అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

nayanarతిరునక్షత్రం : మార్గళి (మార్గశీర్షం) ధనిష్ఠ

అవతార స్థలం: శ్రీరంగం
ఆచార్యులు: వడక్కు తిరువీధి పిళ్ళై
పరమపదించిన స్థలం: శ్రీరంగం
రచనలు: తిరుప్పావై ఆరాయిరప్పడి వ్యాఖ్యానం, కణ్ణినుణ్ శిరుఱ్ఱాంబు వ్యాఖ్యానం, అమలనాది పిరాన్ వ్యాఖ్యానం, అరుళిచ్చెయళ్ రహస్యం, (ఆళ్వారుల పదవిన్యాసంతో రహస్య త్రయ వివరణ) ఆచార్య హృదయం, ఆచార్య హృదయం – ఒక స్వయం వ్రాత ప్రతి – ప్రస్తుతం ఇది అలభ్యం.

అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్నంపెరుమాళ్ అనుగ్రహం వల్ల శ్రీరంగమున వడక్కు తిరువీధిపిళ్ళై గారికి జన్మించిరి. (దీనిని క్రితమే వడక్కు తిరు వీధి పిళ్ళై ఐతిహ్యమున తెలుసుకున్నాము – https://guruparamparaitelugu.wordpress.com/2013/09/25/vadakku-thiruvidhi-pillai/ ). వీరును వీరి అన్నగారగు పిళ్ళై లోకాచార్యులు  అయోధ్యలో రామలక్ష్మణుల్లాగా, గోకులాన శ్రీకృష్ణ బలరామునివలె ఆప్యాయంగా శ్రీరంగమున పెరిగిరి.

వీరిద్దరు మన సాంప్రదాయమున గొప్పవారగు నంపిళ్ళై, పెరియ వాచ్చాన్ పిళ్ళై మరియు వడక్కు తిరువీధి పిళ్ళై మొదలగు ఆచార్యుల కృపా కటాక్షములచే మరియు మార్గ దర్శనమున నడవసాగిరి. వీరిద్దరు తమ తండ్రియగు వడక్కు తిరువీధిపిళ్ళై పాద పద్మముల వద్ద సాంప్రదాయ రహస్యములను అధికరించారు. విశేషముగా ఈ ఆచార్య సింహములు సాంప్రదాయ అభివృద్ధికై ఆజన్మాంతము నైష్ఠిక బ్రహ్మచర్యమును స్వీకరిస్తామని ప్రతిఙ్ఞ పూనినారు .

మాముణులు తమ ఉపదేశ రత్నమాలలో 47వ పాశురమున నాయనార్ ను మరియు వారి రచనలను కీర్తించారు.

నంజీయర్ శెయ్ ద వియాక్కియైగళ్ నాలిరణ్డుక్కు|
ఎంజామై యావైక్కుం  ఇల్లైయే| తం శీరాల్
వైయగురువిన్ తంబి మన్ను మణవళముని|
శెయ్యుమవై తాముమ్ శిల|

సంక్షిప్త  అనువాదం:

నంజీయర్ అరుళిచ్చెయల్లోని కొన్ని ప్రబంధములకు వ్యాఖ్యానమును అనుగ్రహించారు (పెరియ వాచ్చాన్ పిళ్ళై కన్నా ముందు). పెరియ వాచ్చాన్ పిళ్ళై అనంతరం పిళ్ళై లోకాచార్యుల సోదరుడు మహా ఙ్ఞాని అయిన అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ అరుళిచ్చెయళ్ లోని కొన్ని ప్రబంధములకు క్రమంగా వ్యాఖ్యానాలను అనుగ్రహించారు.

పిళ్ళై లోకం జీయర్  తమ వ్యాఖ్యానములో నాయనార్ వైభవాన్ని కీర్తించారు దానిని మనం అనుభవిద్దాం.

