Author Archives: chakravartychudamani

పిన్భళగియ పెరుమాళ్ జీయర్

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీవానాచల మహామునయే నమ:

nampillai-goshti1

నంపిళ్ళై  కాలక్షేప గోష్ఠి – ఎడమ వైపు నుండి 2వ వారు పిన్భళగియ పెరుమాళ్ జీయర్ 

nampillai-pinbhazakiya-perumal-jeer-srirangam

నంపిళ్ళై శ్రీచరణములందు పిన్భళగియ పెరుమాళ్ జీయర్ , శ్రీరంగము

తిరునక్షత్రం : తులామాసము, శతభిష నక్షత్రము

అవతార స్థలము :  తిరుప్పుట్కుళి

ఆచార్యులు : నంపిళ్ళై

పరమపదించిన స్థలము: శ్రీరంగము

రచనలు : ఆరాయిరప్పడి గురు పరంపరా ప్రభావం. “వార్థా మాలై” కూడా వీరే రాశారని అంటారు. కాని సరి అయిన ఆధారాములు లభించుట లేదు.

పిన్భళగియ పెరుమాళ్ జీయర్ , నంపిళ్ళై ప్రియ శిష్యులు. ఆరాయిరప్పడి గురు పరంపరా ప్రభావములో మన పూర్వాచార్యుల, ఆళ్వార్ల గురించిన విశేషాలను చక్కగా పొందు పరచారు. అందులో నంజీయర్ సన్యాసులై వుండి, గృహస్తులైన భట్టరును సేవించినట్లుగా,పిన్భళగియ పెరుమాళ్ జీయర్ సన్యాసులై వుండి గృహస్తులై నంపిళ్ళైని సేవించారని తెలిపారు.

ఒక సారి పిన్భళగియ పెరుమాళ్ జీయర్ అనారోగ్యము పాలైనారు. అప్పుడు వారు తన శిష్యులను చూసి తను త్వరగా కోలు కోవాలని పెరుమాళ్ళను ప్రార్థించమని అడిగారు. శ్రీవైష్ణవులేవరూ అలా కోరుకోరు. ఇది తెలిసి నంపిళ్ళై శిష్యులను పంపి విషయమేమిటో తెలుసుకోవాలనున్నారు. నంపిళ్ళై మొదట సకల శాస్త్ర పారంగతులైన ఎంగళాళ్వాను యొక్క అభిప్రాయమును తెలుసుకోవాలని శిష్యులను వారి దగ్గరికి పంపారు. ఎంగళాళ్వాన్ దానికి “వారు బహుశా శ్రీరంగముతో ఉన్న సంభందము వలన అలా అన్నరేమో” అని తన అభిప్రాయాన్ని తెలియజేసారు. నంపిళ్ళై శిష్యులను తిరునారాయణపురతు అరయర్ దగ్గరికి పంపారు. దానికి – అరయర్ “పూర్తి కావలసిన పనులేవైనా మిగిలిపోయాయేమో! అందుకనే వారు ఈ లోకములో ఇంకా కొంతకాలము ఉండాలనుకుంటున్నారేమో” అన్నారు. నంపిళ్ళై ఈ సారి అమ్మంగి అమ్మాళ్ దగ్గరికి శిష్యులను పంపారు. వారు “నంపిళ్ళై కాలక్షేప గోష్టిని వదల లేక అలా అన్నారేమో” అని బదులిచ్చారు. నంపిళ్ళై, పెరియ ముదలియార్ దగ్గరికి శిష్యులను వెళ్ళమన్నారు. నంపెరుమాళ్ళతో ఉన్న అనుబంధము వలన వారిని వీడి వెళ్ళటానికి ఇష్టపడటం లేదేమో” అన్నారు . నంపిళ్ళై చివరగా జీయరునే కారణమడగగా, “పైవేవీ కారణాలు కావు .తమరికే తెలుసు. అయినా కృపతో అడుగుతున్నారు. తమరు ప్రతి రోజు స్నానము చేసిన తరువాత తమ దివ్య దర్శనము చేసుకొని వీవెన వీయటము ఇత్యాది కైంకర్యములను చేస్తూ వుంటాను కదా? పరమ పదము కోసము వాటిని ఎలా వదులుకోగలను?” అన్నారు.పిన్భళగియ పెరుమాళ్ జీయర్  ఉత్తమ శిష్యులు తమ ఆచార్యుల పట్ల చూపవలసిన అభిమానమును ఈ విధముగా ఆచరించి చూపారు.ఇది విన్న వారందరూ జీయరుకున్న ఆచార్య భక్తికి మురిసి పోయారు.

వీరి పురుషకారముతోనే నడువిల్ తిరువీది పిళ్ళైభట్టరు నంపిళ్ళై శిష్యులైనారు. ఈ విషయాలను ఇంకా వివరముగా https://guruparamparaitelugu.wordpress.com/2015/05/07/naduvil-thiruvidhi-pillai-bhattar/  అనే లింకు ద్వారా చూడవచ్చును.

ప్రబంధ వ్యాఖ్యానములలో,పిన్భళగియ పెరుమాళ్ జీయర్కు సంభంధించిన మరి కొన్ని అంశాలను తెలు స్తున్నాయి. అవేమిటో చూద్దాము.

*ఉపధేశ రత్న మాల 65,66 – పిళ్ళై లోకం జీయర్ వ్యాఖ్యానం –ఆచార్యుల పట్ల సంపూర్ణ శరణాగతి చేసే అంశము గురించి పిళ్ళై లోకాచార్యుల శ్రీవచన భూషణ దివ్య శాస్త్రము లోని 333 సూత్రములోను, మణవాళ మామునుల ఉపధేశ రత్న మాల 65,66 పాశురముల లోను తెలుపడినది. 66వ పాసురములో,పిన్భళగియ పెరుమాళ్ జీయర్ కు  నంపిళ్ళైతో గల అనుబంధము వారికి పరమపధం కూడ వద్దనుకునేటంత గొప్పదని పేర్కొన్నారు. పిళ్ళై లోకం జీయర్ పిన్భళగియ పెరుమాళ్ జీయర్లకు నంపిళ్ళై మీద కల ఆచార్య నిష్టను మదురకవి ఆళ్వార్లు నమ్మాళ్వార్, ఆణ్దాళ్పెరియాళ్వార్, వడుగ నంబి ఎంపెరుమానార్ ,మామునులుతిరువాయిమొళి పిళ్ళైతో పోల్చారు. వీరంతా ఆచార్య నిష్టకు గొప్ప ఉదాహరణ. అప్పిళ్ళై యతిరాజ వింశతికి వ్యాఖ్యానము చేస్తూ పిళ్ళై లోకం జీయరు,పిన్భళగియ పెరుమాళ్ జీయర్, నంపిళ్ళైను తన యజమానిగా భావించి వారినే సదా ఎకాగ్రతతో స్మరిస్తూ వుండే వారని పేర్కొన్నారు.

*వార్త మాలలో, పిన్భళగియ పెరుమాళ్  జీయరుకు సంబంధించిన కొన్ని సంఘటనలను చూద్దాము.

• 2 లో – పిన్భళగియ పెరుమాళ్ జీయర్ ఒక సారి నంపిళ్ళైని స్వరూపం, ఉపాయం , ఉపేయం గురించి అడిగారు. దానికి నంపిళ్ళై జీవాత్మయొక్క ఇచ్చ స్వరూపము, భగవంతుని దయ ఉపాయం, ఆనందము ఉపేయమని చెప్పారు. జీయరు నేను మరొక విధముగా అనుకున్నానన్నారు. నంపిళ్ళై ఆశ్చర్యపోయారు. వీరు ఇంకా గొప్పగా ఆలోచించారా అనుకుని మీ అభిప్రాయమేమిటో చెప్పండని అడిగారు. శ్రీవైష్ణవులకు దాసులవుట స్వరూపము, వారితో సంబంధము ఉపాయము, వారి ఆనందము నా లక్ష్యము అని వివరించారు. నంపిళ్ళై జీయరు మాటలు విని మహదానందపడ్డారు. “భాగవత శేషత్వము”ను తమ ఆచార్యుల వద్ద జీయర్ ఈ విధముగా నిరూపించారు.

• 69 లో– జీయరు, నంపిళ్ళైని ద్వయ మహా మంత్రము యొక్క వివరణను కోరారు. నంపిళ్ళై మొదటి భాగమైన “శ్రీమన్ నారాయణ …” సంపూర్ణ శరణాగతి, ద్వితీయ పాదములో ఉభయులకు కైంకర్య ప్రాప్తి (పెరుమాళ్ మరియు పిరాట్టి) కోరుతూ అది కూడా ఆ శ్రీమన్నారాయణుని ముఖోల్లాసము కొరకే చేయాలి. అదే చేతనుడికి అత్యుత్తమ లక్ష్యము కావాలి. దీనికి సంపూర్ణ ఆచార్య అనుగ్రహము శిష్యులపై ప్రసరించాలి అన్నారు.జీయరు, పిరాట్టి ఎప్పుడు ఎంపెరుమాన్ సేవలో నిమగ్నమై వుంటారు కదా! జీవాత్మలను ఎలా ఉద్దరిస్తారు? అని అడిగారు. దానికి నంపిళ్ళై, భగవంతుడు ఎల్లప్పుడు పిరాట్టి అందమును చూస్తూ ఆనందిస్తున్నా చేతనుల సమ్రక్షణ విడువనట్లుగానే ఆ తల్లి కూడా చేతనులకు సదా సహకరిస్తుంది. ఆమె సహజముగానే పురుషకార భూత అని వివరించారు.

• 174 – పిన్భళగియ పెరుమాళ్ జీయరు తమ ఆచార్యులైన నంపిళ్ళై కైంకర్యార్దము తాము త్వరగా కోలుకోవాలని పెరుమాళ్ళను ప్రార్థించిన సంఘటన ముందే చూసాము.

• 216 – నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్, నంపిళ్ళై మరియు పిన్భళగియ పెరుమాళ్ జీయరుల మధ్య జరిగిన ఒక అందమైన సంభాషణను చెప్పారు. అది చూద్దాము.“ప్రతి ముముక్షువు ఆళ్వార్ల లాగా ఎంపెరుమానునే పూర్తిగా విశ్వసించి, ఆయన మీదే ఆధార పడాలి. కాని సామాన్యులకు ఇంకా లౌకికమైన కోరికలు ఉంటూనే వుంటాయి కదా? మరి ఆళ్వార్ల లాగా పరమపదములో నిత్య కైంకర్య ప్రాప్తి ఎలా దొరుకుతుంది?” అని నంపిళ్ళైని అడిగారు జీయరు. దానికి నంపిళ్ళై “మనకు ఆళ్వార్లంత వైరాగ్యము ఈ శరీరములో ఉన్నప్పుడు లేకున్నా, మన ఆచార్యుల ఔన్నత్యము వలన భగవంతుడు ఆళ్వార్లకున్న కోరికనే మనకు కలిగేలా చేస్తాడు.(ఈ శరీరమును వీడి పరమపదము చేరే లోగా). అందువలన మనము పరంపదము చేరే సరికి ఎంపెరుమాన్ కైంకర్య మొకటే మన లక్ష్యముగా వుంటుంది.”అన్నారు.

• 332 – పిన్భళగియ పెరుమాళ్ జీయరు, నంపిళ్ళైని “ఎవరికైనా కష్ఠము కలిగినప్పుడు శ్రీవైష్ణవులను ఆశ్రయించి నివారణ పొందుతారు కదా!. అది భగవంతుడి ప్రభావమా లేక శ్రీవైష్ణవుల ప్రభావమా?” అని అడిగారు.

దానికి నంపిళ్ళై, “అది నిస్సంకోచముగా భగవంతుడి ప్రభావమే”అన్నారు.

జీయరు మళ్ళీ “అలా అయితే మన కష్ఠ నివారణకు నేరుగా భగవంతుడినే ఆశ్రయించ వచ్చు కదా!”అన్నారు.

