శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః
తిరువరంగప్పెరుమాళ్ అరయర్ శ్రీరంగం
తిరునక్షత్రము~: వైకాశి, కేట్టై
అవతార స్తలము~: శ్రీ రంగము
ఆచార్యులు~: మణక్కాల్ నమ్బి, ఆళవన్దార్
శిష్యులు~: ఎమ్పెరుమానార్ (గ్రంథ కాలక్షేప శిష్యులు)
పరమపదించిన చోటు ~: శ్రీరంగము
తిరువరంగప్పెరుమాళ్ అరయర్, వీరు శ్రీ అళవందార్లకు తొలి సంతానము. ప్రథమ శిష్యులు.
అరయర్లు ఆళ్వార్ల ప్రభందాలకు చక్కటి అభినయము చేస్తు శ్రావ్యముగా పాడగల నైపుణ్యము కలవారు.
ఎప్పటిలాగానే శ్రీరంగంన అధ్యయన ఉత్సవములు జరుగుచుండగ తిరువరంగ పెరుమాళ్ అరయర్ (అరయర్ అనగా శ్రీరంగంన పెరుమాళ్ళకి అళ్వార్ పాశురములును శ్రుతి లయ భద్దముగ పాడుతూ అభినయము చేశేవారు).నమ్మాళ్వారుల తిరువాయ్ మొళి (10.2) లో ఉన్న తిరువనంతపురమున పద్మనాభ స్వామి పై పాశురమును పాడిరి. “నడమినో నమర్గళుళ్ళీర్ నాముమక్కు అఱియచ్ చొన్నోమ్” ఓ భక్తులరా మనం అందరము తిరువనంతపురమునకు నడిచి పోదాము అనే అర్దము వచ్చే పాశురమును అరయర్ పాడిరి.
ఇది విన్న శ్రీ ఆళవందార్లు పరవశించి అది పెరుమాళ్ళ అనుఙ్ఞ గా భావించి తిరువనంతపురమునకు వెళ్ళిరి. అచట శ్రీ పద్మనాభ స్వామి కి మంగళాశాసనమును చేసిరి.
శ్రీ ఆళవందార్ సూక్తులు బట్టి అరయర్లు నంపెరుమాళ్ ,తిరుప్పాణాళ్వారులపై భక్తి ని కనబరిచిరి.
శ్రీ ఆళవందార్ చివరి రొజులలో వారు స్వయముగా లోకాన్తమున అరయార్లు కి నంపెరుమాళ్ ,తిరుప్పాణాళ్వారులపై భక్తిని గురించి బాహాటముగ అందరి సమక్షమున చెప్పిరి. ఇది అరయార్లు భక్తి భావములకు నిదర్శనము.
శ్రీ ఆళవందారుల తరువాత రామనుజులు శ్రీరంగం వచ్చుటకు అరయర్లు ప్రధాన కారణము అని చెప్పవచ్చును. శ్రీవైష్ణవులు అందరూ రామానుజులని కంచీపురం నుంచి శ్రీరంగంనకు స్థిరంగా రావాలని
కోరుకుంటూ నంపెరుమాళ్ళని వేడుకొంటిరి. పెరియ పెరుమాళ్ శ్రీ వరదరాజ స్వామికి రామానుజులని శ్రీరంగం పంపించమని వర్తమానమును పంపిరి. కాని అందుకు శ్రీ వరదరాజ స్వామి రామనుజులు తనకి చాల ప్రియమైన శిష్యుడు అని నిరాకరించిరి.అందుకు శ్రీ పెరియ పెరుమళ్, శ్రీ వరదరాజ స్వామికి సంగీతము చాల ప్రియము కావున ఈ పనిని అరయర్లకి అప్పగించిరి.
