మణక్కాల్ నంబి

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలొ మనము ఉయ్యక్కొండార్ వారి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

మణక్కాల్ నంబి

మణక్కాల్ నంబి – మణక్కాల్

తిరు నక్షత్రం ~: మాఘ మాసము, మఖ నక్షత్రము
అవతారస్థలం ~: మణక్కాల్ ( కావేరి నది ఒడ్డున శ్రీ రంగము వద్ద ఒక గ్రామము)
ఆచార్యులు ~: ఉయ్యక్కొణ్డార్
శిష్యులు ~: ఆళావందార్, తిరువరంగ పెరుమాళ్ అరయర్(ఆళవందార్ వారి కుమారులు),
దైవతుక్కరసు నంబి, పిళ్ళై అరసు నంబి, శిరు పుళ్ళూరుడైయార్ పిళ్ళై, తిరుమాలిరుంశోలై దాసర్, వన్గిపురత్తు ఆయ్చి.

శ్రీ రామ మిశ్రులు మణక్కాల్ నందు జన్మించిరి. వారు తరువాతి కాలములో మణక్కాల్ నంబిగా ప్రసిద్ధి పొందిరి.

మణక్కాల్ నంబి వారి ఆచార్యులు ఉయ్యక్కొణ్డార్లు. నంబి 12 సంవత్సరములు వారి దగ్గర ఉండి వారికి సేవ చేసెను. ఆ సమయమున గురు పత్ని పరమపదించెను. కావున మణక్కాల్ నంబి ఆచార్యుల తిరుమాళిగను ( గృహమును ) మరియు వారి పిల్లలను పదిలముగ చూసుకొనెను.ఒక రోజు, ఆచార్యుని కుమార్తెలు కావేరి నది నుంచి వచ్చుచుండగా వారికి ఒక మురికి నీరుతో ఉన్న ఒక గుంట అడ్డువచ్చెను. వారు అది దాటలేక ఆగిపొయేను. అప్పుడు నంబి వారు దాటుటకు అనుకూలముగా ఆ గుంటకు అడ్డుగా పడుకొనెను. వారు నంబి మీద కాలుమోపి ఆ గుంటను దాటెను.అది విన్న ఉయ్యక్కొణ్డార్లు మిక్కిలి సంతోషించెను. నంబి తిరుముడి ( తల )ని వారి పాద పద్మములతొ అలంకరించెను. వారు నంబిని ఏమి కావాలో అడుగగా, ఆచార్యుడి సేవ ఒక్కటే తనకు కావాలని అది చాలునని చెప్పెను. శిష్యుని నడువడిక/కోరికను చూసి ఆనందము చెందిన ఆచార్యుడు నంబికి మరల ఒకసారి ద్వయ మహా మంత్రోపదేశమును చేసెను. ( ఆచార్యులకు శిష్యుల నడువడి నచ్చినప్పుడు ద్వయ మహా మంత్రోపదేశము చేయుట రివాజు).

ఉయ్యక్కొణ్డార్లు పరమపదించు సమయమున మణక్కాల్ నంబిని తన తరువాతి వారసుడిగా నియమించి; ఈశ్వర ముణి యొక్క తనయుడిని సాంప్రదాయమునకు నాయకుడిగా తీర్చిదిద్దమని ఆదేశించెను.ఈశ్వర మునులు యమునైతురైవర్లను బిడ్డగా పొందెను. వారికి నంబి పంచ సంస్కారములను గావించెను. (అప్పటిలో 11వ రోజున శంక చక్ర లాంఛనము (అగ్ని లేక పుష్పము) నామ కరణం సమయములో చేయుట సాధరణము. శిష్యుడు తిరుమంత్ర అర్థ ఉపదేశము మరియు తిరువారాధనము వయస్సు పక్వము చెందిన పిమ్మట శిష్యుడు నేర్చుకొనును).

యమునైతురైవర్ చాల తెలివి కలవారు. వారే ఆళవందార్లు అయ్యిరి, అర్ధ రాజ్యమును పొంది( ఆ లీలను వారి వైభవమున చుసెదము) ,ఉద్యోగ బాధ్యతలలో మునిగి వారి స్వరూపమును మరిచిపోయిరి. ఒకనాడు నంబి ఆళవందార్లను కలవడానికి వెళ్ళగా అక్కడి సిబ్బంది వారిని అడ్డుకొనిరి.