 • “తమం శీర్” లో జీయర్, నాయనార్ ప్రభావమును విశేషముగా ప్రకటించారు.  అరుళి చ్చెయళ్లో ఇతర ఆచార్యుల కన్నా వీరికి అధిక ప్రావీణ్యం ఉన్నదని గుర్తించారు. మనం దీనిని వారి ‘ఆచార్య హృదయం’ నందు అరుళిచ్చెయళ్లోని పదాల వినియోగాన్ని బట్టి వీరికి అరుళిచ్చెయళ్లో (కొన్ని పదములను ఇతిహాస పురాణముల నుండి కూడా) ఉన్న ప్రావీణ్యత తెలుస్తుంది.
 • “వైయ గురువిన్ తంబి” అను వాక్యమున, నాయనార్ గొప్పదనం పిళ్ళై లోకాచార్యులకు తమ్మునిగా అవతరించడమే అని ఉద్ఘాటించారు. వీరు “జగద్గురువరానుజ “(జగద్గురువగు  పిళ్ళైలోకాచార్యులకు సోదరులు) అను నామధేయముతో కీర్తింపబడేవారు.

నాయనార్ తిరుప్పావై, కణ్ణినుణ్ శిరుఱ్ఱాంబు మరియు అమలనాది పిరాన్ ప్రబంధములకు వ్యాఖ్యానాలను అనుగ్రహించారు. ఆచార్య హృదయం అను గ్రంథము వీరి విశేష కృతి.

వీరి వ్యాఖ్యానములు/రచనలు.

 • వీరి తిరుప్పావై ఆరాయిరప్పడి వ్యాఖ్యానం చాలా విస్తృతమైనది మరియు విశేషమైనది కూడా. ఈ వ్యాఖ్యానమునందు సాంప్రదాయ సారమును అందముగా వర్ణించారు. ఎంపెరుమాన్ యొక్క ఉపాయత్వం / ఉపేయత్వం, నిర్హేతుక కృప, పిరాట్టి (అమ్మవారు) యొక్క పురుషాకారం, పరగత స్వీకారం మరియు  కైంకర్యమున విరోధం మొదలైన విశేషములను తమ తిరుప్పావై వ్యాఖ్యానమున చాలా అనర్గళంగా నాయనార్ వివరించారు.
 • వీరి అమలనాదిపిరాన్ వ్యాఖ్యానం మన సాంప్రదాయమున విశేషమైనది. ఎంపెరుమాన్ ఒక్క దివ్య తిరుమేని అనుభవం చాలా విశేషంగా వర్ణించబడింది, మనం క్రితమే ఈ అనుభవాలను తిరుప్పాణాళ్వార్ అర్చావతార విషయమున చూశాము. http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-thiruppanazhwar.html.
 •  కణ్ణినుణ్ శిరుఱ్ఱాంబు వ్యాఖ్యానంలో వీరు పంచమోపాయము (ఆచార్యుడే సర్వస్వం అని నమ్మి ఉండుట) మరియు ఆచార్య వైభవములపై విశేష వ్యాఖ్యానమును అనుగ్రహించారు.
 • అరుళిచ్చెయళ్ రహస్యంలో వీరు రహస్య త్రయం, తిరు మంత్రం, ద్వయ మత్రం మరియు చరమ శ్లోకములను అరుళి చ్చెయళ్ లోని పదబంధములను ప్రయోగిస్తు వివరించారు. అరిళిచ్చెయళ్ నిపుణులలో సాంప్రదాయ రచనలు చేసేవారిలో నాయనార్ అత్యంత సామర్థ్యం కలవారు.
 • ఆచార్య హృదయం వీరి గ్రంథ రచనలలో అత్యంత విశేషణమైనది. నమ్మాళ్వార్ యొక్క మానసిక భావలను ప్రతిబింబింప చేశారు మరియు తిరువాయ్మొళి దివ్య ప్రబంధ రహస్యములను ఆళ్వార్  హృదయానుసారం వెలికి తీశారు. ఈ గ్రంథం పిళ్ళై లోకాచార్యుల శ్రీ వచన భూషణంలోని శ్రీ సూక్తులను సవివరంగా విశదీకరించినది. మనం క్రితమే నాయనార్ అర్చావతార అనుభవమును ఆచార్య హృదయం ద్వారా తెలుసుకున్నాము. http://ponnadi.blogspot.in/2012/11/archavathara-anubhavam-nayanar-anubhavam.html.