నంపిళ్ళై “కూడదు, మనము అలా చేయకూడదు. ఎప్పుడైనా శ్రీవైష్ణవుల ద్వారా మాత్రమే భగవంతుడిని ఆశ్రయించటము క్రమమైన పద్దతి.” అన్నారు.

జీయరు “భగవంతుడు శ్రీవైష్ణవుల మాటను మన్నించిన సంఘటనలేవైనా వున్నాయా?”.

నంపిళ్ళై, “ అర్జునుడు భారత యుధ్ధములో సూర్యాస్తమము లోపల జయద్రదుడిని చంపి తీరుతానని శపథము చేశాడు. సర్వేశ్వరుడు యుధ్ధములో ఆయుధమును పట్టనని తాను చేచిన శపథమును పక్కకు పెట్టి, నీటిలో దాగిన జయద్రదుడుని బయటకు రప్పించటము కోసము సుధర్శన చక్రమును సూర్యుడికి అడ్డు వేసి చీకటి పడినట్లు భ్రమ కల్పించాడు. అది నిజమని నమ్మిన జయద్రదుడు బయటకు రాగానే చక్రమును తొలగించి అర్జునుని శపథమును నెరవేర్చేను.ఈ సంఘటనలేవైనా వలన ఎంపెరుమాన్ శ్రీవైష్ణవుల మాటను మన్నిస్తాడని నిరూపణ దొరుకుతున్నది.

పిన్భళగియ పెరుమాళ్ జీయరు జీవితములోని కొన్ని విషయములను తెలుసుకున్నాము. వీరు మహా ఙ్ఞాని,విరాగియే కాక నంపిళ్ళై ప్రియ శిష్యులు. వారి శ్రీ పాదములను ఆశ్రయించటము ద్వారా మనలో కూడ కొంత భాగవత నిష్ట కలగాలని ప్రార్థన చేద్దాము.

పిన్భళగియ పెరుమాళ్ జీయరు తనియను:

ఙ్ఞాన వైరాగ్య సంపూర్ణం పస్చాద్ సుందర దేశికం
ద్రవిడోపనిషధ్ భాష్యదాయినం మద్గురుం భజే

అడియేన్ చూడామణి రామనుజ దాసి

archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/

Source: https://guruparamparai.wordpress.com/2013/04/21/pinbhazhagiya-perumal-jiyar/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
srIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

Advertisements

పెరియవాచ్చాన్ పిళ్ళై

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

తిరునక్షత్రము:  శ్రావణ మాసము, రోహిణి నక్షత్రము
అవతార స్థలము:  శంగనల్లూర్ (సేంగణూర్).
ఆచార్యులు: నంపిళ్ళై

శిష్యులు: నాయనారాచాన్ పిళ్ళై, వాదికేసరి అళగియ మణవాళ జీయర్, పరకాల దాసర్  మొదలగు వారు.

సేంగణూరులో అవతరించారు. తండ్రి గారు యామునులు. వారు పెట్టిన పేరు “కృష్ణన్” తరువాతి కాలములో పెరియవాచ్చాన్ పిళ్ళైగా ప్రసిద్ది గాంచారు. వీరు నంపిళ్ళై ప్రధాన శిష్యులలో ఒకరు. వారి దగ్గరే సకల శాస్త్ర అర్థములను తెలుసుకున్నారు. పెరియవాచ్చాన్ పిళ్ళై తన ఆచార్య అనుగ్రహము వలన మన సంప్రదాయములో వ్యాఖ్యానాచార్యులుగా ప్రసిద్ది పొందారు.

periyiavachanpiLLai-nampillai

పెరియవాచ్చాన్ పిళ్ళై – నంపిళ్ళై

పెరియ తిరుమొళి 7.10.10, ప్రకారము తిరుక్కణ్ణమంగై పెరుమాళ్   తిరుమంగై ఆళ్వార్ల(కలియన్) పాశురములకు వారి వద్దనే అర్థములు తెలుసుకొవాలనుకున్నారు. నంపిళ్ళై తాను  కలియన్ అవతారముగా, ఎంపెరుమాన్(పెరుమాళ్ళు) పెరియవాచ్చాన్ పిళ్ళై అవతారముగా చెపుతారు. పెరియవాచ్చాన్ పిళ్ళైకి వ్యాఖ్యాన చక్రవర్తి, అభయప్రద రాజర్ అనే బిరుదులున్నాయి. వీరు నాయనారాచ్చాన్ పిళ్ళై ని కుమారులుగా స్వీకరించారు.

వీరి జీవిత కాలములో వీరు ఈ క్రింది గ్రంధములకు వ్యాఖ్యానములను అనుగ్రహించారు.

* నాలాయిర దివ్య ప్రబంధము – వీరు మొత్తము ప్రబంధమునకు వ్యాఖ్యానములు అనుగ్రహించారు. దురదృష్టవశాత్తు పెరియాళ్వార్ తిరుమొళి లోని 400 పాశురములకు వీరు రాసిన వ్యాఖ్యానములు లుప్తమై పోగా మామునులు ఆ భాగమునకు వ్యాఖ్యానమును రాశారు.

*స్తోత్ర గ్రంధములు – పూర్వాచార్య శ్రీసూక్తులైన స్తోత్ర రత్నమునకు, చతుశ్లోకికి, గద్య త్ర్యయమునకు, జితంతే స్తోత్రమునకు వీరు వ్యాఖ్యానములు రాశారు.

*శ్రీ రామాయణము – శ్రీ రామాయణములోని ముఖ్యమైన శ్లోకములను ఎంచుకొని వాటికి చక్కటి వ్యాఖ్యానములు రాశారు. రామాయణ తనిశ్లోకి కి మంచి వివరణ పూరకమైన వ్యాఖ్యాలు చేసారు. విభీషణ శరణాగతి భాగమునకు “అభయ ప్రదరాజర్” అని పేరు పెట్టారు.

ఇవి కాక మాణిక్యమాలై, పరందరహస్యం, సకల ప్రామాణ తాత్పర్యము వంటి చాలా రహస్య గ్రంథములకు వ్యాఖ్యానములు రాశారు. వీటిలో రహస్య త్రయసారము విపులముగా తెలుపబడింది. పిళ్ళై లోకాచార్యులు, రహస్య త్రయమునకు నంపిళ్ళై మరియు పెరియవాచాన్ పిళ్ళైల ఉపదేశములను తీసుకొని అష్టాదశ రహస్య గ్రందములను అనుగ్రహించారు.

“పాశురపడి రామాయణము” ద్వారా వీరికి శ్రీ రామాయణము, దివ్యప్రబంధములలో ఉన్న పట్టు అవగతమవుతుంది. దివ్యప్రబంధములోని పదములను తీసుకొని శ్రీ రామాయణమును చక్కగా సులభముగా రచించారు.

వాది కేసరి అళగియ మణవాళ జీయర్ జీవితములో జరిగిన సంఘటన వలన వీరి దయా గుణము అర్థమవుతుంది. జీయర్, తన పూర్వాశ్రమములో పెరియవాచ్చాన్ పిళ్ళైగారి తిరుమాళి వంటశాలాలో కైంకర్యము చేస్తుండేవారు. ఆరోజులలో వీరు నిరక్షరులు. ఆచార్య భక్తి మాత్రము అపారంగా వుండేది. ఒకసారి కొందరు శ్రీవైష్ణవులు వేదాంత విషయములుము చర్చించుకుంటున్నారు. వీరు వాళ్ళను చూసి “మీరు ఏవిషయము మీద చర్చించుకుంటున్నా”రని అడగగా దానికి వాళ్ళు హేళనగా నవ్వి “ముసల కిసలయము”(అప్పుడే పుట్టిన మొగ్గ) అనే గ్రంథము మీద అని చెప్పారు. వీరు తమ ఆచార్యులతో ఈ విషయమును విన్నవించగా, పెరియవాచ్చాన్ పిళ్ళై అపారమైన కారుణ్యముతో వారికి సకల శాస్త్రములను బోధించారు. అనతి కాలములోనే అన్ని సాస్త్రములను అధికరించి వాది కేసరి అళగియ మణవాళ జీయరుగా ప్రసిద్ది గాంచి ఎన్నో సంప్రదాయ గ్రంధములను రాశారు.

పెరియ పెరుమాళ్, పెరియ పిరాట్టి, పెరియ తిరువడి, పెరియాళ్వార్, పెరియ కోయిల్ లాగా ఆచ్చాన్ పిళ్ళై కూడా వారి ఔన్నత్యము వలన పెరియవాచ్చాన్ పిళ్ళైగా ప్రసిద్ది గాంచారు.

మణవాళ మామునులు తమ “ ఉపదేశరత్న మాలై “లో రెండు పాశురములలో పెరియవాచ్చాన్ పిళ్ళైని ప్రస్తావించారు.

పాశురం: 43

“నంపిళ్ళై తమ్ముడైయ నల్లరుళాల్ ఏవియిడ
పిన్ పెరియవాచ్చాన్ పిళ్ళై అదనాల్, ఇన్ బా
వరుపత్తి! మారన్ మరై పొరుళై చొన్నదు
ఇరుపత్తు నాలాయిరం”

అర్థము: నంపిళ్ళై ఆనతి మేరకు పెరియవాచ్చాన్ పిళ్ళై వేదసారమైన తిరువాయిమొళికి చక్కని వ్యాఖ్యానమును రాసారు. శ్రీ రామాయణమును మనసునందు నిలుపుకొని రాసినందు వలన అది 24000 పడి అయింది. శ్రీ రామాయణములోశ్లోకములు 24000).

పాశురం: 46

“ పెరియవాచాన్ పిళ్ళై పింబుళ్ళవైక్కుం
తెరియ! వియాక్కిగైగళ్! శెయ్వాల్ అరియ
అరుళిచ్చెయల్ పొరుళై! ఆరియ ర్ గట్కు ఇప్పోదు
అరుళిచ్చెయలాయ త్తరిం న్ దు“

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానముల వలననే దివ్య ప్రబంధమునకు పెద్దలు అర్థాలను గ్రహించి తమ ఉపన్యాసముల ద్వారా ప్రచారము చేయగలుగు తున్నారు. వీరి వ్యాఖ్యానములే లేకుంటే ఇది ఎవరికీ సాధ్యమయ్యేది కాదు.

మామునులు 39వ పాశురములో, తిరువాయిమొళి వ్యాఖ్యాన కర్తలైన ఐదుగురిలో పెరియవాచ్చాన్ పిళ్ళైని చేర్చి చెప్పారు. ఇటువంటి పూర్వాచార్యుల వ్యాఖ్యానములవలననే దివ్య ప్రబంధములోని అంతరార్థములను గ్రహించగలుగు తున్నాము.

వార్తామాలై గ్రంధములోను ఇతర పూర్వాచార్య గ్రంథములలోను వీరి జీవిత విశేషాలు కొన్ని లభిస్తున్నాయి. ఇప్పుడు వాటిలో కొన్నిటిని చూద్దాము:

ఒకసారి కొందరు పెరియవాచ్చాన్ పిళ్ళైని ఈవిధముగా అడిగారు.”మనము ఎందుకు పెరుమాళ్  కృపకోసము, లీల కోసము ఎదురు చూస్తాము?”

దానికి వారు “మనము సంసారములో చిక్కుకున్నామని తలిస్తే పెరుమాళ్  కృప కోసము, ఇక్కడ ఆనందముగా వున్నామనుకుంటే లీల కోసము ఎదురుచూస్తాము” అన్నారు.

“పారతంత్ర్యము అంటే ఏమిటని?” ఒకరు అడిగారు. దానికి  పెరియవాచ్చాన్ పిళ్ళై పూర్తిగా పెరుమాళ్ళ శక్తి పై ఆధార పడి యుండుట, స్వప్రయత్నముతో సహా ఉపాయాంతరములను వదిలివేయుట, నిరంతరము భగవత్కైంకర్యములో గడుపుట, అంతే కాదు మోక్షము కూడా పారతంత్ర్యమే అని చెప్పారు.

