శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
క్రితం సంచికలో మనం నమ్మాళ్వార్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల గురించి తెలుసుకొందాం.

నాథమునులు, కాట్టుమన్నార్ కోయిల్
తిరునక్షత్రం : జ్యేష్ఠ మాసం, అనురాధా నక్షత్రం .
అవతారస్థలం : కాట్టుమన్నార్ కోయిల్ (వీర నారాయణపురం)
ఆచార్యులు: నమ్మాళ్వార్
శిష్యులు: ఉయ్యక్కొండార్, కురుగై కావలప్పన్, పిళ్ళై కరుణాకర దాసర్, నంబి కరుణాకర్ దాసర్, యేరు తిరువుడైయార్, తిరుక్కణ్ణమంగై ఆన్డాన్, వానమామలై దైవనాయక ఆణ్డాన్, ఉరుప్పట్తూర్ ఆచ్ఛాన్ పిళ్ళై, చోగత్తూర్ ఆళ్వాన్, కీళైఅగత్తానాళ్వాన్, మేళైఅగత్తానాళ్వాన్ మొదలైనవారు.
శ్రీసూక్తి గ్రంథములు: న్యాయ తత్త్వం, యోగ రహస్యం , పురుష నిర్ణయం.
శ్రీమన్నాథమునులు వీరనారాయణపురంలో ఈశ్వరభట్టాళ్వారునకు జన్మించారు. వీరికి రంగనాథముని మరియు నాథబ్రహ్మర్ అని నామధేయములు కలవు. వీరు అష్టాంగ యోగం మరియు దేవగానంలో నిష్ణాతులు. వీరే అరయర్ సేవని దివ్య దేశములలో ప్రవేశ పెట్టారు. ఇప్పటికి మనం శ్రీరంగం, ఆళ్వార్ తిరునగరి మరియు శ్రీవిల్లిపుత్తూర్ లలో సేవించ వచ్చును.
నాథమునులు తమ తండ్రి మరియు కుమారునితో (ఈశ్వరమునులు) కలసి మధుర, బృందావనం, గోవర్ధనగిరి, ద్వారక, బదరికాశ్రమం మరియు నైమిశారణ్యం మొదలగు దివ్యదేశములను సందర్శించిరి. వారు గోవర్ధనపురం అనే ఊరిలో యమునా తీరమున ఉన్నప్పుడు భగవానుడు నాథమునులకు రాత్రి కలలో సాక్షాత్కరించి కాట్టుమన్నార్ కోయిల్ కి తిరిగి వెళ్ళమని ఆదేశించిరి. వారు తిరుగు ప్రయాణంలో వారణాసి, పూరి, సింహాచలం, తిరుమల, ఘటికాచలం, కాంచీపురం (చుట్టూర ఉన్న దివ్య దేశములు), తిరువహీంద్రపురం, తిరుక్కోవలూరు, శ్రీ రంగం మరియు కుంభకోణం మొదలైన దివ్యదేశములు దర్శించి ఆయా దివ్యదేశములలో వేంచేసి ఉన్నపెరుమాళ్ళకు మంగళాశాసనము గావించి చివరికి వీరనారాయణ పురమును చేరుకొన్నారు.
ఒకనాడు ఒక శ్రీవైష్ణవ బృందం మేలైనాడు (తిరునారాయణపురము) నుండి కాట్టుమన్నార్ కోయిల్ ను దర్శించి తిరువాయ్మొళిలోని ‘ఆరావముదే‘ అనే పత్తును (పది పాశురములు కల్గినది) కాట్టుమన్నార్ పెరుమాళ్ సన్నిధిన విన్నవించిరి. వాటి అర్థం గ్రహించిన నాథమునులు ఆ శ్రీవైష్ణవ బృందాన్ని ఆ పాశురముల గురించి వాకబు చేసారు. కానీ వారు ఈ పద కొండు పాశురములు తప్ప మరేతర విషయం తమకు తెలియదని చెప్పారు. ఒక వేళ మీరు తిరుక్కురుగూర్ వెళ్ళితే వాటి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు అని చెప్పారు. వెంటనే నాథమునులు ఆళ్వార్ తిరునగరికి చేరి అక్కడ మధురకవి ఆళ్వార్ శిష్య వంశములోని పరాంకుశ దాసులు అనే వారిని కలిసారు. వారు నాథమునులకు “కణ్ణినున్ శిరుత్తామ్బు” అనే ప్రబంధమును ఉపదేశించి దానిని 12 వేల సార్లు తిరుప్పుళి ఆళ్వార్ (చింతచెట్టు)/తిన్త్రిణి చెట్టు (నమ్మాళ్వార్ వేంచేసి ఉన్న స్థలం) ఎదురుగా ప్రార్థించమనిరి. వారు అష్ఠాగయోగం తెలిసినవారు కావున నమ్మాళ్వార్లని ధ్యానించి 12000 వేల సార్లు కణ్ణినుణ్ శిరుత్తామ్బును జపించిరి. నమ్మాళ్వార్ వారి ప్రార్థనకు సంతృప్తి చెంది వారి ఎదుట ప్రత్యక్షమయ్యి అష్ఠాంగయోగము నందు వారికున్న శ్రద్ధను అభినందించి 4 వేల పాశురములు కలిగిన దివ్య ప్రబంధమును వాటి అర్థములను ఉపదేశించిరి. ఏ విధముగా పెరుమాళ్లు నమ్మాళ్వార్లకు జ్ఞాన శక్తి ద్వారా ప్రసాదించారో అదే విధముగా శ్రీనమ్మాళ్వార్లు నాథమునులకు తమ జ్ఞాన శక్తి ద్వారా ప్రసాదించారు. అందుకే మణవాళ మాముణులు తమ ఉపదేశ రత్నమాలలో “అరుళ్ పెత్త నాథముని ముదలాన” అని అనుగ్రహించారు.
ఆ తరువాత నాథమునులు కాట్టుమన్నార్ కోవెలకి తిరిగి వచ్చి మన్నార్ పెరుమాళ్ ముందు 4 వేల దివ్యప్రబంధ పాశురములను విన్నవించారు. ఆ పాశురములను ఆలకించిన మన్నార్ పెరుమాళ్ ముగ్ధుడై దివ్య ప్రబంధాన్నినాలుగు భాగములుగా విభజించి, విస్తరింప చేయుమని ఆఙ్ఞాపించిరి. వారు ప్రబంధానికి రాగ తాళాలను చేర్చి తన మేనళ్లులైన కీళైఅగత్తాళ్వాన్ మరియు మేళైఅగత్తాళ్వాన్లకు నేర్పి దానిని ప్రచారం గావించమనిరి.
నాథమునులు దేవగానంలో నిష్ణాతులు. ఒకసారి ఆ దేశమును పరిపాలించే రాజు సాధారణ గాయకుడికి మరియు దేవగాయకునికి మధ్యన వ్యత్యాసమును గుర్తించలేక నాథమునులు తెలియపరిచారు. రాజు వీరి సామర్థ్యతను ప్రశ్నించగా, వీరు 4 వేల తాళములతో శబ్దము చేయమని చెప్పి వాటి నుండి వచ్చే శబ్ధమును బట్టి ఒక్కొక్క తాళము బరువును చెప్పిరి – ఇది వీరి నైపుణ్యము. అప్పుడు రాజు వారి గొప్పతనమును గుర్తించి చాల ధనమును కానుకగా ఇచ్చిరి. కాని నాథమునులు వాటిని తిరస్కరించిరి.
నాథమునులు తమ యోగ దృష్ఠితో రాబోవు కాలమున ఆళవందార్ (వీరి మనుమనిగా) అవతరిస్తారని గ్రహించి, తమ కుమారులైన ఈశ్వరమునులకు ఆ బాలునికి ‘యమునై తురైవన్’ (కృష్ణ పరమాత్మపై తమకు గల ప్రీతి విశేషం చేత) అనే పేరుని ఉంచమని ఆజ్జాపించిరి. అలాగే తమ శిష్యులందరిని శాస్త్రములన్నింటిని యమునైతురైవన్ కి ఉపదేశించమని నియమించిరి.
నాథమునులు పెరుమాళ్ల ధ్యానంలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయేవారు. ఒకసారి అలా ఉండగా రాజు మరియు అతని భార్యలు నాథమునుల దర్శనార్ధమై వచ్చి ధ్యానంలో ఉండడం చూసి ధ్యాన భంగం కాకుడదని తిరిగి వెళ్ళిపొయ్యారు. కాని నాథమునులు నిర్మలమైన భక్తి ధ్యానములో ఉన్నారు కావున వచ్చిన వారు కృష్ణ పరమాత్మ మరియు గోపికలుగా భావించి వారి వెనుక పరిగెడుతారు.
