కూర కులోత్తమ దాసులు

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

తిరునక్షత్రము:తులా(ఆశ్వీజ) మాసము, ఆరుద్రా నక్షత్రము

అవతార స్థలము: శ్రీరంగం

ఆచార్యులు: వడక్కు తిరివీధిపిళ్ళై( కాలక్షేప ఆచార్యులు పిళ్ళైలోకాచార్యులు మరియు అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్

పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగమ్

కూరకులోత్తమ దాసులు శ్రీరంగమున అవతరించిరి వారి నిత్యనివాసం కూడా శ్రీరంగమే. వీరు కూరకులోత్తమ నాయన్ గా కూడ వ్యవహరింపబడేవారు.

కూరకులోత్తమ దాసులు , తిరుమలై ఆళ్వార్(తిరువాయ్ మొళిపిళ్ళై ) ని సాంప్రదాయములోనికి తిరిగి తీసుకరావడానికి కారణమైనవారు. వీరు పిళ్ళైలోకాచార్యుల కు అత్యంత సన్నిహితంగా ఉండే సహచరులు. వీరు పిళ్ళైలోకాచార్యుల తో కలిసి  శ్రీరంగమున నంపెరుమాళ్ కు జరగు ఉలా(నంపెరుమాళ్ కలాబకాలమున జరుగు  యాత్ర) ఉత్సవానికి  వెళ్ళేవారు. జ్యోతిష్కుడి యందు  పిళ్ళైలోకాచార్యులు తమ అవసాన కాలమున  తాము అందించిన సాంప్రదాయ విశేషఙ్ఞానమును  తిరువాయ్ మొళిపిళ్ళై/తిరుమలై ఆళ్వార్  (అతిపిన్న వయస్కులుగా ఉన్నప్పుడు పిళ్ళైలోకాచార్యుల వద్ద పంచసంస్కారములు పొందిన) కి అందించి వారిని సాంప్రదాయ అధికారిగా చేయమని  కూరకులోత్తమ దాసులను, తిరుకణ్ణంగుడి పిళ్ళైను , తిరుపుట్కులి జీయర్ ను, నాలూర్ పిళ్ళై మరియు విలాంశోలై పిళ్ళైను నిర్ధేశించారు.

మొదట కూరకులోత్తమ దాసులు  మధురై కు మంత్రి అయిన తిరుమలై ఆళ్వార్  ను కలవాడానికి వెళ్ళారు. ఎందుకనగా  తిరుమలై ఆళ్వార్   పరిపాలన యంత్రాంగములో మరియు తమిళ   సాహిత్యమున బహు నైపుణ్యం కలవారు.  మధురై రాజు పిన్నవయసులో నే మరణించడం వల్ల ఆ రాజు బాధ్యతలను మరియు యువరాజు పోషణా బాధ్యతలు వహించెడి వారు.

కూరకులోత్తమదాసులు మధురై నగరమునకు ప్రవేశించి నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువిరుత్త ప్రబంధమును అనుసంధించసాగిరి. ఆ సమయాన తిరుమళైఆళ్వార్  నగరమున పల్లకిలో విహారానికి వెళుతూ వీరిని గమనించారు.

తిరుమలైఆళ్వార్ పల్లకి దిగకుండానే కూరకులోత్తమదాసులను దీనికి అర్థమును చెప్పమనిరి దానికి దాసులు వీరిపై ఉమ్మివేసిరి. దీనిని గమనించిన తిరుమలైఆళ్వార్ భటులు ఆగ్రహించి కూరకులోత్తమదాసులను  శిక్షించడానికి ముందుకు వచ్చిరి. తిరుమలైఆళ్వార్ కూరకులోత్తమదాసుల గొప్పదనమును తెలిసిన వారు కనుక భటులను నిరోధించిరి.

తిరుమలై ఆళ్వార్  తిరిగి తమ భవనానికి వెళ్ళి తమకు మార్గదర్శనం చేయు  మారుటి (సవతి) తల్లికి ఈ సంఘటనను చెప్పగా ఆవిడ కూరకులోత్తమదాసులకు , పిళ్ళైలోకాచార్యులకు ఉన్న సంబంధమును ఎరిగి కూరకులోత్తమదాసులను కీర్తించిరి. వారి గొప్పదనము గ్రహించిన  తిరుమలైఆళ్వార్ తాము కూరకులోత్తమదాసులను వెతక సాగిరి.

