నంపిళ్ళై

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

గత సంచికలో  మనం నంజీయరుల గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

నంపిళ్ళై – తిరువల్లిక్కేణీ

తిరునక్షత్రము: కార్తీక మాసము, కృత్తిక నక్షత్రము

అవతార స్థలము: నంబూర్

ఆచార్యులు: నంజీయర్

శిష్యులు: వడక్కు తిరువీధి పిళ్ళై, పెరియ వాచ్చాన్ పిళ్ళై, పిన్బళగియ పెరుమాళ్ జీయర్, ఈయుణ్ణి మాధవ పెరుమాళ్, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ మొదలగువారు.

పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగం

శ్రీ సూక్తులు: తిరువాయ్మొళి 36000 పడి ఈడు వ్యాఖ్యానము, కణ్ణినుణ్ శిఱుత్తాంబుకు వ్యాఖ్యానము, తిరువన్దాదులకు, తిరువిరుత్తములకు వ్యాఖ్యానము.

నంబూర్ నందు వరదరాజన్ గా జన్మించిరి, నంపిళ్ళైగా ప్రసిద్దిగాంచిరి. వారికి గల మరి కొన్ని నామధేయములు తిరుక్కలికన్ఱి దాసర్, కలివైరి దాసర్, లోకాచార్యర్, సూక్తి మహార్ణవర్, జగదాచార్యర్ మరియు ఉలగాశిరియర్.

పెరియ తిరుమొళి 7.10.10 ని చూస్తే కనుక, తిరుక్కణ్ణమంగై ఎమ్పెరుమాన్ తిరుమంగై ఆళ్వారుల పాశురముల అర్థములను కలియన్ నుండే తెలుసుకో దలిచెనని – అందువల్ల కలియన్ నంపిళ్ళై అవతారమును ధరించి ఎమ్పెరుమాన్ పెరియ వాచ్చాన్ పిళ్ళై అవతారము ధరించి అరుళిచ్చెయల్ అర్థములని తెలుసుకొనిరి.

నంజీయర్ తమ యొక్క 9000 పడి వ్యాఖ్యానమునకు ఒక మంచి గ్రంథమును చేయదలిచెను. అప్పుడు వారు శ్రీ వైష్ణవ గోష్ఠిలో విచారించగా, నంబూర్ వరదరాజులను ప్రతిపాదించిరి. వరదరాజులు నంజీయర్లతో మీ తిరువుళ్ళమ్ (భావన) ప్రకారము వ్రాసెదమని చెప్పెను. నంజీయర్ మొదట వరదరాజులకు 9000 పడి కాల క్షేపమును చెప్పి తదుపరి అసలు ప్రతిని ఇచ్చిరి. వరదరాజులు కావేరి నదికి అటు వైపు ఒడ్డున ఉన్న తన స్వస్థలానికి చేరి అక్కడ ఎటువంటి ఇబ్బందులు  గ్రంథమును రాసి పూర్తి చేయవలెనని సంకల్పించిరి. నది దాటే సమయములో, ఒక్కసారిగా వరద రావడముతో వరదరాజులు ఈదుచూ దాటిరి. ఆ సమయములో, తన చేతుల నుండి అసలు గ్రంథము జారి పోయెను. తిరిగి తన స్వస్థలమునకు చేరిన పిమ్మట, వారి ఆచార్యులను మరియు వారు అనుగ్రహించిన అర్థ విశేషములను ధ్యానించి, మరల 9000 పడి వ్యాఖ్యానమును వ్రాయుట మొదలు పెట్టెను. అప్పడికే వారు తమిళ భాష మరియు సాహిత్యములపై పట్టు ఉండుట వలన, వారు ఎక్కడ అందమైన అర్థములను కావలెనో అక్కడ చేర్చి, చివరికి నంజీయరుల వద్దకి వచ్చి వారికి సమర్పించిరి. నంజీయర్ ఆ వ్యాఖ్యానమును చూసి, అసలు ప్రతికి కొన్ని మార్పులు ఉన్నవని అర్థముచేసుకొని, ఏమైనదని విచారించిరి. వరదరాజులు జరిగిన సంఘటనను వివరించిరి, నంజీయర్ జరిగినది విని సంతోషముతో వరదరాజులు సత్యమైన కీర్తిని అర్థము చేసుకొని వారికి నంజీయర్ “నంపిళ్ళై” మరియు “తిరుక్కలికన్ఱి దాసర్” అనే నామధేయమును అనుగ్రహించిరి.

భట్టర్ – నంజీయరుల సంబంధం మరియు సంభాషణల వలె, నంజీయర్ – నంపిళ్ళైసంబంధం మరియు సంభాషణలు కూడా ఎంతో ఆహ్లాదకరముగా మరియు చాలా అర్థవంతముగా ఉండును. వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాము:

