Author Archives: raguvamsi

కూరత్తాళ్వాన్

శ్రీ~:
శ్రీమతే శఠగోపాయ నమ~:
శ్రీమతే రామానుజాయ నమ~:
శ్రీమద్ వరవరమునయే నమ~:
శ్రీ వానాచల మహామునయే నమ~:

kurathazhwan

తిరునక్షత్రము~: మాఘ మాసము, హస్త

అవతార స్తలము~: కూరము

ఆచార్యులు~: ఎమ్పెరుమానార్

శిశ్యులు~: తిరువరన్గత్తముదనార్

పరమపదము చేరిన ప్రదేశము~: శ్రీరంగము

శ్రీ సూక్తులు~: పంచ స్తవములు (అతి మానుష స్తవము, శ్రీ వైకుంఠ స్తవము, సున్దర భాహు స్తవము, వరదరాజ స్తవము, శ్రీ స్తవము), యో నిత్యమచ్యుత/లక్శ్మినాత తనియన్ లు

 • కూరము అనే గ్రామములో ఒక సంస్థానాదిపతుల కుటుంబములో 1010 CE సంవత్సరములో (సౌమ్య నామ సంవత్సరము,మాఘ మాసము, హస్త నక్షత్రము)కూరత్తాళ్వర్ మరియు పెరుందేవి అమ్మాళ్ లకు జన్మించిరి. శ్రీవత్సాంగన్ అను నామదేయమును పెట్టిరి.
 • వీరి తల్లి గారు చిన్న వయసులో ఆచార్యుల తిరువడి చేరడము వలన వారి యొక్క తండ్రి గారు మరలా వివాహమును చేసుకొనలేదు,   శాస్త్రములులో చెప్పి ఉన్నాకూడా ఆశ్రమములను అనుసరించి (ఏలననగా ఒకసారి వివాహము జరిగినప్పుడు,ఒక వేళ భార్య చనిపోతే,ఆ వ్యక్తి మరలా వివాహమును చేసుకొనవచ్చును).వారి యొక్క తండ్రి గారు ఈ విదముగా చెప్పిరి“నేను మళ్ళి వివాహము చేసుకొన్నచో నా యొక్క నూతన అర్థాంగి కూరతాళ్వాన్ ను సరిగాచూసుకొననట్లైతే, అది భాగవత అపచారము”అవుతుంది.అది వారి యొక్క గొప్ప గుణము ఆ యొక్క చిన్న వయసులో.
 • వీరు దేవపెరుమాళ్ సేవచేస్తున్న తిరుక్కచ్చి నంబి ఆఙ్ఞలను పాఠించేవారు.
 • వీరికి ఆండాళ్తో వివాహము జరిగినది,తను మంచి గుణములలో వీరికి సరిసమానమైనది.
 • వీరి ఎమ్పెరుమానార్ ఆశ్రయించి పంచ సంస్కారములను వారి వద్ద పొందినారు.
 • వారి యొక్క సంపదను అంతా కూరములో వదిలి, దర్మ పత్నితో కూడి శ్రీరంగమునకు చేరి అక్కడ బిక్షను చేస్తూ నివసించారు.
 • వీరు ఎమ్పెరుమానార్ తో కూడి కాశ్మీరునకు వెళ్ళి భొదాయన వృతి గ్రంథమును తేవడములో సహాయపడిరి.ఆ గ్రంథమును తిరుగు ప్రయాణములో పోవడమువలన,పూర్తి గ్రంథము తమకు గుర్తుకు ఉన్నదని ఎమ్పెరుమానార్ కి దైర్యము చెప్పిరి.తదుపరి,శ్రీరంగమునకు చేరుకొన్న పిదప ,వీరు ఎమ్పెరుమానార్ యొక్క మహత్తరమైన “శ్రీ భాష్యము” ను తాళాపత్ర గ్రంథములో ఎమ్పెరుమానార్ చెప్పినది వ్రాయుటకు తోడ్పడిరి.

amudhanar-azhwan-emperumanar

తిరువరన్గత్తముదనార్  కూరత్తాళ్వాన్ ఎమ్పెరుమానార్

 • వీరు ఎల్లప్పుడూ తిరువరంగత్తు అముదనార్లను ఎమ్పెరుమానారుల శిశ్యులగా ఉండమని ఆదేశించేవారు,అలానే ఆలయము యొక్క నిర్వహణ భాద్యతలను ఎమ్పెరుమానార్కి అప్పగించవలెనని చెప్పేవారు.
 • వీరు శైవ రాజు యొక్క న్యాయస్థానమునకు ఎమ్పెరుమానారుగా వెళ్ళీ,రాజు ఆదేశించిన విదముగా “రుద్రుడే అదిదేవుడు” అనుటను  ఖండించి, శ్రీమన్ నారాయణుడే పరతత్త్వము అని చెప్పి వారి యొక్క దర్శనము (నేత్రములు) ఇచ్చి శ్రీవైష్ణవ దర్శనము (సాంప్రాదాయము)ను రక్షించిరి.
 • వీరు శ్రీరంగమును వదిలి తిరుమాలిరుంచోలైకి వెళ్ళి (ఎమ్పెరుమానార్ తిరునారాయణపురము/మేల్కోటె వెళ్ళిన తరువాత) అక్కడ 12 సంవత్సరములు నివశించిరి.
 • వీరు సుందర బాహు స్తవమును (పంచ స్తవములలో ఒకటి)  కళ్ళజగర్(తిరుమాలిరున్చోలై ఎమ్పెరుమాన్) విషయమున పాడిరి.
 • ఎమ్పెరుమానార్  శ్రీ రంగమునకు తిరిగి వచ్చినారని తెలిసి వీరు కూడా శ్రీరంగమునకు తిరిగి వచ్చిరి.
 • ఎమ్పెరుమానార్ ఆఙ్ఞతో,వీరు వరదరాజ స్తవమును దేవ పెరుమాళ్ విషయమున పడి,చివరన తన యొక్క సంభందులందిరికీ మోక్షమును ప్రసాదించమని అడిగిరి–ముఖ్యముగా నాలురాన్ విషయమై(వీరి కారణముగా తమ యొక్క నేత్రములు పోయెను).
 • మొత్తము వీరు పంచ స్తవములను పాడిరి – శ్రీ వైకుంఠ స్తవము, అతిమానుష స్తవమ్, సుందర బాహు స్తవము, వరదరాజ స్తవము మరియు శ్రీ స్తవము –అన్నీ వేదాంతము యొక్క సారమును కలిగి ఉండినవి.
 • వీరు ఎమ్పెరుమానారుల ఆదేశముచే పౌరాణిక కైంకర్యమును శ్రీరంగము ఆలయమందు చేయుటకు నియమించబడిరి మరియు అలానే మన సాంప్రాదాయ గ్రంథ నిర్వాహణమును కూడా తమ యొక్క కాలములో చేసిరి

azhwan_bhattars

కూరత్తాళ్వాన్ మరియు  పరాశర భట్టర్  వేద వ్యాస భట్టర్

 • వీరు మరియు వీరి యొక్క దర్మపత్ని శ్రీ రంగనాదుని ప్రసాదమువలన,ఇద్దరు అందమైన కుమారులు కలిగిరి.వారికి పరాశర భట్టర్ మరియు వేద వ్యాస భట్టర్ అని నామకరణము చేసిరి.
 • వీరు అరుళిచ్చెయల్ అనుభవములో (4000 దివ్య ప్రభందము)మునిగి వారు ఎప్పుడైతే ఉపన్యాసము చెప్పుటకు ఉపక్రమించుదురో ఆ అనుభవము వలన ఏడుస్తూ ఉండేవారు.
 • పెరియ పెరుమాళ్ వీరిని నేరుగా ఐక్యము చేసుకొనిరి.
 • చివరగా,వీరు పెరియ పెరుమాళ్ళను మోక్షమును ప్రసాదించమని అడుగగా పెరియ పెరుమాళ్ అనుగ్రహించిరి.అప్పుడు ఎమ్పెరుమానార్ ఈ విదముగా అడిగిరి “నా కన్నా మొదలు మీరు ఎలా వెల్లుదురు?”,వారు ఈ విదముగా చెప్పెను “తిరువాయ్ మొజి శూజ్ విశుమ్బణి ముగిల్… పదిగములో చెప్పినట్టుగా,ఎవరైతే పరమపదమును చేరుదురో, నిత్యులు మరియు ముక్తులు వచ్చి నూతనముగా వచ్చినటువంటి ముక్త ఆత్మ యొక్క పాదములు కడుగుదురు.నేను మీతో నా కొరకై ఎలా ఈ పనిని చేయుంచుకొనుదును? అందువలన నేను ముందు వెళ్ళుతున్నానని చెప్పిరి.”.
 • ఎన్నో ఐదీహ్యములు (సంఘటనలు), వ్యాఖ్యానములు మరియు గురు పరంపర ప్రభావములలో కూరత్తాళ్వాన్ యొక్క వైభవములను వీశదీకరించినవి.
  వారి యొక్క వైభవమును ఒక పేజిలో చెప్పడము సాద్యము కానిది? కూరతాళ్వాన్ వైభవమును ఇంతటితో ముగించడము నా యొక్క అశక్తతని తెలియచేయును,వారి యొక్క వైభవము అంతులేనిది.

ఆళ్వాన్ యొక్క తనియన్

శ్రీవత్స చిహ్న మిశ్రేబ్యో నమ ఉక్తి మదీమహే~:
యదుక్తయ స్త్రయి కంఠే యాన్తి మంగళ సూత్రదామ:

 

ஸ்ரீவத்ஸ சிந்ந மிஸ்ரேப்யோ நம உக்திம தீமஹே:
யதுக்தயஸ் த்ரயி கண்டே யாந்தி மங்கள ஸூத்ரதாம்:

నేను కూరత్తాళ్వాన్ ను ఆరాదించుదును,వారి యొక్క పంచ స్తవములు వేదములకు మంగళ సూత్రములవంటివి (తిరుమాంగళ్యము)–ఏలననగా,అవిలేనిచో ఎవరు పరదేవత అనునది స్పష్టముగా చెప్పలేరు.

ఆళ్వాన్ యొక్క గొప్ప గుణములు(తిరువల్లిక్కేణి లో ఆళ్వాన్ యొక్క 1000 తిరు నక్షత్రము సందర్భముగా శ్రీ ఊ.వే.వేళుక్కుడి క్రిష్ణన్ స్వామి అనుగ్రహ భాషనము ఆదారముగా–http://koorathazhwan1000.webs.com/)

అర్వాన్చో యత్ పద సరసిజ ద్వన్ద్వమ్ ఆశ్రిత్య పూర్వే
మూర్ద్నా యస్యాన్వయమ్ ఉపగతా దేశికా ముక్తిమాపు~:
సోయమ్ రామనుజ మునిర్ అపి స్వీయ ముక్తిమ్ కరస్తామ్
యత్ సమ్భన్దాద్ అమనుత కతమ్ వర్నయతే కూరనాధ~:

ఏ విదముగా హద్దులు లేని కూరతాళ్వాన్ యొక్క గొప్పతనమును పదములతో చెప్పగలము(మొజియై కడక్కుమ్ పెరుమ్పుగలాన్/వాచ మగోచర)? ప్రతీఒక్కరు ఎమ్పెరుమానార్ ద్వారా మోక్షమును పొందుదురు –కొందరు(ఎమ్పెరుమానార్ కన్నా వయసులో పెద్దవారు)వారి యొక్క తిరుముడి సంభందమ్ మరియు ఇంకొంత మందికి(ఎమ్పెరుమానార్ కన్నా చిన్నవారికి)తిరువడి సంభందము వలన.అటువంటి గొప్ప గుణమును కలిగిన ఎమ్పెరుమానార్ కూడా కూరత్తాళ్వాన్ యొక్క సంభందము వలన మోక్షమును పొందినామని చెప్పిరి.

కూరత్తాళ్వాన్ ఎమ్పెరుమానార్ యొక్క ముఖ్యమైన శిశ్యులలో ఒకరు.కాంచీపురము సమీపములో కూరము అను గ్రామములో ఒక సంస్థానాదీశుల కుటుంబములో జన్మించిరి, కూరత్తాళ్వాన్ ను శ్రీవైష్ణవ ఆచార్యులలో ఒక సారాంశముగా పరిగణించుదురు .వీరు 3 మతములను కలిగిఉండరని చెప్పుదురు – గర్వములు (విద్యా మతము –గొప్ప ఙ్ఞానమును కలిగిన గర్వము, దన మతము –అంతులేని సంపద కలిగిన గర్వము, అబిజాత్య మతము – గొప్ప కుటుంభము యొక్క వారసత్వమును కలిగిన గర్వము).వీరిని తిరువరన్గత్తు అముదనార్ రామానుజ నూత్తంతాదిలో ఈ విదముగా కీర్తించిరి“మొజియై కడక్కుమ్ పెరుమ్ పుగజాన్ వంజ ముక్ కురుమ్బామ్ కుజియై కడక్కుమ్ నమ్ కూరత్తాళ్వాన్” మరియు మనవాళ మామునిగల్ యతిరాజ వింశతి లో “వాచామగోచర మహాగుణ దేశికాగ్ర్య కూరాధినాధ” – రెండునూ కూరత్తాళ్వాన్ యొక్క వైభవమును అంతులేనిదిగా సూచించును. నిజముగా రామానుజ నూత్తన్తాది మరియు యతిరాజ వింశతి రెండూ కూడ ఎమ్పెరుమానార్ ను కీర్తించుటకూ పాడినవి.