“ఉపాయమంటే ఏవిటి అన్ని వదిలివేయడమా? ఆయనను పట్టుకోవడమా?” అని ఒకరు అడుగగా పెరియవాచ్చాన్ పిళ్ళై దానికి “రెండు ఉపాయములు కావు. పరమాత్మ మనలను సృష్ఠించాడు. మనకు అన్నీ ఇచ్చాడు. ఆయనను పట్టుకోవడము ఒక్కటే ఉపాయము” అని వివరించారు.

ఒకసారి వారి బంధువు ఒకరు చాలా విచారముగా కనబడ్డారు. పెరియవాచ్చాన్ పిళ్ళై కారణము అడిగారు. దానికి ఆమె ఈ సంసారములో అనాది కాలముగా ఉండి అనేక కర్మలను చేస్తున్నాను, పరమాత్మ నాకు మోక్షము ఎలా ఇస్తారు? అని అడిగింది. దానికి పెరియవాచ్చాన్ పిళ్ళై మనము ఆయన సొత్తు. స్వామి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన కర్మలను లెక్క చేయక తానే తీసుకుంటాడు అన్నారు.

ఒక శ్రీవైష్ణవులు మరొక శ్రీవైష్ణవులను తప్పులెంచడము చూసి, పెరియవాచ్చాన్ పిళ్ళై, యముడు శ్రీవైష్ణవుల తప్పులు చూడవద్దని తన భటులకు చెపుతాడు, పిరాట్టి “న కశ్చిన్ నా పరాధ్యతి” అంటుంది. అందువలన ఇతరుల తప్పులను చూడకండి. పెరుమాళ్ళు కూడా” నా భక్తులు తప్పులు చేయరు. ఒకవేళ చేస్తే అది మంచికే” అన్నారు. ఆళ్వార్ కూడ్ ఎవరైతే ఎంపెరుమాన్ల భక్తులో వారు స్తుతింపబడాలి. శ్రీవైష్ణవులలో తప్పులు పట్టే వాడు శ్రీవైష్ణవుడే కాదు.

ఒకసారి భాగవతుల గురించి చర్చ జరుగుతున్నప్పుడు భగవంతుని గురించి ఒకరు అడగగా పెరియవాచ్చాన్ పిళ్ళై “విశేష విషయములు చర్చ జరుగుతున్నప్పుడు సామాన్య విషయముల గురించి ఎందుకు మాట్లాడుతారు శ్రీవైష్ణవులందరు ప్రబంధమును తప్పక సేవించాలి అని అన్నారు.

పెరియవాచ్చాన్ పిళ్ళై తనియన్

శ్రీమత్ కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే|
యత్ కటాక్షైకలక్ష్యాణం సులభ: శ్రీధర స్సదా||

ఎవరి కటాక్షము వలన శ్రీమన్నారాయణుని కృప మన మీద పడుతుందో అటువంటి యామునుల కుమారులైన పెరియవాచ్చాన్ పిళ్ళైని నేను సేవిస్తాను.

వారు సంప్రదాయమునకు చేసిన కృషిని స్మరిస్తూ మనము సదా వారి శ్రీపాదములను మనసులో నిలుపుకుందాము.

అదియేన్ చూడామణి రామానుజ దాసి.

Source: http://guruparamparai.wordpress.com/2013/10/05/periyavachan-pillai/

ఈయుణ్ణి మాధవ పెరుమాళ్

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమతే వరవరమునయే నమ:
శ్రీవానాచల మహామునయే నమ:
nampillai-goshti1
తిరునక్షత్రము:  వృశ్చిక మాసము,  భరణి నక్షత్రము ( యతీంధ్ర ప్రవణ ప్రభావములో   హస్త అని పేర్కొనబడింది)
అవతార స్థలము:  శ్రీరంగము

ఆచార్యులు:   నంపిళ్ళై

శిష్యులు: ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ (వారి కుమారులు),
ఈయుణ్ణి మాధవ పెరుమాళ్(నంపిళ్ళై ప్రియ శిష్యులు),   వీరినే శిరియాళ్వాన్అప్పిళ్ళై అని కూడా అంటారు.తిరువాయిమొళి ఈడు మహా వ్యాఖ్యానము వీరి ద్వారానే మణవాళ మామునులకు చేరింది.
తమిళములో “ఈతల్” అనగా ఇచ్చుట అని ,“ఉణ్ణుతల్” అనగా  భుజించుటా అని అర్థము. ఈయుణ్ణి అనగా శ్రీవైష్ణవులకు పెట్టకుండా తిననివారని అర్థము.
 నంపిళ్ళై  నిరంతరము  భగవధ్విషయ కాలక్షేపములో  పొద్దుపుచ్చేవారు.  అవి  శ్రీరంగములోని  శ్రీవైష్ణవులకు బంగారు కాలము.  ప్రతి ఒక్కరు మహాచార్యులైన నంపిళ్ళై ద్వారా  భగవధనుభవములో  ఓలలాడారు.  నంపిళ్ళై ఎంపెరుమాన్ మరియు వారి ఆచార్యులైన నంజీయర్ల కృప వలన  ఆళ్వార్ల  పాశురములకు  శ్రీ రామాయణము, పురాణములు, ఇతిహాసముల నుండి  ఉదాహరణలనిస్తూ వివరించేవారు.
నంపిళ్ళైకు  వడక్కు తిరు వీధి  పిళ్ళై  ప్రియ శిష్యులు.  పగలు  నంపిళ్ళై చెప్పే తిరువాయిమొళి కాలక్షేపము విని రాత్రిళ్ళు దానిని జాగర్తగాగ్రంధస్థము చేసేవారు. ఒక సారి నంపిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళై  గృహమునకు  రాగా  వారు తిరువాయిమొళి  కాలక్షేపము చేసిన  విషయాలు తాటాకు మీద కనబడ్డాయి.  తన శిష్యుడు అక్షరము పొల్లు లోకుండా రాయగలిగినందుకు  ఎంతో  సంతోషించారు.  కాని  తన అనుమతి లేకుండాఈ పని  చేయటము వారిని   నొప్పించింది .ఈ గ్రంధమే తరువాతి  కాలములో ఈడు ముప్పత్తారాయిరప్పడి గా ప్రసిధ్ధి పొందినది. తరువాత దీనిని ఈయుణ్ణి  మాధవ  పెరుమాళ్ళకు  అందజేసి శిష్యులకుబోధించమనిచేప్పారు.(ఈచరిత్ర https://guruparamparaitelugu.wordpress.com/2013/09/25/vadakku-thiruvidhi-pillai/ లో  చూడవచ్చు..)
       ఈయుణ్ణి  మాధవ  పెరుమాళ్  వారి కుమారులైన  ఈయుణ్ణి  పధ్మనాభ  పెరుమాళ్ళకు ,వారు తన శిష్యులైన నాలుర్ పిళ్ళైకి బోధించారు.  వీరు కూరతాళ్వాన్  శిష్యులైన  నాలురాన్ వారసులు.
నాలుర్ పిళ్ళై జన్మస్థలము  మేల్పాడగం (తొణ్దై నాడు),తిరునక్షత్రము పుష్యమి.వీరిని సుమన:కోసేలర్, కోల వరాహ పెరుమాళ్ నాయనార్, రామానుజార్య దాసర్, అరుళాళర్  తిరువడి  ఊనృఇయవర్ అని కూడా అంటారు.వీరి శిష్య్లులు నాలూరాచాన్  పిళ్ళై, తిరుప్పుళింగుడి జీయర్ మరియు తిరుక్కణ్ణంగుడి జీయర్.
తిరుప్పుళింగుడి జీయర్ శ్రీవైష్ణవ చరితమనే గ్రంధమును రాశారు.
నాలూర్ పిళ్ళై కుమారులు మరియు  ప్రియశిష్యులు  నాలురాచ్చాన్ పిళ్ళై.వీరి తిరునక్షత్రము ధనుర్మాస భరణి నక్షత్రము.
వీరినే దేవరాజాచ్చాన్ పిళ్ళై,  దేవేసర్,  దేవాధిపర్ మరియు మేల్నాడు ఆచ్చాన్ పిళ్ళై అని కూడా అంటారు.వీరి తండ్రిగారి దగ్గర  ఈడు ముప్పత్తారాయీప్పడి   నేర్చుకున్నారు  .వీరి శిష్యులు తిరునారాయణపురత్తు ఆయ్,  ఇళంపిళిచైపిళ్ళై మరియు తిరువాయిమొళి పిళ్ళై.
 నాలూర్ పిళ్ళై, నాలూరాచాన్ పిళ్ళై తిరునారాయణపురములోనే నివాసముండేవారు.
   కూర కులోత్తమ ధాసర్ ఆనతి  మేరకు  తిరువాయిమొళి పిళ్ళై తిరువాయిమొళిలోని  అర్థములు తెలుసుకోవటానికి కాంచీపురమునకుబయలుదేరారు.  అదే సమయములో  నాలూర్ పిళ్ళై, నాలూరాచ్చాన్ పిళ్ళై కూడా అక్కడకు చేరుకున్నారు.  దేవ పెరుమాళ్ సన్నిధిలో అందరూకలుసుకున్నారు. దేవ పెరుమాళ్  అర్చక ముఖముగా  “పిళ్ళై లోకాచార్యులు మరెవరో కాదు,  సాక్షాత్ ఎంపెరుమానులే”  అనితెలియ జేసారు.  అంతే కాక నాలూర్ పిళ్ళైని  ఈడు వ్యాఖ్యానమును  తిరువాయిమొళి  పిళ్ళైకి  బోధించవలసినదిగా  అదేశించారు.  దానికి నాలూర్ పిళ్ళై దేవపెరుమాళ్ళను ఈ వయసులో తాను ఈ పని చేయగలనా అని అడిగారు.  అప్పుడు  ధేవ పెరుమాళ్  మీ కుమారులు నాలూరాచాన్ పిళ్ళై మీకు సహకరిస్తారని చెప్పారు.  ఆ విధముగా  తిరువాయిమొళి పిళ్ళై అందరితో కలసి ఈడు వ్యాఖ్యానమును  నాలూరాచాన్ పిళ్ళై దగ్గర అధికరించిఆళ్వార్ తిరునగరి  చేరుకొని  మణవాళ మామునులకు అనుగ్రహించారు. మామునులు  తరవాతి  కాలములో  “ఈట్టు పెరుక్కర్” గా ఖ్యాతిగాంచారు.
నాలూర్ పిళ్ళై లేక  నాలూరాచ్చాన్ పిళ్ళై  తిరువాయిమొళికి,  పెరియాళ్వార్ తిరుమొళికి  వ్యాఖ్యానము  రాసినట్లుగా చెపుతారు.
మామునులు, తమ” ఉపదేశ రత్నమాల” లో ఈడు వ్యాఖ్యానము పరిక్రమణ  చేసిన విధమును  48,49 పాశురములలో చక్కగావివరించారు.
  •  48వ పాశురములో,వడక్కు తిరువీది పిళ్ళై ఈడు ముప్పత్తారాయిరప్పడి ని గ్రందస్తము చేసినట్టుగా చెప్పారు.నంపిళ్ళై దానిని వారి నుండి తీసుకొని ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళ్కు ఇచ్చినట్టు చెప్పారు.
  •  49వ పాశురములో,  ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళ  నుండి,  వారి కుమారులు  ఈయుణ్ణి  పధ్మనాభ పెరుమాళ్ నేర్చుకొని  నాలూర్ పిళ్ళై మరియు  నాలూరాచ్చాన్ పిళ్ళైకి  తరువాత  తిరువాయిమొళి పిళ్ళైకి, తిరునారాయణపురతు ఆయ్కి అనుగ్రహించారని  చెప్పారు.
     ఈ విధముగా ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ చరిత్ర తెలుసుకున్నాము. వీరు గొప్పఙాని  నంపిళ్ళై  ప్రియ  శిష్యులు. వారి చరిత తెలుసుకోవటము వలన మనలోనూ  భాగవత నిష్ట  కలగాలని కోరుకుందాము.
ఈయుణ్ణి  మాధవ  పెరుమాళ్ళ తనియన్: 
 
