Author Archives: raguvamsi

పిళ్ళై ఉరంగా విల్లి దాసర్

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

తిరునక్షత్రము: మాఘ మాసము, ఆశ్లేషా

అవతార స్థలము: ఉఱైయూర్

ఆచార్యులు: ఎమ్పెరుమానార్

పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగము

పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ మరియు వారి దర్మపత్ని పొన్నాచ్చియార్ ఉఱైయూర్ లో నివసించేవారు. దాసర్ ఆ దేశము రాజుగారి కొలువులో గొప్ప మల్లయోదుడు. వారు తమ దర్మపత్ని సౌందర్యముయందు ఎంతో అనుభందమును కలిగిఉండెడివారు (ముఖ్యముగా ఆమె నేత్రములందు).వారికి దనుర్దాసు అను నామముతో కూడా కలదు.వీరు బాగా దనవంతులు మరియు వారికి గల దైర్య సాహసములకు ఆ రాజ్యములో వీరిని అందరు గౌరవించేవారు.

pud-1

ఒకసారి శ్రీ రామానుజులు వారి శిష్యులతో నడుస్తూ ఉండగా,దాసర్ ఒక చేతితో గొడుగును పొన్నాచికి ఎండను తగులకునండగా మరొక చేతో ఆమె యొక్క పాదములకు ఇబ్బంది కలుగకుండా భూమిపై వస్త్రమును పరచుకుంటూ వెళ్ళడమును గమనించిరి . ఎమ్పెరుమానార్ దాసర్ కి ఆ స్త్రీ యందు గల అనుబందమును చూసి ఆశ్చర్యచకితులై వారిని రమ్మని పిలిచెను దాసర్ ని ఆ స్త్రీకి ఎందుకు అలా సేవ చేస్తున్నావని అడిగిరి, అందుకు దాసర్ ఈ విదముగా చెప్పెను ఆమె నేత్రములు చాలా అందముగా ఉండడము వలన ఆమెకు దాసుడను అయ్యెనని చెప్పిరి,ఆ ఆందమును కాపాడుట కొరకు ఏమైనా చేయుదని అని చెప్పెను. ఎమ్పెరుమానార్ వెంటనే తమ చాతుర్యముతో దాసర్ ని ఈ విదముగా అడిగెను, నేను నీ భార్య యొక్క నేత్రముల కన్నా అందమైనది వేరొకటి చూపిస్తే దానికి దాసుడవు అవుతవా అని అడిగెను. ఎమ్పెరుమానార్ అతడిని శ్రీ రంగనాధుని వద్దకి తీసుకెళ్ళి ఎమ్పెరుమాన్ ని వారి యొక్క నేత్ర సౌందర్యమును దాసర్ కి తిరుప్పాణాళ్వారులకు అనుగ్రహించిన విదముగా చూపించమనిరి. ఎమ్పెరుమాన్ సజముగానే అందమైన నేత్రములను కలిగిఉండడముచే వెంటనే దాసర్ సహజ సిద్దమైన అందము ఇదే అని తెలుసుకొని ఎమ్పెరుమానార్ లకు దాసులై అతడిని శిష్యునిగా స్వీకరించమని అభ్యర్తించెను.అతని దర్మపత్ని కూడా ఎమ్పెరుమాన్ మరియు ఎమ్పెరుమానార్ ల గొప్పతనమును తెలుసుకొని వెంటనే ఎమ్పెరుమానార్ లని ఆశ్రయించిరి.ఆ దంపతులు అన్ని బందములను వదిలి శ్రీరంగమునకు వచ్చి ఎమ్పెరుమానార్ మరియు ఎమ్పెరుమాన్ ల సేవ చెస్తూ అక్కడే నివసించిరి. ఎమ్పెరుమాన్ దాసర్ ని పూర్తిగా అనుగ్రహించిరి మరియు ఎల్లప్పుడూ ఎమ్పెరుమాన్ ని వనవాసమునందు లక్ష్మణుడు ఏ విదముగా నిద్రలేకుండా శ్రీ రామునికి సేవ చేసెనో ఆ విదముగా చేయుటచే వారికి పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ అను నామము వచ్చెను.

దాసర్ మరియు పొన్నాచ్చియార్ లు పూర్తి జీవితమును పూర్తిగా ఎమ్పెరుమానార్ మరియు ఎమ్పెరుమాన్ ల కైంకర్యములకు ఉపయోగించిరి. ఒకసారి నంపెరుమాళ్ళ తీర్తవారి (ఉత్సవము చివరి రోజు), ఎమ్పెరుమానార్ గుడి పుష్కరిణి లో నుండి పైకి వస్తూ ,దాసర్ యొక్క చేతిని పట్టుకొనిరి. కొందరు శిష్యులు ఎమ్పెరుమానార్ సన్యాసి అయి ఉండి దాసర్ చేతిని పట్టుకోవడుమును (కారణము అతడి వర్ణము)తప్పుగా బావించిరి. వారు తమ భావమును ఎమ్పెరుమానార్ కు చెప్పగా అప్పుడు ఎమ్పెరుమానార్ దాసర్ మరియు పొన్నాచ్చియారుల గొప్పతనమును ఒక అందమైన సంఘటన ద్వారా తెలుపెను.

ఎమ్పెరుమానార్ వారిని  దాసర్ ల ఇంటికి వెళ్ళి ఆ గృహమునందు గల ఆభరణములను ఎత్తుకురమ్మని చెప్పిరి. వారు దాసర్ ఇంటికి వెళ్ళగా అక్కడ పొన్నాచ్చియార్ పడుకొని ఉండెను. వారు నిశభ్దముగా ఆమె వద్దకి చేరి ఆమె పై గల ఆభరణములను తీయుటకు ఉపక్రమించిరి. పొన్నాచ్చియార్ ఈ శ్రీ వైష్ణవులు వారికి గల బీదతనము వలన ఇలా చేస్తున్నారేమోననని భావించి ఆభరణములను సులభముగా తీయువిదముగా చెసినది.ఒక వైపు వారు పూర్తిచేయగానే ఇంకోప్రక్కన గల ఆభరణములను తీయుటకొరకై అటు తిరిగను . కాని వారు భయముతో అక్కడి నుండి పరిగెత్తి  ఎమ్పెరుమానార్ వద్దకి చేరెను.ఆ సంఘటనలను విన్న తదుపరి, ఎమ్పెరుమానార్ వారిని మళ్ళీ దాసర్ యొక్క గృహమునకు వెళ్ళీ ఏమి జరుగుతుందో గమనించమనిరి.వారు అక్కడికి చేరగానే ,అక్కడ దాసర్ తిరిగి వచ్చి పొన్నాచ్చియార్ తో మాట్లడడమును గమనించిరి. అతను ఆమెను ఒక పైపు గల ఆభరణములు లేవెందులకు అని అడుగగా .ఆమె ఈ విదముగా చెప్పెను కొందరు శ్రీవైష్ణవులు వచ్చి దొంగిలించుచుండగా వారికి వీలుగా ఇంకో వైపునకు గల ఆభరణములను తీయుటనకు వీలుగా తాను తిరుగగా వారు వెళ్ళనని చెప్పెను . ఆ సమయమున , దాసర్ నీవు ఒక రాయి వలె ఉంటె వారికి తోచిన విదముగా తీసుపోయేవాళ్ళు, నీ చర్య వాలన వారు భయముతో వెళ్ళిరి అని విచారపడిరి .వారిద్దరు ఎంతో గొప్పవారగుటచే వారి యొక్క ఆభరణములను దొంగలించినా ఆ విదముగా ఆలోచించెను.ఆ శ్రీవైష్ణవులు తిరిగి  ఎమ్పెరుమానార్ వద్దకి వచ్చి అక్కడ జరిగిన సంఘటనల్ను వివరించి ఆ దంపతుల గొప్పతనమును అంగీకరించెను. మరునాడు ఉదయము ఎమ్పెరుమానార్ దాసర్ నకు జరిగిన విషయమును చెప్పి ఆభరణములను తిరిగి ఇచ్చెను.

దాసర్ మహామతి (గొప్ప వివేకము కలిగిన వారు) గా కీర్తించబడెను .వారు ఎమ్పెరుమాన్ లతో శ్రీ విదురులు మరియు పెరియాళ్వారుల వలె అనుభందమును కలిగిఉండిరి . పొన్నాచ్చియారుల నిర్వాహములు కూడా పూర్వాచార్య శ్రీ సూక్తులయందు కొన్ని సంఘటనలు ద్వారా ఆమె శాస్త్రమునందు గొప్ప పరిజ్ఞానముకలిగినదిగా చెప్పబడెను .

చాలా ఐదిహ్యములు దాసర్ మరియు వారి దర్మపతి గొప్పతనములను మన పూర్వాచార్య శ్రీ సూక్తులందు కలవు.వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాము.

 • 6000 పడి గురుపరంపరా ప్రభావము – ఒకసారి ఎమ్పెరుమానార్  విభీషణ శరణాగతి వివరించుచుండగా. దాసర్  గోష్టిలో నుండి నిలుచొని ఈ విదముగా అడిగిరి “ శ్రీ రాముడు సుగ్రీవ, జాంబవంతులు, మొదలగు వారితో  విభీషణుడిని స్వీకరించమని, అతడు సమస్తమూ వదిలినప్పడికి కూడా,మరి నాకు ఎలా (అతడు ఇంకనూ సంసారము మొదలగు వాటి యందు ఉండడమువలన)  మోక్షము లబించును ?”. ఎమ్పెరుమానార్ ఈ విదముగా సమాదానమును చెప్పిరి “ఒకవేళ నేను మోక్షమును పొందితే,నీకు కూడా లభించును; ఒక వేళ పెరియ నంబి  మోక్షమును పొందితే, నాకూ లభించును; ఒక వేళ ఆళవందార్ మోక్షమును  పొందితే, పెరియ నంబి లకు లభించును;ఆ విదముగా పూర్తి పరమ్పరకునూ లభించును;కారణము నమ్మాళ్వార్ తనకి  మోక్షము లభించెనని దృవీకరించిరి మరియు పెరియ పిరాట్టియార్  ఎమ్పెరుమానుని అందరికీ మోక్షము ఇచ్చేలా కోరినది. ఎవరైతే భాగవత శేషత్వమును కలిగి ఉందురో వారు తప్పక అర్హులు – ఎలాగైతే 4 రాక్షసులు విభీషణుడితో కలిసి రావడముచే శ్రీ రాముడి ఆశ్రయమును పొందిరి కారణాము వారు విభీషణుడి ఆశ్రయించడముచే”.
 • పెరియ తిరుమొజి 2.6.1 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము – దాసర్ ఎమ్పెరుమాన్ యెడల పూర్తి మిక్కిలి అనుబందమును కలిగిఉండిరి( యశోద, పెరియాళ్వార్, మొదలగు వారి వలె) ఇక్కడ ఎలానో చూద్దాము.  నమ్పెరుమాళ్ (శ్రీ రంగనాదన్) పురప్పాడు (తిరువీది)సమయమున, దాసర్ నంపెరుమాళ్ ఎదురుగా తన చేతియందు కత్తిని ఉంచుకొని జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళేవారు .ఒకవేళ ఏ చిన్న ఇబ్బంది నంపెరుమాళ్ళకి కలిగినా, తన కత్తితో తానే స్వయముగా సంహరించుకొనుటకు వీలుగా (ఇక్కడ మనము గమనించవలసిన కారణము,చాలా శ్రద్దతో వారు  నంపెరుమాళ్ళని తిసుకొని వెళ్ళేవారు,అప్పుడు తాను సంహరించుకొనే అవకాశము రాదు). ఈ విదమైన సంభదమును కలిగి ఉండడముచే, దాసర్ ని మహామతి అని వ్యవహరించేవారు.
 • తిరువిరుత్తమ్ 99 – నంపిళ్ళై వ్యాఖ్యానము –ఎప్పుడైనా కూరత్తాళ్వాన్  తిరువాయ్ మొజికి వ్యాఖ్యానమును చెప్పుచుండగా, దాసర్ భావోద్వేగముతో కృష్ణ చరితమును అనుభవించేవారు. ఆళ్వాన్ దాసర్ యొక్క అనుభవపూర్వక గొప్పతనమును గమనించీ ఈ విదముగా చెప్పేవారు. “మేము భగవత్ విషయమును నేర్చుకొని ఇతరులకు వివరించగలము –మీరు ఆ భగవానుడి గురించే ఆలోచిస్తూ ఉండిపోతారు –మీ అలొచనవిదానము చాలా గొప్పది”. ఆళ్వాన్ స్వయముగా  ఎమ్పెరుమాన్ గురించి ఆలొచించేవారు –వారే స్వయముగా దాసర్ గురించి ఈ విదముగా అన్నారంటే మనము ఇక్కడ దాసర్ యొక్క గొప్పతనమును గ్రహించవలెను.
 • తిరువిరుత్తమ్ 9 – నంపిళ్ళై స్వాపదేశము –ఒకసారి ఎమ్పెరుమానార్ శ్రీరంగమును వదిలి  తిరుమలైకి వెళ్లదలిచిరి.ఆ సమయమున ఒక శ్రీవైష్ణవుడిని సామాను భద్రపరచు గదికి వెళ్ళి బియ్యమును తెమ్మని పంపిరి(ఆ గది దాసర్ ఆదినములో ఉండెను) . ఆ వార్త తెలిసిన దాసర్ ఎమ్పెరుమానారుల సాంగత్య ఎడబాటును తలుచుకొని భాదతో గదిలోన దుఖిఃచసాగిరి. ఈ ఘటన వారికి ఎమ్పెరుమానార్ యెడల గల గొప్ప అనుభందమును చుపును. ఆ శ్రీవైష్ణవుడు తిరిగి ఎమ్పెరుమానార్ వద్దకి వచ్చి జరిగిన దానిని చెప్పెను.ఎమ్పెరుమానార్  దాసర్ యొక్క పరిస్థితిని గమనించి వారు కూడా దాసర్ ఎడబాటును వీడి ఉండలేమని చెప్పిరి.
 • తిరువాయ్ మొజి 4.6.6 – నంపిళ్ళై వ్యాఖ్యానము –ఒకసారి దాసర్ ఇద్దరు మేనళ్ళుల్లు (పేర్లు వణ్డర్ మరియు చొణ్డర్) ఒక రాజుతో నడుస్తూ వెళ్తూ ఉండగా దారిలో ఆ రాజు వారికి ఒక జైన మందిరమును చూపి అది విష్ణుమందిరమని చెప్పి వారిని ప్రార్తించమనిరి. నిర్మాణములందు పోలిక ఉండడముచే వెంటనే వారు రాజు చెప్పిన విదముగా చేసెను.కాని రాజు వారిని ఆటపట్టించుటకై ఆ విదముగా చెప్పెననసరికీ వణ్డర్ మరియు చొణ్డర్ వెంటనే  శ్రీమన్ నారాయణుడిని కాక దేవతాంతరమును ఆశ్రయించితిమని సృహని కోల్పోయెను. దాసర్ అది తెలిసిన వెంటనే అక్కడ్కి వెళ్ళి తన పాద దూళిని వారియందు ఉంచగా వెంటనే సృహలోనికి వచ్చెను.ఈ సంఘటన ద్వారా  భాగవతుల పాదదూళి ఒక్కటే మనలని దేవతాన్తర భజనము (ఒకవేళ తెలియకచెసిననూ)నుండి కాపాడునని గ్రహించవచ్చును.
 • తిరువాయ్ మొజి 1.5.11 – నంపిళ్ళై వ్యాఖ్యానము –  “పాలేయ్ తమిజర్ ఇశై కారర్ పత్తర్”, ఆళ్వాన్ ఒకసారి ఈ విదముగా చెప్పిరి “శ్రీ పరాంకుశ నంబి  పాలేయ్ తమిజర్ అని (తమిళములో గొప్ప పాండిత్యముకలవారు), ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్  ఇశై కారర్ అని (సంగీత విద్వాంసులు) మరియు పిళ్ళై ఉరంగా విల్లి దాసర్  పత్తర్ అని(భక్తుడు – గొప్ప భక్తులు)”.

