ఆళవందార్

 

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలొ మనం మణక్కాల్ నంబి గురించి తెలుసుకున్నాం , ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

ఆళవందార్, కాట్టుమన్నార్ కోవెల

ఆళవందార్, కాట్టుమన్నార్ కోవెల

తిరు నక్షత్రం  : ఉత్తరాషాడ నక్షత్రం ,ఆషాడ మాసం
అవతారస్థలం  :కాట్టుమన్నార్ కోయిల్ (వీరనారాయణపురం)

ఆచార్యులు: మణక్కాల్ నంబి

శిష్యులు:   పెరియ నంబి, పెరియ తిరుమలై నంబి, తిరుక్కోట్టియూర్ నంబి,తిరుమాలైఆన్డాన్, దైవవారి ఆన్డాన్, వానమామలైఆన్డాన్,ఈశ్వర్ ఆన్డాన్,జీయర్ ఆన్డాన్, ఆళవందార్ ఆళ్వాన్, తిరుమోగూరప్పన్, తిరుమోగుర్ నిన్ఱర్,దేవపెరుమాళ్, మారనేరి నంబి, తిరుక్కచ్చి నంబి, తిరువరంగ పెరుమాళ్ అరయర్( మణక్కాల్ నంబి శిశ్యులు మరియు ఆళవందారుల కుమారుడు), తిరుక్కురుగూర్ దాసర్, వకుళాభరణ సోమయాజియార్, అమ్మన్గి, ఆళ్కొణ్డి, గోవిన్ద దాసర్( వడమధురై లో ఙన్మించారు), నాదముని దాసర్ ( రాజ పురోహితుడు), తిరువరంగత్తమ్మన్ (రాజ మహిషి).

శ్రీ సూక్తి గ్రంథములు: చతుశ్లోకి, స్తోత్త్రరత్నం, సిద్ది త్రయం, ఆగమ ప్రామణ్యము, గీతార్త సంగ్రహము.

పరమపదించిన ప్రదేశం : శ్రీ రంగం.

యమునైతురైవన్ కాట్టుమన్నార్ కోవెలనందు ఙన్మించిరి. వారు ఆళావందార్ అనే నామముతో ప్రసిద్దిగాంచారు. వారికి గల మరో నామములు పెరియముదలియార్ , పరమాచార్యర్, వాదిమతేభ సింహేన్ద్రర్.

వీరు ఈశ్వర మునులకు కుమారులు మరియు నాధమునులకు మనుమడు.వీరు సామాన్య శాస్త్రమ్ అనే విద్యను మహాభాశ్య భట్టర్ వద్ద అభ్యంసించిరి. ఆ సమయములో, ఆక్కిఆళ్వాన్ ( రాజ పురోహితుడు) తన ప్రతినిదిని రాజ్యంలోని మిగతా పండింతులందరు తనకు శిస్తు కట్టవలెనని పంపిరి.(తనుముఖ్య పండితుడు కాబట్టి). ఆ వార్త విని మహాభాశ్య భట్టర్ కలతచెందడము చూచి, యమునైతురైవన్ తను ఆ సమస్యను పరిష్కంచగలని చెప్పిరి. వారు ఒక శ్లోకమును అందులో ” ఎవరైతే చవకబారు ప్రచారం కొరకు ప్రయత్నిస్తారో వారిని నిర్మూలించెదను” అని రాసి వారి వద్దకి పంపిరి. ఆక్కిఆళ్వాన్ అది చూచి కోపంతో తన సైనికులను, యమునైతురైవన్ ని రాజ్యసభకు తీసుకురమ్మని పంపిరి. అప్పుడు యమునైతురైవన్ తనకి సరియగు గౌరవం ఇస్తే వస్తానని చెప్పెను. అప్పుడు రాజు పల్లకి పంపగా యమునైతురైవన్ సభకి వచ్చిరి.

సంవాదము మొదలవుతుండగా, రాణి, రాజుతో ఈ సంవాదములో తప్పక యమునైతురైవన్ గెలుచునని, ఒకవేళ ఓడిపోతే రాజు పాదదాసిగా ఉంటానని చెప్పింది. అది విని రాజు ఆక్కిఆళ్వాన్ తప్పకుండా వాదంలో గెలుస్తాడని విశ్వసం వ్యక్తం చేసి అలా జరగని పక్షంలో తన అర్థ రాజ్యముని ఇస్తానని చెప్పెను.