లోకాచార్య పధాంభోజ సంశ్రయం కరుణాంభుధిం
వేధాంత ధ్వయ సంపన్నం మాధవార్యం అహం భజే
ఈయుణ్ణి పధ్మనాభ పెరుమాళ్ళ తనియన్:
 
మాధవాచార్య సత్పుత్రం తత్పాదకమలాశ్రితం
వాత్సల్యాధి గుణైర్ యుక్తం పధ్మనాభ గురుం భజే
నాలూర్ పిళ్ళై తనియన్ :
 
చతుర్గ్రామ కులోధ్భూతం ద్రావిడ బ్రహ్మ వేధినం
యఙ్ఞార్య వంశతిలకం శ్రీవరాహమహం భజే
నాలూరాచాన్ పిళ్ళై తనియన్:
 
నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే
రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే
ఆచార్యన్ తిరువడిగలే శరణం
అడియెన్ చూడామణి రామానుజ దాసి

Source: https://guruparamparai.wordpress.com/2013/04/21/eeynni-madhava-perumal/

అనంతాళ్వాన్

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వవరవరమునయే నమ:
శ్రీ వానాచల మహా మునయే నమ:

ananthazhwan

తిరునక్షత్రము : మేషమాసము, చిత్రా నక్షత్రము

అవతార స్థలము : సిరుపుత్తూరు/కిరన్గనూరు ( బెంగళూరు-మైసూరు మార్గములో)

ఆచార్యులు : అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్
పరమపదించిన స్థలము : తిరువేంకటమ్(తిరుమల)
రచనలు : వేంకటేశ ఇతిహాసమాల, గోదా చతుశ్శ్లోకీ, రామానుజ చతుశ్శ్లోకీ

అనంతాచార్యర్, అనంత సూరి మొదలగు నామధేయములు ఉన్నవి

శిష్యులు- ఏచ్చాన్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి.

ఎంపెరుమానార్ గురించి తెలుసుకొని వారి శ్రీపాదములను ఆశ్రయించాలని కోరికతో వారిని చేరారు. ఆ రోజులలోనే యఙ్ఞమూర్తిని సంస్కరించి  వారికి అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ అను నూతన నామధేయాన్ని ఏర్పరిచారు. అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ శిష్యులు కమ్మని అనంతాళ్వాన్ ను ఎంపెరుమానార్ ఆదేశమిచ్చారు. ఉభయులు ఆనందముతో అంగీకరించారు. కాని అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ సౌహృదయముతో పేరుకే నేను ఆచార్యుడైనను నా శిష్యులందరు ఎంపెరుమానార్ శ్రీపాదాలనే శిరోధార్యముగా భావిస్తారని ప్రకటించారు. కావుననే తిరుమల లో ఎంపెరుమానార్ శ్రీపాదములను (శ్రీశఠారిని) అనంతాళ్వాన్ అని వ్యవహరిస్తారు.

అనంతాళ్వాను కు మధురకవి ఆళ్వార్ కు గల పోలికలను పరిశీలిద్దాము:

*ఉభయుల తిరునక్షత్రం మేషమాసము, చిత్రా నక్షత్రము.

* ఉభయులు ఆచార్యనిష్ఠలో పరిపూర్ణులు

తిరువాయ్ మొళి లో “ఒళవిళ్ కాలమెల్లాం” పదిగములోని(3.3.1) అమృత తుల్యమైన పాశురమునకు వ్యాఖ్యానము చెపుతున్న సమయములో నమ్మాళ్వార్ శ్రీవేంకటేశ్వరునికి చేయదలచిన పుష్పకైంకర్యము గురించి ఎంపెరుమానార్ వివరించారు.అదేసమయాన శ్రోతలను చూసి” ఎవరైన తిరుమలలో అందమైన పూతోటలను పెంచి శ్రీవేంకటేశ్వరునికి పుష్పకైంకర్యము చేసి నమ్మాళ్వార్ కోరికను తీర్చగలవారు ఉన్నారా?” అని ప్రశ్నించారు. వెంటనే అనంతాళ్వాన్ లేచి ” తమరి ఆనతితో దాసుడు తమరి కోరికను నమ్మాళ్వార్ కోరికను నెరవేర్చుటకు సిద్ధమని విన్నవించుకున్నారు. అది విన్న ఎంపెరుమానార్ అమితానందముతో ఆనతిచ్చి తిరుమలకు పంపారు. అనంతాళ్వాన్ తిరుమల చేరుకొని స్వామికి మంగళాశాసనములు చేసి తోటను  పెంచి “ఇరామానుశన్” అని నామధేయమును ఉంచి ఎంపెరుమానార్ కోరిక మేరకు పుష్పకైంకర్యము చేయసాగారు. అది తెలిసిన ఎంపెరుమానార్ తిరుమలేశుని దర్శనార్థం తిరువాయ్ మొళి కాలక్షేపం త్వరగా ముగించి తిరుమల కు బయలుదేరారు. ఎంపెరుమానార్ కాంచీపురము మీదుగా ప్రయాణించి దేవపెరుమాళ్ కి , తిరుకచ్చినంబికి మంగళాశాసనము చేసుకొని తిరుపతికి చేరుకున్నారు. వీరిని ఆహ్వానించుటకు అనంతాళ్వాన్ మరికొదరు శ్రీవైష్ణవులతో కూడి కొండ క్రిందకు వచ్చారు.

తిరుమల స్వయంగా ఆదిశేషుని అవతారమని ఎంపెరుమానార్ కొండ పైకి వెళ్ళుటకు ఇష్ఠపడలేరు. కాని అనంతాళ్వాన్ తదితరుల కోరికమేరకు బయలుదేరారు. తిరుమలనంబి స్వయముగా ఆహ్వానించుటకు ఎదురారాగా ,ఎంపెరుమానార్ తోటకు వెళ్ళి  అక్కడ అనేకరకాల పూలమొక్కలను చూసి ఎంతో సంతోషముతో తిరుమంగైఆళ్వార్ పాశురమైన “వళర్ తాడానాళ్ పయన్ పెత్తెన్” (పరకాల నాయకి  తన పెంపుడు చిలుక నారయణుని నామాలు పలకడం చూసి సంతోషముతో పాడిన పాశురం)పాశురంను గుర్తుకు చేసుకున్నారు. అంతాళ్వాన్ కృషిని, అంకితభావనను చూసి చాలా సంతోషించారు.

 

ఒకసారి అనంతాళ్వాన్ భార్య నిండుగర్భణిగా ఉన్నప్పుడు ఇద్దరు తోట పని చేస్తున్నారు. ఆమె అవస్థను చూడలేక వేంకటేశుడు కిన్న బాలుడిలా వచ్చి సహాయము చేయబోతే, అనంతాళ్వాన్   మా ఆచార్యులు   ఆఙ్ఞానుసారం మేమే ఈ పనిని  చేయాలి నీ సహాయము అవసరం లేదని చెప్పి పంపారు. ఆ బాలుడు చూడ కుండా ఆమె చేతిలోని మట్టి తట్టను  తీసుకొని దూరంగా పోసాడు. అది తెలిసి అనంతాళ్వాన్ కోపముతో ఆ బాలుణ్ని వెంబడించాడు.

ananthazhwan-art1

 

ఆ బాలుణ్ణి అందుకోలేక చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు. అది ఆ బాలుని గడ్దానికి(చుబుకానికి) తగిలింది.ఆ బాలుణ్ణి డిని అందుకోబోగా అంతలో దేవాలయములోనికి వెళ్ళి మాయమయ్యాడు.  సాయంకాలం దేవాలయానికి వెళ్ళిన అనంతాళ్వాన్ కు స్వామి చుబుకము నుండి రక్తం రావడం కనిపించినది. అప్పుడు విషయం అర్థమైంది అనంతాళ్వాన్ కు. వెంటనే పచ్చకర్పూరము అద్దారు.  నేటికి ఆ సాంప్రదాయము మేరకు స్వామి చుబుకానికి పచ్చకర్పూరము అద్దడం జరుగు తుంది.

 

ఒక సారి అనంతాళ్వాన్ కు ఒక పాము కరచినది.తోటి వారందరు ఎంతో ఆందోళన పడ్డారు.  కాని అనంతాళ్వాన్  నిర్భయంగా ” నన్ను కరచిన పాము బలముగలదైతే  ఈ శరీరాన్ని విడచి విరజా స్నానము చేసి, పరమపదమును చేరి అక్కడ స్వామికి కైంకర్యమును చేస్తాను.  కరచిన పాము కంటే ఈ శరీరము బలముగలదైతే ఇక్కడే ఉండి  స్వామిపుష్కరిణిలో స్నానముచేసి తిరుమలేశునికి కైంకర్యము చేస్తాను” అని అన్నారు.

ananthazhwan-snake

మరొకసారి అనంతాళ్వాన్ ప్రసాదాన్ని మూట కట్టుకొని  దానిని తీసుకొని పొరుగూరికి బయలుదేరారు. కొండ దిగి  నడుస్తూ దారిలో ప్రసాదమును తిందామని మూట విప్పారు. దానిలో కొన్ని చీమలు కనిపించాయి, వెంటనే తన శిష్యులని కొండ ఎక్కి ఆ మూటలోని చీమలను తిరుమలలో వదిలి రమ్మన్నారు . అలా ఎందుకు చేశారంటే కుళశేఖరాళ్వార్ తన పెరుమాల్ తిరుమొళి ఒ” తిరుమలైయిలే ఎడునావేన్”(తిరుమలలో ఏదో ఒకటి అవుతానని) అన్నారు. “బహుశా ఈ చీమలు వారే అయితే కొండ క్రింద వదలడం ఎంత అపచారము చేసిన వారమవుతాము”  అని  తన శిష్యులతో అన్నారు.

ananthazhwn-ants

ఇంకొకసారి అనంతాళ్వాన్ పూమాల కడుతున్న సమయములో ఒక స్వామి  వచ్చి” శ్రీనివాసుడు మిమ్ములను రమ్మన్నారు” అని చెప్పాడు. వీరు పని పూర్తిచేసుకొని వెళ్ళగా శ్రీనివాసుడు ” ఆలస్యమయింది తమరికి” అని అడిగారు దీనికి వీరు ” పూలు పూర్తిగా విచ్చుకోక ముందే  మాల కట్టాలి, మా ఆచార్యులు ఆఙ్ఞ అయిన ఈ కైంకర్యము కంటే వేరేదేది ఈ సన్నిధిలో నాకు లేదు” అన్నారు

“మేము మిమ్ములను ఇక్కడి నుండి వెళ్ళిపోమని ఆఙ్ఞాపిస్తే” అన్నాడు శ్రీనివాసుడు.

” మీరు తిరుమలకు నాకంటే కొంచెం ముందుగా  వచ్చారు. నేను మా ఆచార్యుల ఆనతి మీద వచ్చాను. నన్ను వెళ్ళి పోమని మీరెలాగ అనగలరు?” అని అన్నారు అనంతాళ్వాన్.

ananthazhwan-srinivasan

వీరి ఆచార్య నిష్ఠను చూసి స్వామి ఎంతో మురసి పోయారు.

