Author Archives: sri yathirajavalli sampradaya sabha

About sri yathirajavalli sampradaya sabha

JAI SRIMAN NARAYANA

మాఱనేఱి నంబి

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్ వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః

alavandhar-deivavariandan-maranerinambi

ఆళవందార్ (మద్యలో) దైవవారి ఆణ్డాన్ మరియు మాఱనేఱి నంబి – శ్రీ రామానుజుల సన్నిది, శ్రీ రంగము

తిరునక్షత్రము~: ఆని, ఆశ్లేష(ఆయిలము)

అవతార స్థలము~: పురాన్తకము (పాండ్యనాడులో చిన్న పట్టణము)

ఆచార్యులు~: శ్రీ ఆళవందార్

పరమపదించిన చోటు~: శ్రీ రంగం.

మాఱనేఱి నంబి గారు శ్రీఆళవందార్లకి ప్రియమైన శిష్యులలొ ఒకరు. వీరికి ఉన్న ఆచార్యనిష్ఠను చూసి మరియు ఆ పెరియపెరుమళ్ పై ఉన్న భక్తి కి శ్రీరంగమున అందరిచే చాలా గౌరవించబడేవారు.

వీరు నమ్మళ్వారుల(మారన్) వలె ఎప్పుడూ భగవత్ భక్తి లో ఉండుట చేత వీరిని మాఱనేఱి నంబి అని పిలిచేవారు.

వీరు ఎప్పుడు సదా వారి ఆచార్యుల అయిన ఆళవందారుల కాలక్షేపములును వింటూ సదా శ్రీరంగ ప్రాకారమున నివసిస్తూ ఉండేవారు.

మాఱనేఱి నంబి గారి అంత్యదశలో ఉన్నప్పుడు వారికి అత్యంత అప్తులైన పెరియనంబి గారిని పిలిచి వారి తిరుమేనిని(శరీరంను) వారి శరీరబందువులు అవైష్ణవులు అవ్వుట చేత వారికి ఇవ్వవద్దు అని చెప్పినారు. మాఱనేఱి నంబి గారు వారి శరీరము హవిస్సు లాంటిదని అది ఒక్క భగవానునికే చందవలిసినది అని దానిని ఇతరులు తాకరాదు అని భావించారు.మాఱనేఱి నంబి  గారు పరమపదించిన తరువాత పెరియనంబి గారు మాఱనేఱి నంబి గారికి అంత్యసంస్కారములను చేసినారు.మాఱనేఱి నంబి గారు చతుర్థవర్ణము చెందిన వారు కావడము వలన అక్కడ నివసించే వైష్ణవులు పెరియనంబి గారి చేసిన పనిని తప్పుబట్టేరు.ఈ విషయమును రామానుజులుకి చేప్పినారు అప్పుడు రామానుజులు పెరియనంబి గారి నోటి ద్వారా మాఱనేఱి నంబిగారి వైభవమును తెలియచెప్పాలని నిర్ణయించుకున్నారు.రామానుజులు పెరియనంబి గారిని పిలిచి మేము శాస్త్రము పై విశ్వాసమును పెంచుటకు ప్రయత్నము చేస్తుంటే మీరు ఇలా శాస్త్ర విరుద్దముగా చేయుచున్నారేమి అని అడిగిరి ?అప్పుడు పెరియనంబి గారు “భాగవతులకి కైంకర్యము చేయుటలో ఇంకొకరికి అప్పగించుట తగదు అని, మనమే దగ్గర ఉండి చేయాలని చెప్పుట చేత అలా చెసాను అని ” శ్రీరామచంద్రుడు జటాయుకి దగ్గర ఉండి తానే చరమ కైంకర్యమును చేసెను అని అందుచే తాను శ్రీరామచంద్రుడు కంటే గొప్పవాని కాను అని,మాఱనేఱి నంబి గారు జటాయు కంటే తక్కువ కాదు అని “ అందుచే ఈ కైంకర్యమును చేసినామని అని చెప్పినారు.పయిలుమ్ చుడరొళి (తిరువాయ్ మొళి 3.7) మరియు నెడుమాఱ్కడిమై (తిరువాయ్ మొళి 8.10) పదిగమున నమ్మాళ్వారుల భాగవత శేషత్వమును గూర్చి చెప్పినారు.అందుచే మనము అళ్వారుల హృదయ భావమును తేలుసుకొవాలని పెరియనంబి గారు చేప్పినారు. ఇది విన్న శ్రీరామానుజులు చాల సంతొషించి రామానుజులు, పెరియనంబి గారిని అభినందించారు. శ్రీరంగములో వున్న శ్రీవైష్ణవులు అందరూ సంతోషించారు. పిళ్ళైలోకాచార్య స్వామి వారి శ్రీవచనభూషణముకి భాష్యము వ్రాసిన మణవాళ మహామునులు 234 సూత్ర వ్యాఖ్యానము లో ఈ విషయమును వివరించారు.

మాఱనేఱి నంబిగారి వైభవమును తెలుపు కొన్ని వ్యాక్యానములును చుద్దాము.

తిరుప్పావై 29 – ఆయి జననాచార్యర్ వ్యాక్యానము:

ఈ పాశుర వ్యాఖ్యానమున పెరియనంబి గారికి రామానుజులుకి జరిగిన సంభాషణములును చెప్పబడినది.మాఱనేఱి నంబిగారు వారి చివరి దశలో చాలా శరీర బాదకి లోనవుతారు. అందుచే చివరి సమయమున భగవంతుని స్మరించలేదు అని అందుచే వారికి మోక్షము వస్తుందా ? అని పెరియనంబి గారు రామానుజులుని అడిగేరు .అప్పుడు రామానుజులు, వరహపెరుమాళ్ యొక్క చరమశ్లోకమును గుర్తు చేసి అయినని స్మరణ చేయుట చేతను మోక్షము ఇస్తాను అన్న వరాహపెరుమాళ్ చేప్పిన వ్యాక్యనములును గుర్తుచేసారు. దానికి పెరియనంబిగారు అంగీకరించక భుమిదేవి యొక్క సంతోషము కొసం వరాహస్వామి అలా చేప్పివుంటారు అని పెరియనంబి గారు రామానుజులుతో అన్నారు.రామానుజులు” తన తో ఎప్పుడు వున్న భుదేవి కి వరహస్వామి అలా సరదాకి చేప్పరు” అని అన్నారు. అయినా పెరియనంబి గారు అంగీకరించక ప్రమాణమును చూపమన్నారు.భగవద్గీత 4.10 – “జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవమ్ యో వేత్తి తత్వత~: త్యక్త్వా దేహమ్ పునర్ జన్మ నైతి మామేతి సోర్జున” శ్లొకమున పరమాత్మ తన గురించి,తన దివ్య జన్మను గురించి యతార్థముగా తేలుసుకున్న వారికి మరల జన్మ వుండదు అని ,వారు పరమపదమును చేరుతారు అని చెప్పగ పెరియనంబి గారు చలా సంతోషించారు

పెరియ తిరుమొళి 7.4 – పెరియవాచాన్ పిళ్ళై వ్యాక్యానము ఉపొత్ఘాతమున– (కణ్సోర వెన్కురుతి) అను పదిగమున తిరుమంగై ఆళ్వార్లు, “తిరుచ్చేరై అను దివ్యదశమున వేంచేసి వున్న సారనాథ పెరుమాళ్ కి శరణాగతి చేసిన శ్రీవైష్ణవుల భాగ్యమును కొనియాడేరు.” ఈ పాశుర వ్యాక్యానమున పెరియనంబి గారు మాఱనేఱి నంబి గారికి చేసిన చరమకైంకర్యమును ప్రస్తావించారు.

ముదల్ తిరువందాది 1 – నమ్పిళ్ళై వ్యాక్యానము –ఈ పాశురము వ్యాఖ్యానమున ఎవరొ ఒకసరి మాఱనేఱి నంబిగారిని “భగవంతుని సదా మరవక ఎప్పుడూ ఆయన స్మరణ చెయుట ఎట్లు?” దానికి మాఱనేఱి నంబిగారు అసలు భగవంతుని మరచుట యెట్లొ మీరు చెప్పండి అని అడిగారు అట.(మాఱనేఱి నంబి గారు సదా ఆ భగవంతుని ధ్యానములొ ఉండుట చేత ,వారు భగవంతుని మరుచుట జరగదు. )

శ్రీవచన భూషణము 324 – పిళ్ళై లోకాచార్యస్వామి అనుగ్రహితము–ఒక వర్ణములో పుట్టుట ద్వారా శ్రీవైష్ణవుల వైభవము ముడిపడదు అని ,ఆచరణా ప్రయమైన మారనేరి నంబి గారి వైభవము చెప్పడము అయినది. ఇక్కడ పెరియ నంబి గారు మాఱనేఱి నంబి గారికి చేసిన చరమ కైంకర్యమును వర్ణించారు.మనవాళమామునులు కుడా తమ యొక్క వ్యాక్యానములలోఈ చరమ కైంకర్యము యొక్క సారమును గురించి వర్ణించారు.

ఆచార్య హృదయము 85 – అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, తమ యొక్క అన్నగారైన (పిళ్ళై లోకాచార్యర్) బాటలోనే నడచి, మాఱనేరి నమ్బి యొక్క వైభవమును తమ యొక్క చూర్ణికలో ఈ వృత్తాంతమును వివరించిరి.

ఆ విదముగా , మనము మాఱనేరి నమ్బి గారి కొన్ని వైభవములను తెలుసుకుంటిమి.

మనము మాఱనేరి నమ్బిగారికి ఆళవందారులకు గల సంభందమును కలుగు విదముగా వారి యొక్క శ్రీ చరణములను ఆశ్రయించి.

గమనిక~: నంబిగారి తిరునక్షత్రము పెరియ తిరుముడి అడైవులో ఆడి – ఆయిలము అని ఉండినది కాని ఆని – ఆయిలము అని వారి యొక్క వాజి తిరునామములో చెప్పబడినది.

