తిరుక్కచ్చి నంబి

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

tirukkachinambi

తిరు నక్షత్రము : మాఘ మాసము (మాసి), మృగశిరా నక్షత్రము

అవతార స్థలము : పూవిరుందవల్లి

ఆచార్యులు : ఆళవందార్

శిష్యులు  : ఎమ్పెరుమానార్ (అభిమాన శిష్యులు)

పరమపదము చేరిన చోటు : పూవిరుందవల్లి

శ్రీసూక్తులు : దేవరాజ అష్టకము

తిరుక్కచ్చి నంబి గారికి కాంచీపూర్ణులు, గజేంద్ర దాసర్ అను నామధేయములు ఉన్నవి. వీరు ప్రతి నిత్యము శ్రీకంచి వరదరాజ స్వామికి ఆలవట్ట కైంకర్యము (చామర కైంకర్యము) ను చెసేవారు. ప్రతినిత్యము శ్రీ వరదరాజ స్వామి శ్రీ పెరుందేవి తాయార్ వారితో మాట్లడేవారు.

రామానుజుల వారు కాశీ యాత్ర నుంచి కాంచీపురము చేరుకున్నాక (కాశీ యాత్రలో వారిపైన జరిగిన హత్యా యత్నము తదుపరి). రామానుజుల తల్లిగారు, శ్రీ ఆళవందార్ (శ్రీ యామునాచార్యులు అని కూడ వీరి పేరు ) కి శిష్యులు అయిన తిరుక్కచ్చి నంబి గారిని ఆశ్రయించమని రామనుజుల తల్లి గారు చెప్పిరి. ఆ ప్రకారము గా రామనుజులు నంబి గారిని అశ్రయించి వారికి ఏమైన కర్తవ్యమును బోధించమనగ, నంబిగారు దేవ పెరుమాళ్ కి కావలిసిన తిరుమంజన తీర్థ కైంకర్యముకై సాలై కిణరు (దేవ పెరుమాళ్ ఆలయం నుంచి బహు దూరముగా ఉన్న బావి) నుంచి తీర్థ కైంకర్యము చెయ్యమని చెప్పిరి.రామనుజులు, నంబి గారు చెప్పిన విదముగా సంతోషముగా చెయ్యుచుంటిరి.

రామనుజులని సంప్రదాయములోకి తీసుకుని వచ్చి యామునుల తరువాత సాంప్రదాయ కొనసాగింపు కోసం శ్రీరంగము నుంచి వచ్చిన   శ్రీపెరియనంబి గారు, రామనుజులని కాంచీపురము నుంచి శ్రీరంగము తీసుకువెళ్ళుటకు తిరుక్కచ్చి నంబి గారి ఆఙ్ఞ్నను అడుగగా వారు సంతోషముతో అంగీకరించిరి. అప్పుడు పెరియ నంబి ఇళయాళ్వారునకు ఆళవందారుల కీర్తిని గురించి చెప్పగా వారు పెరియనంబి గారితో కలిసి శ్రీ ఆళవందార్ (శ్రీ యమునాచార్యులు) ని ఆశ్రయించుటకు శ్రీరంగము వెళ్ళారు. అక్కడికి వెళ్ళుసరికి శ్రీ ఆళవందార్ పరమపదించిన వార్త తెలుసుకుని రామనుజులు బాదపడి కాంచీపురమునకు తిరిగి వచ్చి మరల తీర్థ కైంకర్యమును చేసిరి.