అనంతాళ్వాన్ శ్రీసూక్తులను వారి ఔనత్యాన్ని వివిధ వ్యాఖ్యానముల నుండి కొన్నింటిని పరిశీలిద్దాము

పెరియాళ్వార్ తిరుమొళి 4.4.1 కి మణవాళ మామునుల వ్యాఖ్యానం •

నావకారియం శొల్లిలాదవర్ నాల్ దొరుం విరుందోమ్బువార్ 

దేవకారియం శెయ్ దు వేదం  పయిన్ఱు వాళ్ తిరుకోట్టియూర్

మూవకారియము తిరుత్తుం ముదల్వనై చిందియాద

అప్పావకారిగళై పడైత్తవన్ ఎఙ్ఞనం పదైత్తాంగొలో  

.ఈ పాశురంలో తిరుకోష్ఠియూర్ లో ఉన్న వాక్ శుద్ధి గల శ్రీవైష్ణవులు తమ ఆచార్యులకు ప్రియమైన విషయాలు తప్ప మరొకటి మాట్లాడరు అని పెరియాళ్వార్ పేర్కొన్నారు.పాశురమునకు మామునులు వ్యాఖ్యానము చేస్తు  అనంతాళ్వాన్ కు  భట్టర్ మీద ఉన్న అభిమానమును ఈవిధంగా పేర్కొన్నారు.

అనంతాళ్వాన్ అంతిమ సమయంలో భట్టర్ కు ప్రియమైన శ్రీవైష్ణవులతో ” ఏ నామము భట్టర్ కు  ప్రియమైనది” అని అడిగారు. దానికి వారు ” అళిగియ మణవాళన్” అని చెప్పగా విని ” భర్త పేరును భార్య చెప్పడము శాస్త్ర సమ్మతము కానప్పటికిని  భట్టర్ కు ప్రియమైన నామము కదా! అదే చెప్పుకుంటాను” అని  “” అళిగియ మణవాళన్” అనుంటూనే పరమపదించారు.

పూర్వాచార్యులు పేర్కొన్న అనంతాళ్వాన్ శ్రీసూక్తులను  కొన్నింటిని చూద్దాము.

నాచ్చియార్ తిరుమొజి 7.2 పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం

ఈ పాశురములో ఆండాళ్ పాంచజన్యము యొక్క  వైభవమును ఈ విధంగా తెలిపినది. పుట్టింది సముద్రములో , నివాసం శ్రీమన్నారాయణుని శ్రీ హస్త కమలముల్లో . సందర్భముగా పెరియవాచ్చాన్ పిళ్ళై – అనంతాళ్వాన్  మరియు నంజీయర్ మధ్య జరిగిన ఒక సంఘటనను చెప్పారు. వేదాంతి (పూర్వాశ్రమములో నంజీయర్  కు వేదాంతి అని పేరు)

భట్టర్ చేత సంస్కరించబడిన తర్వాత  తన సంపదను మూడు భాగములుగా చేసి తన భార్యలిద్దరికి చెరొక్కటి ఇచ్చి మూడవది తమ ఆచార్యులకు సమర్పించారు. సన్యసించి ఆచార్య కైంకర్యము చేసుకోవడానికి శ్రీరంగమును చేరుకొన్నారు. ఈ విషయం తెలిసి న  అనంతాళ్వాన్ ” మీరు గృహస్థాశ్రమమును కొనసాగించి  ఉండవలసినది.  అక్కడే ఉంటు  ఆధ్యాత్మిక విషయములను  అర్థం చేసుకుంటు, ఆచార్య భాగవత కైంకర్యము చేసి ఉండ వలసినది.  ఎందుకు సన్యాసాశ్రమమును స్వీకరించారు?” అక్కడ ఉన్న ఇతర శ్రీవైష్ణవులు ‘అలా ఎందుకు చెపుతున్నారు’ అని అడిగారు.  “భాగవతుడైన వాడు  తిరుమంత్రములో పుట్టి ద్వయంంత్రములో పెరగాలి” అన్నారు అనంతాళ్వాన్.

నాచ్చియార్ తిరుమొజి 12.5 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం

ఈ పాశురములో గోపగోపికలు శ్రీకృష్ణుడు కాళీయుడు మీద కెక్కి నాట్యము చేస్తున్నాడని వినగానే స్పృహ తప్పి పడిపోయారని ఆండాళ్ పాడారు. ఒకసారి  అనంతాళ్వాన్ శ్రీగుహదాసర్  తో కలసి ఎంపెరుమానార్  ను సేవించుకోవడానికి వెళుతున్నారు. శ్రీరంగం చేరుకోగానే కొందరు ఏకాంగులు శిరోముండనం చేసుకొని కావేరి నుండి వస్తూ  కనపడ్డారు. వారిని చూసి విషయమేమని విచారించగా,   ఎంపెరుమానార్   పరమపదించారని చెప్పారు. ఇది విన్న నంబిగుహదాసర్ పక్కన ఉన్న చెట్టెక్కి దూకి చనిపోవాలనుకున్నారు. అది చూసిన అనంతాళ్వాన్ “ ఎంపెరుమానార్   పరమపదించారని తెలియగానే పోని ప్రాణము చెట్టెక్కి దూకితే పోతుందా, కాళ్ళు చేతులు విరుగుతాయి అంతే” అని అన్నారు.

* పెరుమాళ్ తిరుమొళి 4.10- పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం- ఈ పాశురములో కులశేఖరాళ్వార్   తిరుమల పై ప్రీతిని ప్రకటించుకున్నారు. తిరుమల మీద ఏదో ఒక వస్తువుగా పడి ఉన్న చాలని తలచారు.

అదే అనంతాళ్వాన్ వేంకటేశుని  దగ్గరనైన ఉండటానికి అభ్యంతరం లేదన్నారు. అదే తిరుమల తో వారికున్న సంబంధము.

*పెరుమాళ్ తిరుమొళి 4.10- పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం – ఈ పదిగములో తిరుమంగైఆళ్వార్  పరకాల నాయకిగా  తిరువేంగడం  గురించి  తపించి ” వేంగడమే వేంగడమే ” అని ఆ దివ్యదేశము మీది ప్రీతిని చాటుకున్నారు. భట్టర్ శ్రీరంగనాథుని  ” అళిగియ మణవాళన్ ” అన్నట్లుగా ,అనంతాళ్వాన్ శ్రీనివాసున్ని ” తిరువేంగడముడయాన్” అని పిలిచారు అని నంజీయర్ అన్నారు.

*తిరువాయ్ మొళి 6.7.1 నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానమున  – ఈ పదిగంలో నమ్మాళ్వార్ , వైత్తమానిధి ఎంపెరుమాన్ మీద , తిరుక్కోళూర్ దివ్యదేశము మీద  తమ ప్రీతిని చాటుకున్నారు. నంపిళ్ళై , అనంతాళ్వాన్ దివ్యదేశవాసము గురించి చెప్పిన ఒక సంఘటనను వివరించారు.

చోళ కులాంతకం అనే ఊరిలో  శ్రీవైష్ణవులొకరు వ్యవసాయం చేస్తు  కనబడగా, వారి స్వస్థలమేదని అడిగారు అనంతాళ్వాన్ . దానికి  వారు ” మాది తిరుక్కోళూర్, అక్కడ ఉపాధి దొరకనందున  ఇక్కడకు రావల్సి వచ్చినదని” బదులు చెబుతారు దివ్యదేశవాసము వదలుకొని ఇక్కడ రావటం కన్నా ఎంపెరుమానార్, మరియు  నమ్మాళ్వార్ కు ఎంతో ఇష్ఠమైన తిరుక్కోళూర్ లో నివాసముతో వారికి కైంకర్యము చేస్తు జీవించడానికి గాడిదలము పెంచుకొని సంపాదించవచ్చు” అని  అనంతాళ్వాన్ అన్నారు. దీని వలన  దివ్యదేశవాస శ్రీవైష్ణవ  కైంకర్యము ఎంత ముఖ్యమైనదో అర్థమవుతుంది.

* తిరువాయ్ మొళి 6.7.1 నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానమున  – ఈ పదిగంలో నమ్మాళ్వార్ , పరాంకుశనాయకిగా పెరుమాళ్ కు ఒక పక్షిద్వారా సందేశమును పంపుతుంది.  ఈ సందేశమును పెరుమాళ్  కు విన్నవిస్తే నీకు ఈ లోకము, పరమపదము ఇస్తానని  వాగ్ధానం   చేశారు. ( ఈమె పెరుమాళ్ కు నాయకి కావున ఆయన సొత్తు అంతా ఈమెదే)అంతా పక్షికే ఇస్తే వీరు  ఎక్కడ ఉంటారని ఒకరికి సందేశము వచ్చినది” ఆ పక్షి చూపిన చోటే ఉంటారు” అని అనంతాళ్వాన్ అందముగా అన్నారు.

*తిరువాయ్ మొళి 6.8.1 నంపిళ్ళైడు వ్యాఖ్యానమున  – ఈ పాశురంలో నమ్మాళ్వార్ , పెరుమాళ్ ను ” ఎన్ తిరుమగళ్ శేర్ మార్బన్” అన్నారు(శ్రీ మహా లక్ష్మి నివస స్థానము)

అనంతాళ్వాన్ తమ కూతిరికి ” ఎన్ తిరుమగళ్” అని పేరు పెట్టుకొని  పవిత్రమైన మాతల మీద తన ప్రేమను చాటుకున్నారు.

*వార్తామాలై-345- భట్టర్ ఒకసారి తన  శిష్యులలో ఒకరిని శ్రీవైష్ణవుల లక్షణాలను తెలుసుకొనుటకు అనంతాళ్వాన్  వద్దకు పంపించారు. వీరు వెళ్ళే  సమయానికి   అనంతాళ్వాన్  తిరుమాళిగలో తదీయారాధన జరుగుతుంది. పంక్తిలో కూర్చోగానే మరొక  శ్రీవైష్ణవుల కోసం వీరిని లేపారు. ప్రతి పంక్తిలోను అలాగే జరిగింది.  ఆఖరికి   అనంతాళ్వాన్  తో కూర్చొని ప్రసదమును స్వీకరించారు వారు. అప్పుడు   అనంతాళ్వాన్  ఆ శ్రీవైష్ణవుల గురించి వివరములను అడిగారు. తాము భట్టర్ శిష్యులమని ,  శ్రీవైష్ణవుల లక్షణాలను తెలుసుకొనుటకు భట్టర్ తమ వద్దకు పంపిచారని చెప్పారు.

దానికి అనంతాళ్వాన్  ” కొక్కై పోలిలే, కోలియై పోలిలే , ఉప్పై పోలిలే, ఉమ్మైపోలిలే ఇరుక్కు వేండం” అని చెప్పారు. అంటే కొంగ లాగ అవకాశం వచ్చే వరకు ఆగడం, కోడి లాగా సారతమమైన పదార్థాలను  మాత్రమే తీసుకోవడం, ఉప్పు లాగా తన ఉనికిని చాట కుండా అన్నింటా ఉండాలి” అని చెప్పారు. ఆఖరికి మాలాగా అన్నారే దాని అర్థం ఏమిటని అడిగారు, ” ప్రతిపంక్తిలోను కూర్చున్న మిమ్ములను  లేపినా మీరు కోపగించుకోక ఓపికగా ఉన్నారు. ఇలాగే శ్రీవైష్ణవులకు ఓపిక ఉండాలి” అని చెప్పారు.

తిరువేంకటాద్రీశుని కృప  అనంతాళ్వాన్ పైన ఈనాటికి అపారముగా ఉన్నది. వారి వీరి అవతారోత్సవమైన మేష మాసములో చిత్తా నక్షత్రం నాడు,  వారి పరమపదోత్సవమైన కర్కాటక మాసం పూర్వఫల్గుణి  నక్షత్రం నాడు  తిరువేంకటాద్రీశుడు  అనంతాళ్వాన్ తోటకు విచ్చేసి తన శేషమాలను,  శ్రీశఠగోపమును అనుగ్రహించే సాంప్రదాయం ఇప్పటికిని కొనసాగుతున్నది

ananthazwan-magilatree

 

ఈ వ్యాసములో  అనంతాళ్వాన్ వైభవము  కొంతవరకు మాత్రమే  తెలుకున్నాము. మన మీద వారి అపార కృపాకటాక్షములు సదా ప్రసరించాలని ప్రార్థన చేద్దాం.

ananthazhwan-thirumalai

అనంతాళ్వాన్  తనియన్:

అఖిలాత్మ గుణవాసం అఙ్ఞాన తిమిరాపహం|
ఆశ్రితానాం సుశరణం వందే అనంతార్య దేశికమ్||

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజ దాసి

archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/

Source: http://guruparamparai.wordpress.com/2013/03/31/ananthazhwan/

కిడాంబి ఆచ్చాన్

శ్రీ:

శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమధ్వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

kidambi achan

తిరునక్షత్రం: చిత్రై(మేష మాసము), హస్తా నక్షత్రము

అవతార స్తలం: కాంచీపురం

ఆచార్యన్: ఎంపెరుమానార్

కిడాంబి ఆచ్చాన్ అసలు పేరు “ప్రణతార్తిహరులు”.తిరుక్కచ్చి నంబి పాడిన దేవరాజ అష్టకములో “దేవ పెరుమాళ్”ను స్తుతించిన నామములలో ఈ పేరు కూడా ఒకటి.