మణక్కాల్ నంబి ఆళవందార్లను మార్చుటకు పూనుకొనిరి. ఉపాయములో భాగముగ అంతఃపుర వంట వానికి ప్రతి రోజు తూతువళై కీరై ( ఒక ఆకు కూర రకం)ను ఇవ్వసాగెను. ఆళవందార్లకు ఆ కూర బాగ నచ్చసాగెను. ఒకనాడు ఆ కూరలేకపోవడంతొ వారి దాసులను అడుగగా వారు ఈ విధముగ విన్నవించిరి. ప్రతిరోజు ఒక వృద్ధ శ్రీ వైష్ణవుడు ఇచ్చుచుండెనని ఇప్పుడు ఆపివేసెనని తెలియ చేసెను. చివరకు ఎవరో అని ఆరాతీయగా ; అది మణక్కాల్ నంబి అని తెలుసుకొని వారిని అంతఃపురమునకు ఆహ్వానించిరి. వారికి ఉచితాసనము వేసి ధనము కావలనేమొ అని అడుగగా; నంబి ఈ విధముగ చెప్పెను. తన దగ్గర నిజమయిన ధనము (శ్రీ వైష్ణవశ్రీ) కలదని; అది నాథమునులచే సంపాదించబడింది అని, అది ఆళవందార్లకు ఇద్దామనుకుంటున్నట్లు చెప్పెను. అది విన్న ఆళవందార్లు అక్కడి సిబ్బందికి నంబి ఎప్పుడు వచ్చిన వారిని అడ్డుకోవద్దు అని అజ్ఞాపించెను.

మణక్కాల్ నంబి భగవద్గీత పూర్తి అర్ధమును ఆళవందార్లకు బోధించెను.ఆ విధముగా ఆళవందార్లు క్రమంగా వారి పూర్వ స్వరూపమును పొందిరి. పూర్తిగా మారిపొయిన ఆళవందార్లు భగవత్ సాక్షాత్కారమును పొందుటకు సాధనముగా గీతయొక్క సారమును తెలుపమని అడిగెను. అప్పుడు నంబి వారికి చరమ శ్లోక పూర్తి అర్థ మును వివరించెను. తరువాత ఆళవందార్లను నంబి తిరువరంగమునకు కొనిపోయి పెరియ పెరుమాళ్ళా ను ఆరాధింపచేసెను. పెరియ పెరుమాళ్ళ సౌందర్యమును చూసి ఆ నాటి నుండి ఆళవందార్లు ఈ బాహ్య ప్రపంచమును, సంసారమును త్యజించెను.

ఆచార్యుని కోరిక తీర్చిన పిమ్మట మణక్కాల్ నంబి ఎంతో ఆనందముగా పరమపదమునకు బయలుదేరెను. వారు ఆళవందార్లకు ఎల్లప్పుడు నాధమునులను ధ్యానించమని మన సాంప్రదాయమును కాపాడుతు ప్రచారము చేయమని ఆదేశించెను. అదే విధముగా మన సాంప్రదాయ ప్రవర్తకుడుగా ఒకరిని గుర్తించమని వారికి ఆదేశించెను. ఆ తరువాత ఆళవందార్లు ఎమ్పెరుమానార్లను గుర్తించుట వారు మన సాంప్రదాయ ప్రవర్తకుడుగా ప్రసిద్ధి పొందుట మనకు తెలిసినదే. .

మణక్కాల్ నంబి తనియన్ ~:

అయత్నతో యామున మాత్మదాసం అలర్క పత్రార్పణ నిష్క్రయేణ
యఃక్రీతవా నాస్ధితయౌవరాజ్యం నమామి తమ్ రామమేయసత్త్వమ్

రామానుజ తిరువడిగళే శరణమ్
జై శ్రీమన్నారాయణ

అడియేన్ .!

సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాస

Source

Advertisements

5 thoughts on “మణక్కాల్ నంబి

  1. Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu

  2. Pingback: కురుగై కావలప్పన్ | guruparamparai telugu

  3. Pingback: వంగి పురత్తు నంబి | guruparamparai telugu

  4. Pingback: 2015 – Mar – Week 1 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc

  5. Pingback: srI rAma misra (maNakkAl nambi) | AchAryas

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s