మరొకసారి రాజు వేట ముగించుకొని తన భార్య, ఒక వేటగాడు మరియు ఒక కోతితో కలిసి నాథమునుల గృహమునకు వస్తారు. వారి కూతురు నాన్నగారు లేరని చెప్పగా వారు తిరిగి వెళ్ళిపోతారు, కొంత సమయానికి నాథమునులురాగా వారి కూతురు రాజు వచ్చిన సంగతిని విన్నవిస్తుంది. తదేకం భగవానుని ధ్యాసలో ఉన్న వీరికి ఆ వచ్చిన వారు స్వయంగా రామసీతాలక్ష్మణహనుమేనని భావించి వారు వెళ్ళిన దిశగా కనిపించేంత వరకు పరిగెడతారు. వారు కనపడక పోయేసరికి అయ్యో అని ముర్చిల్లుతారు. భగవానుడి ఎడబాటును తట్టుకోలేక అక్కడే పరమపదమును అలంకరిస్తారు. ఆ వార్త విన్న ఈశ్వరమునులు మరియు శిష్యులు అక్కడ చేరుకొని చరమ కైంకర్యాన్ని జరిపిస్తారు.
దివ్య ప్రబంధమును తిరిగి మనకు అందించడములో నాథమునుల కృషి లేకపోతే ఈవేళ మనము ‘శ్రీవైష్ణవశ్రీ’ని పొంది ఉండే వాళ్ళము కాదు. ఆళవందార్లు తమ స్తోత్త్ర రత్నంలో నాథమునుల వైభవాన్ని మొదటి 3 శ్లోకాలలో వర్ణిస్తారు.
- ఇతర ప్రాపంచిక విషయములందు వైరాగ్యము, అసాథారణమైన అపరిణామాణాత్మక భగవద్విషయములు యందే లోతైన ఙ్ఞానము కలిగి నిరంతరము భగవంతున్ని ధ్యానము చేయు, భగవంతుని యందు సముద్రము వంటి లోతైన ఙ్ఞానము కలిగిన శ్రీ మన్నాథమునులకు నమస్కరిస్తున్నాను.
- మధుని చంపిన వాని (మధుసూధనుని) పాద పద్మములందును, భగవతత్త్వఙ్ఞానమందును అనురాగమును అధికముగా గల శ్రీమన్నాథమునుల పాద పద్మములే ఇహపరములందు నాకు శరణ్యము.
- అచ్యుతుని యందు అపరిమితమైన భక్తి, నిజమైన జ్ఞానమును కలిగి, అమృత సముద్రమై, ఇతరులను కాపాడుటకు ఈ లోకమున అవతరించినవారై, పరిపూర్ణ భక్తి కలవారై మరియు యోగీంద్రులైన శ్రీ నాథమునులను నమస్కరించుచున్నాను.
- చివర శ్లోకంలో దయ చేసి నన్ను, నేను చేసిన పనులను చూసినచో నన్ను అంగీకరించలేవు, నీ పాద పద్మములందు స్వభావ సిద్ధమైన ప్రేమ కలిగి, ఆత్మ గుణ పరిపూర్ణులగు మా పితామహులగు శ్రీమన్నాధములను చూచి అనుగ్రహింపుము.
పైన చెప్పిన 4 శ్లోకములలో మనం నాథమునుల గొప్పతనమును అర్థం చేసుకొని వారి లాగా మనకు అచ్యుతుడికి మరియు ఆళ్వార్లతో అలాంటి సంబంధం కలిగేలా వృద్ధి చెందాలని శ్రీమన్నాథమునుల శ్రీ చరణాలను ప్రార్థిద్దాము.
స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం |
స్తోత్రయామాస యోగీంద్రః తం వందే యామునాహ్వయం||
యత్పదాంభోరుహ ధ్యానవిధ్వస్తాశేషకల్మషః|
వస్తుతాముపయాతో2హం యామునేయం నమామి తం||
నమో నమో యామునాయ యామునాయ నమో నమః |
నమో నమో యామునాయ యామునాయ నమో నమః |
నాథమునుల తనియన్:
నమో అచింత్యాద్బుత అక్లిష్ట ఙ్ఞానవైరాగ్య రాశయే !
నాథాయ మునయేగాధ భగవద్భక్తి సింధవే !!
అడియేన్ రఘువంశీ రామానుజదాసన్.
మూలము: https://guruparamparai.wordpress.com/2012/08/22/nathamunigal/
పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu
Pingback: నమ్పిళ్ళై | guruparamparai telugu
Pingback: వడక్కు తిరువీధి పిళ్ళై | guruparamparai telugu
Pingback: పిళ్ళై లోకాచార్యర్ | guruparamparai telugu
Pingback: శ్రీవైష్ణవ తిరువారాధనము | srIvaishNava granthams – Telugu
Pingback: కురుగై కావలప్పన్ | guruparamparai telugu
Pingback: 2014 – July – Week 2 | kOyil
Pingback: కోయిల్ కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్ | guruparamparai telugu
Pingback: nAthamunigaL | AchAryas
Excellent srivaishnava website Really so great who posted this article s.
Very much useful to know about acharyas.