శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
గత సంచికలో మనం శ్రీ వైష్ణవ గురుపరంపర గురించి విశదీకరించుకున్నాము.
శ్రియఃపతి (లక్ష్మీనాథుడు) అయిన ఎమ్పెరుమాన్ (శ్రీమన్నారాయణుడు) పరిపూర్ణ దివ్య కళ్యాణ గుణములతో నిత్యము శ్రీ వైకుంఠము నందు తన దివ్య మహిషులతో (శ్రీభూనీళాదేవేరులు) మరియు అనంత కళ్యాణగుణములు కలిగిన అనంత గరుడ విష్వక్సేనాది నిత్యసూరి గణములతో ప్రతి నిత్యము కైంకర్యములు పొందుతు ఉంటారు. శ్రీ వైకుంఠము నిత్యము ఆనందముతో శోభాయమానముగా ఉండును. ఎమ్పెరుమాన్ అక్కడ ఆనందమును అనుభవించుచున్నప్పటికిని వారి హృదయం సదా సంసారమందు దుఃఖమును అనుభవిస్తున్న జీవాత్మల (అనాదిగా ఉన్న) యందే ఉండును.
జీవాత్మ మూడు విధములు:
- నిత్యులు : ఎల్లప్పుడు పరమపదమునందుండెడి వారు (కర్మచేత ఈ సంసారలోక సంపర్కం లేని వారు)
- ముక్తులు : సంసారమున ఒకనాడు ఉండి మొక్షమును పొందినవారు.
- బధ్ధులు : సంసారము నందు కర్మచే బద్ధుడై ఎంపెరుమానునితో సంబంధము కలిగి ఉన్నవాడు. (పితా – పుత్ర మరియు శేష – శేషి సంబంధము కల). ఈ సంబంధము వలన భగవంతుడు ఈ బద్ధ జీవునకు సదా అనుగ్రహిస్తు వారిని శ్రీవైకుంఠమునకు రప్పించి నిత్య కైంకర్యపరునిగా చేయాలని ఆరాట పడుతుంటాడు.
శాస్త్రము నందు చెప్పినటుల మోక్షము పొందుటకు తత్త్వ జ్ఞానము అవసరము. రహస్య త్రయమందు ఈ తత్త్వ జ్ఞానము స్పష్ఠముగా వివరించబడి ఉన్నది. జీవులకు ఈ తత్త్వ జ్ఞానమును బోధించి జీవాత్మలను సంసార బంధము నుండి విముక్తిని కలిగించే వారినే ఆచార్యులంటారు. ఈ ఆచార్యుని పాత్ర విశేషమైనది కావున భగవంతుడే ఆచార్యునిగా అవతరించుటకై సిద్ధపడును. కావున తానే ప్రధమాచార్యుడు. తాను ఆచార్యునిలా వేంచేసి ఉన్న స్థలములను మన పూర్వాచార్యులు ఇలా వివరించారు.
- శ్రీమన్నారాయణుడు బదరికాశ్రమము నందు నారాయణ ఋషిగా (ఆచార్యునిగా) అవతరించి, తన అవతారమైన (శిష్యునిగా) నర ఋషికి తిరుమంత్రమును ఉపదేశించెను.
- ఎమ్పెరుమాన్ విష్ణులోక మందు ద్వయ మంత్రమును పెరియ పిరాట్టి (శ్రీ లక్ష్మీదేవి) కి ఉపదేశించెను. (ఈ క్రమముననే శ్రీవైష్ణవ గురుపరంపర ఆరంభమయినది).
- ఎమ్పెరుమాన్ పార్ధ సారథిగా కురుక్షేత్రమున అర్జునునకు చరమ శ్లోకమును ఉపదేశించెను.
సమగ్ర గురుపరంపర ఇక్కడ చూడండి http://kaarimaaran.com/downloads/guruparambarai.jpg. శ్రీరంగము నందు వేంచేసియున్న పెరియ పెరుమాళ్ మరియు పెరియ పిరాట్టి సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడే. ఓరాణ్ వళి గురుపరంపరలోని క్రమానుసారం పెరియ పెరుమాళ్ళతో ఆరంభమగును.
- పెరియ పెరుమాళ్
- పెరియ పిరాట్టి
- సేనై ముదలియార్
- నమ్మాళ్వార్
- శ్రీమన్నాథమునులు
- ఉయ్యక్కొండార్
- మణక్కాల్ నంబి
- ఆళవందార్
- పెరియనంబి
- ఎమ్పెరుమానార్
- ఎంబార్
- పరాశరభట్టర్
- నంజీయర్
- నంపిళ్ళై
- వడక్కు తిరువీధిపిళ్ళై
- పిళ్ళై లోకాచార్యులు
- తిరువాయ్మొళి పిళ్ళై
- అళగియ మణవాళ మాముణులు
శ్రీ వైష్ణవ గురుపరంపరలో ఆళ్వారులతో పాటు ఆచార్యులను కూడ చేర్చి ఒకే భాగముగా వ్యవహరించెదరు. ఆళ్వారుల క్రమము.
- పోయిగై ఆళ్వార్
- భూదత్తాళ్వార్
- పేయాళ్వార్
- తిరుమళిశై ఆళ్వార్
- మధురకవి ఆళ్వార్
- నమ్మాళ్వార్
- కులశేఖరాళ్వార్
- పెరియాళ్వార్
- ఆండాళ్
- తొండరడిప్పొడి ఆళ్వార్
- తిరుప్పాణాళ్వార్
- తిరుమంగై ఆళ్వార్
కొంతమంది ఆచార్యుల (ఓరాణ్ వళి గురుపరంపరలో లేని) ను కూడ కొంత పరిమితితో ఇక్కడ చేర్చడం జరిగింది.
- శెల్వనంబి
- కురుగై కావలప్పన్
- తిరుకణ్ణమంగై ఆండాన్
- తిరువరంగ ప్పెరుమాళ్ అరయర్
- తిరుక్కోష్ఠియూర్ నంబి
- పెరియ తిరుమలై నంబి
- తిరుమలై ఆండాన్
- తిరుక్కచ్చి నంబి
- మాఱినేరి నంబి
- కూరత్తాళ్వాన్
- ముదలియాండాన్
- అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్
- కోయిల్ కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్
- కిడాంబి ఆచ్చాన్
- వడుగ నంబి
- వంగీపురత్తు నంబి
- సోమాశి ఆండాన్
- పిళ్ళై ఉఱంగావిల్లి దాసర్
- తిరుక్కురుగై ప్పిరాన్ పిళ్ళాన్
- కూర నారాయణ జీయర్
- ఎంగళాళ్వాన్
- అనంతాళ్వాన్
- తిరువరంగత్తు అముదనార్
- నడాదూర్ అమ్మాళ్
- వేదవ్యాస భట్టర్
- శ్రుత ప్రకాశికా భట్టర్ (సుదర్శన సూరి)
- పెరియ వాచ్చాన్ పిళ్ళై
- ఈయుణ్ణి మాధవ పెరుమాళ్
- ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్
- నాలూర్ పిళ్ళై
- నాలూరాచ్చాన్ పిళ్ళై
- నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్
- పిన్బళగియ పెరుమాళ్ జీయర్
- అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్
- నాయనారాచ్చాన్ పిళ్ళై
- వాదికేసరి అళగియ మణవాళ జీయర్
- కూరకులోత్తమ దాసులు
- విళాన్ శోలై పిళ్ళై
- వేదాందాచార్యులు
- తిరునారాయణ పురత్తు ఆయ్ జనన్యాచార్యులు
మణవాళ మాముణులు వేంచేసి ఉన్న కాలములో మరియు ఆ తరువాతి కాలములో వైభవం కలిగిన పలువురు ఆచార్యులు (పరిమితిలో) :
- పొన్నడిక్కాల్ జీయర్
- కోయిల్ కందాడై అణ్ణన్
- ప్రతివాది భయంకరం అణ్ణన్
- పతన్గి పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్
- ఎఱుంబి అప్పా
- అప్పిళ్ళై
- అప్పిళ్ళార్
- కోయిల్ కందాడై అప్పన్
- శ్రీ పెరుంబుదూర్ ఆది యతిరాజ జీయర్
- అప్పాచ్చియారణ్ణ
- పిళ్ళై లోకమ్ జీయర్
- తిరుమళిశై అణ్ణావప్పంగార్
- అప్పన్ తిరువేంకట రామానుజ ఎంబార్ జీయర్, ఇంకను కలరు.
పైన చెప్పబడిన ఆచార్య పురుషుల జీవిత చరిత్రను వీలైనంతగా రాబోవు సంచికలలో చూడవచ్చును.
ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం
పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/2012/08/17/introduction-contd/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org