మాఱనేరి నమ్బిగారి తనియన్

యామునాచార్య సచ్చిష్యమ్ రంగస్థలనివాసినమ్
ఙ్ఞానభక్త్యాదిసమ్పన్నం మాఱనేరిగురుమ్ భజే

யாமுநாசார்ய ஸச்சிஷ்யம் ரங்கஸ்தலநிவாஸிநம்
ஜ்ஞாநபக்த்யாதிஜலதிம் மாறனேரிகுரும் பஜே

 

అంగ్ల అనువాదము- సారథి రామానుజ దాస

తెలుగు అనువాదము- సురేష్ కౄష్ణ రమానుజ దాస.

 

Source

Advertisements

తిరుక్కోష్ఠియూర్ నంబి

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్ వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః

 thirukoshtiyur-nambi

తిరునక్షత్రము~: వైశాఖ మాసము,రోహిణి

అవతార స్థలము~: తిరుక్కోష్ఠియూర్

ఆచార్యులు~: శ్రీ ఆళవన్దార్

శిష్యులు~: రామానుజులు (గ్రంథ కలక్షేప శిష్య)

పెరియళ్వార్లు వారి పెరియళ్వార్ తిరుమొళి 4.4 – నావ కారియమ్ పదిగమున తిరుక్కోష్ఠియూర్ ను అద్భుతముగా స్తుతించిరి.తిరుక్కురుగై పిరాన్ గా ఈ దివ్య దేశమున జన్మించి,తిరుక్కోష్ఠియూర్ నంబి గా ప్రఖ్యాతిగాంచి, . శ్రీ ఆళవన్దార్ల ప్రధాన శిష్యుల లో ఒకరైయారు. వీరిని గొష్ఠీపూర్ణులు,గొష్ఠీపూర్ల్సర్ అని కూడా వ్యవహరించెదరు.
శ్రీ ఆళవన్దార్లు వారి అయిదు ప్రధాన శిష్యులుకు సంప్రదాయములోని విభిన్న విషయములను ఎమ్పెరుమానర్లకు ఉపదేశించమని ఆజ్ఞా పించారు.వాటి లో తిరుక్కోష్టియూర్ నంబి గారికి రహస్య త్రయ అర్థములను -తిరుమంత్రము, ద్వయ మరియు చరమ స్లోక అర్థములును రామానుజులు వారికి అనుగ్రహించమన్నారు.

ఏ మాత్రము నిబంధనలు లేకుండా , ఆశ ఉన్న వారందరికి చరమ శ్లోక అర్థములను నిస్వార్థముగా పంచినందుకు తిరుక్కోష్ఠియూర్ నంబి గారు రామానుజులు ని ఎమ్పెరుమానార్ అనే తిరునామమును అనుగ్రహిస్తారు.తిరుక్కోష్ఠియూర్ నంబి గారు వారి ఆచార్యులు అయిన శ్రీ ఆళవందార్లు అనుగ్రహించిన తిరుమంత్ర, ద్వయ,చరమ శ్లోకముల దివ్య అర్థములు తో ఎమ్పెరుమాన్ ని ధ్యానము చేసుకుంటూ ఒంటరిగ ఉండేవారు.అందు చేత తిరుక్కోష్ఠియూర్ లో ఉన్న ప్రజలికి కుడా నంబి గారి గొప్పతనము తెలియదు.నంబి గారి గొప్పతనము ఎరిగిన రామానుజులు వారు, నంబి గారి దగ్గర చరమ శ్లోకము యొక్క నీఘుడమైన అర్థములను నేర్చుకునుటకు 18 సార్లు శ్రీ రంగము నుండి తిరుక్కోష్ఠియూర్ వెళ్ళారు. 18 వ సారికి నంబి గారు రామానుజులుకి చరమ శ్లొక యొక్క రహస్య అర్థములను తెలుపుటకు నిశ్చయించుకున్నారు.అర్హత లేని వారికి , కష్టపడి తెలుసుకోవలని అనుకోనివారికి ఈ అర్థములను ఉపదేశించరాదని  రామానుజలను వాగ్దానుము చేయమని కోరుతారు. శ్రీ రామానుజల అంగీకరించి , వాగ్దానము చేస్తారు.తిరుక్కోష్ఠియూర్ నంబి గారు పరమ గోప్యమైన చరమ శ్లోక అర్థమును రామానుజులుకి ఉపదేశిస్తారు.చరమ శ్లోకమ్ – గీతాచార్యుని “సర్వ ధర్మాన్ పరిత్యజ్య” శ్లోకమ్ (గీత – 18.66).ఈ శ్లోకమున, అత్యంత ముఖ్యమైన సిద్దాంతమును  ఏకమ్ అనే పదము ద్వారా ప్రతిపాదించబడినది- భగవనుడే మనకు ఏకైక ఉపాయము.మరి ఇంక ఏ సాధనములు అయిన  కర్మ, ఙ్యాన, భక్తి యోగములు, మనము చేసిన ప్రపత్తి కాని మనకి ఉపాయములు కావు.ఈ భావ గుహ్యమైన చరమ శ్లోకమును అందరికి అందించిన ఇతరులు వారి కర్మలును మానివేసే ప్రమాదమున్నందున రామానుజులు వరుకు వచ్చిన ఆచార్యులు ఈ విషయమును చాలా గోప్యము గా ఉంచినారు.రామానుజులు నంబి గారి దగ్గర నేర్చుకున్న వెంటనే చరమ శ్లొక అర్థమును తెలుసుకోవలన్నా ఆశ ఉన్న వారందరికి ఉపదేశం చేసారు. అది తెలుసుకున్న వెంటనే నంబి గారు రామానుజులు ని పిలిపిస్తారు.రామానుజులు నంబి గారి తిరుమాళిగై చేరుతారు.రామానుజులు తో జరిగిన విషయము గురించి విచారిస్తారు, వారి అజ్ఞాను ఉల్లంఘించినారని రామానుజులు ఒప్పుకుంటారు. ఎందుకు అలా చేసారు అని అడుగగా  “నేను మీ అజ్ఞాని ఉల్లంఘించినందున నాకు నరకము కలిగినప్పటికి విన్న వారు అందరు మొక్షము పొంది, ఉజ్జివించేదరు” అని చెప్తారు.ఇతరులకు నిజమైన ఆధ్యాత్మిక ఙ్ఞానమును ఇవ్వాలనే రామానుజులు వారి యొక్క పెద్ద మనస్సును చూసి నంబి సంతసించి, వారికి “ఎంబెరుమానార్”  అని పిలిచారు.ఎమ్పెరుమాన్ అనగా నా స్వామి(భగవానుడు), ఎమ్పెరుమానార్ అనగా భగవంతుని కన్నా ఎక్కువ కారుణ్యము కల వారు.ఈ విధముగా రామానుజులు చరమ శ్లోకము యొక్క నిఘూఢమైన అర్ధములను చాటి ఎంబెరుమానార్ గా మారారు. ఈ చరిత్రము మనకు ముముక్షుప్పడి వ్యాఖ్యాన అవతారికన (పరిచయము) మణవాళ మామునులు గారి చేత చరమ శ్లోక ప్రకరణమున అతి స్పష్టంగ ,సుందరంగా వివరించబడినది , గమనిక ~:6000 పడి గురు పరమపరా ప్రభావమ్ అందు శ్రీ రామానుజులు తిరుక్కోష్టియూర్ నంబి గారి వద్ద తిరుమంత్ర అర్థమును తెలుసుకుని తరువాత అందరికి చాటి, ఎమ్బెరుమానార్ అని నంబి గారి చేత తిరునామము గ్రహించి , అటు పిమ్మట చరమ శ్లోక అర్థములను తెలుసుకున్నారని చెప్పబడినది.కాని మణవాళ మామునులు ,రామానుజులు చరమ శ్లోక అర్థమును వ్యక్త పరిచారని స్పష్టంగ తెలిపినందువల్లను, మరియు వ్యాఖ్యానములో అనేక చోట్ల “ఏకమ్” అను పదము యొక్క అర్థము అత్యంత రహస్యమైనదని చెప్పునందు వల్ల ,ఇదే  ప్రమాణమని(ఆచార్యులు చెప్పిన ప్రకారముగా) తీసుకుంటిమి.

తిరుక్కోష్ఠియూర్ నంబి గారి వైభవమును అనేక చోట్ల వ్యాఖ్యానముల లో చెప్పబడినది.

 • నాచ్చియార్ తిరుమొళి 12.2 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానమ్,
  • ఇందు ఆండాళ్ ని తిరుక్కోష్ఠియూర్ నంబి గారి తో పోల్చడం జరిగింది. ఎందుకు అనగా నంబి గారు కూడా వారి భగవద్గుణ అనుభవమును ఎవరికీ తెలియజేయలేదు. మన ఆండాళ్ కుడా తనకి కలిగిన భగవత్ విరహమును ఎవరికి చెప్పుటకు ఇష్టపడలేదు.
  • తిరుక్కోష్ఠియూర్ లో ఉన్న ప్రజలి కూడా నంబి గారి గొప్పతనము తెలియదు. రామానుజులు తిరుక్కోష్ఠియూర్ చేరుకోగానే అక్కడ వున్న వారిని   తిరుక్కురుగై పిరాన్ ( నమ్మళ్వార్ పేరు మీదు గా నంబి గారి నిజ నామధేయము)గారి ఇంటి దారి చెప్పమన్నారు. చూపిన వెంటనే ఆ ఇంటి దిక్కుకి సాష్టంగ నమస్కారమును చేసారు. సాక్షాత్ యతిరాజులు వీరికి నమస్కారము చేయుట చూసి అక్కడ ఉన్న స్థానికులు నంబి గారి విలువను తెలుసుకున్నారు.
  • ముదలియాణ్డాన్ మరియు కూరత్తాళ్వానులు శ్రీ నంబి గారి వద్ద 6 నేలలు పాటు వుండి సంప్రదాయ రహస్యాలను తెలుసుకున్నారు.
 • తిరువిరుత్తమ్ 10 – నంపిళ్ళై స్వాపదేశము~: నంబి గారు శ్రీరంగమునకు వచ్చిన ప్రతిసారి రామానుజులు మరచ్చిపురం అనే ఊరు వరుకు సాగనంపేవారు. అలా ఒక సారి రామానుజులు నంబి గారితో “ధ్యానము చేసుకోనుటకు యోగ్యమైన ఒక సంఘటనను చెప్పండి” అని అడుగగా అందుకు నంబి గారు వెంటనే “మా ఆచార్యులు అయిన యామునాచార్యులు స్నానము కై నదిలో మునిగినప్పుడు వారి వీపు భాగము కుర్మాసనము వలే”కనిపించేదని ,వారు లేకపొయినా తాను అదే ఎప్పుడూ ధ్యానము చేస్తానని, రామానుజులుని కుడా అదె ధ్యానము చేయమన్నారు. దీని వలన మనకు తెలిసినది ఏమనగా శిష్యుడు ఆచార్యుని ఉపదేశములకు మరియు జ్ఞాననమునకు ఎంతటి ప్రాముఖ్యత ఇస్తాడో , వారి దివ్య తిరుమేని కూడా ఇవ్వవలెనని తెలుస్తునది.
 • తిరువిరుత్తమ్ 99 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానమ్ ~:ఆళ్వార్, వారు జ్ఞానపిరానుల నే ఉపాయము గా స్వీకరించుదురని అని చెప్పారు.ఈ విషయము ద్వారా చరమ శ్లోకము యందు ఏకం పదము యొక్క అర్థము – మిగిలిన ఉపాయములు తొలగించి భగవంతుడు ఒక్కడే ఉపాయము అనుటకు వివరణనిస్తునది. ఇది సంప్రదాయమునందు చాలా రహస్యమైన అర్థము, దీనినే నంబి గారు రామానుజులకు ఉపదేశించినారు.ఒకసారి, శ్రీ రంగమునకు ఉత్సవము సేవించుటకు వచ్చినప్పుడు, నంబి గారు రామానుజులుని శ్రీ రంగము కోవెల  లో   జనసంచరము లేని ప్రదేశమునకు తీసుకువచ్చి ఏకమ్ అనే పద వివరణ చేయ సాగారు .నంబిగారు చెప్పనారంబించినప్పుడు ఆ మూలన నిద్రపోతున్న ఒక కైంకర్యపరుడిని చూసి వారు చెప్పడం ఆపివేసారు.వెంటనే ఇక్కడ ఎవరో ఉన్నారని అర్థమును చెప్పరు.తరువాత నంబి గారు రామానుజులు అర్థ విశేషములను తెలిపి , ఈ అర్థములను అర్హత ఉన్న వారికే అనుగ్రహించ వలెనని చెప్తారు. మండుట యెండను లెక్క చేయక  తెలిసిన అర్థములు తెలిసినట్టుగా వెంటనే కురత్తాళ్వాన్ యెడకి వెళ్ళి  ఏ ప్రతిఫల ఆపేక్ష లేకుండా  ఉపదేశిస్తారు,ఈ విధంగా, అర్థములను తెలుసుకునుటకు ఆళ్వాన్ ఎటువంటి శ్రమను చేయకున్నను, ఎమ్పెరుమానార్ ఆళ్వాన్ తో అర్థ విశేషములను పంచుకుని  సహకారి నైరపేక్ష్యమ్ ని (మనము చేసిన ఉపకారమునకు ప్రతి స్పందన ఆశించకుండా)  ఇక్కడ చాటి చెప్తున్నారు.
 • తిరువిరుత్తమ్ 95 – (యాతానుమ్ ఓర్ ఆక్కయిల్ పుక్కు పాశురమ్) నంబి గారికి ఈ పాశురమ్ చాలా ఇష్టమైనదని వారి శిష్యులలో ఒకరు నంజీయరు గారికి తెలుపుతారని ఈ వ్యాఖ్యానము యందు చెప్తారు .జీవాత్మ నిరంతరము లౌకిక విషయములలో మునిగి తేలుతున్నను ఎమ్పెరుమాన్ జీవాత్మ పై చూపించే నిర్హేతుక కృపను ఈ పాశురమున చెప్పబడినది.
 • తిరువాయిమొళి 1.10.6 – నమ్పిళ్ళై వ్యాఖ్యానమ్ –ఆళ్వారులు వారికి కలిగిన భగవద్ అనుభవమును వారి మనస్సుతో చెప్పుకునేవారు . ఈ విషయమును వివరించుటకు,నమ్పిళ్ళై గారు నంబి గారి ఉదాహరణ ఇస్తు చేస్తారు. ఎమ్పెరుమాన్ విషయము చాల గొప్పది, దానిని అందరు అర్థము చేసుకోలేరు.అందుకే నంబి గారు ఒంటరిగా భగవద్ అనుభవములో ఉంటారు , అదే విధంగా ఆళ్వారులు వారి మనస్సుతో చెప్పుకునేవారు
 • తిరువాయిమొళి 8.8.2 — రామానుజులు ప్రసంగిస్తున్నప్పుడు జీవత్మ సహజ స్వరూపమును గూర్చి ప్రశ్న తలెత్తుంది “ఙ్ఞాతృత్వమా లేక శేషత్వమా (పరమాత్మ కి శేషుడా)”? అని, అప్పుడు రామానుజులు కూరత్తాళ్వాన్ ని తిరుకోష్ట్టియూర్ నంబి గారి దగ్గర తెలుసుకునుటకు పంపించారు. కూరత్తాళ్వాన్ నంబి గారి కి ఆరు నేలలు శుశ్రుష చేస్తారు.నంబి వారు వచ్చిన కారణము అడుగుతారు.రామానుజులు కి కలిగిన ప్రశ్న గురించి వారికి విన్నవిస్తారు కూరత్తాళ్వాన్. వెంటనే నంబి గారు మన ఆళ్వారులు వారి ప్రబంధమ్ లో “అడియేన్ ఉళ్ళాన్” అనగా జీవత్మ దాసుడు అని చెప్పారు. మరి వేదాంతము జీవుడు ఙ్ఞానం కలిగిన వాడని ఎందుకు చెప్తుంది అని అడుగగా.ఇక్కడ ఙ్ఞాతృత్వము ఏమనగా పరమాత్మ కి జీవుడు దాసభూతుడనే ఙ్ఞానం కలిగి ఉండుట.” ఆళ్వారులు మరియు నంబి గారు వివరించినట్టుగా ఎమ్పెరుమాన్ కి శేషుడనే ఙ్ఞానం కలిగిన వాడే జీవాత్మ.

తిరుకోష్ఠియూర్ నంబిగారు ఎంబెరుమానారుల వైభవమును స్థాపించుట చరమోపాయ నిర్ణయము అను గ్రంథము లోను చూపబడినది.ఈ క్రింది లింకున పొందుపర్చడమైనది.

http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujars-acharyas.html

తిరుమాలై ఆండాన్ రామానుజులుకి తిరువాయిమొళి కాలక్షేపమును అనుగ్రహించు సమయమున వారి ఇరువురికి కలిగిన చిన్న విభేధము కారణమున కాలక్షేపము అగిపోయినది.అప్పుడు నంబి గారు అండాన్ తో రామానుజులు అవతార పురుషులు , ఙ్ఞానులని అని తెలియజేసి కాలక్షేపము కొనసాగేల చేసిరి.
ఒక సారి రామానుజులు కు గిట్టని వారు వారికి భిక్ష లో విషమును కలిపిరి.ఈ విషయమును తెలుసుకున్న రామానుజులు ఆహరము మాని ఉపవసించారు. ఈ విషయమును తెలుసుకున్న నంబి గారు శ్రీరంగమునకు బయలుదేరిరి.నంబి గారిని స్వాగతించుటకు రామానుజులు ఎదురువెళ్ళి మండుటెండలో సాష్టాంగ ప్రణామము చేసిరి. నంబి గారు రామానుజులుని లేవమని అనక అలానే చూసిరి. అప్పుడు రామానుజులు శిష్యుడు అయిన కిడామ్బి ఆచ్చాన్ అను వారు రామానుజులుని పైకి లేపి నంబిగారిని సవాల్చేస్తారు. అప్పుడు నంబి గారు రామానుజుల తిరుమేని పై ఎవరికి అభిమానము ఉన్నదని తెలుసుకునుటకు ఆ విధంగా ప్రవర్తించానని చెప్పి, కిడామ్బి ఆచ్చాన్ను ఎమ్పెరుమానార్ కు రోజు ప్రసాదమును చేయమనిరి.ఈ విషయము ద్వారా నంబి గారికి రామానుజులు అంటే చాలా ప్రీతి అని , వారి బాగు కోరే వారని తెలుస్తుంది.

ఇలా తిరుకోష్ఠియూర్ నంబిగారు వైభవమును తెలుసుకున్నాము శ్రీ రామానుజులుకి ఎంబెరుమానార్ అనే తిరునామము వచ్చుటకు కారణమై,అదే పేరు మీదుగా నంపెరుమాళ్ ద్వారా మన సంప్రదాయమునుకు ఎంబెరుమానార్ దర్సనం అని పేరు వచ్చుటకు దోహదపడ్డారు.ఈ విషయమును మణవాళమామునులు వారి “ఉపదేశ రత్నమాల” అను గ్రంథమున చెప్పిరి.
యామునాచార్యులు, రామానుజులు పై అపారమైన ప్రేమ కలిగి వున్న తిరుకోష్ఠియూర్ నంబిగారి శ్రీపాదములుకు మనం అందరమూ సాష్ఠాంగ ప్రణామములను అర్పిద్దాము.

తిరుక్కోష్ఠియూర్ నమ్బి తనియన్:

శ్రీవల్లభ పదామ్భోజ దీభక్త్యామ్రుత సాగరమ్ |
శ్రీమద్గోష్ఠీపురీపూర్ణమ్ దేసికేంద్రమ్ భజామహే ||

తెలుగు అనువాదము~: సురేశ్ కృష్ణ రామానుజ దాస

source

పెరియ తిరుమలై నంబి

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్ వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః

periya-thirumalai-nambi

తిరునక్షత్రము: వైశాఖ మాసము,స్వాతి

అవతార స్థలము: తిరువేంకటము

ఆచార్యులు: శ్రీ ఆళవన్దార్

శిష్యులు: రామానుజులు (గ్రంథ కాలక్షేప శిష్య) ,మలైకునియ నిన్ఱ పెరుమాళ్, పిళ్ళై తిరుక్కులముడైయార్, భట్టారియరిల్ శఠగోపదాసులు.