చాలా సంఘటనలు మనకు దాసరులకు కణ్ణన్ ఎమ్పెరుమాన్ యెడల గల గొప్ప అనుభందమును తెలియచేయును.

 • తిరువిరుత్తమ్ 95 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము – ఒకసారి ఒక పశువుల కాచే బాలుడు రాజు గారికి పంపే పాలని దొంగలించడముతో ఆ రాజ భటులు ఆ బాలుడిని కొట్టసాగిరి.అది చూసి , దాసర్ ఆ పశువుల కాపరిని కృష్ణుడిగా భావించి భటుల వద్దకి వెళ్ళి ఆ శిక్షని తనకి వేసి బాలుడిని వదలమనిరి.
 • నాచ్చియార్ తిరుమొజి 3.9 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము – దాసర్ ఈ విదముగా చెప్పిరి “ కృష్ణుడు చిన్నవాడు కావడముచే ,తనని తాను కాపడుకోలేడని.తన తల్లి తండ్రులు సౌమ్యులు మరియు వారు కారాగాఱమునందుండిరి. కంసుడు మరియు అతడి అనుచరులు స్వామిని చంపుటకై ఎడురుచూడసగిరి. ఒక్క చీకటి రాత్రి మాత్రమే(ఆ సమయమున కృష్ణుడు పుట్టడముచే) కాపాడగలదని తలిచిరి.అందువలన మనము ఆ చీకటి రాత్రిని కీర్తిద్దాము ఎమ్పెరుమాన్ ని కాపడమని”.
 • పెరియాళ్వార్ తిరుమొజి 2.9.2 – తిరువాయ్ మొజి పిళ్ళై వ్యాఖ్యానము – దాసర్ గోపికలు కృష్ణుడు తమ ఇంట వెన్నను దొంగిలించాడని యశోదమ్మకు చెప్పడము విని,కృష్ణుడికి అనుకూల వాదను ఈ విదముగా చెప్పిరి. “అటడు మీ తాళములను పగులగొట్టెనా? లేద అభరణములు ఎత్తుకెళ్ళెనా? మరి ఎందుకు పిర్యాదు చేయుచున్నారు కృష్ణుడిపై? తనకే చాలా ఆవులు ఇంట్లో ఉన్నాయి.అవ్వే చాలా పాలు మరియు వెన్నని ఇస్తున్నాయి.మరి ఎందుకు మీ  ఇంట్లో దొంగిలిస్తాడు? అతను తన గృహమేనని మీ ఇంట్లోకి వచ్చాడో ఎమో .

పొన్నాచ్చియార్ కూడా విశ్య పరిజ్ఞానమును కలదని ఎన్నో సంఘటనలు తెలియచేయును.చరమోపాయ నిర్ణయము లో, ఎమ్పెరుమానార్ పొన్నాచ్చియారుల ఉన్నతమైన పరిజ్ఞానమును గ్రహించి తన యొక్క కీర్తిని ఆమె ద్వారా తెలిపెను. ఇక్కడ ఆ పూర్తి సంఘటనలను చదువవచ్చును. http://ponnadi.blogspot.com/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-2.html.

పిళ్ళై లోకాచార్యర్ కూడా తమ గొప్పదైన శ్రీ వచన భూషన దివ్య శాస్త్రమందు పిళ్ళై ఉరంగావిల్లిదాసరుల కీర్తిని ఎమ్పెరుమానులకు మంగళాశాసనమును చేయు సందర్భమున చెప్పిరి.

కొంతకాలము తదుపరి, దాసర్ తమ చివరి రోజులయందు  శ్రీవైష్ణవులందరినీ తమ యొక్క  తిరుమాళిగకు పిలిచి, తదీయారాదనమును చేసి,వారి శ్రీపాద తీర్థమును స్వీకరించి,పొన్నాచ్చియారులకు తాను పరమపదమునకు వెళ్తున్నానని చెప్పి ఆమెను ఇక్కడ ఉండవలసినదిగా చెప్పిరి. ఎమ్పెరుమానారుల  పాదుకలను తలపై ఉంచుకొని , తమ చరమ తిరుమేనిని వదిలిరి. శ్రీవైష్ణవులు వారి అంతిమయాత్రకు ఏర్పాట్లను చేసిరి,కావేరి నది నుండి పుణ్య జలములను తీసుకువచ్చి,శ్రీచూర్ణ పరిపాలనమును మొదలగు వాటిని చేసిరి. పొన్నాచ్చియార్ దాసర్ పరమపదమునకు తగు ఏర్పట్లను చేసి,శ్రీవైష్ణవుల యందు పూర్తి ద్యాసను కలిగిఉండెను.చివరగా , దాసర్ యొక్క తిరుమేనిని పల్లకిలో ఉంచి వీది చివరకు చేరగానే ,దాసరుల ఎడబాటుని సహించలేక బిగ్గరగా ఏడుస్తూ తానూ ప్రాణములను విడిచెను.అందరు శ్రీవైష్ణవులు ఆశ్చర్యమును చెంది  దాసర్తో పాటుగా ఆమెకు చరమ సంస్కారములను చేసిరి. ఈ సంఘటన భాగవతులు ఇతర భాగవతులందు కల భందము యొక్క  ఎడబాటును ఒక్క క్షణమును భరించరని తెలియచేయును.

మణవాళ మామునిగళ్ ఇయల్ శాత్తుముఱై (ఉత్సవములందు ఇయఱ్పా చివరన అనుంసందిచునవి) వ్రాస్తున్నపుడు ,అందరి ఆచార్యుల పాశురములనుండి గ్రహించి. మొదటి పాశురములో వారు పిళ్ళై ఉరంగా విల్లి దాసరుల గురించి మరియు వారు మన సంప్రదాయమునకు సారము వంటి వారని చెప్పెను.

నన్ఱుమ్ తిరువుడైయోమ్ నానిలత్తిల్ ఎవ్వుయిర్క్కుమ్
ఒన్ఱుమ్ కుఱై ఇల్లై ఓతినోమ్
కున్ఱమ్ ఎడుత్తాన్ అడిచేర్ ఇరామానుజన్ తాళ్
పిడిత్తార్ పిడిత్తారై పఱ్ఱి

మనము ఎటువంటి చింతలు లేకుండా అసలైన దనము (కైంకర్యము) కలిగి ఉన్నామని దృవీకరించవలెను.కారణము మనము శ్రీవైష్ణవులకు దాసులము వారు శ్రీ రామానుజులకు దాసులు,వారు స్వయముగా ఎవరైతే తన ప్రియమైన భక్తుల(గోప బాలురు మరియు బాలికలు) రక్షణకై గోవర్దనమును ఎత్తెనో ఆ కణ్ణన్ ఎమ్పెరుమానులకు దాసులు.

ఈ పాశురములో, దాసర్ ముఖ్యమైన సూత్రములను తెలిపెను~:

 • శ్రీవైష్ణవులు గొప్ప దనమును కలిగి ఉండెను – కైంకర్యశ్రీ (దాసగుణమనెడి సంపద)
 • శ్రీవైష్ణవులు ఎప్పుడూ ప్రాపంచిక విషయములందు భాద పడరాదు.
 • శ్రీవైష్ణవులు గొప్ప సంపదగు కైంకర్యశ్రీని ఎమ్పెరుమాన్ మరియు ఎమ్పెరుమానారుల కృపచే కలిగిఉందురు.
 • శ్రీవైష్ణవులు గొప్ప సంపదగు కైంకర్యశ్రీని ఎమ్పెరుమాన్ మరియు ఎమ్పెరుమానారుల కృపచే కలిగిఉందురు.

చాలా సమయములలో మన  పూర్వాచార్యులు ఒక శ్రీవైష్ణవుడి యొక్క గొప్పతనము తన యొక్క జన్మ వర్ణము కారణముచే రాదని చెప్పెను,కానీ ఎమ్పెరుమాన్ మరియు ఇతర శ్రీవైష్ణవులందు భక్తి వలన అది లభించునని తెలిపెను. ఈ ఒక్క సూచన మనకు పిళ్ళై ఉరంగా విల్లి దాసరుల జీవితము ద్వారా తెలియపరచును.

ఈ విదముగా మనమూ పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ మరియు పొన్నాచ్చియారుల జీవితములోని గొప్ప సంఘటనలను కొన్నిటిని తెలుసుకున్నాము.ఇద్దరూ భాగవత నిష్టయందు శ్రద్దని కలిగి ఎమ్పెరుమానార్ లకు స్వయముగా ఇష్టులైరి.మనకూ అటువంటి భాగవత నిష్ట లేశమాత్రమైన కలుగువిదముగా వారి యొక్క శ్రీ చరణములను ఆశ్రయించుదాము.

పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ తనియన్ :

జాగరూగ దనుశ్పాణిమ్ పాణౌ కట్గసమన్విదమ్
రామానుజస్పర్సవేదిమ్ రాద్దాన్తార్త్త ప్రకాశకమ్
భాగినేయద్వయయుతమ్ భాష్యకార భరమ్వహమ్
రంగేసమంగళకరమ్ దనుర్దాసమ్ అహమ్ భజే

అడియేన్ రఘు వంశీ రామానుజ దాసన్

మూలం: http://guruparamparai.wordpress.com/2013/02/22/pillai-uranga-villi-dhasar/

ఎంగళాళ్వాన్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

engaLazhwan

ఎంగళాళ్వాన్ శ్రీ చరణములందు నడాతూర్ అమ్మాళ్

తిరునక్షత్రము~: చైత్ర మాసము, రోహిణి

అవతార స్థలము~: తిరువెళ్ళరై

ఆచార్యులు~: ఎమ్పెరుమానార్, తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్

శిష్యులు~: నడాదూర్ అమ్మాళ్

పరమపదము చేరిన ప్రదేశము~: కొల్లన్ కొంణ్డాన్ ( మదురై దగ్గర)

శ్రీ సూక్తులు~: సారార్త చతుష్టయము ( వార్తామాలై లో భాగము), విష్ణు చిత్తీయము (విష్ణు పురాణమునకు వ్యాఖ్యానము )

తిరువెళ్ళరై లో జన్మించిరి, వారి తల్లితండ్రులు శ్రీ విష్ణు చిత్తర్ అను పేరును పెట్టిరి.వీరు ఎమ్పెరుమానార్ లకు శిష్యులై  భగవత్ విశయము మరియు శ్రీభాష్యమును తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ వద్ద సేవించిరి.ఎమ్పెరుమానార్ స్వయముగా  ఎన్గళాళ్వాన్ అను పేరును అనుగ్రహించినట్టుగా చెప్పబడును (కారణము వీరు కూరత్తాళ్వాన్ వలె ఙ్ఞానము, భక్తి, ఆచార్య నిష్ఠ మొదలగు గుణములను కలిగిఉండడముచేత,).