రామనుజులవారు తిరుక్కచ్చి నంబి గారి యెడల ఎక్కువ గురు భక్తిని కనబరిచేవారు. నంబి గారిని తనకి పంచ సంస్కారములని అనుగ్రహించమని కోరగా అందుకు నంబి గారు తాను అబ్రాహ్మణ వర్ణమున ఉన్నందున తాను ఆచార్యత్వమును స్వీకరించరాదని శాస్త్ర రిత్య ప్రమాణములును చూపించిరి. నంబి గారికి శాస్త్రముపై ఉన్న విశ్వాసమునకు రామనుజులని నంబి గారికి మరింత దగ్గిర చేసింది. ఒకనాడు రామానుజులు తిరుక్కచ్చినంబి గారి ఉచ్చిష్టముని స్వీకరించాలనే తపన కలిగి నంబి గారిని రామనుజులు వారి గృహమునకి అహ్వానించారు, దానికి వారు అంగీకరించగా ఇళయాళ్వార్ సంతోషముతో పరుగున ఇంటికి వెళ్ళి “మన గృహమునకు ప్రసాదమును స్వీకరించుటకు నంబి గారిని అహ్వానించానని మంచి విందును తయారు చేయమని వారి బార్య అయిన తంజమాంబతో చెప్పి, నిత్య కర్మానుష్టాలను పూర్తి చేసుకొని, దేవ పెరుమాళ్ యొక్క తీర్థ కైంకర్యమును పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిరి. వారు నంబి గారిని తీసుకురావడము కొరకు ఆలయపు దక్షిణ వీది నుండి వెళ్ళగా నంబి గారు ఉత్తరవీది గుండా రామానుజుల గృహమునకి వచ్చారు. తనకి వేరొక పనిఉండుట చేత తంజమాంబ(ఇళయాళ్వార్ భార్య) గారిని ప్రసాదముని పెట్టమనరి, దానిని వెంటనే స్వీకరించి వెళ్ళిరి. తంజమాంబ ఇళయాళ్వారుల మనసును అర్థము చేసుకొనక నంబి గారు తక్కువ వర్ణమునకు చెందినవారని వారి విస్తరిని బయట పడవేసి స్నానము చేసెను. ఇళయాళ్వార్ ఇంటికి తిరిగి వచ్చి ఎందుకు స్నానము చేసావని అడుగగా, ఈ విదముగా సమాదానమును చెప్పిరి”నంబి గారికి వేరొక కైంకర్యము ఉండడముచే త్వరగా ప్రసాదమును స్వీకరించి వెళ్ళిరి. కానీ వారికి ఉపవీతము (యఙ్న్యోపవీతము) లేనందున, విస్తరిని తీసివేసి గోమూత్రముతో శుద్ది చేసి నేను స్నానము చేసానని చెప్పిరి”. ఈ విషయమును విన్న ఇళయాళ్వార్ తన భార్య నంబి గారిని అగౌరపరించినందుకు (కారణము నంబి యొక్క గొప్పతనము తెలియక) చాలా బాద కలిగిన హృదయముతో అక్కడి నుంచి వెళ్ళిపొయారు.

తిరుక్కచ్చినంబి గారు ప్రతి నిత్యము శ్రీ వరదరాజ స్వామి వారితో స్వయముగ సంభాషిస్తారు అని తెలుసుకున్న రామనుజులు నంబి గారిని కలిసి తనకి కలిగిన సందేహాలకు సమాదానములును పెరుమాళ్ళును అడగమని అభ్యర్తించిరి. (రామనుజులు ఆదిశేష అవతారం అయి ఉండి వారికి సర్వము తెలిసినా శాస్త్ర ప్రమాణమును సాక్షాత్తు పెరుమాళ్ళు, ఆచార్యుల నోటిన వినిపింప చేసి శాస్త్రమునకు మరింత బలమును చేకుర్చాలని వారి తపన). ఆ రాత్రి కైంకర్యము తదుపరి, నంబి దేవపెరుమాళ్ళని ఎప్పటివలే ప్రేమతో చూసిరి.