6000 పడి గురు పరంపరా ప్రభావము,మరి కొన్ని పూర్వాచార్య గ్రంథముల ఆధారముగా తిరుక్కోష్టియూర్ నంబి వీరిని ఎంపెరుమానార్లకు తళిగ కైంకర్యమునకు ప్రధాన అధికారిగా నియమించినట్లుగా తెలియుచున్నది.

kidambi achan-emperumanar
ఎంపెరుమానార్లు గధ్యత్రయం మరియు నిత్య గ్రంథమును (తిరువారాధన క్రమము)లను అనుగ్రహించెను.అవి శ్రీవైష్ణవ సంప్రధాయమును తెలియ జేసే గొప్పగ్రంధములు.ఆకాలములో శ్రీరంగములోని కొందరికి ఎంపెరుమానార్ల విధానము నచ్చలేదు. అందువలన వారు అతి నీచమైన పనికి ఒడిగట్టారు.నిత్యము ఎంపెరుమానార్లు భిక్షకొరకు వెళ్ళు గృహములలొ ఒక గృహిణి చేత విషము కలిపిన ఆహారమును బిక్షగా పెట్టించాలని పన్నాగము చేసి అలాగే పెట్టించారు.
ఆమె భర్త కూడా ఈ నీచమైన పనిలో భాగస్వామి అయినప్పటికీ ఆమెకు ఈ పని చేయటము ఇష్టము లేదు,కాని భర్తకు ఎదురు చేప్పి గెలవలేక కన్నీటి పర్యంతమై ఎంపెరుమానార్ల భిక్షలో కలవకుండా విడిగా ఆహారమును పెట్టి సాష్టాంగ నమస్కారము ఆచరించింది.ఆమె అలా చేయటము ఎంపెరుమానార్లకు ఒక సంకేతముగ తోచి ఆ ఆహారమును కావేరిలో కలిపి వేసి పాప పరిహారార్థము ఉపవాస వ్రతమును ఆచరించారు. తిరుక్కోష్టియూర్ నంబి ఈ వార్త విని పరుగు పరుగున శ్రీరంగము చేరుకున్నారు.అది మిట్ట మధ్యాహ్నవేళ.ఎండ ప్రచండముగా వుంది.ఎంపెరుమానార్లు సశిష్యులుగా తమ ఆచార్యులను ఆహ్వానించుటకు కావేరీ తీరమునకు ఎదురేగుతున్నారు.ఆచార్యులు దగ్గరకు చేరగానే ఆమిట్ట మధ్యహ్నవేళ ఇసుకనేలమీద ఎంపెరుమానార్లు సాష్టాంగ నమస్కారము ఆచరించించారు.నంబి ఎంతకు వీరిని లేవమని చేప్పలేదు(శ్రీ వైష్ణవ సంప్రదాయములో సాష్టాంగ నమస్కారము ఆచరించించినపుడు గ్రహీతలు లెమ్మని చెప్పేదాకా లేవకూడదు).అంతలో కిదాంబి ఆచ్చాన్ తాను ఇసుక మీద పడుకొని ఎంపెరుమానారును అమాంతము ఎత్తి తన మీద వేసుకొని,నంబిని చూచి “కోమలమైన కుసుమమును ఎండలో వేస్తారా? మండే ఇసుక మీద మా ఆచార్యులను ఎంతసేపు ఉంచుతారు?” అని కోపముగా అడిగారు.వీరికి ఎంపెరుమానార్ల మీద వున్న భక్తికి మెచ్చి నంబి”ఆచార్య దేహమును పరిరక్షించుకోవాలునుకునే మీరే ఇక నుండి ఎంపెరుమానార్లకు భిక్ష తయారు చేసి పెట్టండి” అని ఆదేశించారు.ఆరోజు మొదలు కిడాంబి ఆచ్చాన్ నిత్యము ఆ కైంకర్యమును ఆచరిస్తూ వచ్చారు.

కిదాంబి ఆచాన్ ఔన్నత్యమును తెలిపే కొన్ని వ్యాఖ్యానములను చూద్దాము.
*తిరుప్పావై 23 – పెరియవాచ్చాన్  పిళ్ళై వ్యాఖ్యానము- ఈ పాసురములో, ఆణ్దాళ్ గోపికలకు కృష్ణుడు తప్ప వేరెవరు రక్షకులు లేరని తెలుపుతుంది.ఆ గోపికలలాగానే కిడాంబి ఆచాన్ కూడా తిరుమాలిరుంచోలై పెరుమాళ్ళైన అళగర్ను సేవించుకోవటానికి వెళ్ళినప్పుడు ఆ స్వామి ఏదైనా పాడమని అడిగారు. వెంటనే ఆచ్చాన్ ఆళవంధార్ల స్తోత్ర రత్నము- 48వ శ్లోకము“అపరాద సహస్ర భాజనం … అగతిం ..” అని పాడారు.దానికి పెరుమాళ్ళు స్పందించి “మీరు ఎంపెరుమానార్ లను ఆశ్రయించి వుండగా గతి లేనివారెలా అవుతారన్నారు.
*తిరువిరుత్తం 99 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము – ఒక సారి కూరాత్తాళ్వాన్ కాలక్షేపమునకు వెళ్ళిన ఆచ్చాన్ ఆలస్యముగా మఠమునకు వచ్చారు.ఎంపెరుమానార్ ఆలస్యమునకు కారణమడిగారు.కిదాంబి ఆచ్చాన్ కాలక్షేపమునకు వెళ్ళటము వలన ఆలస్యమైనదని చెప్పారు.ఎంపెరుమానార్ ఏ పాసురము చెపుతున్నారని అడిగగా ” పిఱందవారుం వళందవారున్” (తిరువాయిమొళి 5.10) పధ్గమని చెప్పారు.ఆళ్వాన్ ఎలా వ్యాఖ్యానము చేసారని ఎంపెరుమానార్ అడగగా, కూరాత్తాళ్వాన్ పాసురమును పాడి అర్థములు చెపుతూ కన్నీరు మున్నీరై నమ్మాళ్వార్ల అనుభవం ఉన్నతమైనది.దానిని ఎలా వర్ణిచగలము నాకు మాటలే దొరకటము లేదని దు:ఖించారని వివరించారు.ఇది విన్న ఎంపెరుమానార్ నమ్మాళ్వార్ల మీద ఆళ్వాన్ కున్న భక్తికి పొంగిపోయారు.
* తిరువాయిమొళి 4.8.2 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము –ఒక సారి కిదాంబి ఆచ్చాన్ తదీయారాధన సమయ ములో అందరికీ మంచినీళ్ళు అందిస్తున్నారు(ఆ రోజులలో నోటిలోనే మంచి నీరు పోసేవారు).గోష్టిలోని ఒక శ్రీవైష్ణవులు మంచి నీరు అడగగా ఆచ్చాన్ పక్క నుండి మంచి నీరు పోసారు. అది చూసిన ఎంపెరుమానార్ పరుగున దగ్గరకు వచ్చి,’అలా పక్కనుండి పోస్తే తాగేవారికి కష్టముగా వుంటుంది ఎదురుగా నిలబడి పోస్తే నీటిధార సమానముగా వస్తుంది తాగేవారికి సుళువుగా వుంటుంది”అని చెప్పగా ఆచ్చాన్“పణిమానం పిళయామే అడియేనైప్ పణి కొణ్డ”(దాసుడిని సక్రమముగా  తీర్చి దిద్దుతున్నారు)అన్న నమ్మళ్వార్ల మాటను ఎంపెరుమానార్ పాటిస్తున్నారు కదా అని పొంగిపోయారు.
*తిరువాయిమొళి 6.7.5 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానమునమ్మాళ్వార్ కన్నులంటూ వున్నది దివ్య దేశములను  సేవించు కోవటానికేనని వాటి ప్రాశస్త్యములను ఈ పాసురములో వివరించారు.ఈ సందర్భముగా అచ్చాన్ జీవితములో జరిగిన ఒక సంఘటనను చూద్దాము. ముదలియాండాన్,కిదాంబి ఆచ్చాన్ కలిసి తిరుక్కుడంతై బయలుదేరారు.దారిలో అప్పక్కుడతాన్ కోవెల కనపడగానే ఈ పాసురము స్మరణకు వచ్చి ఆ స్వామిని కూడా సేవించుకొని బయలుదేరారు.
*తిరువాయిమొళి 10.6.1-కిదాంబి ఆచ్చాన్ భట్టరు పట్ల చాలా నమ్రత చూపేవారు.ఒక సారి భట్టరు శిష్యులలో ఒకరైన ఇళయాళ్వాన్ వీరిని అలా నడచుకోవటానికి కారణమడగగా,వీరు ఎంపెరుమానార్ ఆఙ్ఞ గురించి వివరించారు.ఒక రోజు భట్టరు పెరియ పెరుమాళును సేవించుకోవాలని కోవెలకు వేంచేయగా ఎంపెరుమానార్ ఎదురు వెళ్ళి ఆహ్వానించి గర్భ గుడిలోనికి తీసుకు వెళ్ళి,స్వామిపై ఒక శ్లోకము పాడమని కోరి,తరువాత వారిని భయటకు తీసుకు వచ్చి, తన శిష్యులతో ” భట్టరు మా పట్ల ఎలా నడచుకొంటారో మీరందరూ వారి పట్ల అలా నడచుకోవాలని ఆఙ్ఞాపించారని చెప్పారు.

కిడాంబి నాయనార్ (కిడాంబి ఆచ్చాన్ వారసులు)తిరువె:క్కాలో మణవాళ మామునులకు శ్రీ భాష్యమును చెప్పారు. ఆ సమయములో కిడాంబి నాయనార్ కోరగా మామునులు తమ నిజ స్వరూపమును చూపించారు.ఆ తరవాత వారికి మామునుల మీద అభిమానము ఇంకా పెరిగింది.

కిడాంబి ఆచ్చాన్ భాగవత నిష్టను గురించి,వీరి మీద ఎంపెరుమానార్ ఉన్న అభిమానమును గురించి తెలుసుకున్న మనము కూడ వారి శ్రీపాదములకు నమస్కరించి ఆచార్య,భాగవత నిష్టను కలిగి వుందేలాగా అనుగ్రహించమని ప్రార్థన చేద్దాము.