మన అరయర్లు వెంటనే కాంచీపురంనకు ప్రయాణమయ్యిరి.అక్కడ కాంచీపురంనకు చెరుకొగానే
వరమ్ తరుమ్ పెరుమాళ్ అరయర్ ( కంచీపురం అరయర్లు) వారికి స్వాగతం పలికి వారి తిరుమాళిగై (ఇల్లు) నకు తీసుకువెళ్ళిరి. అరయర్లు రాక తెలుసుకున్న తిరుకచ్చి నంబి గారు అచటకి వచ్చి వారి కుశలమును అడిగిరి. అరయర్లు నంబి గారిని పెరుమాళ్ దర్శనమునకు తెసుకువెళ్ళమనరి.(స్థానిక కైంకర్యపరులు తో అచటి అలయమును దర్శించుట ఉత్తమము. ) మన అరయర్లు శ్రీ వరదరాజ స్వామి ని దర్శంచి ఈ విధమున స్తొత్రము చేసిరి.“కదా పునస్ శంక రతాన్గ్ కల్పక ద్వజ అరవిన్ద అన్గుచ వజ్ర లాంచనమ్; త్రివిక్రమ త్వచ్చరణామ్భుజ ద్వయమ్ మదీయ మూర్ద్దానమ్ అలన్కరిశ్యతి”దాని అర్దము ఏమనగ “ఓహ్ త్రివిక్రమ! శంక రతాంగ కల్పక ద్వజ అరవిన్ద అన్గుచ వజ్ర లాంచనముల ముద్రలు కలిగిన నీ పాదములను నా శిరస్సు పై వుంచు తండ్రీ. మన అరయర్లుకు శఠారి తీర్థమును ఇచ్చిన తరువాత మన అరయర్లును పాడమనిరి.అరయర్లు ఎంతో మృదు మధురముగా అళువారుల శ్రీసూక్తులను పాడుతూ అభినయము చేసిరి.అది విన్న వరదరాజ స్వామి ఎంతో ఆనందించి మన అరయర్లును ఏమి కావలో కోరుకోమనగ అందుకు మన అరయర్లు నిరాకరించిరి.వరదరజస్వామి తనకి ఎదైనా ఇస్తాను అని మరల చెప్పగా,మన అరయర్లు తిరిగి “ఎది అడిగిన ఇస్తారు కదా ?” అని అడిగిరి. అందుకు వరదరాజస్వామి తనను తన దేవేరులును తప్పించి ఏమైన ఇస్తాను అని చెప్పిరి! వెనువెంటనే మన అరయర్లు రామనుజులిని చూపించి వారిని శ్రీరంగంనకు పంపమనిరి. అందుకు వరదరాజస్వామి నిరాకరించిరి వెంటనే మన అరయర్లు వరదరజస్వామిని చూసి “నువ్వు సాక్షాత్తు శ్రీ రామచంద్రుడివి ఇచ్చిన మాట తప్పరాదు అనిరి” వరదరజస్వామి అందుకు అంగీకరించి రామానుజులని త్యాగము చేసిరి(ఎందరో ఆచార్యులని వరదరజస్వామి సంప్రదాయమునకు త్యాగం చేసిరి అందుకనే కంచిని త్యాగ మండపము అనిరి.) రామానుజులు అందరికి నమస్కరించి వారి మఠం లో ఉన్న వరదరజస్వామి తిరువారాదన మూర్తులని తీసుకుని మన అరయర్లతో కూడి రామనుజులు శ్రీరంగంనకు వెడలిరి.రామానుజులిని శ్రీరంగంనకు తీసుకువచ్చుట లో కీలక పాత్ర మన అరయర్లు పొషించి సంప్రాదాయమునకు ఎంతో మేలు చేసిరి.
శ్రీ ఆళవందార్లు వారి అయిదు ప్రదాన శిశ్యులకి అయిదు ప్రదాన బాద్యతలను ఉడయవర్ విశయములొ అప్పగించిరి.పెరియ నంబి గారిని రామనుజులు కి పంచ సంస్కారములుని ప్రసాదించమనిరి.
పెరియ తిరుమలై నంబి గారు శ్రీ రామాయణమును రామనుజులు కి అనుగ్రహించమనిరి.
తిరుక్కోష్టియూర్ నంబి గారిని తిరుమంత్ర చరమ శ్లోక అర్ధములును రామనుజులు కి అనుగ్రహించమనిరి.
తిరుమాలై ఆణ్డాన్ గారిని తిరువాయ్ మొళిని రామనుజులు కి అనుగ్రహించమనిరి.
మన తిరువరన్గప్పెరుమాళ్ అరయరును ,శ్రీ ఆళవన్దార్లు, అరుళిచెయల్ అను గ్రంధము మరియు చరమోపాయము ( ఆచార్య నిష్టయే చరమోపాయము అని) రామనుజులకి అనుగ్రహించమనిరి.