తిరుమలైఆళ్వార్ తాము ఏనుగు అంబారిపై అధిరోహించి వెళ్ళిరి,  కూరకులోత్తమ దాసులు తాము కనబడాలని ఒక ఎత్తైన ప్రదేశమునకు ఎక్కిరి. దీనిని గమనించిన తిరుమలైఆళ్వార్ వెంటనే తమ అంబారిని దిగి కూరకులోత్తమదాసుల తిరువడిపై పడి వారిని స్తుతించిరి.

కూరకులోత్తమదాసులను ,తిరుమలైఆళ్వార్ తమ రాజభవనమునకు తీసుకెళ్ళి పిళ్ళైలోకాచార్యుల చే అనుగ్రహించబడిన అమూల్యమైన నిర్ధేశ్యములను శ్రవణం చేశారు. ఆ నిర్థేశ్యములను అనుసరించ దలచి తిరుమలైఆళ్వార్ , కూరకులోత్తమదాసులను ప్రతిరోజు ప్రాతః  కాలమున తమ అనుష్ఠాన సమయమున వచ్చి సాంప్రదాయ రహస్యములను అనుగ్రహించాలని ప్రార్థించారు. మరియు కూరకులోత్తమదాసులకు వేగై నదీ తీరాన ఒక నివాసగృహమును ఏర్పాటు చేసి వారి జీవనమునకు అవసరమగు వస్తుసామాగ్రిని సమకూర్చారు.

కూరకులోత్తమదాసులు ప్రతిరోజు తిరుమలై ఆళ్వార్  దగ్గరకు వెళ్ళసాగిరి. తిరుమలైఆళ్వార్ ప్రతిరోజు తాము తిరుమణ్ కాప్పు (స్వరూపం) చేసుకొనేసమయాన(మనం తిరుమణ్ కాప్పు చేసుకొనే సమయాన గురుపరంపరను అనుసంధిస్తాము కదా) పిళ్ళైలోకాచార్యుల తనియన్ ను అనుసంధించుటను   కూరకులోత్తమదాసులు  గమనించి చాలా ఆనందించిరి.   కూరకులోత్తమదాసులు వారికి  సాంప్రదాయ విషయాలను బోధించసాగిరి. ఒక రోజున కూరకులోత్తమదాసులు రానందున తిరుమలైఆళ్వార్ తమ సేవకున్ని పంపారు అయినా  ఏ స్పందన లేదు.

ఆచార్య సంబంధమువల్ల తామే స్వయంగా వెళ్ళిరి.  కూరకులోత్తమదాసులు వారిని కొంత సమయం వేచిఉండేలా చేసిరి. చివరకు తిరుమలైఆళ్వార్  తాము కూరకులోత్తమదాసుల శ్రీపాదములపై పడి తమ తప్పిదమును మన్నించమని వేడుకొనగా వారు మన్నించిరి.

ఆనాటి నుండి తిరుమలైఆళ్వార్ తామే స్వయంగా కాలక్షేప సమయానికి ఉపస్థితులై ప్రతిరోజు కూరకులోత్తమదాసుల శ్రీపాదతీర్థమును మరియు శేషప్రసాదాన్ని స్వీకరించసాగిరి. భాగవత్తోత్తముల శ్రీపాద తీర్థము మరియు శేషప్రసాదం తీసుకొన్నవాళ్ళు పవిత్రులవతారు. అలాగే తిరుమలైఆళ్వార్ లో గొప్ప మార్పు వచ్చినది. వీటి ప్రభావం వల్ల తిరుమలై ఆళ్వార్          “కూరకులోత్తమ దాస నాయన్  తిరువడిగళే శరణం” అని అనుసంధిస్తు తమ రాజ్యవిషయముల యందు మరియు ప్రాపంచిక విషయాలయందు నిరాసక్తతను   ప్రదర్శించ సాగిరి.