 • నంపిళ్ళై, నంజీయరులని ఈ విధముగా అడిగిరి, ఆ కాలములో ఉపాయాంతరములకు (కర్మ, జ్ఞాన, భక్తి) చాలా ప్రమాణములు ఉండగా శరణాగతికి చాలా ప్రమాణములు లేవు ఎందులకు అని అడిగిరి. నంజీయర్ మొదటగా మనకు ప్రత్యక్షముగా అర్థమయ్యే వాటికి ప్రమాణము అవసరము లేదని చెప్పిరి – ఏ విధముగానైతే ఒక వ్యక్తి నదిలో మునుగుచుండగా, అతను అలానే మునుగుతాడో లేక మునగని ఒక వ్యకి సహాయము కోరి శరణు వేడుతాడో – మనము సంసారము అనే సముద్రములో మునుగుచుండగా అట్లే సంసారం అనే మహా సాగరంలో మునిగే మనలను ఒడ్డున చేర్పించటానికి మునిగి తేలని ఎమ్పెరుమాన్ ని శరణు వేడటమే ఉత్తమమైన ఉపాయము, కాని వారు శరణాగతి తత్త్వమును నిరూపించటానికి మరి కొన్ని బలమైన ప్రమాణములను శాస్త్రములో చూపుతారు. వారు అలానే – ప్రమాణముల సంఖ్యను బట్టి ఆ తత్త్వము యొక్క గొప్పతనమును నిరూపణ చేయటము సరికాదని, లోకములలో అనేక మంది సంసారులు మరియు కొద్ది మంది మాత్రమే సన్యాసులుగా ఉన్నారని అంత మాత్రాన సంసారిగా ఉండడటమే మంచిదని అనుకోలేమని విన్నవించిరి. ఇవి విని నంపిళ్ళై చాలా సంతృప్తి చెందెను.
 • నంపిళ్ళై నంజీయర్లను ఈ విధముగా అడిగిరి “ఎప్పుడు ఒకరు శ్రీవైష్ణవత్వమును కలిగి౦దని తెలుసుకొందురు?” నంజీయర్ సమాదానము – ఎవరైతే పరత్వమును అర్చావతారములో చూస్తారో, ఎవరైతే ఇతర శ్రీవైష్ణవులను తమ భార్య మరియు పిల్లలుగా భావిస్తారో (అదే అనుబంధమును శ్రీవైష్ణవులందు కలిగి ఉండవలెను) మరియు ఎవరైతే ఇతర శ్రీవైష్ణవులు తనను అవమానపరచినా సంతోషముగా స్వీకరించ గలుగుదురో వారు శ్రీవైష్ణవత్వమును కలిగి ఉందురు.
 • ఒక్కప్పుడు నంపిళ్ళై శ్రీభాష్యమును నంజీయరుల వద్ద సేవించుచుండగా, నంజీయర్ నంపిళ్ళైను తమ పెరుమమాళ్ళకి తిరువారాధనమును చేయమని  ఆఙ్ఞాపించిరి. నంపిళ్ళై ఎలా చేయాలో తెలియదు అనగా – ఆ సమయములో నంజీయర్ నంపిళ్ళైని ద్వయ మహా మంత్రమును (ద్వయములోని మొదట మరియు రెండవ భాగముల మధ్యన “సర్వ మంగళ విగ్రహాయ” అనే వాక్యము చేర్చి తిరువారాధనం చేయటం ద్వారా అర్చావతార రూపములో ఉన్న ఎమ్పెరుమాన్ యొక్క సౌలభ్యమును చూపుదురు) అనుసంధానం చేసి భోగమును ఎమ్పెరుమానులకు నివేదించమనిరి. ఈ విషయము ద్వారా మన పూర్వాచార్యులు దేనికైనను ద్వయ మహామంత్రంపై ఆధార పడుదురని తెలుసుకొంటిమి.
 • నంపిళ్ళై అడిగిరి “ఎమ్పెరుమానుల అవతారముల ముఖ్య ఉద్దేశము ఏమిటి?”. నంజీయర్ ఈ విదముగా చెప్పెను “ఎవరైనా భాగవత అపచారమునకు పాల్పడినచో ఎమ్పెరుమాన్ వారిని సరియైన విధముగా శిక్షించుటకు పెద్ద పనులను తీసుకొనును” (ఉదా: ఎవరైనా భాగవత అపచారమునకు పాల్పడినచో వారిని సరియైన విధముగా శిక్షించుటకు ఎమ్పెరుమాన్ ఎటువంటి అసామాన్య పనులు చేయుటకును సిద్ధముగా నుందురు. పూర్వం తన భక్తుల యెడల చాలా అపచారములు చేసినా దుర్యోధనుని సంహరించుటకై ఎన్నో వ్యయ ప్రాయసనలను ఓర్చుకొని తాను కృష్ణ ప్రరమాత్మగా అవతారమును ధరించిరి).
 • అప్పుడు నంపిళ్ళై ఈ విధముగా అడిగెను “భాగవత అపచారము అనగానేమి?”.  నంజీయర్ సమాదానము “మనతో సమానముగా ఇతర శ్రీవైష్ణవులని భావించడము”. ఆళ్వారుల తమ పాశురములలో గొప్ప భాగవతులు వారి జన్మము, జ్ఞానము మొదలగు వాటిని పరిగణలోకి తీసుకోకుండా, భాగవతులు ఎప్పుడు మన కన్నా గొప్పవారు అనే భావనతో శ్రీవైష్ణవులు ఉండాలని. మన పుర్వాచార్యులు ఎల్లప్పుడు భాగవతులు గొప్పతనాని అనుసంధానం చేస్తు కాలం గడిపేవారని, మనమును అట్లు ఉండుటకు ప్రయత్నం చేయవలెనని చెప్పిరి.
 • నంజీయర్ నంపిళ్ళైకి ఎవరైతే భగవద్ గుణానుభవములో ఉంటారో వారికి లౌకిక విషయముల యగు ఐశ్వర్య, అర్థ, కామ మొదలగు వాటిలో రుచి కూడదని ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధ పాశురములను ఉదాహరణముగా చెప్పిరి. ఎమ్పెరుమాన్ యొక్క దివ్య స్వరూపాన్ని గుర్తించిన తిరుమంగై ఆళ్వార్లు భౌతిక విషయములలో ఆసక్తిని ఏ విధముగా విడిచిరో తన దివ్య ప్రబంధంలోని మొదటి పాశురములో “వాడినేన్ వాడి…నారాయణ ఎన్నుమ్ నామమ్” (ఎమ్పెరుమాన్ తిరునామము లభించే వరకు మేము సంసారము నందు భాదలను అనుభవించితిమి అని తెలిపిరి). అది విని నంపిళ్ళై చాలా సంతోషము చెంది నంజీయరులను ఎప్పడికి వదలక వారికి సపర్యలను చేస్తూ కాలక్షేపములను అనుభవించేవారు.
 • నంజీయర్ తిరువాయ్మొళి కాలక్షేపమమును 100 పర్యాయములు నిర్వహించిరి మరియు నంపిళ్ళై నంజీయరులకు శతాభిషేక మహోత్సవమును జరిపించిరి. నంజీయరుల కాలక్షేపముల ద్వారా పూర్వాచార్యుల రహస్యార్థములను అన్ని వారు తెలుసుకొనిరి.