అక్కిఆళ్వాన్ తన వాద ప్రతిభయందు చాలా విశ్వాసముతో , యమునైతురైవన్ ఏ ప్రశ్న అడిగినా దానిని ఖండించగలను అని చెప్పిరి. యమునైతురైవన్ క్రింది 3 ప్రశలను అడిగిరి.

1. అక్కిఆళ్వాన్ ( రాజపురోహితుడు) తల్లి గొడ్రాలు.
2. ఈ రాజు సార్వభౌముడు కాడు.
3. రాజ పత్ని పతివ్రతకాదు.

ఇవి విని అక్కిఆళ్వాన్ నోట మాటరాలేదు. రాజు గారి భయము వలన ఏ ప్రశ్నను ఖండించలేకపోయెను. కాని యమునైతురైవన్ చాల సులభముగ వాటికి సమాదానము చెప్పిరి.

1.ఒక సంతానము కలిగిన తల్లి గొడ్రాలికింద వచ్చును( సామాన్య శాస్త్రము ద్వారా).

2.సార్వభౌముడనగా ప్రపంచము మొత్తమునకు పరిపాలించవలెను,కాని  వీరు ఈ రాజ్యమునకే రాజు.

3. వివాహము శాస్త్ర ప్రకారము జరుగును, పెళ్ళి కూతురు మొదటగ దేవతలకు కొన్ని ముఖ్య మంత్రముల ద్వారా అర్పించబడును భర్తకంటె మొదలు, అందువలన తను ప్రతివత కాదు.

అక్కిఆళ్వాన్ యమునైతురైవన్ యొక్క శాస్త్ర ప్రావీణ్యమును అర్థం చేసుకొని చివరకు వాదములో ఓడిపోయెను, వాదంలో యమునైతురైవన్ శాస్త్రముద్వార ఇచ్చిన గొప్ప వివరణతో విశిష్టాద్వైత సిద్దాంతమును స్తాపించిరి. అలాగే వారు యమునైతురైవన్ కి శిశ్యులుగా మారిరి. అప్పుడు రాణి వారిని “ఆళవందార్”( ఎవరైతే తనను పాలించుట/ రక్షించుట కు వచ్చిన వారు) అని పిలిచిరి అలాగే ఆమె శిష్యురాలిగా చేరిరి. రాజు తన అర్థరాజ్యమును ఇచ్చిరి.

గత సంచికలో మణక్కాల్ నంబి, ఆళావందర్లను తిరిగి శ్రీ రంగమునకు తీసుకురావడము వారిని మన సాంప్రాదాయమునకు ఆచార్యునిగ ఎలా తీర్చిదిద్దారో చూసాము. వారు శ్రీ రంగమునకు వచ్చిన పిదప సన్యాశ్రమము స్వీకరించి సాంప్రదాయమును విస్తరించిరి. ఎంతో మంది వారికి శిశ్యులుగా మారిరి.

ఒకసారి మణక్కాల్ నంబి, ఆళవందార్లను కురుగై కావలప్పన్ దగ్గరికి వెళ్ళి అష్టాంగ యోగ రహస్యమును అభ్యసించమని ఆఙ్ఙాపించారు. వారు అక్కడికి వెళ్ళగా, కురుగై కావలప్పన్ యోగము ద్వారా భగవద్ అనుభవములోనిమగ్నమైనారు. కాని వారు ఆళవందార్ల రాకని గుర్తించి వారితో ఎమ్పెరుమానులు మీ భుజస్కందములందు యోగమును చూడాలని ఆశిస్తున్నారు, ఎందుకనగ మీరు నాధమునుల వంశంనకు చెందినవారు , నాధమునుల వంశము అనిన ఎమ్పెరుమాన్లకు ఎంతో ప్రీతి అని చెప్పి ఒక రోజు యోగ రహస్యమును నేర్చుకొనుటకు ( వారు ముందుగా అనుకొనిన ప్రకారము సంసారము నుండి పరమపదమునకు చేరు విశయములో) ఆళవందార్లని రమ్మని చెప్పిరి. కాని ఆ రోజునే వారు తిరువనంతపురమును దర్శించుటకు వెళ్ళి వెంటనే యోగ రహస్యమును నేర్చుకొనుటకు వెళ్ళడమునకు సమయము దాటిపొయెనని గుర్తించిరి.

ఆ సమయములో వారి శిశ్యులైన దైవవారిఆన్డాన్, ఆచార్య ఎడబాటుని సహించలేక తిరువనంతపురమునకు బయలుదేరగ అక్కడనుండి ఆళవందార్ శ్రీ రంగమునకు తిరుగుప్రయాణమైరి.వారిద్దరు తిరువనంతపురము ముఖద్వారము దగ్గర కలుసుకొనిరి. దైవవారిఆన్డాన్ వారి ఆచార్యులను సేవించి చాలా సంతోశము చెంది వారితో తిరుగు ప్రయాణమవ్వగా ఆళవందార్ వారిని అనంతశయన పెరుమాళ్ళను దర్శించుకోమనగా అప్పుడు వారు పెరుమాళ్ళకన్న మీరే మాకు ముఖ్యమనిరి, అది వారి ఆచార్య భక్తి.

ఆళవందార్ తిరిగి శ్రీ రంగమునకి చేరి వారి తదుపరి ఎవరికి ఈ సాంప్రాదయ భాద్యతలు అప్పగించవలనని కలతచెందుతుండగా, అప్పుడు వారు ఇళయాళ్వార్ లని( శ్రీ రామానుజులు) గుర్తించిరి. అప్పుడు వారు కాంచిపురములో యాదవ ప్రకాశుల వద్ద విద్యను అభ్యసించుచున్నారు. వారు కాంచిపురమును దర్శించి , కరియమాణిక్క పెరుమాళ్ళ సన్నిది ఎదురుగ ఇళయాళ్వార్ ఆ సమయములో అక్కడనుండి వెల్లుచుండగా దైవ కటాక్షమును ప్రసాదించిరి. ఆళవందార్లు దేవ పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎమ్పెరుమాన్ ని ఇళయాళ్వార్లని వారి తదుపరి సాంప్రాదయమునకు ఆచార్యులుగా చేయమని శరణాగతి చేసిరి.అలా ఆళవందార్ చెట్టు విత్తనము నాటి మహా వృక్షమును చేసిరి, అదే ‘ఎమ్పెరుమానార్ దర్శనం’. ఆళవందార్, తిరుక్కచ్చి నంబిని ఇళయాళ్వర్ల ఆద్యాత్మిక అభివృద్దికై సహయపడమనిరి.

ఆళవందార్లు అనారోగ్యముతో ఉండగా,వారి శిశ్యులందరిని తిరువరంగ పెరుమాళ్ అరయర్ పై ఆదారపడమని చెప్పిరి.చరమదశలో ఉండగా వీరు కూడా చాలా ముఖ్యమైన సూచనలు చేసిరి. వాటిలో కొన్ని విలువైనవి…

1. దివ్య దేశములే మన జీవితము, మనము తప్పక కొంత సమయము వాటి గురించి ఆలోచించి కైంకర్యము చెయవలెను.

2. మనము తప్పక తిరుప్పాణాళ్వర్ని ఆరాధించవలెను( తిరుపాదము నుండి తిరుముఖము వరకు), పెరియ పెరుమాళ్ శ్రీ చరణములందు వారు ఉందురు. వారు ఇంకా ఇలా చెప్పారు, వారు ఎల్లప్పుడు తిరుప్పాణాళ్వర్ల గురించి ఆలోచించేవారు వారే ( తిరువరంగ పెరుమాళ్ అరయర్ ఎల్లప్పుడు వారినే ఆరాధించేవారు) ఉపాయము మరియు ఉపేయమని. అలానే వారు తిరుప్పాణాళ్వార్( పెరియ పెరుమాళ్ళ గురించి పాడిరి), కురుమ్బరుత్త నంబి(తిరువేంగడ పెరుమాళ్ళకి మట్టి పూలని సమర్పించిరి) మరియు తిరుక్కచ్చి నంబి( దేవరాజ పెరుమాళ్ళకు తిరువాల వట్ట కైంకర్యము చెసిరి) మద్య సామ్యాలను పోల్చేవారు.

3. ప్రపన్నులు ఎప్పుడు కూడ తన ఆత్మయాత్ర( భగవత్ విశయము) గురించి కాని దేహ యాత్ర (లౌకికము) గురించి చింతింపకూడదు. ఆత్మ ఎప్పుడూ ఎమ్పెరుమాన్ కి అత్యన్త పరతన్తన్, ఎమ్పెరుమాన్ ఆత్మయాత్ర గురించి చూసుకొనును. అలానే దేహము కర్మ ద్వారా నడుచును, మన పుణ్యము/ పాపములు మన దేహ యాత్ర గురించి చూసుకొనును. అందువలన మనము వాటి గురించి చింతించకూడదు.