కూరకులోత్తమదాసులు తిరిగి శిక్కిళ్ గ్రామానికి (తిరుపుళ్ళాని కి సమీపమున ఉన్నది) వెళ్ళిపోయిరి. తిరుమలైఆళ్వార్ తమ రాజ్యభారాన్ని అప్పచెప్పి తాను రాజ్యాన్ని వదలి కూరకులోత్తమదాసుల తో సహవాసం చేస్తు వారికి సమస్త సేవలు చేయనారంభించిరి.

కూరకులోత్తమదాసులు తమ అవసానమున తిరుమలైఆళ్వార్ కు తరువాతి సాంప్రదాయవిషయాలను విలాంశోలై పిళ్ళై మరియు తిరుకణ్ణంగుడిపిళ్ళై వద్ద సేవించమని నిర్థేశించిరి. ఒకనాడు కూరకులోత్తమదాసులు పిళ్ళైలోకాచార్యుల తిరువడిని స్మరిస్తూ తమ చరమ శరీరాన్ని వదిలి పరమపదం వేంచేశారు.

మామునులు , కూరకులోత్తమదాసులను “కూరకులోత్తమ దాసం ఉదారం”(వీరు చాలా ఉదార స్వభావులు మరియు కృపాలురు) అని కీర్తించారు. కారణం వీరి నిరంతర కృషి మరియు నిర్హేతుక కృపవల్ల తాము పిళ్ళైలోకాచార్యుల వద్ద సేవించిన సాంప్రదాయ విషయాలన్నింటిని తిరుమలైఆళ్వార్ కు బోధించి వారు మళ్ళీ సాంప్రదాయములోనికి  వచ్చేలా శ్రమించిరి.  వీరు మన సాంప్రదాయమున రహస్యగ్రంథ కాలక్షేప పరంపరలో ఒక ప్రముఖ స్థాన్నాన్ని ఆక్రమించారు. మరియు చాలా రహస్య గ్రంథములలో పెక్కు తనియన్ల తో కీర్తంచబడ్డారు.

శ్రీవచనభూషణ దివ్యశాస్త్రము  ప్రతి శిష్యునికి ” ఆచార్య అభిమానమే ఉత్తారకం” (ஆசார்ய அபிமானமே உத்தாரகம்) అని నిర్థేశించినది. దీనికి  వ్యాఖ్యానమును చేస్తు మామునులు ఇలా అనుగ్రహించారు “ప్రపన్నునకు అన్నీ ఉపాయములకన్నా ఆచార్యుని నిర్హేతుక కృప మరియు వారు ‘ఇతను నా శిష్యుడు’ అని తలంచిన అదే శిష్యునకు ముక్తి (మోక్షం) ని ప్రసాదించును’

ఈ విషయాన్ని మనం పిళ్ళైలోకాచార్యుల, కూరకులోత్తమదాసుల మరియు తిరువాయ్ మొళిపిళ్ళై చరితమున స్పష్ఠంగా దర్శించవచ్చును. కూరకులోత్తమదాసుల మరియు తిరువాయ్ మొళిపిళ్ళై యందు పిళ్ళైలోకాచార్యుల అభిమానం మరియు ఉత్తమ ఆచార్యులగు తిరువాయ్ మొళిపిళ్ళై యొక్క అలుపెరుగని శ్రమవల్ల  క్రమంగా ఆ అభిమానం అళిగియ మణవాళ మామునుల ద్వారా మనకు సంక్రమించినది.

ప్రతి నిత్యం పిళ్ళైలోకాచార్యుల ను ధ్యానించు కూరకులోత్తమ దాసులను ధ్యానము చేద్దాం.

కూరకులోత్తమ దాసుల తనియన్ :

లోకాచార్య కృపాపాత్రం కౌణ్డిన్య కుల భూషణం |
సమస్తాత్మ గుణావాసం వందే కూర కులోత్తమం ||

పిళ్ళైలోకాచార్యుల కృపకు పాత్రులై కౌణ్డిన్య కుల భూషణుడై అనేక కల్యాణ గుణములకు ఆవాస్యయొగ్యుడైన కూరకులోత్తమ దాసులకు వందనం చేయుచున్నాను.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.in/

Source: http://guruparamparai.wordpress.com/2012/11/02/kura-kulothama-dhasar/

1 thought on “కూర కులోత్తమ దాసులు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s