నడాదూర్ అమ్మాళ్ (వాత్స్య వరదాచార్యర్) వీరికి ముఖ్యమైన శిష్యులు మరియు  నడాదూర్ ఆళ్వాన్ లకు మనుమడు (వీరు ఎమ్పెరుమానార్ శిష్యులు).నడాదూర్ అమ్మాళ్  శ్రీభాష్యము అధ్యాపనమునకు పితామహులు అయిన నడాదూర్ ఆళ్వాన్ ను ఆశ్రయించగా, వారు వయోభారముచేత ఎంగళాల్వాన్నుఅశ్రయించమనిరి. అమ్మాళ్ ఎంగళాల్వాన్ తిరుమాళిగను చేరి, ద్వారమును తట్టగా, ఎంగళాల్వాన్ “వచ్చినది ఎవరు” అని అడుగగా, అమ్మాళ్ “నేను వరదన్” అని సమాధానము ఇచ్చారు. అప్పుడు ఎంగళాల్వాన్  అమ్మాళ్ను ” ‘నేను’ అనేది  నశించిన తరువాత రమ్మ” ని అన్నారు. అమ్మాళ్ పితామహులను చేరి జరిగిన వృత్తాంతము తెలియజేయగా, వారు “నేను” అని స్వపరిచయము చేసుకొనుట అహంకారపూరితము కావున, “అడియేన్” అని వినమ్రముగా అహంకారరహితముగ చేయవలెను అని ఆదేశించిరి. అమ్మాళ్ మరల ఎంగళాల్వాన్ తిరుమాళిగను చేరి, ద్వారమును తట్టగా, వారు “వచ్చినది ఎవరు” అని అడుగగా, అమ్మాళ్ “అడియేన్ వరదన్ దాసన్” అని సమాధానము ఇచ్చిరి. ఈ సమాధానముతొ తృప్తి చెందిన ఎంగళాల్వాన్ , అమ్మాళ్ను స్వాగతించి, శిష్యునిగా స్వీకరించి, వారికి సాంప్రదాయరహస్యములను విశదీకరించిరి. అమ్మాళ్ శ్రీవైష్ణవ సాంప్రదాయ విశిష్ఠులుగా ప్రసిద్ది చెందడముతో, వారి అచార్యులు అయిన  ఎంగళాల్వాన్ “అమ్మాళాచార్యులు” గా కొనియాడబడిరి.

ఎమ్పెరుమానార్ పరమపదమునకు చేరు చివరి దశలో ,ఎన్గళ్ ఆళ్వాన్ లను తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ వద్దకు వెళ్ళమని ఆఙ్ఞాపించిరి.

మన వ్యాఖ్యానములలో, ఎన్గళ్ ఆళ్వాన్ లకు సంభందించిన కొన్ని ముఖ్యమైన విషయములను ఇక్కడ చూద్దాము.

మన వ్యాఖ్యానములలో, ఎన్గళ్ ఆళ్వాన్ లకు సంభందించిన కొన్ని ముఖ్యమైన విషయములను ఇక్కడ చూద్దాము.

 • పెరియాళ్వార్ తిరుమొజి 2.9.10 – తిరువాయ్ మొజి పిళ్ళై వ్యాఖ్యానము – ఈ పాశురములో పెరియాళ్వార్ కణ్ణన్ ఎమ్పెరుమాన్ కి నేరేడు పండు అంటే ఇష్టము అని విశదపరిచిరి . ఈ సంభందముతో, ఎన్గళాళ్వాన్ లకు కలిగిన ఒక సంఘటనను నంజీయర్ తెలియపరిచిరి.ఎన్గళాళ్వాన్ లకు నిద్రకు ఉపక్రమించే సమయములో ఒక కల వచ్చినది.ఆ కలలో ఒక బాలుడు ఎన్గళాళ్వాన్ లను ఒక నేరేడు పండు ఇవ్వమని అడిగిరి.అప్పుడు ఎన్గళాళ్వాన్ ఆ బాలుడిని మీరు ఎవరు అని అడుగగా “నేను ఆయర్ దేవు –  నంజీయర్ కూమారుడు” (ఆయర్ దేవు నంజీయరుల తిరువారాదన మూర్తి పేరు ) అని చెప్పిరి. ఎన్గళాళ్వాన్ నంజీయర్ వద్దకి వెళ్ళి మీ యొక్క  తిరువారాదన పెరుమాళ్ మాకు నిద్ర లేకుండ చేస్త్తున్నారని చెప్పగ,నంజీయర్ వారి తిరువారాదన గది వద్దకి వెళ్ళి వారి ఎమ్పెరుమానులని నిద్రకి ఆటంకము కలిగించవద్దని చెప్పెరి.
 • ముదల్ తిరువందాది 44 – నమ్పిళ్ళై/పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములు – ఈ పాశురములో, పొయైగైయాళ్వార్  ఎమ్పెరుమాన్ వారి ప్రియమైన భక్తులకు నచ్చు విదముగా వివిద నామములను మరియు రూపములను దరించునని తెలిపిరి.అటువంటి సంఘటనని ఇక్కడ వివరించిరి. –ఎమ్పెరుమాన్ స్వయముగా ఎన్గళాళ్వానులకు  నంజీయర్ ( ఆయర్ దేవు) పెట్టిన పేరుని చెప్పిరి. ఆ సంఘటనని విన్న ఎన్గళాళ్వాన్, నంజీయర్ ఇద్దరూ పారవశ్యముని చెందిరి.

వార్తా మాలై లో, ఎన్గళాళ్వానులకు సంభందించిన కొన్ని ఐదిహ్యములను ఇక్కడ చూద్దాము~:

 • 17 – అమ్మంగి అమ్మాళ్ ఎన్గళాళ్వాన్ వద్దకి వెళ్ళి సాంప్రదాయముని గురించి పూర్తిగా తెలుపని అడుగగా, ఎన్గళాళ్వాన్ వారికి సారార్త చతుష్టయము (4 ముఖ్యమైన మరియు తప్పనిసరియైన సూత్రములని)వివరించిరి. అవి~:
  • స్వరూప ఙ్ఞ్యానము
  • స్వరూప యాతాత్మ్య ఙ్ఞానము
  • విరోది ఙ్ఞానము
  • విరోది యాతాత్మ్య ఙ్ఞానము
  • పల ఙ్ఞానము
  • పల యాతాత్మ్య ఙ్ఞానము
  • ఉపాయ ఙ్ఞానమ్
  • ఉపాయ యాతాత్మ్య ఙ్ఞానము
 • 118 – ఎన్గళాళ్వాన్ నడాతూరమ్మాళ్ కూ చరమ శ్లోకములోని  “సర్వ ధర్మాన్ పరిత్యజ్య” అర్థమును అనుగ్రహించుచండగా– నడాతూర్ అమ్మాళ్ ఆశ్చర్యముతో ఎందుకు ఎమ్పెరుమాన్ శాస్త్రములో చెప్పిన అన్ని దర్మములను(ఉపాయములను) ప్రక్కకిపెట్టి తన  స్వాతన్త్రియమును గురించి చెప్పుచున్నాడని అడిగెను. అప్పుడు ఎన్గళాళ్వాన్ అది భగవాన్ యొక్క నిజమైన స్వభావము అని చెప్పిరి – వారు సర్వస్వతంత్రులు –అందువలన  అది వారికి అలా చెప్పుటకు యుక్తమైనది. అదికాకుండా, ఎమ్పెరుమాన్ జీవాత్మకు స్వభావ విరుద్దమైన ఉపాయములమునుండి ఉపశనమును కలిగించును– కారణము జీవాత్మ పుర్తిగా భగవంతుడిపై ఆదారపడిఉండును,ఆందువలన జీవాత్మ భగవానుడిని ఉపాయముగా స్వీకరించవలెను.ఆ విదముగా, ఎన్గళాళ్వాన్ భగవానుడి వివిదములైన ఉపదేశములను ఇక్కడ వివరించెను.
 • 153 –ఇందులో ఎన్గళాళ్వాన్ చాలా అందముగా ఆచార్యుల యొక్క గుణములను వెలికితీసెను. ఆచార్యులు అనగా ఎవరైతే శరీరము ఆత్మను వదిలి, ఎమ్పెరుమాన్ కి పూర్తి దాసుడిగా తలిచి,ఇతర దేవతా సంభదమును వదిలివేసి,అలానే ఎమ్పెరుమాన్ సర్వాంతర్యామిగా గుర్తించి,ఈ ప్రపంచములో తన యొక్క సమయమును  అర్చావతార ఎమ్పెరుమానును ఆరాదిస్తూ చివరగా  పరమపదమును చేరవలెను.
 • ఒక సారి పిన్భళగియ పెరుమాళ్ జీయర్ అనారోగ్యము పాలైనారు. అప్పుడు వారు తన శిష్యులను చూసి తను త్వరగా కోలు కోవాలని పెరుమాళ్ళను ప్రార్థించమని అడిగారు. శ్రీవైష్ణవులేవరూ అలా కోరుకోరు. ఇది తెలిసి నంపిళ్ళై శిష్యులను పంపి విషయమేమిటో తెలుసుకోవాలనున్నారు. నంపిళ్ళై మొదట సకల శాస్త్ర పారంగతులైన ఎంగళాళ్వాను యొక్క అభిప్రాయమును తెలుసుకోవాలని శిష్యులను వారి దగ్గరికి పంపారు. ఎంగళాళ్వాన్ దానికి “వారు బహుశా శ్రీరంగముతో ఉన్న సంభందము వలన అలా అన్నరేమో” అని తన అభిప్రాయాన్ని తెలియజేసారు. నంపిళ్ళై శిష్యులను తిరునారాయణపురతు అరయర్ దగ్గరికి పంపారు. దానికి – అరయర్ “పూర్తి కావలసిన పనులేవైనా మిగిలిపోయాయేమో! అందుకనే వారు ఈ లోకములో ఇంకా కొంతకాలము ఉండాలనుకుంటున్నారేమో” అన్నారు. నంపిళ్ళై ఈ సారి అమ్మంగి అమ్మాళ్ దగ్గరికి శిష్యులను పంపారు. వారు “నంపిళ్ళై కాలక్షేప గోష్టిని వదల లేక అలా అన్నారేమో” అని బదులిచ్చారు. నంపిళ్ళై, పెరియ ముదలియార్ దగ్గరికి శిష్యులను వెళ్ళమన్నారు. నంపెరుమాళ్ళతో ఉన్న అనుబంధము వలన వారిని వీడి వెళ్ళటానికి ఇష్టపడటం లేదేమో” అన్నారు . నంపిళ్ళై చివరగా జీయరునే కారణమడగగా, “పైవేవీ కారణాలు కావు .తమరికే తెలుసు. అయినా కృపతో అడుగుతున్నారు. తమరు ప్రతి రోజు స్నానము చేసిన తరువాత తమ దివ్య దర్శనము చేసుకొని వీవెన వీయటము ఇత్యాది కైంకర్యములను చేస్తూ వుంటాను కదా? పరమ పదము కోసము వాటిని ఎలా వదులుకోగలను?” అన్నారు.పిన్భళగియ పెరుమాళ్ జీయర్  ఉత్తమ శిష్యులు తమ ఆచార్యుల పట్ల చూపవలసిన అభిమానమును ఈ విధముగా ఆచరించి చూపారు.ఇది విన్న వారందరూ జీయరుకున్న ఆచార్య భక్తికి మురిసి పోయారు.ఈ సూత్రమును పిళ్ళై లోకాచార్యర్ తమ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రములో (సూత్రము 333) మరియు మణవాళ మామునిగళ్ ఉపదేస రత్తిన మాలై (పాశురము 65 అన్డ్ 66)లో చెప్పిరి.ఈ విదముగా కొన్ని దివ్యమైన సంఘటనలను ఇక్కడ ఎన్గళాళ్వాన్ జీవితములోనివి తెలుసుకొంటిమి. వీరు పూర్తిగా భాగవత నిష్ఠ యందు ఉండి ఎమ్పెరుమానార్ ఇష్టులుగా ఉండిరి.మనమూ వారి శ్రీ చరణములను అటువంటి భాగవత నిష్ఠ కలిగేలా అనుగ్రహించమని ప్రార్దిస్తాము.

ఎన్గళాళ్వాన్ తనియన్

శ్రీవిష్ణుచిత్త పద పంకజ సమాశ్రయాయ చేతో మమ స్పృహయతే కిమత~: పరేణ
నోచేన్ మమాపి యతిశేకరభారతీనామ్ భావ~: కతమ్ భవితుమర్హతి వాగ్విదేయ~:

అడియేన్ రఘు వంశీ రామానుజదాసన్

archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/

Source: http://guruparamparai.wordpress.com/2013/04/04/engalazhwan/

వంగి పురత్తు నంబి

శ్రీ~:
శ్రీమతే రామానుజాయ నమ~:
శ్రీమద్ వరవరమునయే నమ~:
శ్రీ వానాచల మహామునయే నమ~:

తిరునక్షత్రము~: తెలియదు

అవతార స్థలము ~: తెలియదు (వంగి పురము వారి తండ్రిగారి గ్రామము లేదా శ్రీరంగము వారి తండ్రిగారైన వంగి పురత్తు ఆచ్చి మణక్కాల్ నంబి గారి శిష్యులైన పిదప ఇక్కడే నివశించారు)

ఆచార్యులు~: ఎమ్పెరుమానార్

శిశ్యులు~: సిరియాతాన్

గ్రంథములు~: విరోధి పరిహారము

వంగి పురత్తు ఆచి మణక్కాల్ నంబి శిష్యులు. వంగి పురత్తు నంబి వన్గి పురత్తు ఆచి కూమారులు మరియు ఎమ్పెరుమానారులకి శిష్యులైరి.

