ఉయ్యక్కొండార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలొ మనం శ్రీమన్ నాథమునుల గురించి తెలుసుకున్నాం , ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

ఉయ్యక్కొణ్డార్- ఆళ్వార్ తిరునగరి

తిరు నక్షత్రం : కృత్తిక నక్షత్రం,చైత్ర మాసం.
అవతారస్థలం : తిరువెళ్ళఱై.
ఆచార్యులు : నాథ మునులు
శిష్యులు : మణక్కాల్ నంబి,తిరువల్లిక్కేణి పాణ్ పెరుమాళ్ అరైయర్,చేట్టలూర్ చెన్డలాన్గార దాసర్, శ్రీ పుణ్డరీక దాసర్, గోమఠమ్ తిరువిణ్ణకరప్పన్, ఉలగపెరుమాళ్ నన్గై

పుణ్డరీకాక్షర్ తిరువెళ్ళఱై(శ్వేత గిరి) అనే దివ్య దేశంలో అవతరించిరి, ఆ దివ్యదేశ పెరుమాళ్ళ పేరునే వీరికి పెట్టిరి. వీరి మరో పేరు పద్మాక్షర్ కాని తుదకు ఉయ్యక్కొణ్డార్ అనే నామంతో ప్రసిద్ది కెక్కారు.

వీరు మరియు కురుగై కావలప్పన్ నాథమునుల శిష్యబృందంలో ముఖ్యులు. నాథమునులు; నమ్మాళ్వార్లు జ్ఞాన శక్తిని ప్రసాదించిన తరువాత తిరిగి కాట్టుమన్నార్ కోవెలకి వచ్చి అక్కడనుండి మన సాంప్రదాయన్ని విస్తరించారు. అష్టాంగ యోగాన్ని కురుగై కావలప్పన్ కి ఉపదేశించారు- దీని ద్వార ఎవరైన భగవత్ గుణములను నిరంతరంగా ఎటువంటి శరీర సంబంధము లేకుండా అనుభవించగలరు. అప్పుడు నాథమునులు ఉయ్యక్కొణ్డార్ ని మీకు అష్ఠాంగ యోగాన్ని ఉపదేశిస్తాము అని అడుగగా- ఉయ్యక్కొణ్డార్ ఇలా చెప్పారు “పినమ్ కిడక్క మనమ్ పునరలామో” అర్థము- లోకంలో ఎందరో సంసారులు అఙ్జానము వలన బాధపడుతుండగా, మనము ఎలా ఒంటరిగా భగవత్ అనుభవించగలము.అది విని నాథమునులు వారి మానవత్వకు మిక్కిలి సంతోషముచెంది వారిని అభినందించారు.నాథమునులు ఉయ్యక్కొండార్ మరియు కురుగై కావలప్పన్ లకు అష్ఠాంగ యోగము మరియు ఆళ్వారుల ప్రబంధముల అర్థములను ఉపదేశించి వాటిని త్వరలో అవతరించే ఈశ్వరమునుల కుమారులకు (నాథమునుల మనమడు) ఉపదేశించమని ఆజ్ఞాపించిరి.

నాథమునుల తరువాత , ఉయ్యక్కొండార్లు దర్శన ప్రవర్తకాచార్యులుగా( సాంప్రాదాయ నిర్వహణ/విస్తరణ భాద్యతలు) ఉండి తన శిష్యపరివారమునకు వైష్ణవసాంప్రదాయ విద్యను ఉపదేశించారు. వీరు పరమపదమునకు చేరే సమయంలో మణక్కాల్ నంబి(వారి ముఖ్య శిష్యులు) మీ తదుపరి సాంప్రదాయ బాధ్యత ఎవరిదని అడుగగా , ఉయ్యక్కొండార్లు వారిని సాంప్రాదాయ బాధ్యతలు స్వీకరించవలసినదిగా ఆఙ్జాపించి వారి పిదప యమునైతురైవర్ ని తదుపరి తరమునకు తయారుచేయవలసినదిగా చెప్పిరి.

ఉయ్యక్కొండారుల తనియన్:

నమ: పంకజ నేత్రాయ నాథ: శ్రీ పాద పంకజే !
న్యస్త సర్వ భరాయ అస్మత్ కుల నాథయ ధీమతే !!

అడియేన్ రఘువంశీ రామానుజదాసన్.

నమ: పంకజ నేత్రాయ నాధ: శ్రీ పాద పంకజే !
న్యస్త సర్వ భరాయ అస్మత్ కుల నాధాయ ధీమతే !!

అడియేన్ రఘువంశీ రామానుజదాసన్.

Source:

5 thoughts on “ఉయ్యక్కొండార్

  1. Pingback: మణక్కాల్ నంబి | guruparamparai telugu

  2. Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu

  3. Pingback: 2014 – May | kOyil

  4. Pingback: 2014 – May – Week 3 | kOyil

  5. Pingback: 2015 – Apr – Week 4 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s