ముదలియాండాన్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

mudhaliyandan

తిరునక్షత్రము : చైత్ర మాసము, పునర్వసు

అవతార స్థలము : పేట్టై

ఆచార్యులు : ఎమ్పెరుమానార్

పరమపదము చేరిన ప్రదేశము : శ్రీరంగము

శ్రీ సూక్తులు : ధాటీ పంచకము, రహస్య త్రయము (ప్రస్తుతము ఎక్కడ అందుబాటులో లేవు)

ఆనంద దీక్షీతర్ మరియు నాచ్చియారమ్మన్ల కుమారునిగా అవతరించిరి, వారికి దాశరధి అని నామకరణము చేసిరి. వీరు ఎమ్పెరుమానారుకు చిన్నమ్మ కుమారుడు. వీరికి రామానుజన్ పొన్నడి, యతిరాజ పాదుక, శ్రీవైష్ణవ దాసర్, తిరుమరుమార్భన్ అని కూడా వ్యవహరించేవారు మరియు ప్రధానంగా ముదలియాండాన్ (అర్థము “శ్రీవైష్ణవులకు నాయకుడు”) గా ప్రాశస్తమును పొందిరి. వీరు ఈ విధముగా కూడా వ్యవహరించబడేవారు ఎమ్పెరుమానార్ (యతిరాజ పాదుకా) యొక్క శ్రీ చరణములు మరియు ఎమ్పెరుమానార్ యొక్క త్రిదండము. గమనిక: ఆళ్వాన్(కూరత్తాళ్వాన్) మరియు ఆండాన్ ఇద్దరూ ఎమ్పెరుమానార్లకి చాలా ప్రియమైనవారు మరియు వారి నుండి వీరిని వెరుచేయ లేము – కూరత్తాళ్వాన్ లను ఎమ్పెరుమానార్ యొక్క జల పవిత్రము (ఎమ్పెరుమానార్ యొక్క త్రిదండమునకు కట్టబడిన జెండా) గా వ్యవహరించెదెరు.

azhwan-emperumanar-andan

ఆళ్వాన్, ఎమ్పెరుమానార్, ఆండాన్ – వారి యొక్క అవతార స్థలములలో

ఎమ్పెరుమానార్ ఆండాన్ యెడల గొప్ప ఇష్టమును కలిగి ఉండేవారు కారణము వారి యొక్క భగవత్ / భాగవత నిష్ట (భగవాన్ మరియు అతని భక్తులయందు గల సంభందము). ఎమ్పెరుమానార్ సన్యాసమును స్వీకరించిన సమయములో, వారు ఒక్క ఆండాన్ యందు తప్ప మిగిలిన బంధములన్నీ వదిలి వేసామని చెప్పిరి – అది ఆండాన్ యొక్క గొప్పతనము. ఎమ్పెరుమానార్ సన్యాసాశ్రమము స్వీకరించిన తరువాత, ఆళ్వాన్ మరియు ఆండాన్ ప్రథమంగా వారి యొక్క శిష్యులైరి. వారిద్దరూ ఎమ్పెరుమానార్ వద్ద శాస్త్రములను (ఉభయ వేదాంతము – సంస్కృతము మరియు అరుళి చ్చెయల్) వాటి యందు గల సారములను నేర్చుకొనిరి. వారు ఎమ్పెరుమానార్లతో పాటు కాంచీపురమును వదిలి శ్రీరంగమునకు వెళ్ళిరి. ఎమ్పెరుమానార్ యొక్క దివ్యాఙ్ఞతో, ఆణ్డాన్ కోవెల యొక్క పూర్తి అధికార భాద్యతలను తీసుకొని అన్ని పనులను సరైన నిర్వహణతో (కార్యములను) నిర్వర్తించెను.

తిరుక్కోట్టియూర్ నంబి ఎమ్పెరుమానార్లకు చరమ శ్లోకము యొక్క అర్థములను అనుగ్రహించిన తరువాత, ఆండాన్ ఎమ్పెరుమానార్లని వారికి కూడా అనుగ్రహించ వలసినదిగా కోరిరి. ఎమ్పెరుమానార్ ఆండాన్ ని నంబి వద్దకి వెళ్ళి అభ్యర్తించమనిరి. ఆండాన్ 6 నెలలు నంబి గారి తిరుమాలిగ (గృహము) నందు ఉండి ఎంతో ఓపికతో సేవలను చేసెను. 6 నెలలు గడిచిన తదుపరి, ఆండాన్ నంబి గారిని చరమ శ్లోకము యొక్క అర్థములను అనుగ్రహించ వలసినదిగా కోరగా, నంబి ఈ విధముగా అన్నారు మీరు మీ ఆత్మ గుణములను పూర్తిగా మెరుగు పరచుకొన్నచో ఎమ్పెరుమానార్ స్వయముగా అనుగ్రహించుదురని చెప్పిరి. నంబి వారి యొక్క శ్రీ చరణములను ఆండాన్ యొక్క శిరస్సుపై ఉంచి వారికి వీడ్కోలు పలికిరి. ఎమ్పెరుమానార్ ఆండాన్ యొక్క రాకను చూచి, ఆండాన్ యొక్క భావము (దాస్యము యందు) నకు సంతోషించి చరమ శ్లోకము యొక్క అర్థములను అనుగ్రహించిరి.