కిడాంబి ఆచ్చాన్ తనియన్:

రామానుజ పదాంభోజయుగళీ యస్య ధీమత:
ప్రాప్యం చ ప్రాపకం వంధే ప్రన్ణతార్థిహరం గురుం

ராமானுஜ பதாம்போஜயுகளீ யஸ்ய தீமத:
ப்ராப்யம் ச ப்ராபகம் வந்தே ப்ரணதார்த்திஹரம் குரும்

అడియెన్ చూడామణి రామానుజ దాసి

 

Source

తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్

    శ్రీ:

    శ్రీమతే శఠకోపాయ నమ:

    శ్రీమతే రామానుజాయ నమ:

    శ్రీమద్ వరవరమునయే నమ:

    శ్రీ వానాచల మహామునయే నమ:

    తిరునక్షత్రము:  మిథున మాసము(ఆని)

    అవతార  స్థలము:  తిరుక్కణ్ణమంగై  

    ఆచార్యులు:  నాథమునులు

    పరమపదము పొందిన స్థలము:  తిరుక్కణ్ణమంగై

    రచనలు: నాచ్కియార్ తిరుమొళి తనియన్ అల్లి నాళ్ తామరై మేల్

Thirukkannamangai_bhakthavatsalan

భక్తవత్సలన్ ఎమ్పెరుమాన్ మరియు తాయార్ – తిరుక్కణ్ణమంగై

thirukkannamangai-andan-thiruvarasu

తిరుక్కణ్ణమంగై ఆణ్డాన్ – తిరుక్కణ్ణమన్గై

        తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్,తిరుక్కణ్ణమంగై దివ్య దేశములో అవతరించారు .నాథమునుల శిష్యులు. భగవానుని రక్షకత్వము మీద వీరికున్న విశ్వాసాన్ని పూర్వాచార్యులు ఎంతగానో ప్రశంసించారు.

   పిళ్ళై లోకాచార్యులు అనుగ్రహించింన శ్రీవచనభూషణమనే దివ్య శాస్త్రములో వీరు ప్రస్తుతింపబడ్డారు. ఉపాయమునకు, ఉపేయమునకు ఉండవలసిన లక్షణములను 80వ సూత్రములో  ఉపాయత్తుక్కు పిరాట్టియైయుం, ద్రౌపతియైయుం, తిరుక్కణ్ణమంగై ఆణ్దానైయుం పోలే ఇరుక్కవేణుం; ఉపేయత్తుక్కు ఇళైయ పెరుమాళైయుం, పెరియ ఉడైయారైయుం, పిళ్ళై తిరునరైయూర్ అరైయరైయుం, చింతయంతియైయుం పోలే ఇరుక్కవేణుంఅన్నారు.అనగా”ఉపాయమునకు పిరాట్టిలాగా, ద్రౌపతిలాగా, తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్లాగా,ఉపేయమునకు లక్ష్మణస్వామిలాగ,పెరియ ఉడైయార్లాగ, పిళ్ళై తిరునరైయూర్ అరైయర్లాగ చింతయంతిలాగ ఉండాలి అని అర్థము.  ఉపాయమనగా గమనము,ఉపేయమనగా గమ్యము.భగవంతుడే ఉత్తమ ఉపాయము. శ్రీమహాలక్ష్మితో కూడిన శ్రీ మన్నారాయణుడు ఉపేయము.

ఉపాయం

  *పిరాట్టి అనగా సీతా పిరాట్టి (శ్రీ మహాలక్ష్మి) రావణుని చెరలో ఉన్నప్పుడు తన శక్తిని ఉపయోగించలేదు.లేకుంటే రావణుని తన శక్తిచే నాశనము చేయుట ఆమెకు అసాధ్యమేమి కాదు.దానికి తార్కాణము హనుమ తోకకు రాక్షసులు నిప్పు అంటించినప్పుడు సీతాదేవి హనుమకు ఎమీ కాకూడదని భావించి “శీతో భవ”(చల్లబడుగాక) అని దీవించింది.అదే శక్తినుపయోగించి రావణుని నాశనము చేయగలిగి వుండి కూడా తన స్వతంత్ర్యమును ప్రకటించకుండా శ్రీరాముని  ఉపాయముగా భావించి ఆయన రాక కోసము ఎదురుచూస్తూ తన దాసత్వమును చాటుకుంది.

  *ద్రౌపతి నిండు సభలో కౌరవులచే అవమానింపబడినప్పుదు స్త్రీ సహజమైన లజ్జను విడిచి రెండుచేతులెత్తి కృష్ణుడే రక్షకుడన్న విశ్వాసముతో ఆయనను ప్రార్థించింది.

  *తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్ తన ప్రయత్నములన్నీ వదిలివేసి భక్తవత్సలుడైన  తిరుక్కణ్ణమంగై దివ్య దేశములోని పెరుమాళ్ళపై విశ్వాసమునుంచి శరణాగతి చేశారు.

  ఆణ్డాన్ నిష్ఠను మామునులు ఈ సూత్రములో బాగా వ్యాఖ్యానము చేశారు.

ఒక సారి ఆణ్డాన్ ఒక కుక్క తనపై దాడి చేసిన వ్యక్తి మీద కోపముతో మొరగటము చూశారు. అంతలో ఆ కుక్క యజమాని కోపముతో ఆవ్యక్తి మీదికి వచ్చాడు.మాట మాట పెరిగింది ఆఖరికి కత్తి దూసేదాక విషయము వెళ్ళింది.అది చూసిన ఆణ్దాన్ కు గొప్ప ఙ్ఞానోదయమైంది. ఒక కుక్క యజమాని తన కుక్కను రక్షించుకోవటానికి సాటి వ్యక్తిని చంపటానికి కూడాసిద్దపడ్డాడే|మరి  సర్వాధికారిసర్వశక్తుడు అయిన శ్రీమన్నారాయణుడు తన వారైన చేతనులను వదిలేస్తాడా? అని భావించి తిరుక్కణ్ణమంగై దివ్య దేశములోని పెరుమాళ్ళైన  భక్తవత్సలుని శ్రీపాదములపై సాష్ఠాంగపడ్డారు.    

స్వరక్షణ హేతువాన స్వవ్యాపారంగళై విట్టాన్ ఎంగిన్ఱపడి” (స్వరక్షణ హేతువైన స్వవ్యాపారములను వదిలాడు)అని మామునులు వ్యాఖ్యానము చేశారు. ఆయ్ జనన్యాచార్యులు కూడా తన తిరువాయిమొళి 9.2.1 వ్యాఖ్యానములో ఈ విషయమును ప్రత్యేకముగా చెప్పారు.

  ఉపేయము (కైంకర్యము)-

               శ్రీవచన భూషణ దివ్యశాస్త్రములోని 80వ సూత్రము,తరువాతి సూత్రములలో దీనికి చక్కని వ్యాఖానము చేయబడినది.

   *ఇళయ పెరుమాళ్-(లక్ష్మణస్వామి) శ్రీ రాముడికి ఎప్పుడు ఏ కైంకర్యము కావాలంటే అది చేయటములో సిద్దహస్తుడు.

   *పెరియ ఉడైయార్ –( జటాయు మహారాజు) రావణాసురుడు సీతా పిరాట్టిని అపహరించుకు పోయేటప్పుడు తన ప్రాణాలకు తెగించి పోరాడాడు.

   *పిళ్ళై తిరునరైయూర్ అరైయర్-శ్రీరంగము దగ్గరలోని తొత్తియం తిరునారాయణపురం అనే క్షేత్రములో ఒకసారి పిళ్ళై తిరునరైయూర్ అరైయర్ సకుటుంబముగా సేవించుకోవటానికి వెళ్ళినపుడు కొందరు దుండగులు కోవెలకు నిప్పు పెట్టారు. అర్చావిగ్రహమును రక్షించుకోవటము కోసము అరయర్ కుటుంబముతో సహా అర్చా విగ్రహమును ఆలింగనము చేసుకొని ఆ ప్రయత్నములోనే పరమపదము చేరుకున్నారు. పరమాత్మ పట్ల వీరికున్న అంకితభావమును పూర్వాచార్యులు ఎంతగానో కొనియాడి నారు.

   *చింతయంతి –   వ్రజ భూమిలో ఉండే ఒక గోపిక. కృష్ణుని పట్ల అపారమైన ప్రేమకలది. ఒక రోజు కృష్ణుని వేణుగానము విని ఆనందముతో ఆయనను చూడాలని తహ తహలడింది.ఇంట్లోని వాళ్ళు వెళ్ళనివ్వ లేదు. దుఃఖముతో కూలిపోయి ప్రాణాలను విడిచింది. ఆనందముతో పుణ్య కర్మము, దుఃఖముతో పాప కర్మము తొలగి పోయి  పరమపదం చేరుకున్నది. మన పాపపుణ్యములే మనలను ఈ సంసారములో(భూలోకములో)కట్టి పడవేసేవి.

    ఆణ్దాన్ జీవితకాలమంతా తిరుక్కణ్ణమంగైలోని స్వామికి కైంకర్యము చేసి పరమపదమునకు వేంచేసి అక్కడ పరమపద నాథునికి కైంకర్యము కొనసాగించారు.

    పూర్వాచార్య గ్రంథములలో ఆణ్దాన్ గొప్పతనమును తెలియజేసే వ్యాఖ్యానములు కొన్నిటిని చూద్దాము.

    *నాచ్చియార్ తిరుమొళి 1.1- వ్యాఖ్యానము  –   “తరై విళక్కి”(నేలను ఊడ్చి)అని  ఆణ్దాళ్ అన్న మాటకు తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్ చెడును ఊడుస్తున్నారు అని పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానంలో రాశారు.

    *తిరుమాలై 38 –  వ్యాఖ్యానము–“ఉన్ కడైత్తలై ఇరుంతు వాళుం సోంబర్”(“నీ తలవాకిటనే ఉండి ఉజ్జేవించే సోమరులు” అని అర్థము) దీనికి  పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములో తిరుక్కణ్ణమంగై ఆండాన్ ను ఉదాహరణగా  చూపించారు.ఎందు కంటే పరమాత్మనే నమ్ముకొని ఇతర తాపత్రయములు లేకుండా జీవించారు. 

    *తిరువాయిమొళి 9.2.1 నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము – నమ్మాళ్వార్  తిరువాయిమొళి  10.2.7 చెప్పిన విదముగా కడైత్తలై చీయ్క్కప్పెత్తాల్ కడువినై కళైయలామే”(తల వాకిలి ఊడిస్తే పాపాలన్నీ తరిగిపోతాయి) అనే  పాశురానికి నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానములో చక్కగావివరించారు. ఈ పాశుర అర్థము ఏవిటంటే నమ్మాళ్వార్ స్వామితో ‘మేము తరతరాలుగా కోవెలను శుభ్రము చేసే కైంకర్యము చేస్తున్నాము’.  “ ప్రపన్నులైనవారు కైంకర్యము ఉపాయముగా ఎందుకు స్వేకరించాలి?వారికి పరమాత్మ ఉపాయము కదా? “అన్న ప్రశ్న వస్తుంది. నంపిళ్ళై తిరువాయిమొళి 9.2.1  పాశురము యొక్క ఈడు వ్యాఖ్యానములో దీనికి తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్ అనుభవములోని విషయాన్ని ఉదాహరణగా చెప్పారు. ఆణ్దానుకు నాస్తికుడైన  మిత్రుడు ఒకడు వుండేవాడు. ఆణ్దాన్ రోజు కోవెలలోని సన్నిధిని శుభ్రము చేయటము చూసి ప్రపన్నులైన మీరు కోరికలే లేని వారు కదా మరి ఎందుకు ఇంత కష్టపడి రోజూ  శుభ్రము చేస్తున్నావు? అని అడిగారు. దానికి ఆండాన్ శుభ్రము చేసిన స్థలము,చేయని స్థలము చూపించి తేడా చూడమన్నారు.దాసభూతులైన వారికి కైంకర్యము చేయటము సహజసిద్దము అంతేకాని ఉపాయము కాదు అని చెప్పారని నంపిళ్ళైతన వ్యాఖ్యానములో వివరించారు.

          *శ్రీవచన భూషణము సూత్రం 88లో పిళ్ళై లోకాచార్యులు సామాన్యులు చేసే కైంకర్యానికి,    ప్రపన్నులు చేసే  కైంకర్యానికి బేధమును చక్కగాతెలిపారు.