తిరుమాలై ఆణ్డాన్ గారి దగ్గెర తిరువాయ్ మొళిని పరిపూర్ణంగా నేర్చిన తరువాత పెరియనంబి గారి ఆఙ్ఞ అనుసారము రామానుజులు మన అరయర్ల దగ్గర సంప్రదాయ రహస్యములును అభ్యసించిరి. అప్పుడు రామానుజులు శాస్త్ర నిర్ణయమును పాటిస్తూ ముందుగా ఆరు నెలలు అరయర్ గారికి కైంకర్యముని చెసిరి. రామానుజులు మన అరయర్లుకు ప్రతీ రొజూ వెచ్చటి పాలు కాచి,పసుపు అరగతీసి మన అరయర్లుకు అవసరమైనప్పుడు దానిని లేపనమ్ చేసిరి.
ఒక రోజున మన అరయర్లకై రామానుజులు పసుపు ను అరగతిసిరి. కానీ అది అరయర్లకి ఆనందమును ఇవ్వని కారణమున రామానుజులు మరి కొంచెం పసుపు ను అరగతిసిరి. అందుకు మన అరయర్లు సంతశించిరి. అప్పుడు మన అరయర్లు రామానుజులకి చరమోపాయము (అంతిమ లక్ష్యము) అనగా ఆచార్య కైంకర్యముగా ఏవిదముగా గుర్తించాలని ఉపదేశించిరి.”క్షీరాబ్ది యందు శయనించి యున్న భగవంతుడు ఆచార్యుని గా మన ముందు ఉన్నారు అని విశ్వసించాలని చెప్పిరి.”
మన అరయరుల ఘనతని చాటి చెప్పే కొన్ని ఐతిహ్యములును చుద్దాము.
- ఈడు వ్యాక్యానమున 1.5.11, వివరిస్తుండగ “పాలేయ్ తమిళర్ ఇశైకారర్” ఇందు ఇశైకారర్ అనిన సంగీత విద్వాంసుడు, నంపిళ్ళై గారు మన అరయర్లుని( తిరువరన్గప్పెరుమాళ్ అరయర్) ఇశైకారర్ అని ఆళ్వారులు ముందుగానే పాడిరి అని వ్యాఖ్యనించిరి.
- ఈడు వ్యాఖ్యానమున 3.3.1, వివరిస్తుండగా నంపిళై గారు మన అరయర్ల గొప్పతనమును వివరించిరి.ఒకసారి మన అరయర్లు “ఒళివిల్ కాలమెల్లామ్” అను ఆళ్వారులు పాశురమును గానము చేస్తు ఆ పాశురమును ఉన్న కాలమెల్లామ్ అనె పదము దగ్గర ఆగి “ తిరువేంకటముడయాన్ కాలమెల్లామ్ కాలమెల్లామ్” అంటు ఉండిపొయిరి. ఈ పాశురమున ఆళ్వారులు తమకి తిరువేంకటముడయాన్ కైంకర్యము ఎల్లప్పుడు (కాలమెల్లామ్) కోరిరి. ఈ పాశురముని ద్వయ మంత్రపు వివరణమున కైంకర్య ప్రార్దన గా చెప్పెదరు.
మనము తిరువరంగప్పెరుమాళ్ అరయర్ గారి పాదములకు దాసోహములు సమర్పించి వారికి కలిగిన ఆచార్య నిష్ట, భగవద్ భక్తి ని మనకును ప్రసాదించమని కొరుకుందాము.
తిరువరన్గప్పెరుమాళ్ అరయర్ గారి తనియ
శ్రీరామమిశ్ర పద పంకజ చంచరీకం శ్రీయామునార్య వర పుత్రం అహం గుణాఢ్యం |
శ్రీ రంగరాజ కరుణా పరిణామదత్తం శ్రీ భాష్యకార శరణం వరరంగమీడే||
శ్రీరామమిశ్రుల (శ్రీమణక్కాల్ నంబి) శ్రీపాదతామరలయందు తుమ్మెదవలె సంచరించే, , శ్రీరంగనాథుని కరుణచే జన్మించి, శ్రీయామునాచార్యుల సత్పుత్రులై, కల్యాణ గుణములను కలిగి శ్రీ రామానుజులకు ఆచార్యులైన తిరువరంగపెరుమాళ్ అరయర్ ను ఆశ్రయుస్తున్నాను.
ఆంగ్ల అనువాదము- సారథి రామానుజ దాస
తెలుగు అనువాదము- సురేష్ కౄష్ణ రమానుజ దాస.
Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu
Pingback: 2014 – June – Week 2 | kOyil
Pingback: తిరువరంగత్తు అముదనార్ | guruparamparai telugu
Pingback: కూర నారాయణ జీయర్ | guruparamparai telugu
Pingback: పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ | guruparamparai telugu