mudhaliyandan-sridhanavellAtti

  ఆండాన్ ఎమ్పెరుమానార్లకు పుర్తి దాసులవడము ఈ చరితము (చారిత్రక సంఘటన) ద్వారా తెలుసుకోవచ్చును.

ఒకసారి పెరియ నంబి గారి కూతురైన అత్తుళాయ్ తన అత్తగారి వద్దకి వెళ్ళి తాను నదికి వస్త్ర ప్రక్షాళనకు / స్నానానికి ఒంటరిగా వెళ్ళుచున్నాను కావున సహాయానికి ఎవరినైన పంపించ వలసినదని కోరగా దానికి వారి అత్తగారు “మీ పుట్టింటి నుండి స్త్రీ ధనంగా సహాయకులను  తెచ్చుకోవలసినది” అని బదులిచ్చినది. అత్తుళాయ్ తన యొక్క తండ్రి గారు వద్దకి వెళ్ళి (సహాయకునికై) ఏర్పాటు చెయమని కోరెను. పెరియ నంబి తాను పూర్తిగా ఎమ్పెరుమానార్లపై ఆధారపడటముచే వారి వద్దకు వెళ్ళి అడుగమనెను, ఆమె వెళ్ళి వారిని ఈ విషయమున అభ్యర్తించింనది. ఎమ్పెరుమానార్ ఆ ప్రదేశములో చుట్టూ చూసి ఆండాన్ ను అత్తుళాయ్కి సహాయకుడిగా వెళ్ళమని ఆఙ్ఞాపించిరి. ఆండాన్ వారి యొక్క ఆఙ్ఞకు పాఠించి ఆమె వెంట వెళ్ళెను. వారు ఆమెకు నిత్యమూ సహాయమును చేయుచుండిరి. అత్తుళాయ్ అత్తగారు ఇది చూసి ఆందోళన చెందిరి కారణము ఆండాన్ (అతను గొప్ప పండితుడు మరియు రామానుజ శిష్యులలో నాయకుడు) వారి యొక్క గృహమునకు వచ్చి దాస్యము చేయడము. అందువలన ఆమె వారిని ఆ పనులు చేయవద్దనిరి. ఆండాన్ వెంటనే ఇది ఎమ్పెరుమానార్ యొక్క ఆఙ్ఞ కావున నేను చేస్తానని చెప్పెను. ఆమె వెంటనే పెరియ నంబి గారి వద్దకు వెళ్ళగా వారు ఎమ్పెరుమానార్ వద్దకు పంపిరి. ఎమ్పెరుమానార్ ఈ విధముగా చెప్పెను “మీరు కోరడముచే మేము సహాయకుడిని పంపితిమి – మీకు వద్దైతే అతడిని వెనుకకు పంపడి”. అత్తుళాయ్ అత్తగారు తన యొక్క తప్పును గ్రహించి పెరియ నంబి, ఎమ్పెరుమానార్, ఆండాన్ యొక్క గొప్పతనమును గుర్తించి ఆపై అత్తుళాయ్ విషయమున శ్రద్దను తీసుకొనెను. ఈ యొక్క సంఘటన తమ యొక్క ఆచార్యుల ఆఙ్ఞలను పాఠించడములో ఆండాన్ యొక్క గొప్పతనమును తెలియచేయును .మనము దీని ద్వారా సులభముగా గ్రహించవచ్చు. ఎవరైతే ఎమ్పెరుమానార్ శ్రీ చరణ దాసులమని చెప్పుదురో, ఎవరైతే ఎమ్పెరుమానార్ శ్రీ చరణ దాసులుగా భావిస్తారో వారందరు ఇలాంటి పవిత్రమైన / కళ్యాణ గుణములను కలిగి ఉంటారు. ఈ గుణముల సారభూతునిగా  ముదలి యాండాన్ ఉన్నారని గ్రహించ వచ్చు.