వీరు విరోధి పరిహారము బయటకు రావడములో ఒక సాదనముగా ఉండిరి –మన సంప్రాదాయములో ఒక ఉత్తమ గ్రంథము.ఒకసారి వంగి పురత్తు నంబి ఎమ్పెరుమానార్ వద్దకి వెళ్ళి ఒక ప్రపన్నుడు సంసారములొ ఎటువంటి కష్టములను ఎదుర్కొనునని అడుగగా, ఎమ్పెరుమానార్ 83 అవరోధములను కలిగిన ఒక చిట్టీ ఇచ్చెను. వంగి పురత్తు నంబి ఆ 83 అవరోదములను ఒక గ్రంథరూపములో వివరణాత్మకముగా వ్రాసిరి. ఈ గ్రంథములో,మన జీవితములో వచ్చు ప్రతీ అంశములను ఏ విదముగా నిర్వహించవలెనో పూర్తి మార్గదర్శకములతో వ్రాసిరి.

వంగి పురత్తు నంబి గారి కుమారులకు వంగి పురత్తు ఆచి అను నాదేయమును పెట్టిరి, వారు కొన్ని ఐదిహ్యములను తెలియబరచిరి.

మన వ్యాఖ్యానములలో,వంగి పురత్తు నంబి గారికి సంబందిచిన కొన్ని ఐదిహ్యములను ఇక్కడ చుద్దాము.

 • నాచ్చియార్ తిరుమొజి 9.6 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానముఆండాళ్ ఎమ్పెరుమాన్ ని శ్రీ మహాలక్ష్మి అను గొప్ప సంపదని కలిగిఉండెనని కీర్తించినది.ఈ సంభదముతో, వంగి పురత్తు నంబి తమ శిష్యులైన సిరియాతాన్ కు “అన్నీ తత్వాలు ఒక గొప్ప శక్తి ఉన్నదని అంగీకరించును,కాని మనము(శ్రీవైష్ణవులు) శాస్త్రములో చెప్పబడిన విదముగా –శ్రీమాన్ నారాయణుడే అదిదేవత అని మరియు ప్రతీ ఒక్కరు వారిని శరణు వేడవలెనని చెప్పిరి”.
 • పెరియ తిరుమొజి 6.7.4 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము – ఈ పాశురములో, తిరుమంగై ఆళ్వార్ కణ్ణన్ ఎమ్పెరుమాన్ (తానే ఆదిదేవత అయిననూ) వెన్న దొంగలించిన సమయమున యశోదమ్మకు పట్టుబడిన వెంటనే ఏడవడము మొదలుపెట్టెను. ఈ సంభదము ద్వారా,ఒక అందమైన సంఘటనను వివరించెను. వంగి పురత్తు నంబి ఎమ్పెరుమానారులని తిరువారాధన క్రమమును (గృహ తిరువారాధన) తెలుపని అభ్యర్తించిరి. ఎమ్పెరుమానార్ సమయము చిక్కపోవడముచే వారికి చెప్పలేదు.కాని ఒకసారి నంబి గారు లేనప్పుడు, ఎమ్పెరుమానార్ తిరువారాధన క్రమమును ఆళ్వాన్ మరియు మారుతి సిరియాండాన్ (హనుమత్ దాసర్)లకు చెప్పసాగిరి.ఆ సమయమున వంగి పురత్తు నంబి ఆ గదిలోకి రావడముచూసి ఎమ్పెరుమానార్ గొప్ప అనుభూతిని చెందెను.అప్పుడు వారు ఈ విదముగా చెప్పిరి “చాలా కాలము నుండి నాకు ఈ సందెహము ఉండేది. ఇప్పుడు నాకు ఎందుకు ఎమ్పెరుమాన్ (తానే ఆదిదేవత అయిననూ) వెన్న దొంగిలించు సమయమున ఎందుకు  బయపడెనో తెలిసినది.నేను అటువంటి అనుభూతిని ఈ సమయమున పొందితిని–మీరు నన్ను అభ్యర్తించినప్పుడు,నేను మీకు ఉపదేశించలేదు కాని ఎలాగో ఈ రోజు అది వీరికి ఉపదేశించుచున్నాను.నేను ఆచార్యుడిని అయినప్పడికినీ మీరు నాకు శిష్యులైన కారణముచే నేను మీకు భయపడనవసరము లేదు,నా యొక్క పని ద్వారా మిమ్మల్ని చూచిన వెంటనే భయముకలిగెను”.అదీ మన ఎమ్పెరుమానార్ యొక్క గొప్పతనము.ఎప్పుడైనా వారు తప్పుచెసినచో , బాహాటముగానె ఒప్పుకొని దాని ద్వారా ఒక గొప్ప సూత్రముని వివరించెడివారు.
 • తిరువిరుత్తము – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము అవతారిక – నమ్పిళ్ళై ఇక్కడ మొదటగా నమ్మాళ్వార్ సంసారిగా ఉండెననీ ఎమ్పెరుమాన్ దివ్య కృపా కటాక్షముచే తదుపరి  ఆళ్వార్ అయ్యెనని నిర్ణయించెను.కాని ఆళ్వార్ అళోచనల గొప్పతనము ఆచార్యుల ద్వారా చూసినప్పుడూ వేరుగా ఉండును –ఒకవైపు నుండి చూస్తే వారు ముక్తులు (సంసారమునుండి బయట పడినవారు);అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ శిష్యులు ఒకరు వారు ముక్తులు కాకున్ననూ మంచి వారిలో ఒకరు అనెను;ఇంకొకరు వారు నిత్య సూరి అనెను; వంగి పురత్తు నంబి వారు స్వయముగా ఎమ్పెరుమాన్ అని చెప్పెను.
 • తిరువాయ్ మొజి 7.2.7 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము – ఈ పదిగములో (కంగులుమ్ పగలుమ్), నమ్మాళ్వార్ అమ్మ భావముతో పాడెను,కాని అక్కడ ఆళ్వారులు వారి అమ్మగారు వివరిస్తున్నారని చెప్పెను. ప్రతి పాశురములో, ఆళ్వార్ (అమ్మ) ఎమ్పెరుమాన్ కొరకు వారిని తిరువరంగత్తాయ్ అని పిలుచును.కాని ఈ పాశురములో, ఆమె ఆ విదముగా చేయడము లేదు. వంగి పురత్తు నంబి ఇక్కడ ఒక రోగి చివరి సమయమున ఉన్నప్పడి సంఘటన ద్వారా వివరించెను,ఆ సమయములో వైద్యుడు నేరుగా రోగి బందువుల కళ్ళలోనికి చూడకుండా వేరే వైపునకు తిరిగి ఆ రోగి పరిస్తిని వారి బందువులకు వివరిస్తాడో. అదేవిదముగా, ఆళ్వార్ ఎమ్పెరుమాన్ నుండి వేరుగా ఉండడముచే వారి పరిస్తితిని చెప్పుటకు , ఆళ్వార్ (అమ్మ) ఎమ్పెరుమాన్ ని ఈ పాశురములో నేరుగా పిలువక ఆమె యొక్క పరిస్తితిని ఆక్రోశము ద్వారా తెలిపెను.
 • తిరువాయ్ మొజి 9.2.8 – నమ్పిళ్ళై ఈడు వ్యాఖ్యానము – శ్రీ రంగములో శ్రీజయంతి పురప్పాడు సమయమున, వంగీపురత్తు నంబి ఎమ్పెరుమాన్ ని సేవించుటకై గొల్లపిల్లల సమూహమున చేరిరి. ఆణ్డాన్ అక్కడ ఉన్నారేమిటని అడుగగా, నంబి ఈ విదముగా చెప్పెను “నేను విజయస్వ అని చెప్పితిని”. ఆణ్డాన్ అందుకు సమాదానముగా మీరు వారి మద్యన ఉండి,వారి యొక్క భాషను మాట్లాడక కష్టమైన సంస్కృతమును ఎందుకు మాట్లాడుతున్నారని అడిగిరి.

వార్తామాలై లో, కొన్ని ఐదిహ్యములు వంగి పురత్తు నంబి (మరియు వారి కుమారుల) కీర్తిని తెలుపును.వాటిని ఇక్కడ చూద్దాము.

 • 71 – వంగి పురత్తు నంబి యతివర చూడామణి దాసర్ కి ఉపదేశించిరి – ఒక జీవాత్మ (ఎవరైతే అచేతనుడో) ఎమ్పెరుమాన్ (గొప్ప వాడు మరియు సర్వ శక్తిమంతుడు)ని పొందినప్పుడు,అక్కడ జీవాత్మ యొక్క కృషిగాని మరెవరి కష్టము కాని లేదు . జీవాత్మకు రెండు దారులు కలవు – ఆచార్యుల కృపచే , ద్వయ మహా మంత్రమును ద్యానము చేసి బయటకు రావడమో లేక నిత్య సంసారిలా ఎప్పుడూ సంసారములో ఉండడము.
 • 110 – వంగి పురత్తు ఆచి కిడామ్బి ఆచ్చాన్కి ఉపదేశించిరి – అనాదియైన ఈ కాలములో ఒక జీవాత్మ ఈ యొక్క సంసారములో ఉన్నప్పుడూ , ఎల్లప్పుడూ పెరియ పిరాట్టియార్ మనలను ఎమ్పెరుమాన్ దగ్గరికి చేర్చునని దృడనిశ్చయముతో ఉండవలెను.
 • 212 – ఇది ఒక అందమైన సంఘటన. ఒక శ్రీవైష్ణవి పేరు త్రైలోక్యాళ్ వంగి పురత్తు ఆచి కి శిష్యురాలు.ఒకసారి అనంతాళ్వాన్ శ్రీరంగమునకు వచ్చినప్పుడు, ఆమె వెళ్ళి వారికి 6 నెలలు శుశ్రూష చేసెను.అనంతాళ్వాన్ తిరి వెళ్ళిన పిదప, ఆమె ఆచి వద్దకు వచ్చెను. ఆచి ఆమె ఇన్ని రోజులు రాకపోవడము గురించి కారణము అడుగగా ఆమె అనంతాళ్వాన్ కి సపర్యలు చేసెనని చెప్పినది. ఆచి ఆమెను వారు ఎమైనా ఉపదేశించారా అని అడుగగా ఆమే ఈ విదముగా చెప్పినది “నేను మీకు ఎన్నో సంవత్సరములు సేవలను చేస్తే–మీరు నాకు ఎమ్పెరుమాన్ యొక్క శ్రీ చరణములను ఆశ్రయించమనిరి.ఈ 6 నెలలలో వారు నాకు మీ యొక్క శ్రీ చరణములకు దాసురాలని చూపిరి”. అనంతాళ్వాన్ ఆమెకు ఆచార్యుల శ్రీ చరణములే మనకు సర్వము అని చెప్పడము ఈ సంఘటన ద్వారా తెలియబరచిరినది.

పిళ్ళై లోకాచార్యర్ తమ ముముక్షుపడిలో వంగి పురత్తు నంబి గారి చరమ శ్లోకము యొక్క ముగింపును గుర్తించింరి.చరమ శ్లోక ప్రకరణము చివరన, చరమ శ్లోకము యొక్క కీర్తిని తెలిపెను.265 సూత్రములో, “వంగి పురత్తు నంబి  కణ్ణన్ ఎమ్పెరుమాన్ అర్జునుడికి తన గొప్పతనమును ఎన్నో వివిదములైన సంఘటనల ద్వారా చూపి చివరన చరమశ్లోకమును అనుగ్రహించిరనిరి. అందువలన సులభముగా అర్జునుడు ఆ సూత్రమును గ్రహించెను”. వ్యాఖ్యానములొ, మామునిగళ్ వంగి పురత్తు నంబిని “ఆప్త తమర్”అని  చెప్పెను –మన ఆధ్యాతిక భావనములో నేర్పరులు.

వంగి పురత్తు నంబి గారి జీవితములోని కొన్ని ముఖ్య సంఘటనలను ఇక్కడ చూసాము.వీరు పుర్తిగా భాగవత నిష్ఠతో ఉండి ఎమ్పెరుమానారుకి ప్రియ శిష్యులైరి.మనకూ అటువంటి ఆచార్య నిష్ఠ కలిగేలా వారి శ్రీ చరణములను ఆశ్రయించుదాము.

వంగి పురత్తు నంబి తనియన్ ~:

భారద్వాజ కులోత్భూతమ్ లక్ష్మణార్య పదాశ్రితమ్
వందే వంగిపురాధీశమ్ సంపూర్ణాయమ్ కృపానిధిమ్

பாரத்வாஜ குலோத்பூதம் லக்ஷ்மணார்ய பதாச்ரிதம்
வந்தே வங்கிபுராதீஸம் ஸம்பூர்ணாயம் க்ருபாநிதிம்

అడియేన్ రఘు వంశీ రామానుజ దాసన్

source:

వడుగ నంబి

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

vaduganambi-avatharasthalam

తిరునక్షత్రము~: చైత్ర మాసము, అశ్విని

అవతార స్థలము~: సాలగ్రామము (కర్నాటక)

ఆచార్యులు~: ఎమ్పెరుమానార్

పరమపదము చేరిన ప్రదేశము~: సాలగ్రామము

గ్రంథ రచనలు~: యతిరాజ వైభవము, రామానుజ అష్టోత్తర శత నామ స్తోత్రము, రామానుజ అష్టోత్తర శత నామావళి

తిరునారాయణపురమునకు ప్రయాణించు సమయములో, ఎమ్పెరుమానార్ మిథిలాపురి సాళగ్రామమునకు వెళ్ళిరి,వారు ముదలియాణ్డాన్ ను అక్కడ ప్రవహించే నదిలో శ్రీ చరణములతో తాకమని ఆఙ్ఞాపించిరి.ఆ నదిలో స్నానము ఆచరించడము వలన అక్కడి ప్రజలు (ముదలియాణ్డాన్ పాద పద్మముల స్పర్శచే) పునీతులై ఎమ్పెరుమానార్ లకు శిష్యులైరి. అందులో ఒక స్వామి వడుగ నంబి,వీరిని ఆంద్ర పూర్ణులు అని కూడా వ్యవహరించుదురు. ఎమ్పెరుమానార్ తన కృపా కటాక్షముచే వడుగ నంబిని అశీర్వదించి,మన సంప్రదాయములోని ముఖ్య సూత్రములను ఉపదేశించిరి.వడుగ నంబి ఆచార్య నిష్ఠతో ఎమ్పెరుమానారులను సేవించి వారితో ఉండసాగిరి.

వడుగ నంబి పూర్తిగా ఆచార్య నిష్ఠతో ఉండడమువలన ఎమ్పెరుమానారులను అర్థించి వారు ధరించిన పాదరక్షలకు ప్రతీ నిత్యము తిరువారాధనమును చేయసాగిరి.

ఒకసారి ఎమ్పెరుమానారుతో కూడి ప్రయాణించు సమయములో, ఎమ్పెరుమానారుల తిరువారాధన పెరుమాళ్ళతో కూడి, వడుగ నంబి కూడా వారి తిరువారాధన మూర్తులైన (ఎమ్పెరుమానారుల పాదరక్షలు) ఒకే మూటలో ఉంచిరి. ఎమ్పెరుమానార్ అది గమనించి వడుగ నంబిని అలా చేయుటకు గల కారణమును అడిగిరి. వడుగ నంబి వెంటనే ఈ విదముగా చెప్పిరి “నా ఆరాధన మూర్తి కీర్తిలో మీ ఆరాధన మూర్తులతో సమానము అందువలన ఇలా చేయుటలో తప్పేమి లేదనిరి”.

ఎమ్పెరుమానార్ ఎల్లప్పుఢూ మంగళాశాసనము చేయు సమయములో,పెరియ పెరుమాళ్ళ అందమైన రూపమును సేవిస్తూ ఆనందించేవారు. ఆ సమయములో వడుగ నంబి ఎమ్పెరుమానారుల అందమైన రూపమును చూసి ఆనందించేవారు. ఎమ్పెరుమానార్ అది గమనించి వడుగ నంబిని పెరియ పెరుమాళ్ళ అందమైన నేత్రములను సేవించి అనందించమనిరి . వడుగ నమ్బి తిరుప్పాణాళ్వార్ ల శ్రీ సూక్తిని అనుసరించి ఈ విదముగ చెప్పిరి“ఎన్ అముదినై కణ్డ కణ్గళ్ మఱ్ఱొన్ఱినై కాణావే” అర్థము “ఎమ్పెరుమానారుల దివ్య సౌందర్యమును దర్శించిన ఈ నేత్రములు వేటిని చూడదలచలేదు” . ఎమ్పెరుమానార్ వారి యొక్క ఆచార్య నిష్ఠను చూసి సంతోషముతో ఆశీర్వదించిరి.

వడుగ నంబి నిత్యమూ ఎమ్పెరుమానారుల శేష ప్రసాదమును తీసుకొనెడివారు,ఆపై వారి చేతులను భక్తితో తలపై తుడుచుకొనేవారు (చేతులను కడుగుటకు బదులుగా) – సాదారణముగా ఎమ్పెరుమాన్/ఆళ్వార్ ఆచార్యుల ప్రసాదములు పవిత్రములు అవడముచేత తీసుకొన్న పిదప ఇలానే చేస్తాము , స్వీకరించిన తదుపరి, మనము చేతులను కడుగరాదు, చేతులను మన తలపై తుడుచుకొనవలెను. ఒకసారి ఎమ్పెరుమానార్ అది గమనించి కలవరపడగా, నంబి తమ చెతులను శుబ్రముచేసుకొనిరి. మరుసటి రోజు, ఎమ్పెరుమానార్ భగవత్ ప్రసాదమును స్వీకరించి మిగిలినది వడుగ నంబికి ఇచ్చిరి. వడుగ నంబి స్వీకరించి చేతులను కడుగుకొనిరి. ఎమ్పెరుమానార్ మరలా కలత చెంది ప్రసాదమును స్వీకరించి చేతులను ఎందుకు కడుక్కొన్నారనిరి. వడుగ నంబి,వినయముతో మరియు తెలివిగా “నేను దేవర వారు నిన్న ఆఙ్ఞాపించిన విదముగా నదుచుకుంటున్నాను అని చెప్పిరి”. ఎమ్పెరుమానార్ “మిరు నన్ను చాలా సులభముగా ఓడించినారు” అని చెప్పి వారి నిష్ఠను అభినందించిరి.

ఒకసారి వడుగ నమ్బి ఎమ్పెరుమానార్ కోసము పాలను కాచుచున్నారు. ఆ సమయమున , నమ్పెరుమాళ్ పుఱప్పాడులో బాగముగా ఎమ్పెరుమానారుల మఠము ముందుకు వచ్చెను. ఎమ్పెరుమానార్ వడుగ నంబిని వచ్చి సేవించమని పిలువగా వారు “నేను మీ పెరుమాళ్ళను చూచుటకు వస్తే,నా పెరుమాళ్ళ పాలు పొంగిపోవును. అందువలన నేను రానని చెప్పెను”.

ఒకసారి వడుగ నంబి బందువులు(వారు శ్రీవైష్ణవులు కారు) వారిని చూచుటకు వచ్చిరి.వారు వెళ్ళిన తదుపరి, వడుగ నంబి పాత్రలను అన్నీ పడేసి ఆ ప్రదేశమును శుబ్రము చేసెను.ఆపై ముదలియాణ్డాన్ తిరుమాళిఘకు వెళ్ళీ,వారు వదిలివేసిన కుండలను తీసుకొని వచ్చి ఉపయోగించసాగిరి.ఈ సంఘటన ద్వారా ఎవరైతే పూర్తి ఆచార్య సంభదమును కలిగి ఉంటారో వారికి సంభదించినవి (వారు వదిలివేసినవి అయినా) పవిత్రములుగా భావించి మనమూ స్వీకరించవచ్చు అని తెలియపరచును.

vaduganambi-emperumanar

ఎమ్పెరుమానార్ తిరువనంతపురమునకు వెళ్ళినప్పుడు,అనంత శయన ఎమ్పెరుమాన్ ఆలయములోని ఆగమమును మార్చదలచెను. కాని ఎమ్పెరుమాన్  ప్రణాళిక వేరుగా ఉండడముచే ఎమ్పెరుమానార్ నిద్రించుచున్న సమయమున ఎత్తుకొని వెళ్ళి తిరుక్కురుంగుడి దివ్య దేశమున వదిలి వచ్చెను. ఎమ్పెరుమానార్ ఉదయము లేచి పక్కన నదిలో స్నానమును ఆచరించి,ద్వాదశ ఊర్ద్వ పుండ్రములను (12 పుండ్రములు) దరించి వడుగ నంబిని (వారు తిరువనంతపురములోనే ఉండెను) శేషమును స్వీకరించుటకు పిలిచిరి. తిరుక్కురుంగుడి నంబి స్వయముగా వడుగ నంబి వలె వచ్చి తిరుమణి ని దరించెను. ఎమ్పెరుమానార్ తదుపరి తిరుక్కురుంగుడి నంబిని శిష్యుడిగా స్వీకరించిరి.

ఎమ్పెరుమానార్ పరమపదము చేరిన తరువాత, వడుగ నంబి తమ స్వస్థలమునకు వెచ్చేసి,అక్కడ ఎమ్పెరుమానారుల వైభవమును ప్రవచిస్తూ ఉండెను .వారు ఎమ్పెరుమానారుల శ్రీ పాద తీర్థమును (చరణామృతము)తప్ప వేరవరిదీ స్వీకరించెడి వారు కారు .ఎమ్పెరుమానారుల శ్రీ చరణములను ఆరాదిస్తూ వారి శిష్యులకి/అభిమానులకి ఎమ్పెరుమానారుల తిరువడిని చేరుటయే అంతిమ ఉద్దేశ్యమని చెప్పి మిగిలిన కాలమును సాలగ్రామమున నివసించి ఎమ్పెరుమానార్ తిరువడిని చేరిరి.

మన వ్యాఖ్యానములలో, కొన్ని ఐదిహ్యములు వడుగ నంబి కీర్తిని తెలుపును.మనమూ వాటిని ఇక్కడ చుద్దాము.

 • పెరియాళ్వార్ తిరుమొజి 4.3.1 – మణవాళ మామునిగళ్ వ్యాఖ్యానము – ఈ పదిగములో  “నావ కారియమ్” అను పదమును గురించి.ఒక సంఘటనను వడుగ నంబి జీవితములో గమనించవచ్చు.ఒకసారి వడుగ నమ్బి దగ్గర ఒక శ్రీవైష్ణవుడు తిరుమంత్రమును అనుసందించెను. అది విని వడుగ నంబి (ఆచార్య నిష్ఠచే)  “ఇది నావ కారియమ్” అని చెప్పి వెళ్ళిపోయెను.ఇది ముఖ్యముగా మనము తిరుమంత్రము, ద్వయము, చరమ శ్లోకము –అనుసందిచుటకు మొదలు గురు పరంపరను అనుసందిచవలెనని ఆపై రహస్య త్రయమును అనుసందించవలెననీ తెలియచేయును. పిళ్ళై లోకాచార్యర్ ఇది గుర్తించి“జప్తవ్యమ్ గురు పరమ్పరైయుమ్ ద్వయముమ్” (ప్రతీ ఒకరు తప్పక గురు పరంపర తదుపరి ద్వయ మహా మంత్రమును అనుసందించవలెను) శ్రీవచన భూషణ దివ్య శాస్త్రములో (సూత్రమ్ 274)తెలిపిరి.
 • పెరియాళ్వార్ తిరుమొజి 4.4.7 – మణవాళ మామునిగళ్ వ్యాఖ్యానము –వడుగ నమ్బి పరమపదము చేరిన పిదప, ఒక శ్రీవైష్ణవుడు అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానారుతో “వడుగ నమ్బి పరమపదమును చేరిరి” అని చెప్పెను.దానికి అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ ఈ విదముగా అనెను “వడుగ నంబి ఆచార్య నిష్ఠులు కావున, మీరు వారు ఎమ్పెరుమానార్ తిరువడిని చేరినారని చెప్పవలెను, పరమపదమునకు కాదు అనెను”.
 • వడుగ నంబి యతిరాజ వైభవమును తెలుపు ఒక అందమైన గ్రంథమును రచించిరి.ఈ గ్రంథములో వారు ఎమ్పెరుమానార్ 700 సన్యాసులతో, 12000 శ్రీవైష్ణవులతో,ఇతర శ్రీవైష్ణవులెందరితోనో ఆరాదించబడెను అని పేర్కొనెను.

పెరియవాచ్చాన్ పిళ్ళై మాణిక్క మాలైలో “వడుగ నంబి ఆచార్య అను పదము (స్థానము)చాలా ప్రత్యేకము మరియు దీనికి ఎమ్పెరుమానార్ ఒక్కరే సరితూగుదురని చెప్పెను”.

పిళ్ళై లోకాచార్యర్ వడుగ నంబి గారి గొప్పతనమును శ్రీవచన భూషణ దివ్య శాస్త్రములో (సూత్రమ్ 411) వివరించిరి.

వడుగ నంబి ఆళ్వానైయుమ్ ఆణ్డానైయుమ్ ఇరుకరైయర్ ఎన్బర్ (வடுகநம்பி ஆழ்வானையும் ஆண்டானையும் இருகரையர் என்பர்)

మామునిగళ్ వడుగ నంబిని మధురకవి ఆళ్వార్ తో పోల్చెను కారణము వారికి నమ్మాళ్వారులే సర్వస్వము. కూరత్తాళ్వాన్ మరియు ముదలియాణ్డాన్ ఎమ్పెరుమానారుకి పూర్తిగా దాసులైనా –కొన్ని సమయములలో వారు ఎమ్పెరుమాన్ ని కీర్తించి సంసారములో ఇమడలేక ఎమ్పెరుమాన్ ని మోక్షము ప్రసాదించవలెననీ అభ్యర్థించిరి .అందువలన వడుగ నమ్బి “వారు ఎమ్పెరుమానారుకి చెందిన వారైనా,వారు ఎమ్పెరుమాన్ మరియు ఎమ్పెరుమానార్ లను పట్టుకొనిరి ”అని చెప్పెను.

చివరగా ఆర్తి ప్రభందములో (పాశురము 11), మామునిగళ్ వడుగ నమ్బి స్థానమును గుర్తించి తీవ్రమైన తృష్ణతో ఎమ్పెరుమానార్ ని వారిని వడుగ నంబి వలె అనుగ్రహించమని వేడుకొనెను. వడుగ నంబికి ఎమ్పెరుమానార్ పై అపారమైన నమ్మకముచే ప్రత్యేకముగా ఎమ్పెరుమాన్ ని ఆరాదించలేదు. దీని ద్వారా మన పూర్వాచార్యులు ఎవరైతే ఆచార్యులను ఆరాదించుదురో, స్వయముగా ఎమ్పెరుమాన్ ని ఆరాదించినట్టే అని తెలిపిరి . కాని మనము ఒక్క ఎమ్పెరుమాన్ ని ఆరాదిస్తే, ఆచార్యులను ఆరాధించినట్లు కాదు. అందువలన మన సంప్రదాయములో ఆచార్యుల ఆఙ్ఞలను పాఠించడమే ముఖ్యమైన సూత్రము, మామునిగళ్ ఇది వడుగ నంబిలో పూర్తిగా ఉండెనని గుర్తించిరి.
వడుగ నంబి గారి జీవితములోని కొన్ని ముఖ్య సంఘటనలను ఇక్కడ చూసాము.వీరు పుర్తిగా భాగవత నిష్ఠతో ఉండి ఎమ్పెరుమానారుకి ప్రియ శిష్యులైరి.మనకూ అటువంటి ఆచార్య నిష్ఠ కలిగేలా వారి శ్రీ చరణములను ఆశ్రయించుదాము.

వడుగ నంబి తనియన్ :

రామానుజార్య సచ్చిశ్యమ్ సాళగ్రామ నివాసినమ్
పంచమోపాయ సంపన్నమ్ సాళగ్రామార్యమాశ్రయే

ராமானுஜார்ய ஸச்சிஷ்யம் ஸாளக்ராம நிவாஸிநம்
பஞ்சமோபாய ஸம்பந்நம் ஸாளக்ராமார்யம் ஆச்ரயே

అడియేన్ రఘు వంశీ రామానుజ దాసన్

source:

కోయిల్ కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్

శ్రీ~:
శ్రీమతే రామానుజాయ నమ~:
శ్రీమద్ వరవరమునయే నమ~:
శ్రీ వానాచల మహామునయే నమ~:

komandur-ilayavilli-achan

కొమాణ్డుర్ ఇళయవిల్లి ఆచ్చాన్ – శెంపొసెన్ కోయిల్, తిరునాంగూర్

తిరునక్షత్రము~: చైత్రమాసము చిత్రై, ఆయిల్యమ్

అవతార స్థలము~: కొమాణ్డూర్

ఆచార్యులు~: ఎమ్పెరుమానార్

పరమపదము చేరిన ప్రదేశము~: తిరుప్పేరూర్

కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్ ఎమ్పెరుమానార్ లకు ఎంబార్ వలె బందువులు. వీరిని బాలదన్వి గురు అని కూడా వ్యవహరించేవారు. ఇళయవిల్లి/బాలదన్వి అనగా అర్థము లక్ష్మణుడు – ఇళయ పెరుమాళ్ (లక్ష్మణుడు) శ్రీరాముడికి సేవలు చేసిన మాదిరిగా వీరు ఎమ్పెరుమానార్ లకు సేవలు చేసెను.ఎమ్పెరుమానార్ స్వయముగా ఏర్పరచిన 74 సింహాసనాదిపతులలో (ఆచార్యులు) వీరు ఒకరు .

వీరి తనియన్ మరియు వాజి తిరునామములో చెప్పిన విదముగా వీరికి పెరియ తిరుమలై నమ్బి (శ్రీశైల పూర్ణులు)గారికి చాలా గొప్ప సంభందము కలదు మరియు అలానే వీరు నంబి గారికి కైంకర్యము కూడా చేసిరి.

చరమ ఉపాయ నిర్ణయము ((http://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html)లో, నాయనారాచ్చాన్ పిళ్ళై ,కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్ గొప్పతనమును వర్ణించిరి.మనము ఇప్పుడు ఇక్కడ దానిని  చూద్దాము.

ఉడయవర్ పరమపదమునకు చేరినప్పుడు,చాలామంది వారిని అనుసరించిరి(వారి యొక్క ప్రాణములను వదిలిరి). కణియనూర్ సిరియాచ్చాన్ ఉడయవర్ లను వదిలి కొంతకాలము కణియనూర్ లో నివసించి తదుపరి కొంతకాలమునకు తమ ఆచార్యులను(ఉడయవర్) ప్రేమతో సేవించుటకు కోయిల్ (శ్రీరంగము)నకు బయలుదేరిరి.దారిలో,వారు ఒక శ్రీవైష్ణవుడిని కలిసి ఈ విదముగా అడిగెను “మా ఆచార్యులైన ఎమ్పెరుమానార్ ఆరోగ్యముగా ఉన్నారా?” అప్పుడు ఆ శ్రీవైష్ణవుడు ఉడయవరులు పరమపదము చేరిన విశయమును చెప్పెను.ఆ వార్తను విని,వెంటనే , కణియనూర్ సిరియాచ్చాన్ “ఎమ్పెరుమానార్ తిరువడిగళే శరణము” (எம்பெருமானார் திருவடிகளே சரணம்) అని చెప్పి వారు కూడా పరమపదించిరి. కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్ తిరుప్పేరూర్ లో నివసించేవారు. ఒక రాత్రి, తన కలలో ఆకాశములో ఉడయవరులను దివ్య రథములో కూర్చొని ఉన్నట్టుగా చూసిరి. అలానే పరమపదనాతన్ వేలమంది నిత్య సూరులు, ఆళ్వార్, నాధమునిగళ్ మరియు ఇతర ఆచార్యులు, ఇతర అనేకులు మంగళా వాయిద్యములతో ఎమ్పెరుమానారులను పరమపదమునకు తీసుకువెళ్ళుతున్నట్టుగా చూసిరి.ఆ స్వాగతమును చూసి ఎమ్పెరుమానార్ రథము పరమపదమునకు వెళ్ళుచుండగా అందరూ వారిని అనుసరించిరి.వారు వెంటనే మేల్కొని ఏమి జరిగినో తెలుసుకొనగోరి వారి యొక్క పక్కన నివసించే వారితో ఈ విదముగా చెప్పిరి “వళ్ళల్ మణివణ్ణన్”  “మన ఆచార్యులైన ఎమ్పెరుమానార్ దివ్య రథముపై ఎక్కి పరమపదమునకు పరమపదనాధులతో మరియు నిత్యసూరులతో కూడి వెళ్ళుచున్నారు. నేను ఇక్కడ ఒక క్షణమైనా ఉండలేను. ఎమ్పెరుమానార్ తిరువడిగళే శరణమ్” అని వెంటనే వారి ప్రాణమును వదిలి పరమపదమునకు చేరిరి.ఎమ్పెరుమానార్ పరమపదమునకు చేరిన వార్తను విని ఎందరో శిష్యులు ఇలా వారి ప్రాణములను వదిలిరి . ఎవరైతే ఎమ్పెరుమానార్ లతో నివసించి ఉన్నారో వారు మాత్రమే ఎమ్పెరుమానార్ ఆఙ్ఞతో ఇష్టము లేకపోయిననూ సాంప్రదాయ పరిరక్షణకై జీవించి ఉండిరి. వారిని విడచి ఉండలేక వారి శిష్యులు కూడా ప్రాణములను వదలడము ఎమ్పెరుమానార్ ల గొప్పతనము .

కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్ జీవితములోని కొన్ని గొప్ప సంఘటనలను చూశాము. వీరు పూర్తి భాగవత నిష్టను కలిగి ఉండి ఎమ్పెరుమానార్ లకు చాలా ప్రియ శిష్యులైరి.వారి వలె మనకూ భాగవత నిష్టయందు కొంతైనా అనుగ్రహము కలిగేలా వారి శ్రీ చరణములను ఆశ్రయించుదాము .

కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్ తనియన్ ~:

శ్రీ కౌశికాన్వయ మహాంభుతి పూర్ణచంద్రమ్
శ్రీ భాష్యకార జననీ సహజా తనుజమ్
శ్రీశైలపూర్ణ పద పంకజ సక్త చిత్తమ్
శ్రీబాలదన్వి గురువర్యమ్ అహమ్ భజామి

ஸ்ரீ கௌஸிகாந்வய மஹாம்புதி பூர்ணசந்த்ரம்
ஸ்ரீ பாஷ்யகார ஜநநீ ஸஹஜா தநுஜம்
ஸ்ரீஸைலபூர்ண பத பங்கஜ சக்த சித்தம்
ஸ்ரீபாலதந்வி குருவர்யம் அஹம் பஜாமி

అడియేన్
రఘు వంశీ రామానుజ దాసన్

 

source:

ముదలియాణ్డాన్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమ~:
శ్రీమద్ వరవరమునయే నమ~:
శ్రీ వానాచల మహామునయే నమ~:

mudhaliyandan

తిరునక్షత్రము~: చైత్ర మాసము, పునర్వసు

అవతార స్థలము~: పేట్టై

ఆచార్యులు~: ఎమ్పెరుమానార్

పరమపదము చేరిన ప్రదేశము~: శ్రీరంగము

శ్రీ సూక్తులు~: ధాటీ పంచకము, రహస్య త్రయము (ప్రస్తుతము ఎక్కడ అందుబాటులో లేవు)

ఆనంద దీక్షీతర్ మరియు నాచ్చియారమ్మన్ ల కుమారునిగా అవతరించిరి,వారికి ధాశరధి అని నామకరణము చేసిరి.వీరు ఎమ్పెరుమానారుకు చిన్నమ్మ కుమారుడు.వీరికి రామానుజన్ పొన్నడి, యతిరాజ పాదుక, శ్రీవైష్ణవ దాసర్, తిరుమరుమార్భన్ అని కూడా వ్యవహరించేవారు మరియు ప్రధానంగా ముదలియాణ్డాన్ (అర్థము“శ్రీవైష్ణవులకు నాయకుడు”) గా ప్రాశస్తమును పొందిరి.వీరు ఈ విధముగా కూడా వ్యవహరించబడేవారు ఎమ్పెరుమానార్ (యతిరాజ పాదుకా)యొక్క శ్రీ చరణములు మరియు ఎమ్పెరుమానార్ యొక్క త్రిదండము.గమనిక~: ఆళ్వాన్(కూరత్తాళ్వాన్) మరియు ఆణ్డాన్ ఇద్దరూ ఎమ్పెరుమానార్ కి చాలా ప్రియమైనవారు మరియు వారి నుండి వీరిని వెరుచేయలేము – కూరత్తాళ్వాన్ లను ఎమ్పెరుమానార్ యొక్క జల పవిత్రము (ఎమ్పెరుమానార్ యొక్క త్రిదండమునకు కట్టబడిన జెండా) గా వ్యవహరించెదెరు.

azhwan-emperumanar-andan

ఆళ్వాన్, ఎమ్పెరుమానార్, ఆణ్డాన్ – వారి యొక్క అవతార స్థలములలో

ఎమ్పెరుమానార్ ఆణ్డాన్ యెడల గొప్ప ఇష్టమును కలిగిఉండేవారు కారణము వారి యొక్క భగవత్/భాగవత నిష్ట (భగవాన్ మరియు అతని భక్తుల యందు గల సంభందము). ఎమ్పెరుమానార్ సన్యాసమును స్వీకరించిన సమయములో,వారు ఒక్క ఆణ్డాన్ యందు తప్ప మిగిలిన బంధములన్నీ వదిలివేసామని చెప్పిరి –అది ఆణ్డాన్ యొక్క గొప్పతనము.ఎమ్పెరుమానార్ సన్యాసాశ్రమము స్వీకరించిన తరువాత, ఆళ్వాన్ మరియు ఆణ్డాన్ ప్రథమంగా వారి యొక్క శిష్యులైరి. వారిద్దరూ ఎమ్పెరుమానార్ వద్ద శాస్త్రములను (ఉభయ వేదాంతము – సంస్కృతము మరియు అరుళిచ్చెయల్) వాటి యందు గల సారములను నేర్చుకొనిరి. వారు ఎమ్పెరుమానార్ తో పాటు కాంచీపురమును వదిలి శ్రీరంగమునకు వెళ్ళిరి.ఎమ్పెరుమానార్ యొక్క దివ్యాఙ్ఞతో, ఆణ్డాన్ కోవెల యొక్క పూర్తి అధికార భాద్యతలను తీసుకొని అన్ని పనులను సరైన నిర్వహణతో ( కార్యములను) నిర్వర్తించెను.

తిరుక్కోట్టియూర్ నంబి ఎమ్పెరుమానార్ లకు చరమ శ్లోకము యొక్క అర్థములను అనుగ్రహించిన తరువాత, ఆణ్డాన్ ఎమ్పెరుమానార్ లని వారికి కూడా అనుగ్రహించవలసినదిగా కోరిరి. ఎమ్పెరుమానార్ ఆణ్డాన్ ని నంబి వద్దకి వెళ్ళి అభ్యర్తించమనిరి. ఆణ్డాన్ 6 నెలలు నమ్బి గారి తిరుమాళిఘ (గృహము) నందు ఉండి ఎంతో ఓపికతో సేవలను చేసెను.6 నెలలు గడిచిన తదుపరి,ఆణ్డాన్ నంబి  గారిని చరమ శ్లోకము యొక్క అర్థములను అనుగ్రహించవలసినదిగా కోరగా , నంబి ఈ విదముగా అన్నారు మీరు మీ యొక్క ఆత్మ గుణములను పూర్తిగా మెరుగుపరచుకొన్నచో ఎమ్పెరుమానార్ స్వయముగా అనుగ్రహించుదురని చెప్పిరి. నంబి వారి యొక్క శ్రీ చరణములను ఆణ్డాన్ యొక్క శిరస్సుపై ఉంచి వారికి వీడ్కోలు పలికిరి. ఎమ్పెరుమానార్ ఆణ్డాన్ యొక్క రాకను చూచి,ఆణ్డాన్ యొక్క భావము (దాస్యము యందు)నకు సంతోషించి చరమ శ్లోకము యొక్క అర్థములను అనుగ్రహించిరి.

mudhaliyandan-sridhanavellAtti

ఆణ్డాన్ ఎమ్పెరుమానార్ లకు పుర్తి దాసులవడము ఈ చరితము (చారిత్రక సంఘటన)ద్వారా తెలుసుకోవచ్చును.

ఒకసారి పెరియ నంబి గారి కూతురైన అత్తుజాయ్ తన అత్తగారి వద్దకి వెళ్ళి  తాను నది కి వస్త్ర ప్రక్షాళనకు /స్నానానికి ఒంటరిగా వెళ్ళుచున్నాను కావున సహాయానికి ఎవరినైన పంపించ వలసినదని కోరగా దానికి వారి అత్తగారు మీ పుట్టింటి నుండి స్త్రీధనంగా సహాయకులను  తెచ్చుకోవలసినది” అని బదులిచ్చినది.  అత్తుజాయ్ తన యొక్క తండ్రి గారు వద్దకి వెళ్ళి (సహాయకునికై)ఏర్పాటు చెయమని కోరెను. పెరియ నంబి తాను పూర్తిగా ఎమ్పెరుమానార్ పై ఆదారపడటముచే వారి వద్దకు వెళ్ళి అడుగమనెను,ఆమె వెళ్ళి వారిని ఈ విషయమున అభ్యర్తించింనది. ఎమ్పెరుమానార్ ఆ ప్రదేశములో చుట్టూ చూసి ఆణ్డాన్ ను అత్తుజాయ్ కి సహాయకుడిగా వెళ్ళమని ఆఙ్ఞాపించిరి. ఆణ్డాన్ వారి యొక్క ఆఙ్ఞకు పాఠించి ఆమె వెంట వెళ్ళెను.వారు ఆమెకు నిత్యమూ సహాయమును చేయుచుండిరి. అత్తుజాయ్ అత్తగారు ఇది చూసి ఆందోళన చెందిరి కారణము ఆణ్డాన్ (అతను గొప్ప పండితుడు మరియు రామానుజ శిష్యులలో నాయకుడు) వారి యొక్క గృహమునకు వచ్చి దాస్యము చేయడము.అందువలన ఆమె వారిని ఆ పనులు చేయవద్దనిరి. ఆణ్డాన్ వెంటనే ఇది ఎమ్పెరుమానార్ యొక్క ఆఙ్ఞ కావున నేను చేస్తానని చెప్పెను.ఆమె వెంటనే పెరియ నంబి గారి వద్దకు వెళ్ళగా వారు ఎమ్పెరుమానార్ వద్దకు పంపిరి. ఎమ్పెరుమానార్ ఈ విదముగా చెప్పెను“మీరు కోరడముచే మేము సహాయకుడిని పంపితిమి –మీకు వద్దైతే అతడిని వెనుకకు పంపడి”. అత్తుజాయ్ అత్తగారు తన యొక్క తప్పును గ్రహించి పెరియ నంబి, ఎమ్పెరుమానార్, ఆణ్డాన్ యొక్క గొప్పతనమును గుర్తించి ఆపై అత్తుజాయ్ విషయమున శ్రద్దను తీసుకొనెను.ఈ యొక్క సంఘటన తమ యొక్క ఆచార్యుల ఆఙ్ఞలను పాఠించడములో ఆణ్డాన్ యొక్క గొప్పతనమును తెలియచేయును .మనము దీని ద్వారా సులభముగా గ్రహించవచ్చు,ఎవరైతే ఎమ్పెరుమానార్ శ్రీ చరణ దాసులమని చెప్పుదురో,ఎవరైతే ఎమ్పెరుమానార్ శ్రీచరణ దాసులుగా భావిస్తారోవారందరు ఇలాంటి పవిత్రమైన /కళ్యాణ గుణములను కలిగి ఉంటారు. ఈ గుణముల సారభూతునిగా  ముదలిఆండాన్   ఉన్నారని గ్రహించవచ్చు.

mudhaliyandan-sripadhathirtham

శైవరాజు ఆగడములు భరించక ఆణ్డాన్ కూడా ఎమ్పెరుమానార్ తో కూడి మేల్కోటె (తిరునారాయణపురము) ప్రయాణించిరి.ఒక ప్రదేశములో మిథులాపురి సాగ్రామము, అక్కడ నివశించే ప్రజలు అవైదికముగా ఉండేవారు. ఎమ్పెరుమానార్ ఆణ్డాన్ తో  ఆ గ్రామ ప్రజలు స్నానము చేయు చోట(నదిలో) వారి యొక్క శ్రీచరణాములను ఉంచమని చెప్పిరి. ఆణ్డాన్ తమ శ్రీపాదములను నదిలో ఉంచుటచే నదిలో అందరూ స్నానము చేయడము వలన  వారు ఆణ్డాన్ యొక్క శ్రీపాద సంభందముచే,వారు పునీతులైరి.ఆ మరునాటి నుండి ప్రతీ ఒక్కరు  ఎమ్పెరుమానార్ వద్దకు వచ్చి వారిని ఆశ్రయించెను.అందువలన ,మనము ఈ సంఘటన ద్వారా ఒక స్వచ్చమైన శ్రీవైష్ణవుని శ్రీ పాద తీర్థము అందరినీ పునీతులగా చేయుననే విశేషమును గ్రహించవచ్చును.

ముదలియాణ్డాన్ కుమారులైన కందాడై ఆణ్డాన్ ఎమ్పెరుమానార్ యొక్క ఆఙ్ఞను తీసుకొని ఎమ్పెరుమానార్  ఒక అర్చా విగ్రహమును తయారు చేసిరి . ఎమ్పెరుమానార్ ప్రేమతో ఆ విగ్రహమును ఆలింగనము చేసుకొనిరి.ఆ యొక్క విగ్రహమును వారి అవతార స్థలములో (శ్రీపెరుంబూతూర్)తై పుష్యమిన(ఈ రోజును గురు పుష్యమిగా ఇప్పడికీ శ్రీపెరుంబూతూర్ లో నిర్వహించుదురు)ప్రతిష్టించిరి మరియు ముఖ్యముగా  తాముగంద తిరుమేని (ఆ విగ్రహము రామానుజులకి ప్రియము కావడముచే)గా ప్రసిద్దిగాంచెను.

ఆణ్డాన్  ఆఙ్ఞలను మరియు వారి యొక్క కీర్తిని వ్యాఖ్యానములో వివిద ప్రదేశములలో ఉదహరించబడెను.వాటిలో కొన్ని మనమూ ఇక్కడ చుద్దాము:

 • తిరువాయ్ మొజి 2.9.2 – నమ్పిళ్ళై ఈడు వ్యాఖ్యానము – ఆణ్డాన్ ఔదార్యం ఈ సంఘటనందు అందముగా వివరించెను.ఒకసారి ఆణ్డాన్ నగరములో లేని సమయమున అతని శిష్యుడొకరు ఎమ్బార్ వద్దకి వెళ్ళెను. ఎమ్బార్ ఆ శ్రీ వైష్ణవుడి కైంకర్యమును అంగీకరించిరి కారణము అతనికి ఆచార్య సంభందము లేదని,వారు అతడికి పంచ సంస్కారములని అనుగ్రహించి దైవ విషయములను చెప్పుచుండెను.అప్పుడు ఆణ్డాన్ తిరిగి రాగా, ఆ శ్రీవైష్ణవుడు తిరిగి ఆణ్డాన్ వద్దకి వచ్చి కైంకర్యమును చేయసాగెను. ఎమ్బార్ దానిని గురించి తెలుసుకొని ఆణ్డాన్ వద్దకి వచ్చి ఈ విదముగా చెప్పిరి “నాకు ఇతను మీ  శిష్యుడని తెలియక అలాచేయడమైనదని అందుకు తన అపచారమును మన్నించమనిరి”. ఆణ్డాన్, ప్రశాంతముగా సమాదానమును చెప్పిరి “ఎవరైనా బావిలో పడినప్పుడూ,ఇద్దరు కలిసీ అతడిని బయటకు తీస్తే,అది చాలా సులభము.అలానే,ఇతను సంసారములో ఉన్నాడు కావున,మనమిద్దరమూ సహాయము చేస్తే అది లాభమే కదా”.ఇటువంటి ఉదార హృదయమును కలిగి ఉండడము చాలా అరుదు దానిని  మనము ఆణ్డాన్ వద్ద చూడవచ్చు.
 • తిరువాయ్ మొజి 3.6.9 – నమ్పిళ్ళై ఈడు వ్యాఖ్యానము – ఈ పదిగములో ఆణ్డాన్ అర్చావతార ఎమ్పెరుమాన్ యొక్క గొప్పతనమును పూర్తిగా వివరించిరి. “పరమపదనాథుడు తన భక్తులపై కృపతో అర్చావతారముగా  ఇక్కడ  అవతరించిరని భావించరాదు. దానికి బదులుగా   అర్చావతారమే చాలా ప్రథానమైనదని మరియు పరవాసుదేవుడిగా తాను ఇక్కడ పరమపదము నుండి విచ్చేశాడని భావించాలి”. 
 • తిరువాయ్ మొజి 5.6.7 – నమ్పిళ్ళై ఈడు వ్యాఖ్యానము – ఈ పదిగములో, ఎమ్పెరుమాన్ యొక్క సర్వ వ్యాపకత్వమును (సర్వాంతర్యామి) గురించి వివరించెను.ఇక్కడ పరాంకుశ నాయకి(నమ్మళ్వార్ స్త్రీ భావనతో పాడినపుడు పరాంకుశ నాయకి అని పేర్కొంటారు.)ఎంపెరుమాన్ తమ బంధువులను నాశనము చేస్తాడు అన్నారు. దానికి ఆణ్దాన్ “ఎంపెరుమాన్ తన దివ్య సౌందర్యముతో(తన భక్తులను పూర్తిగా ద్రవింపచేసి ) నాశనము చేస్తాడు”అని చక్కటి వ్యాఖ్యానము చేసారు.
 • తిరువాయిమొళి-6.4.10- నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము-ఇక్కడ్ ఆణ్దాన్ అర్చావతార ఎంపెరుమాన్ ప్రణవత వర్ణిచబడింది(విశేషముగా నంపెరుమాళ్ మీద)..ఎంబార్,ఆణ్దాన్ల మీద నంజీయర్ చేసిన వ్యాఖ్యను నంపిళ్ళై  గుర్తించారు.సంసారములో చాలా మంది పరమాత్మ పట్ల విముఖులుగా వున్నారు.అర్చావతార ఎమ్పెరుమాన్ సుకుమారుఢై పూర్టిగా తన భక్టుల మీద ఆదారపఢ్ఢాఢు.బ్రహ్మోత్సవము తరువాత ఎమ్బార్,ఆణ్డాన్ కలుసుకున్నప్పుఢు పరస్పరము అభివాదాలింగనముల తరువాత”నమ్పెరుమాళ్ (శ్రీరంగనాధులు) ఉత్సవాంతరము క్షేమముగా ఆస్థానము చేరారు.” అని సంతసించారు.మన పూర్వాచార్యుల లగా పెరుమాళ్ళకు మంగళాశాసనము చేయుటమీద వీరికి ఆసక్తి అధికం.
 • తిరువాయ్ మొజి 8.10.3 – నమ్పిళ్ళై ఈడు వ్యాఖ్యానము~:భట్టర్ చిన్నతనములో, ఆళ్వాన్ ని “శిరుమామనిశర్” (తిరువాయ్ మొజి 8.10.3)యొక్క అర్థమును అడిగిరి. కారణము అది విరుద్దముగా కనబడడముచే. అందుకు, ఆళ్వాన్ ఈ విదముగా చెప్పెను ‘శ్రీవైష్ణవులైన ముదలియాండాన్, ఎంబార్ మరియు అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ శారీరకముగా చిన్నవారు కాని నిత్య సూరుల వలె గొప్పవారు.
 • తిరువాయ్ మొజి 9.2.8 – నమ్పిళ్ళై ఈడు వ్యాఖ్యానము – శ్రీ రంగములో శ్రీజయంతి పురప్పాడు సమయమున, వంగీపురత్తు నంబి ఎమ్పెరుమాన్ ని సేవించుటకై గొల్లపిల్లల సమూహమున చేరిరి. ఆణ్డాన్ అక్కడ ఉన్నారేమిటని అడుగగా, నంబి ఈ విదముగా చెప్పెను “నేను విజయస్వ అని చెప్పితిని”. ఆణ్డాన్ అందుకు సమాదానముగా మీరు వారి మద్యన ఉండి,వారి యొక్క భాషను మాట్లాడక కష్టమైన సంస్కృతమును ఎందుకు మాట్లాడుతున్నారని అడిగిరి.

ముదలియాణ్డాన్ జీవితములోని కొన్ని విషయములను ఇక్కడ మనమూ చూసాము.వారు పూర్తిగా భాగవత నిష్ట కలిగి ఉండి ఎమ్పెరుమానార్ లకు ప్రియమైన శిష్యులైరి.మనమూ అటువంటి భాగవత నిష్ట కలుగవలెనని వారి శ్రీ చరణములను ఆశ్రయించుదాము.

ముదలియాణ్డాన్ యొక్క్ తనియన్ ~:

పాదుకే యతిరాజస్య కథయంతి యదాఖ్యయా|

తస్య దాశరథే పాదౌ శిరసా ధారయామ్యహం ||

 

பாதுகே யதிராஜஸ்ய கதயந்தி யதாக்யயா
தஸ்ய தாஸரதே: பாதௌ சிரஸா தாரயாம்யஹம்

 

అడియేన్

రఘు వంశీ రామానుజ దాసన్

source:

 

అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ – తిరుప్పాడగమ్ 

తిరునక్షత్రము: కార్తీక మాసము, భరణీ

అవతార స్థలము: వింజిమూర్

ఆచార్యులు: ఎమ్పెరుమానార్

శిష్యులు: అనన్తాళ్వాన్, ఎచ్చాన్, తొణ్డనూర్ నంబి, మరుదూర్ నంబి మొదలగు వారు

గ్రంథములు: ఙ్ఞాన సారము, ప్రమేయ సారము.

వింజిమూర్ (ఆంధ్ర ప్రదేశ్)అను గ్రామములో జన్మించిరి.  వీరు అద్వైతిగా ఉన్న సమయమున యఙ్ఞమూర్తి అను నామముతో ప్రసిద్దులు. వీరు ఒకసారి గంగాస్నానము చేయుటకు వెళ్ళి అక్కడ ఎందరో విద్వాంసులపై విజయమును సాధించి మాయావాద సన్యాసిగా మారిరి. వీరికి శాస్త్రముపైన అపారమైన ఙ్ఞానము ఉండడముచే  గొప్ప పేరును  మరియు ఎంతో మంది శిష్యులను సంపాదించిరి. ఎమ్పెరుమానార్ యొక్క కీర్తిని గురించి విన్నవారై  వారితో వాదము చేయవలెనని కోరిక కలిగెను. వారు చాలా గ్రంథములను లిఖించి తమ శిష్యులతో  శ్రీరంగమునకు ఎమ్పెరుమానార్(భగవద్రామానుజులు)  ను కలుసుకోవటానికై బయలు దేరిరి.

ఎమ్పెరుమానార్ యఙ్ఞమూర్తిని ఆహ్వానించి, వారితో 18 రోజులు వాదము చేయుటకు ఏర్పాట్లు చేసుకొనిరి. వాదములో ఓడిపోతే యఙ్ఞ మూర్తి తన యొక్క పేరును ఎమ్పెరుమానార్ గా మార్చుకొందునని, ఎమ్పెరుమానార్ యొక్క పాదుకలను  శిరస్సుపై ధరించి వారికి శిష్యులుగా మారుతానని ప్రతిఙ్ఞ చేసిరి. ఎమ్పెరుమానార్ కూడా అతడు గెలిచినట్లైతే తానిక  గ్రంథములను ముట్టనని చెప్పిరి.

వాదము మొదలై 16 దినములు గడిచినది. ఇద్దరూ కూడ వాదములో అనర్గళముగా మరియు ఆగ్రహముగా రెండు ఏనుగులు ఏ విధముగా అయితే కలహపడునో ఆ విధముగా వాదమును చేయుచుండిరి. 17 వ రోజున యఙ్ఞమూర్తి కాస్త పైచేయి సాధించిరి. అప్పుడు ఎమ్పెరుమానార్ కాస్త కలతచెంది తమ మఠమునకు వెళ్ళిరి. రాత్రి,వారు పేరరుళాళన్  అను(వారి తిరువారాధన పెరుమాళ్)ధ్యానమును చేసి వారిని  ప్రార్థించి ‘ ఒకవేళ తాను వాదమున౦ ఓడిపోతే అది నమ్మాళ్వార్ మరియు ఆళవందార్లచే పెంచబడిన  సంప్రాదాయము దెబ్బతినునని ,  అటువంటి దురదృష్టమునకు తానే కారణము  కాకూడదని అని చింతించసాగిరి’. పేరరుళాళన్ ఎమ్పెరుమానార్ యొక్క కలలో కనిపించి చింతించవసరము లేదని, ఇది వారికి సరిసమానమైన ఙ్ఞానమును కలిగిన శిష్యుడిని అనుగ్రహించే ఒక దైవలీల అని చెప్పెను .ఎమ్పెరుమానార్ ని ఆళవందార్ యొక్క మాయావాదముచే ఖండించి యఙ్ఞ మూర్తిని వాదములో ఓడించమని చెప్పిరి. ఎమ్పెరుమానార్ , ఎమ్పెరుమాన్(భగవానుని) యొక్క గొప్పదనమును గ్రహించిరి.  తెళ్ళవార్లు  ఎమ్పెరుమాన్ యొక్క తిరునామములను అనిసంధిస్తు గడిపిరి. నిత్యానుష్టానములను మరియు తిరువారాధనను పూర్తిచేసుకొని చివరి రోజైన(18వ) వాదమునకు గంభీరముగా వచ్చెను. యఙ్ఞమూర్తి వివేకమును కలిగి ఉండడముచే వెంటనే ఎమ్పెరుమానార్ యొక్క తేజమును చూసి వారి యొక్క శ్రీ చరణములను ఆశ్రయించి, ఎమ్పెరుమానార్ యొక్క పాదుకలను తమ శిరస్సుపై ఉంచుకొని తమ అపజయమును అంగీకరించెను. ఎమ్పెరుమానార్ తదుపరి వాదమును చేద్దామా అని అడుగగా యఙ్ఞమూర్తి ఈ విధముగా అనెను  “తనకు ఎమ్పెరుమానార్ మరియు పెరియ పెరుమాళ్ వేరుకాదని ,ఇక వాదము అవసరము లేదని చెప్పిరి”. కాని ఎమ్పెరుమానార్ తమ  కృపచే సరియగు ప్రమాణాములచే ఎమ్పెరుమాన్ యొక్క సత్వగుణత్వములను చూపెను. యఙ్ఞమూర్తి తనకు సన్యాసాశ్రమమును అనుగ్రహించవలసినదిగా ఎమ్పెరుమానార్ ను    వేడుకొనిరి. ఎమ్పెరుమానార్ వారిని యఙ్ఞోపవీతమును (మాయవాద సన్యాసిగా ఉండడముచే)తీసివేసి పిమ్మట ప్రాయచిత్తమును చేయవలెని ఆఙ్ఞాపించిరి.అటుపిమ్మట, ఎమ్పెరుమానార్ వారికి త్రిదండకాషాయములను ఇచ్చి అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ అను  దాస్య  నామమును అనుగ్రహించిరి. కారణము పేరరుళాళన్(తమ తిరువారాధన పెరుమాళ్) చేసిన సహాయమునకు గుర్తుగా  యఙ్ఞ మూర్తి కోరిన విదముగా ఎమ్పెరుమానార్ అను తమ నామము ఉండవలెనని. అదే విధముగా ఎమ్పెరుమానార్ అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానారుని నమ్పెరుమాళ్ మరియు తమ తిరువారాధన పెరుమాళ్ దగ్గరికి తీసుకువెళ్ళి ‘మన కలయిక  వారు ఆడిన దైవలీల’ అని చెప్పెను.

ఎమ్పెరుమానార్ స్వయముగా అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానారుకి అరుళిచెయల్ మరియు వాటి  అర్థములను అనుగ్రహించిరి. అప్పుడు శ్రీరంగమునకు  అనన్తాళ్వాన్, ఎచ్చాన్ మొదలగు వారు ఎమ్పెరుమానార్ యొక్క శిష్యులవుదామని వచ్చిరి.  ఎమ్పెరుమానార్,  అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ వద్ద పంచసంస్కారములను పొందవలసినదిగా వారిని ఆదేశించిరి. అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ వారి శిష్యులకు సదా ఎమ్పెరుమానారే  ఉపాయము అని  ఆదేశించిరి.

అలానే అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానారుకు విశేషమైన కైంకర్యమగు తమ తిరువారాధన పెరుమాళ్ అయిన  పేరరుళాళన్ ఎమ్పెరుమానుకి  తిరువారాధనమును సమర్పించవలెనని చెప్పిరి.

ఒకసారి శ్రీరంగమునకు వచ్చిన ఇద్దరు శ్రీవైష్ణవులు  “ఎమ్పెరుమానార్ యొక్క మఠము ఎక్కడ?” అని అడిగెను. ఆ సమయములో  స్థానికుడు  “ఏ ఎమ్పెరుమానార్?” అని అడిగెను. ఆ శ్రీవైష్ణవులు “మన సాంప్రదాయములో ఇద్దరు ఎమ్పెరుమానారులు ఉన్నారా?” అని అడుగగా అతడు ఈ విధముగా చెప్పెను,  “అవును, ఎమ్పెరుమానార్ మరియు అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ ” అనెను. అప్పుడు శ్రీవైష్ణవులు చివరికి  “మేము అడిగినది ఉడయవరుల యొక్క మఠము” అనగా ,అతను మఠమునకు పోవు దారిని చూపెను.ఆ సమయమున అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ అక్కడ ఉండడముచే అది విని దానికి కారణము తాను వేరొక మఠములో ఉండడమువలన ఈ విధముగా జరిగెనని కలత చెందిరి. వెంటనే వారు తమ యొక్క మఠమును నాశనము చేసి, ఎమ్పెరుమానార్ వద్దకి వచ్చి ఇంక తాను వేరొక ప్రదేశములో నివసించలేనని , జరిగిన సంఘటనను చెప్పెను . ఎమ్పెరుమానార్ అందుకు అంగీకరించి వారికి రహస్యార్థములను అనుగ్రహించెను.

అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్  తమిళములో ‘ఙ్ఞానసారము’ మరియు ‘ప్రమేయ సారము’ అను రెండు ప్రబంధములను అనుగ్రహించిరి .ఈ  రెండు ప్రబంధములు మన సంప్రాదాయములోని విశేష అర్ఠములను వెలికి తీయును. ముఖ్యముగా ఆచార్యుల యొక్క వైభవమును అందముగా చెప్పెను. పిళ్ళై లోకాచార్యుల  తమ శ్రీవచనభూషణము,  అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్  ప్రభంధములలోని విశేషములను వివరించిరి  . మామునిగళ్ ఈ ప్రబంధములకు అందమైన వ్యాఖ్యానమును అనుగ్రహించిరి.

భట్టర్ చిన్నతనములో, ఆళ్వాన్ ని “శిరుమామనిశర్” (తిరువాయ్ మొజి 8.10.3)యొక్క అర్థమును అడిగిరి. కారణము అది విరుద్దముగా కనబడడముచే. అందుకు, ఆళ్వాన్ ఈ విదముగా చెప్పెను ‘శ్రీవైష్ణవులైన ముదలియాండాన్, ఎంబార్ మరియు అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ శారీరకముగా చిన్నవారు కాని నిత్య సూరుల వలె గొప్పవారు.ఈ చరితము నంపిళ్ళై తమ  ఈడు మహా వ్యాఖ్యానములో చెప్పెను.

ఎమ్పెరుమానార్ ను నిత్యము స్మరించే అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ యొక్క శ్రీచరణములను మనం  ఆశ్రయించుదాము.

అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్  తనియన్

రామానుజార్య సచ్చిష్యమ్ వేదశాస్త్రార్థ సంపదం|
చతురాశ్రమ సంపన్నం దేవరాజ మునిమ్ భజే||

ராமானுஜார்ய ஸச்சிஷ்யம் வேதஸாஸ்த்ரார்த்த ஸம்பதம்
சதுர்தாஸ்ரம ஸம்பந்நம் தேவராஜ முநிம் பஜே

అడియేన్
రఘు వంశీ రామానుజదాసన్

సూచన:  ప్రమేయసారమున కు  శ్రీ మణవాళమామునులు అనుగ్రహించిన ద్రావిడ వ్యాఖ్యానమునకు  డా||ఉ.వే ఈ.ఏ.శింగరాచార్య స్వామి వారు తెలుగు అనువాదంతో(అరుళాళప్పెరుమాళ్ ఎంపెరుమానార్ వైభవముతో  ) అనుగ్రహించిన కోశము ఉన్నది . కావలసిన వారు  శ్రీరామానుజ సిద్ధాంతసభ, సికింద్రాబాద్ , నల్లా  శశిధర్ రామానుజదాసున్ని సంప్రదించగలరు. 9885343309

Source