thyaga-mandapam

సర్వజ్నుడు అయిన శ్రీ వరద రాజ స్వామి, నంబి వారిని చూసి మీరి ఏమైనా అడగ దలచుకున్నారా అనగా నంబి గారు  ఇళయాళ్వారుల మనసులో (గమనిక: ఇళయాళ్వార్ తమ యొక్క సందేహములను చెప్పలేదు) గల సందేహములను చెప్పి దేవ పెరుమాళ్ళని నివృత్తి చేయమనిరి. అప్పుడు దేవ పెరుమాళ్ “నేను ఏ విదముగా శాస్త్రము అభ్యసించడానికి సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళానో, ఇళయాళ్వార్ (ఆది శేషులు) శాస్త్రములో పండితుడైనప్పడికినీ తన సందేహములను నివృత్తి చేయమని నన్ను అడిగాడు”. వారు అప్పుడు ముఖ్యమైన  6 వార్తలు నంబి ద్వారా ఇళయాళ్వారులకు చెప్పిరి. అవి:

  • అహమేవ పరమ్ తత్వమ్ – నెనే అన్నిటికి మూల కారకుడిని.
  • దర్శనమ్ భేదమ్ ఏవ – జీవాత్మలు / అచేతనములు కి వేరు అయి ఉన్న వాడిని. వాటితో శరీర ఆత్మ భవమున సంబందము కలిగిన వాడిని
  • ఉపాయమ్ ప్రపత్తి – నన్నే శరణు అని నమ్మినవాడు నన్నే చేరుకుంటాడు
  • అంతిమ స్మ్రుతి వర్జనమ్ –  ప్రపన్నులు అయిన వారు, శరీరమును విడిచిపెట్టే సమయుమున తన గూర్చి ఆలోచించక పొయిన స్వామి, వారి బదులుగ తాను ఆలోచన చెస్తాను అని వరాహ చరమ శ్లోకమున చెప్పెను. (చిత్రముగ మన పుర్వాచర్య వర్గము అంతా వారి అచార్యుల విషయముని అంతిమ స్మరణ చెసారు – మన సాంప్రదాయములో గల విశిష్టత అంతిమ సమయములో మన యొక్క ఆచార్యులను స్మరించడము)
  • దేహవసానే ముక్తి – ప్రపన్నులు అయినవారు ఈ దేహమును విడిచిపెట్టగనే పరమపదము చేరుకుని భగవంతునికి నిత్య కైంకర్యము చేయుదురు.
  • పూర్ణాచార్య పదాశ్రిత – మాహా పూర్ణులని (పెరియ నంబి)  గురువుగా స్వీకరించుట.

ఆ తరువాత తిరుక్కచ్చి నంబి గారు ఇళయాళ్వారులని కలిసి, వరదరాజ స్వామి వారి ఆరు వార్తలని చెప్పగా, చాలా సంతోషముతో వారికి ప్రణామములను సమర్పించిరి. నంబి గారు ఇళయాళ్వారులని వారు కూడా వీటీ గురించి ఆలోచిస్తున్నారా అని అడుగగా, తన మనసులో వున్నవి ఇవియే అని చెప్పగ నంబి గారు చాలా ఆనంద పడిరి.

ఆ తరువత ఇళయాళ్వార్ మధురంతకంలో పెరియ నంబి గారిని ఆచార్యులుగా స్వీకరించి  శ్రీ రామానుజ అను నామముతో ప్రసిద్దిగాంచిరి.

తిరుకచ్చినంబి గారి గూర్చి  సంపూర్ణము గా పూర్వాచర్యుల గ్రంధములున లేకున్న వారి గూర్చి వ్యాక్యానములున చెప్పబడినవి. అవి ఇప్పుడు చుద్దాం.

