నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

తిరునక్షత్రము:  సింహ (శ్రావణ)మాస రోహిణీ నక్షత్రం (యతీంద్ర ప్రవణ ప్రభావంలో చిత్తా నక్షత్రంగా తెలుపబడింది)
అవతార స్థలము: శ్రీరంగం
ఆచార్యులు: పెరియ వాచ్చాన్ పిళ్ళై
శిష్యులు: వాది కేసరి అళగియ మనవాళ జీయర్, శ్రీరంగాచార్యులు, పరకాలదాసులు మొదలైన వారు
పరమపదించిన స్థలం : శ్రీరంగం

రచనలు: చరమోపాయ నిర్ణయం  (http://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html), అణుత్వ పురుషాకారత్వ సమర్థనం, ఙ్ఞానార్ణవం, ముక్త భోగావళి,  ఆళవందార్ కృత చతుఃశ్లోకికి వ్యాఖ్యానం, పెరియ వాచ్చాన్ పిళ్ళై కృత విష్ణుశేషి అను శ్లోకమునకు వ్యాఖ్యానం, తత్త్వత్రయ నిర్ణయం, కైవల్య నిర్ణయం మొదలైనవి.

పెరియవాచ్చాన్ పిళ్ళైగారికి దత్తపుత్రుడు నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై. వీరి అసలు పేరు అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ (సుందర వరరాజాచార్యులు). వీరి శిష్యులగు పరకాల దాసులు రచించిన పరకాల నల్లాన్ రహస్యం అను గ్రంథమున  వీరు సౌమ్యవరేశులుగా వ్యవహరింప బడ్డారు. “రంగరాజ దీక్షితులు” గా మరియు మహా పండితులుగా కూడ వ్యవహరింపబడే వారు. వీరు సత్సాంప్రదాయ స్థాపనకై ప్రామాణికమైన ఎన్నో గ్రంథములను, శ్రీసూక్తులను రాశారు. వీరు పిళ్ళై లోకాచార్యులకు, అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ల సమకాలీనులు.

వీరి రచనలు మన సాంప్రదాయ విషయాలకు సారంగా ఉంటాయి. వీరి చరమోపాయ నిర్ణయం సాంప్రదాయానికి పరాకాష్ఠ, దీనిలో ఎంపెరుమానార్ కు మన సాంప్రదాయమున ఉన్న విశేష స్థానము తెలుపబడింది. వీరి చతుఃశ్లోకి వ్యాఖ్యానములో పెరియ పిరాట్టి (శ్రీ రంగనాయకి) యొక్క పురుషాకార స్వభావమును విస్పష్ఠముగా తెలిపినారు.

ప్రమేయరత్నంలో (వాది కేసరి అళగియ మనవాళ జీయర్ శిష్యులగు యామునాచార్యుల కృతం) నాయనారాచ్చాన్ పిళ్ళై అనుగ్రహించిన ముక్త భోగావళి ని వీరు యుక్త వయస్సులో ఉన్నప్పుడు వ్రాసి పెరియవాచ్చాన్  పిళ్ళై కు నివేదించారు అని ఉన్నది. దీనిలోని విశేషములను గ్రహించిన పెరియవాచ్చాన్  పిళ్ళై దీనిని ప్రశంసించి వీరికి సాంప్రదాయ రహస్యములన్నింటిని విశేషముగా అనుగ్రహించారు.

వాది కేసరి అళగియ మణవాళ జీయర్, శ్రీరంగాచార్యులు, పరకాలదాసులు మొదలైన వారు పెరియ వాచ్చాన్ పిళ్ళై గారి శిష్యులు అయినను భగవద్విషయాన్ని నాయనారాచ్చాన్  పిళ్ళై గారి వద్ద సేవించారు.

ఇంతవరకు మనం నాయనారాచ్చాన్ పిళ్ళై గారి వైభవమును తెలుసుకున్నాము. వీరు బహుముఖ ప్రఙ్ఞా శాలి మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై గారికి అతి సన్నిహితులు. వీరి చరణారవిందముల యందు భాగవతనిష్ఠ మనకు అబ్బాలని ప్రార్థనచేద్దాం.

వీరి తనియన్:

సృత్యర్తసారజనకం స్మృతిబాలమిత్రం
పద్మోల్లసద్ భగవదన్ఘ్రి పురాణబందుం |
ఙ్ఞానాదిరాజం అభయప్రదరాజ సూనుం
అస్మత్ గురుం పరమకారుణికం నమామి ||

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: http://guruparamparai.wordpress.com/2013/04/21/nayanarachan-pillai/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/2012/08/17/introduction-contd/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

2 thoughts on “నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై

  1. Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu

Leave a comment