణాగా ప్రసిద్దిగాంచారు.     

కూరత్తళ్వార్ల లాగా రామానుజుల కంటే ముందుగా అవతరించినా వారి శిష్యులుగా చేరి అష్ట దిగ్గజములలో ఒకరైనారు.

కాంచీపురములో వుండి  వేదాంతాచార్యుల ఆశీసులతో వారి కుమారులైన కుమార నయనాచార్యుల వద్ద  విధ్యాభ్యాసము చేసారు.అతి తక్కువ కాలములో సంప్రధాయ విషయముల మీద మంచి పట్టు సాధించి ఇతర సిధాంతములను తన వాదనాపటిమతో తుత్తునియలు చేసి,ప్రతివాధి భయంకర అణ్ణాగా ప్రఖ్యాతిగడించారు.

గౄహస్తాశ్రమము స్వీకరించినతరవాత అణ్ణా శ్రీనివాసునికి కైంకర్యము చేయటము కోసము తిరుమలకు వేంచేసారు. వీరి ధర్మపత్ని  కూరతాళ్వాన్ ధర్మపత్ని  ఆణ్దాళ్ లాగా శాస్త్రములో మంచి పట్టు,ఙ్ఞాన,వైరాగ్యము గలవారు.ముగ్గురు కుమారులకు తల్లిగా గృహిణిగా తన కర్తవ్యము చక్కగా నిర్వర్తించేవారు.కొంతకాలమునకు అణ్ణా సంసార సుఖములమేద విరక్తి చెంది శ్రీనివాసుని సన్నిధికి వెళ్ళి విన్నవించుకున్నారు.అంతట  శ్రీనివాసుడు తిరుమలలో శ్రీవైష్ణవ ఆచార్యులైన  తోళప్పర్ ద్వారా తిరుమంజన తీర్థము తెచ్చే కైంకర్యము చేయమని ఆనతిచ్చారు. తోళప్పర్ ఒక వెండి బిందె ఇచ్చి ఆకాశగంగ నుండి తిరుమంజన తీర్థము తెమ్మని, కైంకర్యమునకు అందచేసేముందు దానిలో ఏలకులు,లవంగాది పరిమళ వస్తువులు చేర్చి ఇవ్వాలని చెప్పారు. వీరు కూడా ఆనందముగా రోజూ అలాగే చేసేవారు.

      ఒక రోజు కొందరు శ్రీవైష్ణవులు శ్రీరంగమునుండి తిరుమలకు వచ్చారు.అణ్ణా ఆకాశగంగ నుండి తిరుమంజన తీర్థము తీసుకువస్తూ దారిలో వారు శ్రీరంగములోని విశేషాలు, మనవాళమామునుల విశేషాలు చెప్పగావిని పొంగిపోయారు.కాస్త ఆలస్యము కూడా అవటముతో పరిమళద్రవ్యాలు చేర్చటము మరచిపోయి అలాగే ఇచ్చేసారు.పొరపాటు తెలుసుకొని త్వర త్వరగా పరిమళద్రవ్యాలు తీసుకువెళ్ళి అర్చకులకివ్వగా వారు మీరు కలిపే తెచ్చారు.రోజుకన్నా ఈరోజు చాలా సువాసనగా స్వామి స్వీకరించారని చెప్పారు.ఇదంతా శ్రీరంగనాధుని,మణవాళమామునుల విశేషాలు వింటూవచ్చిన మహిమ అని  అప్పుడు అణ్ణా అర్థము చేసుకున్నారు కొన్ని రోజుల తరవాత శ్రీనివాసుని అనుమతి తీసుకొని  మణవాళ మామునుల దర్సనార్థము శ్రీరంగమునకు సకుటుంబముగా బయలుదేరారు.