నంపిళ్ళై చాలా ప్రత్యేక గుణములను కలిగినవారు మరియు వారి గొప్పతనమును మనము ప్రమాణించలేము. వారికి తమిళ/సంస్కృతము భాష మరియు సాహిత్యములలో మంచి పట్టు ఉండేది. తన ప్రవచనములలో వారు తిరుక్కురళ్, నన్నూల్, కంబ రామాయణము, మొద!!వాటిని మరియు వేదాంతము, విష్ణు పురాణము, శ్రీ వాల్మీకీ రామాయణము మొద!!  వాటిని ఉదహరించేవారు. వారు ఎవరికైనా ఆళ్వార్ అరుళిచ్చెయలందు సందేహము/ప్రశ్న లు తలెత్తినప్పుడు వాల్మీకీ రామాయణమును ఉపయోగించి వారి సందేహములను యుక్తితో సంతృప్తి పరిచేవారు, కారణము రామాయణము వైదికులచే ప్రపంచ వ్యాప్తముగా అంగీకరించబడినది. వాటిలో కొన్ని సంఘటనలు మనకు వారి యొక్క గొప్పతనమును మరియు వినయమును తెలియచేయును.

 • నంపిళ్ళై సాదారణముగా తమ ప్రవచనములను పెరియ కోవెలలో మూల మూర్తి సన్నిధికి ప్రదక్షిణముగా తూర్పు దిక్కున (పెరియ పెరుమాళ్ళ తిరువడి దిక్కు) చెప్పేవారు. అందువలనే ఈ రోజు కూడా మనము ప్రణామమును సన్నిధి నుండి తిరిగి వచ్చి అక్కడ సమర్పించుదుము. ఒకసారి పెరియ పెరుమాళ్ అక్కడ నుంచొని నంపిళ్ళై ఉపన్యాసమును వినదలచిరి. తిరువిళక్కు పిచన్ (సన్నిధిలో దీప కైంకర్యమును చూసే ఒక శ్రీవైష్ణవుడు) పెరియ పెరుమాళ్ నిలబడుట చూసి వారిని క్రిందికి పూర్వం మాదిరిగా పడుకునేలాగా నెట్టి ఈ విధముగా ఆర్చావతారములో వెళ్ళరాదు అని చెప్పిరి. ఎమ్పెరుమాన్ ఇప్పడికి నంపిళ్ళైని చూస్తూ కాలక్షేపం వినాలని ఎమ్పెరుమాన్ తన అర్చావతారమును లెక్క చేయకుండా అర్చ సమాధిని త్యజించారు.
 • ఆ తదుపరి నంపిళ్ళైల ప్రవచనములు చాలా ప్రసిద్దిగాంచెను, అప్పుడు ప్రతీ ఒక్కరు ఇది నంపెరుమాళ్ గోష్టియా లేక నంపిళ్ళై గోష్టియా అని అడిగేవారు. వారు తన ప్రవచనములతో ప్రజలను ఎలాగైతే నంపెరుమాళ్ ప్రజలను తమ పురప్పాడుకు ఆకర్షించేవారో ఆ విధముగా తన ప్రవచనములతో ఆకర్షించేవారు. 
 • నంపిళ్ళైల వినయము పోల్చలేనిది. వారు శ్రీవైష్ణవత్వమునకు ఉదాహరణముగా జీవించిరి, వారు ఆ గుణములను నంజీయరుల వద్ద నేర్చుకొనిరి. ఒకసారి నమ్పెరుమాళ్ళ ఎదుట, కందాడై తోళప్పర్ (ముదలియాండాన్ పరంపర నుండి వచ్చినవారు) నంపిళ్ళై యొక్క కీర్తిని ఓర్వలేక నంపెరుమాళ్ళ ఎదుట, కొన్ని పరుషమైన వాక్యములు పలుకుదురు, నంపిళ్ళై ఆ అవమానమును అంగీకరించి ఒక్క మాటను మాట్లడక గుడిని వదిలి తన తిరుమాళిగైకు వెళ్ళిరి. అప్పుడు తోళప్పర్ వారి తిరుమాళిగకు వెళ్ళిరి, వారి ధర్మ పత్ని ఆ వార్తలను వేరే వారి ద్వారా తెలుసుకొని వారిని గట్టిగా మందలించి నంపిళ్ళైల కీర్తి గురించి చెప్పెను. ఆమె వారిని నంపిళ్ళైల దగ్గరికి తప్పకుండా వెళ్ళి వారి పాదముల వద్ద క్షమాపణను కోరమని అడిగెను. చాలా రాత్రి గడిచిన తరువాత చివరకు అతను తన తప్పుని గ్రహించి, నంపిళ్ళైల తిరుమాళిగైకు వెళదామని నిర్ణయించుకొనెను. అప్పుడు వారు ద్వారము తీసి చూస్తే అక్కడ ఒక వ్యక్తి వేచి ఉండడం గమనిస్తారు. పరిశీలించి చూడగా వారు నంపిళ్ళై. నంపిళ్ళై తోళప్పర్లను చూసి, వెంటనే క్రింద పడి ప్రణామమును సమర్పించి, మేము మీ యెడల తప్పు చేయడము కారణముగా మీరు బాధ పడినట్టున్నారు అని చెప్పెను. తోళప్పర్ నంపిళ్ళైల గొప్పతనమును చూసి భీతీల్లినవాడై – తోళప్పర్ తప్పు చేసినప్పడికినీ, నంపిళ్ళై ఆ తప్పును తనపై వేసుకొనే పెద్దమనసు ఉన్నవాడై క్షమాపణ చెప్పెను. తోళప్పర్ వెంటనే నంపిళ్ళైలకి ప్రణామములు సమర్పించి ఈ విదముగా చెప్పెను, నంపిళ్ళై ఈ క్షణము నుండి “లోకాచార్యర్” గా పిలవబడును కారణము – గొప్పవారైనాను వినయముగా ఉండంటం కేవలం కొద్ది మందికి మాత్రమే సాధ్యమగును, వారిని లోకాచార్యులుగా సంబోధన చేయుదురు. నంపిళ్ళై ని ఈ విధముగు పిలువుటకు తగినవారు. తోళప్పర్ నంపిళ్ళైపైన ఉన్న ద్వేషమును వదిలి అతని భార్యతో కూడి నంపిళ్ళైకి సేవలు చేయసాగిరి అలానే శాస్త్రము యొక్క రహస్యములను వారి వద్ద నుండి నేర్చుకొనిరి. మాముణులు తమ ఉపదేశ రత్తిన మాలలో ఈ సన్నివేషమును ఉదహరించిరి అలానే తోళప్పర్ మరియు నంపిళ్ళైల ఇరువురి కీర్తిని వర్ణించిరి. దాని నుండే మనము నంపిళ్ళైల పవిత్రతను అర్థము చేసుకోవచ్చు. అలానే తోళప్పర్ నంపిళ్ళైల సహవాసముతో ఏ విధముగా పవిత్రము చెందిరో ఈ సంఘటన తదుపరి మనము అర్థము చేసుకోవచ్చును.
 • నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ భట్టరుల తిరువంశముల నుండి వచ్చెను, వారు నంపిళ్ళైల కీర్తిని చూసి, నంపిళ్ళైపైన కొంత ద్వేషమును పెంచుకొనెను. ఒకసారి వారు రాజుగారి న్యాయస్తానమునునకు పోవుచు, పిన్భళగియ పెరుమాళ్ జీయరులను తమ వెంట రమ్మని పిలిచెను. ఆ రాజు వారిరువురిని ఆహ్వానించి, సంభావనను ఇచ్చి ఉచితాసనములను సమర్పించెను. ఆ రాజు భట్టర్ వారిని శ్రీ రామాయణము నుండి ఒక ప్రశ్నను అడిగిరి. రామావతారములో పెరుమాళ్ పరత్వమును చూపను అనెను కదా, మరి ఎలా జటాయునకు “గచ్చ లోకాన్ ఉత్తమాన్” (పెద్దైన ప్రపంచమునకు వెళ్ళుము – పరమపదము)? అని చెప్పిరి, అప్పుడు భట్టర్ సరియగు సమాదానము తెలియక తన యొక్క యశస్సును గురించి కలత చెందుచుండగా, రాజు ఇతర విషములందు ధ్యాస మరిలెను. భట్టర్ జీయరులను నంపిళ్ళై ఏ విధముగా చెప్పును అని అడుగగా జీయర్ వేంటనే వారైతే ఈ విధముగా వివరించుదురు “సత్యేన లోకాన్ జయతి” (ఒక సత్యమైన వ్యక్తి ప్రపంచమును జయించును). భట్టర్ ఆ శ్లోకముపై దృష్టి ఉంచి అర్ధమును గ్రహించి రాజుకు ఈ విధముగా చెప్పెను, రాముడు చాలా సత్య వ్రతుడు అయినందున అతను తన యోగ్యతచే సులభముగా ఎవరినైనా ఎక్కడికైనా పంప వచ్చును. రాజు అది విని చాలా సంతోషము చెంది, భట్టరుల ఙ్ఞానమును పొగిడి వారికి చాలా ధనమును సమర్పించెను. భట్టర్ వెంటనే నంపిళ్ళై వివరణ శక్తిని గ్రహించినవాడై, వారి వద్దకు వెళ్ళి మొత్తము ధనమును వారికి సమర్పించి వారి శిష్యులైరి, అ తరువాత నంపిళ్ళైల సేవలో ఎప్పడికి ఉండిపోయెను.

చాలా సంఘటనలు నంపిళ్ళైల జీవితములో తమ శిశ్యులకు విలువగు పాఠములు మరియు ఉపదేశములను నేర్పిరి. కొన్ని ఇక్కడ చూద్దాము:

 • ఒకసారి నంపిళ్ళై తమ శిశ్యులతో కూడి తిరువెళ్ళరై నుండి పడవలో తిరిగి వస్తుండగా, కావేరి నదికి వరదరాగా, పడవ నడిపే వ్యక్తి గోష్టిని ఉద్దేశించి పడవ నదిలో నిలుచుటకు మరియు నంపిళ్ళైను కాపాడుకొనుటకు ఎవరైనా ఒకరు పడవనుండి దూకమని చెప్పెను. అదివిని ఒక వృద్ద స్త్రీ వరదలోకి దూకినది, అదిచూసి నంపిళ్ళై చాలా బాధ పడిరి. కాని ఒడ్డుకు చేరగానే ఆ వృద్ద స్త్రీ గొంతు పక్కనే గల దీవిలో వినబడి ఈ విధముగా చెప్పెను, నంపిళ్ళై తన ఎదురుగా కనబడి తనని రక్షించెనని చెప్పెను. ఆ వృద్ద స్త్రీ తన జీవితమును పణముగా పెట్టి ఏ విదముగా ఆచార్యులకు సేవ చేయవచ్చునో చూపించి, మరియు నంపిళ్ళై – ఆచార్యులు ఆపద సమయములో తన శిశ్యులను ఎలా కాపాడుతారో చూపించిరి.
 • ఒక శ్రీ వైష్ణవ స్త్రీ నంపిళ్ళై తిరుమాలిగై పక్కనే ఉండేది, ఆమె దగ్గరికి ఒక శ్రీ వైష్ణవుడు వెళ్ళి ఈ విధముగ అడిగెను ఆమె గృహము నంపిళ్ళైల తిరుమాళిగై కుడి పక్కనే ఉన్న మూలముగా, మీరు మీ తిరుమాళిగను నంపిళ్ళై వారికి ఇస్తే నంపిళ్ళైల తిరుమాళిగను పెద్దగా చేసే అవకాశము ఉండును మరియు శ్రీ వైష్ణవ గోష్టికి ఉపయోగముగా ఉండును. మొదట సంకోచించి తదుపరి నంపిళ్ళై వద్దకు వెళ్ళి తనకు పరమపదములో చోటు ఇస్తే తన గృహమును ఇస్తానని చెప్పెను. నంపిళ్ళై సంతోషముతో ఒక గుర్తును తను వ్రాసి ఇచ్చెను, ఆమె కొన్ని దినముల తదుపరి తన చరమ శరీరమును వదిలి పరమపదమునకు చేరెను.
 • నంపిళ్ళై ఇద్దరు భార్యలను కలిగి ఉండెను. ఒకసారి వారు తన మొదటి భార్యని నా గురించి నీ ఆలోచన ఏమిటి అని అడిగిరి. ఆమె ఈ విదముగా జవాబు చెప్పెను, మీరు ఎమ్పెరుమానుల అవతారము మరియు నాకు ఆచార్యులుగా భావించెదను. నంపిళ్ళై చాలా సంతోషము చెంది తమ కొరకు వచ్చే శ్రీ వైష్ణవుల కొరకై తదియారాధన కైంకర్యములో పాల్గొనమని చెప్పిరి. వారు తమ రెండవ భార్యను అదే విధముగా అడుగగా, ఆమె నంపిళ్ళైలను తమ భర్తగా భావించెదను అని చెప్పెను. నంపిళ్ళై ఆమెను మొదటి భార్యకు సహాయముగా ఉండమని మరియు శ్రీవైష్ణవుల ప్రసాదమును స్వీకరించమని చెప్పిరి. వారు ఈ విధముగా అనిరి, శ్రీవైష్ణవుల శేషము వలన తాను పవిత్రమై, నిష్ఠ పెరగడము వలన ఆధ్యాత్మికముగా (ఆచార్య – శిష్యురాలు) పరిణితి చెంది శరీర సంబంధమైన భావనను (భర్త – భార్య) మరచిపోవును.
 • అప్పుడు మహాభాష్య భట్టర్ నంపిళ్ళైలను ఒక శ్రీవైష్ణవుడు తన యొక్క చైతన్యమునును (ఙ్ఞానము) గ్రహించిన తదుపరి ఏ విధముగా ఉండును అని అడిగిరి. నంపిళ్ళై ఈ విధముగా సమాధానమును చెప్పిరి, ఆ శ్రీ వైష్ణవుడు ఎమ్పెరుమానులే ఉపాయము మరియు ఉపేయము అని తలుచును, సంసారము అనే అనాధియైన వ్యాధి నుండి కాపాడినందుకు ఆచార్యులకు క్రృతఙ్ఞుడై ఉండును, తప్పక శ్రీ భాష్యం ద్వారా నిరుపించబడ్డ ఎమ్పెరుమానారుల సిద్ధా౦తము సత్యము అని నమ్మిన వాడై ఉండును, తప్పక భగవద్ గుణానుసంధానము శ్రీ రామాయణముతో నిత్యము భగవద్ గుణానుసంధానము చేయు ఉండును మరియు వారి సమయమును ఆళ్వారుల అరుళిచ్చెయల్ నందు పూర్తిగా వినియోగించుతూ ఉండును. చివరగా తప్పక ఈ జీవితము తదుపరి  పరమపదమును చూస్తామని నమ్మకమును కలిగి ఉండును.
 • కొందరు శ్రీవైష్ణవులు పాండ్యనాడు నుండి నంపిళ్ళైల దగ్గరకు వచ్చి మన సంప్రదాయము యొక్క సారమును తెలుపమని అడిగిరి. నంపిళ్ళై వారిని సముద్రము రేవును గురించి అలోచించమనిరి. అప్పుడు వారు దిగ్బ్రమ చెంది ఎందుకు సముద్రపు రేవు గురించి ఆలోచించడము అని అడుగగా, నంపిళ్ళై ఈ విధముగా వివరించిరి అప్పుడు శ్రీ రాముడు రావణునితో యుద్దమునకు ముందు సముద్రపు ఒడ్డున నివసించే సమయములో, వారు తమ గుడారములో విశ్రమించే సమయములో వానరములు వారి రక్షణ కొరకై చుట్టు పక్కన కాపలాగా ఉండేవి. కాని శ్రమ వలన వానరములు పడుకొనినప్పుడు, ఎమ్పెరుమాన్ స్వయముగా తానే అక్కడ పరిసరములు తిరుగుతూ వారికి రక్షణగా ఉండెను. నంపిళ్ళై ఈ విధముగా వివరించెను ఎమ్పెరుమాన్ మనము పడుకొనినను తానే రక్షించును మేలుకతో ఉన్నప్పడికినీ తానే రక్షించును అందువలన మనము వారి యందు పూర్తి విశ్వాసమును ఉంచవలెను, ఈ విధముగా స్వరక్షనే స్వ అన్వయము అనగా మనలని మనమే రక్షించుకోగలం అనే భావనను త్యజించ వలెను.
 • దేవతాంతర భజనముల గురించి నంపిళ్ళై గొప్ప వివరణమును ఇక్కడ మనము చుద్దాము. ఒక వ్యక్తి నమ్పిళ్ళై వద్దకు వచ్చి అడిగిరి “మీరు దేవతాన్తరములను (ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, సూర్య మొదలైన) మీ నిత్య కర్మలందు ఎందుకు ఆరాధించుదురు,చ్కాని గుడిలో ఎందుకు ఆరాధించరు?”. నంపిళ్ళై చాలా తెలివిగా సమాధానమును చెప్పిరి “మీరి అగ్నిని యాగములో ఎందుకు ఆరాధించుదురు మరియు స్మశానములో ఉండే అగ్నికి దూరముగా  ఎందుకు ఉందురు? అదే విధముగా, శాస్త్రములో విధించిన నిత్య కర్మములను భగవద్ ఆరాధనముగా తప్పక చేయవలెను ఎందుకంటే ఎమ్పెరుమానులు దేవతలకు అంతర్యామిగా ఉండి వాటిని గ్రహించుదురు, అందువలన మేము చేస్తాము. అదే శాస్త్రము ఈ విధముగా చెప్పినది, మనము ఎమ్పెరుమానులను తప్ప వేరెవరిని ఆరాధించకూడదని, అందువలన వేరే ఆలయములకు వెళ్ళము. అదే విధముగా, ఆ దేవతాలను ఆలయములలో ప్రతిష్టించడము వలన, వారి యొక్క రజో గుణము పెరిగి మరియు వారికి వారే పరత్వులు అని ఆలోచించుదురు, మేము (శ్రీవైష్ణవులు) సత్వ గుణము కలిగి ఉండడము వలన రజో గుణములు కలిగిన దేవతలను ఆరాధించము”.  దేవతాంతర భజనము మనము వదులు కొనుటకి ఈ సమాధానము చాలు కదా?.
 • ఒక శ్రీవైష్ణవుడు నంపిళ్ళై వారి దగ్గరకు వచ్చి ఈ విధముగా చెప్పెను, నేను ఇంతకు ముందుకన్నా చిక్కిపోయాను అనిరి. నంపిళ్ళై  సమాధానము: ఆత్మ పెరిగినప్పుడు శరీరము దానికదే చిక్కిపోవును.
 • అప్పుడు మరియొక శ్రీవైష్ణవుడు నంపిళ్ళైలను అడిగిరి, ఎందుకు మేము బలముగా లేము, నంపిళ్ళై సమాధానము: ఎమ్పెరుమానులను ఆరాధించే బలము మీకు ఉంది ఇంకా బలముగా ఉండుటకు మీరు యుద్దమునకు పోవుట లేదు. శ్రీవైష్ణవుడు శారీరకముగా చాలా బలముగా ఉండవలెనని చింతించ అవసరము లేదు అన్న సత్యమును ఇది తెలియచేయును.
 • అప్పుడు నంపిళ్ళై అనారోగ్యముతో ఉన్నప్పుడు, ఒక శ్రీవైష్ణవుడు చింతపడుచుండగా, నంపిళ్ళై చెప్పిరి, మనము ఏ బాధనైనను మంచిదే అని ఆలోచించవలే, కారణము శాస్త్రము చెప్పెను“ ఎవరైతే ఎమ్పెరుమానులకు శరణాగతి చేయుదురో, వారు మృత్యు దేవతను (చావు) సంతోషముగా వచ్చుటకు  ఆహ్వానించేదురు”.
 • ఒకానొక  సమయములో కొందరు శ్రీ వైష్ణవులు ఎంగళ్ ఆళ్వాన్ ఆదేశము మేరకు మరియు నంపిళ్ళైల మీద ప్రేమచే అనారోగ్యము నుండి త్వరగా కోలుకొనుటకు ఒక రక్షను కట్టదలిచిరి, నంపిళ్ళై అంగీకరించకపోతే, శ్రీ వైష్ణవులు “ఒక శ్రీవైష్ణవుడు తన గురించి వదిలి ఇతరుల అనారోగ్యమును గురించి ఆలోచించితే తప్పేమి” అని అడిగిరి. నంపిళ్ళై ఈ విధముగా చెప్పిరి మనము మన అనారోగ్యమును మనమే నయము చేసుకొనిన, దాని అర్థము మన స్వరూపమును మనము సరిగా అర్థము చేసుకోకపొవడమే, మనము పూర్తిగా ఎమ్పెరుమానులపై ఆదారపడినాము అంతకు మించి వేరేలేదు. అలానే  మనము ఇతరుల అనారోగ్యమును బాగు చేయదలచిన మనము ఎమ్పెరుమానుల జ్ఞానము మరియు శక్తిని అర్థము చేసుకోకపొవడమే, మరలా మనము వారి భక్తులను కాపాడుటకు వారిపై ఆధార పడవలసినదే. అదీ నంపిళ్ళైల నిష్ట మరియు అలానే వారి జీవించిరి. ఇంకనూ మనము ఆళవందార్లను బాధపడినపుడూ మారనేరి నంబి ఏ విధముగా చేసిరో మనము గ్రహించ వలెను ఇతర శ్రీవైష్ణవులు బాధను నయము చేయుటకి మనము ఆ విధముగా మన కర్తవ్యమును నిర్వహించవలెను.
 • నంపిళ్ళై ఆ కాలములో గొప్ప శిష్యులుగా చాలా ఆచార్య పురుష కుటుంబాల నుండి వచ్చిన వారిని కలిగి ఉండేవారు, వారి సమయములో శ్రీరంగం ప్రతీ ఒక్కరు నల్లడిక్కాలమ్ (మంచి కాలము) అని కీర్తించెడివారు. వారి శిశ్యులు నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ (125000 పడి) మరియు వడక్కు తిరువీధి పిళ్ళై (ఈడు 36000 పడి) వారిరువురు తిరువాయ్మొళికి వ్యాఖ్యానమును వ్రాసిరి కాని నంపిళ్ళై పూర్వపు దానిని అంతం చేసిరి కారణము అది చాలా పెద్దది మరియు వివరమైనది, తదుపరి గ్రంథమును తీసుకొని ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళకి ఇచ్చిరి. కాలాంతరములో అళగియ మణవాళ మాముణుల ద్వారా అందరికి ఉపదేశించబడుటకై. అలానే వారు పెరియ వాచ్చాన్ పిళ్ళైలను తిరువాయ్మొళి వ్యాఖ్యానమును వ్రాయమని ఆదేశించిరి మరియు పెరియ వాచ్చాన్ పిళ్ళై వారి ఆచార్యుల కోరికను 24000 పడి వ్యాఖ్యానమును వ్రాసిరి అది నంపిళ్ళైలచే పొగడబడినది.
 • అప్పుడు నంపిళ్ళై పెరియ కోయిల్ వళ్ళలార్ లను “కులమ్ తరుమ్” అర్థము ఏమి అని అడిగిరి, వళ్ళలార్ చెప్పెను “మా కులము జన్మ కులము నుండి నంబూర్ కులమునకు (నంపిళ్ళై వారి కులము) మారెను, దాని అర్థమే కులమ్ తరుమ్” – ఇది పెరియాళ్వారుల శ్రీసూక్తి పాణ్డ్య కులము (జన్మతో వచ్చిన కులము) నుండి తొండ కులము (ఆచార్య సంబంధము మరియు కైంకర్య శ్రీ) మాదిరి ఉండెను. అదీ నంపిళ్ళైల గొప్పతనము.