  • పెరియాళ్వార్ తిరుమొళి – 3.7.8 – తిరువాయ్మొళి పిళ్ళై గారి స్వాపదేశ వ్యాక్యానమున
    తిరుకచ్చినంబి గారు శ్రీ కంచి వరదరాజ స్వామి ని తనకి ఏమైన ఒక పేరు పెట్టమని అడిగిన వెంటనే, స్వామి నంబి గారిని గజేంద్ర దాసర్ అని పిలిచేరు. (కంచిపురము లోనే గజేంద్రుడు, వరదరాజ స్వామిని కొలిచాడు అందుచెతనే గజేంద్రుడు వరదరాజ స్వామికి ప్రియుడు)
  • తిరువిరుత్తమ్ – 8 నమ్పిళ్ళై ఈడు – శ్రీరంగమున  రామానుజులు శిష్యులతో సంబాషిస్తూ ఉండగా రామానుజులుకి  తిరుకచ్చినంబి గారు ఙ్ఞాపకం వచ్చి, రామానుజులు ఎవరయిన కంచిపురం వెళ్లి తిరుకచ్చినంబి గారి కుశలంను తెలుసుకోమనిరి. ఆ సమయమున ఏవరూ సిద్దంగా లేకపొయేసరికి ఆ తరువాత రోజున పెరియ నంబి (మహాపుర్ణులు) కాంచిపురం వెళ్ళి తిరుకచ్చినంబి గారిని కలిసి వారి క్షేమ సమాచారమును తెలుసుకొనిరి. తిరుకచ్చినంబి గారు కంచిపురంన రాబోవు ఉత్సవమునుకు ఉండమన్నను అందుకు పెరియనంబి గారు రామనుజులుకి మీ కుశలంను తెలియజెయ్య వలెనని పెరియనంబి గారు శ్రీరంగంనకు ప్రయణం అయ్యిరి.
  • ఆచార్య హృదయము – 85త్ చూర్ణికై – త్యాగ మన్ణ్డపత్తిల్ ఆలవట్టముమ్ కైయుమాన అంతరంగరై వైదికోత్తమర్ అనువర్తిత క్రమం భాగవతుల వైభవమును తెలియజేయు సమయమున అబ్రహ్మణ వర్ణమున జన్మించిన తిరుకచ్చినంబి గారి వైభవమును మనవాళ మహాముణులు వారి ఆచార్య హృదయమను గ్రంధమున ఈ విధముగ చెప్పిరి.

మాముణులు తమ యొక్క దేవరాజ మంగళములో తిరుక్కచి నంబి గారి యొక్క గొప్పతనమును మరియు దేవ పెరుమాళ్ళకు గల గొప్ప సంభదమును 11వ శ్లోకములో ఈ విదముగా చెప్పిరి.

శ్రీ కాంచీపూర్ణమిశ్రేణ ప్రీత్యా సర్వాభిభాశనే |
అతితార్ చ్చావ్యవస్తాయ హస్తద్రీశాయ మంగళమ్ ||

అర్చా రుప ధర్మమును అతిక్రమించి తిరుకచ్చినంబి గారితో ముచ్చటించిన శ్రీ వరదరాజ స్వామికి మంగళమ్. మనము భగవంతుని చేరు వేళన ఇటువంటి భక్తులని ముందు ఆశ్రయించాలి అని స్వామి మనవాళ మహా ముణులు ఈ శ్లోకమును ప్రసాదించిరి.

మనము తిరుక్కచ్చి నంబి గారి పాదములకు దాసోహములు సమర్పించి వారికి కలిగిన ఆచార్య నిష్ట, భగవద్ భక్తి ని మనకును ప్రసాదించమని కొరుకుందాము.

తిరుకచ్చి నంబి గారి  తనియన్:

దేవరాజ దయాపాత్రమ్ శ్రీ కాన్చి పూర్ణమ్ ఉత్తమమ్
రామానుజ మునేర్ మాన్యమ్ వన్దేహమ్ సజ్జనాశ్రయమ్

తిరుకచ్చినంబి గారు దేవరాజ అష్టకమ్ అను స్తోత్రమును రచించిరి. అందు వారు అనుభవించిన అర్చావతార వైభవమును  http://ponnadi.blogspot.in/2012/11/archavathara-anubhavam-thuirukkachi-nambi.html. చదవగలరు.

అడియేన్ సురేశ్ కృష్ణ రామానుజ దాస.

మూలము: https://guruparamparai.wordpress.com/2013/02/15/thirukkachi-nambi/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

3 thoughts on “తిరుక్కచ్చి నంబి

  1. Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu

  2. Pingback: కూరత్తాళ్వాన్ | guruparamparai telugu

  3. Pingback: కిడాంబి ఆచ్చాన్ | guruparamparai telugu

Leave a comment