4. మనము ఎప్పుడు భాగవత అపరాదము చెయరాదు, వారిని ఎప్పుడు ఎమ్పెరుమాన్తో సమానముగా గౌరవించవలెను.

5. ఎమ్పెరుమానుల శ్రీ చరణ తీర్థమును ఎలాగైతే స్వీకరిస్తామో అలానే ఆచార్య శ్రీపాద తీర్థమును స్వీకరించవలెను.

6. ఎల్లప్పుడు మనము( ఆచార్య పురుషులు) శ్రీపాద తీర్థమును ఇతరులకు ఇస్తున్నప్పుడు, గురుపరంపరలోని ప్రతినిదిగా, వాక్యగురుపరంపరను/ ద్వయమంత్ర అనుసంధానము చేస్తూ ఇవ్వవలెను.

చివరగా వారు తమ శిశ్యులని మరియు ఇతర శ్రీ వైష్ణవులందరిని తమ ఎదుట చేరమని, వారిని తన కర్తవ్య నిర్వహణలో ఏమైనా తప్పు జరిగినచో క్షమించమని అడిగి, వారికి శ్రీపాద తీర్థమును అనుగ్రహించి , తధీయారాదనముచేసి వారి చరమ తిరుమేనిని వదిలి పరమపదము చేరిరి. వారి శిశ్యులందరు బాదతో వారి చరమకైంకర్యమునకు గొప్పగా ఏర్పాట్లు చేయసాగిరి. ఎవరైన శ్రీ వైష్ణవులు పరమపదము చేరితే అది వరముగా భావించి వారికి చాలా వైభవముగా చరమ కైంకర్యమును నిర్వహించుందురు. చరమ కైంకర్యములో తిరుమంజనము, శ్రీ చూర్ణపరిపాలనము, అలంకారము, బ్రహ్మరథము మొదలైనవి, ఇవి అన్ని చాలా వివరముగా మనము ఆళవందార్ల మరియు ఇతర ఆచార్యుల విశయములలో చూడవచ్చు.

ఇలా ఉండగా, పెరియ నంబి కాంచిపురమునకు ఇళయాళ్వర్లని తమతో శ్రీ రంగమునకు తీసుకురావడము కొరకు వెళ్ళిరి. అప్పుడు ఇళయాళ్వర్ దేవపెరుమాళ్ తీర్థ కైంకర్యమునకై సాలై కిణరు బావి దగ్గరికి వెళ్ళిరి, పెరియ నంబి బిగ్గరగా ఆళవన్దార్ల స్త్రోత్రరత్నమును బిగ్గరగా పఠిస్తుండగా, అది విని వాటి లోతైన అర్థములను గ్రహించి, ఇళయాళ్వర్ పెరియ నంబిని ఆ శ్లోకములను ఎవరు రచించిరి అని అడిగిరి. అప్పుడు పెరియ నంబి ఆళవన్దార్ల గొప్పతనమును గురించి చెప్పి, తమతో పాటు ఇళయాళ్వర్లని శ్రీ రంగమునకు రావలసినదిగా కోరిరి. ఇళయాళ్వర్ వారి కోరికని మన్నించి, దేవ పెరుమాళ్, తిరుక్కచ్చి నంబిల ఆఙ్ఙను తీసుకొని శ్రీ రంగమునకు బయలుదేరిరి. వారు శ్రీ రంగ సమీపమునకు చేరుతుండగా, ఆళవందార్ల చరమ యాత్ర్రని చూసి పెరియనంబి క్రిందపడి ధు:ఖించుచుండగా, ఇళయాళ్వర్ అక్కడ ఉన్న శ్రీవైష్ణవులని విచారించి, ఏమి జరిగినదో అర్థముచేసుకొనిరి.

ఆ సమయములో, ఆళవందార్లకు చివరి కైంకర్యము మొదలవుచుండగా, ప్రతి ఒక్కరు వారి చేతి వేళ్ళలో మూడు వేళ్ళు ముడుచుకొని ఉండడము గమనించగా, ఇళయాళ్వర్ దాని కారణము అడుగగా, శ్రీ వైష్ణవులు ఆళవందార్ల 3 తీరని కోరికల గురించి చెప్పిరి. అవి:

1. వ్యాస, పరాశర ఋషుల ఉపకారమునకు మనము క్రుతఘ్నతని చూపవలెను.

2. నమ్మాళ్వార్లయందు మన ప్రేమను చూపవలెను.

3. వ్యాస మహర్షి బ్రహ్మసూత్రములకు, విశిష్టాద్వైత పరముగా శ్రీ భాష్యమును రాయవలెను.

అవివిని , ఇళయాళ్వర్ వెంటనే ఆ మూడు కోరికలను తను పూర్తిచేయుదనని ప్రమాణముచేయగా ఆళవందార్ల వేళ్ళు తెరుచుకొనెను. అక్కడ గుమికూడిన శ్రీ వైష్ణవులు అది చూచి ఆనందపరవశులై , ఆళవందార్ల కృప మరియు శక్తి పూర్తిగా వీరియందు ఉండెనని, మన దర్శన నిర్వహణకై వీరు వచ్చెననిరి. అన్ని కైంకర్యములు పూర్తైన పిమ్మట, ఇళయాళ్వర్ ఆళవందార్లని ఇక లేరనే బాదతో నమ్పెరుమాళ్ళని దర్శించకుండానే కాంచీపురమునకు తిరిగివచ్చిరి.

ఆళవందార్లు ఉభయ వేదాంతములలో గొప్ప పండితులు. మనము చాలా సులభముగా శ్రీ సూక్తులని వారి గ్రంథములను నుండి అర్థముచేసుకోవచ్చును.

* పిరాట్టి తత్వ వైభవమును చతుశ్లోకి లోని 4 శ్ళోకముల ద్వారా వివరించిరి.

*స్త్రోత్రరత్నము నిజముగా ఒక రత్నము- శరణాగతి యొక్క భావమును (తిరువాయ్ మొజిలో వివరించిన విదముగా) చాలా సులభమైన శోకముల ద్వారా వివరించిరి.

*గీతార్థ సంగ్రహము ద్వారా గీతలోని తత్వమును వెలికితీసిరి.

* ఆగమ ప్రామణ్యము , శ్రీ పాంచారాత్ర ఆగమము యొక్క ప్రాముఖ్యతని, ప్రాబల్యమును గుర్తించిన మొదటి గ్రంథము.

ఆళవందార్ తనియన్ :

యత్ పదామ్భోరుహ ద్యాన విద్వస్తా శేశ కల్మశ: !
వస్తుతాముపయా దోహమ్ యామునేయమ్ నమామితమ్. !!

మన తదుపరి సంచికలో పెరియనంబి వైభవమును తెలుసుకుందాము.

అడియేన్ :
రఘు వంశీ రామానుజదాసన్.

source:

Advertisements

18 thoughts on “ఆళవందార్

 1. Pingback: పెరియ నంబి | guruparamparai telugu

 2. Pingback: పరాశర భట్టర్ | guruparamparai telugu

 3. Pingback: తిరువాయ్ మొజి పిళ్ళై | guruparamparai telugu

 4. Pingback: అజగియ మణవాళ మామునిగళ్ | guruparamparai telugu

 5. Pingback: తిరుక్కచ్చి నంబి | guruparamparai telugu

 6. Pingback: కురుగై కావలప్పన్ | guruparamparai telugu

 7. Pingback: పెరియ తిరుమలై నంబి | guruparamparai telugu

 8. Pingback: తిరుక్కోష్టియూర్ నంబి | guruparamparai telugu

 9. Pingback: mARanEri nambi | guruparamparai telugu

 10. Pingback: 2014 – Aug – Week 2 | kOyil

 11. Pingback: పరవస్తు పట్టర్పిరాన్ జీయర్ | guruparamparai telugu

 12. Pingback: కిడాంబి ఆచ్చాన్ | guruparamparai telugu

 13. Pingback: వేదవ్యాస భట్టర్ | guruparamparai telugu

 14. Pingback: పెరియవాచ్చాన్ పిళ్ళై | guruparamparai telugu

 15. Pingback: నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై | guruparamparai telugu

 16. Pingback: sri yAmunAchArya (ALavandhAr) | AchAryas

 17. Pingback: అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ | guruparamparai telugu

 18. Pingback: పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ | guruparamparai telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s