mudhaliyandan-sripadhathirtham

శైవ రాజు ఆగడములు భరించక ఆండాన్ కూడా ఎమ్పెరుమానార్తో కూడి మేల్కోటె (తిరునారాయణ పురము) ప్రయాణించిరి. ఒక ప్రదేశములో మిథిలాపురి శాలగ్రామము, అక్కడ నివశించే ప్రజలు అవైధికముగా ఉండేవారు. ఎమ్పెరుమానార్ ఆండాన్ తో ఆ గ్రామ ప్రజలు స్నానము చేయు చోట (నదిలో) వారి యొక్క శ్రీ చరణాములను ఉంచమని చెప్పిరి. ఆండాన్ తమ శ్రీ పాదములను నదిలో ఉంచుటచే నదిలో అందరూ స్నానము చేయడము వలన వారు ఆండాన్ యొక్క శ్రీపాద సంబంధముచే, వారు పునీతులైరి. ఆ మరునాటి నుండి ప్రతీ ఒక్కరు  ఎమ్పెరుమానార్ వద్దకు వచ్చి వారిని ఆశ్రయించెను. అందువలన, మనము ఈ సంఘటన ద్వారా ఒక స్వచ్చమైన శ్రీవైష్ణవుని శ్రీ పాద తీర్థము అందరినీ పునీతులగా చేయుననే విశేషమును గ్రహించవచ్చును.

ముదలియాండాన్ కుమారులైన కందాడై ఆండాన్ ఎమ్పెరుమానార్ యొక్క ఆఙ్ఞను తీసుకొని ఎమ్పెరుమానార్  ఒక అర్చా విగ్రహమును తయారు చేసిరి. ఎమ్పెరుమానార్ ప్రేమతో ఆ విగ్రహమును ఆలింగనము చేసుకొనిరి. ఆ యొక్క విగ్రహమును వారి అవతార స్థలములో (శ్రీపెరుంబూతూర్) తై పుష్యమిన (ఈ రోజును గురు పుష్యమిగా ఇప్పడికీ శ్రీపెరుంబూతూర్లో నిర్వహించుదురు) ప్రతిష్టించిరి మరియు ముఖ్యముగా  తాముగంద తిరుమేని (ఆ విగ్రహము రామానుజులకి ప్రియము కావడముచే) గా ప్రసిద్దిగాంచెను.

ఆండాన్ ఆఙ్ఞలను మరియు వారి యొక్క కీర్తిని వ్యాఖ్యానములో వివిధ ప్రదేశములలో ఉదహరించబడెను. వాటిలో కొన్ని మనమూ ఇక్కడ చుద్దాము:

  • తిరువాయ్మొళి 2.9.2 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము – ఆండాన్ ఔదార్యం ఈ సంఘట నందు అందముగా వివరించెను. ఒకసారి ఆండాన్ నగరములో లేని సమయమున అతని శిష్యుడొకరు ఎంబార్ వద్దకి వెళ్ళెను. ఎంబార్ ఆ శ్రీ వైష్ణవుడి కైంకర్యమును అంగీకరించిరి కారణము అతనికి ఆచార్య సంభందము లేదని, వారు అతడికి పంచ సంస్కారములని అనుగ్రహించి దైవ విషయములను చెప్పుచుండెను. అప్పుడు ఆండాన్ తిరిగి రాగా, ఆ శ్రీవైష్ణవుడు తిరిగి ఆండాన్ వద్దకి వచ్చి కైంకర్యమును చేయసాగెను. ఎమ్బార్ దానిని గురించి తెలుసుకొని ఆండాన్ వద్దకి వచ్చి ఈ విధముగా చెప్పిరి “నాకు ఇతను మీ శిష్యుడని తెలియక అలా చేయడమైనదని అందుకు తన అపచారమును మన్నించమనిరి”. ఆండాన్, ప్రశాంతముగా సమాదానమును చెప్పిరి “ఎవరైనా బావిలో పడినప్పుడూ, ఇద్దరు కలిసీ అతడిని బయటకు తీస్తే, అది చాలా సులభము. అలానే, ఇతను సంసారములో ఉన్నాడు కావున, మనమిద్దరమూ సహాయము చేస్తే అది లాభమే కదా”. ఇటువంటి ఉదార హృదయమును కలిగి ఉండడము చాలా అరుదు దానిని  మనము ఆండాన్ వద్ద చూడవచ్చు.
  • తిరువాయ్మొళి 3.6.9 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము – ఈ పదిగములో ఆండాన్ అర్చావతార ఎమ్పెరుమాన్ యొక్క గొప్పతనమును పూర్తిగా వివరించిరి. “పరమపదనాథుడు తన భక్తులపై కృపతో అర్చావతారముగా ఇక్కడ అవతరించిరని భావించరాదు. దానికి బదులుగా అర్చావతారమే చాలా ప్రథానమైనదని మరియు పర వాసుదేవుడిగా తాను ఇక్కడ పరమపదము నుండి విచ్చేశాడని భావించాలి”
  • తిరువాయ్మొళి 5.6.7 –  నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము – ఈ పదిగములో, ఎమ్పెరుమాన్ యొక్క సర్వ వ్యాపకత్వమును (సర్వాంతర్యామి) గురించి వివరించెను. ఇక్కడ పరాంకుశ నాయకి (నమ్మళ్వార్ స్త్రీ భావనతో పాడినపుడు పరాంకుశ నాయకి అని పేర్కొంటారు.)  ఎంపెరుమాన్  తమ బంధువులను నాశనము చేస్తాడు అన్నారు. దానికి ఆండాన్ “ఎంపెరుమాన్ తన దివ్య సౌందర్యముతో (తన భక్తులను పూర్తిగా ద్రవింపచేసి) నాశనము చేస్తాడు” అని చక్కటి వ్యాఖ్యానము చేసారు.
  • తిరువాయ్మొళి – 6.4.10 –  నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము – ఇక్కడ్ ఆండాన్ అర్చావతార ఎంపెరుమాన్ ప్రణవత వర్ణిచబడింది (విశేషముగా నంపెరుమాళ్ మీద)..  ఎంబార్, ఆండాన్ల మీద నంజీయర్ చేసిన వ్యాఖ్యను నంపిళ్ళై  గుర్తించారు. సంసారములో చాలా మంది పరమాత్మ పట్ల విముఖులుగా వున్నారు. అర్చావతార ఎమ్పెరుమాన్ సుకుమారుఢై పూర్టిగా తన భక్టుల మీద ఆధారపడ్డాడు. బ్రహ్మోత్సవము తరువాత ఎమ్బార్, ఆండాన్ కలుసుకున్నప్పుడు పరస్పరము అభివాదాలింగనముల తరువాత “నమ్పెరుమాళ్ (శ్రీరంగనాధులు) ఉత్సవాంతరము క్షేమముగా ఆస్థానము చేరారు.” అని సంతసించారు. మన పూర్వాచార్యుల లగా పెరుమాళ్ళకు మంగళాశాసనము చేయుట మీద వీరికి ఆసక్తి అధికం.
  • తిరువాయ్మొళి 8.10.3 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము:  భట్టర్ చిన్నతనములో, ఆళ్వాన్ ని “శిరుమామనిశర్” (తిరువాయ్మొళి 8.10.3) యొక్క అర్థమును అడిగిరి. కారణము అది విరుద్దముగా కనబడడముచే. అందుకు, ఆళ్వాన్ ఈ విధముగా చెప్పెను ‘శ్రీవైష్ణవులైన ముదలియాండాన్,  ఎంబార్  మరియు అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ శారీరకముగా చిన్నవారు కాని నిత్య సూరుల వలె గొప్పవారు.
  • తిరువాయ్మొళి 9.2.8 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము – శ్రీ రంగములో శ్రీ జయంతి పురప్పాడు సమయమున, వంగీపురత్తు నంబి ఎమ్పెరుమాన్ ని సేవించుటకై గొల్ల పిల్లల సమూహమున చేరిరి. ఆండాన్ అక్కడ ఉన్నారేమిటని అడుగగా, నంబి ఈ విధముగా చెప్పెను “నేను విజయస్వ అని చెప్పితిని”. ఆండాన్ అందుకు సమాదానముగా మీరు వారి మద్యన ఉండి, వారి యొక్క భాషను మాట్లాడక కష్టమైన సంస్కృతమును ఎందుకు మాట్లాడుతున్నారని అడిగిరి.

ముదలి యాండాన్ జీవితములోని కొన్ని విషయములను ఇక్కడ మనమూ చూసాము. వారు పూర్తిగా భాగవత నిష్ట కలిగి ఉండి ఎమ్పెరుమానార్ లకు ప్రియమైన శిష్యులైరి. మనమూ అటువంటి భాగవత నిష్ట కలుగవలెనని వారి శ్రీ చరణములను ఆశ్రయించుదాము.

ముదలి యాండాన్ యొక్క తనియన్ :

పాదుకే యతిరాజస్య కథయంతి యదాఖ్యయా|

తస్య దాశరథే పాదౌ శిరసా ధారయామ్యహం ||

అడియేన్ రఘు వంశీ రామానుజ దాసన్

మూలము: https://guruparamparai.wordpress.com/2013/03/29/mudhaliyandan/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org