        *చరమోపాయ నిర్ణయం నాథమునులు నాలాయిర దివ్య ప్రబంధమును   నమ్మాళ్వార్ వద్ద ఆళ్వార్ తిరునగరిలో నేర్చుకున్నారు.అక్కడ నుండి  వీరనారాయణ పురం (కాట్టు మన్నార్ కోయిల్)చేరుకొని, దివ్య ప్రబంధమును అక్కడి పెరుమాళ్ళు ,మన్ననార్ ముందు నివేదించారు.  కోవెలలో మర్యాదలు అందుకున్న తరువాత తిరుమాళిగకు వెళ్ళగానే, తన మేనళ్ళులను కీళై అగత్తాళ్వాన్, మేలై అగత్తాళ్వాన్లను(కింది ఇంటి ఆళ్వాన్,మీది ఇంటి ఆళ్వాన్) పిలిచితను నమ్మాళ్వార్ల అనుగ్రహము పొందిన విధానమును వివరించారు.తనకు కలలో భవిష్యదాచార్యులు(రామానుజులు) దర్శనము ఇచ్చిన విషయము చెప్పగా విని, వారిరువురు ఆశ్చర్యచకితులైయ్యారు. తరవాత వారికి ద్వయ మంత్రార్థమును తిరువాయిమొళి పరముగా వివరించారు. ప్రియ శిష్యులైన తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్ కు కూడా చెప్పారు.పొలిగ పొలిగ పొలిగ” (తిరువాయిమొళి 5.2.1) పాశురమును వివరిస్తున్న సందర్భములో,స్వప్న వృత్తాంతము(భవిష్యదాచార్యులు)ను నాథమునులు తెలపగా విన్న ఆండాన్   నాయనారాచ్చాన్ పిళ్ళై(పెరియవాచ్చాన్ పిళ్ళై కుమారులు)రచించిన “చరమోపాయ నిర్ణయమును”లోని విషయము చక్కగా భోద పడుతున్నదని తమలాంటి పెద్దల సాంగత్యము నా పూర్వజన్మ సుకృతమని పొంగిపోయారు. 

   *వార్తా మాలై 109 – పిన్బజగియ పెరుమాళ్ జీయర్ కూడ తన వార్తామాలలో పిరాట్టి, ద్రౌపతి , తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్లను  గురించి శ్రీవచనభూషణములో చెప్పిన విధముగానే చెప్పారు.

   *వార్తా మాలై 234-ఇందులో విశేష శాస్త్రము (భాగవత ధర్మము) సామాన్య శాస్త్రం (వర్ణాశ్రమ ధర్మం) కంటే ఎలా గొప్పదో తెలియజేసారు. అలాంటి నిష్ఠ అందరికీ సాధ్యము కాదు. ఎంతో ప్రపన్నులైన అధికారులు ఆది భరతన్, తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్ లాంటి వారికి మాత్రమే సాధ్యము.

       తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్ దివ్య తిరువడిని మనసులో నిలుపుకొని మనలోను పరమాత్మ మీద చెదరని విశ్వాసము వుండాలని ప్రార్థించుదాము.

   అడియేన్ చూడామణి రామానుజ దాసి

 source:

   ఆధారము:  చరమోపాయ నిర్ణయం, వార్తామాలై వ్యాఖ్యానములు.

తిరుమాలై ఆణ్దాన్

శ్రీ:

శ్రీమతే రామానుజాయ నమ:

శ్రీమద్ వరవరమునయే నమ:

శ్రీ వానాచల మహామునయే నమ:

thirumalai-andan

తిరునక్షత్రము: మాసి, మగం (మాఘ మాసము-మఖ నక్షత్రము)
అవతార స్థలము: తిరుమాలిరుంచోలై
ఆచార్యులు: ఆళవందార్
శిష్యులు: ఎంపెరుమానార్ (గ్రంథ కాలక్షేప శిష్యులు)
ఆళవందార్ ప్రధాన శిష్యులలో తిరుమాలై ఆణ్దాన్ ఒకరు. వీరిని మాలాధారులు, శ్రీ ఙ్ఞాన పూర్ణులు అని కూడా అంటారు.
ఆళవందార్ ఐదుగురు శిష్యులకు సంప్రధాయములోని లోతులను ఎంపెరుమానార్కు ఉపదేశించటము కోసము నియమించారు. తిరువాయ్ మొళిలోని అర్థములను చెప్పటము కోసము తిరుమాలై ఆణ్దానును నియమించారు.
ఆళవందార్ పరమపదము చేరిన పిదప ఎంపెరుమానార్ శ్రీరంగము చేరుకున్నారు. అప్పుడు తిరుక్కోష్తియూర్ నంబి ఎంపెరుమానారును తిరుమాలై ఆణ్దాన్ వద్ద నమ్మాళ్వార్ తిరువాయ్ మొళిలోని లోతులను తెలుసుకోమని ఆదేశించారు.

pancha-acharyas

తిరుమాలై ఆణ్దాన్ తిరువాయ్ మొళిలోని అర్థములను చెప్పే సమయములో తాను ఆళవందార్ దగ్గర విన్న విషయములను వివరించగా,ఎంపెరుమానార్ ఆయా పాశురములకు వేరే అర్థములను చెప్పటము చూసి ఈయన యేదో విశ్వామిత్ర సృష్ఠి చేస్తున్నారని భావించేవారు.

ఒక సారి తిరువాయిమొళిలోని 2.3.3 “అరియా క్కాలత్తుళ్ళే” పాశురమునకు ఆణ్దాన్, “నమ్మాళ్వార్ పరమాత్మ తనకు ఙ్ఞానము నిచ్చి కూడా ఇంకా ఈ సంసారములోనే వుంచార”ని ,విషాదముగా ఈ పాశురము పాడారని చెప్పారు. కాని ఎంపెరుమానార్ అదే పాశురములోని రెండవ పాదమును ముందు తీసుకొని నమ్మాళ్వార్ “ఇప్పటిదాకా ఈ సంసారములో ఉంచావు.ఇప్పుడు నీకు నామీద దయ కలిగి నన్ను కరుణంచావు ‘ అని అన్నారని వివరించారు. “ఆళవందార్ చెప్పిన అర్థము ఇలా లేదు మీరు కొత్తగా విశ్వామిత్ర సృష్ఠి చేస్తున్నారని” కాలక్షేపము నిలిపివేసారు. ఈ విషయము తెలిసిన తిరుక్కోష్టియూర్ నంబి తిరుక్కోష్టియూర్తి నుండి శ్రీరంగమునకు వచ్చి, ఆణ్దాను ను విషయమేమిటని అడిగి తెలుసుకొని “ఆళవందార్ కూడా ఇలాగే చెప్పారు. మీరు బహుశా అరోజు రాలేదేమో. శ్రీ కృష్ణ్దుడు, సాంధీపని వద్ద విద్య నేర్చుకున్నట్టే, ఎంపురుమానార్ మన దగ్గర తిరువాయిమొళి నేర్చుకుంటున్నారని సర్ధి చెప్పి మళ్ళీ కాలక్షేపము కొనసాగే ఏర్పాటు చేసారు. ఆణ్దానును, పెరియ నంబిని ఎంపెరుమానార్ మఠమునకు తీసుకువచ్చి ఆణ్దాన్ దగ్గర కాలక్షేపము కొనసాగించమని ఎంపెరుమానారును కోరారు. తిరిగి ఒక సారి ఎంపెరుమానార్ ఇలాగే ఒక పాసురమునకు వేరే అర్థము చెప్ప్గగా,ఆణ్దాన్ “మీకు ఈ అర్థములు ఎలా తెలుస్తున్నాయ”ని అడిగారు దానికి ఎంపెరుమానార్ “ఆళవందారుకు నేను ఏకలవ్య శిష్యుడను.” అన్నారు.ఆళవందార్ వారి గొప్పతనము తెలుసుకొని సంతోషించి అప్పటి నుండి ఎంపెరుమానార్ చెప్పే అర్థములను ఆనందముగా వినేవారు.

ఈ రకముగా పాశురముల వ్యాఖ్యానములో ఎంపెరుమానార్ ఆణ్దాన్ తో విభేషించినవి చాలా వున్నాయి.వాటిలో కొన్నింటిని చూద్దాము.

  • తిరువాయిమొళి 1.2 – నంపిళ్ళై వ్యాఖ్యానము – “వీడు మిన్ ముత్తవుం” పదిగము ఆణ్దాన్ వివరిస్తూ ఎంపెరుమానారుతో ఇది “ప్రపత్తి యోగముగమ”ని తనకు ఆళవందార్లు బొధించారని చేప్పారు. ఎంపెరుమానార్ అప్పుడు ఊరుకున్నా శ్రీ భాష్యము పూర్తిచేసిన తరవాత ఉపన్యాసాలలో “భక్తి యోగం”ని చెప్పేవారు.ప్రపత్తి చాలా నిఘూడమైనది భాష్యము చేసేవారి చేతిలో పదితే అతి సులభముగా మార్చేస్తారు.ఇది “సాధ్య భక్తి ” (పరమాత్మకోసమే భక్తి చేయటము అందులో అణు మాత్రము కూడ స్వప్రవృత్తి ఉండరాదు)ఇది ఉపాయము,సాధన భక్తి కంటే భిన్న మైనది. ఎంబార్ కూడా ఎంపెరుమానార్ విధానమునే అనుసరించారు.
  • తిరువాయ్ మొళి2.3.1- “తేనుం పాలుం కన్నలుం అముథుమొత్తే – కలందొళింతోం” అనే పాశురము ఆణ్దాన్ “అళ్వార్లు పరమాత్మ,తను తేనె, తేనె లానో పాలు,పాలు లానో కలిసిపోయామ”ని ఆళవందార్ మాకు చెపారన్నారు.కాని ఎంపెరుమానార్ ఒక్క పాలో ,తేనో కాదు.తేనె,పాలు,పంచదార ఇంకా అనేక మధుర పధార్థాలు కలిసి పోయిన్నట్టు ఒక కొత్తరుచిని అనుభవించామని చెప్పడమే ఆళ్వార్ల ఉద్దేశ్యమని వివరించారు.

నాచియార్ తిరుమొళి, 11.6 వ్యాఖ్యానములో, ఆణ్దాన్ ఈ వ్యాఖ్యానములో ఏమి చెప్పారంటే “ఈ శరీరముతో గల అన్ని సంబంధములను,శరీరము మీది అభిమానమును కూడా వెదిలి వేసినా, ఈ శరీరమును తృణీకరించరాదు. ఇది ఆళవంధార్ల సంబంధము గలది.”అనటము చూసి పెరియవాచాన్ పిళ్ళై ఆణ్దాన్ యొక్క ఆచార్య భక్తిని గుర్తించారు.
చరమోపాయ నిర్ణయము లో నాయనార్ ఆచాన్ పిళ్ళై తిరుమాలై ఆణ్దాన్”పొలిగ పొలిగ” పాశురము(తిరువాయిమొళి 5.2) అర్థమును వివరిస్తున్న సమయములో, తిరుక్కోష్ఠియూర్ నంబి గోష్టిలో, ఈ పాశురము ఎంపెరుమానార్ల గురించి ఆళ్వార్లు చెప్పినదని ప్రకటించారు. అది వినగానే, ఆండాన్ సంతోషంగా ఎంపెరుమానార్ నాకు ఆళవంధార్లతో సమానమన్నారు (స్వాచార్యులు).

అంతటి ఆచార్య నిష్ఠ గల ఆండాన్ కృప సదా మనపై వుండాలని కోరుకుందాము.

తిరుమాలై ఆణ్దాన్ తనియన్
రామానుజ మునీంద్రాయ ద్రామిడీ సంహితార్థధం
మాలాధర గురుం వందే వావధూకం విపస్చితం

ராமாநுஜ முநீந்த்ராய த்ராமிடீ ஸம்ஹிதார்த்ததம்
மாலாதர குரும் வந்தே வாவதூகம் விபஸ்சிதம்

అడియేన్  చూడామణి రామానుజదాసి

ఆధారము: 6000పడి(ఆరాయిర పడి) గురు పరంపరా ప్రభవం, పెరియ తిరుముడి అడైవు, వ్యాఖ్యానము, యం.ఏ.వి.స్వామి “వాళ్వుం వాక్కుం”.

source: