అప్పిళ్ళార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
OLYMPUS DIGITAL CAMERA

తిరునక్షత్రము; తెలియదు

అవతారస్థలము; తెలియదు

ఆచార్యులు:  మనవాళ మాముణులు

వారు అనుగ్రహించిన గ్రంధములు; సాంప్రదాయ చంద్రికై, కాల ప్రకాశికై

అప్పిళ్ళార్ గొప్ప ఙ్ఞాని. వీరిని అప్పిళ్ళాన్ అని కూడా అంటారు. వీరు ఎంబెరుమానార్ శిష్యులైన కిడాంబి ఆచ్చాన్  పరంపరవారు. మనవాళ మాముణుల శిష్యులై అష్ట దిగ్గజాలలో ఒకరయ్యారు.

శ్రీ రంగనాధుఙ్ఞ మేరకు మాముణులు  శ్రీరంగములో వేంచేసి మన సంప్రదాయ పరిమళాలను నాలుగు దిశల వ్యాపింప చేస్తున్న కాలంలో ఎందరో ఆచార్య పురుషులు వీరి ఉత్తర భారతంలోని ఎందరో పన్డితులను అవలీలగా గెలిచారు. ఆ గర్వంతో ఎరుమ్బి అప్పాతో వాదుకు వచ్చారు. కాని ఎరుమ్బి అప్పాను చూడగానే వారికి దాసోహమన్నారు. వారి దగ్గర కొత్త కొత్త అర్ధాలను తెలుసు కులున్నారు. కొంత కాలం తరవాత వారు శ్రీ రంగమునకు బయలు దేరుతూ ఎరుమ్బి అప్పా ధగ్గరకు వెళ్ళి మాముణులతో వాదుకు బయలుదేరుతున్నానని సెలవు తీసుకొరారు. అలా ఎప్పటికి చేయకండి. వారు మహా పండితులు. కాంచేపురములో కిడాంబి ఆచ్చాన్ దగ్గర శ్రీ భాష్యము సేవించినవారు. ఆ రోజులలో ఒకసారి  కిడాంబి ఆచ్చాన్ మాముణులను పాత పాఠాలలో. పరీక్షించమని కోరారు మామునుల అపారమైన ఙ్ఞాపక శక్తికి, ఙ్ఞానమునకు నేను ఆశ్చర్యపోయాను. వారు సన్యాసులందరికి నాయకులు. మన సంప్రదాయాన్ని పునరుజ్జీవింప చేస్తున్నారు. వారిని మనం గౌరవించాలి కాని వాదులాడరాదు. ముందు ముందు వారి గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలియజేస్తాను అన్నారు. ఇది విన్న అప్పిళ్ళార్ మాముణుల గురించి ఓ మేరకు తెలుసుకొని ఎరుమ్బి అప్పా నుండి సెలవు తీసుకొని వెళ్ళారు.

మాముణులు శ్రీరంగనాధుని ఆఙ్ఞ మేరకు శ్రీ రంగములో నివాసముండి మన సంప్రదాయ ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియచెప్పేవారు.ఎరుమ్బి అప్పా శ్రీ రంగము వచ్చి మాముణు శిష్య వర్గములో చేరిపోయారు. కొంత కాలము అక్కడే వుండిపోయారు. తమ స్వస్థలమైన ఎరుమ్బి వెళ్ళదలచి బయలుదేరారు.అంతలో కొన్ని దుశ్శకునాలు కనపడినవి. వెంటనే మాముణులను చూసి చెప్పారు అందుకు వారు ఒక వింత జరగబోతున్నది. మీరు ఇక్కడే ఉండి దానిని చూడండి అన్నారు.

ఆ సమయములో అప్పిళ్ళార్, అప్పిళ్ళై ఇద్దరూ సకుటుంబముగా శ్రీ రంగము వచ్చారు. మాముణుల గురించి విని యున్నప్పటికి వారికి ఆ విషయములో అంతగా ఆసక్తి లేకపోయింది. అప్పటికే వారు ఙ్ఞాన సంపన్నులగుటచే తమ శిష్య బృందముతో కావేరి తీరములో విడిది చేసారు. మాముణుల ప్రాభవమును కళ్ళారా చూసి చేవులారా విని ఆశ్చర్యపోయారు. అప్పటికే ఙ్ఞాన, భక్తి వైరాగ్య సంపన్నులైన కందాఢై అన్నన్, ఎరుమ్బి యప్పా వంటి వారు మాముణులను ఆశ్రయించివున్నారు. అప్పిళ్ళార్ ఎరుమ్బి అప్పా ఙ్ఞాన సంపదను గురించి తెలిసినవారు. మాముణులలో ఎదో గొప్ప తనము వుందని గ్రహించారు. అప్పిళ్ళార్ మాముణుల మఠము లోపలికి వెళ్ళ గల స్వామితో వాకిలిదాక కలసి వెళ్ళి మఠములోకి వెళ్ళి అప్పిళ్ళార్ వచ్చారని చెప్పమన్నారు. వారు లోపలికి వెళ్ళి ఎరుమ్బి అప్పాను చూసి అప్పిళ్ళార్ వచ్చారని చెప్పారు. అది విన్న ఎరుమ్బి అప్పా ‘ఆహా అప్పిళ్ళార్ మంచికాలము ఆసన్నమైనది అని సంతోషించి  వెంటనే బయటకు వచ్చి అప్పిళ్ళార్ను కలుసుకున్నారు. ఎరుమ్బి అప్పా భుజముల మీద ఉన్న శంఖ, చక్రముల గుర్తులను చూసిన అప్పిళ్ళారుకు ఎరుమ్బి అప్పా ఈ మధ్యనే మాముణుల శిష్యులైయ్యారని అర్థమైంది పరస్పర నమస్కారములు, ఉభయ కుశలముల తరవాత ఎరుమ్బి అప్పా తాను మాముణులను ఆశ్రయించిన విధమును వివరించారు.

ఇంతలో వానమామలై జీయరు మాముణుల దగ్గరకు వెళ్ళి మహా ఙాన వైరాగ్య సంపన్నులైన అప్పిళ్ళార్, అప్పిళ్ళై వేం చేస్తున్నరని తెలియజేసారు. అంతే కాదు వారు మాముణులతో ఆచార్య సంబంధము కోరి వస్తున్నారని తెలియ జేసారు. దీనిలో 6 సూత్రాలు ఇమిడి వున్నాయి. అవి ఈ క్రింది శ్లోకములో తెలుసుకోగలము.

ఈశ్వర్శ్చ సౌహార్ధం యత్రుచ్చా సుహృదమ్ తతా విషఃణో కటాక్షం, అధ్వేషమ్ ఆభి ముఖ్యం చ సాత్వీక; సంభాషణం షడేతాని

  1. పరమాత్మ దయార్ద హృదయుడు, సమస్త జీవరాసుల సంక్షేమం ఆయనే చూసుకుంటాడు.
  2.  పరమాత్మ కటాక్షం కావాలనే కోరిక.
  3. జీవాత్మల మీద పరమాత్మ క్రృపా కటాక్షం.
  4. పరమాత్మ కృపకు అడ్డు పడకుండుట / అద్వేషము లేకుండా వుండుట.
  5. జీవాత్మ పరమాత్మ పట్ల ఆభిముఖ్యము కలిగి వుండుట.
  6. భాగవతులతో సాత్విక సంభాషణం.

అందు వలన వారు ఇప్పటికే ఎరుమ్బి అప్పాతో సంభాషించి వున్నందున తమరి శిష్యరికము చేయడానికి అన్ని అర్హతలు పొందివున్నారు. తమరు కూడా నిరంతరం జీవాత్మల ఉన్నతి కోసమే కృషి చేస్తున్నవారు. మీరు దయతో వారిని తమ శిష్యులుగా చేసుకోవాలని ఎరుమ్బి అప్పా ఈ దాసుడు కోరు కుంటున్నామని పొన్నడిక్కాల్ జీయర్మాముణులను లకు విన్నవించుకున్నారు.

ఉభయ కుశలముల తరవాత జీయరు వీరందరిని కొయిల్ అన్నన్ తిరుమాళిగకు తీసుకు వెళ్ళారు. అక్కడ కొయిలన్నన్ మాముణుల ప్రభావమును గురించి వివరముగా చెప్పారు. మాముణులు మరెవరో కాదు. రామానుజుల అవతారమే అని చెప్పటంతో అప్పిళ్ళై, అప్పిళ్ళార్ మాముణులను ఆశ్రయించాలని ఆతృత పడ్డారు. అందరూ కలసి పళ్ళు, తాంబూలాదులతో మఠమునకు చేరున్నారు. మఠములో తిరుమలై ఆళ్వార్ మండపములో మాముణులు ఆశీనులై వున్నారు. ఎగు భుజములు, విశాల వక్షము, కరుణ పొంగు కన్నులు కాషాయాంభరము చేతిలో త్రిదండములతో మాముణులు తేజరిల్లుతున్నారు. చిరునగవుతో అందరిని ఆహ్వానించారు. అప్పిళ్ళై, అప్పిళ్ళార్ సాష్టాంగ నమస్కారాలు సమర్పించి మాముణుల ఆనతి కొసము వేచి వున్నారు. మాముణులు ఎంతో ఆదరముతో అంగీకారము తెలిపి ముఖ్య సూత్రాలను తెలియజేసారు. పంచ సంస్కారము చేసి శిష్యులుగా చేసుకున్నారు. మాముణులు వారందరినీ శ్రీ రంగనాధుల సన్నిధికి తేసుకువెళ్ళారు. క్రమముగా ఆండాళ్, ఎంబెరుమానార్, నమ్మాళ్వార్, సేనైముదలియార్, గరుడాళ్వార్, శ్రీ రంగనాధులు, శ్రీరంగనాచ్చియార్, పరమపద నాధులను సేవించుకున్నారు. మఠమునకు తిరిగి వచ్చిన తరవాత మముణుల శేషమును స్వీకరించి ఆచార్య నిష్ఠనుపాటించారు.

జీయర్ మఠ నిర్వహణ భాద్యతను అప్పిళ్ళా కి అనుగ్రహించారు. కిడాంబి ఆచ్చాన్ లాగా వీరు కూడా జీయర్ మఠ నిర్వహణతో పాటు ఎమ్బెరుమానార్లకు కైంకర్యము చేసేవారు. అప్పిళ్ళార్, జీయర్ నరాయణన్ (పూర్వా శ్రమములో మాముణుల మనవడు) మాముణుల నిత్యారాధన కొరకు అర్చా విగ్రహము అనుగ్రహించమని కోరారు. అప్పుడు మాముణులు తన చెంబును వారిద్దరికి ఇచ్చి దానిని రెండు విగ్రహాలుగా చేసుకొని చెరొకటి తీసుకొమన్నారు. దీని వలన అప్పిళ్ళార్ మాముణులకు ఎంత ప్రీతి పాత్రులో మనకు భోద పడుతుంది.

అప్పిళ్ళార్ తనియన్ :

కాంతోపాయంత్రు యోగీంద్ర సర్వ కైంకర్యదూర్వహమ్ తదేక దైవతమ్ సౌమ్యమ్ రామానుజగురుమ్ భజే

అడియేన్ చూడామణి రామానుజదాసి

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/2012/08/17/introduction-contd/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

2 thoughts on “అప్పిళ్ళార్

  1. Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu

  2. Pingback: 2014 – June – Week 3 | kOyil

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s