               శ్రీరంగము చేరిన పిదప పెరుమాళ్ళ ధర్శనార్థము కోవెలకు వెళ్ళారు. క్రమముగా ఆణ్దాళ్, ఎంపెరుమానార్, సేనై ముధలియార్లను సేవించుకొని శ్రీరంగనాధుని సన్నిధికి వెళ్ళే ముందు మామునులు నమ్మాళ్వార్తిరువాయ్ మొజి 4.10 పదిగం‘ – ‘ఒన్రుం దేవుంమీద చేస్తున్న ప్రవచనము విన్నారు.అందులో  ఆళ్వార్ భగవంతుని అర్చావతార వైభవము ప్రతేకముగాఆథినాతన్  పెరుమాళ్‘- ఆళ్వార్ తిరునగరి గురించి పాడిన పాసురములను వర్ణించడము చూసి మనసు ద్రవించి,అణ్ణా గోష్టికి,మామునులకు సాష్టాంగ నమస్కారము చేసి కూర్చున్నారు. ప్రవచనానంతరము మామునులు అణ్ణాను ఆనందముతో ఆలింగనము చేసుకొని పరామర్శించారు.అణ్ణాను కలుసుకోవటము చాలా ఆనందముగా వుందని చెప్పారు.అణ్ణా మామునులకు ఉభయ వేధాంతము (సంస్కృత వేధాంతము , ధ్రావిడ వేధాంతము)లో ఉన్న పట్టు చూసి ఆశ్చర్యపోయారు. ఇద్దరూ కలసి శ్రీరంగనాధుని దర్శనము కోసము వళ్ళగా అర్చక ముఖముగా ఓ ప్రథివాధి భయంకరాచార్య!ఆకాశ గంగ తీర్తం తెచ్చేటప్పుదు మామునుల గొప్పతనము విన్నంతనే  తీర్థము పరిమళభరితమైనది చూసి మీరు ఇప్పుడు వారి సాన్నిహిత్యము కోరి రావటము మాకెంతో ఆనంద దాయకము” అన్నారు.తరువాత అణ్ణా అర్చకులు ఇచ్చిన తీర్థము, శ్రీశఠగోపము, మాల స్వీకరించి మామునుల మఠమునకు వెళ్ళారు. 

     అణ్ణా  శ్రీరంగములో  కందాడై  అణ్ణన్ తిరుమాళిగకు వెళ్ళారు.ఆసమయములో అక్కడ పొన్నడిక్కాల్ (వానమామలై) జీయరు కూడా వేంచేసి వుండటము చూసి చాలా సంతోషించి  వైష్ణవో వైష్ణవం ధృష్ట్వాదండవత్ ప్రణమేత్ భువిఅనే శాస్త్ర వాఖ్యము ప్రకారము పరస్ప్రము దాసోహములు సమర్పించుకున్నారు.అరుళ్ కొణ్దాడుం అడియవర్” (కణ్ణినుణ్ చిరుతాంబు – 7)లో లాగ నిరంతరము మామునుల ఔన్నత్యమును కొనియాడే పొన్నడిక్కాల్ జీయర్ మామునులు యతిరాజుల పునరవతారముగా వర్ణించారు.వారి మంగళాశాసనములు తీసుకొని అణ్ణా సకుటుంబముగా మామునుల మఠమునకు వెళ్ళి,తమకు పంచ సంస్కారము అనుగ్రహించమని కోరారు.దానికి మామునులు తమరు ప్రథివాధి భయంకరాచార్యులూకదా? మమ్మల్ని మీరు ఆచార్యులుగా ఎలా స్వీకరిస్తారని   ‘శ్రీ వైష్ణవ సిధ్ధాంత వ్యతిరేకులకు ప్రథివాధి భయంకరుడను ,కాని తమరికి దాసుడను అని ఎంతో వినమ్రతతో చెప్పారు.అది విని సంతోషించిన మామునులు అణ్ణానుశ్రీ వైష్ణవ ధాసులుగా గుర్తించి వారి ఆచార్య నిష్టకు మెచ్చి వారి కోరికమేరకు పంచ సంస్కారము అనుగ్రహించారు.అప్పటి నుంచి అక్కడే వేంచేసివుండి రామానుజుల వారికి కూరత్తళ్వర్లాగా మామునులతో కలసి    సత్సంప్రధాయ సిధాంత పరిరక్షణకు కృషి సలిపారు.

     మామునులు ఎరుంబి అప్పా,అణ్ణా లతో కలసి కాంచీపురము, చోళసిమ్హపురము మీదుగా తిరుమల యాత్రకు బయలుదేరారు. మామునులు  శ్రీవేంటేశ్వరునికి తిరుమలలో సుప్రభాతము లేకపోవటము గమనించి వెంటనే అణ్ణాను అఙ్ఞాపించారు.అణ్ణా అచార్యుల అఙ్ఞను శిరసావహించి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి మంగళ శ్లోకములను రచించి సమర్పించారు.అది చూసి మామునులు ఎంతో సంతోషించి ఆరోజు నుండి ప్రతిదినము ఉదయము శ్రీవేంకటేశ్వరునికి ఈశ్లోకములను నివేదించాలని నిర్ణయించారు.

       శ్రీరంగము చేరుకున్న తరువాత ఒకరోజు మామునులు అణ్ణాను పిలిచి   కందాడై అణ్ణన్, పోరేర్రు నాయనార్, అనంత్తయ్యనప్పై, ఎంపెరుమానార్ జీయర్ నాయనార్, కందాడై నాయన్ తదితరులకు శ్రీ భాష్యముకాలక్షేపము చేయమని అఙ్ఞాపించారు.ఆచార్యుల ఆనతిని పాటించి   శ్రీ భాష్యము మొదలు పెట్టారు.అప్పటినుండివీరికి  శ్రీభాష్యచార్యులని పేరు స్థిరపడింది.

    అణ్ణా మామునుల కృప మీద చాలాచక్కని గ్రంధములను కూర్చారు. వాటిలో మచ్చుకు

malayappan-mamunigal-pbannanthirupathi

శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి (శ్లోకం 15)

సత్వోతరై సతత సేవ్య పదామ్బుజేన

సంసార తారక దయార్ద్ర దృగన్చలేన

సౌమ్యో పయన్త్రు మునినా మమ దర్శితౌ తే

శ్రీవేంకటేశ శరణౌ శరణమ్ ప్రపద్యే

సంసార సాగరమును దాటుటకు ,పరమపదము చేరుటకు శ్రీ వేంకటేస్వరుని శ్రీ పాదములే శరణమని మా ఆచార్యులైన మామునులు చూపడము వలన ఆచరణములనే ఆశ్రయిస్తాను.

శ్రీవేంకటేశ్వర మంగళము (శ్లోకం 13)

శ్రీమత్ సుందరజామాత్రు ముని మానస వాసినే

సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ మంగళం

శ్రీ మహాలక్ష్మినే హృదయములో ధరించి,మనవాళ మామునుల హృదయములో నివసించే శ్రీనివాసా సదా నీకు మంగళము కలుగుగాక అని అణ్ణా మంగళశాసనము చేసారు.

ఉభయ వేధాంత ప్రతిష్థాపకాచార్యులైన,ప్రతివాది భయంకరం అణ్ణన్ ఆచార్య నిష్థ, మామునులకు వారి యందు గల ప్రీతి తెలుసుకున్నాము.మనలోను భాగవత నిష్థ కలగాలని కోరుకుంటూ వారి శ్రీచరణములను ఆశ్రయిద్దాము.

ఇక వారి తనియన్ చూద్దాము:

   వేధాంత దేశిక కటాక్ష వివృత్తభోదం

   కాంతోపయంత్రు యమిన: కరుణైక పాత్రం

   వత్సాన్వవాయమనవధ్య గుణైరుపేతం

   భక్త్యా భజామి పరవాథి భయంకరార్యం

 వీరి రచనలు http://acharya.org/acharya/pbanna/index.html. చూడవచ్చు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source