శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీవానాచల మహామునయే నమ:
నంపిళ్ళై కాలక్షేప గోష్ఠి – ఎడమ వైపు నుండి 2వ వారు పిన్భళగియ పెరుమాళ్ జీయర్
నంపిళ్ళై శ్రీచరణములందు పిన్భళగియ పెరుమాళ్ జీయర్ , శ్రీరంగము
తిరునక్షత్రం : తులామాసము, శతభిష నక్షత్రము
అవతార స్థలము : తిరుప్పుట్కుళి
ఆచార్యులు : నంపిళ్ళై
పరమపదించిన స్థలము: శ్రీరంగము
రచనలు : ఆరాయిరప్పడి గురు పరంపరా ప్రభావం. “వార్థా మాలై” కూడా వీరే రాశారని అంటారు. కాని సరి అయిన ఆధారాములు లభించుట లేదు.
పిన్భళగియ పెరుమాళ్ జీయర్ , నంపిళ్ళై ప్రియ శిష్యులు. ఆరాయిరప్పడి గురు పరంపరా ప్రభావములో మన పూర్వాచార్యుల, ఆళ్వార్ల గురించిన విశేషాలను చక్కగా పొందు పరచారు. అందులో నంజీయర్ సన్యాసులై వుండి, గృహస్తులైన భట్టరును సేవించినట్లుగా,పిన్భళగియ పెరుమాళ్ జీయర్ సన్యాసులై వుండి గృహస్తులై నంపిళ్ళైని సేవించారని తెలిపారు.
ఒక సారి పిన్భళగియ పెరుమాళ్ జీయర్ అనారోగ్యము పాలైనారు. అప్పుడు వారు తన శిష్యులను చూసి తను త్వరగా కోలు కోవాలని పెరుమాళ్ళను ప్రార్థించమని అడిగారు. శ్రీవైష్ణవులేవరూ అలా కోరుకోరు. ఇది తెలిసి నంపిళ్ళై శిష్యులను పంపి విషయమేమిటో తెలుసుకోవాలనున్నారు. నంపిళ్ళై మొదట సకల శాస్త్ర పారంగతులైన ఎంగళాళ్వాను యొక్క అభిప్రాయమును తెలుసుకోవాలని శిష్యులను వారి దగ్గరికి పంపారు. ఎంగళాళ్వాన్ దానికి “వారు బహుశా శ్రీరంగముతో ఉన్న సంభందము వలన అలా అన్నరేమో” అని తన అభిప్రాయాన్ని తెలియజేసారు. నంపిళ్ళై శిష్యులను తిరునారాయణపురతు అరయర్ దగ్గరికి పంపారు. దానికి – అరయర్ “పూర్తి కావలసిన పనులేవైనా మిగిలిపోయాయేమో! అందుకనే వారు ఈ లోకములో ఇంకా కొంతకాలము ఉండాలనుకుంటున్నారేమో” అన్నారు. నంపిళ్ళై ఈ సారి అమ్మంగి అమ్మాళ్ దగ్గరికి శిష్యులను పంపారు. వారు “నంపిళ్ళై కాలక్షేప గోష్టిని వదల లేక అలా అన్నారేమో” అని బదులిచ్చారు. నంపిళ్ళై, పెరియ ముదలియార్ దగ్గరికి శిష్యులను వెళ్ళమన్నారు. నంపెరుమాళ్ళతో ఉన్న అనుబంధము వలన వారిని వీడి వెళ్ళటానికి ఇష్టపడటం లేదేమో” అన్నారు . నంపిళ్ళై చివరగా జీయరునే కారణమడగగా, “పైవేవీ కారణాలు కావు .తమరికే తెలుసు. అయినా కృపతో అడుగుతున్నారు. తమరు ప్రతి రోజు స్నానము చేసిన తరువాత తమ దివ్య దర్శనము చేసుకొని వీవెన వీయటము ఇత్యాది కైంకర్యములను చేస్తూ వుంటాను కదా? పరమ పదము కోసము వాటిని ఎలా వదులుకోగలను?” అన్నారు.పిన్భళగియ పెరుమాళ్ జీయర్ ఉత్తమ శిష్యులు తమ ఆచార్యుల పట్ల చూపవలసిన అభిమానమును ఈ విధముగా ఆచరించి చూపారు.ఇది విన్న వారందరూ జీయరుకున్న ఆచార్య భక్తికి మురిసి పోయారు.
వీరి పురుషకారముతోనే నడువిల్ తిరువీది పిళ్ళైభట్టరు నంపిళ్ళై శిష్యులైనారు. ఈ విషయాలను ఇంకా వివరముగా https://guruparamparaitelugu.wordpress.com/2015/05/07/naduvil-thiruvidhi-pillai-bhattar/ అనే లింకు ద్వారా చూడవచ్చును.
ప్రబంధ వ్యాఖ్యానములలో,పిన్భళగియ పెరుమాళ్ జీయర్కు సంభంధించిన మరి కొన్ని అంశాలను తెలు స్తున్నాయి. అవేమిటో చూద్దాము.
*ఉపధేశ రత్న మాల 65,66 – పిళ్ళై లోకం జీయర్ వ్యాఖ్యానం –ఆచార్యుల పట్ల సంపూర్ణ శరణాగతి చేసే అంశము గురించి పిళ్ళై లోకాచార్యుల శ్రీవచన భూషణ దివ్య శాస్త్రము లోని 333 సూత్రములోను, మణవాళ మామునుల ఉపధేశ రత్న మాల 65,66 పాశురముల లోను తెలుపడినది. 66వ పాసురములో,పిన్భళగియ పెరుమాళ్ జీయర్ కు నంపిళ్ళైతో గల అనుబంధము వారికి పరమపధం కూడ వద్దనుకునేటంత గొప్పదని పేర్కొన్నారు. పిళ్ళై లోకం జీయర్ పిన్భళగియ పెరుమాళ్ జీయర్లకు నంపిళ్ళై మీద కల ఆచార్య నిష్టను మదురకవి ఆళ్వార్లు– నమ్మాళ్వార్, ఆణ్దాళ్ – పెరియాళ్వార్, వడుగ నంబి –ఎంపెరుమానార్ ,మామునులు – తిరువాయిమొళి పిళ్ళైతో పోల్చారు. వీరంతా ఆచార్య నిష్టకు గొప్ప ఉదాహరణ. అప్పిళ్ళై యతిరాజ వింశతికి వ్యాఖ్యానము చేస్తూ పిళ్ళై లోకం జీయరు,పిన్భళగియ పెరుమాళ్ జీయర్, నంపిళ్ళైను తన యజమానిగా భావించి వారినే సదా ఎకాగ్రతతో స్మరిస్తూ వుండే వారని పేర్కొన్నారు.
*వార్త మాలలో, పిన్భళగియ పెరుమాళ్ జీయరుకు సంబంధించిన కొన్ని సంఘటనలను చూద్దాము.
• 2 లో – పిన్భళగియ పెరుమాళ్ జీయర్ ఒక సారి నంపిళ్ళైని స్వరూపం, ఉపాయం , ఉపేయం గురించి అడిగారు. దానికి నంపిళ్ళై జీవాత్మయొక్క ఇచ్చ స్వరూపము, భగవంతుని దయ ఉపాయం, ఆనందము ఉపేయమని చెప్పారు. జీయరు నేను మరొక విధముగా అనుకున్నానన్నారు. నంపిళ్ళై ఆశ్చర్యపోయారు. వీరు ఇంకా గొప్పగా ఆలోచించారా అనుకుని మీ అభిప్రాయమేమిటో చెప్పండని అడిగారు. శ్రీవైష్ణవులకు దాసులవుట స్వరూపము, వారితో సంబంధము ఉపాయము, వారి ఆనందము నా లక్ష్యము అని వివరించారు. నంపిళ్ళై జీయరు మాటలు విని మహదానందపడ్డారు. “భాగవత శేషత్వము”ను తమ ఆచార్యుల వద్ద జీయర్ ఈ విధముగా నిరూపించారు.
• 69 లో– జీయరు, నంపిళ్ళైని ద్వయ మహా మంత్రము యొక్క వివరణను కోరారు. నంపిళ్ళై మొదటి భాగమైన “శ్రీమన్ నారాయణ …” సంపూర్ణ శరణాగతి, ద్వితీయ పాదములో ఉభయులకు కైంకర్య ప్రాప్తి (పెరుమాళ్ మరియు పిరాట్టి) కోరుతూ అది కూడా ఆ శ్రీమన్నారాయణుని ముఖోల్లాసము కొరకే చేయాలి. అదే చేతనుడికి అత్యుత్తమ లక్ష్యము కావాలి. దీనికి సంపూర్ణ ఆచార్య అనుగ్రహము శిష్యులపై ప్రసరించాలి అన్నారు.జీయరు, పిరాట్టి ఎప్పుడు ఎంపెరుమాన్ సేవలో నిమగ్నమై వుంటారు కదా! జీవాత్మలను ఎలా ఉద్దరిస్తారు? అని అడిగారు. దానికి నంపిళ్ళై, భగవంతుడు ఎల్లప్పుడు పిరాట్టి అందమును చూస్తూ ఆనందిస్తున్నా చేతనుల సమ్రక్షణ విడువనట్లుగానే ఆ తల్లి కూడా చేతనులకు సదా సహకరిస్తుంది. ఆమె సహజముగానే పురుషకార భూత అని వివరించారు.
• 174 – పిన్భళగియ పెరుమాళ్ జీయరు తమ ఆచార్యులైన నంపిళ్ళై కైంకర్యార్దము తాము త్వరగా కోలుకోవాలని పెరుమాళ్ళను ప్రార్థించిన సంఘటన ముందే చూసాము.
• 216 – నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్, నంపిళ్ళై మరియు పిన్భళగియ పెరుమాళ్ జీయరుల మధ్య జరిగిన ఒక అందమైన సంభాషణను చెప్పారు. అది చూద్దాము.“ప్రతి ముముక్షువు ఆళ్వార్ల లాగా ఎంపెరుమానునే పూర్తిగా విశ్వసించి, ఆయన మీదే ఆధార పడాలి. కాని సామాన్యులకు ఇంకా లౌకికమైన కోరికలు ఉంటూనే వుంటాయి కదా? మరి ఆళ్వార్ల లాగా పరమపదములో నిత్య కైంకర్య ప్రాప్తి ఎలా దొరుకుతుంది?” అని నంపిళ్ళైని అడిగారు జీయరు. దానికి నంపిళ్ళై “మనకు ఆళ్వార్లంత వైరాగ్యము ఈ శరీరములో ఉన్నప్పుడు లేకున్నా, మన ఆచార్యుల ఔన్నత్యము వలన భగవంతుడు ఆళ్వార్లకున్న కోరికనే మనకు కలిగేలా చేస్తాడు.(ఈ శరీరమును వీడి పరమపదము చేరే లోగా). అందువలన మనము పరంపదము చేరే సరికి ఎంపెరుమాన్ కైంకర్య మొకటే మన లక్ష్యముగా వుంటుంది.”అన్నారు.
• 332 – పిన్భళగియ పెరుమాళ్ జీయరు, నంపిళ్ళైని “ఎవరికైనా కష్ఠము కలిగినప్పుడు శ్రీవైష్ణవులను ఆశ్రయించి నివారణ పొందుతారు కదా!. అది భగవంతుడి ప్రభావమా లేక శ్రీవైష్ణవుల ప్రభావమా?” అని అడిగారు.
దానికి నంపిళ్ళై, “అది నిస్సంకోచముగా భగవంతుడి ప్రభావమే”అన్నారు.
జీయరు మళ్ళీ “అలా అయితే మన కష్ఠ నివారణకు నేరుగా భగవంతుడినే ఆశ్రయించ వచ్చు కదా!”అన్నారు.
నంపిళ్ళై “కూడదు, మనము అలా చేయకూడదు. ఎప్పుడైనా శ్రీవైష్ణవుల ద్వారా మాత్రమే భగవంతుడిని ఆశ్రయించటము క్రమమైన పద్దతి.” అన్నారు.
జీయరు “భగవంతుడు శ్రీవైష్ణవుల మాటను మన్నించిన సంఘటనలేవైనా వున్నాయా?”.
నంపిళ్ళై, “ అర్జునుడు భారత యుధ్ధములో సూర్యాస్తమము లోపల జయద్రదుడిని చంపి తీరుతానని శపథము చేశాడు. సర్వేశ్వరుడు యుధ్ధములో ఆయుధమును పట్టనని తాను చేచిన శపథమును పక్కకు పెట్టి, నీటిలో దాగిన జయద్రదుడుని బయటకు రప్పించటము కోసము సుధర్శన చక్రమును సూర్యుడికి అడ్డు వేసి చీకటి పడినట్లు భ్రమ కల్పించాడు. అది నిజమని నమ్మిన జయద్రదుడు బయటకు రాగానే చక్రమును తొలగించి అర్జునుని శపథమును నెరవేర్చేను.ఈ సంఘటనలేవైనా వలన ఎంపెరుమాన్ శ్రీవైష్ణవుల మాటను మన్నిస్తాడని నిరూపణ దొరుకుతున్నది.
పిన్భళగియ పెరుమాళ్ జీయరు జీవితములోని కొన్ని విషయములను తెలుసుకున్నాము. వీరు మహా ఙ్ఞాని,విరాగియే కాక నంపిళ్ళై ప్రియ శిష్యులు. వారి శ్రీ పాదములను ఆశ్రయించటము ద్వారా మనలో కూడ కొంత భాగవత నిష్ట కలగాలని ప్రార్థన చేద్దాము.
పిన్భళగియ పెరుమాళ్ జీయరు తనియను:
ఙ్ఞాన వైరాగ్య సంపూర్ణం పస్చాద్ సుందర దేశికం
ద్రవిడోపనిషధ్ భాష్యదాయినం మద్గురుం భజే
అడియేన్ చూడామణి రామనుజ దాసి
archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/
Source: https://guruparamparai.wordpress.com/2013/04/21/pinbhazhagiya-perumal-jiyar/
pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
srIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org
Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu
Pingback: నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ | guruparamparai telugu
Pingback: ఎంగళాళ్వాన్ | guruparamparai telugu