శ్రీ తిరుమల నంబి గారు శ్రీ వేంకటనాథుని కృప తో తిరుమలలో జన్మించారు. వీరు శ్రీ ఆళవన్దార్ శిష్యులలో ప్రధానులు. వీరికి ఆ వేంకటనాథుని పైన ఉన్న ప్రేమ చేత ఆ భగవంతుడే వీరిని “పితామహ” అని పిలిచి బిరుదు ఇచ్చినారు.

 శ్రీ ఆళవన్దార్లు వారి అయిదు ప్రధాన శిష్యులుకు అయిదు ప్రధాన బాధ్యతలను ఉడయవర్ విషయము లో అప్పగించిరి.తిరుమల నంబి గారిని మన సాంప్రదాయములో శరణగాతి శాస్త్రమైన రామాయణమును రామానుజులు కి అనుగ్రహించమనిరి.

భగవత్ రామానుజులు కి వీరు స్వయముగా మేనమామ అవుతారు. వీరు రామానుజులు కి “ఇళయాళ్వార్” అని నామకరణమును చేసిరి. వీరు తిరుమలలో నిత్య కైంకర్యపరులు.తిరువేంకటనాథునికి నిత్యము ఆకాశ గంగ తీర్థమును తెచ్చేవారు.

భగవత్ రామానుజులు వారి పిన్ని కొడుకు అయిన గోవిందుడుని మరల శ్రీ వైష్ణవ సంప్రదాయము లోకి తీసుకు రావలనే ఆకాంక్షతో (గోవిందుడు తాను కాశీ యత్ర లూ ” ఉళ్ళన్గై కొణర్న్త నాయనార్ ” గ పిలువబడి శ్రీ కాళహస్తి లో దేవతాన్తరమును పూజిస్తు వుండి పోయారు). వారి వద్దకు వెళ్ళి వారిని మార్చే బాధ్యతను తీసుకోవలసిందని తిరుమల నంబి గారికి ఒక శ్రీ వైష్ణవుడి ద్వారా విన్నవిన్చినారు.

గోవింద్ పెరుమాళ్ ని చూడడానికి తిరుమల నంబి గారు వారి శిష్యులు మరియు శ్రీ వైష్ణవుల(వారు మరల శ్రీ రంగమ్ చేరి ఎమ్పెరుమానార్ల్ తో జరిగిన సంఘటన తెలియజెస్తారు ) తో కలిసి శ్రీ కాళహస్తి కి వేంటనే తరలి పోతారు, గోవిందుడు ప్రతిరోజు వెళ్ళే దారి లో ఉన్న చెట్టు నీడన కుర్చున్నారు నంబి గారు.గోవిందుడు అక్కడి శివ భక్తునిల విభుతి రేఖల తో రుద్రాక్ష మాల తో శరీరమంతా మూడు నామముల తో రుద్రుడిని స్తుతిస్తూ అక్కడికి వచ్చేరు. నంబి గారు వెంటనే ఎమ్పెరుమాన్ ని స్తుతించారు, గోవింద్ పెరుమాళ్ వారిని ఆశక్తి తో చూస్తూ ఉండిపోయారు . కొన్ని రోజులు తరువాత , శ్రీ తిరుమల నంబి గారు,అదే స్థలమునకు, అదే సమయములో వచ్చి శ్రీ ఆళవందారుల స్తొత్రరత్నము లోని 11 వ శ్లోకమును(ఎమ్పెరుమాన్  యొక్క స్వాభావికమైన పరతత్వము , ఇతర దేవతల పరాధీనత్వము తెలుపునది) ఒక తాటిపత్రము పై వ్రాసి అక్కడ జార విడుస్తారు.వస్తున్న దారి లో, ఆ పత్రమును కనిపించగా తీసి, చదివి మరల దానిని క్రింద పార వేస్తారు గోవింద్ పెరుమాళ్. తన తిరిగి ప్రయాణములో,ఆ పత్రమును వెతికి పట్టుకుంటారు.దాని అర్థమును నెమరువేసుకుంటు,నమ్బి గారి వద్దకు చేరి ఆ పత్రము తనదా అని అడిగిరి.ఇరువురి మధ్య సంభాషణము మొదలయి, గోవింద్ పెరుమాళ్ కు శ్రీ మన్నారయణుని పరత్వము పై గల అన్ని సందేహములును తీర్చిరి నంబి. నంబి గారు చెప్పిన సమాధానములుకు కొంతవరకు సంతుష్టి చెంది గోవిందుడు పయనమవుతారు.తరువాత గోవిందుడు రుద్రునికి పూజ చేయుటకు పూవ్వులును కోస్తూ వున్నప్పుడు, శ్రీమన్నారాయణుని పరత్వమును చెప్పు పదిగమైన ” తిణ్ణన్ వీడు (తిరువాయ్ మొళి 2.2)” ను నంబి గారు ఉపన్యాసము చేస్తారు. ఆ పదిగమ్ లోని నాలుగవ పాశురములో నమ్మాళ్వార్ స్తాపించిన అర్థమును మిక్కిలి అందముగా ప్రసంగిస్తు,పూవ్వులు మరియు ప్రార్ధనలు ఎమ్పెరుమాన్ కు మాత్రమే తగును అని అనుగ్రహించారు.ఈ అర్థములను విన్న గోవిందుడు వెంటనే చెట్టు దిగి శ్రీ నంబి గారి పదములు పైన పడి, ఆర్తి తో కంట్ నీరు తో, తాను ఇన్ని రోజులు మాయచే కప్పబడి వున్నానని తనని ఉద్దరించమని సాష్టాంగ నమస్కారము చేసారు .నంబి వారిని ఓదార్చి స్వీకరించిరి.గోవిందుడు కళహస్తి తో తనకు ఉన్న బంధుత్వమును వదులుకొని , ధనాగరము తాళము చెవులను అక్కడ వున్న రుద్ర భక్తులుకి అప్పగించారు.వారికి మునపటి రాత్రి స్వప్నమున రుద్రుడు సాక్షాత్కరించి రామానుజులు ఈ భుమి పై నిజమైన జ్ఞానమును అందరికి ఇచ్చుటకు వచ్చారు అని అందు చే గోవిందు వారి పట్ల అనుబంధమును వదిలివేసుకుంటునప్పుడు అడ్డు చెప్పవద్దని చెప్పారని స్వప్న వృత్తాంతమును చెప్పినారు.వారందరు సంతోషముగా గోవిందుడుని పంపిస్తారు.

తిరుమలై తిరిగి వచ్చిన తరువాత నంబి గారు గోవిందునికి ఉపనయన సంస్కారదులు,పంచసంస్కారాలు చేసి ఆళ్వారుల ప్రభందములును నేర్పిరి.

భగవత్ రామానుజులు తిరుమలకి వేంచేసినప్పుడు శ్రీ తిరుమల నంబి గారు స్వాగతించుటకు తిరుమల కొండ స్వాగత ద్వారము కడకి వచ్చిరి.రామానుజులు ” ఈ దాసుడు ని స్వాగతించుటకు మీరు రావలా ? ఇంక ఎవరినైన చిన్న వారిని పంపించ కూడాదా” అన్న రామానుజుల మాటలకు నంబి గారు యెంతో వినమ్రత తో తాను బాగా వేతికి చూస్తే తనకంటే చిన్నవారు తన లేరు అని పలికారు. రామానుజులు శ్రీవేంకటనాథునికి మంగళాశసనము చేసి కొండ దిగారు.

ptm-ramayana-goshti

periya thirumalai nambi’s srI rAmAyaNa kAlakshEpa gOshti

శ్రీ రామానుజులు నంబి గారి దగ్గర శ్రీరామాయణమును నేర్చుటకు తిరుపతి వచ్చి అక్కడనే ఒక సంవత్సర కాలము ఉన్నారు. నంబి గారు శ్రీరామాయణమును అంతా వివరించిన తరువాత ,శ్రీ రామానుజులు ని వారి దగ్గర నుంచి ఏమైన స్వీకరించమని అడిగారు. దానికి శ్రీ రామానుజులు
గోవిందుని తనతో పంపమని అడిగిరి. నంబి గారు సంతోషముగా పంపించినారు. కాని గోవిందుడు వారి ఆచార్యులుని విడిచి వుండలేక తిరిగి నమ్బి గారి యెడకి వచ్చినాడు.అప్పుడు నమ్బి గారు గోవిందునితో మాటలాడక ఇప్పుడు గోవిందుడు శ్రీ రామానుజులుకి చెందిన వాడని,వెళ్ళిపోవలెనని చెప్పారు. ఈ వృత్తాంతమును ఈ క్రింది వెబ్ లింకున పొందుపర్చబడినది.
http://ponnadi.blogspot.com/2013/01/embars-acharya-nishtai.html

అటు తరువాత గోవిందుడు సన్యాస ఆశ్రమును స్వీకరించి ఎంబార్ అని పేరు గాంచిరి.

నంబి వైభావము మరియు వారి వివరణములు వ్యాఖ్యానములో చాలా చోట్ల ప్రసంగించబడ్డాయి , వాటిలో కొన్నింటిని ఇక్కడ చూద్దాం

 • తిరుప్పావై.14 తిరుప్పావై అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ – నంబి గారు తిరుప్పావై నందు “చెన్గల్ పొడిక్కూఱై వెణ్పల్ తవత్తవర్” అను దానికి ఈ విధముగా చెప్పినారు. గోపికలును నిదుర లేపుతున్న సమయమున కాషాయ బట్టలును ధరించి తెల్లని దన్తకాంతి కలవారై ఉన్న సన్యాసులు ఆలయమునుకు పోవుచున్న దాన్ని బట్టి అక్కడ చాలా పవిత్రమైన వాతావరణము నెలకొల్పబడిన విషయమును చెప్పినారు.
 • నాచ్చియార్ తిరుమొళి 10.8 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానమ్ -పాశురమ్ (మళైయే మళైయే) దాని తరువాత వచ్చు పాశురం అయిన (కడలే కడలే) అనునది నంబి గారికి చాల ప్రియమైనవి.ఈ పాశురం న ఆండాళ్ తాను అనుభవిస్తున్న భగవద్ విరహాన్ని మేఘము ద్వార తిరువేంకటముడైయాన్ కి తన వర్తమానమును పంపినది.ప్రతిసారి ఈ పాశుర విన్నపమున నంబి గారు తథాత్మ్యత ని చెందేవారు. ఈ కారణమున మన పుర్వాచర్యులు అందరికి ఇవి చాలా ప్రియమైనవి.
 • తిరువిరుత్తమ్ 3 – నమ్పిళ్ళై వ్యాఖ్యానమున-ఆళ్వార్లు వారికి కలిగిన భగవద్ అనుభవము మానసిక సాక్షాత్కరముగా ఉండిపోతుందా లేకుంటే బాహ్య సాక్షాత్కరము కలిగి, అనుభవము కలుగున అని వాపోతున్న మనస్సును -తిరుమల నంబి గారు అవిష్కరించారని పిళ్ళై తిరునరైయూర్ వివరించారు.
 • .తిరువాసిరియమ్ 1 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానమ్– ఆళ్వారులు పెరుమాళ్ యొక్క సౌందర్యమును “పచ్చని దుప్పటి పర్చిన కొండ వలే తాను పడుకుని ఉన్నాడు. ” అని వర్ణించారు. వారు “తూన్గువతు”(పడుకునివున్నాడు) అనే సాధారణ పదప్రయోగమును చేయక “కణ్వళర్వతు”(శయనించివున్నాడు) అనే చక్కటి పదప్రయోగము చేసి వారి పదప్రయోగ విన్యాసము తెలియపరిచారు. ఎమ్పెరుమానర్ తో ఒకరిని పోల్చె సమయములో ” బంగారపు కుండలాలును ఇచ్చిన పెట్టుకోలేని వారు” అని నంబి సంభోదిస్తారు. ఇక్కడ నంబి ఎవరు ఎంత మంచి మాటలు చెప్పిన వినని వారి గురించి చెప్తున్నారు.చాలా సుతిమెత్తని మాటల తో వారు యెత్తిచూపిన విధానము బట్టి శ్రీవైష్ణవులు ఆవలి వారి లో దోషములును తప్పక చెప్పవలిసి వస్తే ఇలా అందముగా చెప్పాలి అని నిరూపించారు.
 • తిరువాయ్మొళి 1.4.8 – నమ్పిళ్ళై వ్యాఖ్యానమున—– ఆళ్వార్లు యొక్క భగవద్ విరహమును (నాయికా భావమున) ఒక పక్షికి చెప్పుతారు (తన స్థితిని పెరుమాళ్ కి విన్న వించమంటారు) ఇంక తన శరీరమున శక్తి మరియు అందము పోయి, ఆయన విరహమున తాను సుష్కించిపోయాను అని చెప్పమనిరి.అందుచేత ఆళ్వార్లు ఆ పక్షి యొక్క ఆహార విషయము తననె వెత్తుకోవలెనని, తాను ఏమీ సహాయము చేయలేకపోతున్నానని విలపించిరి. నంపిళ్ళై గారు, తిరుమలనంబి గారి జీవిత విషయమును గుర్తుతెచ్చుకుంటు, తిరుమలనంబి గారు చరమ దశ లో వారి నిత్య తిరువారాధన పెరుమళ్ అయిన వెణ్ణైక్కాడుమ్ పిళ్ళై (వెన్న కోసమ్ నాట్యమ్ చేసే కృష్ణుడు) తో ఇంకా వారికి ఒపిక లేనందున పెరుమాళ్ని వేరు ఎవరినైన ఆరాధన చేయుట కొరుకు వెత్తుక్కోమని చెప్పినట్టు విన్న వించారు.

తిరుమలనంబి గారు ఎమ్పెరుమానర్ల గుణగణములను కీర్తించిన విధానము
చరమోపాయ నిర్ణయమ్ అను గ్రంథము లోను చెప్పబడినది.ఈ క్రింది లింకున పొందబర్చినది.

http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujars-acharyas.html

ఈ విధముగా , తిరుమల నంబిగారి గొప్పతనమును తెలుసుకున్నాము.

యామునాచార్యులు, రామానుజులు మిక్కిలి ప్రేమ వున్న తిరుమలనంబి గారి శ్రీపాదములుకు మనం అందరమూ సాష్ఠాంగ ప్రణామములు అర్పిద్దాము.

గమనిక~: వీరి తిరునక్షత్రము 6000పడి గురు పరంపరా ప్రభావమున మరియు తిరుముడి అడైవు అనుసరించి చైత్రమాసము స్వాతి నక్షత్రము గా పెర్కొనబడినది. కాని వాళి తిరునామమున వైశాఖ మాసము స్వాతి నక్షత్రము గా చెప్పబడినది , ఆరోజే జరుపుకుంటున్నాము.

పెరియ తిరుమలై నంబి తనియన్:
పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేచపలప్రదాయ
శ్రీభాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమ: స్తాత్

source

అడియెన్
సురేశ్ కృష్ణ్ రామనుజ దాస

తిరువరంగప్పెరుమాళ్ అరయర్

 

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః

thiruvarangaperumal-arayar

తిరువరంగప్పెరుమాళ్ అరయర్ శ్రీరంగం

తిరునక్షత్రము~: వైకాశి, కేట్టై

అవతార స్తలము~: శ్రీ రంగము

ఆచార్యులు~: మణక్కాల్ నమ్బి, ఆళవన్దార్

శిష్యులు~: ఎమ్పెరుమానార్ (గ్రంథ కాలక్షేప శిష్యులు)

పరమపదించిన చోటు ~: శ్రీరంగము

తిరువరంగప్పెరుమాళ్ అరయర్, వీరు శ్రీ అళవందార్లకు తొలి సంతానము. ప్రథమ శిష్యులు.
అరయర్లు ఆళ్వార్ల ప్రభందాలకు చక్కటి అభినయము చేస్తు శ్రావ్యముగా పాడగల నైపుణ్యము కలవారు.

ఎప్పటిలాగానే శ్రీరంగంన అధ్యయన ఉత్సవములు జరుగుచుండగ తిరువరంగ పెరుమాళ్ అరయర్ (అరయర్ అనగా శ్రీరంగంన పెరుమాళ్ళకి అళ్వార్ పాశురములును శ్రుతి లయ భద్దముగ పాడుతూ అభినయము చేశేవారు).నమ్మాళ్వారుల తిరువాయ్ మొళి (10.2) లో ఉన్న తిరువనంతపురమున పద్మనాభ స్వామి పై పాశురమును పాడిరి. “నడమినో నమర్గళుళ్ళీర్ నాముమక్కు అఱియచ్ చొన్నోమ్” ఓ భక్తులరా మనం అందరము తిరువనంతపురమునకు నడిచి పోదాము అనే అర్దము వచ్చే పాశురమును అరయర్ పాడిరి.
ఇది విన్న శ్రీ ఆళవందార్లు పరవశించి అది పెరుమాళ్ళ అనుఙ్ఞ గా భావించి తిరువనంతపురమునకు వెళ్ళిరి. అచట శ్రీ పద్మనాభ స్వామి కి మంగళాశాసనమును చేసిరి.

శ్రీ ఆళవందార్ సూక్తులు బట్టి అరయర్లు నంపెరుమాళ్ ,తిరుప్పాణాళ్వారులపై భక్తి ని కనబరిచిరి.
శ్రీ ఆళవందార్ చివరి రొజులలో వారు స్వయముగా లోకాన్తమున అరయార్లు కి నంపెరుమాళ్ ,తిరుప్పాణాళ్వారులపై భక్తిని గురించి బాహాటముగ అందరి సమక్షమున చెప్పిరి. ఇది అరయార్లు భక్తి భావములకు నిదర్శనము.

శ్రీ ఆళవందారుల తరువాత రామనుజులు శ్రీరంగం వచ్చుటకు అరయర్లు ప్రధాన కారణము అని చెప్పవచ్చును. శ్రీవైష్ణవులు అందరూ రామానుజులని కంచీపురం నుంచి శ్రీరంగంనకు స్థిరంగా రావాలని
కోరుకుంటూ నంపెరుమాళ్ళని వేడుకొంటిరి. పెరియ పెరుమాళ్ శ్రీ వరదరాజ స్వామికి రామానుజులని శ్రీరంగం పంపించమని వర్తమానమును పంపిరి. కాని అందుకు శ్రీ వరదరాజ స్వామి రామనుజులు తనకి చాల ప్రియమైన శిష్యుడు అని నిరాకరించిరి.అందుకు శ్రీ పెరియ పెరుమళ్, శ్రీ వరదరాజ స్వామికి సంగీతము చాల ప్రియము కావున ఈ పనిని అరయర్లకి అప్పగించిరి.

