Category Archives: Alvars

పెరియాళ్వార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

periazhvar

తిరునక్షత్రము: ఆషాడ మాసము (ఆని), స్వాతి

అవతార స్థలము: శ్రీవిల్లిపుత్తూర్

ఆచార్యులు~: విష్వక్సేనులు

శ్రీ సూక్తులు: తిరుప్పల్లాణ్డు, పెరియాళ్వార్ తిరుమొళి

పరమపదము చేరిన ప్రదేశము: తిరుమాలిరుంశోలై

 

పెరియవాచ్చాన్ పిళ్ళై తన తిరుపల్లాండు అవతారికలో పెరియాళ్వార్ వైభవాన్ని కీర్తించారు. వీరి యొక్క అవతార ప్రయోజనం,  ఈ సంసార దుఃఖములను అనుభవిస్తున్న జీవాత్మలను ఉజ్జీవింపచేయడం. ఎంపెరుమాన్ కృపచే పెరియాళ్వార్ సహజముగానే పెరుమాళ్  యందు  దాస్యకైంకర్యం అను దానిచే అలంకరిపబడిరి.  తమ జీవితాన్ని ఎంపెరుమాన్ కు కైంకర్యము చేయడానికి మరియు శాస్త్ర నిర్ణయం చేసి ఉత్తమ కైంకర్యమును ప్రవర్తింప చేయడానికి వినియోగించాలనుకున్నారు.శ్రీకృష్ణుడు కంస సభకు వెళ్ళేముందు మథురలోని మాలకారుని గృహమునకు వెళ్ళి ఉత్తమ పూమాలను కోరగా, మాలకారుడు ప్రేమతో మరియు ఆనందముతో మాలను సమర్పించగా  శ్రీకృష్ణుడు చాలా  ఆనందముతో దాని ధరించాడు.దీనిని గుర్తించిన పెరియాళ్వార్,  పెరుమాళ్  కు మాలాకైంకర్యం  చేయడమే  ఉత్తమ కైంకర్యముగా భావించి, ఒక నందనవనము పెంచి దానినుండి వచ్చు పూలచే శ్రీవిల్లిపుత్తూర్ పెరుమాళ్ కు ప్రతిరోజు అత్యంత ప్రీతిచే  మాలాకైంకర్యము చేయసాగిరి.

పెరియాళ్వార్ కు ఇతర ఆళ్వార్లకు చాలా వ్యత్యాసమున్నది.  ఇతర ఆళ్వార్లు తమ కైంకర్యమును (ఎంపెరుమాన్ యందు వారిది  నిత్య కైంకర్యము)తమ ఆనందమునకై చేయగా ,  పెరియాళ్వార్  మాత్రం తమ గురించి కాక  కేవలం  ఎంపెరుమాన్ ఆనందమునకై  (జీవాత్మలకు పరమపదమునందు ఎంపెరుమాన్ కు నిత్య కైంకర్యము చేయాలని)మాత్రమే తమ కైంకర్యమును చేసిరి.ఇతర ఆళ్వార్లు,   ఈశ్వరుడే రక్షకుడని మరియు వాని రక్షణచే తమ భయములను పోగొడతాడని భావించారు. కాని పెరియాళ్వార్,  ఆ ఈశ్వరుడు రక్షకుడు మరియు రక్షింపబడే వాడుకూడా అని భావించారు. పిళ్ళైలోకాచార్యులు మరియు మామునులు అన్నీ ప్రబంధముల కన్నా తిరుపల్లాండు  విధిగా కీర్తించబడిందని తెలిపారు.

మిగితా ప్రబంధములన్నీ క్లిష్ఠమైన వేదాంత సంబంధ విషయములతో కూడుకొన్నవి,  కాని  తిరుపల్లాండు సులువుగా ఉండి నేరుగా ఎంపెరుమాన్ కు మంగళాశాసనము చేస్తుంది. మిగితా ప్రబంధములన్నీ ఆకారమున పెద్దవిగా ఉన్నవి, కాని తిరుపల్లాండు చిన్నది మరియు సారవంతమైనది – కేవలం  12పాశురములలో సారవంతమైన  విషయాలు  వర్ణించబడి ఉన్నవి.

 పిళ్ళైలోకాచార్యులు తమ దివ్యశాస్త్రమైన శ్రీవచనభూషణములో , మంగళాశాసనమును కీర్తిస్తు ఇది  సిద్దోపాయనిష్ఠులకు( ఎవరైతే భగవంతున్ని  ఉపాయం(పొందించే కారకం)  , ఉపేయం(పొందబడేది),వారికి దినచర్యలో భాగమని తెలిపారు . ఇది  క్రితమే శ్రీవైష్ణవ దినచర్య http://ponnadi.blogspot.in/2012/08/srivaishnava-lakshanam-10.html మరియుhttp://ponnadi.blogspot.in/2012/08/srivaishnava-lakshanam-11.html , శ్రీవైష్ణవ  లక్షణం లో భాగంగా ఉన్నటువంటిhttp://ponnadi.blogspot.in/p/srivaishnava-lakshanam.html.యందు వివరించబడింది.

మంగళాశాసనము అనగా  ఒకరి శ్రేయస్సు కోసం ప్రార్థించడం. ఆళ్వార్లందరు , ఎంపెరుమాన్ శ్రేయస్సు గురించి ప్రార్థించారు. కాని  పిళ్ళైలోకాచార్యులు ,పెరియాళ్వార్ కు  ఎంపెరుమాన్ తో ఉన్న  విశేష సంబంధము మిగితా ఆళ్వాంర్లందరి తో ఉన్న సంబంధము కన్నా విశేష మైనదని నిరూపించారు. ఇదంతా వివరముగా క్రితము పెరియాళ్వారుల అర్చావతార వైభవమునందు వివరింపబడింది. http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-periyazhwar.html.

ప్రస్తుతం మనం పెరియాళ్వారుల అర్చావతార వైభవములోని 255వ సూత్రములో తెలుపబడ్ద  పెరియాళ్వార్ మరియు శ్రీభాష్యకారుల (రామానుజుల)వైభవమును పరిశీలిద్దాము.

అల్లాతవర్గలైప్ పోలే  కేట్కిఱావర్గళుడైయవుం , శొల్లుకిరావర్గళుతైయవుం తనిమైయైత్  తవిక్కైయన్నిక్కే ఆళుమాళార్  ఎంగిన్ఱవనుడైయ తనిమైయైత్ తవిర్కైక్కాగవాయిర్రు    భాష్యకారరుం ఇవరుం ఉపతేచిప్పత్తు. 

ఇతర ఆళ్వార్ల, ఆచార్యుల కన్న పెరియాళ్వారులు మరియు శ్రీభాష్యకారులు,  శాస్త్రం యొక్క అర్థ నిర్థేశకత్వముననుసరించి జీవాత్మలను సంస్కరించుట మరియు ఆ జీవాత్మలను ఎంపెరుమాన్ కు మంగళాశాసనములు చేయడానికి నిమగ్న పరిచి  సర్వేశ్వరుని చింతనను పోగొట్టారు(సాధారణంగా  సర్వేశ్వరుడు  సర్వులు తనకు కైంకర్యం చేయాలని భావిస్తాడు,  ఎందుకనగా జీవులందరు తన (వారు) ఆధీనులు, తల్లితండ్రులు తమ సంతానం తమ దగ్గర లేనప్పుడు ఎలాగైతే సంతోషంగా ఉండరో అలాగే సర్వేశ్వరుడు జీవాత్మలు తన దగ్గరకు రానప్పుడు అలా బాధ చెందుతాడు) .నిజానికి తమ దృష్ఠి సర్వేశ్వరుని ఒంటరితన్నాన్ని పోగొట్టుట కాదు  జీవాత్మ యొక్క చింతను పోగొట్టి  ఉజ్జీవింప చేయడమే- అయినను ఇది ఎంపెరుమాన్ యొక్క సహజమైన కోరిక ను తీర్చి జీవాత్మకు వాస్తవిక స్వరూపమును కల్గించును.

మామునులు ఈ సూత్రమునకు తమ వ్యాఖ్యానములో ఇలా వివరించారు- ఆళ్వార్లు  సర్వేశ్వరుని సున్నిత స్వభావం ఎరిగి అలాంటి స్వభావము కలవారు జీవాత్మలను వేరు పరుచుటను భరించలేక వారి దూరత్వము పైననే తమ దృష్ఠిని  ప్రసరింప చేస్తారని భావించారు.   పిళ్ళైలోకాచార్యుల వివరణలో – భాష్యకారులు(ఎంపెరుమానార్ మరియు శ్రీరామానుజులు అనే నామాలకు వ్యతిరిక్తముగా)అనే నామం శ్రీభాష్యం ద్వారా వేదసారాన్ని స్థాపించుటను బహిర్గతం చేస్తుంది-  ఆ నామ కార్యం వేదాంతమున  చెప్పినటుల  సర్వేశ్వరుని ఆనందముపైననే  దృష్ఠి నిల్పుట.

మామునులు తమ ఉపదేశరత్నమాలలో పెరియాళ్వార్ వైభవాన్ని వరుసగా ఐదు పాశురములలో వర్ణించారు.

 • 16వ పాశురమున తిరుపల్లాండు ద్వారా లోకాన్ని ఉజ్జీవింప చేసిన పట్టర్ పిరాన్(పెరియాళ్వార్)  అవతరించిన   ఆని(ఆషాడ-జ్యేష్ఠ) స్వాతి నక్షత్ర అతిశయాన్ని ఉపదేశంగా తమ మస్సును ఉద్దేశించి అనుగ్రహించారు
 • 17వ పాశురాన తమ మస్సును ఉద్దేశించి ఇలా అనుగ్రహించుకున్నారు –పెరియాళ్వార్  అవతరించిన   ఆని(ఆషాడ-జ్యేష్ఠ) స్వాతి నక్షత్రమును ఆదరించే ఙ్ఞానులు దీనికి సమానమైనది  ఈ పృథ్వీలో ఏదీ లేదు అని తెలుపుట ద్వారా దీని వైభవాన్ని ప్రకటిస్తున్నారు.
 • 18వ పాశురమున ఇలా అనుగ్రహించారు- సర్వేశ్వరుని యందున్న అతి అభినివేశముచే మంగళాశాసనం చేయడంలో మిగిలిన ఆళ్వార్ల కన్నా వీరికి ఉన్న గొప్ప భేధముచే వీరికి పెరియాళ్వార్ అనే తిరునామం కలిగినదని తెలిపారు.
 • 19వ పాశురమున ఇలా అనుగ్రహించారు- ఇతర ఆళ్వారుల(లోపభూయిష్ఠులు, కాని ఇక్కడ లోపమన్న-  ఇతర ఉపాయములైన కర్మ/ఙ్ఞాన/భక్తి లతో సంభంధము కల్గి ఉండుట  మరియు వాటితో సర్వేశ్వరుణ్ణి చేరాలని కోరిక లేకపోవుట)  పాశురాల ( లోపములు లేని – లోపమనగా భగద్విషయేతరములుండుట) కన్న వీరి మంగళాశాసన  తిరుపల్లాండు   ఎలాగైతే సంస్కృత వేదమునకు ఓం(ప్రణవం)  కారము సారము మరియు ఆదిగా  ఉండునో అలాగే ద్రావిడ దివ్యప్రబంధమునకు సారము మరియు ఆదిగా  కలదిగా ఏర్పడినది.
 • 20వ పాశురమున తమ మనస్సును ఇలా అడుగుతున్నారు- అన్నీ ప్రమాణాలను దృష్ఠి లో ఉంచుకొని మిగితా ప్రబంధములను పరిశీలించిన, వీరి ప్రబంధమైన తిరుపల్లాండు వైభవమును  , ఇతర ఆళ్వారుల జీవన  వైభముతో పోల్చిన  వీరి వైభవమునకు అవి సాటి వచ్చునా ?.

వీరికి మరో విలక్షణ  విశేషమేమనగా తమ కూతురైన ఆండాళ్ ను పెరియపెరుమాళ్ కి ఇచ్చి వివాహం చేసి వారికి మామగారైనారు.

ఇక వీరి చరితమును తెలుసుకుందాము

వేద పండితులు నివసించు శ్రీవిల్లిపుత్తూర్ అనే దివ్యదేశమున పెరియాళ్వార్ అవతరించిరి. ఆని(ఆషాడ-జ్యేష్ఠమాసం)  స్వాతి నక్షత్రాన  అవతరించినారు. వీరికి తల్లిదండ్రులు పెట్టిన నామధేయం విష్ణుచిత్తులు. ఎప్పుడైతే వీరు పరతత్వ నిరూపణ(శ్రీమన్నారాయణుని పరతత్వ స్థాపన చేశారో) చేశారో ఆనాటి నుండి వీరు,  వేదాత్మ(వేదమునే శరీరంగా కలవాడు) గా కీర్తింపబడు మరియు సదా శ్రీమన్నారాయణుని పాదారవిందములను(శ్రీమన్నారాయణుని పరత్వమునుస్థాపించునవి) మోయునో ఆ గరుడాళ్వార్(ఆళ్వారులు  ఈ సంసారము నుండి భగవానునిచే గైకొనబడి ఆశీర్వదింపబడినవారు)  అంశగా భావింపబడ్డారు.

ప్రహల్లాదుడు ఎలాగైతే జన్మతః భగవద్భక్తితోనే జన్మించారో అలాగే వీరు కూడ వటపత్రశాయి యొక్క నిర్హేతుక కృపచే కరుణించబడి,  భగవద్భక్తితోనే జన్మించారు. దీనినే శాస్త్రమున ఇలా తెలిపారు‘ నాఅకించిత్ కుర్వత చ శేషత్వం’ఎవైరైతే ఎంపెరుమాన్ కు కనీస కైంకర్యం కూడ చేయరో, వారికి శేషత్వం లేదు. దీనిననుసరించి పెరియాళ్వార్,   ఎంపెరుమాన్ కృపచే ఏదైన కైంకర్యములో నిమగ్నమవ్వాలని తలిచారు. అదే తడవుగా అన్నీ పురాణాలను  పరీశిలించారు. సర్వేశ్వరుడు  శ్రీకృష్ణునిగా మథురలో ఉన్నప్పుడు పేర్కొన్న వచనం.

ఏషః నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతనః |

నాగపర్యంకం ఉత్స్రుజ్యః  ఆగతో మథురాపురిమ్||  

క్షీరాబ్దిలో శయనించి ఉన్న శ్రీమన్నారాయణుడు తన శయ్య అయిన ఆదిశేషుణ్ణి తీసుకొని మథురలో శ్రీకృష్ణునిగా అవతరించాడు.

అలాగే నమాళ్వార్ కూడ “ మన్ననిన్ భారం నికుత్తర్కే వడమథురై పిరందన్”. దీనర్థం  – భూదేవి యొక్క భారమును తగ్గించుటకు కణ్ణన్ ఎంపెరుమాన్ మథురలో కనబడ్డాడు. మహాభారతంలో కూడ-   నిత్యం భగవానుడు  శ్రీకృష్ణుడి అవతారంలో ధర్మస్థాపనకై ద్వారకలో  నివసిస్తున్నాడు. సాధువులను దుర్మార్గుల నుండి రక్షిస్తున్నాడు.ఎంపెరుమాన్ అందమైన దేవకికి జన్మించి  యశోద దగ్గర పెరిగినాడు. సదా నిత్యసూరుల చే దివ్య పూమాలలచే అలంకరిపడిన ముగ్దమనోహర శ్రీకృష్ణుడు  కంసుని వద్ద పనిచేయు మాలాకరుని వద్దకు వెళ్ళి మాలలను అడిగాడు. స్వయంగా శ్రీకృష్ణుడు వచ్చి మాలలను అభ్యర్థించడం వల్ల ఆనందభరితుడైన ఆ మాలకారుడు శ్రీకృష్ణుడు ఆనందించేలా అందమైన పరిమళ భరిత మాలలను ఇచ్చాడు.  దీనిని  అవగ్రహణం చేసుకొనిన పెరియాళ్వార్ ప్రేమతో కట్టిన మాలలను సమర్పించుట ఉత్తమ కైంకర్యముగా భావించి ఆ రోజు నుండి శ్రీవిల్లిపుత్తూర్ లోని వటపత్రశాయి పెరుమాళ్ కు పూమాలలను సమర్పించ సాగారు.

.                       ఆ సమయాన పాండ్యవంశములో(మత్స్య పతకాన్ని మేరుపర్వతం పై స్థాపించిన రాజు)  ఉన్న రాజైన వల్లభదేవుడు పాండ్యనాడును మథురైను రాజధానిగా చేస్కని ధర్మానుసారంగా పరిపాలించసాగాడు. ఓ నాటి రాత్రి తన రాజ్య సుపరిపాలనా  కార్యాచరణ కై తన రాజ్యమున మారువేషములో తిరగసాగాడు, ఆ సమయాన ఒక బ్రాహ్మణుడు వేరొకరి గృహం వెలుపల కూర్చుండడం చూశాడు. అతనిని  పరిచయం చేస్కొని చిరునామా కోసం అడిగాడు.  దానికి ఆ బ్రాహ్మణుడు నేను గంగా స్నానము చేసి వస్తునన్నాడు. ఆ రాజు వాడిని బ్రాహ్మణుడిగా నిర్ణయంచేసుకొనుటకు  ఓ శ్లోకాన్ని పఠించమన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఈ శ్లోకాన్ని పఠించాడు.

వర్షర్థమస్తౌ ప్రయతేత మాసాన్ని చర్థతమర్థతం దివ్యసంయతేత |

వార్థక్య హేతోః వయసా నవేన పరార్థ హోతేరిహ జన్మనా చ||   

దీనర్థం -మానవులు  వర్షఋతువులో విశ్రాంతి కోసం మిగితా 8నెలలు శ్రమించాలి. రాత్రి సుఖనిద్రకు పొద్దున శ్రమ చేయాలి. వృద్ధ్యాపములో   విశ్రాంతి కోసం యవ్వనంలో శ్రమించాలి. శరీర అవసాన అనంతర   ఉజ్జీవనమునకై శరీరము ఉండగానే శ్రమించాలి.

ఆ మాటలు విన్న  ఆ రాజు   ఈ భౌతిక సంపదలు మరియు సుఖములతో హాయిగా ఉన్నాను కదా మరి అవసాన అనంతరం ఏమిటని ఆలోచనలో పడ్డాడు. శరీర అవసాన అనంతరం  దేనిని పొందాలి, దానిని ఎలా చేరాలి అనే విషయం తెలియలేదు. వెంటనే తమ రాజపురోహితుని దగ్గరకు వెళ్ళి పరతత్త్వ దైవము ఎవరు మరియు శరీర అవసానంతరం అతన్ని చేరుట ఎలా అని ప్రశ్నించాడు. శ్రీమన్నారాయణుని పరమ భక్తుడైన శెల్వనంబి,  వేదాంతాన్ని అనుసరించి పరతత్త్వనిరూపణకై విద్వాంసులందరిని సమావేశపరచాలని రాజుతో విన్నవించాడు. ఆ రాజు  విద్వాంసులందరిని ఆపస్తంబున్ని ప్రమాణ సూత్రమైన .” ధర్మఙ్ఞ యసమయః ప్రమాణం వేదాశ్చ”  అను దాని మీద నిజమైన పరతత్త్వ నిరూపణకై ఆహ్వానించాడు.

పరతత్వ నిరూపనకు వేద కార్యం తెలిసిన వేదఙ్ఞులు ప్రథమ ఆధారం మరియు వేదం ద్వితీయాధారం. ఆ రాజు చాలా ధనమును   వస్త్రపు మూటలో పెట్టి ఎవరైతే వేద ప్రతిపాద్యున్ని నిరూపణగా తెలుపుతారో వారికి అందడానికి  ఆధారం(ceiling)  పై వ్రేలాడ దీశాడు. వివిధ ప్రదేశములనుంచి వివిధ విద్వాంసులను వాదనకై సమావేశ పరిచాడు.

వటపత్రశాయి పెరుమాళ్(శ్రీవిల్లిపుత్తూర్), పెరియాళ్వార్ ద్వారా  తన   సిద్ధాంత(వేదం ప్రతిపాందిచినటుల)స్థాపనచేసి ఈ సంసారులను ఉజ్జీవింపచేయడానికి  వారి స్వప్నమున సాక్షాత్కరించి వల్లభదేవుని సభకెళ్ళి   శుల్కమును పొందుమని ఆఙ్ఞాపించారు. పెరియాళ్వార్  వినయంగా ఇలా సమాధాన మిచ్చారు ‘ఆ శుల్కం  వేదాంతం ద్వారా సిద్ధాంత స్థాపన చేసిన వారి కదా, కాని  నేను తోట పని చేయడం వల్ల కఠినంగా తయారైన నాచేతుల ద్వారా దానిని  ఎలా సాధించగలను?’  ఎంపెరుమాన్ ఆళ్వార్ కు ఇలా సమాధాన పరిచారు ‘ వేదప్రతిపాదనలో దానర్థ ప్రతిపాదనలోను నేను మీకు   సహాయపడగలను’.  ‘బ్రహ్మముహూర్తే చ ఉత్థాయ’ అని  శాస్త్రంలో చెప్పిన విధంగా ఆళ్వార్, తెల్లవారుజాముననే మేల్కొన్నారు. దీనర్థం  తెల్లవారుజామున బ్రహ్మముహూర్తాన(సుమారు 4గంటలకు) విధిగా మేల్కొనాలి. ఆ స్వప్నము నుండి తేరుకొని తన నిత్యానుష్ఠానములను ముగించుకొని ఆ వల్లభ రాజు ఉన్న మథురై కి బయలు దేరారు పెరియాళ్వార్ .బ్రాహ్మాణోత్తముడైన ఆ పెరియాళ్వార్  మథురకు చేరుకోగానే శెల్వనంబి మరియు ఆ రాజు ఆళ్వార్  కు వినమ్రతతో ఆహ్వానపరిచారు. స్థానిక పండితులు  రాజుకు ఈ పెరియాళ్వార్  చదువురాని వాడని తెలిపారు. ఈ  విషయము ముందే తెలిసిన వారు  వటపత్రశాయికి అంకితభావముతో కైంకర్యముచేయు  ఆ పెరియాళ్వార్ ని  గౌరవ మర్యాదలతో  సత్కరించి , వేదాంతమాధారంగా తత్వప్రతిపాదనను చేయమన్నారు.ఎంపెరుమాన్ దివ్యాశీస్సులతో వేదం, వేదార్థం ,ఇతిహాసం, పురాణముల యొక్క సారాన్ని గ్రహించారు పెరియాళ్వార్. ఎలాగైతే శ్రీవాళ్మీకి బ్రహ్మ అనుగ్రహంవల్ల , శ్రీ ప్రహల్లాదుడు భగవానుని శ్రీపాంచజన్య స్పర్శవల్ల ఙ్ఞానాన్ని పొందినారో అలా వీరుకూడ పొందినారు. ఎంపెరుమాన్ యొక్క నిర్హేతుక కృప వల్ల పెరియాళ్వార్ వేదసారమగు  శ్రీమన్నారాయణుడే  పరతత్వమని గ్రహించారు.

తర్క విధానంలో దీని ప్రమాణాలు.

సమస్త శబ్దమూల త్వాద్ అకారస్య స్వభావతః

సమస్త వాచ్య మూలత్వాత్ బ్రహ్మణోపి స్వభావతః

వాచ్య వాచక సంబంధస్తయోః  అర్థాత్ ప్రదీయతే. 

అన్నీ శబ్దములు సహజంగా ‘అ’ అక్షరం నుండి జనించును. ఆ శబ్దం యొక్క సమస్త అర్థములు సహజముగా బ్రహ్మం నుండి జనించును. కావున  అక్షరం మరియు బ్రహ్మం మధ్య సంబంధముకూడ సహజ సిద్ధమని తెలియును.

భగవద్గీతలో గీతాచార్యుడు  తనను తాను ఇలా నిర్ణయించుకున్నాడు” అక్షరాణామకారోస్మి” – నేను  అన్నీ అక్షరములలో అకార వాచ్యుడను.

“అకారో విష్ణువాచకః” అను ప్రమాణమును అనుసరించి అకారం  పరతత్వమగు శ్రీమన్నారయణుని  తెలుపు విష్ణు వాచక శబ్దం.

తైత్తరీయోపనిషద్ శ్రీమన్నారయణుని విశేషగుణములను ఇలా తెలిపినది

యతో వా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతి తత్ విఙ్ఞానస్య తత్ బ్రహ్మేతి.   

సమస్త విశ్వం మరియు ప్రాణులు దేనినుండి ఉద్భవిస్తాయో , ఏ విశ్వం దేని ఆధారంగా కొనసాగుతుందో,  లయమందు దేనిలో విలీనమవుతుందో, ప్రాణులు చేరవలసిన మోక్షమును చేరునో అదే బ్రహ్మముగా తెలుపబడుతుంది. కావున జగత్తు కారణత్వం (విశ్వం సృజనకాధారం)  ముముక్షు ఉపాస్యత్వ(మోక్షమును పొందుటకు ఆరాధించవలసిన వస్తువు)  మరియు మోక్షప్రదత్వ ( జీవాత్మకు మోక్షమును అనుగ్రహించు సామర్థ్యం గల) ములు పరతత్వమునకు ఉన్న ముఖ్యమైన గుణములని తెలుపబడింది.

ఆ గుణములన్నీ శ్రీమన్నారాయణుని యందు చూడవచ్చని ప్రమాణం

vishnNOs sakAchAdhudhbhUtham jagath thathraiva cha sthitham
sthithi samyamakarththAsau jagathOsya jagachcha sa:

 విష్ణోః సకాచాత్ ఉద్భుతం జగత్ తత్రైవ చ స్థితం|

స్థితి సమ్యకర్తాసౌ జగతోస్య జగత్ చ సః ||

విష్ణుపురాణమున తెలిపినటుల , ఈ విశ్వం  విష్ణువు నుండి సృజించబడును, ప్రళయమున(సృష్ఠి లేనప్పుడు)   విష్ణువు నందు చేరును; ఇతనే నిర్వహించును మరియు అంతమొందిచును; విశ్వమునంతయు తన శరీరముగా కలవాడే శ్రీమహావిష్ణువు.

నారాయణాత్ పరో దేవో న భూతో నభవిష్యతి|

ఏతత్ రహస్యం వేదానామ్  పురాణానామ్ చ సమ్మతమ్||

వరాహపురాణములో చెప్పినటుల నారాయణునికి సమమైన లేదా  అధికమైన  దైవం భూతకాలమున లేదు భవిష్యత్ కాలమున ఉండబోదు. ఇది అతి గుహ్యమైన రహస్యంగా వేదంలో చెప్పబడింది అలాగే పురాణాల్లో కూడ.

సత్యం సత్యం పునస్సత్యం ఉద్ధృత్వ బుధముచ్యతే |

వేదాశాస్త్రం పరం నాస్తి న దైవం కేశవాత్పరం ||

నారదపురాణములో  వ్యాసభగవానుడు వివరించినటుల, “నేను ముమ్మారులు చేతులెత్తి నిర్ణయిస్తున్నాను (ఉద్ఘోషిస్తున్నాను) కేశవుని కన్న పరమైన (అధికమైన) దైవం  లేదు వేదం కన్న పరమైన  శాస్త్రం లేదు”.

ఇలా పెరియాళ్వార్ శ్రీమన్నారాయణుని పరత్వమును పైన చెప్పిన ప్రమాణాలను మరియు శ్రుతుల నుండి ఇతిహాసముల నుండి , పురాణముల నుండి ఉట్టంకిస్తు నిర్ణయించారు. పిదప ఆ సంపద ఉన్న మూట ( గెలిచిన వారి బహుమతి) దైవ సంకల్పముగా పైనుండి కిందపడగా పెరియాళ్వార్ దానిని గ్రహించారు.

ఇదంతా గమనించిన ఆ పండితులు, ఎవరైతే ఆళ్వార్ ను తిరస్కరించారో వారు మరియు  ఆ మహారాజు చాలా ఆనందముతో వారి నమస్సులను అందించారు పెరియాళ్వార్ కు . వారందరు పెరియాళ్వార్,   వేదాంతము యొక్క సారాన్ని విస్పష్ఠంగా విశేష ప్రభావముగా వెల్లడించారని ఆనందించారు.  వారికి ఉత్సవ గజం పై  గొప్ప ఊరేగింపును ఏర్పాటు చేశారు. మిగితా పండితులందరు ఛత్రచామరలు చేతిలో ధరించిరి. వారు ఇలా ప్రకటించసాగిరి “అత్యంత ప్రమాణముగా వేద సారమును తెలిపి కీర్తిని పొందిన వారు వేంచేస్తున్నారు”అని.     వల్లభదేవుడు ఙ్ఞానవిశేషములను అనుగ్రహించిన పెరియాళ్వార్ ను భట్టర్(గొప్ప పండితులు) లకు విశేషఉపకారకులు అనే అర్థం వచ్చే “పట్టర్ పిరాన్” అను బిరుదనామంతో సత్కరించారు. అంతటా విశేష ఉత్సముగా జరుగు ఆ  ఊరేగింపులో ఆ రాజు కూడ పాల్గొన్నారు.

pallandu

 

తమ సంతానానికి జరుగు విశేష కీర్తి మర్యాదలో బహు ఆనందముతో తల్లి తండ్రులు పాల్గొని నటుల పరమపదనాథుడు కూడ  ఆ విశేష ఉత్సవములో పాల్గొనదలిచారు. తమ పట్టపురాణి అగు మహాలక్ష్మి(శ్రియః పతిత్వం – పిరాట్టికి భర్త అగుటయే అతనికి ప్రథాన గుర్తింపు)  తన అభిమానమగు గరుడ వాహనంపై  తమ తిరువాభరణములగు పాంచజన్యం మరియు శ్రీసుదర్శనాళ్వార్ తో ఆకాశాన  వేంచేసిరి.ఆళ్వార్ ను దర్శించుటకు ఎంపెరుమాన్ మరియు ఈ లౌకిక జగత్తుకు దేవతలైన బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు వారి వారి కుటుంబము మరియు సహచరులతో విచ్చేసిరి.  ఎంపెరుమాన్ ద్వారా కృపచేయబడ్డ  పెరియాళ్వార్, వేంచేసిన శ్రీమన్నారాయణుని మరియు ఇతరులను సేవించసాగిరి. వారు ఆ ఉవిశేష ఉత్సవమును ఆనందగర్వముతో  అనుభవించక ఎంపెరుమాన్ ను చూడగానే  ఈ లౌకిక జగత్తునందు ప్రత్యక్షమైన  ఎంపెరుమాన్ గురించి చింతించ సాగిరి.భగవంతుని అనుగ్రహము వల్ల పెరియాళ్వార్ , శ్రీమన్నారాయణుడు సర్వఙ్ఞుడు ,సర్వరక్షకుడు అని తెలుసుకున్నారు. ఎవరి ప్రోద్భలం లేకుండానే తమంతగ తామే ఎంపెరుమాన్ మీద అనురాగంతో భగవానుని వాత్సల్యం, కోమలస్వభావంపై చింతించసాగిరి. శాస్త్రంలో   చెప్పినటుల   ఎంపెరుమాన్ దివ్యమంగళ విగ్రహం పంచోపనిషద్  తో తయారైనదని, అతను సదా దివ్యఋషులు, దేవతలు మరియు బ్రహ్మరుద్రాదులు కూడ చేరుకోలేని పరమపదంలో నిత్యసూరులచే నిరంతరం అనుభవింపబడతాడని తెలుసుకున్నాడు.

ఎంపెరుమాన్ తన దివ్య లోకాన్ని వదలి అఙ్ఞానము మరియు రాక్షసత్వం  కలిగిన లోకులున్న,  కలి పరిపాలిస్తున్న ఈ యుగపు భౌతిక లోకమునకు వచ్చాడు కాన   వారి దివ్యమంగళ విగ్రహానికి ఏదైన దృష్ఠిదోషం కలుగునో అని కలతచెంది వారి రక్షణ కోసం   మంగళం పాడుదామని తాను కూర్చున్న గజానికి ఉన్న గంటలను తీసుకొని భవవానునికి మంగళాశాసన రూపాన ‘ తిరుపల్లాండు’ ను పాడారు.ఎంపెరుమాన్ సర్వస్వతంత్రుడు, సర్వసమర్థుడు అనే విషయాన్ని మరియు తన స్వరూపమగు పారతంత్ర్యమును కూడ మరచిపోయాడు పెరియాళ్వార్. ప్రేమ పరాకాష్ఠచే అందరిని(ఐశ్వార్యార్థి- సంపద పై కోరిక ఉన్న వారు, కైవల్యార్థి- ఆత్మానుభవం పై కోరిక ఉన్నవారు,భాగవత శరణార్థి-ఎంపెరుమాన్  ఆంతరంగిక కైంకర్యం పై కోరిక ఉన్న వారు)తనతో సహా ‘తిరుపల్లాండు’ను పాడుటకు  ఆహ్వానిస్తున్నారు పెరియాళ్వార్ . శ్రీమన్నారాయణుడు ఉత్సావానంతరం తన దివ్యధామమునకు ఆనందముతో తిరిగి వెళ్ళాడు.

అనంతరం పెరుయాళ్వార్ రాజును ఆశీర్వదించి అతనిచే గౌర్వమర్యాదలు స్వీకరించారు. తిరిగి మళ్ళీ శ్రీవటపత్రశాయికి కైంకర్యము చేయిటకు శ్రీవిల్లిపుత్తూర్ నకు వచ్చి భగవంతుని  ద్వారా వల్లభదేవుని చే ఇవ్వబడ్డ ఆ  సంపదనంతటిని  భగవదర్పితం చేశారు.

మనుస్మృతిననుసరిచి:

త్రయేవాదన రాజన్ భార్య దాస తధా సుతః|

యత్తే సమాధి గచ్చంతి యస్యైతే తస్య తద్ధనం ||

భార్య, సుతుడు, సేవకులు స్వతాహాగా తాము ఏమి ఆర్జించేవారు కాదు,సంపదంతయు తమ సంబంధ యజమానిదే(భర్త,అధికారి మరియు తండ్రి).

దీనిననుసరించి పెరియాళ్వార్  తన సర్వస్వంను  తన అధికారి యగు వటపత్రశాయి సమర్పించి ఇలా అన్నారు “ ఈ సంపాదించినదంతా మీ అనుగ్రహము వల్లనే కావున ఇదంతా మీకు చెందవలసినదే” .  పెరియాళ్వార్  తమ మీద ఉన్న ఈ కార్యమును పూర్తికాగానే  శ్రీమాలాకారుడు శ్రీకృష్ణునకు  అందమైన మాలలను సమర్పించినటుల  తానుకూడ నిత్యము చేయు మాలా కైంకర్యమును వటపత్రశాయికి ప్రేమాతిశయముచే   వివిధరకాల పూలతో రకరకాల మాలలను కట్టి  సమర్పించసాగిరి.    పెరియాళ్వార్ కు బాల్యను నుండి అంతిమము వరకు శ్రీకృష్ణుని చరితం  యందు అత్యంత అభిమానము కలిగి ఉండి తాము యశోదగా భావన చేసుకొని భగవానుని సౌశీల్యం(ఔదార్యం)  మరియు  సౌలభ్య ములను (సులభంగా లభించువాడు) అనుభవించిరి.

పొంగి పొరులుతున్న ప్రేమాతిశయ భావనలచే వారు  ‘పెరియాళ్వార్ తిరుమొజి’ అనే దివ్య ప్రంబంధాన్ని  అనుగ్రహించారు. తమ భావనలో సదా శ్రియఃపతిని స్మరించేవారు. తమను  ఆశ్రయించిన  శిష్యులను మరియు అభిమాలను  అనుగ్రహించి దిద్దుబాటు ద్వారా ఉజ్జీవింపచేసిరి.

వీరి తదుపరి  దివ్య చరితమును ఆండాళ్  చరితములో http://guruparamparai.wordpress.com/2012/12/16/andal/.  కూడ సేవించవచ్చు

వీరి తనియన్

గురుముఖ మనధీత్య ప్రాహ వేదానశేషాన్
నరపతి పరిక్లుప్తం శుల్కమాధాతుకామ: |
శ్వశురమమరవంధ్యం రంగనాథస్య సాక్షాత్
ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి ||
వీరి అర్చావతార అనుభవం క్రితమే ఇక్కడ వివరించబడింది. http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-periyazhwar.html.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

ఇవన్నీ archived in http://guruparamparai.wordpress.com, మరియు http://ponnadi.blogspot.in/,http://srivaishnava-events.blogspot.com నందు భద్ర పరచబడ్డాయి

ఆధారం : ఆరాయిరపడి వాఖ్యానం ,గురుపరంపర ప్రభావం, పెరియ తిరుముడి అడైవు.

Source:

Advertisements

తిరుమంగైఆళ్వార్

శ్రీః

శ్రీమతేరామానుజాయనమః

శ్రీమద్వరవరమునయే నమః

శ్రీ వానాచల మునయే నమః

thirumangai-azhwar

తిరునక్షత్రం : కార్తీక మాస కృత్తికా నక్షత్రం

అవతార స్థలం  : తిరుక్కురయలూర్

ఆచార్యులు : విశ్వక్సేనులు, తిరునరయూర్ నంబి, తిరుకణ్ణపురం శౌరిరాజ పెరుమాళ్

శిష్యగణం:  తమ బావమరిది ఇళయాళ్వార్, పరకాల శిష్యులు, నీర్మేళ్ నడప్పాన్(నీటి పైన నడిచే వాడు), తాళూదువాన్(తాలములను నోటితో ఊది తెరిచేవాడు), తోళావళక్కన్(జగడములు చేసి ధనమును రాబట్టే వాడు), నిలలిళ్ ఒదుంగువాన్(నీడలో ఒదిగి పోయేవాడు), నిజలిళ్ మరైవాన్, ఉయరత్ తొంగువాన్(ఎంత ఎత్తుకైన ఎక్కేవాడు)

రచనలు/కృతులు: పెరియ తిరుమొళి, తిరుక్కురుదాణ్డగం, తిరువెజుకూత్తిరుకై, శిరియ తిరుమడళ్, పెరియతిరుమడళ్, తిరునెడుదాణ్డగం.

తిరునాడలకరించిన దివ్యదేశం: తిరుకురుఙ్గుడి

పెరియవాచ్చాన్ పిళ్ళై శాస్త్ర సారమగు తమ పెరియ తిరుమొళి అవతారిక లో,  తిరుమంగైఆళ్వార్ ను  ఇలా అనుగ్రహించినారు.  ఎంపెరుమాన్(భగవంతుడుతన నిర్హేతుకకృప వలన ఆళ్వార్ ని సంస్కరిచినారు మరియు అతని ద్వారా అనేక జీవాత్మలు కూడా ఉద్ధరించబడినాయిదానిని పరిశీలిద్దాము.

          తిరుమంగైఆళ్వార్ తమ ఆత్మను(తమను తాము) మండే సూర్యుని యందు మరియు తమ దేహాన్ని మాత్రము చల్లని నీడలో ఉంచినారు. దీనంతరార్థము మండేసూర్యుని యందుంచుట అనగా భగవద్విషయములందు(ఆధ్యాత్మిక విషయములందు)  లగ్నము కాకపోవడం , తమ దేహాన్ని మాత్రము చల్లని నీడలో ఉంచినారనగా అనాదిగా భౌతిక విషయములందు   కోరికలుకలిగి అదే తమ జీవిత లక్ష్యం అని అనుకొన్నారు.  నిజమైన ఛాయ (నీడ) భగవద్విశయము కావుననే వాసుదేవ తరుచ్ఛాయ ( वासुदेव तरुच्छाय) దీనర్థం వాసుదేవుడు  (శ్రీకృష్ణభగవానుడు) నిజమైన ఛాయ అనుగ్రహించే వృక్షం.  తానే నిజమైన చల్లని  ఛాయ అనుగ్రహించు వృక్షం , ఈ  చల్లని  ఛాయ మనలను సదా సర్వదేశ సర్వ కాలము నందు రక్షించునది, మన తాపమును ఉపశమింపచేయునది మరియు ఇది  అతి శీతలమైనది కాదు అతి వేడియైనది కాదు. తిరుమంగైఆళ్వార్ ఏవైతే భౌతిక సుఖాన్ని అందిస్తాయో ఆ విషయాంతరముల యందు (భౌతిక కోరికలు)బహు ఆసక్తిని కలిగి ఉండెడివారు. కాని ఎంపెరుమాన్ తిరుమంగైఆళ్వార్  ని  విషయాంతరముల నుండి   దివ్యదేశములలో వేచేంసి ఉన్న తమ అర్చావతార వైభవమును ప్రదర్శించగా ఆళ్వార్ ఆ అర్చావతార వైభవమును తమ హృదయము నిండా   ఆనందంగా అనుభవించి ఆరూపమును వదలి క్షణకాలమైనను ఉండలేక విరహమును అనుభవించిరి.  తర్వాత ఎంపెరుమాన్  ఆళ్వార్ ని భౌతిక సంసారములో ఉన్నను  నిత్యముక్తుల అనుభవ స్థాయికి తీసుకెళ్ళి పరమపదమును అనుభవించేలా చేసి చివరకు పరమపదమును అనుగ్రహించిరి.

ఆళ్వార్  భగవంతుడు తమ అద్వేషత్వం పరిశీలిస్తున్నారని  భావించారు(భగవంతుడు ఈ జీవాత్మను అనాదిగా  సర్వవేళల యందు రక్షించుటకు ప్రయత్నించగా జీవుడు దానిని తిరస్కరిస్తుంటాడు.  ఎప్పుడైతే ఈ జీవుడు తిరస్కరించకుండా ఉంటాడో ఆ స్థితి చాలు భగవానునికి వీడిని ఉద్ధరించడానికి  –  అధికారి విశేషణములో జీవుని ఈ సహజ  స్వభావాన్ని అద్వేషం  అంటారు.) భౌతికవిషయాల పరిమితులను  సంస్కరించాలని, ఆళ్వార్ యొక్క  భౌతికవిషయముల యందు ఆసక్తిని ఆసరాగా ( భగవంతుని వైపు ఆసక్తి కలిగేలా) , ఆళ్వార్ కి అనాదిగా వస్తున్న పాపములను తమ కృపతో      తొలగించడమే   లక్ష్యంగా  ఎంపెరుమాన్ ప్రథమంగా తిరుమంత్రాన్ని ఉపదేశించారు మరియు తమ స్వరూప(నిజ స్వభావం) రూప(అవతారములు)  గుణ(దివ్య లక్షణములు) మరియు విభూతి(నాయకత్వ  సంపద) లను దర్శింపచేశారు.ఆళ్వార్  భగవంతుని కృపకు  పాత్రుడైనప్పుడు  అతనికి కృతఙ్ఞతగా   తమ పెరియతిరుమొజిలో   తిరుమంత్రాన్ని కీర్తించసాగిరి. ఇది చిత్(ఙ్ఞానము కల) యొక్క  స్వరూమైన ఙ్ఞానోదయం, జడత్వం తొలగిన ఙ్ఞానం కాని వాటిని అభినందించడం మాత్రము కాదు.  ఆళ్వార్  దీనికి తమ కృతఙ్ఞతను ప్రదర్శిస్తూ అర్చవతార వైభవాన్ని కీర్తించిరి చాలా ప్రబంధములలో.

 పెరియవాచ్చాన్ పిళ్ళై ఎంపెరుమాన్ నిర్హేతుక కృప( కారణ రహిత కృప) ను ఆళ్వార్  యొక్క ఉపాయ శూన్యత్వం (  ఎంపెరుమాన్ దయ పొందుటకు అనుకూల చర్యా ప్రదర్శన లోపించుట) ను తమ వ్యాఖ్యాన అవతారికలో స్థాపించారు. కాని ఆళ్వార్  ఎప్పుడైతే  ఎంపెరుమాన్ దివ్య కృపచే అనుగ్రహింపబడినారో ఈ ఎంపెరుమాన్  ప్రతిగా  ఈ సంబంధము అసమానమైనదని తమ పెరియ తిరుమొజి 4..9.6 యందు    నుమ్మఅడియారోడుమ్ ఒక్క ఎన్నానియిరుత్తిర్  అడియేనై “–   నన్ను ఇతర దాసుల వలె పరిగణించరాదు.

మనం ఇప్పటికే ఆళ్వార్ యొక్క స్తుతిని  పెరియవాచ్చాన్ పిళ్ళై  మరియు మామునుల ఎలా వర్ణించారో http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-thirumangai.htmlనందు చాశాము.  

తిరువరంత్తఅముదనార్ తమ రామానుజ నూత్తందాది 2వ పాశురంలో  ఎంపెరుమానార్ (శ్రీ రామానుజులు) ను  “ కురయళ్ పిరాన్  అడిక్కీళ్ విల్లాద అన్బన్” గా ప్రకటించిరి. దీనర్థం-  ఎవరైతే (శ్రీరామానుజులు)  తిరుమంగై ఆళ్వార్ తిరువడి తో వెనుదీయని  సంబంధము  కలవారో .

మామునులు తిరువాలి-తిరునగరి దివ్య దేశమును సందర్శించినప్పుడు ఆళ్వార్ దివ్యతిరుమేని సౌందర్యమునందు(రూప సౌందర్యము) ఈడుపడి ఒక పాశురాన్ని ఆశువుగా అనుగ్రహించినారు.ఆ పాశురం ఆళ్వార్ దివ్యత్వమును కళ్ళముందుం చుతుంది. దానిని మనం ఇప్పుడు అనుభవిద్దాం.   

thiruvali_kaliyan

anNaiththa vElum, thozhukaiyum, azhuNthiya thiruNAmamum,
OmenRa vAyum, uyarNtha mUkkum, kuLirNtha mukamum,

paraNtha vizhiyum, irunNda kuzhalum, churunNda vaLaiyamum,
vadiththa kAthum, malarNtha kAthu kAppum, thAzhNtha cheviyum, 
cheRiNtha kazhuththum, aganRa mArbum, thiranNda thOLum,
NeLiththa muthugum, kuviNtha idaiyum, allikkayiRum, 
azhuNdhiya chIrAvum, thUkkiya karunGkOvaiyum,
thonGgalum, thani mAlaiyum, chAththiya thiruththanNdaiyum,
chathirAna vIrakkazhalum, kuNthiyitta kanNaikkAlum,
kuLira vaiththa thiruvadi malarum, maruvalartham udal thunNiya 
vALvIchum parakAlan manGgaimannarAna vadivE enRum

అనైతధ వేలుం, తొజుకైయుం అజుంతియ తిరునామముం

ఒమెన్ఱ వాయుం ఉయరంద ముఖం, కుళిరింద ముఖముం

పరంద విషుయుం , ఇరుంద కుశలుం చురంద వళైయముం

వడిత్త కాతుం , మలరంద కాత్తు  కాప్పుం, తజంద చెవియుం.

చెరింద  కజుత్తతుం అగన్ఱ మార్బుం  తిరంద తోలుం

నెళితధ ముత్తుగుం కువింద ఇడైయుం  అల్లిక్కయిరుం

అజుందియ చ్లరావుం , తుక్కైయ కరుంగకోవైయుం

తొంగగలుం , తని మాలైయుం. చత్తతియ తిరుత్తన్నాడైయుం  ,

చతిరాన వలర్కజలుం కుంతియిట్ట కన్నైక్కాలుఁ

కుళిర వైత్త తిరువాడి మలరుం  , మరువలర్తం  ఉడళ్  తునియ

వాళ్ విశుం  పరకాలన్ మంగైమన్నారాన వడివే ఎన్ఱుం

அணைத்த வேலும், தொழுகையும், அழுந்திய திருநாமமும்,
ஓமென்ற வாயும், உயர்ந்த மூக்கும், குளிர்ந்த முகமும்,
பரந்த விழியும், இருண்ட குழலும், சுருண்ட வளையமும்,
வடித்த காதும், மலர்ந்த காது காப்பும், தாழ்ந்த செவியும், 
செறிந்த கழுத்தும், அகன்ற மார்பும், திரண்ட தோளும்,
நெளித்த முதுகும், குவிந்த இடையும், அல்லிக்கயிறும், 
அழுந்திய சீராவும், தூக்கிய கருங்கோவையும்,
தொங்கலும், தனி மாலையும், சாத்திய திருத்தண்டையும்,
சதிரான வீரக்கழலும், குந்தியிட்ட கணைக்காலும்,
குளிர வைத்த திருவடி மலரும், மருவலர்தம் உடல் துணிய 
வாள்வீசும் பரகாலன் மங்கைமன்னரான வடிவே என்றும்

పరకాలులు/మంగైమన్నన్(మంగై అనే ప్రదేశానికి రాజు)దివ్య రూపము సదా నామనస్సులో నిలుపుకుంటాను. ఈ రూపమును ఇలా వ్యాఖ్యానించారు   బల్లెమునకు ఆధారమైన ఆ దివ్య భుజములు,ఎంపెరుమాన్ ను ఆరాధిస్తున్న ఆ శ్రీ హస్తములు, దివ్య ఊర్ధ్వ పుండ్రములు, ప్రణవాన్ని ఉచ్ఛరిస్తున్న ఆ  నోరు, కొద్దిగా ఎత్తై మొనదేలిన నాసికాగ్రం, ప్రశాంత వదనం, విశాల నేత్రములు, వంపులు తిరిగిన నల్లని కురులు,కొద్దిగా ముందుకు వంగి(ఎంపెరుమాన్  వద్ద తిరుమంత్రము శ్రవణం చేయడానికి) తీర్చిదిద్దిన కర్ణములు,గుండ్రని అందమైన మెడ, విశాల వక్షస్థలం, బలమైన బాహుద్వయం ,అందంగా తీర్చిన వీపు పైభాగం,   సన్నని కటిభాగం, అందమైన పూమాల,    అద్భుతమైన అందెలు, వినయాన్ని ప్రదర్శిస్తున్ననట్లుగా వంగిన మొకాళ్ళు ,కొద్దిగా వ్యత్యాసంగా ఉన్న పాదారవిందములు, శత్రువులను సంహరించు ఖడ్గం,  తిరువాలితిరునగరిలో వేంచేసి ఉన్న ఈ కలియన్  అర్చామూర్తి మొత్తం సృష్ఠిలోని  విగ్రహములో కెల్ల అందమైనదని మనం సులువుగా నిర్ధారణచేయవచ్చు.

ఆళ్వార్ ఈ తిరునామాలతో కూడా పరిగణింపబడేవారు,   పరకాలన్(ఇతర మతస్థులకు కాలుల(యముని) వంటివారు), కలియన్(కాలుల వంటివారు), నీలుడు (నీలవర్ణ దేహచ్ఛాయ కలవారు), కలిధ్వంసులు(కలిని నశింపచేయువారు), కవిలోక దివాకరులు(కవి లోకానికి సూర్యులవంటివారు),చతుష్కవి శిఖామణి(నాలుగురకాల కవిత్వంలో ఆరితేరినవారు), షట్ప్రబంధ కవి(ఆరు ప్రబంధములను కృపచేసిన కవి), నాలుకవి పెరుమాళ్,  తిరువాల్వురుడయ పెరుమాన్(గొప్ప కత్తి గల ఉపకారకులు), మంగైయార్ కోన్(మంగైదేశానికి రాజు), అరుళ్ మారి(వర్షాకాలపు వర్షంలాగా కృపను వర్షించేవారు), మంగైవేందన్(మంగదేశానికి అధికారులు), ఆళినాడన్(ఆడళ్ మా అను పేరుగల గుర్రానికి అధికారి), అరట్టముఖి, అడయార్ శియం(పరమతస్తులను దగ్గరకు రానివ్వని సింహం),  కొంగు మాలార్క్ కుజలియర్ వేళ్, కొర్చ వేందన్(గొప్పరాజు), కొరవిళ్ మంగై వేందన్(ఏ కొరతాలేని మంగైరాజు).

వీటిని మనస్సులో నిలుపుకొని ఆళ్వార్ చరితమును తెలుసుకుందాము.

ఆళ్వార్ కార్ముఖ  (కుముద గణము)  అంశావతారంగా తిరుక్కురయలూర్ లో(తిరువాలి-తిరునగరి సమీపాన) చతుర్థ వర్ణమున  నీలుడు(నల్లని దేహచ్ఛాయ కలిగిన) అనే నామథేయంతో అవతరించిరి అని గరుడ వాహ పండితుని దివ్యసూరిచరితమున కలదు.

                        వీరి బాల్యమంతా భగవద్విషయ సంబంధము  లేకుండానే గడిచిపోయినది. కాలక్రమేణ పెరిగి యువకుడయ్యాడు. కాని భౌతిక విషయాలయందు ఆసక్తి కలవాడయ్యాడు. శరీరమును బాగా బలిష్ఠంగా పెంచాడు . కుస్తీలో  మెలుకువలు బాగా నేర్చాడు. ఏదైన ఆయుధాన్ని ప్రయోగించగల సామర్థ్యాన్ని సంపాదించి చోళరాజు వద్దకు వెళ్ళి తన సామర్థ్యానికి అనుగుణంగా  సైన్యంలో భాగత్వం ఇవ్వాలని అడిగాడు. చోళరాజు నీలుని సామర్థ్యానికి అనుగుణంగా  సైన్యాదక్ష్యుడిగా నియమించి పాలించడానికి ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు.

                        ఒకానొక సమయాన తిరువాలి దివ్యదేశమున ఉన్న అందమైన సరోవరంలో అప్సరసస్త్రీలు( దేవలోక నాట్యగత్తెలు) జలకాలాడటానికి దిగారు. వారిలో తిరుమామగళ్ (కుముదవల్లి)అనే కన్య పుష్ప సంచయనానికి వెళ్ళగా తన స్నేహితురాళ్ళు ఈ కన్యను మరచి వెళ్ళి పోయారు. తాను మనుష్యకన్యగా మారి సహాయార్థం ఎదురు చూడసాగింది. ఆ సమయాన ఆ మార్గాన ఒక శ్రీవైష్ణవ వైద్యుడు వెళ్ళుతు ఈ అమ్మాయిని చూసి వివరములడుగగా  తనను తన  స్నేహితులు వదిలి వెళ్ళిన వృత్తాంతమును వివరించినది. ఆ వైద్యుడు సంతానహీనుడు  కావున ఈ అమ్మాయిని సంతోషంగా తీసుకొని తన గృహమున కెళ్ళి తన భార్యకు పరిచయం చేశాడు. దీనికి అతని భార్య సంతసించి ఆ అమ్మాయిని తమ కూతురిలా పెంచసాగిరి..  ఆ అమ్మాయి అందాన్ని చూసిన వారు ఆ అమ్మాయి గురించి  నీలునికి వివరించారు. నీలుడు ఆమె అందానికి ముగ్ధుడై  ఒకసారి ఆ భాగవత వైద్యుని  దగ్గరకు వెళ్ళి  మాటాలాడాడు.

                        ఆ సమయాన కుముదవల్లి విషయాన ఆ వైద్యుడు నీలునితో ఈ అమ్మాయి వివాహము గూర్చి చెబుతూ ఆమె యొక్క కులగోత్రములు తెలియవని వివరిస్తాడు. నీలుడు ఆ అమ్మాయిని వివాహమాడుతానని చాలా సంపదలను కూడా ఇస్తానని చెబుతాడు. ఆ వైద్య దంపతులు సంతోషముగా ఒప్పుకున్నారు. కాని కుముదవల్లి ఒక షరతుని విధించినది ఏమనగా తాను  కేవలం ఆచార్యుని వద్ద సమాశ్రయణం(పంచసంస్కారములు) పొందిన శ్రీవైష్ణవుణ్ణే వివాహమాడుతానని . తెలివైనవాడు విశేషమైన దానిని పొందడానికి శీఘ్రముగా కార్యమును చేస్తాడు. అలాగే నీలుడు వెంటనే తిరునరయూర్  పరుగెత్తి  తిరునరయూర్ నంబి దగ్గర వెళ్ళి పంచసంస్కారములు అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. ఎంపెరుమాన్ దివ్య కృపతో శంఖ చక్ర లాంఛనములతో అనుగ్రహించి,  తిరుమంత్రాన్నిఉపదేశిస్తాడు.

పద్మపురాణమున ఇలా చెప్పబడింది.

సర్వైశ్చ శ్వేతమృత్యా  ధార్యం ఊర్థ్వపుండ్రం యధావిధి

ఋజునై సాంతరాలాని అంగేషు ద్వాదశస్వపి

ఊర్ద్వపుండ్రములను తప్పని సరిగా   శరీరంలోని  ద్వాదశ స్థలములలో ఊర్ద్వదిశలో తగిన స్థల వ్యత్యాసముతో  దివ్య దేశములలో లభించు శ్వేతమృత్తికతో ధరించవలెను. 

                        పిమ్మట ఆళ్వార్ ద్వాదశపుండ్రములను ధరించి కుముదవల్లి తాయార్ దగ్గరకు వచ్చి వివాహమాడమని  కోరతాడు. దీనికి ఒప్పుకొని కుముదవల్లి,  వివాహమాడతాను కాని మీరు ఒక సంవత్సరం పాటు  ప్రతిరోజు విఫలం కాకుండా 1008 మంది  శ్రీవైష్ణవులకు తదీయారాధన కైంకర్యము చేయవలసి ఉండును అప్పుడే తమని భర్తగా అంగీకరిస్తానని షరతుని విధిస్తుంది. ఆమెపైన గల అనురాగముతో ఆళ్వార్ షరతుకు  అంగీకరించి కుముదవల్లిని అతి వైభవముగా  వివాహమాడతాడు.

 పద్మపురాణములో దీనిగురించి  ఇలా చెప్పబడినది:

ఆరాధనానాం సర్వేషాం విష్ణోః ఆరాధనం పరం|

తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారధనం నృప||

ఓ రాజా!ఇతర దేవతల కన్న శ్రీమహావిష్ణువుని ఆరాధించడం  చాలా విశేషము. కాని ఆయన కంటే ఆయన భక్తులను ఆరాధించుట బహు విశేషము.

            ఈ ప్రమాణాన్ని అనుసరించి ఆళ్వార్ తన సంపదలన్నింటిని వినియోగిస్తు తదీయారాధనను(విశేషమైన దివ్య ప్రసాదాన్ని శ్ర్రీవైష్ణవులకు భోజనంగా అందించడం)  ప్రారంభించారు. దీనిని చూసిన కొందరు ఈ నీలుడు(పరకాలుడు) ప్రజాధనానంతటిని శ్ర్రీవైష్ణవుల తదీయారాధనకు వినియోగిస్తున్నాడని మహారాజుకు ఫిర్యాదు  చేశారు. ఆ రాజు పరకాలులను తీసుకరమ్మని తన సైన్యమును పంపగా పరకాలులు కొంత ప్రతీక్షించవలసినదని నివేదించాడు. వారు ఆళ్వార్ ను రాజుకు  కప్పం(సుంకం) కట్టవలసినదని నిర్భందిస్తారు. ఆళ్వార్ కోపగించుకొని వారిని బయటకు నెట్టివేస్తాడు. ఆ సైన్యం తిరిగి వెళ్ళి రాజుకు జరిగినదంతా నివేదిస్తారు. రాజు సైన్యాదక్షునికి మొత్తం సైన్యమును తీసుకొని పరకాలులను బంధించమని    ఆఙ్ఞాపిస్తాడు. ఆ సైన్యాదక్షుడు పద్దమొత్తంలో సైన్యమును తీసుకొని పరకాలునిపై దండెత్తాడు. ఆళ్వార్  వారిపై  ధైర్యంగా శక్తియుక్తంగా ఎదిరిస్తూ ఆ సైన్యాదక్షునికి మరియు మొత్తం సైన్యమును వెనుదిరిగేలా చేస్తారు.  ఆ సైన్యాదక్షుడు రాజు వద్దకువెళ్ళి ఆళ్వార్ విజయప్రాప్తిని తెలుపుతాడు. ఆ రాజు తానే స్వయంగా పోరు సల్పదలచి తన మొత్తం సైన్యముతో ఆళ్వార్ పైకి దండెత్తారు. ఆళ్వార్ సాహసాన్ని ప్రదర్శించి ఆ సైన్యాన్ని అతి సులువుగా నాశనం చేస్తాడు.   ఆ రాజు ఆళ్వార్  ధైర్యానికి సంతసించి   శాంతిని ప్రకటించగా ఆళ్వార్ దానిని నమ్మి ముందుకు రాగా  కుయుక్తితో రాజు తన మంత్రితో బంధించి తన బకాయి కప్పమును కట్టమని నిర్భంధిస్తారు. ఆళ్వార్ ని ఎంపెరుమాన్  సన్నిధి  దగ్గర చరసాలలో బంధిస్తారు. దీనికి ఆళ్వార్  మూడు రోజులు పస్తులుంటారు.    ఆ సమయాన తిరునరయూర్ నాచ్చియార్  తన తిరునరయూర్ నంబితో ఆకలితో ఉన్నాడు కావున ప్రసాదం తీసుకెళుతానని చెబుతుంది. ఆళ్వార్ పెరియపెరుమాళ్(శ్రీరంగనాథుడు) మరియు తిరువేంగడముడయాన్ (శ్రీనివాసుడు)ల ధ్యానములో మునిగిపోయారు. కాంచీ వరదుడైన దేవపెరుమాళ్   ఆళ్వార్ కి స్వప్నమున సాక్షాత్కరించి  కాంచీపురమున పెద్దనిధి ఉందని మీరు వస్తే ఇస్తానని చెబుతాడు. ఆళ్వార్ ఈ స్వప్నవృత్తాంతాన్ని రాజుకు నివేదించగా రాజు పెద్ద రక్షణతో తనను కాంచీపురానికి పంపుతాడు. ఆళ్వార్ కాంచీపురానికి చేరుకొనగా అక్కడ నిధి కనిపించలేదు. తన భక్తులకు సర్వం అనుగ్రహించే ఆ  దేవపెరుమాళ్ మళ్ళీ ఆళ్వార్ స్వప్నమున సాక్షాత్కరించి వేగవతీ నదీతీరాన ఆ నిధి ఉన్న స్థలమును చూపిస్తాడు.  ఆళ్వార్ ఆ నిధిని సేకరించి రాజుకు కట్టవలసిన కప్పమును కట్టి మిగితాది తదీయారధన కొనసాగించుటకు తిరుక్కురయలూర్ కు మళ్ళిస్తారు.   

                        మళ్ళీ ఆ రాజు కప్పమును కట్టమని తన సైన్యమును పంపగా ఆళ్వార్  కలత చెందగా మరలా    దేవపెరుమాళ్ స్వప్నమున సాక్షాత్కరించి వేగవతీ నదీతీరాన ఉన్న ఇసుకను సేకరించి ఆ సైన్యమునకు ఇవ్వ వలసినదని ఆఙ్ఞాపిస్తారు. ఆళ్వార్ ఆ సైన్యమునకు ఇసుకను ఇవ్వగా వారికి ఆ రేణువులు విలువైన ధాన్యంగా కనిపిస్తాయి. వారు ఆనందంగా రాజువద్దకు వెళ్ళి జరిగినదంతా వివరిస్తారు. అప్పుడు ఆ రాజు ఆళ్వార్ యొక్క గొప్పదనాన్ని గుర్తిస్తాడు. తన రాజ్యసభకు ఆహ్వానించి తన తప్పుకు క్షమాప్రార్థన చేసి తిరిగి సంపదనంతా ఇచ్చివేస్తాడు. తాను చేసిన నేరాలకు ప్రాయశ్చిత్తంగా  తన సంపదను దేవస్థానములకు మరియు బ్రాహ్మణులకు  పంచివేస్తాడు.ఆళ్వార్ తమ తదీయారధనను నిరంతరంగా నడిపిస్తున్నారు.  అలాగే తన సంపద  కూడా తరుగుతూ రాగాసాగింది. తాను మాత్రం ఈ తదీయారాధనను ధనవంతుల నుండి దారిదోపిడిని చేసైనా సరే    నిరంతరం జరపాలని నిశ్చయించినారు.

                        ఆళ్వార్  పిసినారి ధనవంతులనుండి ధన్నాన్ని  సేకరించి నిర్విరామంగా తదీయారాధనను  జరిపిస్తున్నారు. సర్వేశ్వరుడు ఇలా చింతించసాగాడు. ఇతను దొంగతనము చేస్తున్నాడు. అయిననూ ఆ సొమ్ముచే శ్రీవైష్ణవులకు తదీయారాధనను చేస్తున్నాడు కదా ఇది సరైనదే  . ఇది చరమపర్వనిష్ఠ(చరమోపాయం), భగవంతుడు ఆళ్వార్ ని సంసారసాగరం నుండి తన నిర్దోష దయాగుణంచే   ఉద్ధరించాడు. శ్రీమన్నారాయణుడు నరునిగా (ఆచార్యునిగా)అవతరించి శాస్త్రానుగుణంగా  సంసారాన్ని అనుభవిస్తున్న జీవాత్మను ఉద్ధరిస్తాడో  ఆ మాదిరిగా ఎంపెరుమాన్  తన దేవేరితో ఆళ్వార్ ని అనుగ్రహించుటకు అతనుండే చోటుకు వివాహ వస్త్రములు,  అందమైన నగలు ధరించి   వివాహ బృందముతో వయలాలిమణవాళన్ గా  బయలుదేరుతాడు.అధిక మొత్తంలో దోచుకోవడానికి అవకాశం లభించినందున ఆళ్వార్  ఆనందపడి వయలాలిమణవాళన్ తో సహా  ఆ వివాహ బృందాన్ని సమస్తం దోచుకోవడానికి ఆక్రమించారు.  ఆళ్వార్ అలా దోచుకొని చివరకు కాలి  మెట్టెను తన నోరు ద్వారా తీయదలచి ఎంపెరుమాన్ దివ్యాపాదారవిందములను కొరికాడు. ఆళ్వార్ ఈ శౌర్యమునకు ఎంపెరుమాన్ ఆశ్చర్య చకితుడై “నం కలియన్”  అని సంభోదిస్తాడు. దీనర్థం మీరు నా కలియనా ? (శౌర్యములో ఆధిక్యులు)

thirumangai-adalma

 

తర్వాత  ఆళ్వార్ మొత్తం సంపదలను మరియు నగలన్నింటిని ఒక పెద్దమూటలో కట్టి  దానిని ఎత్తుటకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ఆళ్వార్ వరుణ్ణి(మారు రూపములో ఉన్న ఎంపెరుమాన్) చూసి  నువ్వు ఏదో మంత్రము వేశావు కాన ఈ మూట కదలడం లేదు ఆ మంత్రపఠనాన్ని ఆపేయ్ అని గద్దించారు. ఎంపెరుమాన్ దీనికంగీకరించి మీకు శ్రద్ధ ఉంటే ఆ మంత్రాన్ని చెబుతానన్నారు. ఆళ్వార్ తన కత్తిని చూపించి వెంటనే  దాని చెప్పవలసినదని గద్దించారు. ఎంపెరుమాన్ ఆ సర్వవ్యాపక మంత్రమయిన  తిరుమంత్రాన్ని  ఆళ్వార్  చెవిలో అనుగ్రహించారు. ఇది అంతిమ లక్ష్య మును చేరుస్తుంది మరియు ఇది  సకల వేదసారము, సంసార దుఃఖ సాగరము నుండి తరింపచేసేది, (ఐశ్వర్యం) కైవల్యం(స్వానుభవము) భగవత్ కైంకర్యమును అనుగ్రహించేది. ఈ తిరుమంత్రము యొక్క వైభవము శాస్త్రములలో ఇలా వర్ణించబడింది.   

వృద్ధ హరీత స్మృతి నందు:

రుచో యజుశ్మి సామాని తతైవ అధర్వణాణి చ

సర్వం అష్ఠాక్షరాణంతస్థం  యచ్చచాణ్యదపి వాఙ్ఞ్మయం

ఋగ్వేద, యజుర్వేద, సామవేద మరియు అధర్వవేదముల సారము మరియు వాటి ఉపబృహ్మణముల సారమంతయి అష్ఠాక్షరిమంత్రములో ఇమిడి ఉన్నది.

నారదీయపురాణమున:

సర్వవేదాంత సారార్థతసః  సంసారార్ణవ తారకః |

గతిః అష్ఠాక్షరో నృణామ్ అపునర్భావకాంక్షిణామ్ ||

ఎవరికైతే మోక్షాన్ని సాధించాలి,  సంసార సాగరమును దాటాలి అనే ఆకాంక్ష /ఆర్తి ఉండునో వారికి  సకల వేద సారమగు  అష్ఠాక్షరిమంత్రమే ఆశ్రయంచదగినది.   

నారాయణోపనిషద్ నందు:

ఓమిత్య గ్రే వ్యాహరేత్ నమ ఇతి పచ్ఛాత్ నారాయణాయేతిఉపరిష్ఠాత్

ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాని 

నమః  మరియు నారాయణాయ పదాలు ఓమ్ అను ఏకాక్షరంతో  ఆరంభమగును . నమః  పదము రెండక్షరములతో ,  నారాయణ  పదం ఐదు అక్షరముల తో (1+2+5=8 కావుననేఈ మంత్రము అష్ఠాక్షరి అనబడుతుంది) ఉచ్ఛరించబడుతుంది.  శాస్త్రములన్నీ ఈ మంత్ర స్వరూపాన్ని మరియు దోషరహిత ఉచ్ఛారణ విధాన్నాన్ని వర్ణిస్తున్నాయి.

నారదీయ పురాణమున:

మంత్రాణామ్ పరమో  మంత్రోగుహ్యాణామ్ గుహ్యముత్తత్తమ్ |

పవిత్రన్యాచ పవిత్రాణామ్  మూలమంత్రస్సనాతనః||

అష్ఠాక్షరి మహా మంత్రము అన్నీ మంత్రములలో కెల్ల విశిష్ఠమంత్రము, రహస్య మంత్రములలో కెల్ల రహస్యమైనది, పవిత్రములలో కెల్ల పవిత్రమైనది, అనాదియైనది/సనాతనమైనది  మరియు శాశ్వతమైనది.

ఈ అష్ఠాక్షరిమహామంత్రం  మహాఙ్ఞానులగు పూర్వాచార్యులచే అంగీకరించబడినది. దీనిని వారు తిరుమొజిలో 7.4.4లో “ పేరాళన్ పేరోదుమ్ పెరియోర్”   భగవంతుని గుణస్వభావాన్ని వర్ణించు విశేష నామముగా వర్ణించిరి.  

మరియు ఆళ్వార్  తన పెరియతిరుమొజి లో  మొదటి పదిగం(మొదటి 10 పాశురములలో) ఇలా తాము చెబుకుంటున్నారు “ పెత్తతాయినమ్ ఆయిన చెయ్యుమ్ నలంతరుం శొల్లై నాన్ కండుకొండేన్”  ఈ మంత్రం నాకు నాతల్లిచేయు మేలు  కన్నా ఎక్కువ మేలు చేయునదని నేను కనుకొంటిని”.      తిరుమంత్రాన్ని ఎంపెరుమాన్ దగ్గర విన్న తర్వాత , ఎంపెరుమాన్  సువర్ణము వలె ప్రకాశించు దివ్య గరుత్మాన్ మీద అధిరోహించి దయాస్వరూపిణి అగు శ్రీ మహాలక్ష్మిచే కూడి దర్శనమును అనుగ్రహించాడు.

స్వామి తన నిర్హేతుక కృపాకటాక్షము (కారణములేని దయ) వలన ఆళ్వార్ ని   అఙ్ఞానలేశములేని ఙ్ఞానముతో ఆశీర్వదించారు. ఆళ్వార్ ఇదంతా కూడా శ్రీమహాలక్ష్మి యొక్క పురుషాకార పురస్సరముగా  ఎంపెరుమాన్ అనుగ్రహించారని  గ్రహించారు.  వారు తమ ఆరు ప్రబంధములను  అందరికి  కృపచేసారు. నమ్మాళ్వార్ అనుగ్రహించిన నాలుగు దివ్యప్రబంధములకు ఆరు అంగాలుగా తిరుంమంగైఆళ్వార్    పెరియతిరుమొజి, తిరుక్కురుదాణ్డకమ్, తిరువెజుకూత్తిరిక్కై , శిరియతిరుమడళ్, పెరియతిరుమడళ్ మరియు తిరునెడుందాణ్డకములవు అనుగ్రహించారు. వీరి ఆరు ప్రబంధములు  వేరువేరు కవిత్వపు రూపాలను కలిగి ఉన్నాయి – ఆశు,మధురం,చిత్తం మరియు విస్తారం.   దీని కారణంగానే వీరికి నాలు కవి పెరుమాళ్ అనే నామము వచ్చినది.

 ఆళ్వార్ కు తమ శిష్యులతో కలసి అనేక దివ్యదేశములు దర్శించుకొని ఆయా దివ్యదేశములలో వేంచేసి ఉన్న అర్చావతార మూర్తులకు మంగళాశాసనములు చేయమని ఎంపెరుమాన్ ఆఙ్ఞాపించిరి. ఆళ్వార్ తన మంత్రులతో మరియు శిష్యులతో దివ్యదేశ యాత్రకు బయలుదేరి  ఆయా దివ్యదేశపు నదులలో స్నానమాచరించి  పెరుమాళ్ళకు మంగళాశాసనములను అనుగ్రహించిరి. అవి క్రమంగా భద్రాచలం, సింహాచలం, శ్రీకూర్మం, శ్రీపురుషోత్తమం(పూరిజగన్నాథము), గయా , గోకులం , బృందావనం, మధుర, ద్వారక , అయోధ్య, బదిరికాశ్రమం , కాంచీపురం, తిరువేంగడం మొదలైనవి.

                        ఆళ్వార్ అలా అనుగ్రహిస్తు చోళమండలమునకు చేరుకొనిరి. వారి శిష్యులు  వారిని      “ చతుష్కవులు వేంచేస్తున్నారు “కలియన్ వేంచేస్తున్నారు”  “పరకాలులు వేంచేస్తున్నారు”  “ పర మతములను జయించిన వారు వేంచేస్తున్నారుఅని కీర్తిస్తు ముందుకు సాగుచుంటిరి. అక్కడ నివసించు  తిరుఙ్ఞాన సంబంధర్ అను శివభక్తుని శిష్యులు ఆళ్వార్ ను వారి శిష్యులు పొగడడాన్ని వ్యతిరేఖించారు.  ఆళ్వార్  తమ గురువు గారిచే వాదించి నారాయణ పరతత్త్వమును(ఆధిపత్యాన్ని )  స్థాపించాలని కోరారు.     వారు ఆళ్వార్ ను తిరుఙ్ఞాన సంబంధర్  నివాస స్థలమునకు తీసికెళ్ళి జరిగినదంతా వివరించగా వారు ఆళ్వార్ తో  వాదానికి సిద్ధమయ్యారు. ఆ నగరమంతా అవైష్ణవులతో నిండి ఉన్నది.  ఆ స్థిలో   ఒక్క చోట కూడ ఎంపెరుమాన్  విగ్రహం లేని కారణంగా  ఆళ్వార్ తమ వాదనను ఆరంభించుటకు సందిగ్ధపడసాగిరి. 

ఆ సమయాన ఒక శ్రీవైష్ణవ భక్తురాలిని వారు గమనించి  తమ తిరువారాధన మూర్తిని తీసుకరమ్మనగా ఆవిడ తమ తిరువారాధన మూర్తియగు శ్రీకృష్ణమూర్తిని తీసుకరాగా ఆళ్వార్ వారిని దర్శించి వాదానికి  సంసిద్ధులయ్యారు. సంబంధర్ ఒక పద్యాన్ని వర్ణించగా ఆళ్వార్ దానిలో దోషారోపణ చేసిరి. సంబంధర్ ఆళ్వార్ తో మీరు వర్ణించండి అని సవాలు విసరగా  ఆళ్వార్ వారితో  తాడాళన్ ఎంపెరుమాన్ (కాజిచ్చీరామవిణ్ణగరం- శీర్గాళి) పైన ఉన్న “ ఒరుకురలై ” పదిగాన్ని (పెరియతిరుమొజి-7.4)  వర్ణించిరి. ఆ పదిగము యొక్క విశేష వైభవ కూర్పుచేత  సంబంధర్  బదులు సమాధానమీయలేకపోయిరి. చివరకు ఆళ్వార్ వైభవాన్ని అంగీకరించి వారిని కొలిచిరి.   

ఆళ్వార్ శ్రీరంగమును దర్శించదలచి  శ్రీరంగమునకు వెళ్ళి శ్రీరంగనాథునకు మంగళాశాసనములు మరియు కైంకర్యమును ఒనరించిరి.

బ్రహ్మాండపురాణమున:

విమానం ప్రణవాకారం వేదశృంగం మహాద్భుతం శ్రీరంగశాయి భగవాన్ ప్రణవార్థ ప్రకాశకః

మహాద్భుతమైన  శ్రీరంగవిమానం ఓంకారాన్ని అభివ్యక్తీకరిస్తున్నది ; దాని శృంగం స్వయంగా వేదమే. భగవాన్ శ్రీరంగనాథుడు స్వయంగా తాను ప్రణవార్థమును అభివ్యక్తీకరిస్తున్నాడు(తిరుమంత్ర సారము).  

ఆళ్వార్   శ్రీరంగమునకు  ప్రాకారాన్ని నిర్మించాలని భావించి  దానికి అయ్యే సంపదను(ఖర్చు) గురించి తమ శిష్యులతో మాట్లాడారు. దానికి వారు శ్రీనాగపట్టణమున అవైదిక సాంప్రదాయానికి చెందిన సువర్ణ ప్రతిమ ఉన్నది దానిని సంపాదించినచో మనం దానిని వినియోగించి  చాలా   కైంకర్యమును చేయవచ్చని విన్నవించిరి.

ఆళ్వార్ ఒక పర్యాయము నాగపట్టణమున నివసించి ఈపట్టనమున ఏమైన రహస్యము/విశేషమున్నదా అని అక్కడ ఉన్న ఒక వనితను అడిగారు. ఆమె ఈ పట్టణమున ఒక ద్వీపనివాసి అగు   గొప్ప వాస్తు శిల్పిచే  నిర్మితమైన విగ్రహమున్నది,  కాని అది  అత్యంత పకడ్బందీగా విమానం  ఉన్న దేవాలయంలో ఉంచబడిందని మా అత్తగారు చెబితే విన్నాన్నది.  ఆళ్వార్ ఆ ప్రదేశానికి తన శిష్యులతో  నివసిస్తూ ఆ విశ్వకర్మ(దేవతల వాస్తుశిల్పి)తో సాటియగు ఆ వాస్తు శిల్పి గురించి విచారించసాగారు. ప్రజలు సుందరము మరియు విశాలమగు ఆ శిల్పి స్థలమును చెప్పగా  ఆళ్వార్ అక్కడికి చేరుకొన్నారు.  ఆళ్వార్ తన శిష్యులతో  ఆ గృహం వెలుపల వివిధ విషయాల గురించి  మాట్లాడుతుండగా ఆ శిల్పి స్నాన భోజనాదులు ముగించుకొని వెలుపలికి రాసాగిరి.  ఆ శిల్పికి వినిపించేలా వ్యూహాత్మకంగా చాలా బాధాకరంగా ఇలా అన్నారు ఆళ్వార్ “అయ్యో ! కొందరు దుండగులు నాగపట్టణము ఉన్న దేవాలయాన్ని కూల్చి దానిలో ఉన్న సువర్ణ విగ్రహాన్ని దోచుకెళ్ళారు, ఇక మనం బ్రతికి వృధా”. ఇది విన్న ఆ శిల్పి చాల బాధాకరంగా బిగ్గరగా రోదిస్తు        “ విమాన గోపురపు శిఖరాన్ని తొలగించి సులువుగా  లోపలికి ప్రవేశించు రహస్యాన్ని ఎవడో ఆకతాయి శిల్పి  వెల్లడించి ఉంటాడు”      నేను చాలా క్లిష్టంగా  తాళపుచెవిని రహస్యపరచాను   రాతికి  పక్కగా  వంపుగా మెలిపెట్టిన ఇనుము గొలుసులను చేసి దానిని నీళ్ళు జాలువారు ఒక   ఫలకం క్రింద ఉంచాను దాని నెలా ధ్వంసం చేశారు?” అని తనకు తెలియ కుండానే రహస్యాన్ని బయట పెట్టాడు.

                        ఈ రహస్యాన్ని విన్న  ఆళ్వార్ తన శిష్యులతో ఆనందంగా ఆ స్థలాన్ని వదలి నాగపట్టణమునకు బయలు దేరుటకు సముద్ర తీరాన్ని చేరారు.  ఆ సమయాన  ఒక ధర్మపరాయణుడిగా ఉన్న ఒక వ్యాపారి తన వక్కలను    ఓడ లోకి  భారీగా రవాణా చేయుటను ఆళ్వార్ చూసి అతన్ని దీవించి తనను  ఒడ్డుకు ఆ వైపునకు వదలమని ప్రాథేయపడ్డారు. వ్యాపారి అంగీకరించి సరుకును ఎక్కించి బయలుదేరారు.  ప్రయాణంలో ఆళ్వార్ ఆ వక్కల రాశి నుండి ఒక వక్కను తీసుకొని దానిని రెండుముక్కలుగా చేసి ఒక ముక్కను ఆవ్యాపారి కిచ్చి  తాను ఆ ముక్కను దిగేటప్పుడు తనకు ఇస్తానని  “నేను ఆళ్వార్ కు నా నావ నుండి సగం వక్కను ఇచ్చుటకు ఋణపడి ఉన్నాను” అని  తన చేవ్రాలు తో  ఒక చీటిని వ్రాసియ్యమనిరి.    

అలా ఆ వ్యాపారి చేయగా, ఆళ్వార్ నాగపట్టణము చేరుకోగానే  ఆ రాశిలో నుండి ఖరీదైన సగం   వక్కలను ఇవ్వమనిరి(శ్రీరంగమందిర నిర్మాణ కైంకర్యమునకై)   ఆ వ్యాపారి ఖంగుతిని దీనిని తిరస్కరించాడు. వారిద్దరు వాదులాడుకొని మిగితా వ్యాపారులను తటస్థతీర్పునకై అడగ్గా వారు సగం వక్కలను ఆళ్వార్ కు ఇవ్వ వలసినదే అని తీర్పునిచ్చారు.  ఆ వ్యాపారి వేరు దారిలేక ఆ సగం వక్కలకు ఖరీదు సొమ్మును ఇచ్చి వెళ్ళిపోయాడు.ఆళ్వార్ నాగపట్టణము చేరుకొని రాత్రి అయ్యే వరకు దాక్కొనిరి.  రాత్రిన ఆ ఫలకమును విరచి ఆ తాళపు చెవిని తీసుకొని విమానమును ఎక్కి ఇరుపక్కలా తిరుగు ఆ దారిని తెరిచి లోపల  ధగాధగా మెరిసే విగ్రహమును చూసారు.

ఆ విగ్రహం ఇలా పలికినది “ ఇయత్తై ఆగతో ఇరుంబినై ఆగతో , భూయత్తై  మిక్కతొరు భూత్తత్తై ఆగతో తేయతే పిత్తలై  నార్చెంబుగలైఆగతో  మాయప్పొన్ వేణుమో మత్తత్తైన్నైప్ పణ్ణున్ గైక్కే”   

                        “మీరు ఇనుము ,ఇత్తడి , రాగి లాగా వినియోగిస్తారా? మీరు నన్ను దివ్య సువర్ణముగా భగవత్ కైంకర్యానికి వినియోగించాలన్న నా దగ్గరకు  రావాలి” అన్నది. ఆళ్వార్ తన బావమరదిని విగ్రహాన్ని తీయుటకు వినియోగించి దానిని తీసుకొని తామందరు  ఆ స్థలాన్ని వదిలారు. మరునాడు వారందరు   ఒక చిన్న పట్టణమునకు చేరి దున్నేటువంటి  ఒక స్థలమును చూసుకొన్నారు. దానిలో విగ్రహమును పాతి విశ్రాంతి తీసుకొన్నారు.వ్యవసాయదారులు వచ్చి ఆ నేలను దున్నగా వారికి విగ్రహం కనిపించిగా  వారు తమదనుకొనిరి. ఆళ్వార్ ఇది తమ తాత తండ్రులదని వారు దీనిని ఈ నేలలో పాతిరనిరి. ఆ సంవాదంను  నడుపుతూ  చివరకు ఆ స్థలం యొక్క యజమానిని నేనే అని మీకు రేపు ఋజువు పత్రాన్ని చూపిస్తామనగా ఆ రైతులు సరేనని వెళ్ళి పోయారు. రాత్రికి ఆళ్వార్ ఆ విహ్రమును తీసుకొని  తమ శిష్యులతో   ఉత్తమర్ కోయిళ్ అనే దివ్యదేశానికి చేరుకొని  ఆ విగ్రహాన్ని జాగ్రత్త పరిచిరి.   అదే సమయాన ఆ నాగపట్టణ దేవాలయపు  కార్యనిర్వాహణాధికారి కొంతమంది స్థానిక నేతలతో ఆళ్వార్ ని వెంబడిస్తూ విగ్రహాన్ని పాతిన స్థాలానికి అలాగే చివరకు ఉత్తమర్ కోయిల్ కు చేరుకొన్నారు.  వారు ఆళ్వార్ ను అడగ్గా మొదటఆ విగ్రహముగురించి తెలియదని చెప్పి ఆ తరువాత చిటికన వేలు తప్పంచి విగ్రహపు భాగాన్ని  వర్షాకాలం తరువాత వచ్చు ఫంగుణి(ఫాల్గుణమాసం) మాసం వరకు తిరిగి  ఇచ్చేస్తానన్నారు.

ఆళ్వార్ ఒక పత్రాన్ని వ్రాసి చేవ్రాలు చేసి వారికివ్వగా వారి తిరిగి వెళ్ళిరి. ఆళ్వార్ వెంటనే ఆ విగ్రహాన్ని కరిగించి దానికి తగ్గ ఖరీదుకు అమ్మి ఆ వచ్చిన డబ్బుతో శ్రీరంగ దేవాలయ ప్రాకారాన్ని నిర్మాణం చేయ సాగిరి. ఆ ప్రాకారం తొండరడిపొడి ఆళ్వార్   నిర్మించిన నందనవనం మీదుగా వెళ్ళినప్పుడు ఆళ్వార్ వారి దివ్యభక్తిని  గుర్తించి దానికి ఎటువంటి అపాయం చేయకుండ  ప్రాకారం నిర్మించారు. దీనికి తొండరడిపొడి ఆళ్వార్    సంతోషించి ఆప్యాయతతో తిరుమంగై ఆళ్వార్ కు  వనసాధనం అను అరుళ్ మారి   (shear/fork) అని  పేరుని అనుగ్రహించారు. ఆళ్వార్  ఎంపెరుమాన్ కు కృతఙ్ఞతగా ఎన్నో కైంకర్యములను చేశారు.

వర్షాకాలం రానే వచ్చింది. ఆ నాగపట్టణదేవాలయ కార్యనిర్వాహాణాధికారి స్వర్ణవిగ్రహాన్ని తీసుకోవడానికి వచ్చాడు. వారు క్రితం రాసుకొన్న ప్రమాణ పత్రం ఆధారంగా ఆళ్వార్  స్వర్ణవిగ్రహపు చిటికెన వేలు తిరిగి ఇచ్చారు. దానికి ఆగ్రహించిన ఆ కార్యనిర్వాహాణాధికారి మధ్యవర్తులనాశ్రయించగా వారు కూడా ఆ ప్రమాణ పత్ర ఆధారంగానే తమ తీర్పును తెలుపగా ఆ కార్యనిర్వాహాణాధికారి చేసేదేమీలేక కేవలం ఆ చిటికెన వేలును తీసుకొని బయలుదేరాడు.కార్యనిర్వాహాణాధికారి ఆళ్వార్ యొక్క యుక్తిని గ్రహించి ఇక మరేమి కోరక  వెళ్ళిపోయిరి. ఆళ్వార్ నాగపట్టణదేవాలయ  చేసిన వాస్తుశిల్పులను పిలచి మీకు శ్రమ తగ్గట్టుగా  సంపదనిచ్చెదను , అది ఆ నదీ తీరాన ఉన్నదని చెబుతారు.  వారినందరినీ ఒక ఓడలో ఎక్కించి నదిలో కొంత దూరం ప్రయాణించిన పిదప  ఆ పడవ నడిపేవాడికి  సైగలు చేసి వాడును ఆళ్వార్ ను వేరొక చిన్న పడవలోకి దూకి పోతారు. ఆ   వాస్తుశిల్పులు  ఉన్న ఓడను  ముంచి వేస్తారు. ఆళ్వార్ తన ప్రదేశానికి తిరిగి రాగా ఆ వాస్తుశిల్పుల మనవలు (grandchildren) వచ్చి  వారి తాతల గురించి వాకబు చేస్తారు. వారికి నేను గొప్ప సంపదను చూపించాను వారు వాటిని  సర్దుకొని మూటలను కడుతున్నారు,  వాటితో సహా వస్తారన్నారు.

వాస్తుశిల్పుల మనవలు  ఆళ్వార్ ను అనుమానించి , మేము మా తాతలను  క్షేమంగా ఇచ్చేవరకు తిరిగి వెళ్లమనిరి. ఆళ్వార్   చింతించగా శ్రీరంగనాథుడు స్వప్నమున సాక్షాత్కరించి “ మీరు ఇక బయపడనవసరం లేదు.  వారినందరిని కావేరీనది కి వెళ్ళి స్నానమాడి ఊర్ధ్వ పుండ్రములను ధరించి  నా ప్రధాన మండపమునకు వచ్చి వారి వారి తాతలను వారి వారి పేర్లను పిలుస్తు ఆహ్వానించమన్నారు”.  శ్రీరంగనాథుని ఆఙ్ఞను శిరసావహించి ఆ శిల్పుల తాతలను క్రమంగా పిలవ సాగిరి. అప్పుడు  వారి వారి తాతలు శ్రీరంగనాథుని ప్రక్కగా క్రమంగా వస్తూ వారి మనవలకు కనిపిస్తు ఇలా అన్నారు “ మేము ఆళ్వార్  దివ్య కృపవలన  శ్రీరంగనాథుని శ్రీపాదములయందు చేరుకొన్నాము, కాన మీరు కూడ వారినాశ్రయించవలసినది , ఈ సంసారమున కొంత కాలము  సుఖంగా నివసించి తర్వాత ఉజ్జీవించండిఅని  .  వారు సంతోషంగా తాతల ఆఙ్ఞలను శిరసావహించి ఆళ్వార్ ను   వారి ఆచార్యులుగా స్వీకరించి  వారివారి స్వస్థలాలకు తిరిగి వెళ్ళిరి.     

పెరియపెరుమాళ్ , ఆళ్వార్ ను మీకేమైన కోరిక ఉన్నదా అని అడిగారు. ఆళ్వార్  ఎంపెరుమాన్ యొక్క దశావతారాలను దర్శించాలని పెరియపెరుమాళ్ ని కోరారు. పెరియపెరుమాళ్ “ మీ కోరిక ఇదే అయితే మీరు నా దశావతార అర్చామూర్తులను స్థాపించండి”  అన్నారు. ఆళ్వార్  దశావతార సన్నిధిని   శ్రీ రంగమున నిర్మించినారు. 

తదనంతరం పెరియపెరుమాళ్ , ఆళ్వార్  బావమరదిని పిలచి వారికి ఆళ్వార్ అర్చామూర్తిని నిర్మించవలసినదని ఆఙ్ఞనిచ్చారు (ఎందుకనగా ఆళ్వార్ వారి బావమరదికి ఆచార్యులు). వారు అలా ఆళ్వార్ అర్చావిగ్రహాన్ని తిరుక్కురయలూర్ నందు కూడా ఏర్పాటుచేసి , పెద్ద దేవాలయాన్ని నిర్మింపచేసి , ఆళ్వార్ ఉత్సవాలను అతి వైభవంగా జరుపసాగిరి. ఆళ్వార్ బావమరిది  వెనువెంటనే ఆచార్యవిగ్రహాన్ని వారి ధర్మపత్నిఅయిన కుముదవల్లి నాచ్చియార్ తో సహా ఏర్పరచి తిరుక్కురయలూర్  కు అందరితో  వెళ్ళి    అర్చావిగ్రహాలను స్థాపించి అత్యంత వైభవంగా ఉత్సవములను  జరిపించారు. ఆళ్వార్ తమ శిష్యులను ఉజ్జీవింప చేస్తూ    నిరంతరం పెరియపెరుమాళ్ ని ఉపేయం మరియు ఉపాయంగా భావిస్తు ధ్యానించసాగిరి.

 

వీరి తనియన్ :

కలయామి కలిధ్వంసం కవిలోక దివాకరం

యస్యగోభిః  ప్రకాశాభిః  ఆవిద్యం నిహతం తమః

వీరి అర్చావతార అనుభవం  మునుపు  ఇక్కడ వర్ణింపబడినదిhttp://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-thirumangai.html.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

source

మధురకవి ఆళ్వార్

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః
madhurakavi

తిరునక్షత్రము: చిత్తా నక్షత్రము

మాసము: చైత్రమాసము (చిత్తిరై/మేష)

అవతార స్థలము: తిరుక్కోళూర్(ఆళ్వార్ తిరునగరి నవ తిరుపతులలో ఒకటి)

ఆచార్యులు: నమ్మాళ్వార్

శ్రీ సూక్తులు: కణ్ణినుణ్ శిరుతాంబు

పరమపదము చేరిన ప్రదేశము: ఆళ్వార్ తిరునగరి

నమ్పిళ్ళై తన అవతారికా వ్యాఖ్యానంలో మధురకవి ఆళ్వార్ల కీర్తిని అతి వైభవంగా వివరించారు. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాము. మహాఋషులందరు తమ దృష్టిని సామాన్యశాస్త్రము నిర్ణయించే ఐశ్వర్యం, కైవల్యం, మరియు పురుషార్థమైన (ఆత్మ పొందవల్సిన లక్ష్యం) భగవత్ కైంకర్యం పై ప్రసారం చేశారు. కాని ఆళ్వారులు తమ దృష్టిని శ్రీమన్నారాయణునకు ప్రీతిని కలిగించే ఉత్తమపురుషార్థము (అంతిమ లక్ష్యం)పై ప్రసారం చేశారు. మధురకవిఆళ్వార్ మాత్రం తమ దృష్టిని అత్యుత్తమస్థితి అయిన భాగవత కైంకర్యం పై ప్రసరింప చేశారు, దీనిని తన కన్నా తన భక్తులకు చేయు కైంకర్యమే విశేషమని భగవంతుడు ప్రశంసించాడు. దీనిని మనం శ్రీరామాయణం లో చూడవచ్చు. శ్రీరామాయణం వేదోపబృహ్మణం(వేదం యొక్క క్లిష్టమైన అర్థాలని వివరించేది) ఇది వేదం యుక్క ప్రధాన అంశాలని నిర్ణయుంచును.

§శ్రీరాముడు వేద మూర్త స్వరూపుడు- కావున తాను సామాన్యధర్మమైన పితృవాక్ పరిపాలనను(తండ్రి ఆఙ్ఞ ను ఆచరించేవాడు)నిరూపించినాడు.

§ ఇళయపెరుమాళ్(లక్ష్మణుడు) విశేషధర్మమైన శేషత్వమును నిరూపించినాడు, ఇది శేషుడు(దాసుడు) సదా శేషిని(ప్రభువు/యజమానిని) అనుకరించడం. లక్ష్మణుడు, “అహం సర్వం కరిష్యామి”(మీ కోసం నేనన్నింటిని చేయుదును) అనే దానిని శ్రీరాముని యందు అనుష్టించి చూపినాడు.

§ శ్రీభరతాళ్వాన్(భరతుడు)విశేషధర్మమైన పారతంత్ర్యమును నిరూపించినాడు, ఇది జీవాత్మల అసలైన స్వరూపం. తన స్వాతంత్ర్యం లేకుండా ప్రభువు/యజమాని ఇచ్ఛను అనుసరించి నడుచు కొనుటయే పారతంత్ర్యం.
§ కాని శ్రీరాముడు భరతున్ని అయోధ్యానగరంలోనే ఉండి రాజ్యాన్ని సంరక్షించాలని కోరినాడు. భరతుడు నిర్భంధముగా శ్రీరాముని ఆఙ్ఞను ఒప్పుకొని తను 14సంత్సరములు అయోధ్యానగరం వెలుపల అదే స్వరూపంతో శ్రీ రామునికై అనుష్టించాడు.
§ శ్రీశత్రుఘ్నాళ్వాన్(శత్రుఘ్నుడు)సంగ్రహంగా తన స్వరూపమునకు తగిన భాగవతశేషత్వమును నిరూపించినాడు. ఇతను ఇతర వ్యాపకముల యందు శ్రద్ధచూపక కేవలం భరతుని యందు కైంకర్యమునే ఆసక్తితో అనుష్టించినాడు.
ఇక్కడ నంప్పిళ్ళైగారు శ్రీభాష్యకారుల(శ్రీరామానుజుల) వచనమును ఉట్టంకిస్తు, శ్రీరాముడు తన ఇద్దరి సోదరులైన లక్ష్మణుని మరియు భరుతుని యందు కన్నా సర్వపారతంత్రుడైన శత్రుఘ్నునియందే అధికమైన ప్రీతిని కలిగిఉండేవారు. మధురకవిఆళ్వార్ భాగవత కైంకర్యనిష్టను నిరూపించిన శత్రుఘ్నుని యందు అధికమైన ప్రీతిని కలిగి ఉండేవారు. మధురకవిఆళ్వార్ కూడా నమాళ్వార్ కు పరిపూర్ణదాసుడై వారికి నిత్య కైంకర్యమును చేసెడివారు. మధురకవిఆళ్వార్ కు నమ్మాళ్వారే లక్ష్యం(ఉపాయం) మరియు దానిని పొందించేవారు(ఉపేయం) కూడా ఆళ్వారే. దానినే మధురకవిఆళ్వార్ తన దివ్యప్రబంధము యందు నిరూపించినారు.

పిళ్ళైలోకాచార్యులు తమ మహత్తరమైన శ్రీవచనభూషణంలోని చివరి ప్రకరణంలో మధురకవిఆళ్వార్ జీవితమును మరియు వారికి నమ్మాళ్వార్ యందు ఉన్న సంబంధమును, ఆచార్య అభిమాన నిష్ట (ఆచార్య అభిమానమే సర్వాధారంగా భావించుట)కు ఉదాహరణగా తన సూత్రములో సవివరంగా వివరిస్తారు.

8వ ప్రకరణములో భగవంతుని నిర్హేతుక కృప వర్ణించబడినది. భగవంతుడు జీవాత్మకు ఫలితమునలను వారి కర్మాణుసారంగా ఇవ్వడానికి బద్ధుడై ఉంటాడు. కాని మనను భగవంతుడు ఆమోదిస్తాడా లేడా అని సందేహం ఉండవచ్చు.

9వ ప్రకరణములో (చివరన) పిళ్ళైలోకాచార్యులు, ఆచార్యునిపై ఆధారపడిన చరమోపాయము(అంతిమోపాయము)మరియు ఆ చరమోపాయము వలన జీవాత్మ ఎలా అప్పగించబడునో తెలిపినారు.

407 సూత్రమును పరిశీలించిన, సర్వ సతంత్రుడైన భగవతుండు మనను స్వీకరిస్తాడా లేదా నిరాకరిస్తాడా అని సందేహం కలుగవచ్చు ఇది శాస్త్రానుసారము( ఫలితములను వారివారి కర్మాణుసారంగా ఇవ్వబడేది)గా అతని మీద లేదా అతని కారుణ్యం మీద ఆధారపడి ఉండును.

మణవాళమామునులు తమ వ్యాఖ్యానంలో, ఎపుడైతే మనం పారతంత్రుడైన (సర్వం భగవంతుని మీదనే ఆధారపడిన వారు) ఆచార్యుని యందు ఆధారపడి ఉన్నామో ఇక మనకు ఏ సందేహము లేదు విమోచనము(మోక్షము) కలుగు నంతవరకు. కారణం ఆచార్యుడు కరుణకు మారు మూర్తి మరియు జీవాత్మ ఉద్ధరణకై సదా పాటుపడును.

408వ సూత్రంలో ఇలా వివరించబడినది, సర్వం భగవంతుని యందు ఆధారపడిన పదుగురు ఆళ్వార్లు తమ పాశురాలలో దీనిని నిరూపించ లేదు. ఈ ఆళ్వార్లు ఏవిధమైన లోపంలేని ఙ్ఞానమును భగవంతుని ద్వారా దివ్యంగా ఆశీర్వదించబడ్డారు. వారు భగవత్ అనుభవంలో లో నిమగ్నమైనప్పుడు భాగవతులను కీర్తించెడివారు. భగవంతునితో సంశ్లేషము కలిగినపుడు భాగవతుల విషయంలో కలత చెంది తీరని ఆశతో ఉండేవారు (మణవాళమాముననుల వాఖ్యానములో చాలా పాశురములలో ఈ విషయం పేర్కొనబడినది). మనము ఆచార్యవైభవాన్ని పదుగురి ఆళ్వార్ల పాశురాలలో నిర్ణయించలేము కాని మధురకవిఆళ్వార్ పాశురాలలో ఈ వైభవమును పరిశీలించవచ్చు అని మామునుల సారాంశం.

409వ సూత్రంలో, మిగిలిన పదుగురు ఆళ్వార్ల కన్నా మధురకవి ఆళ్వార్ చాలా గొప్పవారు అనడానికి కారణం, వారి దృష్టి అంతా ఆచార్య వైభవము పైననే ఉండును, కాని మిగిలిన ఆళ్వారులంతా ఒకసారి భాగవతులను కీర్తిస్తారు మరొకసారి విస్మరిస్తారు. మధురకవిఆళ్వార్ వచనములను బట్టి మనము ఆచార్య వైభవమును సిద్ధాంతీకరించవచ్చు. మామునులు తమ ‘ఉపదేశరత్నమాల’లో 25వ మరియు 26వ పాశురములలో మధురకవిఆళ్వార్ ను మరియు వారి ప్రబంధమైన ‘కణ్ణిణున్ శిరుత్తాంబును’ కీర్తిస్తారు. 25వ పాశురంలో మధురకవిఆళ్వారుల తిరుఅవతారమైన చైత్రమాస చిత్తా నక్షత్ర దివసం ప్రపన్నుల స్వరూపానికి తగిన రోజని, ఇది మిగిలిన ఆళ్వారుల అవతార దివసం కన్నావిశేషమయినదని వివరించారు.

 

ఎరార్ మధురకవి | ఇవ్వులగిల్ వన్దుఉదిత్త,

శీరారుం శిత్తిరైయిల్ | శిత్తిరైయిల్ , పారులగిల్

మర్ట్రుళ్ళ ఆళ్వార్ గళ్ | వందుదిత్తనాళ్ గళిలుమ్

ఉర్ట్రదు ఎమక్కెన్ఱు | నెఙ్జే ! ఓర్.

వాయ్ త్త తిరుమన్దిరత్తిన్ |మత్తిమమాం పదంపోల్

శీర్తమధురకవి |శెయ్ కలైయై – ఆర్తపుగళ్

ఆరియర్ గళ్ తాఙ్గళ్ |అరుళిచ్చెయల్ నడువే,

శేర్విత్తార్ | తాఱ్పరియం తేర్ న్దు(26)

పిళ్ళైలోకం జీయర్ ఈ పాశురానికి విశేషమైన వివరణ అనుగ్రహించారు: కణ్ణినుణ్ శిరుతాంబును తిరుమంత్రములోని ‘నమ:’ పదానికి ఉదాహరణగా స్వీకరించారు. తిరుమంత్రము, మననము చేసేవారిని ఈ సంసార బంధము నుండి విముక్తి చేయునదిగా వాసిక్కెక్కినది. తిరుమంత్రములో ‘నమ:’ పదం చాలా ప్రాధాన్యత కలిగినది. మన రక్షణాభారములో మన ప్రమేయమే ఉండదు, మన రక్షణాభారమంతా స్వామిదే (ఎమ్పెరుమాన్) అనే విషయాన్ని ఇది ధృడీకరించును. ఈ సూత్రమునే మధురకవిఆళ్వార్ (తాము ఆచార్యనిష్టను కలిగిన విశేషశీలురు) తన ప్రబంధములో విశదీకరించారు. దీని ఆధారంగానే మన రక్షణాభారమంతా ఆచార్యులదే అని తెలియును. ఈ విషయ వాస్తవికతయే శాస్త్రము యొక్క సారాంశము, కావుననే మన పూర్వాచార్యులు వీరి ప్రబంధమును నాలాయిరదివ్య ప్రబంధములోచేర్చినారు. ఒక మాదిరిగా మధురకవిఆళ్వార్ అవతరించిన చిత్తా నక్షత్రము 27 నక్షత్రములలో సరిగ్గా మధ్యన ఉండును, అలాగే వీరి ప్రబంధము కూడ దివ్యప్రబంధ రత్నహారమునకు నాయక రత్నం వలె మధ్యలో విరాజిల్లుతున్నది .
ఎంబెరుమానార్(రామానుజులు), నంప్పిళ్ళై, పిళ్ళైలోకాచార్యులు, మామునులు మరియు పిళ్ళైలోకం జీయర్ మొదలైన వారందరు ఈ వియాన్నే వివిధ కోణములలో చాలా అందముగా వివరించారు. వీటిని ఆధారంగా చేస్కొని మనము మధురకవిఆళ్వార్ చరితమును తెలుసుకుందాము.

మధురకవిఆళ్వార్ చైత్రమాసంలో చిత్తా నక్షత్రమున తిరుక్కోళూర్ అనే దివ్యదేశములో(ఆళ్వార్ తిరినగరి నవ తిరుపతులలో ఒకటి) అవతరించిరి. సూర్యునికి ముందే కిరణముల కనిపించినటుల నమ్మాళ్వార్ అవతారానికి ముందే వీరి అవతారం జరిగినది. వీరి వైభవమును గరుడవాహన పండితుని ‘దివ్యసూరిచరితం’ లో అవలోకించిన, వీరు కుముదగణేశుని లేదా గరుడుని(ఆళ్వారులందరు ఈ సంసారము నుండి పెరుమాళ్ చే ఉద్ధరింపబడి వానిచే ఆశీర్వదింపబడినవారు) అంశ అని తెలుస్తున్నది. వీరు సామవేదీయ పూర్వశిఖా బ్రాహ్మణ వంశములో జన్మించిరి. తగిన వయస్సులో వీరికి జాతకకర్మ, నామకరణ, అన్నప్రాసన, చౌల, ఉపనయనాది వైదిక సంస్కారములన్నీ జరిగాయి. క్రమంగా వేదవేదాంతములు, ఇతిహాసపురాణములను అధికరించినారు. పెరుమాళ్ ను తప్ప ఇతరములను పరిత్యజించి ఉత్తరభారతావని లోని అయోధ్య,మధుర మొదలైన దివ్యదేశాలను సేవించుటకు యాత్రను చేసిరి.

nammazhwar-madhurakavi-nathamuni

మధురకవిఆళ్వార్, నమ్మాళ్వార్, నాధమునులు – కాంచీపురం

మధురకవిఆళ్వార్ తరువాత అవతరించిన నమ్మాళ్వార్ అన్యములయందు అశ్రద్ధతో, మాతృ పాలను కూడ స్వీకరించక, నిశబ్దతతో(పూర్తిగా శబ్దము లేకుండా) ఉండిరి. వీరి తల్లిదండ్రులైన ఉడయనంగైకారిలు , అవతరించిన 12వ దివసమున వీరి బాల్య ప్రవర్తనకు ఆత్రుతచెంది, తామ్రపర్ణినదీ దక్షిణ తీరాన అందమైన గోపురములను కలిగిన, అందమైన దివ్యశంఖచక్రములతో అలరారుతున్న, పద్మములవంటి నేత్రములను కలిగిన, అభయ హస్తముతో(మనను రక్షించెదను అను నిర్థారించు హస్తము కలిగిన స్థితి) కూడిన, దివ్యమహిషిలైన శ్రీభూనీలా దేవేరులతో కూడిన ‘పొలిన్దునిన్ఱపిరాన్’ వద్దకు తీసుకవచ్చిరి. పెరుమాళ్ సన్నిధిన ఆ బాలునకు ‘మారన్’ (ఇతరుల నుండి వ్యత్యాసముతో ఉండువాడు)అని పేరుంచి దివ్యచింతచెట్టు సన్నిధిన వదిలి దివ్యునిగా భావించి ఆరాధించసాగిరి.

పరమపదనాధుడు నమ్మాళ్వారులకు పంచసంస్కారములను చేసి ద్రావిడవేదమును (ఈవేదం అనాదిగా ఉన్నదని నాయనార్లు తమ ‘ఆచార్యహృదయము’ లో తెలిపిరి) మరియు అన్నీ రహస్య మంత్రములు,వాటి అర్థములను ఉపదేశించమని విష్వక్సేనులను నిర్దేశించగా విష్వక్సేనులవారు ఆ బాధ్యతను నెరవేర్చిరి. నమ్మాళ్వార్ 16 సంవత్సరములు ఆ తిరుపుళిఆళ్వార్(దివ్య చింతచెట్టు)క్రింద ఉన్నారు. ఆ గొప్పదనమును ఆళ్వారుల తల్లిదండ్రులు గమనించినారు కాని వాటిని అనిభవించలేకపోయినారు. అలా తిరుక్కురుంగుడి నంబిని ప్రార్ధన చేస్తు ఉండిపోయినారు. మధురకవిఆళ్వార్ కూడా ఈ వింత విషయాన్ని విన్నారు, ఒకసారి వారు రాత్రి సమయాన నదీతీరానికి వెళ్ళినప్పుడు దక్షిణ దిశవైపు పెద్దవెలుగును చూసినారు. మొదట వారు ఎదో ఊరు తగలబడి పోతుందని భావించినారు, కాని అదే వెలుగు వారికి ప్రతిరాత్రి కనబడ సాగినది. సరే దీనిని కనిపెడదాము అని నిశ్చయించుకొని దినభాగములో నిద్రించి రాత్రిభాగాన ఆ దిశ(దక్షిణ)వైపు పయనించసాగిరి. ప్రయాణంలో ఎన్నో దివ్యదేశాలను పరిశీలనగా సందర్శిస్తూ చివరకు శ్రీరంగమును చేరుకొనిరి.

అయినను వారికి దక్షిణదిశవైపు ఆ దివ్యవెలుగు కనబడసాగినది. చివరకు తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి)చేరిన తర్వాత ఆవెలుగు కనబడకపోగా, ఆ వెలుగు ఈ ప్రదేశము నుండే వచ్చినదని నిర్థారించుకొనిరి. పిమ్మట దేవాలయంలోకి ప్రవేశించిగానే వారికి ఙ్జానపరిపూర్ణులుగా, అందమైన నేత్రాలతో ,16 ఏండ్ల నూతన వయస్కుడైన, పూర్ణిమా చంద్రునివలె, పద్మాసనములో వేంచేసి కూర్చునటువంటి, భగవంతుని గురించి ఉపదేశిస్తున్న ఉపదేశముద్రతో, సమస్త ప్రపన్నులకు ఆచార్యునిగా, సంపూర్ణ భగవదనుభవములో మునిగి ఉన్న నమ్మాళ్వార్ దర్శనమునిచ్చిరి. మధురకవిఆళ్వార్ ఒక రాయిని తీసుకొని వారి ముందు పడవేసిరి. ఆళ్వార్ తమ సుందర నేత్రాలను విప్పి మధురకవిఆళ్వార్ ను చూసినారు. వారు ఈయన మాట్లాడతారా అని పరీక్షించదలచి ఆళ్వార్ తో ఇలా అనిరి

“శిత్తత్తిన్ వయిఱిళ్ శిరియతు పిరన్దై ఎత్తత్తై త్తిన్ఱు ఎంగేకిడక్కుం “

–దీనర్ధం – చేతనుడు(జీవాత్మ-అజడము) అచేతనములోకి( జడము) ప్రవేశించగానే ఎక్కడ ఉండును? ఏమి అనుభవించును?. దీనికి ఆళ్వార్ “ అత్తత్తైతిన్ఱు అంగై కిడక్కుం” (அத்தைத்தின்று அங்கே கிடக்கும்) కార్యరూప కార్యరూపానందమును దు:ఖములను అనుభవిస్తు అక్కడే శాశ్వతంగా ఉండును” అని అనిరి. ఇది విన్న మధురకవిఆళ్వార్ ఇతనిని సర్వఙ్జునునిగా( అన్నీ తెలిసినవాడు) గుర్తించి ఇక నేను నా ఉజ్జీవనమునకై ఇతనికి సర్వ కైంకర్యములను చేయుదును అని నమ్మాళ్వార్ శ్రీపాదపద్మలయందు మోకరిల్లిరి. సదా వారి సేవలోనే ఉంటూ వారి గుణగణాలను కీర్తించసాగిరి.

శ్రీవైకుంఠనాధుడు, (పరమపదం నుండి)అన్నింటికి కారణభూతుడైనవాడు, అన్నింటికి అధికారి, అన్నింటిని నియంత్రించే వాడు, సర్వంతర్యామిగా ఉండేవాడు, నల్లని/నీలపు తిరుమేని అలరారు ఎంపెరుమాన్ నమ్మాళ్వార్ కు దర్శనమిచ్చుటకుసంకల్పించగానే, పెరియతిరువడి(గరుడన్) వాలగా తన దేవేరి మహాలక్ష్మితో అధిరోహించి తిరుకురుగూర్(ఆళ్వార్ తిరునగరి) వచ్చి దర్శనమును మరియు అనంత ఙ్జానమును అనుగ్రహించిరి. ఎంపెరుమాన్ చే అనుగ్రహింపబడిన నమ్మాళ్వార్ సంపూర్ణంగా భగవదనుభవములో మునిగి తనివితీరా అనుభవించి పొంగి పొరలే ఆ అనుభవం లోపల ఇముడ్చుకోలేక పాశురాల(పద్యములు) రూపములో గానంచేసిరి, అవి తిరువిరుత్తం, తిరువాశిరియం, పెరియతిరువన్దాది, తిరువాయ్ మొజి (నాలుగు వేదాల సారమయిన) అనే ప్రబధములుగా, ఎంపెరుమాన్ స్వరూపములను, గుణగణములను, అవతారములను కీర్తించిరి. వాటినే నమ్మాళ్వార్ తన శిష్యులగు మధురకవిఆళ్వార్ కు ఇతర శ్రద్ధాలువులకు అనుగ్రహించిరి. అన్నీ దివ్యదేశ పెరుమాళ్ళు నమ్మాళ్వార్ కూర్చున్న తిరుపులిఆళ్వార్ (చింత చెట్టు) దగ్గరకు వేంచేసి ఆళ్వార్ కు ఆశీర్వదించి తాము వారిచే మంగళాశాసనం చేయించుకున్నారు. నమ్మాళ్వార్ అందరిచే ఆశీర్వదించబడి, వారివారికి మంగళాశాసనములను చేసిరి. అలాగే నిత్యసూరులు(పరమపదవాసులు) శ్వేతదీప వాసులు(క్షీరాబ్ధివాసులు ) రాగా మహిమ గల నమ్మాళ్వార్ చే వారు మంగళాశాసనములను పొందిరి.

నిత్యసూరుల,శ్వేతదీప వాసుల మహిమలో మునిగిన నమ్మాళ్వార్ తమనుతాము విశ్వములో గొప్పవారిగా భావించు కొనిరి( ఎంపెరుమాన్ అనుగ్రహము వలన సాత్వికఅహంకారం ఉదయించెను). మహిమలతో కూడిన నమ్మాళ్వార్ తాము సదా కణ్ణన్(శ్రీకృష్ణుని) తలుచుకొనేవారు. నమ్మాళ్వార్ అర్ధపంచక ఙ్జానమును ( పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, ఉపాయ స్వరూపం, ఉపేయ స్వరూపం, విరోధి స్వరూపం) మరియు దివ్యమహామంత్రమును అమృతమువంటి పెరుమాళ్ ని భక్తులకు తమ తిరువాయ్ మొజి ద్వారా వివరించిరి. చివరకు నమ్మాళ్వార్ తమ 32వ ఏట సంసారమును వీడి పరమపదమునకు ఎంపెరుమాన్ దయ వలన చేరుకొనిరి. ఆ సమయాన నమ్మాళ్వార్ (ప్రపన్న జనకూటస్థులు- ప్రపన్నులకు మూలపురుషులు) ప్రధాన శిష్యులైన మధురకవిఆళ్వార్ ఆచార్య ప్రభావం గల ‘కణ్ణినుణ్ శిరుత్తాంబు’ను రచించి పంచమోపాయనిష్టులైన (5వ ఉపాయము- మిగితా ఉపాయములు కర్మ, ఙ్జాన,భక్తి మరియు ప్రపత్తి) ముముక్షువులకు అనుగ్రహించినారు. మధురకవిఆళ్వార్, నమ్మాళ్వార్ అర్చావిగ్రహమును ఆళ్వార్ తిరునగరి యందు ప్రతిష్టచేసి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ ఉత్సవములను అతివైభవముగా జరిగేలా ఏర్పాటుచేసిరి.

మధురకవిఆళ్వార్, నమ్మాళ్వార్ లను ఇలా కీర్తించిరి:

వేదం తమిజ్ శెయ్ ద పెరుమాళ్ వందార్, తిరువాయ్ మొజి పెరుమాళ్ వందార్, తిరునగరి పెరుమాళ్ వందార్, తిరువాజుతివళందార్ వందార్, తిరుక్కురుగూర్ నంబి వందార్,కారిమారన్ వందార్, శఠగోపర్ వందార్, పరాంకుశర్ వందార్.

 

దీనర్ధం : వేదసారాన్ని కృపచేసిన వారు వేంచేస్తున్నారు, తిరువాయ్ మొజి రచయిత వేంచేస్తున్నారు, తిరునగరి అధికారి వేంచేస్తున్నారు, కారి కుమారులు వేంచేస్తున్నారు, శఠగోపులు వేంచేస్తున్నారు, పరాకుంశులు(ఇతర మతస్తులకు అంకుశం వంటివారు) వేంచేస్తున్నారు అహో.

ఒకసారి దక్షినాది నుండి వచ్చిన ‘మధురై తమిళ్ సంఘ’ తమిళ పండితులు నమ్మాళ్వార్ యొక్క గొప్పదన్నాన్ని అంగీకరించలేదు. వారు సంఘఫలకం( సాహిత్య విలువను కొలిచే ఒక పీఠం) వీరి సాహిత్యాన్ని అంగీకరించునో అప్పటివరకు మేము నమ్మాళ్వార్ వేదసారాన్ని అందిచారు అనే దానిని ఒప్పుకోమన్నారు. మధురకవి ఆళ్వార్,మా ఆచార్యులు నమ్మాళ్వార్ ఎక్కడికి వేంచేయరు అని వారు అనుగ్రహించిన తిరువాయ్ మొళి 10 .5.1 లోని “కణ్ణన్ కళళినై” (கண்ணன் கழலிணை) అనే పాశుర ఖండాన్ని ఒక తాళపత్రముపై వ్రాసి ఆ పండితులకు ఇచ్చిరి. ఆ పండితులు ‘ఒకవేళ ఈ పాశురఖండాన్ని సంఘపీఠము అనుమతిస్తే మేము ఆళ్వార్ గొప్ప అని భావిస్తాము’ అనిరి.

ఆ సంఘపీఠ అధికారి ఆ పాశుర తాళపత్రాన్ని 300 మంది మహాపండితులు కూర్చున్న సంఘపీఠముపై నుంచగా ఆ సంఘపీఠం 300మహాపండితులను క్రిందకు పడవేసి ఆళ్వార్ పాశుర తాళపత్రాన్ని మాత్రమే నిలుపుకొన్నది. ఆ సంఘపీఠ అధికారి ఆళ్వార్ వైభవమును ఒప్పుకొని ఒక పద్యాన్ని సమర్పించారు.

లాదువతో గరుడర్ కీతిరే ఇరావికితిర్ మిన్మనియాదువతో నాయొదువథో యుఱుమిప్పులిమున్ నరికేచరిమున్ నదైయాదువదో పేయదువదో ఎజిలుర్వచిమున్ పెరుమానందిచేర్ వకుళాభరణన్ ఒరాయిరమామఱైయిన్ తమిళ్ ఒరు చొల్ పొరుమో ఉలగిల్ కవియే

 

దీనర్ధం నమ్మాళ్వార్ (శ్రీమన్నారాయణునకు ఆధీనుడై ఉండి వేదసారాన్ని 1000పాశురములలో కూర్చిన)యొక్క ఈ పాశురాన్ని లోకములోని కవుల ఏ పద్యములతో కూడ పోల్చలేము పోల్చినా ఇలా ఉండును.

§ ఈగ కు గరుడన్ కు మధ్యన ఎగిరే సామర్థ్యమునకు ఉన్న వ్యత్యాసం
§ వెలుతురులో సూర్యునికి మిణుగురుపురుగు కు ఉన్న వ్యత్యాసం
§ పులి గాడ్రింపు కు కుక్క మొరగుకు ఉన్న వ్యత్యాసం
§ సింహపు రాచరిక నడకకు నక్క యొక్క సాధారణ నడకకు ఉన్న వ్యత్యాసం
§ దేవ నర్తకి ఊర్వశి నాట్యానికి దయ్యపు నాట్యానికి ఉన్న వ్యత్యాసం
ఇది గననించిన కవులందరూ వారి చేసిన తప్పిదానికి క్షమాప్రార్ధన చేసినారు. మధురకవి ఆళ్వార్ తన సమయమునంతా “గురుం ప్రకాశతే ధీమాన్” అనునట్లుగా ఆచార్య వైభవమునే (ఆళ్వార్ ) కీర్తించడానికే వెచ్చించారు. ఆచార్యుల ప్రభావం వలన అందరు ఉజ్జీవింపబడతారు. కొద్దికాలం తర్వాత మధురకవిఆళ్వార్ తమ ఆచార్యుల(నమ్మాళ్వార్) తిరువడి (పాదపద్మములు)ని చేరుకొని వారికి నిత్య కైంకర్యములు చేయసాగిరి.

వీరి తనియన్:

అవిదిత విషయాంతర శఠారేః ఉపనిషదాముపగాన మాత్ర భోగః|

అపిచ గుణవశాత్తదదైక శేషి మధురకవి హృదయే మమా విరస్తు||

Source:

అడియేన్ శశిధర్ రామానుజ దాసుడు

 

ఆండాళ్ (గోదా దేవి)

 శ్రీః
శ్రీమతేరామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచలమునయే నమః

andal

తిరునక్షత్రం-ఆషాడ , పూర్వఫల్గుణి(ఆడి, పూరం)

అవతార స్థలం -శ్రీవిల్లిపుత్తూర్

ఆచార్యులు – పెరియాళ్వార్

అనుగ్రహించిన గ్రంథములు – తిరుప్పావై మరియు నాచ్చియార్ తిరుమొళి.

పెరియవాచ్చాన్పిళ్ళై తన తిరుప్పావై ఆరాయిరప్పడి వాఖ్యానములో మిగితా ఆళ్వారుల కన్నా అధికంగా ఆండాళ్ గొప్పతనమును  స్థాపించినారు. వివిధ స్తరములలో జీవాత్మ యొక్క వివిధ గుణములను వర్ణిస్తూవాటి మధ్యన ఉన్న వ్యత్యాసాన్నివర్ణించారు.

 •  సంసారులకు(దేహాత్మఅభిమానులు)ఆత్మ స్వరూపమును  గ్రహించిన  ఋషులకు గల మధ్య భేధాన్ని ఒక రాయి మరియు పెద్ద పర్వతము వలె ఉండునని
 • ఋషులకు (తమ స్వప్రయత్నముచే ఙ్ఞాన సముపార్జన చేసినవారు మరియు తమ స్థానము నుండి చ్యుతులవతారు)ఆళ్వారులకు (భగవంతుని కృపచే అనుగ్రహింపబడిన ఙ్ఞానము కలవారు)మధ్య వ్యత్యాసము  ఒక రాయి మరియు పెద్ద పర్వతము వలె ఉండునని
 • ఆళ్వారులకు( ఒకసారి స్వానుభవం పై దృష్ఠి మరియొకసారి మంగళాశాసనముపై  దృష్ఠి సారించెడి వారు) మరియు పెరియాళ్వారులకు (కేవలం మంగళాశాసనము పైననే దృష్ఠి సారించెడి వారు)  మధ్య వ్యత్యాసము  ఒక రాయి మరియు పెద్ద పర్వతము వలె ఉండునని
 • పెరియాళ్వారులకు, మరియు ఆండాళ్ కు   మధ్య వ్యత్యాసము కూడ  ఒక రాయి మరియు పెద్ద పర్వతము వలె ఉండునని దానికి కారణాలు ఇలా తెలిపినారు.
 1. ఆళ్వారులందరు మొదట భగవంతుని అనుగ్రహము పొంది పిమ్మట ఈ సంసారులను వారి బద్దనిద్ర నుండి లేపి, వారికి భగవంతుని యందు ఙ్ఞానాన్నికలిగించారు. కాని భూదేవిగా అవతరించిన  ఆండాళ్ తాను నిద్రనుండి లేచి భగవంతుని సన్నిధికి వెళ్ళి అతనికి సర్వులను రక్షించే భాధ్యతను గుర్తుచేసింది. నంపిళ్ళై తన తిరువిరుత్తం, తిరువాయ్మొళి వాఖ్యానములో , ఆళ్వారులందరును   నిజమైన సంసారులై జన్మించి భగవంతునిచే అనుగ్రహింపబడిన వారు, కాని ఆండాళ్ స్వతహాగా నిత్యసూరిత్వము కలిగిన భూమాదేవి అవతారము  మరియు స్వయంగా భగవంతుని పట్టపుమహిషి అని విశదీకరించినారు.పెరియవాచ్చాన్పిళ్ళై కూడా ఈ విషయాన్నే నిర్థారిస్తారు.
 2. సహజముగా ఆండాళ్ స్త్రీ ,ఇది ఆమె స్వరూపానికి స్వతహాగా భగవంతునితో భార్య/భర్తు సంభంధము కలిగి ఉన్నది(ఆళ్వారులందరూ కూడా స్త్రీ ప్రాయత్వమునే ప్రదర్శించిన పురుష దేహము కలవారు ) కావున ఆండాళ్ కు  భగవంతుని యందు   ప్రేమ   ఆళ్వారుల ప్రేమ కన్నా ఎక్కువ .

పిళ్ళైలోకాచార్యులు తమ ‘శ్రీవచన భూషణము’ లో ఆండాళ్ వైభవమును కొన్ని సూత్రాలలో తెలిపినారు. వాటిని క్రమంగా అనుభవిద్దాము.

 

 • 238సూత్రము(ப்ராஹ்மணோத்தமரான பெரியாழ்வாரும்  திருமகளாரும் கோபஜந்மத்தை ஆஸ்தாநம் பண்ணினார்கள்).బ్రాహ్మణోత్తతమరాన పెరియాళ్వారుమ్ తిరుమగళారుం గోపఙ్ఞానమత్తై ఆస్థాణం  పణ్ణినార్గళ్,ఈ ప్రకరణములో పిళ్ళైలోకాచార్యులు భాగవత(వర్ణ భేధముతో పనిలేకుండా) వైభవమును వర్ణిస్తున్నారు. దీనిలో వీరు గొప్ప వ్యక్తుల వివిధ జన్మముల  గురించి సహాయకారిగా ఉండు భగవత్ అనుభవము/కైంకర్యము ను తెలిపిరి. ఈ సూత్రములో పిళ్ళై , పెరియాళ్వార్ మరియు ఆండాళ్ ఇద్దరు సద్భ్రాహ్మణుల వంశములో జన్మించినప్పటికి తమకు తాము బృందావనములోని గొల్లపిల్లవలె అనునయిం చు కొన్నారు.   భగవంతుని కృపను పొందుటకు కావల్సిన కైంకర్యమును అనుష్ఠించినారు.

 

 • 285సూత్రము-కొడుత్తుక్ కొళ్ళాతే కొండత్తుత్తుక్కుక్ కైక్కులి కొడుక్కవ నెణ్ణుం(கொடுத்துக் கொள்ளாதே கொண்டத்துக்குக் கைக்கூலி கொடுக்கவேணும்).285సూత్రం- ఈ ప్రకరణములో పిళ్ళైలోకాచార్యులు, ప్రతిఒక్కరు చేయవల్సిన కైంకర్యమును గురించి తెలిపినారు. భగవంతుని కృపకు పాత్రులవుటకు చేయు కైంకర్యమును తెలిపిరి. పైని సూత్రములో పిళ్ళైలోకాచార్యులు ఫలము ఆశించని కైంకర్యమును గురించి తెలిపినారు. కాన మనము ఏదీ ఆశించని కైంకర్యమును చేయాలి. ఈ సూత్రములో మనం భగవంతునికి  కైంకర్యమును చేసి అతని దయకు పాత్రులై, ఇంకా  కైంకర్యమును తనకి చేయాలని తెలిపిరి. మామునులు ఈ విషయాన్ని స్వీకరించి ఆండళ్ సూక్తిని అందముగా  వివరించిరి. ఆండాళ్ తన నాచ్చియార్ తిరుమొళి 9.7 లో ఇన్ఱువందు ఇత్తనైయుం అముదుశెతయ్ దిడ ప్పెఱిళ్ ,నాన్ ఒన్ఱు నూరాయిరమాక కొడుత్తు పిన్నుం ఆళుం శెయ్ వన్ ‘’(இன்று வந்து இத்தனையும் செய்திடப்பெரில், நான் ஒன்று நூறு ஆயிரமாகக் கொடுத்து பின்னும் ஆளும் செய்வன்).ముందరి  పాశురములో తిరుమాళిరుంశోలై అళగర్ (సుందరబాహు పెరుమాళ్) కు నూరుపాత్రల వెన్న, నూరుపాత్రల అక్కారివడిశల్ (పరమాన్నం) ను సమర్పించుకోవాలని అనుకొన్నది. ఈ పాశురంలో తాను సమర్పించిన వాటిని స్వామి స్వీకరిస్తే (మరేతర దానిని ఆశించకుండా కేవలము భవంతుని ముఖోల్లాసమునే ఫలితముగా భావించినది) తన కృతఙ్ఞతను తెలిపి  దానికి రెట్టింపు భోగములను సమర్పిస్తానని తెలిపినది.    ఈ విధంగా ఆండాళ్   ఈ పాశురం ద్వారా తాను సాంప్రదాయ శిఖరమును అధిరోహించినది.

ఆయ్ జనన్యాచార్యులు తమ వ్యాఖ్యాన అవతారికలో తిరుప్పావై వైభవమును(ఆండాళ్ గురించి) అందముగా వర్ణించిరి. ఇరండారాయిరప్పడి మరియు నాలాయిరాయిరప్పడి అను ఉభయ వాఖ్యానములను ప్రసాందించిరి .  వాటి అవతారికలో   శ్రీరామానుజులు “ మీరు తిరుపల్లాండు కోసం(మనన శ్రవణములకు) మనుష్యులు దొరకరు కాని తిరుప్పావై కి అలా కాదు” అని సెలవిచ్చిరి. దీనర్థం పెరియాళ్వార్ పాడిన  తిరుపల్లాండు భగవంతునుకు మంగళాశాసనము(ప్రథమ పర్వం) , ఆండాళ్ చే కృపచేయబడిన తిరుప్పావై భాగవతులకు మంగళాశాసనములు(చరమ పర్వం) కావున దానికి తక్కువగా దీనికి విశేషంగా జనులుందురు అని వచనం. ఇంకా ఇలా అన్నారు “ పురుషులు తిరుప్పావై మననశ్రవణములకి అనర్హులు” దీనర్థం భగవంతునికి ప్రతివారు పరతంత్రులై ఉండాలి  ఎలాగైతే స్త్రీ తన భర్తకు సర్వ పరతంత్రురాలుగా ఉండునో అలా”  ఆండాళ్ శ్రీ సూక్తులను మరియు తిరుప్పావై  అర్థమును గ్రహించాలి. మరియు “ స్త్రీ రూపురాలైన  ఆండాళ్ (భూదేవి వలె) తదేకంగా గ్రహించిన భగవానుని అనుభవమును   తిరుప్పావైలో చేర్చినది. ఆండాళ్(ఆళ్వారుల దివ్యాంశములను ప్ర  తిబింబించే) మాత్రమే పరిపూర్ణ భగవదనుభవమును తెలుసుకొనుటకు అర్హురాలు ,ఈవిషయాలని తన తిరుప్పావైలో కూర్చినది. అదే ఆండాళ్ మరియు తన తిరుప్పావై యొక్క  వైభవము

మామునులు తమ ఉపదేశరత్నమాల లో ఆండాళ్ వైభవాన్ని 22,23,మరియు 24పాశురములలో కీర్తించారు.

 •  22 పాశురములో ,మామునులు  భావోద్వేగముతో   ఇలా అంటారు, ఈ సంసారుల ను కాపాడుటకు పరమపద భోగములన్నీ వదిలి ఇలలో శ్రీ భట్టనాథుల కుమార్తెగా జన్మించినది. ఎలాగైతో నూతిలో పడ్డ తన పిల్లావాణ్ణి రక్షించుటకు తల్లి తానే నూతిలో దూకునో అలా. ఆండాళ్ మనందరికి జనని వంటిది కావున పరమపదము నుండి ఈ సంసారులను ఉద్దరించుటకు ఈ సంసారసాగరములోకి దూకినది.

andal-birth-mirror

 • . 23వ పాశురంలో , ఆండాళ్ పుట్టిన ‘ తిరువాడి పూరం ’ కు సమానమైన రోజే లేదు అని అంటారు అలాగే ఆండాల్ కు సమానమైన వారు లేరే లేరు అని సెలవిచ్చారు.
 • 24 వ పాశురంలో ఆండాళ్ ‘అంజుకుడి’(భయముతో వణుకు నేత్రములు గల వారు(పది మంది ఆళ్వారులు))వారికి ఒకే ఒక్క కూతురు. ఆళ్వారులందరికన్నా చాలా వైభవమును కలది ఆండాళ్ . అతి పిన్నవయస్సులో భగవంతుని యందు తన ప్రేమను అభివృద్ధి చేసుకొన్నది. పిళ్ళైలోకం జీయర్ తన వ్యాఖ్యానములో  ‘అంజుకుడి’అంటే ఏమిటో తెలిపిరి ఇలా
 1. ఆళ్వారుల వంశానికి ఒకే ఒక వారసురాలు ఎలాగైతో పరీక్షిత్తు పంచపాండవులకు ఒకే ఒక వారసుడో.
 2. ప్రపన్న కులమునకు చెందిన ఆళ్వారులకు ఒకే ఒక వారసురాలు.
 3. భగవంతునికి దృష్టిదోశం  తగులునో అని భయపడి మంగళాశాసనములు చేయు పెరియాళ్వార్   అను ఒకే ఒక వారసురాలు.

ఆండాళ్ శుద్ధమైన ఆచార్యునిష్ఠ కలిగినది. ఎందుకనగా  పెరియాళ్వార్ భగవానునకు గల సంభందము, ఆండాళ్ కూడా అలాంటి  భగవానునకు గల సంభందము పెంచుకున్నది.

వీటిని దీనిలో చూడవచ్చు

 • తన నాచ్చియార్ తిరుమొళి లో 10.10 వ పాశురములో విల్లిపుతువై విట్టు శిత్తర్ తఙ్గళ్ తేవరై వల్ల పరిశు వరువిప్పరేల్అదుకాణ్డుమే (வில்லிபுதுவை விட்டுசித்தர் தங்கள் தேவரை வல்லபரிசுவருவிப்பரேல் அதுகாண்டுமேఒకవేల పెరియాళ్వార్ తన ఒప్పిచ్చినచో వచ్చిన ప్రియ భగవానుని ఆరాధింతును.
 • మామునులు తన ఉపదేశరత్నమాలలో పదుగురు ఆళ్వార్ లను కీర్తించి , ఆండాళ్, మధురకవి ఆళ్వార్, శ్రీరామానుజులను వర్ణిస్తూ ఈ ముగ్గురు  ఆచార్యులనిష్ఠ బాగా కలిగిన వారని తెలుపుతారు.

వీటిని స్మరిస్తూ ఆండాళ్ చరితమును తెలుసుకుందాము.

గోదాదేవి శ్రీవిల్లిపుత్తూర్ లోని తులసివనం (ప్రస్తుతం నాచ్చియార్ కోవలలో చూడవచ్చు)లో లభించినది. ఎలాగైతే జనకరాజు తన యాగభూమిని నాగలితో దున్నుతుండగా   సీతాదేవి(నాగలి కి పేరు) లభించినదో అలాగే  పెరియాళ్వార్ కు భూదేవి అవతారమైన గోదాదేవి తులసి వనంలో లభించినది. ఆమెకు కోదై/కోద (పూమాల) అని నామకరణం చేశారు.

పెరియాళ్వార్ లేనప్పుడు పెరుమాళ్ కి కట్టిన మాలలను తాను ధరించి తాను పెరుమాళ్ కి  సరిపోతానో లేదో అని  బావిలో తన సౌందర్యాన్ని చూసుకొనేది ఆండాళ్ . పెరియాళ్వార్ తిరిగి వచ్చి ఆండాళ్  ధరించి వదిలిన మాలలను పెరుమాళ్ కు సమర్పించేవారు. ఇలా కొంతకాలంగా జరిగింది. ఒకనాడు పెరియాళ్వార్ ఆ మాలలను పెరుమాళ్ కు సమర్పించక ముందు ఆండాళ్ ధరించుటను గుర్తించారు.  పెరియాళ్వార్ చాలా ఆశ్చర్యపోయి ఆనాడు ఆ మాలలను పెరుమాళ్ కు సమర్పించలేదు. ఆ రోజు రాత్రి ఎంపెరుమాన్,  పెరియాళ్వార్ కలలో కనిపించి ఈ రోజు మాలలను ఎందుకు సమర్పించలేదు అని అడిగారు. దానికి పెరియాళ్వార్ ఆ మాలలను మీకు సమర్పించక మునుపే మా అమ్మాయి గోద ధరించి విడచినది  కావున అవి ఉచ్ఛిష్టములు అయ్యాయి కాన సమర్పించలేదు అన్నారు. దానికి ఎంపెరుమాన్ నాకు గోద ధరించి విడచిన మాలలనే సమర్పించుము వాటికి గోదాదేవి యొక్క భక్తి సువాసన తగిలినది అని అన్నాడు. దీనికి పెరియాళ్వార్చాలా ఆశ్చర్యపడి ఆమెతో గల విశేష సంభందముచే ఆనాటి నుండి ‘ఆండాళ్(నన్ను రక్షించడానికి వచ్చిన ఆమె)’ అని సంభోదించసాగారు. ఇక ప్రతిరోజు ఆండాళ్ ధరించి విడచిన శేషమాలలనే పెరియాళ్వార్ ,  ఎంపెరుమాన్ కు సమర్పించసాగిరి.

భగవంతునితో సహజ సంబంధము కలిగిన భూమాదేవి పరమభక్తితో ఇలలో ఆండాళ్ నాచ్చియార్ గా అవతరించినది. ఈ విశేష  సంబంధము ఆళ్వార్ల సంబంధము కన్నా చాలా ఎక్కువ. ఆ సంబంధ విశేషముచే విరహము భరించలేక ఎంపెరుమాన్  వివాహమాడుటకు దారిని వెతకనారంభించినది ఆండాళ్.  క్రిందట గోపికలు కృష్ణుని పొందుటకు  ఆచరించిన  రాసక్రీడను అనునయించినటుల, గోద కూడ వటపత్రశాయిని శ్రీ కృష్ణునిగా, అతని కోవెలను నందగోపుని గృహముగా, శ్రీవిల్లిపుత్తూర్ ను గోకులముగా , తన స్నేహితురాండ్లను గోపికలుగా భావించి ‘తిరుప్పావై’ వ్రతమును ఆచరించినది.

తిరుప్పావై లో ఆండాళ్ ఇలా అందముగా వర్ణించినది:

 • ప్రాప్యము(పొందవలసినది) ప్రాప్యకం(పొదించేవాడు) భగవంతుడే అని స్థాపించినది.
 • పూర్వాచార్యుల అనుష్ఠానముననుసరించి (శిష్ఠాచారము) ఏవి చేయదగినవో ఏవి చేయదగనివో నిరూపించినది.
 • భగవదనుభవము  స్వానుభవముకన్నా గోష్ఠిగా సేవించుట విశేషమని  తాను పదిమంది గోపికలను లేపి  కృష్ణుని సన్నిధికి తీసుకెల్లినది.
 • మనము  భగవంతున్ని, అతని  దాసులతో అనగా ద్వారపాలకులు, బలరామ,యశోద,నందగోప మొదలైన వారితో ఆశ్రయించవలెను.
 • భగవంతున్ని, పిరాట్టి(లక్ష్మీదేవి)పురుషాకారముతో ఆశ్రయించవలెను.
 • సదా భగవంతునికి మంగళాశాసనములు చేయవలెను.
 • అతనికి కైంకర్యమును చేయవలెనని ఆశించవలెను-కైంకర్యము జీవాత్మ యొక్క స్వరూపము కావున భగవంతుడు మన కైంకర్యమును మన్నిస్తాడు.
 • కైంకర్యమునకు అతనే ఉపాయమని(చేయించేవాడు)  తలవాలి కాని మన ప్రయత్నమే కైంకర్యమునకు కారణమని తలవరాదు.
 • వాని ఆనందముకై కైంకర్యమును ఆచరించాలి కాని ప్రతిఫలమును ఆశించరాదు.

కాని భగవంతుడు గోదకు కనిపించలేదు కాని ఆమెని స్వీకరించాడు. .ఆండాళ్ భరించలేని బాధ తో తన నాచ్చియార్ తిరుమొళి లో వాపోయినది.  ఎన్నో విశేషములను ఆండాళ్ తన  నాచ్చియార్ తిరుమొళిలో  తెలిపినది. ఆండాళ్  తన నాచ్చియార్ తిరుమొళిని ఎవరైతే దీనిని వింటారో/సేవిస్తారో వారు పరమపదమును చేరుతారనిరి “మానిడవర్కెన్ఱు పేశుపడిళ్ వాళకిల్లేన్ (மானிடவர்க்கென்று பேச்சுப்படில் வாழகில்லேன்) భగవంతున్ని తప్ప నేనితరులెవరిని వివాహమాడ ఒకవేళ జరిగితే నేను బతకను. . తన ‘వారణ మాయిరం’(9.6)లో భగవంతున్ని వివాహమాడినటుల కల కన్నది. పెరియాళ్వార్ , ఆండాళ్ కు అర్చావతార వైభవమును తెలుపగా ఆండాళ్ ‘తిరువరంగత్తాన్’ (శ్రీరంగనాథున్ని) ఇష్ఠపడినది.ఆండాళ్ కోరికను ఎలా తీర్చాలి అని పెరియాళ్వార్ ఆందోలనతో చింతించసాగిరి. ఒకనాడు కలలో శ్రీరంగనాథుడు కనిపించి ఆండాళ్ ను శ్రీరంగమునకు తీసుకరావల్సినది అక్కడ కలుద్దామన్నాడు. ఆ మర్నాడు శ్రీరంగనాథుడు తన పరిచారకులను, అర్చకులను, ఛత్రములను, చామరములను,అందమయిన పల్లకిని, ఆండాళ్ ను కొనిపోవుటకు శ్రీవిల్లిపుత్తూరునకు పంపగా పెరియాళ్వార్ చాలా ఆనందపడెను. పెరియాళ్వార్ శ్రీవిల్లిపుత్తూరు వటపత్రశాయి దగ్గర ఆనతి తీసుకొని పల్లకిలో ఆండాళ్ ను కూర్చుండపెట్టి మేళతాళములతో పెద్ద ఊరేగింపుగా శ్రీరంగమునకు బయలుదేరెను.

శ్రీరంగమునకు చేరుకున్న తరువాత చాలా అందముగా అలంకరించబడిన ఆండాళ్ పల్లకిని దిగి, కోవెలలోకి ప్రవేశించి, శ్రీరంగనాధుని గర్భగృహములోకి వెళ్ళి , శ్రీరంగనాథుని (పెరియ పెరుమాళ్) పాదపద్మములను సేవించి వాటిలో అదృశ్యమయి తన దివ్యధామమైన పరమపదమును చేరుకొన్నది.

periyaperumal-andal

 

ఈ సంఘటనను అందరు చూసి ఆశ్చర్యచకితులై పెరియాళ్వార్ ను కీర్తించసాగిరి. పెరియపెరుమాళ్ అందరి సమక్షాన, సముద్రుడు తనకు మామగారైనట్లు ఈ   పెరియాళ్వార్ కూడా ఈనాటి నుండి నాకు మామగారైనారు అని శఠగోప మర్యాదలు చేయించి వటపత్రశాయి పెరుమాళ్ కి కైంకర్యము చేయుటకై శ్రీవిల్లిపుత్తూర్ నకు సాగనంపినారు. ఆండాళ్ యొక్క కీర్తిని మనము మననము మరియు శ్రవణము(కనీసం మార్గలి మాసంలో నైన) సేవించవలెను. ఎన్నో దివ్యమైన ఆచార సంప్రదాయాలు, శ్రీ సూక్తులు మన ఆండాళ్ జీవన చరితము నుండి మరియు తన దివ్యప్రబంధముల నుండి మనం నిత్యము సేవించవలెను.

ఆండాళ్ మరియు తిరుప్పావై ప్రబంధము యొక్క వైభవమును శ్రీ భట్టర్ (పరాశర) శ్రీసూక్తుల వల్ల తెలుసుకొనవచ్చు. శ్రీభట్టర్, అందరు తిరుప్పావై యొక్క 30పాశురములని ప్రతిరోజు తప్పక సేవించవలెనని నియమనం చేసిరి. వీలుకాకపోతే కనీసం “ శిత్తుం శిరుకాలే ” అనే పాశురాన్ని మాత్రమునైనను  ప్రతిరోజు తప్పక సేవించవలెనని, అదీకాకపోతే శ్రీభట్టర్ కు తిరుప్పావైకి గల సంబంధమును ఒకసారైనను  తలుచుకొనవలెను. అప్పుడే మనం భగవంతుని కృపకు పాత్రులం అవతాము, ఎలాగైతే తల్లిగోవు గడ్డితో చేసిన లేగదూడను చూసి పాలను స్రవించునో అలా.  ఆండాళ్ తిరువడికి మరియు తిరుప్పావై   సంబంధముగల భట్టర్  తలచినచో   భగవంతుడు మనను ఒక పాశురం సేవించినా 30పాశురాలు  సేవించినా తన నిర్హేతుక జాయమాన కృపను మనపై ప్రసరింప చేయును. ఆండాళ్(శ్రీభూదేవి) తిరుప్పావై శ్రవణమననము చేసిన వారిపై  నిర్హేతుక జాయమాన కృపను ప్రసరింప చేయుమని శ్రీవరాహపెరుమాళ్ ని కోరినది. ఆండాళ్    నిర్హేతుకజాయమాన కృపవలన ఈ సంసార సాగరాన జన్మించి, మనకోసమై  తిరుప్పావై ని అనుగ్రహించినది. అలాగే మనం భగవంతుని యొక్క దివ్యమైన కృపకు శాశ్వతంగా పాత్రులమై సంసార తరంగముల నుండి విముక్తిని పొంది పరమపదములో భగవదనుభవమును/కైంకర్యమును పొందుతాము.

ఆండాళ్ తనియ:

నీళా తుఙ్గ స్తనగిరి తటీ సుప్తం ఉద్భోద్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిరసిద్ధం అధ్యాపయన్తీ |
స్వోఛి ష్ఠాయాం స్రజినిగళితం యా బలాత్ కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదం మిదం భూయ ఏవాస్తు భూయః ||

நீளா துங்க ஸ்தனகிரி தடீ ஸுப்தம் உத்போத்ய க்ருஷ்நம்
பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதி சத சிரஸ் சித்தம் அத்யாபயந்தீ
ஸ்வோசிஷ்டாயாம் ச்ரஜிநிகளிதம் யாபலாத் க்ருத்ய புங்க்தே
கோதா தஸ்யை நம இதம் இதம் பூய ஏவாஸ்து பூய:

 

Her archAvathAra anubhavam is already discussed in here –http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-andal-anubhavam.html.

 

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాసః

ఆధారం: వ్యాఖ్యానములు, ఆరాయిరప్పడి గురుపరంపర ప్రభావం

Source

కులశేఖర ఆళ్వార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

kulasekarazhwar

తిరునక్షత్రము: మాఘ మాసము(మాశి),పునర్వసు (పునర్పూసమ్)

అవతార స్తలము: తిరువంజిక్కళమ్

ఆచార్యులు: విష్వక్సేనులు

శ్రీ సూక్తులు: ముకుంద మాల, పెరుమాళ్ తిరుమొజి

పరమపదము చేరిన ప్రదేశము: మన్నార్ కోయిల్ (తిరునల్వేలి దగ్గర)

కులశేఖర ఆళ్వారుల క్షత్రియ కులములో ( అహం భావమును పెంచుటకు అనుకూలమైనది) జన్మించినప్పటికి  ఎమ్పెరుమాన్ మరియు భక్తుల యెడల చాలా విధేయుడై ఉండేవారు ఇదే వారి వైభవము .

దీనికి గల కారణము తన మహాభక్తి మరియు పెరుమాళ్ (శ్రీ రాముడు) తో గల సంభందము, దీని వలన  కులశేఖర పెరుమాళ్ గా ప్రసిద్దులైరి. తన పెరుమాళ్ తిరుమొజిలో మొదటి పదిగములో (ఇరుళియచ్ చుడర్ మనిగళ్) పెరియ పెరుమాళ్ కు  మంగళాశాసనము చేసిన  వెంటనే తన రెండవ పదిగములో(తేట్టరుమ్ తిరల్ తేన్) శ్రీవైష్ణవుల వైభవమును తెలిపిరి.  శ్రీవైష్ణవుల సంభందమువలన వీరు ప్రసిద్ధి పొందిరి ఇది వీరి  చరిత్రలో మనము మునుముందు తెలుసుకుందాము.

జీవాత్మ అసలు స్వరూపము శేషత్వమే అని తనకు తానే తన పెరుమాళ్ తిరుమొజి చివర(10.7) ఈ విధముగా తెలిపిరి “తిల్లైనగర్ చిత్తిరకూడమ్ తన్నుళ్ అరశుఅమర్ న్దాన్ అడిశూడుమ్ అరశై యల్లాల్ అరశాగ ఎణ్ణేన్ మర్ట్ర్ఱ్ఱశు తానే” (தில்லைநகர் சித்திரகூடம் தன்னுள் அரசமர்ந்தான் அடிசூடும் அரசை அல்லால் அரசாக எண்ணேன் மற்றரசு தானே) దీని అర్థము: తిరుచిత్రకూట (గోవిన్దరాజ ఎమ్పెరుమాన్) రాజు శ్రీ పాద పద్మములను తప్ప  నేను మరేతర దానిని రాచరికంగా భావించను.  జీవాత్మకు దేవతాంతర/విషయాంతర సంబంధములను     ఈ పదముల ద్వారా సందేహములను స్పష్టముగా నిర్మూలించెను.

“అచిత్ వత్ పారతం త్రియము ”వలె జీవాత్మ స్వరూపం ఉండవలెనని తిరువేంకట పదిగములో . 4.9లో తీర్మానించెను ,

వారి వివరణ~:

శెడియాయ వల్వినైగళ్ తీర్కుమ్ తిరుమాలే
నెడియానే వేఙ్గడవా! నిన్ కోయిలిన్ వాశల్
అడియారుమ్ వానవరుమ్ అరమ్బైయరుమ్ కిడన్దు ఇయఙ్గుమ్
పడియాయ్   క్కిడన్దు ఉన్ పవళ వాయ్ కాణ్బేనే||

செடியாய வல்வினைகள் தீர்க்கும் திருமாலே
நெடியானே வேங்கடவா! நின் கோயிலின் வாசல் 
அடியாரும் வானவரும் அரம்பையரும் கிடந்தியங்கும்
படியாய்க் கிடந்து உன் பவள வாய்க் காண்பேனே

వేంకటేశా! అనాదికాలముగా  ఆర్జించిన పాపాలను ఛేదించే వాడివై, తిరుమలలో వేంచేసి ఉండే  నీ భక్తులు, దేవతలు కలసి సంచరించేటట్లు నీ దివ్యసన్నిధి  వాకిటిలో అందరు కాలితో తొక్కే గడపగా పడిఉండి  పగడము వంటి పరమభోగ్యమైన నీ అధరోష్ఠాన్ని ఎల్లప్పుడూ సేవించే భాగ్యాన్ని కలవాడను కావాలి.

పెరియవాచ్చాన్ పిళ్ళై జీవాత్మ యొక్క రెండు సంబంధములను గురించి ఈ విధముగా వివరించిరి.

 • (పడియై కిడందు) అచిత్ (అచేతనములు) అను జీవాత్మ ఎల్లప్పుడూ ఎమ్పెరుమాన్ ఎడల పూర్తి నియంత్రణను కలిగి ఉండవలెను.ఎలాగైతే చందనము మరియు పుష్పములు వాటి వ్యక్తిగత ఆసక్తికాకుండా వినియోగదారుని ఆనందమును గురించి ఉండునో ఆ విధముగా.
 • (ఉన్ పవళవాయ్ కాణ్బేనే) చిత్(చేతనములు) ఎల్లప్పుడూ ఎమ్పెరుమాన్ మా యొక్క సేవను అంగీకరించి ఆ సేవచే ఆనందమును పొందుచున్నాడని గ్రహించవలెను.ఒకవేళ మేము ఆ సత్యమును గ్రహించని యెడల మాకు అచిత్ నకు ఏ విధమైన తేడాలేదు.

ఈ సూత్రమును “అచిత్ వత్ పారతన్త్రియమ్” అని పిలుచుదురు. దీనియొక్క అర్థము జీవాత్మా పూర్తిగా ఎమ్పెరుమాన్ చే నియంత్రించబడును మరియు ఎంపెరుమాన్ తో అన్య  ఇది మన శ్రీవైష్ణవ సిద్దాంతములో అతి ముఖ్యమైన సూత్రము.

మనము ఇదివరకే ఏ విదముగా మామునిగళ్ తనయొక్క అర్చావతార అనుభవము అను సంచికలో కులశేఖర ఆళ్వార్ యొక్క గొప్పతనమును అనుభవించినాము. – http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-kulasekara.html.

భాగవతులను వారి యొక్క జన్మని బట్టి భేదమును చూపరాదని వివరించిరి మరియు చివరన నమ్మాళ్వార్ మరియు ఇతర పెద్ద్డల యొక్క గొప్పతనమును చెప్పిరి.ఆ భాగములో,జన్మల యొక్క గొప్పతనమును వివరించుచూ అది భగవత్ కైంకర్యము చేయుటకు అనుకూలముగాఉండునని చెప్పిరి, నాయనార్ గొప్ప మనుషులైన వారు కడ జాతి జన్మలో జన్మించినప్పడికినీ ఏ విదముగా కైంకరమును చేయుటకు అనుకూలపడెనో ఇక్కడ దృష్టాంతములతో సహా ఉదహరించెను.ఇక్కడ 87వ చూర్ణికలోని సారమును మరియు అది ఏ విదముగా కులశేకర ఆళ్వారునకు సంభదించునో చూద్దాము.

అన్ణైయ ఊర పునైయ అడియుమ్ పొడియుమ్ పడప్ పర్వత భవణన్ఙ్గళిలే ఏతేనుమాగ జణిక్కప్ పెఱుగిఱ తిర్యక్ స్తావర జణ్మన్ఙ్గళై పెరుమక్కళుమ్ పెరియోరుమ్ పరిగ్రహిత్తుప్ ప్రార్త్తిప్పర్గళ్.

அணைய  ஊர புனைய அடியும் பொடியும் படப் பர்வத பவநங்களிலே ஏதேனுமாக ஜநிக்கப் பெறுகிற திர்யக் ஸ்தாவர ஜந்மங்களை பெருமக்களும் பெரியோரும் பரிக்ரஹித்துப் ப்ரார்த்திப்பர்கள்.

నిత్యసూరులైన అనంతుడు, గరుడుడు మొదలగువారు,పానుపుగా (ఆదిశేశుడు),ఒక పక్షిలా (గరుడాళ్వార్), మొదలగు వాటిగా జన్మించుటకు అవకాశము కోరకు చూసెదరు. నమ్మాళ్వార్ ఏ విదముగా తిరుత్తుజాయ్ ఎమ్పెరుమానుకి ప్రియమో చెప్పిరి,కారణము వారి దానిని ఎక్కడినా దరించుదురు(తన శిరస్సుపై,భుజములపై,వక్షస్తలముపై,మొదలగు).గొప్ప ఋషులైన పరాశర, వ్యాస, శుఖ, మొదలగువారు, బృందావనములో మట్టిగాననైనా ఉండవలెనని కోరిక ఎందుకనగా కృష్ణుడు మరియు గోపికల పాద పద్మముల యొక్క స్పర్శ తలుగునని. కులశేకర ఆళ్వార్ కూడా తిరువేంకటము కొండపై ఏదైనా ఒక వస్తువుగా ఉండవలెనని కోరిక. ఆళవందార్ కూడా ఒక శ్రీవైష్ణవుడి యొక్క గృహములో పురుగానైనా జన్మించవలెనని కోరుకొనెవారు. క్రింద చూర్ణికలో కులశేకర ఆళ్వార్ యొక్క కోరికని మామునిగళ్ ఏ విదముగా వ్యాఖ్యానించిరో క్రొద్దిగా చూద్దాము.

పెరుమాళ్ తిరుమొళి 4వ పదిగములో, ఆళ్వార్ తిరువేగండముపై ఎదైనా ఒక సంభందమును కలిగిఉండవలెనని కోరిక – వారు నిత్యము తిరువేంగడముపై ఉండవలెనని కోరుకొనేవారు.

sri-srinivasar

వారికి గల కోరికలు~:

 • కొండపై గల కొలను దగ్గర ఒక పక్షిగా
 • కొలనులో ఒక చేపలా ఎందుకంటే పక్శినైతే ఎగిరిపోవచ్చు
 • బంగారు పాత్రలా ఎవరైనా ఎమ్పెరుమానుకి కైంకర్యము చేయువారి చేతిలో,ఎందుకనగా చేప ఈదుతూ వెళ్ళవచ్చు
 • చెట్టుపై ఒక పువ్వులా,కారణము బంగారపు పాత్రను కలిగి ఉండడముచే అహంభావము కలిగి నా యొక్క ఙ్ఞానము దారితప్పును.
 • ఒక పనికిరాని చెట్టులా కారణము ఒకసారి పువ్వుని వాడి,బయట పడివేయుదురు.
 • తిరువేంకటముపై ఒక నదిలా,కారణము పనికిరాని చెట్టుని ఒకరోజు తీసివేయుదురు
 • సన్నిదికి వెళ్ళు దారిలో మెట్లవలె,కారణము నది ఒక రోజు ఎండిపోవచ్చు
 • సన్నిదికి ఎదురుగా గల మెట్టులా (దీనినే కులశేకర పడి అని వ్యవహరించుదురు), కారణము మెట్లవలె ఉండడమువలన, కొన్ని రోజుల తదుపరి దారి మారవచ్చు.
 • ఎలానైనా నిత్యము  తిరువేంకటముపై నివాసము ఉండేలా ఎదైనా – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములో ఈ విదముగా చెప్పిరి, ఆళ్వార్ కనీసము తిరువేంకటముడైయాన్ స్వయముగా ఆ కొండతో నిత్య సంభదము కలిగి ఉండునని మరిచిరి.వారు ఆ విదముగానే భట్టర్ వారి సూక్తులని గుర్తించిరి “వేరెవరికినీ తెలియకుండా నాకు మాత్రమే ఇక్కడ ఉన్నట్టు తెలియవలెను,కాకున్ననూ  తిరువేంకటముడైయాన్ మాత్రమే నేను అక్కడ ఉన్నట్టు తెలియవలెను,వేరెవరు నేను ఇక్కడ ఉన్నట్టు కీర్తించరాదు.ఇక్కడ నిత్య వాసము చేయు విదముగా ఉంటే అదే నాకు చాలా సంతోషము.”.

కులశేకర ఆళ్వార్ల యొక్క గొప్పతనము ఆ విదముగా ఉండినది,వారు తమ యొక్క స్వలాభమును కాక్షించక పూర్తిగా భగవత్/భాగవత సంభందము గురించే తపించెడివారు.

దీనిని మన మదిలో ఉంచుకొని,ఇప్పుడు వారి యొక్క చరితమును చూద్దాము.

శ్రీ కులశేకర పెరుమాళ్ కొల్లినగర్ (తిరువన్జిక్కాళమ్) అను రాజ్యములో క్షత్రియ వంశములో శ్రీకౌస్తుబము యొక్క అంశముతో జన్మించిరి,దివ్య సూరి చరితములో గరుడ వాహన పండితర్ చూపినవిదముగా (ఆళ్వారులు ఎమ్పెరుమాన్ దివ్య కటాక్షముచే సంసారమును వదిలిరి). వీరిని కొల్లి కావలన్, కొజియర్ కోన్, కూడల్ నాయకన్, మొదలగు నామములతో కూడా వ్యవహరించుదురు.

వారి యొక్క తనియన్ లో వివరించినట్టు“మాఱ్ఱలరై, వీరన్ఙ్కెడుత్త చెన్ఙ్కోల్ కొల్లి కావలన్ విల్లవర్కోన్, చేరన్ కులశేకరన్ ముడివేన్తర్ శికామణి” (மாற்றலரை, வீரங்கெடுத்த செங்கோல் கொல்லி காவலன் வில்லவர்கோன், சேரன் குலசேகரன் முடிவேந்தர் சிகாமணி) అర్థము వారు చేర రాజ్యమునకు రాజు మరియు తన యొక్క శత్రువులను నిర్మూలించెడిగ గొప్ప బలము కలిగిన రథములు,గుఱ్ఱములు ,ఏనుగులు మరియు వారి యొక్క శత్రువులను ప్రారదోలే సైనికులు కలరు. వారు శాస్త్రము ప్రకారము రాజ్యమును పరిపాలించెడివారు మరియు వారు శ్రీరాముని వలె గొప్పవారైనప్పడికినీ ఎప్పుడూకూడా తన కన్నా తక్కువ బలము కలవారిని ఇబ్బందులకు గురిచేసేవారుకాదు,వారు చాలా తన యొక్క పరిపాలనను ఉదాత్తముగా మరియు ఎంతో అణుకువతో కొనసాగించేవారు.

గొప్ప రాజైనప్పడికినీ ,వారు పూర్తి ఆలోచనతో కూడిన నిర్ణయములతో వారి యొక్క రాజ్యమును తమ యొక్క ఆదినములో ఉంచుకొనేవారు. శ్రీమన్ నారాయణుడు మాత్రమే పరమపదమునకు మరియు సంసారమునకు పూర్తి అధికారి అని,వారి యొక్క నిర్హేతుక కృపచే, అపారమైన దైవిక విషయములందు పరిఙ్ఞానమును కలిగి ఉండి,తన యొక్క రజో/తమో గుణములను నిర్మూలించుకొని పూర్తిగా సత్వ గుణముచే తన యొక్క దివ్యమైన స్వరూపము (సత్ప్రవర్తన), రూపము (అవతారము), గుణము (గుణములను), విభూతి (తన యొక్క సంపద/శక్తి) మరియు చేశ్టితములు (లీలను) పూర్హిగా తెలియపరిచెను.వాటిని చూసి మరియు అవగతమును చేసుకొని,భగవత్ విశయములందు అలోచన లేకుండా తమ యొక్క శరీరము యొక్క అవసరములను గురించి చింతించే సంసారులను చూసి  ఆళ్వార్ వేదన చెందెను.నమ్మాళ్వార్ చెప్పిన విదముగా గొప్ప దనము పెద్ద అగ్ని వంటిదని అది ఆ యొక్క జీవిని శరీరక అవసరములందు మరలా మరలా వ్యామోహమును పెంపొందిచును, కులశేఖర ఆళ్వార్, శ్రీ విభీషణాళ్వాన్ వలేతన యొక్క రాజ్యముతో ఎటువంటి సంభదము లేకుండా ,తన యొక్క సంపదను శ్రీ రాముని పాదాల వద్ద ఉంచి శరణు వేడెను.

వారు శ్రీరంగము మరియు శ్రీ రంగనాదులపై ముఖ్యముగా ప్రాపంచిక విషయములను వదిలి ఎల్లప్పుడూ శ్రీ రంగనాధుని గుణములను కీర్తించుదురో వారి యెడల వ్యామోహమును పెంచుకొనెను.వారి సమయమును శ్రీవైష్ణవులైన సాదువులతో (వైష్ణవాగ్రేసః –వైష్ణవ నాయకులు) ఎక్కువగా గడపవలెనని  మరియు వారిని ఈ విదముగా గుర్తించవలెనని “అన్ణియరన్ఙ్గన్ తిరుముఱ్ఱత్తు అడియార్” (அணியரங்கன் திருமுற்றத்து அடியார்) అర్థము ఎల్లప్పుడూ తమ యొక్క సమయమును శ్రీరంగనాధుడి ఆలయములో గడిపెవారు .శ్రీరంగ యాత్రని గురించి తెలుసుకొని శ్రీరంగ యాత్ర చేయవలెననే కోరిక ఉంటే పరమపదము ప్రాప్తించునని ,వారు ఎల్లప్పుడూ శ్రీరంగమును గురించి ఆలోచించెడివారు.

అదేవిదముగా,వారు తిరువేంకటముపై (తిరుమల) గొప్ప సంభదమును ఏర్పరచుకొనిరి అది స్వామి పుష్కరిణి కలిగి ఉండినది.అది గంగా, యమునా మొదలగు నదుల కన్నా గొప్పనైనదని కీర్తించబడెను. ఆండాళ్ కూడా  “వేన్ఙ్కటత్తైప్ పతియాగ వాజ్వీర్గాళ్” (வேங்கடத்தைப் பதியாக வாழ்வீர்காள்) అని చెప్పెను.అర్థము మనము ఎప్పుడూ మనసికముగా  తిరువేంకటముపై నివాసము చేయవలెను అక్క్డ గొప్ప ఋషులు  మరియు మహాత్ములు నిత్య వాసము చేయుదురు,వారు కూడా అదేవిదమైన కోరికని కలిగిఉండెను .మొదటనే మనమూ ఆ దివ్యదేశములో వారి కోరికలైన పక్షి వలె, చెట్టు లేదా  రాయి వలెనైనా ఉండవలెననీ చూసిఉంటిమి.ఇది కాకుండా వారు మిగిలిన దివ్యదేశములలోని అర్చావతార ఎమ్పెరుమానులని మరియు వారి యొక్క భక్తులని సేవించవలెనని కోరికను కలిగి ఉండెను.

వివిద పురాణములను, ఇతిహాసములను మొదలగు వాటిని పరిశీలించిన తదుపరి,వారు గొప్ప సంస్కృత శ్లోక గ్రంథమైన  ముకుంద మాలని వ్రాసిరి.శ్రీరామాయణము యొక్క గొప్పతనమును క్రింది శ్లోకములో వివరించిరి:

వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మణా

வேத வேத்யே பரே பும்ஸி ஜாதே தசரதாத்மஜே
வேத~: ப்ராசேதஸாதாஸீத் ஸாக்ஷாத் ராமாயணத்மநா

rama-pattabishekam

కులశేఖరాళ్వార్  ప్రతిరోజు దినచర్యగా శ్రీరామయణాన్ని శ్రవణం చేస్తు ప్రవచిస్తున్నారు. ఆళ్వార్ ఒక్కొక్క సమయం లో శ్రీరామయణం లో తన్మయత్వంగా  మునిగి తమనుతాము మరచిపోతున్నారు.

ఒకసారి ఉపన్యాసకుడు శ్రీరామాయణంలోని ఖరదూషణాదులు మరియు పదనాల్గువేలమంది రాక్షసులు శ్రీరామునితో యుద్ధానికి సిద్ధమవుతుండగా శ్రీరాముడు ఒక గుహలో సీతాదేవిని ఇళయపెరుమాళ్ (లక్ష్మణుని) సంరక్షణలో ఉంచి  పదనాల్గువేలమంది రాక్షసులతో తానొక్కడే ఒంటి చేత్తో క్రమ  పరుస్తుండగా,     ఋషులందరు భయముతో చూస్తుండేఘట్టం ప్రవచిస్తుండగా,ఆళ్వార్  నిష్ఫల భావోద్వేగముతో శ్రీరామునికి యుద్ధములో సహకరించుటకు తన సేనలకు  యుద్ధరంగం వైపు  వెళ్ళుటకు సిద్ధం కావల్సినదని ఆఙ్ఞాపించినాడు.  దీనిని చూసిన మంత్రులు కొందరిని రాజు యాత్రకు ఎదురుగావచ్చేలా చేసి వారితో  “మహారాజా శ్రీరాముడు యుద్ధములో విజయాన్ని వరించాడు, సీతాదేవి అతని గాయాలకు ఉపశమన చర్యలు చేస్తున్నది కావున మీరిక వెళ్ళవలసిన పనిలేదు” అని చెప్పించారు. ఆళ్వార్ సంతుష్టి చెంది తన రాజ్యానికి వెనుదిరిగాడు.

మంత్రులందరు ఆళ్వార్ వింతప్రవర్తన గురించి ఆలోచించి శ్రీవైష్ణవుల అనుభంధ వ్యామోహము నుండి విడదీయాలని నిర్ణయించుకొన్నారు. మంత్రులందరు రాజును శ్రీవైష్ణవులనుండి దూరం చేయుటకు ఒక యుక్తిని పన్నిన్నారు. వారు ఆళ్వార్ తిరువారాధన గది నుండి ఒక వజ్రాలనగను దొంగిలించి ఆ దొంగతనాన్ని అత్యంత సన్నిహితులైన శ్రీవైష్ణవులపై మోపినారు.  ఇది తెలసిన ఆళ్వార్ విషనాగుతో ఉన్న ఒక కుండను తెప్పించి దానిలో  తన చేతిని పుడుతూ “శ్రీవైష్ణవులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే  పాము నన్ను కాటువేయును”  అనగా, వారి నిజాయితికి ఆ పాము కాటువేయలేదు. దీనిని చూసిన మంత్రులు సిగ్గుచెంది ఆ నగను తిరిగి ఇచ్చివేసి ఆళ్వార్ కు  మరియు ఆ శ్రీవైష్ణవులకు క్షమాప్రార్ధన చేసిరి.

క్రమంగా ,ఆళ్వార్  ఈ సంసారుల మధ్యన ఉండుటకు ఇష్టపడక, ‘శౌనక సంహిత’ లో చెప్పిన విధంగా “భగవంతుని కీర్తించని  సంసారుల మధ్య నివసించుట ఒక అగ్ని గోళం మధ్యన ఉండుట లాటింది” అని విచారించిరి.

(ஆனாத செல்வத்து அரம்பையர்கள் தற்சூழ வானாளும் செல்வமும் மண்ணரசும் யான் வேண்டேன்)

ఆళ్వార్ తన రాజ్య భారాన్ని, బాధ్యతలను తన కుమారుని చేతిలో ఉంచి వానికి పట్టాభిషేకం చేసి ఇలా నిర్ణయించుకొన్నాడు “ ఆనాద శెల్వతత్తు అరంబైయర్గళ్ తార్చుజ వానాళుం శెళ్వముం మన్నాన్నరశుం యాన్ వేన్నాదెన్”  దీనర్థం తను సేవకులచే పరివేష్టించబడి, వినోదాలను మరియు  సంసదను ఇక కోరుకోలేదు.

ఆళ్వార్  తన సన్నిహితులైన శ్రీ వైష్ణవులతో  రాజ్యాన్ని వదిలి శ్రీరంగమును చేరి  బంగారపు పళ్ళెములో వజ్రమువలె ఉన్న( ఆదిశేషునిపై పవళించి ఉన్న) శ్రీరంగనాధున్ని మంగళాశాసనము చేసినారు.  తన భావ సంతృప్తి ఫలముకై ప్రతి క్షణమును ఎంపెరుమాన్ కీర్తిస్తు, “ పెరుమాళ్ తిరుమొజి” రచించి అందరి ఉన్నతికై ఆశీర్వదించినారు. కొంతకాలము ఈ సంసారములోజీవించి చివరకు దివ్యమైన పరమపదమునకు వేంచేసి పెరుమాళ్ కి నిత్య కైంకర్యమును చేసిరి.

వారి తనియన్:

ఘుష్యతే  యస్య నగరే  రంగయాత్రా దినేదినే |

తమహం శిరసా వందే రాజానం కులశేఖరమ్ ||

குஷ்யதே யஸ்ய நகரே ரங்கயாத்ரா தினே தினே
தமஹம் சிரஸா வந்தே ராஜாநம் குலசேகரம்

వీరి అర్చావతార అనుభవం  క్రితమేఇక్కడ చర్చించబడినది: – http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-kulasekara.html.

అడియేన్ శశిధర్ రామానుజదాస:

Source

తిరుమజిశై ఆళ్వార్

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్ వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః

thirumazhisaiazhwar తిరునక్షత్రము: మాఘ మాసము(తై),మఖ

అవతార స్థలము: తిరుమజిశై(మహీసారపురం)

ఆచార్యులు: విష్వక్సేనులు, పేయాళ్వార్

శిష్యులు: కణికణ్ణన్, ధ్రుడవ్రతన్

శ్రీ సూక్తులు: నాన్ముగన్ తిరువందాది, తిరుచన్ద విరుత్తమ్

పరమపదము చేరిన ప్రదేశము: తిరుక్కుడందై(కుంభకోణం)

మామునిగళ్ , శాస్త్ర సంపూర్ణ  ఙ్ఞానము యొక్క సారమును  ఈ ఆళ్వారు కలిగిఉన్నారని కీర్తించెను అనగ  శ్రీమన్నారాయణుడే మనకు ఆరాధనీయుడును అన్య దేవతలను (పాక్షిక దేవతలు)లేశ మాత్రము కూడ ఆరాధనీయులు కారు. మామునిగళ్ “తుయ్య మది” అని సంభోధించిరి. దీని అర్థము నిర్మలమైన మనసు కలిగిన ఆళ్వార్. పిళ్ళైలోకమ్ జీయర్ ఆళ్వారు యొక్క శుద్దమైన మనసును ఈ విధముగా విపులీకరించిరి . శ్రీమన్నారాయణుడు దేవతలకు కూడా పరత్వమ్ (శ్రేష్టత్వము) అనే నమ్మకమును కలిగి ఉండవలెను, దీనిలో ఏ మాత్రము సంశయములేదు  ఉన్నచో అది మన మనసు నుండి తీసివేయవలెను. ఆళ్వార్, శ్రీవైష్ణవులు అన్య దేవతలయందు ఏవిధముగా సంభందమును కలిగి ఉండాలో వివిధ  పాశురములలో వివరించిరి. ఉదాహరణకు:

 • నాన్ముగన్ తిరువందాది– 53వ పాశురం  – తిరువిల్లాత్ తేవరైత్ తేఱేల్మిన్ తేవు (திருவில்லாத் தேவரைத் தேறேல்மின் தேவு) – శ్రీమహాలక్ష్మి ఆరాధనీయ దేవత కాదు అన్న వారిని లెక్కించరాదు.
 • నాన్ముగన్ తిరువందాది– 68వ పాశురం – తిరువడి తన్ నామమ్ మఱణ్దుమ్ పుఱణ్తొజా మాణ్దర్ (திருவடி தன் நாமம் மறந்தும் புறந்தொழா மாந்தர்) – ఒకవేళ శ్రీవైష్ణవులు శ్రీమన్నారాయణుడే సర్వస్వామి అని మరచిననూ ఇతర దేవతలను మాత్రము  ఆరాధించరాదు.

నాన్ముగన్ తిరువందాది వ్యాఖ్యానములో  పెరియవాచ్చాన్ పిళ్ళై మరియు నమ్పిళ్ళై  ఎమ్పెరుమాన్ (భగవంతుడు)యొక్క పరత్వమును మరియు ఇతర దేవతల యొక్క పరిధిని తిరుమజిశై ఆళ్వార్ ప్రతిఒక్కరి మనసులోని సందేహములను తన యొక్క చేష్టల ద్వారా నివృత్తి చేసిరో దానిని  చాలా మధురంగా వివరించిరి.

పెరియవాచ్చాన్ పిళ్ళై వివరణ~: ముదలాళ్వారులు ఎమ్పెరుమాన్  మాత్రమే తెలుసుకొని అనిభవించవలసినవాడని నిర్ణయించిరి.తిరుమజిశై ఆళ్వార్ ఈ  క్రమమును పరిష్కృతము చేసిరి. వారు సంసారులకు ఈ విధముగా వివరించిరి ఎవరైతే ఇతర దేవత లను ఈశ్వరునిగా  (అధికారి)  తలుస్తారో  ఆ  ఇతర దేవతలు కూడ  క్షేత్రగ్య (జీవాత్మ – శరీరము గురించి తెలిసిన వారు) వేరొకరిచే యేలబడుదురు. వారు  శ్రీమన్నారాయణుడే ఈ ప్రపంచమునకు అధికారి అని చెప్పెను .

నమ్పిళ్ళై వివరణ~: ముదలాళ్వారులు సర్వేశ్వరుని  గురించి లోకజ్ఞానము వలన,  శాస్త్రము వలన,  వారి భక్తి వలన మరియు ఎమ్పెరుమానుల నిర్హేతుకకృప వలన తెలుసుకొనిరి. తిరుమజిశై ఆళ్వార్ కూడా ఎమ్పెరుమాన్ గురించి అదేవిధముగా తెలుసుకొని అనుభవించిరి. కాని ప్రపంచమును చూసి  వారు కలత చెందిరి.    ఎందుకనగా  చాలామందిజనాలు  శాస్త్రములో చెప్పిన విధముగా శ్రీమన్నారాయణుడే అధికారి అని మరియు అతడే సర్వ నియంత అని గ్రహించడములేదు, అతని అత్యంత కృప వలననే  వేదరహస్యములు చెప్పబడెను. వారు  ఇలా చెప్పెను,  బ్రహ్మ (ప్రధమ సృష్టికర్త) తాను కూడా సృష్టి సమయములో శ్రీమన్నారాయణుని చేత సృజించబడిన ఒక జీవాత్మయే అని శ్రీమన్నారాయణుడే సకల చరాచర జగత్తుకు తానే అంతర్యామిగా ఉండునునని వేదములో వివరించబడినది, శ్రీమన్ నారాయణుడే  సర్వనియంత. ఈ సూత్రమే పరమ ప్రామాణ్యం గా నిర్ధారించు కొని  ఎన్నటికిని విడువరాదు”.

ఈ విధముగా మామునిగళ్, పెరియవాచ్చాన్ పిళ్ళై మరియు నమ్పిళ్ళై తమ తమ  శ్రీ సూక్తులలో తిరుమజిశై ఆళ్వారుల యొక్క ప్రత్యేకతని వివరించిరి.

దీనికి అతిరిక్తముగా తిరుచన్ద విరుత్తమ్ తనియన్ లో  చాలా అందముగా వివరించబడినది ఇలా,  ఒకసారి మహా  ఋషులు తపమును చేయుటకు అనువైన  ప్రదేశమును గురించి తెలుసుకొనుటకై   మొత్తము ప్రపంచమును తిరుమజిశైతో (తిరుమజిశై ఆళ్వార్  అవతార  స్థలము) పోల్చిచూసి  తిరుమజిశై యే  గొప్పదని నిశ్చయించిరి. అంతటి గొప్పతనము ఆళ్వార్/ఆచార్యుల యొక్క అవతార స్థలములు దివ్యదేశముల కన్నా మేటిగా  కీర్తీంచబడెను. ఎందుకనగా ఆళ్వార్/ఆచార్యులు మనకు ఎమ్పెరుమాన్ గురించి తెలియపరచిరి వీరులేనిచో మనకు ఎమ్పెరుమాన్ యొక్క విశేషమైన గుణములను అనుభవించ లేక పోయేవారము.

దీనిని మనసులో ఉంచుకొని ఇక మనము ఆళ్వార్ చరితమును తెలుసుకుందాము.

ఆళ్వార్  కు కృష్ణుడితో  పోలిక  – కణ్ణన్ ఎమ్పెరుమాన్ వసుదేవ/దేవకిలకు జన్మించి నన్దగోప/యశోదల వద్ద పెరిగిరి. అదేవిధముగా  ఆళ్వార్ భార్గవ ఋషి /కనకాంగికి జన్మించి  తిరువాళన్/పంగయచెల్వి ( కట్టెలు కొట్టువాడు మరియు అతని భార్య) అను వారి వద్ద పెరిగెను. వీరిని శ్రీ భక్తిసారులు, మహీసారపురాధీశులు, భార్గవాత్మజులు, తిరుమజిశైయార్ మరియు అతి ప్రాధాన్యముగా తిరుమజిశై  పిరాన్   అనికూడా వ్యవహరించెదరు. పిరాన్ అనగా అర్థము ఒక పెద్ద ఉపకారమును చేసిన వారు,ఆళ్వార్ నారాయణ పరత్వమును స్థాపించి గొప్ప ఉపకారమును చేసెను కదా.

ఒకసారి మహర్షులైన  అత్రి, భృగు, వశిష్ట, భార్గవ, అంగీరస మొదలగు వారు బ్రహ్మ (చతుర్ముఖ) వద్దకు వెళ్ళి ఈ విధముగా అడిగిరి,  “మేము భూలోకములో ఒక మంచి ప్రదేశములో నివసించదలిచినాము.దయతో ఒక అనువైన ప్రదేశమును స్థాపించమనిరి”.  బ్రహ్మ విశ్వకర్మ సహాయముతో మొత్తము ప్రపంచమును ఒకవైపు మరియు తిరుమజిశైని మరొకవైపు వేసి తూచగా తిరుమజిశైయే  భారంలో నెగ్గినది. దీనిని మహీసార క్షేత్రము అని కూడా పిలుచుదురు. మహర్షులు అక్కడికి వెళ్ళి కొంతకాలము నివసించిరి.

ఒకానొక  సమయములో భార్గవ మహర్షి శ్రీమన్నారాయణుడి గురించి ధీర్గ    సత్ర  యాగము చేసిరి. ఆ సమయాన  అతని భార్య  12 మాసముల గర్భవతిగా ఉండి ఒక పిండమునకు (మాంసము ముద్ద– ముందటి దశలో)జన్మనిచ్చినది. వారే తిరుమజిశై ఆళ్వార్. వారు సుదర్శన అంశగా అవతరించిరి (ఆళ్వారుల యొక్క కీర్తిని చూసి కొందరు ఆచార్యులు వీరిని నిత్యసూరుల అంశ అని మరికొందరు  పూర్వాచార్యులు ఆళ్వారులు అనాదియైన సంసారము అకస్మాత్తుగా ఎమ్పెరుమాన్  కృపచే  జన్మించిరని  ధృడంగా నిశ్చయుంచిరి). భార్గవ మహర్షి మరియు అతని భార్య ఆ శిశువును అప్పడికి పూర్తి రూపము రానందున  ఆదరించక పొదల  మధ్యన విడచి వెళ్ళిరి. భూదేవి నాచ్చియార్  శ్రీదేవి నాచ్చియార్ యొక్క దైవిక తలంపు వలన ఆ పిండమును తీసుకొని కాపాడినది. ఆమె స్పర్శ వలన ఆ పిండము ఒక అందమైన శిశువుగా మారెను. వెంటనే ఆ శిశువు ఆకలిచే ఏడుస్తుండగా జగన్నాధ ఎమ్పెరుమాన్ ( తిరుమజిశై) ఆళ్వార్ ఎదురుగాతిరుక్కుడందై ఆరావముతన్ రూపములో దర్శనమిచ్చి త్వరలో పూర్తి ఙ్ఞానమును గ్రహించగలవు అని దీవించి అదృశ్యమవగా ఎమ్పెరుమాన్ విరహమును తట్టుకోలేక ఆళ్వార్  దు:ఖి:చసాగిరి.

ఆ సమయములో తిరువాళన్ అను ఒక కట్టెలుకొట్టేవాడు  అటునుండి వెళ్ళుచుండగా ఏడుస్తున్న బాలుడిని చూసి చాలా సంతోషముతో ఆ బాలుడిని తీసుకొని వెళ్ళి తన భార్యకు  ఇచ్చెను. వారికి సంతానము లేకపోవడముచే ఆమె ఆ బాలుడిని పెంచసాగినది. తన యొక్క మాతృవాస్తల్యముచే  ఆళ్వారునకు తన స్తన్యమివాలని  ప్రయత్నించినది.  కాని ఆళ్వార్  భగవత్ కల్యాణగుణములను అనుభ వించుటచే ఆహారము మాట్లాడుట, ఏడ్చుట మొదలగు వాటియందు ఆసక్తిని చూపలేదు కాని భగవత్ అనుగ్రహముచే  అందముగా పెరగసాగెను.

చతుర్ధ  వర్ణములో జన్మించిన  ఒక వృద్ద దంపతులు ఈ ఆశ్చర్యకరమైన వార్తను విని  ఒకరోజు వెచ్చని పాలను తీసుకొని దర్శనార్ధం ఒక ఉదయాన  వచ్చిరి. ఆ బాలుని దివ్యమైన తేజస్సును చూసి ఆ పాలను వారికి సమర్పించి స్వీకరించవలసినదిగా  అభ్యర్ధించిరి. ఆళ్వార్ వారి యొక్క భక్తికి సంతోషించి ఆ పాలను స్వీకరించి మిగిలిన శేషమును ఇచ్చి ఈ విధముగా చెప్పిరి. ఆ పాలను ప్రసాదముగా స్వీకరించమని,  వారికి ఒక సత్పుత్రుడు  త్వరలో కలుగునని దీవించిరి. ఆళ్వార్ అనుగ్రహముచే వారు తమ యొక్క యవ్వనమును తిరిగిపొందిరి మరియు  అతి త్వరలోనే ఆ స్త్రీ గర్భము దాల్చినది.10 మాసముల అనంతరం ఆమె శ్రీ విదురుని వలెనున్న (శ్రీ కృష్ణునిలో భక్తి కలిగిఉన్న) ఒక బాలుడికి  జన్మనిచ్చెను. వారు అతడికి ‘కణికణ్ణన్’ అను పేరును పెట్టి ఎమ్పెరుమాన్ గురించి పూర్తిగా నేర్పించెను.

భార్గవాత్మజుడై, జన్మాదినుండే ఎంపెరుమాన్ కృప ఉండుటచే ఆళ్వార్  తన ఏడు సంవత్సరముల వయసులో అష్టాంగ యోగమును చేయదలచిరి. దానికి మొదలు పరబ్రహ్మను పుర్తిగా తెలుసుకొనుటకు  ఇతర  మతముల  గురించి తెలుసుకొనెను (వాటి లోపభూయిష్టతను గిర్తించవచ్చు) అందు వలన బాహ్య మతములను (సాంఖ్య, ఉలూక్య, అక్షపాద,  కృపణ, కపిల, పాతంజల) మరియు కుదృష్టి మతములను (శైవ, మాయావాద, న్యాయ, వై శేషిక, భాట్ట, ప్రభాకర మొదలైన) పూర్తిగా పరీశీలించి ఇవన్నీనిజమైన పరమాత్మ తత్త్వమును నిర్ధారించుటలేవని  చివరగా సనాతన ధర్మమైన శ్రీవైష్ణవ సిద్దాంతమును  అవలంభించిరి. ఇలా 700 సంవత్సరములు గడిచినవి. సర్వేశ్వరుడు ఆళ్వారులను  అపరిమితమైన ఙ్ఞానమును ప్రసాదించి వీటిని దర్శింప చేసెను.

 • తన దివ్య స్వరూపమును,
 • తన కళ్యాణ గుణములను,
 • తన అవతారములను (ఇవి స్వరూప గుణములను దర్శింపచేయును),
 • ఆ అవతారములలోని అందమైన ఆభరణములను,
 • తన దివ్యమైన ఆయుధములను, ఎవైతే  అనుకూలురులకు ఆభరణముల వలె గోచరించునో,
 • తన యొక్క మహిషీలను (శ్రీదేవి, భూదేవి, నీళా దేవి) మరియు నిత్యసూరులను , వీరు ఎల్లప్పుడూ ఎమ్పెరుమాన్ గుణములను ( స్వరూపము, గుణములు, అవతారములు, ఆభరణములు, దివ్యాయుధములు మొదలైన) అనుభవించుదురు.
 • పరమపదము –  వారి దివ్యనిత్య నివాస ప్రదేశమును,   చివరగా
 • సంసారమును –  ఇది ప్రకృతి పురుష కాల తత్వములను మరియు అక్కడ ఎమ్పెరుమాన్  చే ప్రత్యక్షముగా లేదా ఇతర దేవతలచే పరోక్షముగా   జరుగు నిరంతర సృష్టి, స్థితి, సంహారములు ఉండును.

కళ్యాణ గుణ పూర్ణుడైన ఎమ్పెరుమాన్  ఆళ్వారులనకు ఈ విధముగా చూపెను, తాను బ్రహ్మను (తన మొదటి కుమారుడు)తన యొక్క నాభి కమలము (తన నాభి లోని తామర పువ్వు) నుండి సృష్టించినది శ్వేతాశ్వేతారోపనిషత్తులో“యో బ్రహ్మణామ్ విదదాతి పూర్వమ్”దీని  అర్థము పరబ్రహ్మము (విష్ణువు)బ్రహ్మను(చతుర్ముఖ) సృజించుటను మరియు ఛాందోగ్య బ్రాహ్మణమ్ లో“బ్రహ్మణ: పుత్రాయ జ్యే ష్టాయ శ్రేష్టాయ” – దీనర్థం రుద్రుడు బ్రహ్మదేవునకు ప్రథమ సుపుత్రుడు. ఆళ్వార్ దీని చూసి వెంటనే తన నాన్ముగన్ తిరువందాది లో అదే భావమును  వ్రాసిరి “నాన్ముగనై నారాయణన్ పడైత్తాన్ నాన్ముగనుమ్ తాన్ముగమాయ్  శంకరనై త్తాన్ పడైత్తాన్” (நான்முகனை நாராயணன் படைத்தான் நான்முகனும் தான் முகமாய்ச் சங்கரனைத் தான் படைத்தான்) దీని అర్థం  నారాయణుడు బ్రహ్మను సృజిస్తే , బ్రహ్మ తిరిగి రుద్రుడిని సృజించెను. ఇది సంసారులకు ఎమ్పెరుమాన్ సర్వ శక్తిత్వమును  గురించి సందేహ నివృత్తి చేయును. తాను ఎన్నో మతములను చూసి చివరగా ఎమ్పెరుమాన్ కృపచే వారి పాద పద్మములను చేరితినని ఆళ్వార్ స్వయముగా నిర్ణయించు కొనిరి. అటుపిమ్మట ఆళ్వార్  ఎల్లప్పూడూ తిరువల్లిక్కేణి (బృన్దారణ్య క్షేత్రము) లోని కైరవిణి పుష్కరిణి తీరాన ఉన్న  శ్రియ:పతి (శ్రీ మహాలక్శ్మి భర్త)కళ్యాణ గుణములను ధ్యానించసాగిరి.

ఒకనాడు  రుద్రుడు తన భార్యతో కలసి తన వాహనమైన వృషభముపై ఆకాశములో వెళ్ళుచుండెను. అప్పుడు వారి యొక్క నీడ ఆళ్వారుపై  పడబోతుండగా ఆళ్వార్ ప్రక్కకు జరిగెను. అది గమనించిన పార్వతి రుద్రునితో మనము అతనిని  కలువాలని కోరినది.  గొప్ప ఆత్మని కలిగి, ఆ ఎమ్పెరుమాన్ భక్తుడైన అతను మనను  నిర్ల క్ష్యముచేయును అని రుద్రుడు అన్నాడు. కాని రుద్రుడు  వారించినా పార్వతి  క్రిందికి వెళ్ళి అతనిని  తప్పక కలవాలని పట్టుబట్టెను. ఆళ్వార్ వారి రాకను కనీసము చూడనైనా చూడ లేదు. రుద్రుడు ఇలా  అడిగినాడు “ , మేము మీ పక్కన ఉన్నప్పటికినీ మీరు ఎలా మమ్మల్ని నిర్లక్ష్యము చేయుచున్నారు?”. ఆళ్వార్ ఇలా పలికిరి “నాకు మీతో చేయవలసిన పని ఎమీ లేదు”.  రుద్రుడు ఇలా పలికెను “మేము మీకు ఆశీర్వచనము  చేయదలచితిమి”. ఆళ్వార్ పలికెను “నాకు మీ నుండి ఎమియు అవసరము లేదు”. దానికి రుద్రుడు “నా సమయము వృధా అగుచున్నది మీ కోరిక ఏమిటో చెప్పు”డనిరి. ఆళ్వార్ నవ్వుతూ బదులిచెను “మీరు నాకు మోక్షమును ఇస్తారా?”. రుద్రుడు ఇలా అన్నాడు “నాకు అధికారము లేదు కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే ప్రసాదించును”. దానికి ఆళ్వార్ అడిగిరి “ఎవరి మరణమునైనా నిలిపివేయుదురా?” రుద్రుని సమాధానము “అది వారి  కర్మనుగతము దానిపై నాకు అధికారము లేదని చెప్పెను”. అప్పుడు ఆళ్వార్ తన సూది దారమును చూపి రుద్రునితో తిరస్కారముగా “కనీసము ఈ సూదిలో దారమునైన పెట్టగలవా?”అనెను . రుద్రుడు కోపముతో నిన్ను కామదేవుని వలె కాల్చివేయుదునని కోపించిరి. శివుడు తన మూడవ నేత్రమును తెరచి  అగ్నిని విడుదల చేసిరి. ఆళ్వార్ కూడా తన కుడికాలి బొటన వేలు ముందు భాగమున ఉన్న మూడవ నేత్రము నుండి అగ్నిశిఖలను ఏకధాటిగా విడుదల చేసెను. రుద్రుడు ఆళ్వారుల తిరువడి నుండి వచ్చే వేడిని తట్టుకోలేక  శ్రీమన్నారాయణుని శరణు వేడెను . దేవతలు, ఋషులు మొదలగు వారు ఎమ్పెరుమానుని ఆ ప్రళయమును ఆపమని అభ్యర్ధించిరి. ఎమ్పెరుమాన్ వెంటనే ప్రళయ మేఘములను పెద్ద వర్షమును కురవమని ఆఙ్ఞాపించెను. కాని అవి తమకు ఆళ్వారుల అగ్నిని ఆపే శక్తి లేదనగా ఎమ్పెరుమాన్ వాటికి ఆ శక్తిని ప్రసాదించెను. ఒక పెద్ద వరద ఆ అగ్నిని అణిచివేయుటకు బయలుదేరెను. ఆళ్వార్ ఎలాంటి కలత చెందక ఎమ్పెరుమాన్ ను ధ్యానమును చేయసాగెను. రుద్రుడు ఆళ్వారుల నిష్ఠకు ముగ్దుడై  “భక్తిసారులు” అని బిరుదును ఇచ్చి, అతడిని కీర్తిస్తు తన భార్యకు ‘దుర్వాసరుడు అమ్బరీశుడికి చేసిన అపచారమునకు  ఏ విధముగా ఆ ఋషి  శిక్షించబడెనో వివరించి చివరకు దీనివలన భాగవతులు ఎప్పటికినీ అపజయమును పొందరు” అని  తమ ప్రదేశమునకు వెళ్ళిరి.

అలా ఆళ్వార్ తన ధ్యానమును కొనసాగించుచుండగా ఒక కేచరుడు (ఆకాశ సంచారుడు) తన వాహనమైన  పులిపై ఆకాశమున వెళుతు ఆళ్వారుని చూసిరి. ఆళ్వార్  యోగ శక్తి వలన అతడు వారిని  దాటి వెళ్ళలేకపొయినాడు. అతను క్రిందికు దిగి వచ్చి ఆళ్వారునకు తన యొక్క ప్రణామములను సమర్పించి మాయచే ఒక దివ్యశాలువను సృజించి ఆళ్వార్ తో ఇలా పలికిరి  “మీ చిరిగిన శాలువను ఇచ్చి ఈ అందమైన శాలువను తీసుకొన వలసినది” అని అభ్యర్థించిరి. ఆళ్వార్ సులభముగా ఒక అందమైన రత్నములతో పొదిగిన శాలువాను సృజించగా అతను చికాకుపడెను. అప్పుడు అతను తన హారమును (నగ) తీసి ఆళ్వారునకు ఇచ్చిరి. ఆళ్వార్ తన తులసి మాలని తీసి వజ్రపు హారముగా చేసి చూపెను. కేచరుడు ఆళ్వార్  యోగ శక్తిని గ్రహించి  అతనిని కీర్తించి,  ప్రణామమును సమర్పించి సెలవుతీసుకొని వెళ్ళెను.

ఆళ్వారుల కీర్తిని విని కొంకణసిదుడు అను మంత్రగాడు ఆళ్వార్ దగ్గరికి వచ్చి ప్రణామములు సమర్పించి ఒక రసవిఙ్ఞాన రత్నమును(అది రాయి/లోహము ను  బంగారముగా రూపాంతరము చేయును), ఆళ్వార్  దానిని నిర్లక్ష్యము చేసిరి.వారు తన అందమైన శరీరము నుండి కొంత మురికిని(చెవి భాగము నుండి) తీసి ఆ మంత్రగాడికి ఇచ్చి ఈ మురికి నీ రాయిని  బంగారముగా రూపాంతరము చేయిననిరి. అతను ఆ విధముగా ప్రయోగించగా అది బంగారముగా మారినది. అతను చాలా సంతోషించి ఆళ్వార్ కు తన ప్రణామములు సమర్పించి తిరిగి వెళ్ళెను.

ఆళ్వార్ కొంతకాలము ఒక గుహలో ధ్యానమును కొనసాగించిరి. ముదలాళ్వారులు (పొయ్ గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్) ఎమ్పెరుమాన్ ను కీర్తిస్తు నిత్య సంచారము చేస్తుండేవారు.  ఆళ్వార్ ధ్యానం చేయుచున్న గుహ నుండి ప్రసరిస్తున్న దివ్యతేజస్సును చూసి  ముదళ్వారులు అక్కడికి వచ్చిరి. ఆ ఆళ్వారులు తిరుమజిశైఆళ్వారుల  వైభవమును గ్రహించి వారి క్షేమమును గురించి విచారించిరి. ఆళ్వార్ కుఢా ముదలాళ్వారుల  వైభవమును గ్రహించి వారి క్షేమమును విచారించిరి. కొంతకాలము వరకు  వారు తమతమ   భగవత్ అనుభవములను  పరస్పరము ప్రవచించు కొనిరి. తరువాత వారు అక్కడినుండి  పేయాళ్వారుల అవతార స్థలమైన  ‘తిరుమయిలై’ (మైలాపూరు)చేరుకొనిరి. అక్కడ కైరవిణి తీర్థము ఒడ్డున కొంతకాలము నివసించిరి. అలా  ముదలాళ్వారులు తమ  యాత్రను కొనసాగించగా తిరుమజిశైఆళ్వార్   తమ అవతార స్థలమైన తిరుమజిశైకి చేరిరి.

తిరుమజిశైఆళ్వారు ధరించు తిరుమణి గురించి  వెతికిరి కాని అది వారికి లభించలేదు.దానితో వారు విచారపడగా తిరువేంగడముడైయాన్(శ్రీనివాసుడు) ఆళ్వారునకు స్వప్నములో సాక్షాత్కరించి తిరుమణి లభించే ప్రదేశమును చూపించిరి. ఆళ్వార్   సంతోషముతో తిరుమణిని  స్వీకరించి ద్వాదశ ఊర్ద్వ పుండ్రములను (శాస్త్రములో చెప్పిన విధముగా శరీరములోని12 ప్రదేశములలో12 తిరునామములు) ధరించి తమ యొక్క భగవత్ అనుభవములను కొనసాగించిరి . పొయ్ గై ఆళ్వారుల అవతార స్థలమైన  తిరువె:క్కా దర్శించే కోరికతో కాంచీపురంకు చేరిరి. ఇది గొప్ప పుణ్య క్షేత్రముగా  కీర్తి క్కెక్కినది. అక్కడ శ్రీదేవి మరియు భూదేవి సపర్యలు చేయుచుండగా  ఆదిశేషునిపై అందముగా శయనించిన ఎమ్పెరుమానుని  700 సంవత్సరములు తిరుమజిశైఆళ్వారులు  ఆరాధించిరి. పొయ్ గై ఆళ్వార్ అవతరించిన పుష్కరిణి ఒడ్డున నివసిస్తు  కాలమును పొయైగై ఆళ్వారుల  ధ్యానముతో గడిపెను. yathokthakari-swamy

               ఉభయదేవేరులతో యధోక్తకారి , తిరువెఃక్కా

 ఒక సమయములో కణికణ్ణన్ ఆళ్వార్  శ్రీ చరణములను ఆశ్రయించిరి. ఒక వృద్ద స్త్రీ వచ్చి ప్తతిదినము ఆళ్వారునకు భక్తితో సేవలు చేయుచుండెను. ఆళ్వార్ ఆమె యొక్క భక్తికి మరియు సపర్యలకు సంతోషించి  ఆమెను ‘ మీకు ఎమైనా కోరికలు  ఉన్నవా ?’ అని అడిగిరి. ఆమె దానికి తన యవ్వనమును తిరిగి పొందవలెనని కోరినది. ఆళ్వార్ అలానే అని దీవించగా ఆమె  అందమైన యువతిగా మారినది. స్థానిక రాజైన పల్లవరాయుడు  ఆమె యందు ఆకర్షితుడై వివాహము చేసుకోమని కోరినాడు.ఆమె తన సమ్మతమును తెలుపగా ఇద్దరు వివాహమును చేసుకొని ఆనందముగా జీవించసాగిరి. ఒకరోజు, పల్లవరాయుడు తన వయసు రోజు రోజుకు పెరుగుచుండగ తన భార్య యుక్త వయసులోనే (ఆళ్వార్ ఆశీస్సుతో)  ఉండడము గమనించి ఆమెను ఏ విధముగా తరగని యౌవ్వనమును పొందినదో అడిగెను. ఆమె ఆళ్వార్ ఆశీస్సుల  గురించి చెప్పి ఆ రాజును ఆళ్వార్ నుండి అదే విధముగా యౌవ్వనమును పొందుటకు అనుగ్రహము లభించేలా కణికణ్ణన్ (తన కైంకర్యార్థము సామాగ్రికై రాజు వద్దకు వస్తాడు) అభ్యర్థించవలసినదిగా చెప్పినది. ఆ రాజు కణికణ్ణన్ ను పిలిపించి ఆళ్వారును ఆరాధించుటకు తన రాజ భవనమునకు తీసుకురావలసినదిగా అభ్యర్థించిరి . కణికణ్ణన్ ఆళ్వార్ ఎమ్పెరుమాన్  కోవెలను వదలి ఇతర ప్రదేశములకు  రారు అని చెప్పెను. ఆ రాజు కణికణ్ణన్ తో తన వైభవమును గురించి చెప్పవలసినదిగా అభ్యర్థించిరి. దానికి కణికణ్ణన్ శిష్టాచారము ప్రకారము  శ్రీమన్నారాయణుడిని మరియు ఆయన భక్తులను  (పెద్దల సూచనలు మరియు పనులు) తప్ప ఇతరులను కీర్తించననిరి. తనను కీర్తించని కారణముగా రాజు కోపముతో కణికణ్ణన్ ని  రాజ్యమును విడిచి వెళ్ళవలసినదిగా ఆఙ్ఞాపించెను. కణికణ్ణన్  రాజభవనమును వదిలి ఆళ్వార్ వద్దకి చేరి జరిగిన సంఘటనను  వివరించి తనకు సెలవును ప్రసాదించవలసినదిగా వేడెను. ఆళ్వార్ ఇలా అనెను “ ఒకవేళ మీరు వెళ్ళిపోతే మేము కూడ వెళ్ళిపోతాము, మేము వెళితే  ఎమ్పెరుమాన్ కూడా వెళ్ళును ,ఎమ్పెరుమాన్ వెళితే ఇక్కడి దేవతలందరు వెళ్ళిపోవుదురు”.ఆళ్వార్  కణికణ్ణన్ తో “నేను కోవెలకు వెళ్ళి ఎమ్పెరుమానుని లేపి నాతో పాటు తీసుకువచ్చెదను చెప్పి” కోవెలకు వెళ్ళిరి. ఆళ్వార్ తిరువె:క్కా ఎమ్పెరుమాన్ ఎదురుగా ఇలా ప్రార్థించిరి:

కణికణ్ణన్  పోగిన్ఱాన్ కామరుపూ కచ్చి మణివణ్ణా నీ కిడక్క వేన్డా తున్ణివుడైయ చెణ్ణాప్పులవనుమ్ పోగిన్ఱేన్ నీయుమ్ ఉన్ఱన్ పైణ్ణాగప్పాయ్ చురుట్టిక్కొళ్

கணிகண்ணன் போகின்றான் காமருபூங்கச்சி மணிவண்ணா நீ கிடக்க வேண்டா துணிவுடைய செந்நாப்புலவனும் போகின்றேன் நீயும் உன்றன் பைந்நாகப்பாய் சுருட்டிக்கொள்

ఆహా!  అందమైన రూపును ధరించిన తిరువెఃక్కా నివాసకుడా! కణికణ్ణన్ వెళ్ళుచున్నాడునేను కూడా వెళ్ళుచున్నాను నీవు నీ ఆదిశేషుణ్ణి  చుట్టుకొని మాతో పాటు రావలెను”.

ఎమ్పెరుమాన్ ఆళ్వార్ యొక్క మాటను అంగీకరించి వారిని కణికణ్ణన్ ను  అనుసరించిరి. అందువలన వారికి యధోక్తకారి (యధా – ఎలానైతే,ఉక్త – చెప్పిన ప్రకారము,కారి – చేయువాడు) అను పేరు వచ్చినది. దేవతలందరు ఎమ్పెరుమాన్ని అనుసరించెను కావున మంగళకర ప్రధానమైనటువంటి వారు లేకపోవుటచే  కాంచీపురమును  తమము  ఆవరించినది . సూర్యుడు కూడా ఉదయించలేక పోయెను. ఆ రాజు అతని మంత్రులు పరిస్థితిని గ్రహించి వెంటనే  పరిగెత్తి కణికణ్ణన్ శ్రీ చరణములను యందు క్షమాప్రార్థన చేసిరి.అప్పుడు కణికణ్ణన్ ఆళ్వారును వేడి తిరిగి  వెళదామని  అభ్యర్థించిరి. ఆళ్వార్ ఎమ్పెరుమాన్ ని యదాస్థానమునకు వేంచేయ వలసినదిగా ప్రార్థించిరి:

కణికణ్ణన్  పోక్కొజిణ్తాన్ కామరుపూన్ఙ్కచ్చి మణివణ్ణా నీ కిడక్క వేండుమ్ తుని వుడైయ చెణ్ణాప్పులవనుమ్ పోక్కొజిణ్తేన్ నీయుమ్ ఉన్ఱన్ పైణ్ణాగప్పాయ్ పడుత్తుక్కొళ్

கணிகண்ணன் போக்கொழிந்தான் காமருபூங்கச்சி மணிவண்ணா நீ கிடக்க வேண்டும் துணிவுடைய செந்நாப்புலவனும் போக்கொழிந்தேன் நீயும் உன்றன் பைந்நாகப்பாய் படுத்துக்கொள்

ఆహా!  అందమైన రూపును ధరించిన తిరువెఃక్కా నివాసకుడా! కణికణ్ణన్ తిరిగి వస్తున్నాడు నేను కూడా తిరిగివస్తున్నాను నీవు నీ ఆదిశేషుణ్ణి విప్పి  తిరిగి యథా విధముగా  శయనించుము”.

అదీ ఎమ్పెరుమాన్ యొక్క సౌలభ్యము- నీర్మై (நீர்மை – నిరాడంబరత్వం) అందువలన  ఆళ్వార్ ఎమ్పెరుమాన్ యొక్క ఈ గుణమునకు ఈడు పడి   వెఃక్కానై క్కిడందతెన్న నీర్మైయే అని పాడిరి (வெஃகணைக்கிடந்ததென்ன நீர்மையே) – నా అభ్యర్థనని మన్నించి ఏ విధముగా ఎమ్పెరుమాన్ తిరువెఃక్కా లో శయనించి నాడో అని.

ఆళ్వార్ ఆర్తితో  తిరుక్కుడందై (కుంభకోణము) వేంచేసిన  ఆరావముదాళ్వార్ (ఎమ్పెరుమాన్)కు మంగళాశాసనమును చేయుటకు వెళ్ళిరి . తిరుక్కుడందై మాహాత్మ్యము ఇలా చెప్పబడినది,  “ఎవరైతే క్షణ కాలమైనను కుంభకోణములో నివాసము చేయుదురో వారికి  శ్రీవైకుంఠ ప్రాప్తి కలుగును  ఇక  సంసారములోని సంపదను గురించి ఏమి చెప్పవలెను” – అదీ ఈ దివ్యదేశ వైభవము .

ఒకసారి ఆళ్వార్  తన ప్రయాణంలో  పెరుమ్పులియూర్ అనే గ్రామములో  ఒక గృహ వరండాలో విశ్రమించిరి. అక్కడ కొందరు బ్రాహ్మణులు వేద అధ్యయనమును చేయుచున్నారు.ఆ సమయములో వారు ఆళ్వారు యొక్క జీర్ణమైన ఆకారమును చూసి తప్పుగా అర్థము చేసుకొని వేదాధ్యయనమును నిలిపివేసిరి. దీనిని ఆళ్వార్  వినమ్రతతో అర్థము చేసుకొని ఆ ప్రదేశమును విడచి వెళ్ళిరి.ఆ బ్రాహ్మణులు ఆ వేధాద్యయనము నిలిపిన పంక్తి  గుర్తుకు  రాక ఇబ్బంది పడసాగిరి . ఆళ్వార్ వెంటనే ఒక వరి ధాన్యపు గింజను తీసుకొని తన గోటితో విరిచెను. ఆళ్వార్ యొక్క ఆ చర్య వారు మరచిన పంక్తిని సూచించెను. “క్రిష్ణాణామ్ వ్రిహిణామ్ నఖనిర్భిన్నమ్”  ఇది యజు: ఖాండము లోనిది. అప్పుడు బ్రాహ్మణులు వెంటనే వారి  వైభవమును  గుర్తించి , ప్రణామములను సమర్పించి తమ అమర్యాదను క్షమించమని వేడుకొనిరి.

ఆళ్వార్ తమ తిరువారాధన సామగ్రి గురించి సంచరిస్తుండగా ఆ గ్రామ కోవెలలోని ఎమ్పెరుమాన్ ఎల్లప్పుడూ ఆళ్వార్ ఉన్నదిక్కు తిరుగుచుండెను. అర్చకులు ఆ ఆశ్చర్యకరమైన సంఘటనను కొందరి బ్రాహ్మణులకు చూపి  ఆ గ్రామములో యాగము చేయుచున్న పెరుమ్పులియూర్ అడిగళ్ వద్దకు వెళ్ళి ఆ సంఘటనను మరియు ఆళ్వార్  వైభవమును వారికి చెప్పిరి . పెరుమ్పులియూర్ అడిగళ్ యాగశాలను (యగ్య భూమి) వదిలి నేరుగా ఆళ్వార్ వద్దకి వెళ్ళి వారి యొక్క అప్రాకృత  (ఆధ్యాతికతను దైవత్వమును) తిరుమేనిని (శరీరము) చూసి ప్రణామమును సమర్పించి ఆళ్వార్ ను తన యాగశాలకు వేంచేయవలసినదిగా ప్రార్థించిరి. ఆళ్వార్ యాగశాలను సందర్శించినపుడు  అడిగళ్  యాగభాగములోని అగ్ర పూజని (మొదటి మర్యాద) ఆళ్వార్ కి సమర్పించెను. ధర్మరాజు  రాజసూయయాగములో  కృష్ణుడికి అగ్రపూజని ఇచ్చినప్పుడు శిశుపాలుడు అతని స్నేహితులు అడ్డుతగిలినట్లుగా ఇక్కడ కూడ కొందరు అడ్డుతగిలారు. అడిగళ్ విచారముతో ఆళ్వారునకు వారి మాటలను వినలేనని చెప్పిరి. ఆళ్వార్ తన వైభవమును తెలుపుటకు నిశ్చయించుకొని  అంతర్యామి ఎమ్పెరుమానుని తన  హృదయములో అందరికీ దర్శనమిచ్చేలా  ప్రత్యక్షమవ్వమని  పాశురంచే ప్రార్థించిరి. ఎమ్పెరుమాన్ తన దయాగుణముచే దివ్య మహిషీలు, ఆదిశేషుడు, గరుడాళ్వార్ మొదలగు వారితో ఆళ్వార్ హృదయములో ప్రత్యక్షమయ్యెను. ఇంతకు మునుపు ఎవరైతే   అడ్డుతగిలిరో వారు  ఆళ్వార్  వైభవమును గ్రహించి వారి శ్రీచరణముల యందు సాష్టాంగపడి తమ తప్పులను మన్నించమని వేడుకొనిరి.  రథమును  ఆళ్వార్ వైభవమును  తెలుపుట వారు ఆళ్వార్ కు  బ్రహ్మరథమును(ఆళ్వారును పల్లకిలో తీసుకువెళ్ళడము) పట్టెను.  ఆళ్వార్ అప్పుడు వారికి శాస్త్రసారమును విశేష వివరణలతో అనుగ్రహించిరి.

ఒకసారి ఆళ్వార్   ఆరావముదన్ ఎమ్పెరుమాన్ సేవించుటకై తిరుక్కుడందైకు  వెళ్ళిరి. తిరుక్కుడందై చేరిన తరువాత వారు తమ గ్రంథములను (తాళ పత్రములను) కావేరి నదిలో విసిరివేసిరి . ఎమ్పెరుమాన్   తిరువుళ్ళము (కృప) ప్రకారము నాన్ముగన్ తిరువందాది మరియు తిరుచ్చన్త విరుత్తమ్ తరంగాలలో తేలుచూ ఆళ్వార్ వద్దకు తిరిగి చేరినవి. ఆళ్వార్  వాటిని తీసుకొని ఆరావముదన్ సన్నిధికి  వెళ్ళి ఎమ్పెరుమానుని  దివ్యతిరువడి (పాదము) నుండి తిరుముడి (శిరస్సు) వరకు సేవించి కీర్తించిరి. అత్యంత ప్ర్రీతిచే  ఆళ్వార్ ఎమ్పెరుమాన్ ను ఈ విధముగా ఆదేశించిరికావిరిక్కారైక కుడందయుళ్ కిడంద వారెళుందిరుందు పేచ్చు” (காவிரிக்கரைக் குடந்தையுள் கிடந்தவாறெழுந்திருந்து பேசு)దీని  అర్థము “ఆహా ! కావేరి తీరాన తిరుక్కుడందై లో శయనిచి ఉన్న వాడా లేచి నిలబడి నాతో మాట్లాడు”. ఆళ్వార్ యొక్క సూక్తిని ఆలకించిన ఎమ్పెరుమాన్ వారి సూక్తి ప్రకారం లేచుటకు ప్రయత్నించగా, ఆళ్వార్ ఎమ్పెరుమాన్ చర్యను చూసి  వారికి మంగళాశాసనమును  చేసిరి “వాజి కేశనే” (வாழி கேசனே) అర్థము “ఓ అందమైన కేశములను కలిగిన వాడా! నిత్య మంగళము”.ఆ దివ్య స్వరూపమును ధ్యానిస్తూ ఆళ్వార్ మరొక  2300 సంవత్సరములు తిరుక్కుడందైలో పాలను మాత్రమే స్వీకరించి  నివసించిరి. ఆ విధముగా 4700 సంవత్సరములు భూలోకములో వేంచేసిఉండి  ప్రతిఒక్కరినీ ఈ సంసారసాగరము దాటించుటకు సకల శాస్త్రముల సారమును తన ప్రబంధముల ద్వారా  అనుగ్రహించిరి. aarAvamuthan

కోమలవల్లి తాయర్ సమేత ఆరావముదన్, తిరుక్కుడందై

వారు తిరుమజిశై పిరాన్ గా వ్యవహరించబడెను ( పిరాన్ అనగా ఎవరైతే  ఈ ప్రపంచమునకు మహోపకారము చేయుదురో వారు సాధారణముగా ఈ వాచక శబ్దమును  ఎమ్పెరుమాన్ యొక్క కీర్తిని తెలుపుటకు వాడుదురు ) –ఆళ్వార్  ఎమ్పెరుమాన్  పరతత్త్వమును తెలుపుటకు మహోపకారమును చేసిరి – ఆనాటి నుండి తిరుమజిశైఆళ్వార్ తిరుమజిశైపిరాన్ గా  తిరుక్కుడందై ఆరావముద ఎమ్పెరుమాన్   ఆరావముదదాళ్వాన్  గా ప్రసిద్దికెక్కిరి ( ఆళ్వార్ అనగా ఎవరైతే ఎమ్పెరుమాన్ కల్యాణగుణములలో, దివ్య సౌందర్యములో  మునిగితేలుదురోవారు, ఈ వాచక శబ్దాన్నిఎమ్పెరుమాన్ ప్రియ భక్తులకు వాడుదురు) –  తిరుమజిశై ఆళ్వార్ భగవంతుని నామ ,రూప, గుణము మొదలగు కళ్యాణగుణములను కలిగి ఉండడముచే, ఆరావముదఎమ్పెరుమాన్ కూడా ఆరావముదాళ్వార్ గా ప్రసిద్దిగాంచిరి.

ఎమ్పెరుమాన్ మరియు వారి దాసులతో మనకు అటువంటి సంభందమును  నిత్యము కలిగేలా అలాగే ఆళ్వార్  దివ్యకృప ప్రసరించేలా ఆళ్వార్ శ్రీ చరణారవిందముల  యందు ప్రార్థిస్తాము

తిరుమజిశై ఆళ్వార్  తనియన్:

శక్తి పంచమయ విగ్రహాత్మనే శుక్తికారజాత చిత్త హారిణే |

ముక్తిదాయక మురారి పాదయో:  భక్తిసార మునయే నమో నమ:||

சக்தி பஞ்சமய விக்ரஹாத்மநே சூக்திகாரஜத சித்த ஹாரிணே முக்திதாயக முராரி பாதயோர் பக்திஸார முநயே நமோ நம~:

అడియేన్: నల్లా శశిధర్   రామానుజదాస

Source

ముదలాళ్వార్లు

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

గత సంచికలో మనము పొన్నడిక్కాల్ జీయరుల వైభవమును చూసాము.ఇప్పుడు ఇతర ఆళ్వారుల మరియు ఆచార్యుల గురించి తెలుసుకుందాము.ఈ సంచికలో ముదలాళ్వార్ల( పొయ్ గైఆళ్వార్, భూదత్తఆళ్వార్,పేయాళ్వార్) వైభవమును  అనుభవిద్దాము.

పొయ్గైఆళ్వార్

తిరునక్షత్రము: ఆశ్వీజ మాసము(ఐప్పసి),శ్రవణం (తిరువోణమ్)

అవతార స్థలము: కాంచీపురము

ఆచార్యులు: సేనముదలియార్

శ్రీ సూక్తులు: ముదల్ తిరువందాది

పొయ్గైఆళ్వార్ తిరువె:కాలోని యధోక్తకారి కోవెల దగ్గరలో గల కొలనులో అవతరించిరి.వీరికి కాసారయోగి మరియు సరోమునీంద్రులు అనే నామధేయములు కలవు.

వీరి తనియన్

కాంచ్యాం సరసిహేమాబ్జే జాతం కాసార యోగినమ్మ్
కలయే యః శ్రియఃపతి రవిమ్ దీపం అకల్పయత్

காஞ்ச்யாம் ஸரஸி ஹேமாப்ஜே ஜாதம் காஸார யோகிநம்
கலயே ய~: ஸ்ரிய~:பதி ரவிம் தீபம் அகல்பயத்

భూదత్తాళ్వార్

తిరునక్షత్రము:ఆశ్వీజమాసము (ప్పసి),ధనిష్ఠ (అవిట్టమ్)

అవతార స్తలము: తిరుక్కడల్ మల్లై

ఆచార్యులు: సేనముదలియార్

శ్రీ సూక్తులు: ఇరన్డామ్ తిరువందాది

భూదత్తాళ్వార్ తిరుక్కడల్ మల్లై దివ్యదేశములోని స్థలశయనపెరుమాళ్ కోవెలలోని కొలనులో అవతరించిరి.వీరికి  భూదహ్వయలు, మల్లాపురవరాధీశులు అనే నామధేయములు కలవు.

వీరి తనియన్:

మల్లాపుర వరాధీశం మాధవీ కుసుమోద్భవం
భూతం నమామి యో విష్ణోర్ జ్ఞానదీపం అకల్పయత్

மல்லாபுர வராதீசம் மாதவீ குஸுமோத்பவம்
பூதம் நமாமி யோ விஷ்ணோர் ஜ்ஞானதீபம் அகல்பயத்

పేయాళ్వార్

తిరునక్షత్రమ: ఆశ్వీజమాసము(ఐప్పసి),శతభిషం (సదయమ్)

అవతార స్థలము: తిరుమయిలై

ఆచార్యులు: సేనముదలియార్

శ్రీ సూక్తులు: మూన్ఱామ్ తిరువందాది

పేయాళ్వార్ తిరుమయిలైలోని కేశవ పెరుమాళ్ గుడి వద్ద అవతరించిరి. వీరికి మహదాహ్వయర్, మయిలాపురాధీపర్ అనే నామములు కలవు.

వీరి తనియన్
దృష్ట్వా హృష్టం తదా విష్ణుం రమయా మయిలాధిపం
కూపే రక్తోత్పలే జాతం మహదాహ్వయం ఆశ్రయే

த்ருஷ்ட்வா ஹ்ருஷ்டம் ததா விஷ்ணும் ரமயா மயிலாதிபம்
கூபே ரக்தோத்பலே ஜாதம் மஹதாஹ்வயம் ஆச்ரயே

ముదలాళ్వార్గళ్ చరితము/వైభవము:

ఈ ముగ్గురు ఆళ్వారులును సేర్తిగా కీర్తించుటకు గల కారణములు క్రింద చెప్పిన విధముగా నున్నవి

 • వీరు ముగ్గురు కూడా రోజు విడచి రోజు జన్మించిరి – పొయ్గైఆళ్వార్, భూదత్తాళ్వార్ర్, పేయాళ్వా ర్ ద్వాపరయుగము చివరన మరియు కలియుగము ప్రారంభమున జన్మించిరి (యుగ సంధి – మార్పు కాలము– వివరణగురించి క్రింద చూద్దాము).
 • ముగ్గురూ అయోనిజులు – తల్లి గర్భము నుండి కాకుండా ఎమ్పెరుమాన్ అనుగ్రహముచే ముగ్గురూ పుష్పముల ద్వారా అవతరించిరి.
 • పుట్టినప్పటినుండి వీరికి ఎమ్పెరుమాన్ తో సంబంధము ఉండెను – ఎమ్పెరుమాన్ యొక్క పరిపుర్ణమైన అనుగ్రహముచేత భగవత్ గుణానుభవములో నిరంతరాయముగా జీవితాంతము నుండిరి .
 • వీరు  ఒక సంఘటన ద్వార ఒకరినొకరు కలుసుకొనిరి.  అప్పటినుండి కలిసి జీవించి ఎన్నో దివ్యదేశములను/క్షేత్రములను దర్శించిరి. వీరిని ఈ విధముగా సంభోదించుదురు “ఓడిత్ తిరియుమ్ యోగిగళ్” (ஓடித் திரியும் யோகிகள்) – ఎల్లప్పుడూ యాత్రలు చేసే యోగులు.

ముగ్గురు ఆళ్వారులు వేరు వేరు ప్రదేశములలో జన్మించి ఎమ్పెరుమానులను పూర్తిగా అనుభవించిరి. ఎమ్పెరుమాన్ వారి యొక్క దాసులను తమ జీవితముగా భావించుదురు(గీతలో – జ్ఞానిత్వ ఆత్మ ఏవ మే మతమ్)కావున వారి ముగ్గురిని ఒకేచోట చూడదలచిన ఎమ్పెరుమాన్  తిరుక్కోవలూర్ అనే దివ్య దేశములో
ఒక రాత్రి వారు ముగ్గురు ఓకే చోట కలుసుకునేలా ఒక దైవ లీలను కల్పంచిరి.

చాలా పెద్ద వర్షము కురుయిచుండగా ఆ ముగ్గురు ఒకరి తరువాత ఒకరు ఒక  ఆచ్చాధన వసార క్రింద చేరుకున్నారు. అప్పుడు ఆ వసారలో  ముగ్గురు నిలబడుటకు మాత్రమే సరిపోవు స్థలము ఉండెను. పూర్తిగా భగవత్ భావముతో ఉండడముచేత ,ఒకరి గురించి మరియొకరు తెలుసుకొన్నారు.అప్పుడు వారు తమ యొక్క దివ్య అనుభవములను చెప్పుచుండగా  ఎమ్పెరుమాన్ తిరుమామగళ్(లక్ష్మిదేవి) తో కూడి, చీకటిగా ఉన్న  ఆ వసారలోకి ప్రవేశించిరి. అప్పుడు ఆ ముగ్గురూ తమ మధ్యలోకి ఎవరు వచ్చారో  తెలుసుకొనుటకు ఇలా చేసిరి.

 • పొయ్గై ఆళ్వార్ ప్రపంచమనే దీపములో సముద్రమును నూనెగా చేసి సూర్యుడిని  వెలుగుగా చేసి ఆ  ప్రదేశమును కాంతిమయం గా చేసిరి.
 • భూదత్తాళ్వార్ తన యొక్క ప్రేమను దీపముగా, అనుబంధమును నూనెగా, తన యొక్క ఙ్ఞానమును వెలుగుగా చేసి ప్రదేశమును కాంతిమయం గా చేసిరి.
 • పేయాళ్వార్ మిగితా ఆ ఇద్దరి  ఆళ్వారుల సహాయముతో   పిరాట్టితో కూడిన ఎమ్పెరుమాన్ ని , తిరువాళి(చక్రం)   మరియు తిరుశంఖంను దర్శించి ఆ సేర్తికి మంగళాశాసనమును చేసిరి.

ఆ విధముగా వారు ముగ్గురూ తిరుక్కోవలూర్ స్వామిని మరియు ఇతర అర్చావతార ఎమ్పెరుమానుల  వైభవమును ఈ లీలావిభూతిలో అనుభవించిరి.

నమ్పిళ్ళై  ఈడు వ్యాఖ్యానములో  ముదలాళ్వార్ల  వైభవమును  చాలా అందముగా వెలికి తీసెను. వాటిలో కొన్నిటిని  ఇక్కడ  అనుభవిద్దాము:

 • పాలేయ్ తమిళర్ (1.5.11) – నమ్పిళ్ళై ఇక్కడ  ఆళవన్దారుల నిర్వాహమును (ముగింపు/వివరణ)  ఉట్టంకించిరి.  నమ్మాళ్వార్  ఇలా వివరించెను,  ముదలాళ్వారులే   మొట్ట మొదట ఎమ్పెరుమానుల వైభవమును మధురమైన తమిళ భాషలో కీర్తించిరనిరి.
 • ఇన్కవి పాడుమ్ పరమకవిగళ్ (7.9.6) – ఇక్కడ నమ్పిళ్ళై ముదలాళ్వార్లను “చెన్దమిళ్ పాడువార్” అనికూడా వ్యవహరించుదురని వివరించిరి. అలానే ఆళ్వారులు తమిళములో నిష్ణాతులని కూడా  వివరించిరి. పొయ్గై ఆళ్వార్ మరియు పేయాళ్వార్లు   భూదత్తాళ్వార్లని ఎమ్పెరుమాన్ ని కీర్తించమని అడుగగా – ఏ విధముగానైతే ఆడ ఏనుగు తేనెను కోరిన వెంటనే మగ ఏనుగు తెచ్చునో ఆ విధముగా వారు వెంటనే ఎమ్పెరుమాన్ యొక్క కీర్తిని పాడిరి (ఈ ఏనుగుల సంఘటనను భూతత్తాళ్వార్ తన ఇరణ్డామ్ తిరువన్తాది – 75వ పాశురము “పెరుగు మదవేళమ్”లో వివరించిరి).
 • పలరడియార్ మున్బరుళియ (7.10.5) – నమ్పిళ్ళై చాలా అందముగా నమ్మాళ్వారుల  తిరువుళ్ళమును వెలికి తీసిరి.  ఈ పాశురములో నమ్మాళ్వార్ ఈ విధముగా చెప్పు చున్నారు ఎమ్పెరుమాన్ మహా ఋషులైన శ్రీ వేదవ్యాసులు, శ్రీ వాల్మీకి, శ్రీ పరాశరులు  మరియు ముదలాళ్వార్లు  వారు తమిళములో పండితులైనప్పడటికి  తనను  మాత్రం  తిరువాయ్ మొళిని పాడుటకు  అనుగ్రహించినారని.
 • చెన్చొర్కవికాళ్ (10.7.1) – నమ్పిళ్ళై ముదలాళ్వార్లని గూర్చి“ఇన్కవి పాడుమ్ పరమ కవిగళ్”, “చెన్దమిళ్ పాడువార్” మొదలగు పాశురముల   ప్రమాణముననుసరించి   వారిని అనన్య ప్రయోజనులు (ఎటువంటి ప్రయోజనము ఆశించకుండా ఎమ్పెరుమానుల కీర్తిని పాడేవారు)అని గుర్తించిరి.

మామునిగళ్ ‘ముదలాళ్వార్లు’  అనే సంభోధన ఏవిధముగా వచ్చెనో తన ఉపదేశరత్తినమాలైలో 7వ  పాశురమున ఇలా  వివరించిరి.

మఱ్ఱుళ్ళ ఆళ్వార్గళుక్కు మున్నే వన్దుదిత్తు (மற்றுள்ள ஆழ்வார்களுக்கு முன்னே வந்துதித்து)
నల్ తమిజాల్ నూల్ చెయ్తు నాట్టైయుయ్త్త – పెఱ్ఱిమైయోర్ (நல் தமிழால் நூல் செய்து நாட்டையுய்த்த – பெற்றிமையோர்)
ఎన్ఱు ముదలాళ్వార్గళ్ ఎన్నుమ్ పెరివర్క్కు (என்று முதலாழ்வார்கள் என்னும் பெயரிவர்க்கு)
నిన్ఱతులగత్తే నిగజన్తు (நின்றதுலகத்தே நிகழ்ந்து).

సాధారణ అనువాదము:
ఈ ముగ్గురు ఆళ్వారులు మిగిలిన ఏడుగురు ఆళ్వారుల కన్నా ముందే వారి దివ్యమైన తమిళ  పాశురములతో ప్రపంచమును ఆశీర్వదించెరి.ఈ కారణముచే వీరు ముదలాళ్వార్లుగా ఖ్యాతిగాంచిరి.

పిళ్ళైలోకమ్జీయర్ తన వ్యాఖ్యానములో కొన్నిమధురమైన వాటిని వెలికి తీసిరి.

 • ముదలాళ్వార్లలను ప్రణవముగా భావించిరి, ప్రణవము ఎల్లప్పుడూ ఆరంభమును సూచించడం వల్ల .
 • ముదలాళ్వార్లు ద్వాపర-కలి యుగ సంధిలో (మార్పు కాలము)జన్మించిరని మరియు తిరుమళిశై ఆళ్వార్ కూడా ఇదే సమయములో అవతరించిరని. కలియుగము మొదలులో మిగలిన ఆళ్వారులు ఒకరి తరువాత మరొకరు అవతరించిరని చెప్పిరి.
 • వీరు దివ్య ప్రబంధమునకు ద్రావిడ భాషలో (తమిళ) గొప్ప పునాదిని వేసిరి.

మామునిగళ్ ఐప్పసి – తిరువోణమ్(శ్రవణం), అవిట్టమ్(ధనిష్ట) మరియు శదయమ్(శతభిషం) ఈ మూడు నక్షత్రాలకు  ప్రాధాన్యత  ముదలాళ్వార్లు  అవతరించిన తరువాతనే కలిగినదని చెప్పిరి.

పెరియవాచ్చాన్ పిళ్ళై తిరునెడున్తాన్డగమ్ అవతారిక వ్యాఖ్యానములో ముదలాళ్వార్లుకు  ఎమ్పెరుమానులు తమ పరత్వమును చూపిరి అని చెప్పెను. అందువలన వారు మాటిమాటికి త్రివిక్రమావతారమును కీర్తించిరి.వారికి సహజముగానే అర్చావతార ఎమ్పెరుమానులతో గొప్ప అనుబంధము కలిగి ఉండడము చేత అర్చావతారము యొక్క కీర్తిని పాడిరి. వారి యొక్క అర్చావతార అనుభవమును ఇదివరకే ఇక్కడ వివరించ బడినది.http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-azhwars-1.html.

యుగ సంధి:

యతీంద్రమతదీపిక మన సంప్రదాయములోని ఎన్నో సాంకేతికపరమైన అంశములను వివరించినది. దీనిని మన సిద్ధాంతమునుకు పరమ ప్రామాణిక మైన గ్రంథముగా పరిగణిస్తారు.

ఇందులో కాల తత్త్వము మరియు వివిధ యుగములు  వాటి సంధి కాలముల గురించి వివరముగా చెప్పబడినది.

 • దేవతల 1 రోజు (స్వర్గములో) మానవుల (భూమి) 1 సంవత్సరంమునకు సమానము .
 • 1 చతుర్ యుగము 12000 దేవ సంవత్సరములతో కూడినది – (కృత – 4000, త్రేతా – 3000, ద్వాపర – 2000, కలి – 1000).
 • బ్రహ్మకు ఒక రోజు 1000 చతుర్ యుగములకు సమానము. వారి యొక్క రాత్రి సమయము కూడా ఉదయమునకు సమానము కాని అప్పుడు సృష్టి ఉండదు..ఇలాంటి 360 రోజులు 1 బ్రహ్మసంవత్సరము.  బ్రహ్మ 100 బ్రహ్మసంవత్సరము జీవించును.
 • ఒక్కొక యుగములో సంధి కాలములు దీర్ఘముగా ఉండును.ఇక్కడ ప్రతీ యుగములోని సంధి కాలమును చూద్దాము :
 1. కృత యుగము మరియు త్రేతా యుగమునకు సంధి కాలము 800 దేవ సంవత్సరములు.
 2. త్రేతా యుగమునకు మరియు ద్వాపర యుగమునకు సంధి కాలము 600 దేవ సంవత్సరములు.
 3. ద్వాపర యుగమునకు మరియు కలియుగమునకు సంధి కాలము 400 దేవ సంవత్సరములు
 4. కలియుగమునకు మరియు తదుపరి కృత యుగమునకు సంధి కాలము 200 దేవ సంవత్సరములు.
 • అదేవిధముగా బ్రహ్మ యొక్క ఒక రోజులో14 మనువులు, 14 ఇంద్రులు మరియు 14 సప్త ఋషులుతో సమానము (వారి యొక్క కర్మను అనుసరించి ఈ విధముగా ఆయా జీవాత్మలకు విధులు ఇవ్వబడును).

అడియేన్ :
రఘు వంశీ రామానుజదాస

source: