శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
గత సంచికలో మనము పెరియ నంబి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల గురించి తెలుసుకొందాం.
తిరు నక్షత్రం : చైత్ర మాసము, ఆరుద్ర నక్షత్రము
అవతారస్థలం : శ్రీ పెరుంబూదూర్.
ఆచార్యులు : పెరియ నంబి
శిష్యులు : కూరతాళ్వాన్, ముదలియాండాన్, ఎంబార్, అరుళళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్,
అనంతాళ్వాన్, 74 సింహాసనాధిపతులు మరియు కొన్ని వేల మంది శిష్యులు.12000 శ్రీ వైష్ణవులు, 74 సింహాసనాధిపతులు, 700 సన్యాసులు మరియు ఎందరో శ్రీ వైష్ణవులు వేరు వేరు కులములకు చెందినవారు రామానుజుల శిష్యులుగా చెప్పబడుతారు.
వీరు పరమపదించిన ప్రదేశము : శ్రీ రంగం
శ్రీ సూక్తి గ్రంధములు : వీరు నవ రత్నములనెడి తొమ్మిది గ్రంధ రచనలను చేసారు. అవి శ్రీ భాష్యము, గీతా భాష్యము, వేదార్ధ సంగ్రహము, వేదాంత దీపము, వేదాంత సారము, శరణాగతి గద్యము, శ్రీ రంగ గద్యము, శ్రీ వైకుంఠ గద్యము మరియు నిత్య గ్రంధము.
కేశవ దీక్షితులు మరియు కాంతిమతి అను పుణ్య దంపతులకు ఆదిశెషుని అంశముగా ఇళయాళ్వార్లు శ్రీ పెరుంబూదూర్ అను గ్రామమున జన్మించిరి. వీరికి అనేక నామధేయములు కలవు. ఎవరు వీరికి అవి బహూకరించెనో ఇప్పుడు చూద్దాము.
- పెరియ తిరుమలై నంబి వారు రామానుజుల తల్లి తండ్రుల తరపున ఇళయాళ్వార్ అని నామకరణం చేసిరి.
- పంచ సంస్కార సమయమున పెరియ నంబి శ్రీ రామానుజ అని బహూకరించెను.
- సన్యాసాశ్రమ స్వీకార సమయమున దేవ పెరుమాళ్ యతిరాజ అని పిలిచి బహూకరించెను.
- తిరువరంగ పెరుమాళ్ అరయర్ లక్ష్మణ ముని అని బహూకరించెను.
- తిరుక్కోష్టియూర్ నందు వారికి శరణాగతి చేసిన వారి అందరికి; చరమ స్లోక అర్ధమును ఉపదేశించ్చినప్పుడు తిరుక్కోష్టియూర్ నంబి వారిని ఎమ్పెరుమానార్ అని పిలిచి వారికి ఆ పేరును బహూకరించెను.
- శఠగోపన్ పొన్నడి అని తిరుమాలై అండాన్ బహూకరించెను.
- కోయిల్ ఆణ్ణన్ అని తిరుమాలిరుంజోలై అళగర్కు 100 పాత్రలలో అక్కార అడిసిల్ మరియు 100 పాత్రలలో వెన్న నైవేద్యము సమప్రించినప్పుడు ఆండాళ్ బహూకరించెను.
- కాష్మీర దేశము నందు సరస్వతి దేవి శ్రీ భాష్యకారర్ అని బిరుదును బహూకరించెను.
- శ్రీ పెరుంబూదూర్ నందు ఆది కేశవ పెరుమాళ్ళు భూతపురీశర్ అని బహూకరించెను.
- తిరువేంకటముడయాన్ (వేంకటేశ పెరుమాళ్) వారికి దేశికేంద్రర్ అను బిరుదును బహూకరించెను.
వారి జీవిత చరిత్ర సంగ్రహముగ:
- తిరువల్లిక్కేణి పార్ధసారధి ఎమ్పెరుమాన్ల కటాక్షముచే వారి అంశావతారముగ శ్రీ పెరుంబూదూర్ నందు జన్మించెను.

ఉభయ నాచ్చియార్ సమేత పార్ధసారధి పెరుమాళ్ – తిరువల్లిక్కేణి
- తంజమ్మాల్ (రక్షకంబాళ్) వారిని వివాహము చేసుకొనెను.
- కాంచిపురమున యాదవ ప్రకాశుల వద్ద సామాన్య శాస్త్రము మరియు పూర్వ పక్షమును నేర్చుకొనెను.
- యాదవ ప్రకాశుల శాస్త్ర వాక్యముల యొక్క కుటిల వివరణమును ఇళయాళ్వార్ సరిదిద్దెను.
- వారణాసి యాత్రలో; యాదవ ప్రకాశుల శిష్యులు కొందరు; ఇళయాళ్వర్లను చంపుటకు ప్రణాలికను రూపుదిద్దెను. గోవిందర్ (ఎంబార్); ఇళయాళ్వార్ యొక్క బంధువు అది కనిపెట్టి; వారిని కాంచిపురమునకు వెళ్ళమని పంపి వేసెను. వారు ఆ అడవిలో తప్పిపోగా; దేవ పెరుమాళ్ మరియు పెరుందేవి తాయార్లు వారికి సాయపడి; వారిని కాంచి పురమునకు కొనిపోయెను.
- వారు కాంచి పురమునకు విచ్చేసిన తరువాత; వారి తల్లి గారి ఆదేశము ప్రకారము; వారు తిరుక్కచ్చి నంబి వారి ఆధ్వర్యములో దేవ పెరుమాళ్ళకు సేవించుచుండెను.
- పెరియ నంబితో కూడి ఇళయాళ్వార్లు శ్రీ రంగమునకు ఆళవందార్లను కలువుటకు బయలుదేరెను. కాని వారికి ఆళవందార్ల చరమ తిరుమేని దర్శనము మాత్రమె దొరికెను. వారు అప్పుడు ఆళవందార్ల 3 కోరికలను తీర్చునని ప్రతిజ్ఞ చేసెను.
- ఇళయాళ్వార్లు తిరుక్కచ్చి నంబి వారిని గురువుగా భావించి; వారిని పంచ సంస్కారములు ప్రసాదించమని కోరెను. నంబి ఆ కోరికను శాస్త్ర ప్రమాణములను చూపించి; తిరస్కరించెను. ఇళయాళ్వార్లు నంబి యొక్క శేష ప్రసాదమును స్వీకరించుటకు కోరిక కలిగెను. ఆ కోరిక కూడ తీరలేదు.
- ఇళయళ్వార్లకు దేవ పెరుమాళ్ళు ఆరు వార్తలు (ఆరు విషయములు) తిరుక్కచ్చి నంబి ముఖముగ ఇచ్చెను.
- పెరియ నంబి మరియు ఇళయాళ్వర్లు ఇరువురు మధురాంతకము నందు కలుసుకొనెను. పెరియ నంబి వారికి పంచ సంస్కారములను కావించి; వారికి రామానుజ అను దాస్య నామమును ఇచ్చెను.
- పెరియ నంబి వారు రామానుజుల గృహము నందు ఉండి; వారికి సాంప్రదాయ అర్ధములను బోధ చేసిరి. తుదకు పెరియ నంబి వారు శ్రీ రంగమునకు వెళ్ళిపోయెను.
- దేవ పెరుమాళ్ వద్ద రామానుజులు సన్యాసాశ్రమమును స్వీకరించెను.
- ఆళ్వాన్ మరియు ఆండాన్ రామానుజులకు శిష్యులయ్యెను.
- యాదవ ప్రకాశులు రామానుజులకు శిష్యులుగ మారి; గోవింద జీయరు అని నామమును పొందెను. వారి యతి ధర్మ సముచయం అను గ్రంధమును రచించెను. శ్రీ వైష్ణవ యతులకు అది ప్రమాణముగ భాసిల్లుచున్నది.
- పెరియ పెరుమాళ్ తిరువరంగ పెరుమాళ్ళను దేవ పెరుమాళ్ళ వద్దకు పంపి; రామానుజులను శ్రీ రంగమునకు పంప వలసినదిగా కోరెను. దేవ పెరుమాళ్ అంగీకారమున రామానుజులు శ్రీ రంగవాసి అయ్యెను.
- రామానుజులు పెరియ తిరుమలై నంబిని పంపి; గోవింద భట్టర్లను (ఎంబార్) తిరిగి శ్రీ వైష్ణవ ధర్మమునకు తెప్పించెను.
- చరమ స్లోక అర్ధమును తిరుక్కోష్టియూర్ నంబి వద్ద నేర్చుకొనుటకు; రామానుజులు తిరుక్కోష్టియూర్ వెల్లెను. అక్కడ వారు నేర్చుకొనుటకు ఆశక్తి ఉన్న వారందరికి ఆ స్లోక అర్ధమును వివరించెను. అది చూసి నంబి సంతోషించి ఎమ్పెరుమానార్ అని బిరుదును బహూకరించెను.
- తిరువాయ్మొళి కాలక్షేపమును తిరుమాలై ఆండాన్ల వద్ద నేర్చుకొనెను.
- తిరువరంగ పెరుమాళ్ అరయర్ వద్ద పంచమోపాయ (ఆచార్య) నిష్ట నేర్చుకొనెను.
- ఎమ్పెరుమానార్లు వారి సంబంధీకుల శ్రేయస్సు కొరకు పరమ కారుణ్యము చేత నమ్పెరుమాళ్ మరియు శ్రీ రంగ నాచ్చియార్ యదుట శరణాగతి చేసెను.
- ఎమ్పెరుమానార్లకు ఒకనాడు విషపూరిత భిక్ష ఇవ్వబడెను. తిరుక్కోష్టియూర్ నంబి శ్రీ రంగమునకు వచ్చి; కిడాంబి ఆచాన్లను ఎమ్పెరుమానార్ల భిక్ష బాధ్యతను స్వీకరించవలసినదిగ ఆదేశించెను.
- రామానుజులు యజ్ఞ మూర్తిని వాదనలో వోడించిరి. వారు అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్లుగా మారి; ఎమ్పెరుమానార్ల (రామానుజుల వారి) తిరువారాధన ఎమ్పెరుమాన్ల తిరువారాధన కైంకర్యమును పొందెను.
- అనంతాళ్వాన్లను మరియు ఇంకొందరిని; అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ల శిష్యులవ్వమని ఆదేశించెను.
- అనంతాళ్వాన్లను తిరుమలలోని తిరువేంకటముడయాన్ల నిత్య కైంకర్యమునకు తిరుమల పంపెను.
- ఎమ్పెరుమానార్లు దివ్య దేశ యాత్రకు వెళ్ళి; తిరుమల చేరుకొనెను.
- ఆ పిమ్మట తిరువేంకటముడయాన్లు విష్ణు మూర్తి (విగ్రహము) అని నిరూపించి; కుద్రుష్టులని ఓడించెను.
- రామానుజులను వేంకటేశ్వర స్వామి యొక్క ఆచార్యునిగా కీర్తించబడెను. ఇప్పటికి కూడ రామానుజులు తిరుమలలో జ్ఞాన ముద్రలో దర్శనమిస్తారు.

ఎమ్పెరుమానార్ – తిరుమల
- అక్కడ వారు పెరియ తిరుమలై నంబి వద్ద శ్రీ రామాయణ కాలక్షేపమును వినెను.
- ఎమ్పెరుమానార్లు గొవింద భట్టర్లకు సన్యాసాశ్రమమును ప్రసాదించి వారికి ఎంబార్లుగ నామకరణము చేసెను.
- ఎమ్పెరుమానార్లు కూరతాళ్వానతో కూడి; కాష్మీరు దేశమునకు బోదాయన వృత్తి గ్రంధమును తెచ్చుటకు వెళ్ళెను. వారికి గ్రంధము లభించినప్పటికి అక్కడి పండితులు వారి సైన్యమును పంపి వారి దగ్గర నుంచి తిరిగి తీసుకొనెను. అప్పుడు ఆళ్వాన్లు ఆ వృత్తి మొత్తాన్ని తాను ధారణలో నిలుపుకున్నట్లు చెప్పెను.
- ఎమ్పెరుమానార్లు ఆళ్వాన్ల సాహాయముతో శ్రీ భాష్యమును రచించెను. ఈ విధముగ ఆళవందార్ల మొదటి కోరిక నిరవేర్చెను.
- ఎమ్పెరుమానార్లు ఒకనాడు తిరుక్కురుంగుడి దివ్య దేశమునకు వెళ్ళగ అక్కడ ఎమ్పెరుమాన్లు రామానుజులకు శిష్యుడయ్యి శ్రీ వైష్ణవ నంబి అని పేరు పొందెను.
- నమ్పెరుమాళ్ యొక్క కృప చేత ఆళ్వాన్ మరియు ఆండాళ్ళకు ఇద్దరు కుమారులు జన్మించెను.
- ఎమ్పెరుమానార్లు వారికి పరాశర మరియు వేద వ్యాస అని నామకరణము చేసి ఆళవందార్ల రెండవ కోర్కెను తీర్చెను.
- ఎంబార్ల సోదరుడయిన శిరియ గోవింద పెరుమాళ్ళకు బిడ్డ పుట్టగ వారికి “పరాంకుశ నంబి” అని నామకరణము చేసి ఆళవందార్ల మూడవ కోర్కెను తీర్చెను. అదే విధముగా ఎమ్పెరుమానార్లు తిరుక్కురున్గై పిరాన్ పిళ్ళాన్ వారికి తిరువాయ్మొళికి భాష్యమును రచించమని చెప్పి ఆళవందార్ల మూడవ కోర్కెను తీర్చెనని ప్రసిద్ధి.
- ఎమ్పెరుమానార్లు తిరునారాయణ పురమునకు వెళ్ళి; అక్కడ ఆలయ నిర్వహణను మరియు ఆరాధనా విధనమును స్ధాపించి ఎంతో మందికి పంచ సంస్కారములను ప్రసాధించెను.
- ఎమ్పెరుమానార్లు ఒకనాడు 1000 తలల ఆదిశేషునిగా మారి 1000 జైనులను ఏక కాలమున వాదనలో ఓడించెను.
- ఎమ్పెరుమానార్లు శెల్వ పిళ్ళై ఉత్సవ మూర్తిని తిరిగి సంపాదించి; ఆ మహమ్మదీయ రాజు కుతురికి శెల్వ పిళ్ళైకు వివాహము చేసెను.
- ఎమ్పెరుమానార్లు శైవ రాజు మరణము పొందిన పిదప శ్రీ రంగమునకు వేంచేసెను. వారు ఆళ్వాన్లను దేవ పెరుమాళ్ళను స్తోత్రము చేసి వారి కన్నులు తిరిగి పొందమని ఆదేశించెను.
- ఎమ్పెరుమానార్లు తిరుమాలిరుంజోలై దేశమునకు వెళ్ళి; 100 పాత్రల అక్కార అడిసిల్ మరియు 100 పాత్రల వెన్నను సమర్పించి ఆండాళ్ళు కోరికను తీర్చెను.
- ఎమ్పెరుమానార్లు పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ల గొప్ప తనమును ఇతర శ్రీ వైష్ణవులకు చూపించెను.
- ఎమ్పెరుమానార్లు వారి శిష్యులకు అనేక చరమ ఆదేశములను ఇచ్చెను. పరాశర భట్టర్లను వారితో సమానముగ చూడవలెనని ఆదేశించెను. పరాశర భట్టర్లకు నంజీయర్లను మన సంప్రదాయమునకు మార్చవలసిందిగ ఆదేశించెను.
- చివరిగా ఆళవందార్ల తిరుమేనిని ధ్యానము చేసుకొనుచు; వారు ఈ లీలా విభూతి యందు వారి లీలను పూర్తి చేసుకొని నిత్య విభూతి యందు లీలను కొనసాగించుటకై పరమపదమునకు సాగెను.
- ఆళ్వార్ల చరమ తిరుమేనిని ఆళ్వార్ల తిరునగరిలో ఆదినాధన్ కోవెలలో భద్రము చేసినట్లు; ఎమ్పెరుమానార్ల చరమ తిరుమేనిని శ్రీ రంగములో రంగనాధ కోవెలలో భద్రపరిచెను (ఎమ్పెరుమానార్ సన్నిది వద్ద మూలవర్ తిరుమేని క్రింద). వారి చరమ కైంకర్యములు అన్ని రంగనాధ బ్రహ్మోత్సవము విధముగ వైభవముగ జరిగెను.
మన సంప్రదాయము నందు ఎమ్పెరుమానార్ల అద్వితీయమైన స్ధానము:
మన ఆచార్య రత్న హారము నందు ఎమ్పెరుమానార్లను నాయక మణి అనగా మధ్యలో ఉండునది అని కీర్తిస్తారు. నాయనార్ ఆచాన్ పిళ్ళై (పెరియవాచాన్ పిళ్ళై వారి తనయులు) వారి చరమోపాయ నిర్ణయం అను గ్రంధమున ఎమ్పెరుమానార్ల పూర్తి వైభవమును చాటి చెప్పిరి. ఆ గ్రంధములోని కొన్ని అద్భుతమయిన విషయములను మనము ఇప్పుడు సేవించుదాము.
- మన పూర్వాచార్యుల (రామానుజులకు ముందు మరియు వారి తరువాత వారు) శ్రీ సూక్తుల ప్రకారము శ్రీ వైష్ణవులకు చరమోపాయము ఎమ్పెరుమానార్లు అనే నిర్ధారించెను.
- మన పూర్వచార్యులు అందరు వారి ఆచార్యుల మీద ఆధారపడినప్పటికి; వారి ఆచార్యులందరు; ఎమ్పెరుమానార్ల మీద ఆధారపడమని చెప్పెను. ఈ విధముగా ఎమ్పెరుమానార్ల ఉద్ధారకత్త్వము నిరూపించబడెను.
- పెరియవాచాన్ పిళ్ళై వారి మానిక్క మాలై అను గ్రంధమున “ఆచార్య స్ధానము” చాల గొప్పదని; ఎమ్పెరుమానార్లు మాత్రమే ఆ స్ధానమునకు అర్హులని చెప్పెను.
- ఎమ్పెరుమానార్ల ముందు ఆచార్యులు “అనువృత్తి ప్రసన్నాచార్యులు“ అని పిలవబడెని. అనగా వారు శిష్యులచే సేవను పొంది వారు తృప్తి చెందితే వారికి అమూల్యమయిన ఉపదేశములను చేసి వారిని శిష్యులుగ స్వీకరించేవారు. కాని ఎమ్పెరుమానార్లు; కలియుగము యొక్క కష్టములను చూసి; ఆచార్యులు “కృపా మాత్ర ప్రసన్నాచార్యులు” గా ఉండవలెనని ఆదేసించిరి. అనగా ఆచార్యులు పూర్తి కారుణ్యముతో ఉపదేశము పొందాలి అన్న ఉత్సాహము అర్హతగ చూసి శిష్యులను స్వీకరించువారు.
- పితృ లోకమున పితృలు ఏ విధముగనైతే సత్ సంతానము చేత ప్రయోజనము (లాభము/హితము) పొందునో; అలాగే వారి తరువాతి తరముల వారు ఏ విధముగ ప్రయోజనమును పొందురో; అదే విధముగ శ్రీ వైష్ణవ కులము నందు ఎమ్పెరుమానార్లకు ముందు ఉన్న ఆచార్యులు మరియు వారి తరువాతి ఆచార్యులు రామానుజుల రాకతీ హితము పొందెను అని ప్రతీతి.
- వసుదేవుడు/దేవకి, నందగోపుడు/యశోదా మరియు దశరధుడు/కౌసల్య ఏ విధముగ పెరుమాళ్ళకు జన్మనిచ్చుట వలన తరించారో; అదే విధముగ ఎమ్పెరుమానార్లకు ముందు ఆచార్యులు ప్రపన్న కులము నందు ఎమ్పెరుమానార్ల అవతారము చేత పావనమయ్యెను.
- నమ్మాళ్వార్లు, ఎమ్పెరుమానార్ల అవతారమునకు ముందుగానే వారిని దర్శించి పొలిగ పొలిగ పొలిగ పదిగమునందు కీర్తించి భవిష్యదాచార్య (ఎమ్పెరుమానార్) విగ్రహమును నాథమునులకు ప్రసాదించిరి. (నమ్మాళ్వార్ అనుగ్రహమువలన మధురకవి ఆళ్వార్ తామ్రపర్ణి జలమును మరిగించుట వలన అవతరించిన మరొక భవిష్యదాచార్య విగ్రహము పొందిరి)

భవిష్యదాచార్యులు (విగ్రహము) –ఆళ్వార్ తిరునగరి
- ఈ దివ్యరూపం నాథముని మెదలుకొని ఉయ్యకొండార్ మొదలైనవారి నుండి తిరుకోష్ఠియూర్ నంబి వరకు వచ్చినది. (తామ్రపర్ణి నీటిని మరిగించడం వలన వచ్చిన వేరొక దివ్యరూపమును తిరువాయ్మొళి పిళ్ళై మరియు మణవాళమాముని వరకు ఆళ్వార్ తిరునగరి భవిష్యదాచార్య సన్నిధిన ఆరాధింపబడుచున్నది)
- పెరుమాళ్ళు ఏ విధముగనైతే రఘు కులము నందు అవతరించి ఆ కులమును ప్రఖ్యాతి గావించెనొ; అదే విధముగ ఎమ్పెరుమానార్లు ప్రపన్న కులమునందు అవతరించి ఈ కులమును ప్రఖ్యాతి గావించెను అని పెరియ నంబి అనెను.
- ఎంబార్లతో “ఎమ్పెరుమానార్ తిరువడిగళే తంజమ్ మరియు ఎమ్పెరుమానార్లను నాకంటే ఎక్కువగ ధ్యానించు” అని పెరియ తిరుమలై నంబి వారు చెప్పెను.
- తిరుక్కోష్టియూర్ నంబి వారి చరమ రోజులలో వారు రామానుజులతో సంబంధము కలుగుట చేత చాల అద్రుష్టవంతులని చెప్పెను. ఒకనాడు తిరుమాలై ఆండాన్లు రామానుజులతో భేదము కలిగినప్పుడు; తిరుక్కోష్టియూర్ నంబి వారు ఆండాన్లతో ఈ విధముగ అనెను. వారు రామానుజులకు ఏమి కొత్తగ నేర్పించడం లేదని; రామానుజులు సర్వజ్ఞులని చెప్పెను. ఏ విధముగ సాందిపని దగ్గర కృష్ణ పరమాత్మ, వశిష్టుని వద్ద పెరుమాళ్ నేర్చుకొనెనో అదే విధముగ రామానుజులు మన దగ్గర నేర్చుకుంటున్నారు అని చెప్పెను.
- పెరరుళాళన్, పెరియ పెరుమాళ్, తిరువేంకటముడయాన్, తిరుమాలిరుంజోలై అళగర్, తిరుక్కురుంగుడి నంబి మొదలగు వారు ఎమ్పెరుమానార్ల గొప్ప తనము కీర్తించి వారిని ఎమ్పెరుమానార్ల మీద మాత్రమే ఆధారపడమని చెప్పెను.
- అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్, ఆళ్వాన్, ఆండాన్, వడుగ నంబి, వంగి పురతు నంబి, భట్టర్, నడాతూర్ అమ్మాళ్, నంజీయర్, నంపిళ్ళై మరియు చాల మంది ఆచార్యులు వారి శిష్యులకు ఎమ్పెరుమానార్ల తిరువడి మాత్రమే ధ్యానించమని, శరణు పొందమని చెప్పెను.
- మన పూర్వాచార్యులు అందరు మనకి ఎమ్పెరుమానార్లు మాత్రమే ఉపాయముగ మరియు ఉపేయముగ ధ్యానించాలి అని ఆదేశించెను. దీనినే చరమోపాయ నిష్ఠ లేక అంతిమోపాయ నిష్ఠ అని అందురు.
- కూరత్తాళ్వాన్లు తిరువరంగత్తాముదనార్లను సంస్కరించాక; వారు ఎమ్పెరుమానార్ల యందు గొప్ప ప్రీతిని పొందిరి. వారి భావమును వారి ప్రబంధము (రామానుశ నూఱ్ఱందాది) యందు పొందుపరిచిరి. రామానుజుల వైభవమును పతాక స్ధాయిలో చక్కగ రచించబడెను. ఈ ప్రబంధము రామానుజులు శ్రీ రంగమున ఉన్న సమయములో కూర్చబడింది. నంపెరుమాళ్ వారి ఉరేరిగింపు పురప్పాడు) సమయమున వారి ముందు కవితాగానము వాద్యములు లేకుండ చేయవలసినదిగ ఆదేశించెను. (సాధారణముగ వాద్యములు ఉండును). మన పూర్వాచార్యులు ఎమ్పెరుమానార్ల వైభవమును; మన సాంప్రదాయమునకు వారి తోడ్పాటు తెలిసినవారై ఈ ప్రబంధమును 4000 దివ్య ప్రబందములలో చేర్చిరి.ఈ ప్రబంధమే ప్రపన్న గాయత్రిగా ప్రసిద్ధి పొందెను. శ్రీ వైష్ణవులు తప్పక రోజుకి ఒకసారి అయిన పఠించవలెను.
- మనవాళ మాముణులు వారి ఉపదేశ రత్న మాలైలో మన సాంప్రదాయమును “ఎమ్పెరుమానార్ దరిశనం” అని నంపెరుమాళ్ స్వయంగ నామకరణము చేసినట్లుగా వివరించెను. రామానుజులు స్వయంగ సంసారములో చిక్కుకున్న వారికి ఉపదేశమును కారుణ్యముతో ప్రసాదించి వారిని ఉద్ధరించుటయెగాక; 74 సింహాసనాధిపతులను నియమించి మన సనాతన ధర్మమును ప్రచారము చేసి అందరికీ తెలుసుకోవాలనే కోరికను అర్హతగ చూసి అనుగ్రహీంచవలసినదిగా ఆదేశించెను.
రామానుజుల వైభవమును సంక్షేపముగ చెప్పుట సాధ్యమే కాని; వారి వైభవము అనంతము. వారు వారి 1000 ముఖములతో (ఆదిశేషుడు) కూడ; వారి వైభవమును కీర్తించలేరు. అలాంటిది; మన లాంటి వారి వల్ల సాధ్యపడదు అను చెప్పుటలో అతిశయోక్తి లేదు. మనము కేవలం వారి వల్లన ఏమి భాగ్యమును పొందామొ చెప్పుకొని ఆనందమును పొందుట తప్ప మనము వారి వైభవమును పూర్తిగ కీర్తించలేము. అది అసాధ్యము.
ఎమ్పెర్మానార్ల తనియన్:
యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మ రుక్మ
వ్యామోహతస్ తదితరాణి తృణాయ మేనే
అస్మద్గురోర్ భగవతోస్య దయైకసింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే
సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాస
మూలము: https://guruparamparai.wordpress.com/2012/09/06/emperumanar/
పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
Pingback: ఎంబార్ | guruparamparai telugu
Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu
Pingback: శ్రీవైష్ణవ తిరువారాధనము | srIvaishNava granthams – Telugu
Pingback: తిరుక్కచ్చి నంబి | guruparamparai telugu
Pingback: 2014 – May | kOyil
Pingback: 2014 – May – Week 3 | kOyil
Pingback: erumbi appA | guruparamparai telugu
Pingback: ఎరుంబి అప్పా | guruparamparai telugu
Pingback: ఆండాళ్ (గోదా దేవి) | guruparamparai telugu
Pingback: మధురకవి ఆళ్వార్ | guruparamparai telugu
Pingback: appiLLai – అప్పిళ్ళై | guruparamparai telugu
Pingback: అప్పిళ్ళార్ | guruparamparai telugu
Pingback: పెరియ తిరుమలై నంబి | guruparamparai telugu
Pingback: కోయిల్ కన్దాడై అప్పన్ | guruparamparai telugu
Pingback: శ్రీ పెరుమ్బుదూర్ ఆది యతిరాజ జీయర్ | guruparamparai telugu
Pingback: తిరుక్కోష్టియూర్ నంబి | guruparamparai telugu
Pingback: mARanEri nambi | guruparamparai telugu
Pingback: అప్పాచియారణ్ణ | guruparamparai telugu
Pingback: అప్పన్ తిరువేంకట రామానుజ ఎమ్బార్ జీయర్ | guruparamparai telugu
Pingback: ప్రతివాది భయంకరం అణ్ణన్ | guruparamparai telugu
Pingback: తిరుమంగైఆళ్వార్ | guruparamparai telugu
Pingback: పరవస్తు పట్టర్పిరాన్ జీయర్ | guruparamparai telugu
Pingback: పెరియాళ్వార్ | guruparamparai telugu
Pingback: కూరత్తాళ్వాన్ | guruparamparai telugu
Pingback: ముదలియాణ్డాన్ | guruparamparai telugu
Pingback: సోమాసియాణ్డాన్ | guruparamparai telugu
Pingback: కోయిల్ కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్ | guruparamparai telugu
Pingback: కిడాంబి ఆచ్చాన్ | guruparamparai telugu
Pingback: వడుగ నంబి | guruparamparai telugu
Pingback: వంగి పురత్తు నంబి | guruparamparai telugu
Pingback: 2015 – Feb – Week 1 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc
Pingback: తిరువరంగత్తు అముదనార్ | guruparamparai telugu
Pingback: అమలనాదిపిరాన్ | dhivya prabandham
Pingback: అనంతాళ్వాన్ | guruparamparai telugu
Pingback: వేదవ్యాస భట్టర్ | guruparamparai telugu
Pingback: పిన్భళగియ పెరుమాళ్ జీయర్ | guruparamparai telugu
Pingback: నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ | guruparamparai telugu
Pingback: అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ | guruparamparai telugu
Pingback: నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై | guruparamparai telugu
Pingback: అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ | guruparamparai telugu
Pingback: తిరునారాయణ పురత్తు ఆయ్ జనన్యాచార్యులు | guruparamparai telugu
Pingback: తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ | guruparamparai telugu
Pingback: కణ్ణినుణ్ శిరుతాంబు | dhivya prabandham
Pingback: ఎంగళాళ్వాన్ | guruparamparai telugu
Pingback: కూర నారాయణ జీయర్ | guruparamparai telugu
Pingback: కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 2 – నావినాల్ | dhivya prabandham