varadhar-arayar-ramanujar
మన అరయర్లు వెంటనే కాంచీపురంనకు ప్రయాణమయ్యిరి.అక్కడ కాంచీపురంనకు చెరుకొగానే
వరమ్ తరుమ్ పెరుమాళ్ అరయర్ ( కంచీపురం అరయర్లు) వారికి స్వాగతం పలికి వారి తిరుమాళిగై (ఇల్లు) నకు తీసుకువెళ్ళిరి. అరయర్లు రాక తెలుసుకున్న తిరుకచ్చి నంబి గారు అచటకి వచ్చి వారి కుశలమును అడిగిరి. అరయర్లు నంబి గారిని పెరుమాళ్ దర్శనమునకు తెసుకువెళ్ళమనరి.(స్థానిక కైంకర్యపరులు తో అచటి అలయమును దర్శించుట ఉత్తమము. ) మన అరయర్లు శ్రీ వరదరాజ స్వామి ని దర్శంచి ఈ విధమున స్తొత్రము చేసిరి.“కదా పునస్ శంక రతాన్గ్ కల్పక ద్వజ అరవిన్ద అన్గుచ వజ్ర లాంచనమ్; త్రివిక్రమ త్వచ్చరణామ్భుజ ద్వయమ్ మదీయ మూర్ద్దానమ్ అలన్కరిశ్యతి”దాని అర్దము ఏమనగ “ఓహ్ త్రివిక్రమ! శంక రతాంగ కల్పక ద్వజ అరవిన్ద అన్గుచ వజ్ర లాంచనముల ముద్రలు కలిగిన నీ పాదములను నా శిరస్సు పై వుంచు తండ్రీ. మన అరయర్లుకు శఠారి తీర్థమును ఇచ్చిన తరువాత మన అరయర్లును పాడమనిరి.అరయర్లు ఎంతో మృదు మధురముగా అళువారుల శ్రీసూక్తులను పాడుతూ అభినయము చేసిరి.అది విన్న వరదరాజ స్వామి ఎంతో ఆనందించి మన అరయర్లును ఏమి కావలో కోరుకోమనగ అందుకు మన అరయర్లు నిరాకరించిరి.వరదరజస్వామి తనకి ఎదైనా ఇస్తాను అని మరల చెప్పగా,మన అరయర్లు తిరిగి “ఎది అడిగిన ఇస్తారు కదా ?” అని అడిగిరి. అందుకు వరదరాజస్వామి తనను తన దేవేరులును తప్పించి ఏమైన ఇస్తాను అని చెప్పిరి! వెనువెంటనే మన అరయర్లు రామనుజులిని చూపించి వారిని శ్రీరంగంనకు పంపమనిరి. అందుకు వరదరాజస్వామి నిరాకరించిరి వెంటనే మన అరయర్లు వరదరజస్వామిని చూసి “నువ్వు సాక్షాత్తు శ్రీ రామచంద్రుడివి ఇచ్చిన మాట తప్పరాదు అనిరి” వరదరజస్వామి అందుకు అంగీకరించి రామానుజులని త్యాగము చేసిరి(ఎందరో ఆచార్యులని వరదరజస్వామి సంప్రదాయమునకు త్యాగం చేసిరి అందుకనే కంచిని త్యాగ మండపము అనిరి.) రామానుజులు అందరికి నమస్కరించి వారి మఠం లో ఉన్న వరదరజస్వామి తిరువారాదన మూర్తులని తీసుకుని మన అరయర్లతో కూడి రామనుజులు శ్రీరంగంనకు వెడలిరి.రామానుజులిని శ్రీరంగంనకు తీసుకువచ్చుట లో కీలక పాత్ర మన అరయర్లు పొషించి సంప్రాదాయమునకు ఎంతో మేలు చేసిరి.

శ్రీ ఆళవందార్లు వారి అయిదు ప్రదాన శిశ్యులకి అయిదు ప్రదాన బాద్యతలను ఉడయవర్ విశయములొ అప్పగించిరి.పెరియ నంబి గారిని రామనుజులు కి పంచ సంస్కారములుని ప్రసాదించమనిరి.
పెరియ తిరుమలై నంబి గారు శ్రీ రామాయణమును రామనుజులు కి అనుగ్రహించమనిరి.
తిరుక్కోష్టియూర్ నంబి గారిని తిరుమంత్ర చరమ శ్లోక అర్ధములును రామనుజులు కి అనుగ్రహించమనిరి.
తిరుమాలై ఆణ్డాన్ గారిని తిరువాయ్ మొళిని రామనుజులు కి అనుగ్రహించమనిరి.
మన తిరువరన్గప్పెరుమాళ్ అరయరును ,శ్రీ ఆళవన్దార్లు, అరుళిచెయల్ అను గ్రంధము మరియు చరమోపాయము ( ఆచార్య నిష్టయే చరమోపాయము అని) రామనుజులకి అనుగ్రహించమనిరి.
తిరుమాలై ఆణ్డాన్ గారి దగ్గెర తిరువాయ్ మొళిని పరిపూర్ణంగా నేర్చిన తరువాత పెరియనంబి గారి ఆఙ్ఞ అనుసారము రామానుజులు మన అరయర్ల దగ్గర సంప్రదాయ రహస్యములును అభ్యసించిరి. అప్పుడు రామానుజులు శాస్త్ర నిర్ణయమును పాటిస్తూ ముందుగా ఆరు నెలలు అరయర్ గారికి కైంకర్యముని చెసిరి. రామానుజులు మన అరయర్లుకు ప్రతీ రొజూ వెచ్చటి పాలు కాచి,పసుపు అరగతీసి మన అరయర్లుకు అవసరమైనప్పుడు దానిని లేపనమ్ చేసిరి.

namperumal-arayar-ramanujar

ఒక రోజున మన అరయర్లకై రామానుజులు పసుపు ను అరగతిసిరి. కానీ అది అరయర్లకి ఆనందమును ఇవ్వని కారణమున రామానుజులు మరి కొంచెం పసుపు ను అరగతిసిరి. అందుకు మన అరయర్లు సంతశించిరి. అప్పుడు మన అరయర్లు రామానుజులకి చరమోపాయము (అంతిమ లక్ష్యము) అనగా ఆచార్య కైంకర్యముగా ఏవిదముగా గుర్తించాలని ఉపదేశించిరి.”క్షీరాబ్ది యందు శయనించి యున్న భగవంతుడు ఆచార్యుని గా మన ముందు ఉన్నారు అని విశ్వసించాలని చెప్పిరి.”

మన అరయరుల ఘనతని చాటి చెప్పే కొన్ని ఐతిహ్యములును చుద్దాము.

 

 • ఈడు వ్యాక్యానమున 1.5.11, వివరిస్తుండగ “పాలేయ్ తమిళర్ ఇశైకారర్” ఇందు ఇశైకారర్ అనిన సంగీత విద్వాంసుడు, నంపిళ్ళై గారు మన అరయర్లుని( తిరువరన్గప్పెరుమాళ్ అరయర్) ఇశైకారర్ అని ఆళ్వారులు ముందుగానే పాడిరి అని వ్యాఖ్యనించిరి.
 • ఈడు వ్యాఖ్యానమున 3.3.1, వివరిస్తుండగా నంపిళై గారు మన అరయర్ల గొప్పతనమును వివరించిరి.ఒకసారి మన అరయర్లు “ఒళివిల్ కాలమెల్లామ్” అను ఆళ్వారులు పాశురమును గానము చేస్తు ఆ పాశురమును ఉన్న కాలమెల్లామ్ అనె పదము దగ్గర ఆగి “ తిరువేంకటముడయాన్ కాలమెల్లామ్ కాలమెల్లామ్” అంటు ఉండిపొయిరి. ఈ పాశురమున ఆళ్వారులు తమకి తిరువేంకటముడయాన్ కైంకర్యము ఎల్లప్పుడు (కాలమెల్లామ్) కోరిరి. ఈ పాశురముని ద్వయ మంత్రపు వివరణమున కైంకర్య ప్రార్దన గా చెప్పెదరు.

మనము తిరువరంగప్పెరుమాళ్ అరయర్ గారి పాదములకు దాసోహములు సమర్పించి వారికి కలిగిన ఆచార్య నిష్ట, భగవద్ భక్తి ని మనకును ప్రసాదించమని కొరుకుందాము.

తిరువరన్గప్పెరుమాళ్ అరయర్ గారి తనియ

శ్రీరామమిశ్ర పద పంకజ చంచరీకం  శ్రీయామునార్య వర పుత్రం అహం గుణాఢ్యం |
శ్రీ రంగరాజ కరుణా పరిణామదత్తం శ్రీ భాష్యకార శరణం వరరంగమీడే||

శ్రీరామమిశ్రుల (శ్రీమణక్కాల్ నంబి) శ్రీపాదతామరలయందు తుమ్మెదవలె సంచరించే, , శ్రీరంగనాథుని కరుణచే జన్మించి, శ్రీయామునాచార్యుల సత్పుత్రులై, కల్యాణ గుణములను కలిగి శ్రీ రామానుజులకు ఆచార్యులైన  తిరువరంగపెరుమాళ్ అరయర్  ను ఆశ్రయుస్తున్నాను.

ఆంగ్ల అనువాదము- సారథి రామానుజ దాస

తెలుగు అనువాదము- సురేష్ కౄష్ణ రమానుజ దాస.

Source:

 

కురుగై కావలప్పన్

 

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః

 

తిరునక్షత్రము~: తై, విశాఖ

అవతార స్థలము~: ఆళ్వార్ తిరునగరి

ఆచార్యులు~: శ్రీ నాథమునులు

కురుగై అను నగరమున జన్మించిననందున వీరికి కురుగై కావలప్పన్ అని నామము వచ్చినది. వీరు శ్రీ నాథమునులకు అత్యంత ప్రియమైన శిష్యులు. శ్రీ నాథమునులు కాట్టుమన్నార్ కొవెళ కి వచ్చిన తరువాత పెరుమాళ్ళ యందు ద్యానం చెసేవారు. ఆ సమయమున ఒక సారి కావలప్పన్ ని శ్రీ నాథమునులు యోగాభ్యాసము నేర్చి వారికినూ నేర్పమనిరి.గురువు గారి ఆదేశము ను అనుసరించి కావలప్పన్ గారు అష్టాంగ యోగమును నేర్చి పెరుమాళ్ళు యందు ద్యానం చెసేవారు.శ్రీ నాథమునులు పరమపదించిన తరువాత గురువు గారి సంశ్లేషనమును భరింప లేక శ్రీ నాథమునులు విడిచి పెట్టిన విమల శరిరము ఉన్న చోటున ఊంటూ గురువు గారిని ఆరాదిస్తూ ,అష్టాంగ యోగమున పెరుమాళ్ళు యందు ద్యానం చెసేవారు.

 

మణక్కాల్ నమ్బి (శ్రీ నాథమునులు శిష్యులు) శ్రీ ఆళవందార్ ని కురుగై కావలప్పన్ ని ఆశ్రయించి అష్టాంగ యోగ విద్యను అభ్యశించమనిరి.శ్రీ ఆళవందార్లు వారి శిష్యులతో కలిసి కావలప్పన్ యొగాభ్యాసము చేయు చోటికి వెళ్ళినారు. కాని యోగములో ఉన్న కావలప్పన్ గారిని చూసి శ్రీ ఆళవందార్లు , వారి యోగమునకు భంగము కలుగరాదు అని శ్రీ ఆళవందార్లు అక్కడ గోడకి వెనుక నిలబడిరి. వెంటనే కావాలప్పన్ గారు కళ్ళు తెరిచి ఇక్కడ శొట్టై కులము వారు ఉన్నరా అని గట్టిగా అడిగిరి. వెంటనే శ్రీ ఆళవందార్లు వారి ముందు నిలబడి నమస్కరించి “యమునై తురైవన్”(అనగ శ్రేష్ఠమగు నాధమునుల కులము ) అని చెప్పిరి. వెంటనే శ్రీ ఆళవందార్లు వెనుక నుంచన్న వారి జాడ, కావలప్పన్ ఎట్లు గ్రహించినారో అడిగిరి. దానికి కావలప్పన్ గారు తాను పెరుమళ్ళును ద్యానిస్తూ ఉండగ సాక్షాత్ తాయారులు వచ్చి పిలిచిన కదలని స్వామి ఈ వేళ నా భుజములుని కిందకు వంచి నా వెనుకకి చూస్తున్న స్వామి ని చూసి అర్దం చేసుకున్న స్వామికి ప్రియమైన శొట్టై కులము (నాథముని కులము) వారు ఎవరో ఇక్కడ వున్నారు అని.పెరుమాళ్ళ తో కావలప్పన్ కి ఉన్న సంభందము,నాథమునులు పై స్వామి కి ఉన్న అనురాగము చూసి చెలించిపోయారు శ్రీ ఆళవందార్లు.
శ్రీ ఆళవందార్లు కావలప్పన్ పాదములు పై పడి తనికి కుడా అష్టాంగ యోగమును ఉపదేశంచమనిరి. శ్రీ ఆళవందార్ల ని పైకి లేవనెత్తి తాను ఈ శరీరమును విడిచి పెట్టే ముందు అష్టాంగ యోగమును ఉపదేశం చెస్తామని చెప్పిరి. కావలప్పన్ గారికి ఉన్న యోగ బలము చేత వారు పరమపదించే సమయమును చెప్పి శ్రీ ఆళవందార్లును ఆ సమయమునుకు వారి వద్దకు రమ్మనిరి. శ్రీ ఆళవందార్లు ,కావలప్పన్ గారి దగ్గెర శెలవు తీసుకుని శ్రీరంగంమునకు వెళ్ళిరి.

ఎప్పటిలాగానే శ్రీరంగమున అధ్యయన ఉత్సవములు జరుగుచుండగ అళ్వార్ తిరువరన్గ పెరుమాళ్ అరయర్ (అరయర్ అనగా శ్రీరంగంన పెరుమాళ్ళ కి అళ్వార్ పాశురములును శ్రుతి లయ బద్దముగ పాడుతూ అభినయము చేసేవారు).నమ్మాళ్వారుల తిరువాయ్ మొళిలో ఉన్న తిరువనంతపురమున పద్మనాభ స్వామి పైఉన్న కెడుమిడర్ (10.2) పాశురమును పాడిరి. “నడుమినో నమర్గళుళ్ళీర్ నాముమక్కు అఱియచ్ చొన్నోమ్(நடமினோ நமர்களுள்ளீர் நாமுமக்கு அறியச் சொன்னோம்) ఓ భక్తులరా మనం అందరము తిరువనంతపురమునకు నడిచి పోదాము అనే అర్దము వచ్చే పాశురమును అరయర్ పాడిరి.ఇది విన్న శ్రీ ఆళవందార్లు పరవశించి అది పెరుమాళ్ళ అనుఙ్ఞ గా భావించి తిరువనంతపురమునకు వెళ్ళిరి. అచట శ్రీ పద్మనాభ స్వామి కి మంగళాశాసనమును చెసిరి. ఆ తరువాత శ్రీ ఆళవందార్లుకు సరిగ్గా ఈ రోజున కావలప్పన్ గారు తనకి అష్టాంగ యోగమును ఉపదేశం చెస్తాను అన్న రోజు అని గుర్తుకు వచ్చి బహు దుఖ్ఖించి ఈ సమయుమున నాకు పుష్పక విమానము లేకపొయేను అని విలపించిరి.

అదే రోజున కావలప్పన్ గారు అష్టాంగ యోగమున వారి గురువు గారిని స్మరిస్తూ వారి ఆచార్య తిరువడిని చెరిరి.

మనం అందరమూ మన ఆచార్య పరంపరలో ఉన్న కురుగై కావలప్పన్ వంటి మహనీయులుని స్మరించుకుంటూ వారి ఆచార్య నిష్టను, భగవద్ భక్తి ని ప్రసాదించమని కోరుకుందాము.

కురుగై కావలప్పన్ గారి తనియ

నాథముని పదాసక్తమ్ ఙ్ఞ్యానయోగాతి సమ్పదమ్|
కురుగాతిప యోగీన్ద్రమ్ నమామి శిరసా సదా||

తెలుగు అనువాదము– సురేష్ కృష్ణ రామానుజ దాస.

Source

తిరుక్కచ్చి నంబి

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

tirukkachinambi

తిరు నక్షత్రము ~: మాఘ మాసము(మాసి), మృగశిరా నక్షత్రము

అవతార స్థలము~: పూవిరుందవల్లి

ఆచార్యులు~: ఆళవందార్

శిష్యులు ~: ఎమ్పెరుమానార్ (అభిమాన శిష్యులు)

పరమపదము చేరిన చోటు~: పూవిరుందవల్లి

శ్రీసూక్తులు~: దేవరాజ అష్టకము

తిరుక్కచ్చి నంబి గారికి కాంచీపూర్ణులు, గజేంద్ర దాసర్ అను నామధేయములు ఉన్నవి. వీరు ప్రతి నిత్యము శ్రీకంచి వరదరాజ స్వామికి ఆలవట్ట కైంకర్యము (చామర కైంకర్యము) ను చెసేవారు. ప్రతినిత్యము .శ్రీ వరదరాజ స్వామి శ్రీ పెరుందేవి తాయార్ వారితో మాట్లడేవారు.

రామానుజుల వారు కాశీ యాత్ర నుంచి కాంచీపురము చేరుకున్నాక ( కాశీ యాత్ర లో వారి పైన జరిగిన హత్యా యత్నము తదుపరి). రామానుజుల తల్లి గారు ,శ్రీ ఆళవందార్ (శ్రీ యామునాచార్యులు అని కూడ వీరి పేరు ) కి శిష్యులు అయిన తిరుక్కచ్చి నంబి గారిని ఆశ్రయించమని రామనుజుల తల్లి గారు చెప్పిరి.ఆ ప్రకారము గా రామనుజులు నంబి గారిని అశ్రయించి వారికి ఏమైన కర్తవ్యమును బోధించమనగ,నంబిగారు దేవ పెరుమాళ్ కి కావలిసిన తిరుమంజన తీర్థ కైంకర్యము కై సాలై కిణరు ( దేవ పెరుమాళ్ ఆలయం నుంచి బహు దూరముగా ఉన్న బావి) నుంచి తీర్థకైంకర్యము చెయ్యమని చెప్పిరి.రామనుజులు, నంబి గారు చెప్పిన విదముగా సంతోషముగా చెయ్యుచుంటిరి.

రామనుజులని సంప్రదాయములోకి తీసుకుని వచ్చి యామునుల తరువాత సాంప్రదాయ కొనసాగింపు కోసం శ్రీరంగము నుంచి వచ్చిన శ్రీపెరియనంబి గారు , రామనుజులని కాంచీపురము నుంచి శ్రీరంగము తీసుకువెళ్ళుటకు తిరుక్కచ్చి నంబి గారి ఆఙ్ఞ్నను అడుగగా వారు సంతోషముతో అంగీకరించిరి.అప్పుడు పెరియ నంబి ఇళయాళ్వారునకు ఆళవందారుల కీర్తిని గురించి చెప్పగా వారు పెరియనంబి గారితో కలిసి శ్రీ ఆళవందార్ (శ్రీ యమునాచార్యులు) ని ఆశ్రయించుటకు శ్రీరంగము వెళ్ళారు.అక్కడికి వెళ్ళుసరికి శ్రీ ఆళవందార్ పరమపదించిన వార్త తెలుసుకుని రామనుజులు బాదపడి కాంచీపురమునకు తిరిగి వచ్చి మరల తీర్థ కైంకర్యమును చేసిరి.

రామనుజులవారు తిరుక్కచ్చి నంబి గారి యెడల ఎక్కువ గురుభక్తిని కనబరిచేవారు. నంబి గారిని తనకి పంచ సంస్కారములని అనుగ్రహించమని కోరగా అందుకు నంబి గారు తాను అబ్రాహ్మణ వర్ణమున ఉన్నందున తాను ఆచార్యత్వమును స్వీకరించరాదని శాస్త్ర రిత్య ప్రమాణములును చూపించిరి. నంబి గారికి శాస్త్రముపై ఉన్న విశ్వాసమునకు రామనుజులని నంబి గారికి మరింత దగ్గిర చేసింది.
ఒకనాడు రామానుజులు తిరుక్కచ్చినంబి గారి ఉచ్చిష్టముని స్వీకరించాలనే తపన కలిగి నంబి గారిని రామనుజులు వారి గృహమునకి అహ్వానించారు,దానికి వారు అంగీకరించగా ఇళయాళ్వార్ సంతోషముతో పరుగున ఇంటికి వెళ్ళి ” మన గృహమునకు ప్రసాదమును స్వీకరించుటకు నంబి గారిని అహ్వానించానని మంచి విందును తయారు చేయమని వారి బార్య అయిన తంజమాంబతో చెప్పి,నిత్య కర్మానుష్టాలను పూర్తి చేసుకొని,దేవ పెరుమాళ్ యొక్క తీర్థ కైంకర్యమును పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిరి.వారు నంబి గారిని తీసుకురావడము కొరకు ఆలయపు దక్షిణ వీది నుండి వెళ్ళగా నంబి గారు ఉత్తరవీది గుండా రామానుజుల గృహమునకి వచ్చారు .తనకి వేరొక పనిఉండుట చేత తంజమాంబ(ఇళయాళ్వార్ భార్య) గారిని ప్రసాదముని పెట్టమనరి,దానిని వెంటనే స్వీకరించి వెళ్ళిరి.తంజమాంబ ఇళయాళ్వారుల మనసును అర్థము చేసుకొనక నంబి గారు తక్కువ వర్ణమునకు చెందినవారని వారి విస్తరిని బయట పడవేసి స్నానము చేసెను.ఇళయాళ్వార్ ఇంటికి తిరిగి వచ్చి ఎందుకు స్నానము చేసావని అడుగగా,ఈ విదముగా సమాదానమును చెప్పిరి “నంబి గారికి వేరొక కైంకర్యము ఉండడముచే త్వరగా ప్రసాదమును స్వీకరించి వెళ్ళిరి.కని వారికి ఉపవీతము (యఙ్న్యోపవీతము) లేనందున,విస్తరిని తీసివేసి గోమూత్రముతో శుద్ది చేసి నేను స్నానము చేసానని చెప్పిరి”. ఈ విషయమును విన్న ఇళయాళ్వార్ తన భార్య నంబి గారిని అగౌరపరించినందుకు (కారణము నంబి యొక్క గొప్పతనము తెలియక) చాలా బాద కలిగిన హృదయముతో అక్కడి నుంచి వెళ్ళిపొయారు.