ముగించుటునకు చివరగా, పెరియ వాచ్చాన్ పిళ్ళై నంపిళ్ళైల గురించి ఏళై ఏతలన్ పదిగములో, ఓతు వాయ్మైమైయుమ్ పాశురము (పెరియ తిరుమొళి 5.8.7) ఏమి చెప్పారో చూద్దాము. “అన్తణన్ ఒరువన్” (అసమానమైన పండితుడు) పదమును వివరించునప్పుడు, పెరియ వాచ్చాన్ తమ ఆచార్యుల కీర్తీని చెప్పుటకు ఈ అవకాశము ఉపయోగించుకొని తమ ఆచార్యులు అసమాన పండితుడు అనుటకు ఈ పదములను వాడిరి: “ముఱ్పడ ద్వయత్తైక్ కేట్టు, ఇతిహాస పురాన్ణన్ఙ్గళైయుమ్ అతిగరిత్తు, పరపక్శ ప్రత్క్శేపత్తుక్కుడలాగ ణ్యాయమీమామ్సైకళుమ్ అతిగరిత్తు, పోతుపోక్కుమ్ అరుళిచెయలిలేయామ్పడి పిళ్ళైయైప్పోలే అతిగరిప్పిక్క వల్లవనైయిరే ఒరువన్ ఎన్బతు”. సరళ అనువాదము: ఎవరు ద్వయమును మొదలు విందురో, అప్పుడు పురాణములు మరియు ఇతిహాసములను నేర్చుకొనుదురు, న్యాయము మరియు మీమాంశలను నేర్చుకొని బాహ్య/కుదృష్ఠులను ఓడించుదురు మరియు వారి సమయము మొత్తము ఆళ్వారుల అరుళిచ్చెయల్ మరియు అర్థములను నేర్చుకొని ఇతరులకు నేర్పుదురు నంపిళ్ళై వలె అందువలన వారిని అసమాన పండితుడు అని చెప్పబడెను. ఇక్కడ పెరియ వాచ్చాన్ పిళ్ళై సాంధీపని మునిని నంపిళ్ళైతో పోల్చిరి (నంపిళ్ళై సాంధీపని ముని కన్నా చాలా గొప్పవారు నంపిళ్ళై భగవత్ విషయము నందు పూర్తిగా మునిగిరి కాని సాంధీపని ముని కృష్ణ పరమాత్మ ముకుందుడు అని తెలిసి కూడా (వారే మోక్షమును ఇచ్చునని తెలిసి కూడా) తన చని పోయిన కుమారుడికి ప్రాణం పోయమని కోరెను).

తమిళ మరియు సంస్కృతముల సాహిత్యములో లోతైనా ఙ్ఞానము కలిగి ఉండే కారణముచే వారి ప్రవచనములను వినుటకు వచ్చే శ్రోతలను మంత్ర ముగ్దులను చేసేవారు. వీరు చెప్పే అరుళిచ్చెయల్ అర్థములు అందరికి అర్థము అయ్యే కారణము చేత తిరువాయ్మొళి ఎంతో ఎత్తునకు విస్తరించెను. తిరువాయ్మొళికి, 6000 పడి వ్యాఖ్యానము తప్ప, మిగిలిన 4 వ్యాఖ్యానములకు నంపిళ్ళై సంబంధము ఉంది.

 • 9000 పడి అసలు పత్రి నంజీయరు వ్రాసిననూ, తిరిగి నంపిళ్ళైలచే కొంచెము ముఖ్యమైన అర్థములను వ్రాయబడెను.
 • 24000 పడిని పెరియ వాచాన్ పిళ్ళై నంపిళ్ళైల ఉపదేశములను మరియు ఆఙ్ఞలచే వ్రాసెను.
 • 36000 పడిని వడక్కు తిరువీధి పిళ్ళై నంపిళ్ళైల ప్రవచనములచే వ్రాసెను.
 • 12000 పడిని పెరియ వాచాన్ పిళ్ళైల శిష్యుడు వాది కేసరి అళగియ మణవాళ జీయర్ వ్రాసిరి వాటి అర్థములను చూసినట్లయితే మనము సులభముగా అర్థము చేసుకోగలము అది నంపిళ్ళైల 36000 పడికి దగ్గరగా ఉండును.

ఇది ఒకటే కాక, నంపిళ్ళై అపరిమితమైన కరుణచే, మన సంప్రదాయమునకు రెండు కీర్తి గల స్తంభములను నాటిరి – వారే పిళ్ళై లోకాచార్యులు మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు, వారు శ్రీవచన భూషణము మరియు ఆచార్య హృదయమును మన పూర్వాచార్యులచే పొందిన ఙ్ఞానముచే వ్రాసిరి. మనము వారి చరిత్రమును తదుపరి సంచికలో చూద్దాము (వడక్కు తిరువీది పిళ్ళై వైభవము).

nampillai-pinbhazakiya-perumal-jeer-srirangam

నంపిళ్ళై తిరువడిలో పిన్భళగరామ్ పెరుమాళ్ జీయర్, శ్రీరంగము

నంపిళ్ళై తమ చరమ తిరుమేనిని శ్రీరంగములో వదిలి పరమపదమును చేరిరి. నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ తమ శిరోజములను ఆ సందర్భముగా తీసివేసెను (శిష్యులు మరియు కుమారులు తండ్రి/ఆచార్యులు పరమపదమునకు చేరినపుడు ఈ విధముగా చేయుదురు) వారి సోదరులు నంపెరుమాళ్ళకి ఈ విషయం గురించి చెబుతారు. ఆ విధంగా ప్రవర్తించుటకు కారణమేమి అని ప్రశ్నించగా భట్టర్ తాను కూరకులంలో జన్మించుట కంటే నంపిళ్ళైతో తన కున్న అనుబంధమునుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వుదురని చెప్తారు. ఇది విని నంపెరుమాళ్ చాలా సంతోషము చెందిరి. 

ఎమ్పెరుమానులతో మరియు ఆచార్యులతో మనకు ఆ విధమైన సంబంధము ఏర్పడాలని నంపిళ్ళైల శ్రీ చరణములను ప్రార్థిస్తాము.

నంపిళ్ళై వారి తనియన్:

వేదాన్త వేద్య అమ్రుత వారివారిరాశే
వేదార్త సార అమ్రుత పూరమగ్ర్యమ్
ఆదాయ వర్శన్తమ్ అహమ్ ప్రపద్యే
కారుణ్య పూర్ణమ్ కలివైరిదాసమ్

మన తదుపరి సంచికలో వడక్కు తిరువీధి పిళ్ళై వైభవమును చూద్దాము.

రఘు వంశీ రామానుజ దాసన్

మూలము: https://guruparamparai.wordpress.com/2012/09/16/nampillai/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

35 thoughts on “నంపిళ్ళై

 1. Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu

 2. Pingback: వడక్కు తిరువీధి పిళ్ళై | guruparamparai telugu

 3. Pingback: ముదలాళ్వార్గళ్ | guruparamparai telugu

 4. Pingback: శ్రీవైష్ణవ తిరువారాధనము | srIvaishNava granthams – Telugu

 5. Pingback: thirumazhisai-azhwar | guruparamparai telugu

 6. Pingback: తిరుక్కచ్చి నంబి | guruparamparai telugu

 7. Pingback: మధురకవి ఆళ్వార్ | guruparamparai telugu

 8. Pingback: తిరువరంగప్పెరుమాళ్ అరయర్ | guruparamparai telugu

 9. Pingback: పెరియ తిరుమలై నంబి | guruparamparai telugu

 10. Pingback: వాది కేసరి అళగియ మణవాళ జీయర్ | guruparamparai telugu

 11. Pingback: తిరుక్కోష్టియూర్ నంబి | guruparamparai telugu

 12. Pingback: 2014 – July – Week 5 | kOyil

 13. Pingback: mARanEri nambi | guruparamparai telugu

 14. Pingback: 2014 – Dec – Week 1 | kOyil

 15. Pingback: ముదలియాణ్డాన్ | guruparamparai telugu

 16. Pingback: సోమాసియాణ్డాన్ | guruparamparai telugu

 17. Pingback: కిడాంబి ఆచ్చాన్ | guruparamparai telugu

 18. Pingback: వంగి పురత్తు నంబి | guruparamparai telugu

 19. Pingback: తిరువరంగత్తు అముదనార్ | guruparamparai telugu

 20. Pingback: అనంతాళ్వాన్ | guruparamparai telugu

 21. Pingback: ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ | guruparamparai telugu

 22. Pingback: వేదవ్యాస భట్టర్ | guruparamparai telugu

 23. Pingback: పెరియవాచ్చాన్ పిళ్ళై | guruparamparai telugu

 24. Pingback: పిన్భళగియ పెరుమాళ్ జీయర్ | guruparamparai telugu

 25. Pingback: పిన్భళగియ పెరుమాళ్ జీయర్ | guruparamparai telugu

 26. Pingback: నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ | guruparamparai telugu

 27. Pingback: అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ | guruparamparai telugu

 28. Pingback: అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ | guruparamparai telugu

 29. Pingback: తిరునారాయణ పురత్తు ఆయ్ జనన్యాచార్యులు | guruparamparai telugu

 30. Pingback: తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ | guruparamparai telugu

 31. Pingback: కణ్ణినుణ్ శిరుతాంబు | dhivya prabandham

 32. Pingback: ఎంగళాళ్వాన్ | guruparamparai telugu

 33. Pingback: కూర నారాయణ జీయర్ | guruparamparai telugu

 34. Pingback: కణ్ణినుణ్ శిరుతాంబు – 7 – కణ్దు కొణ్దు | dhivya prabandham

 35. Pingback: పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ | guruparamparai telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s