ఒకరి గొప్పదనం తెలుసుకోవాలన్న వేరొక గొప్ప వ్యక్తి యొక్క వాక్కుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. నాయనార్ తాను  పిళ్ళై లోకాచార్యుల కన్నా మునుపే  అతి పిన్న వయసులో తమ తిరుమేనిని వదలి పరమపదం చేరుకున్నారు. పిళ్ళై లోకాచార్యులు తమ ఒడిలో నాయనార్ తలను ఉంచుకొని శ్లోక సాగరములో మునిగి ఇలా విలపించారు.

మాముడుంబై మన్ను మణవాల అణ్ణాలొదు
శేమముదన్ వైకుంఠం చెన్ఱక్కాల్
మామెన్ఱు తొతురైత్త శొల్లుం తుయం తన్నినళ్  పొరుళుం
ఎత్తెజుత్తుం ఇంగురైప్పారార్

 సంక్షిప్త అనువాదం:

నాయనార్ విశేష వైభవం ద్వారా పరమపదమును  అలంకరించిరి, ప్రస్తుతం రహస్య త్రయం- తిరు మంత్రం, ద్వయ మంత్రం మరియు చరమ శ్లోకములను ఎవరు ప్రవచిస్తారు (ఎంపెరుమాన్ తాను వారి హృదయ స్పందనను చూచి = మామ్ – నేను రక్షకుడను అన్నారు )

ఇలా పిళ్ళై లోకాచార్యులు నాయనార్ వైభవాన్ని కీర్తించారు.

ఎంపెరుమానార్ మరియు మన ఆచార్యుల అనుగ్రహం పొందాలని అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ పాద పద్మముల యందు ప్రార్థించుదాం.

అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తనియన్:

ద్రావిడామ్నాయ హృదయం గురుపర్వక్రమాగతం|
రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా||

అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లను కీర్తించు పాశురం (సాధారణంగా  ఆచార్య హృదయ సమాప్తినందు పఠిస్తారు)

తన్దదరుళ వేణుమ్  తవత్తోర్ తవప్పయనాయ్ వన్దముడుమ్బై మణవాళా – శిన్దైయినాళ్
నీయురైత్త మాఱన్ నినైవిన్  పొరుళనై త్తెన్  వాయురైత్తు వాళుమ్ వకై

వీరి అర్చావతార వైభవమును ఇక్కడ పఠించవచ్చు : http://ponnadi.blogspot.in/2012/11/archavathara-anubhavam-nayanar-anubhavam.html.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: http://guruparamparai.wordpress.com/2012/12/15/azhagiya-manavala-perumal-nayanar/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
srIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

11 thoughts on “అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్

 1. Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu

 2. Pingback: 2015 – May – Week 3 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc

 3. Pingback: నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై | guruparamparai telugu

 4. Pingback: కూర కులోత్తమ దాసులు | guruparamparai telugu

 5. Pingback: విళాఞ్జోలైపిళ్ళై | guruparamparai telugu

 6. Pingback: తిరునారాయణ పురత్తు ఆయ్ జనన్యాచార్యులు | guruparamparai telugu

 7. Pingback: కణ్ణినుణ్ శిరుతాంబు | dhivya prabandham

 8. Pingback: కణ్ణినుణ్ శిరుతాంబు – 6 – ఇన్ఱు తొట్టుం | dhivya prabandham

 9. Pingback: కణ్ణినుణ్ శిరుతాంబు – 7 – కణ్దు కొణ్దు | dhivya prabandham

 10. Pingback: శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – రహస్యత్రయం | SrIvaishNava granthams – Telugu

 11. Pingback: ramyajAmAthru dhEva (azhagiya maNavALap perumAL nAyanAr) – guruparamparai – AzhwArs/AchAryas Portal

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s