తిరుక్కచ్చినంబి గారు ప్రతి నిత్యము శ్రీ వరదరాజ స్వామి వారితో స్వయముగ సంబాషిస్తారు అని తెలుసుకున్న రామనుజులు నంబి గారిని కలిసి తనకి కలిగిన సందేహాలకు సమాదానములును పెరుమాళ్ళును అడగమని అభ్యర్తించిరి.( రామనుజులు ఆదిశేష అవతారం అయి ఉండి వారికి సర్వము తెలిసినా శాస్త్ర ప్రమాణమును సాక్షాత్తు పెరుమాళ్ళు, ఆచార్యుల నోటిన వినిపింప చేసి శాస్త్రమునకు మరింత బలమును చేకుర్చాలని వారి తపన ).ఆ రాత్రి కైంకర్యము తదుపరి,నంబి దేవపెరుమాళ్ళని ఎప్పటివలే ప్రేమతో చూసిరి.

thyaga-mandapam

సర్వజ్నుడు అయిన శ్రీ వరద రాజ స్వామి ,నంబి వారిని చూసి మీరి ఏమైనా అడగదలచుకున్నారా అనగా నంబి గారు  ఇళయాళ్వారుల మనసులో(గమనిక~: ఇళయాళ్వార్ తమ యొక్క సందేహములను చెప్పలేదు) గల సందేహములను చెప్పి దేవ పెరుమాళ్ళని నివృత్తి చేయమనిరి.అప్పుడు దేవ పెరుమాళ్ “నేను ఏ విదముగా శాస్త్రము అభ్యసించడానికి సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళానో , ఇళయాళ్వార్ (ఆది శేషులు) శాస్త్రములో పండితుడైనప్పడికినీ తన సందేహములను నివృత్తి చేయమని నన్ను అడిగాడు”. వారు అప్పుడు ముఖ్యమైన  6 వార్తలు నంబి ద్వారా ఇళయాళ్వారులకు చెప్పిరి.అవి~:

 • అహమేవ పరమ్ తత్వమ్ – నెనే అన్నిటికి మూల కారకుడిని.
 • దర్శనమ్ భేదమ్ ఏవ – జీవాత్మలు/అచేతనములు కి వేరు అయి ఉన్న వాడిని .వాటితో శరీర ఆత్మ భవమున సంబందము కలిగిన వాడిని
 • ఉపాయమ్ ప్రపత్తి – నన్నే శరణు అని నమ్మిన వాడు  నన్నే చేరుకుంటాడు
 • అంతిమ స్మ్రుతి వర్జనమ్ –  ప్రపన్నులు అయిన వారు,శరీరమును విడిచిపెట్టే సమయుమున తన గూర్చి ఆలోచించక పొయిన స్వామి, వారి బదులుగ తాను ఆలోచన చెస్తాను అని వరాహ చరమ శ్లోకమున చెప్పెను.(చిత్రముగ మన పుర్వాచర్య వర్గము అంతా వారి అచార్యుల విషయముని అంతిమ స్మరణ చెసారు-మన సాంప్రదాయములో గల విశిష్టత అంతిమ సమయములో మన యొక్క ఆచార్యులను స్మరించడము)
 • దేహవసానే ముక్తి – ప్రపన్నులు అయినవారు ఈ దేహమును విడిచిపెట్టగనే పరమపదము చేరుకుని భగవంతునికి నిత్య కైంకర్యము చేయుదురు.
 • పూర్ణాచార్య పదాశ్రిత – మాహా పూర్ణులని (పెరియ నమ్బి)  గురువు గా స్వీకరించుట.

ఆ తరువాత తిరుక్కచ్చి నంబి గారు ఇళయాళ్వారులని కలిసి,వరదరాజ స్వామి వారి ఆరు వార్తలని చెప్పగా,చాలా సంతోషముతో వారికి ప్రణామములను సమర్పించిరి.నంబి గారు ఇళయాళ్వారులని వారు కూడా వీటీ గురించి ఆలోచిస్తున్నారా అని అడుగగా , తన మనసులొ వున్నవి ఇవియే అని చెప్పగ నంబి గారు చాలా ఆనంద పడిరి.

ఆ తరువత ఇళయాళ్వార్ మధురంతకం లో పెరియ నంబి గారిని ఆచార్యులుగా స్వీకరించి శ్రీ రామానుజ అను నామముతో ప్రసిద్దిగాంచిరి.

తిరుకచ్చినంబి గారి గూర్చి  సంపూర్ణము గా పూర్వాచర్యుల గ్రంధములున లేకున్న వారి గూర్చి వ్యాక్యానములున చెప్పబడినవి. అవి ఇప్పుడు చుద్దాం.

 • పెరియాళ్వార్ తిరుమొళి – 3.7.8తిరువాయ్ మొళి పిళ్ళై గారి స్వాపదేశ వ్యాక్యానమున
  తిరుకచ్చినంబి గారు శ్రీ కంచి వరదరాజ స్వామి ని తనకి ఏమైన ఒక పేరు పెట్టమని అడిగిన వెంటనే ,స్వామి నంబి గారిని గజేంద్ర దాసర్ అని పిలిచేరు.(కంచిపురము లోనే గజేంద్రుడు, వరదరాజ స్వామిని కొలిచాడు అందుచెతనే గజేంద్రుడు వరదరాజ స్వామికి ప్రియుడు. )
 • తిరువిరుత్తమ్ – 8 – నమ్పిళ్ళై ఈడు- శ్రీరంగమున  రామానుజులు శిష్యులు తో సంబాషిస్తూ ఉండగా రామానుజులుకి  తిరుకచ్చినంబి గారు ఙ్ఞాపకం వచ్చి ,రామానుజులు ఎవరయిన కంచిపురం వెళ్లి తిరుకచ్చినంబి గారి కుశలంను తెలుసుకోమనిరి.ఆ సమయమున ఏవరూ సిద్దంగా లేకపొయేసరికి ఆ తరువాత రోజున పెరియనంబి(మహాపుర్ణులు) కంచిపురం వెళ్ళి తిరుకచ్చినంబి గారిని కలిసి వారి  క్షేమ సమాచారమును తెలుసుకొనిరి. తిరుకచ్చినంబి గారు కంచిపురంన రాబోవు ఉత్సవమునుకు ఉండమన్నను అందుకు పెరియనంబి గారు రామనుజులుకి మీ కుశలంను తెలియజెయ్యవలెనని పెరియనంబి గారు శ్రీరంగంనకు ప్రయణం అయ్యిరి.
 • ఆచార్య హృదయము – 85త్ చూర్ణికై – త్యాగ మన్ణ్డపత్తిల్ ఆలవట్టముమ్ కైయుమాన అణ్తరన్ఙ్గరై వైదికోత్తమర్ అనువర్త్తిత్త క్రమమ్(த்யாக மண்டபத்தில் ஆலவட்டமும் கையுமான அந்தரங்கரை வைதிகோத்தமர் அனுவர்த்தித்த க்ரமம்)
  భాగవతుల వైభవమును తెలియజేయు సమయమున అబ్రహ్మణ వర్ణమున జన్మించిన తిరుకచ్చినంబి గారి వైభవమును మనవాళ మహామునులు వారి ఆచార్య హృదయమను గ్రంధమున ఈ విధముగ చెప్పిరి.

మామునులు తమ యొక్క దేవరాజ మంగళములో తిరుక్కచి నంబి గారి యొక్క గొప్పతనమును మరియు దేవ పెరుమాళ్ళకు గల గొప్ప సంభదమును 11వ శ్లోకములో ఈ విదముగా చెప్పిరి.

శ్రీ కాఞ్చిపూర్ణ్ణమిశ్రేన్ణ ప్రీత్యా సర్వాభిభాశనే |
అతితార్చ్చావ్యవస్తాయ హస్తద్రీశాయ మంగళమ్ ||

అర్చారుప ధర్మమును అతిక్రమించి తిరుకచ్చినంబి గారితో ముచ్చటించిన శ్రీ వరదరాజ స్వామి కి మంగళమ్. మనము భగవంతుని చేరు వేళన ఇటువంటి భక్తులని ముందు ఆశ్రయించాలి అని స్వామి మనవాళ మహా మునులు ఈ శ్లోకమును ప్రసాదించిరి.

మనము తిరుక్కచ్చి నంబి గారి పాదములకు దాసోహములు సమర్పించి వారికి కలిగిన ఆచార్య నిష్ట, భగవద్ భక్తి ని మనకును ప్రసాదించమని కొరుకుందాము.

తిరుకచ్చి నంబి గారి  తనియ:

దేవరాజ దయాపాత్రమ్ శ్రీ కాన్చి పూర్ణమ్ ఉత్తమమ్
రామానుజ మునేర్ మాన్యమ్ వన్దేహమ్ సజ్జనాశ్రయమ్

தேவராஜ தயாபாத்ரம் ஸ்ரீ காஞ்சி பூர்ணம் உத்தமம்
ராமாநுஜ முநேர் மாந்யம் வந்தேஹம் ஸஜ்ஜநாச்ரயம்

తిరుకచ్చినంబి గారు దేవరాజ అష్టకమ్ అను స్తోత్రమును రచించిరి.అందు వారు అనుభవించిన అర్చావతార వైభవమును  http://ponnadi.blogspot.in/2012/11/archavathara-anubhavam-thuirukkachi-nambi.html. చదవగలరు.

తెలుగు అనువాదము- సురేశ్ కృష్ణ రామానుజ దాస.

Source