ఎమ్పెరుమానార్ శ్రీవైష్ణవ సంప్రాదాయములో ముఖ్యముగా పరిగణించుదురు.ఈ సంప్రాదాయము నిజముగా సనాతన ధర్మమును తెలియజేయును (వేద మతము) ఇది తత్త్వ త్రయము యొక్క పరిమితి లేని ఙ్ఞానమును కలిగిఉండును (చిత్ – ఆత్మ, అచిత్ – విషయము మరియు ఈశ్వర –శ్రియః పతి శ్రీమన్ నారాయణుడు). ఎమ్పెరుమానార్ భారత దేశము మొత్తము ఈ దర్మమును గురించి చాటి చెప్పెను. వీరికి ఒక లక్ష్యమును కలిగి ఉండడముచే ఎన్నో పాత్రలను నిర్వర్తించెను– బోదకుడిగా,ఆలయ నిర్వహణదికారిగా,సామాజిక ఉద్దారకుడిగా , మొదలు,.వీరు తొమ్మిది గ్రంథములను వ్రాసిరి,అవి వేదము, వేదాంతము, భగవత్ గీతా,శరణాగతి (భగవంతుడికి పూర్తిగా దాసోహము సమర్పించుట) మరియు వైదిక అనుష్టానముల యొక్క వివిద కోణములను చూపును.

ఎమ్పెరుమానార్ కు శ్రీ పార్థసారధి స్వామి గుడికి దగ్గరి సంభదము కలదు,కారణము వారి తండి గారు తిరువల్లికేణి మూలవర్లు అయిన శ్రీ వేంకటక్రిష్ణన్/శ్రీ పార్థసారది స్వామిని పూజించడము వలన, ఎమ్పెరుమానార్ ఈ యొక్క ప్రపంచములో అవతరించిరి..ఇది 108 దివ్య దేశములలో ఒకటి,ఇక్కడ పేయాళ్వార్, తిరుమజిశై ఆళ్వార్ మరియు తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనమును చేసిరి.

గీతాచార్యులు మరియు ఆళ్వాన్ 1

శ్రీ పార్థసారది,అతడే గీతాచార్యుడు – శ్రీ భగవత్ గీతను అర్జునుడికి ఉపదేశించెను. శ్రీ భగవత్ గీత సనాతన ధర్మునందు ముఖ్యముగా పరిగణించుదురు మరీ ముఖ్యముగా శ్రీవైష్ణవులకి నేరుగా కృష్ణుడు చెప్పడము చేట.

శ్రీ భగవత్ గీత 13వ అద్యాయములో ,కృష్ణుడు క్షేత్ర (శరీరము) మరియు క్షేత్రఙ్ఞ (శరీరమును గురించి తెలిసిన వాడు –ఆత్మ) మద్య గల భేదములను గురించి వివరించెను. వారి సూచించిన విదముగా,దైవమును గురించి తెలిసిన వ్యక్తి 20 ముఖ్యమైన గుణములను కలిగి ఉండవలెను.ఈ గొప్ప గుణములన్నీ అద్భుతముగా కూరత్తాళ్వాన్ల జీవితములో చూడవచ్చు.మనమూ ఆ యొక్క గొప్ప గుణములను కణ్ణన్ ఎమ్పెరుమాన్ చెప్పిన విదముగా ఉదహారణలతో కూరత్తళ్వాన్ యొక్క జీవిత చరిత్రమును చూద్దాము.
శ్రీ భగవత్ గీత, అధ్యాయము 13,శ్లోకములు 7 – 11

అమానిత్వమ్ అదంమ్భిత్వమ్
అహింసా క్షాంతిర్ ఆర్జవమ్
ఆచార్యోపాసనమ్ శౌచమ్
స్థైర్యమ్ ఆత్మ-వినిగ్రహః

ఇంద్రియార్థేషు వైరాగ్యమ్
అనహంకార ఏవ చ
జన్మ మృత్యు జరా వ్యాధి
దుఖః దోషానుదర్షనం

అసక్తిర్ అనభిష్వంగః
పుత్ర దార గృహాదిషు
నిత్యం చ సమ చిత్తత్వమ్
ఇష్టానిష్టోపపత్తిషు

మయి చానన్య యోగేన
భక్తిర్ అవ్యభిచారిణీ
వివిక్త దేశ సేవిత్వమ్
అరతిర్జన సంసది

అధ్యాత్మ ఙ్ఞ్యాన నిత్యత్వం
తత్త్వ ఙ్ఞానార్త దర్శనమ్
ఏతత్ ఙ్ఞానం ఇతి ప్రోక్తమ్
అఙ్ఞానం యదతో న్యథా
1. అమానిత్వము – నమ్రతను కలిగిఉండడము

 • గొప్ప సంస్థానాదీశుల మరియు సంపదను కలిగిన కుటుంబములో జన్మించినా ,ఎమ్పెరుమానార్ కు సేవను చేద్దామని శ్రీరంగమునకు వెల్లేటప్పుడు మొత్తమూ సంపదనూ దానము చేసిరి.
 • శ్రీరంగములో,ఒక సమయములో,అప్పుడు ఎమ్పెరుమానార్ శ్రీ పెరియ నంబి గారిని పవిత్రమైన ఇసుకను ఆలయము ఉపద్రవములనుండి కాపాడుటకు చూట్టూ గుండ్రముగా చల్లమని చెప్పిరి, శ్రీ పెరియ ణంబి గారు ఒకరి సహాయమును కోరిరి–కాని ఆ వ్యక్తి చాలా విదేయుడై ఉండవలెనని చెప్పిరి–ఒక నిమిషము కూడ నేను ఎందుకు వేరొకరి వెనుక నడవాలి అనుకొకకూడదు.అప్పుడు ఎమ్పెరుమానార్ ఆలోచించి చూట్టూ చూస్తూ ఉండగా, శ్రీ పెరియ నంబి గారు స్వయముగా చెప్పిరి, “కూరత్తాళ్వనులను మాతో పంపండి కారణము అతడిని మించి వేరెవరు విదేయులు లేరు”.

2. అదంభిత్వము – గర్వమును కలిగిఉండకపోవడము

 • అప్పుడు శ్రీ రామానుజులతో కూడి కాశ్మీరునకు భోదాయన వృత్తి గ్రంథమును(బ్రహ్మ సూత్రములకు చిన్న వ్యాఖ్యానము)తెచ్చుటకు వెళ్ళినప్పుడు,గ్రంథమును తీసుకొని తిరిగి ప్రయాణమయ్యిరి .ఆ సమయములో,కొందరు స్థానికులు ఎమ్పెరుమానార్ వారికి నచ్చక కొందరు దొంగలని ఆ యొక్క గ్రంథమును తిరిగి ఎమ్పెరుమానార్ వద్దనుండి తీసుకురమ్మని పంపిరి.దానికి ఎమ్పెరుమానార్ ఆ యొక్క వంచనకు నిచ్చేశ్టులు కాగా , కూరత్తాళ్వాన్ ఎమ్పెరుమానార్ తో ఈ విదముగా చెప్పెను.రాత్రి మీ యొక్క సేవను పూర్తి చేసి ఆ యొక్క మొత్తము గ్రంథమును పూర్తిగా చదివినాము.కాని ఆ యొక్క సంఘటనలో లేశమాత్రమైన గర్వమును కూడా చూపలేదు.

3. అహింస – సాహసము

 • ఒకసారి ఒక కప్పను పాము తింటూ ఉంటే అది ఏడవడము వినెను.అప్పుడు వీరు అది చూసి ఏడుస్తూ వెంటనే మూర్చపోయిరి.ఈ సంఘటన ప్రాణులపై వారికి గల ప్రేమను తెలియచేస్తుంది.వీరిని శ్రీ రాముని యొక్క అవతారముగా తలుచుదురు,వాల్మీకి రామయణములో చెప్పిన విదముగా,ఎప్పుడైనా అయోద్యలో ఎవరికైనా అశుభము జరిగినచో శ్రీ రాముడు దుఃఖించే వాడు సంతోషము కలిగినప్పుడు వారి కన్నా మొదలు మొదటగా తానే సంతోషపడేవాడు.

4. క్షన్తిర్ – సహనము

 • ఎమ్పెరుమానార్ శ్రీ భగవత్ గీతా చరమ శ్లోకము (సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామ్ ఎకమ్ …) అర్థమును శ్రీ తిరుక్కోట్టియుర్ నంబి వద్ద సేవించిరి.శ్రీ తిరుక్కొటియుర్ నంబి ఎమ్పెరుమానారులను వారి యొక్క శిష్యులకి చాలా కష్టమైన పరీక్షలను పెట్టి తదుపరి ఆ యొక్క అర్థమును ఉపదేశించమనిరి.అప్పుడు, కూరత్తాళ్వాన్ వాటి యొక్క అర్థములను అడిగిరి, ఎమ్పెరుమానార్ వారిని దానియందు గల శ్రద్దను చూపమనిరి, కూరత్తాళ్వాన్,మఠము వెలుపల 1 నెల ఉపవాసము ఉండిరి.చివరగా వారు దాని యొక్క అర్థములని ఎంతో ఓపికతో నేర్చుకొనిరి.
 • అలానే వీరు శైవ రాజు ఆస్థానములో తన యొక్క నేత్రములు పోవడానికి కారకులైన నాలూరాన్ ని క్షమించి వారికి మోక్షమును ప్రాసాదించమని అర్థించిరి.

5. ఆర్జవము – నిజాయితీ

 • భగవత్ విషయమై తిరువరంగత్త్ అముదనారులు వీరికి శిష్యులవుదామనుకొనగా,వీరు ఎమ్పెరుమానార్ ను ఆశ్రయించమని ఆఙ్ఞాపించిరి.
 • పిల్లై పిల్లై ఆళ్వన్ విషయములో కూడా, కూరత్తాళ్వాన్ ఎల్లప్పుడూ ఎమ్పెరుమానార్ పై ఆదారపడమని ఆఙ్ఞాపించిరి .

6. ఆచార్యోపాసనము –ఎల్లప్పుడూ ఆచార్యులపై ఆదారపడడము

 • అప్పుడు శ్రీ రంగములో నివశిస్తున్న గుడ్డి మరియు చెవి వానిపై ఎమ్పెరుమానార్ తమ యొక్క పాదములు ఉంచగా , కూరత్తాళ్వాన్ ఏడుస్తూ ఎమ్పెరుమానార్ యొక్క శ్రీ పాదములను పొందడము కన్నా వేదాంతములను నేర్చుకొనడము అవసరము లేదని వ్యత్యాసమును చూపిరి. “త్రుణీ కృత విరించాది నిరంకుశ విబూతయ~: రామానుజ పదామ్బోజ సమాశ్రయణ శాలిన~:” ఇది ఆయొక్క అర్థమును తెలియచేయును.

7. శౌచం– పరిశుబ్రత -లోపల మరియు బయట

 • ఇటువంటి గొప్ప గుణములు కలిగిన వ్యక్తి తప్పక బాహ్యమున పరిశుబ్రముగానే ఉందురు,తదుపరి ఉదాహారణలో వారి యొక్క హృదయము యొక్క శుబ్రతని తెలుసుకొందాము.
 • అప్పుడు ఎమ్పెరుమానార్ శైవ రాజు చర్యల వలన శ్రీరంగమును వడిలి మేల్కోట వెళ్ళిరి, కూరత్తాళ్వాన్ శ్రీరంగములోనే ఉండిరి.ఒక రోజువారు ఆలయములోనికి వెళ్ళిరి,అక్కడ ఒక బటుడు వారిని ఆపి ఈ విదముగా చెప్పెను“ఎమ్పెరుమానార్ సంభందము ఉన్నవారికి ఆలయ ప్రవేశము లేదు ఇది రాజాఙ్ఞ”.కాని ఇంకొక బటుడు ఆ సమయములో ఈ విదముగా అన్నాడు, ” కూరత్తాళ్వాన్ గొప్ప గుణములను కలిగిన వ్యక్తి అందువలన మనము వీరిని లోపలికి పంపుదాము”.అదివిన్న కూరత్తాళ్వాన్ ఇలా చెప్పారు, “నేను ఏమైనా గొప్ప గుణములను కలిగి ఉన్నట్లైతే అందుకు కారణము నాకు ఎమ్పెరుమానార్ తో గల సంభదమే” అని చెప్పి ఆలయము లోనికి వెళ్ళక తిరిగి వెళ్ళెను.అటువంటిది వారి యొక్క శుద్దమైన హృదయము ,వేరవరైనా తమను స్వతంత్రముగా గొప్పగా తలుచుదురో,వీరు దానిని అంగీకరించే వారు కాదు,అది శ్రీ రంగనాదుడి దర్శనము గురించి అయినా సరే.

8. స్థైర్యము–స్థిరమైన

 • అప్పుడు కొందరు భక్తులు ఈ విదముగా అడిగిరి“ఎందుకు శ్రీవైష్ణవులు దేవతంతరములను ఆరాదించరాదు?”, కూరత్తాళ్వాన్ ఈ విదముగా చెప్పిరి, మన పెద్దలు (పూర్వచార్యులు –గొప్ప వేద పండితులు) మునుపెన్నడూ అలా చేయలేదు, అందువలన మనమూ కూడా చేయవద్దు.అదీ వారికి పూర్వచార్యుల యెడల స్థిరమైన నమ్మకము.

9. అత్మ-వినిగ్రహ: – స్వీయ నియంత్రణ (వైరాగ్యము)

 • అప్పుడు వారి యొక్క కుమారుల కళ్యానముణకు తగిన సమయము,వారి యొక్క దర్మపత్ని ఇతరులని వారికి తగిన మంచి కన్యల గురించి అడుగుతున్నది. కూరత్తాళ్వాన్ చెప్పిరి “ఈశ్వర కుడుమ్బతుక్కు నామ్ యార్ కరైవతు?” –అర్థము “భగవంతుడి కుటుంబము గురించి మనకు ఎందుకు చింత? అది శ్రీ రంగనాదుడి భాద్యత.”.
 • ఎమ్పెరుమానార్ కూరత్తాళ్వాన్ లను కాంచీపురము దేవపెరుమాళ్ ఎదుట పాడి వారి యొక్క నేత్రముల చూపు గురించి అడుగమని అఙ్ఞాపించగా – కూరత్తాళ్వాన్ తమ చూపు పోవుటకు కారణమైన నాలురాన్ మరియు తమకు మోక్షమును ప్రాసాదించమని అడిగిరి.

10. ఇంద్రియార్థేషు  వైరాగ్యము -మానసిక దారుడ్యము

 • తిరువరన్గత్త అముదనార్ తమ యొక్క ద్రవ్యమును (బంగారము,మొద,,) కూరత్తాళ్వాన్ కి సమర్పించగా, కూరత్తాళ్వాన్ వాటిని వీదిలో విసిరి వేసిరి,మరియు ఎమ్పెరుమానారులకి అనవసరమైన బారములు తమకు వద్దని చెప్పిరి.

11. అంహకార – అహమును కలిగి ఉండకపోవడము 

 • వారు గొప్ప పండితుడైనప్పడికినీ ,దనము కలిగిన వ్యక్తి అయుననూ, మొద.,ఎమ్పెరుమానార్ శ్రీ భాశ్యమును కూరత్తాళ్వాన్ వ్రాస్తున్నప్పుడూ కలత చెందిరి, కూరత్తాళ్వాన్ ఈ విదముగా చెప్పెను, “ఎమ్పెరుమానార్ నా స్వామి నేను వారి యొక్క దాసుడను ,అందువలన వారికి ఎదనిపించితే నా యెడల అది చేయవచ్చు”.

12. జన్మ-మృత్యు-జరా-వ్యాది-దుఃఖః-దుఖః దోషానుదర్షనం –ఎల్లప్పుడూ సంసారములో తప్పులని వెదుకుట

 • ఒకసారి ఎవరో ఒక బిడ్డకి జన్మని ఇచ్చారని విని, కూరత్తాళ్వాన్ రంగనాదుడి ఎదుటగా వెళ్ళి ఏడ్చిరి.అప్పుడు వారు ఎందుకు అని అడుగగా,ఈ విదముగా చెప్పిరి“సంసారమను జైలులో ఉన్నప్పుడు,ఎవరు నిన్ను దీని నుండి విముక్తి కలిగించుదురో వారి ఎదుట కదా నెను వెళ్ళి అడగాలి.కారణము రంగనాదుడికి తప్ప వేరెవరూ సంసార బంద విముక్తి కలిగించలేరు,అందువలన నేను ఆ యొక్క పుట్టిన శిశువు గురించి వారి ఎదుట దుఃఖించితిమని చెప్పెను”.

13. అశక్తిర్ – నిర్లిప్తత

 • ఎమ్పెరుమానార్ ను ఆశ్రయించుటకు శ్రీరంగమునకు అడవి గుండా ప్రయాణము చేస్తున్నప్పుడు,కూరత్తాళ్వాన్ దర్మపత్ని భయపడుతూ కనిపించినది.కారణమును అడుగగా తను ఒక బొంగారు పాత్రని(అందులో కూరత్తాళ్వాన్ రోజు ప్రసాదమును తీసుకొనే వారు)తెస్తున్నానని చెప్పెను. అదివిని,దానిని తీసి విసిరి వేసెను, రంగనాదులు మరియు శ్రీ రామానుజులు మనకు అక్కడ ఉండగా ఈ యొక్క పాత్ర అవసము ఏమి? అని అడిగిరి.దీనిని బట్టి వారికి వస్తువులపై లేచాయ మాత్రమైనా వ్యామోహము లేదని చూపును.

14. పుత్ర దార గృహాదిషు అనభిస్వంగ: –భార్య,కుమారులు,గృహము మొద,, వాటితో సంభదము లేకపోవడము

 • తన యొక్క మొత్తము దనమూ ఇచ్చి వేయడమే కాక,శ్రీరంగము చేరిన పిదప వారు తమ యొక్క రోజు అవసరములకై ఉంజ వృత్తి (బిక్ష) చేసెడివారు. వారు కుటుంబమును కలిగి ఉన్నప్పడికినీ,వారు శాస్త్రములలో చెప్పిన విదముగా నడుచుకొనే వారు.
 • అప్పుడు వారు తమ యొక్క శిష్యులకు రహస్య త్రయమును (తిరుమంత్రము, ద్వయము, చరమ శ్లోకము)ఉపదేశిస్తూ, వారు మొదట తమ యొక్క కుమారులను వెళ్ళమని చెప్పిరి –కాని తరువాత రమ్మని రహాస్యార్థములను చెప్పిరి.ఎమ్దుకు అలా అని అడుగగా, “ఎవరు చెప్పగలౌ వారు ఎంత కాలము జీవించుదురో ,వారు వారి యొక్క జీవితమును ఇంటికి వస్తున్నప్పుడూ కూడా విడువవచ్చు,అందువలన నేను వారికి ఉపదేశించదల్చితినని చెప్పిరి”. ఈ యొక్క సంఘటన ,వారి యొక్క కుమారులగుటచే కరుణతో కాక,ఆత్మలుగా వారిని చూసి సంసారము నుండి విముక్తులవ్వుటకు ముందు సరియగు ఙ్ఞానమును కలిగి ఉండవలెనని ఈ విదముగా చేసిరి.
 • ఇది వారికి తమ దర్మ పత్నితో ఎటువంటి శారీరక సంభదమును పెట్టుకొనలేదని మరియు వారి కుమారులైన(పరాశర భట్టర్ మరియు వేదవ్యాస భట్టర్)శ్రీ రంగనాదుల ప్రసాదము వలన కలిగిరి.

15. ఇష్టానిష్టోపపత్తిషు నిత్యమ్ సమ-చితత్వము –సందర్భ మరియు అసందర్భ సమయములలో ఒకే విదముగా ఉండడము

 • కూరత్తాళ్వాన్ వారి యొక్క దృష్టిని కోల్పోయినప్పుడూ భాదపడలేదు.వారు ఈ విదముగా చెప్పిరి“ఏమి ప్రయోజనము ఈ యొక్క నేత్రములతో  ఒక భగవత్ విరోది అయిన రాజుని చూసిన తరువాత”. అప్పుడు ఎమ్పెరుమానార్ వారిని శ్రీ కంచి వరదులను దృష్టిని ప్రసాదించమని ఆఙ్ఞాపించగా , కూరత్తాళ్వాన్ ఈ విదముగా అన్నారు“నేను ఎమ్పెరుమానార్ మరియు ఎమ్పెరుమాన్ ఇద్దరిని నా యొక్క అంతర్ నేత్రములతో దర్శిస్తున్నాను,అందువలన బాహ్యపు నేత్రములతో పని ఏమి?”.

16. మయి అనన్య-యోగేన భక్తిః అవ్యభిచారిణీ – నా(కృష్ణుడి) యందు స్థిరమైన భక్తిని కలిగి ఉండడము

 • వారికి ఏవిదమైనటువంటి ఆటంకములైన ఎదురైననూ,తమ యొక్క దృష్టిని కోల్పోయిననూ,శ్రీరంగమును వదిలి వెళ్ళినప్పుడూ, మొదలగు., కూరత్తాళ్వాన్ ఎమ్పెరుమాన్ యెడల స్థిరమైన భక్తీని కలిగి ఉండిరి.వారు ఎప్పుడూ కూడా వేరవరినీ ఆశ్రయించలేదు,అలానే భగవంతుని అందు పూర్తిగా భక్తిని తప్ప మరొకటీ అడుగలేదు.

17. వివిక్త దేశ సేవిత్వము –ఒంటరి ప్రదేశములో నివసించుట

 • ఒక శ్రీవైష్ణవుడు, ఒంటరి ప్రదేశములు అనగా ఎక్కడైతే భగవత్ సంభందమైన కార్యక్రమములు జరుగునో అక్కడ నివసించడు. కూరత్తాళ్వాన్ ఎల్లప్పుడూ వారి యొక్క ఆచార్యులైన ఎమ్పెరుమానారుతో ఉండి ఎమ్పెరుమానార్ మరియు ఎమ్పెరుమాన్ యొక్క సేవలను గురించి ఆలోచించెడెవారు.

18. అరతిః జన సంసది – ప్రజా సమూహమునందు ఇష్టము లేకపోవడము

 • గొప్ప భక్తులైనప్పడికినీ సామానులైన ప్రజలతో కలిసిఉందురు,వారి యెడల ఎటువంటి సంభదమును కలిగిఉండరు. కూరత్తాళ్వాన్ సామాన్యులైన ప్రజలతో కలిసి ఉన్నప్పడికినీ(రాజులు, మొదలగువారు) వీరి నుండి సూచనలను తిసుకోనెడివారు,కాని వారియందు ఎటువంటీ సంభదమును కలిగిఉండెరివారు కాదు .

19. అద్యాత్మ ఙ్ఞాన నిత్యత్వము – శాశ్వతమైన ఆద్యాత్మిక ఙ్ఞానమును కలిగిఉండడము

 • చిన్న వయసు నుండి , కూరత్తాళ్వాన్ ఎల్లప్పుడూ అందరూ జీవాత్మలు భగవంతుడికి సేవకులుగానే గుర్తించెడివారు.

20. తత్త్వఙ్ఞాన అర్థ చింతనము – అసలైన ఙ్ఞానమును గురించి ఆలోచించడము

 • కూరత్తాళ్వాన్ ఎల్లప్పుడూ తత్వ ఙ్ఞానము కొరకై ఆలోచించెడివారు–అందరూ జీవాత్మలు శ్రీమన్ నారయణుడి సేవకులనే తలిచెడివారు.అందువలన వారు తమ యొక్క ప్రాకృత శరీరమును వదిలి పరమపదమును చేరినప్పుడూ, ఎమ్పెరుమానార్ అక్కడ ఉన్న శ్రీవైష్ణవులని ద్వయ మహా మంత్రమును కూరత్తాళ్వాన్ యొక్క చెవులలో చదువని చెప్పిరి,కారణము వారు ఎల్లప్పుడూ దానిని గురించి ఆలోచించెడివారు.

 

ముగింపు:

ఒకే వ్యక్తిలో ఇన్ని గొప్ప గుణములను కలిగిఉండడము చూడడము చాలా అద్భుతము.అందువలన పెరియవాచ్చాన్ పిళ్ళై ఈ విదముగా చెప్పిరి “ఆచార్యుల మరియు శిష్యుల యొక్క లక్షణములను పూర్తిగా కూరత్తాళ్వన్ కలిగిఉండెను” అని తమ యొక్క మానిక్కా మాలై లో చెప్పిరి.మనమూ కూరత్తాళ్వాన్ జీవితములోని కొన్ని ఉదహారణలైనా మన యొక్క జీవితములో అన్వయించుటకూ ప్రయత్నిద్దాము.

అడియేన్
రఘు వంశీ రామానుజదాసన్

 

Source:

 

Advertisements

పెరియాళ్వార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

periazhvar

తిరునక్షత్రము: ఆషాడ మాసము (ఆని), స్వాతి నక్షత్రం  

అవతార స్థలము: శ్రీవిల్లిపుత్తూర్

ఆచార్యులు~: విష్వక్సేనులు

శ్రీ సూక్తులు: తిరుప్పల్లాణ్డు, పెరియాళ్వార్ తిరుమొళి

పరమపదము చేరిన ప్రదేశము: తిరుమాలిరుంశోలై

పెరియవాచ్చాన్ పిళ్ళై  తిరుపల్లాండు అవతారికలో పెరియాళ్వార్ వైభవాన్ని కీర్తించారు. వీరి  అవతార ప్రయోజనం,  ఈ సంసార దుఃఖములను అనుభవిస్తున్న జీవాత్మలను ఉజ్జీవింపచేయడం. ఎంపెరుమాన్ కృపచే పెరియాళ్వార్ సహజముగానే పెరుమాళ్  యందు  దాస్యకైంకర్యం అను దానిచే అలంకరింపబడిరి.  తమ జీవితాన్ని ఎంపెరుమాన్  కైంకర్యం చేయడానికి మరియు శాస్త్రనిర్ణయం చేసి ఉత్తమకైంకర్యమును ప్రవర్తింప చేయడానికి వినియోగించారు.  శ్రీకృష్ణుడు కంస సభకు వెళ్ళేముందు మథురలోని మాలాకారుని గృహమునకు వెళ్ళి ఉత్తమ పూమాలను కోరగా, మాలాకారుడు ప్రేమతో మరియు ఆనందముతో మాలను సమర్పించగా  శ్రీకృష్ణుడు చాలా  ఆనందముతో దానిని  ధరించాడు. దీనిని గుర్తించిన పెరియాళ్వార్,  పెరుమాళ్  కు మాలాకైంకర్యం  చేయడమే  ఉత్తమకైంకర్యముగా భావించి ఒక నందనవనమును  పెంచి దానినుండి వచ్చు పూలచే శ్రీవిల్లిపుత్తూర్ పెరుమాళ్ కు ప్రతిరోజు అత్యంత ప్రీతిచే  మాలాకైంకర్యము చేయసాగిరి.

పెరియాళ్వార్ కు ఇతర ఆళ్వార్లకు చాలా వ్యత్యాసమున్నది.  ఇతర ఆళ్వార్లు తమ కైంకర్యమును (ఎంపెరుమాన్ యందు  నిత్య కైంకర్యము)తమ ఆనందమునకై చేయగా ,  పెరియాళ్వార్  మాత్రం తమ గురించి కాక  కేవలం  ఎంపెరుమాన్ ఆనందమునకై  (జీవాత్మలు పరమపదమునందు ఎంపెరుమాన్ కు నిత్య కైంకర్యము చేయాలని)మాత్రమే తమ కైంకర్యమును చేసిరి. ఇతర ఆళ్వార్లు,   ఈశ్వరుడే రక్షకుడని మరియు వాని రక్షణచే తమ భయములు పోగొట్టబడతాయని భావించారు. కాని పెరియాళ్వార్,  ఆ ఈశ్వరుడు రక్షకుడు మరియు రక్షింపబడే వాడుకూడా అని భావించారు. పిళ్ళైలోకాచార్యులు మరియు మామునులు అన్నీ ప్రబంధముల కన్నా తిరుపల్లాండు  విధిగా కీర్తించబడాలని  తెలిపారు.

మిగితా ప్రబంధములన్నీ క్లిష్ఠమైన వేదాంత సంబంధ విషయములతో కూడుకొన్నవి,  కాని  తిరుపల్లాండు సులువుగా ఉండి నేరుగా ఎంపెరుమాన్ కు మంగళాశాసనము చేస్తుంది. మిగితా ప్రబంధములన్నీ ఆకారమున పెద్దవిగా ఉన్నవి, కాని తిరుపల్లాండు చిన్నది మరియు సారవంతమైనది – కేవలం  12పాశురములలో సారవంతమైన  విషయాలు  వర్ణించబడి ఉన్నవి.

 పిళ్ళైలోకాచార్యులు తమ దివ్యశాస్త్రమైన శ్రీవచనభూషణములో , మంగళాశాసనమును కీర్తిస్తు ఇది  సిద్దోపాయనిష్ఠులకు( ఎవరైతే భగవంతున్ని  ఉపాయం(పొందించే కారకం)  , ఉపేయం(పొందబడేది), దినచర్యలో భాగమని తెలిపారు . ఇది  క్రితమే శ్రీవైష్ణవ దినచర్య http://ponnadi.blogspot.in/2012/08/srivaishnava-lakshanam-10.html మరియుhttp://ponnadi.blogspot.in/2012/08/srivaishnava-lakshanam-11.html , శ్రీవైష్ణవ  లక్షణం లో భాగంగా ఉన్నటువంటిhttp://ponnadi.blogspot.in/p/srivaishnava-lakshanam.html.యందు వివరించబడింది.

మంగళాశాసనము అనగా  ఒకరి శ్రేయస్సు కోసం ప్రార్థించడం. ఆళ్వార్లందరు , ఎంపెరుమాన్ శ్రేయస్సు గురించి ప్రార్థించారు. కాని  పిళ్ళైలోకాచార్యులు ,పెరియాళ్వార్ కు  ఎంపెరుమాన్ తో ఉన్న  విశేష సంబంధము మిగితా ఆళ్వార్లందరి తో ఉన్న సంబంధము కన్నా విశేష మైనదని నిరూపించారు. ఇదంతా వివరముగా క్రితము పెరియాళ్వారుల అర్చావతార వైభవమునందు వివరింపబడింది. http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-periyazhwar.html.

ప్రస్తుతం మనం పెరియాళ్వారుల అర్చావతార వైభవములోని 255వ సూత్రములో తెలుపబడ్ద  పెరియాళ్వార్ మరియు శ్రీభాష్యకారుల (రామానుజుల)వైభవమును పరిశీలిద్దాము.

అల్లాతవర్గలైప్ పోలే  కేట్కిఱావర్గళుడైయవుం , శొల్లుకిరావర్గళుతైయవుం తనిమైయైత్  తవిక్కైయన్నిక్కే ఆళుమాళార్  ఎంగిన్ఱవనుడైయ తనిమైయైత్ తవిర్కైక్కాగవాయిర్రు    భాష్యకారరుం ఇవరుం ఉపతేచిప్పత్తు. 

ఇతర ఆళ్వార్ల, ఆచార్యుల కన్న పెరియాళ్వారులు మరియు శ్రీభాష్యకారులు-  శాస్త్ర అర్థ నిర్థేశకత్వముననుసరించి జీవాత్మలను సంస్కరించుట మరియు ఆ జీవాత్మలను ఎంపెరుమాన్ కు మంగళాశాసనములు చేయడానికి  తయారు చేసి  సర్వేశ్వరుని చింతను పోగొట్టారు.(సాధారణంగా  సర్వేశ్వరుడు  సర్వులు తనకు కైంకర్యం చేయాలని భావిస్తాడు,  ఎందుకనగా జీవులందరు తన  ఆధీనులు) తల్లితండ్రులు తమ సంతానం తమ దగ్గర లేనప్పుడు ఎలాగైతే సంతోషంగా ఉండరో అలాగే సర్వేశ్వరుడు జీవాత్మలు తన దగ్గరకు రానప్పుడు అలా బాధ చెందుతాడు. నిజానికి తమ దృష్ఠి సర్వేశ్వరుని ఒంటరితన్నాన్ని(చింతను) పోగొట్టుట కాదు  జీవాత్మ చింతను పోగొట్టి  ఉజ్జీవింప చేయడమే- అయినను ఇది ఎంపెరుమాన్ సహజమైన కోరిక ను తీర్చి జీవాత్మకు వాస్తవిక స్వరూపమును కల్గించును.

మామునులు ఈ సూత్రమునకు తమ వ్యాఖ్యానములో ఇలా వివరించారు- ఆళ్వార్లు  సర్వేశ్వరుని సున్నిత స్వభావం ఎరిగి అలాంటి స్వభావము కలవారు జీవాత్మలను వేరు పరుచుటను భరించలేక వారి దూరత్వము పైననే తమ దృష్ఠిని  ప్రసరింప చేస్తారని భావించారు.   పిళ్ళైలోకాచార్యుల వివరణలో – భాష్యకారులు(ఎంపెరుమానార్ మరియు శ్రీరామానుజులు అనే నామాలకు వ్యతిరిక్తముగా)అనే నామం శ్రీభాష్యం ద్వారా వేదసారాన్ని స్థాపించుటను బహిర్గతం చేస్తుంది-  ఆ నామ కార్యం వేదాంతమున  చెప్పినటుల  సర్వేశ్వరుని ఆనందముపైననే  దృష్ఠి నిల్పుట.

మామునులు తమ ఉపదేశరత్నమాలలో పెరియాళ్వార్ వైభవాన్ని వరుసగా ఐదు పాశురములలో వర్ణించారు.

 • 16వ పాశురమున తిరుపల్లాండు ద్వారా లోకాన్ని ఉజ్జీవింప చేసిన పట్టర్ పిరాన్(పెరియాళ్వార్)  అవతరించిన   ఆని(ఆషాడ-జ్యేష్ఠ) స్వాతి నక్షత్ర అతిశయాన్ని ఉపదేశంగా తమ మస్సును ఉద్దేశించి అనుగ్రహించారు.
 • 17వ పాశురాన తమ మస్సును ఉద్దేశించి ఇలా అనుగ్రహించుకున్నారు –పెరియాళ్వార్  అవతరించిన   ఆని(ఆషాడ-జ్యేష్ఠ) స్వాతి నక్షత్రమును ఆదరించే ఙ్ఞానులు దీనికి సమానమైనది  ఈ పృథ్వీలో ఏదీ లేదు అని తెలుపుట ద్వారా దీని వైభవాన్ని ప్రకటిస్తున్నారు.
 • 18వ పాశురమున ఇలా అనుగ్రహించారు- సర్వేశ్వరుని యందున్న అతి అభినివేశముచే మంగళాశాసనం చేయడంలో మిగిలిన ఆళ్వార్ల కన్నా వీరికి ఉన్న గొప్ప భేధముచే వీరికి పెరియాళ్వార్ అనే తిరునామం కలిగినదని తెలిపారు.
 • 19వ పాశురమున ఇలా అనుగ్రహించారు- ఇతర ఆళ్వారుల(లోపభూయిష్ఠులు, కాని ఇక్కడ లోపమన్న-  ఇతర ఉపాయములైన కర్మ/ఙ్ఞాన/భక్తి లతో సంభంధము కల్గి ఉండుట  మరియు వాటితో సర్వేశ్వరుణ్ణి చేరాలని కోరిక లేకపోవుట)  పాశురాల ( లోపములు లేని – లోపమనగా భగద్విషయేతరములుండుట) కన్న వీరి మంగళాశాసన  తిరుపల్లాండు   ఎలాగైతే సంస్కృత వేదమునకు ఓం(ప్రణవం)  కారము సారమో  మరియు ఆదిగా  ఉండునో అలాగే ద్రావిడ దివ్యప్రబంధమునకు సారము మరియు ఆదిగా  కలదిగా ఏర్పడినది.
 • 20వ పాశురమున తమ మనస్సును ఇలా అడుగుతున్నారు- అన్నీ ప్రమాణాలను దృష్ఠి లో ఉంచుకొని మిగితా ప్రబంధములను పరిశీలించిన, వీరి ప్రబంధమైన తిరుపల్లాండు వైభవమును  , ఇతర ఆళ్వారుల జీవన  వైభముతో పోల్చిన  వీరి వైభవమునకు అవి సాటి వచ్చునా ?.

వీరికి మరో విలక్షణ  విశేషమేమనగా తమ కూతురైన ఆండాళ్ ను పెరియపెరుమాళ్ కి ఇచ్చి వివాహం చేసి వారికి మామగారైనారు.

ఇక వీరి చరితమును తెలుసుకుందాము

వేదపండితులు నివసించు శ్రీవిల్లిపుత్తూర్ అనే దివ్యదేశమున పెరియాళ్వార్ అవతరించిరి. ఆని(ఆషాడ-జ్యేష్ఠమాసం)  స్వాతి నక్షత్రాన  అవతరించారు. వీరికి తల్లిదండ్రులు పెట్టిన నామధేయం విష్ణుచిత్తులు. ఎప్పుడైతే వీరు పరతత్త్వ నిరూపణ (శ్రీమన్నారాయణుడే  పరతత్త్వం అని) చేశారో ఆనాటి నుండి వీరు,  వేదాత్మ(వేదమునే శరీరంగా కలవాడు) గా కీర్తింపబడు మరియు సదా శ్రీమన్నారాయణుని పాదారవిందములను (శ్రీమన్నారాయణుని పరత్వమునుస్థాపించునవి) మోయునో ఆ గరుడాళ్వార్(ఆళ్వారులు  ఈ సంసారము నుండి భగవానునిచే గైకొనబడి ఆశీర్వదింపబడినవారు)  అంశగా భావింపబడ్డారు.

ప్రహల్లాదుడు ఎలాగైతే జన్మతః భగవద్భక్తితోనే జన్మించారో అలాగే వీరు కూడ వటపత్రశాయి యొక్క నిర్హేతుక కృపచే కరుణించబడి,  భగవద్భక్తితోనే జన్మించారు. దీనినే శాస్త్రమున ఇలా తెలిపారు‘ నా అకించిత్ కుర్వత చ శేషత్వం’ఎవైరైతే ఎంపెరుమాన్ కు కనీస కైంకర్యం కూడ చేయరో, వారికి శేషత్వం లేదు. దీనిననుసరించి పెరియాళ్వార్,   ఎంపెరుమాన్ కృపచే ఏదైన కైంకర్యములో నిమగ్నమవ్వాలని తలిచారు. అదే తడవుగా అన్నీ పురాణాలను  పరీశిలించారు. సర్వేశ్వరుడు  శ్రీకృష్ణునిగా మథురలో ఉన్నప్పుడు పేర్కొన్న వచనం.

ఏషః నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతనః |

నాగపర్యంకం ఉత్సృ జ్యః  ఆగతో మథురాపురిమ్||  

‘క్షీరాబ్దిలో శయనించి ఉన్న శ్రీమన్నారాయణుడు తన శయ్య అయిన ఆదిశేషుణ్ణి తీసుకొని మథురలో శ్రీకృష్ణునిగా అవతరించాడు’.

అలాగే నమాళ్వార్ కూడ “ మన్ననిన్ భారం నికుత్తర్కే వడమథురై పిరందన్”. దీనర్థం  – భూదేవి యొక్క భారమును తగ్గించుటకు కణ్ణన్ ఎంపెరుమాన్ మథురలో కనబడ్డాడు. మహాభారతంలో కూడ-   నిత్యం భగవానుడు  శ్రీకృష్ణుడి అవతారంలో ధర్మస్థాపనకై ద్వారకలో  నివసిస్తున్నాడు. సాధువులను దుర్మార్గుల నుండి రక్షిస్తున్నాడు. భగవానుడు అందమైన దేవకికి జన్మించి  యశోద దగ్గర పెరిగినాడు. సదా నిత్యసూరుల చే దివ్య పూమాలలచే అలంకరింపడిన ముగ్దమనోహర శ్రీకృష్ణుడు  కంసుని వద్ద పనిచేయు మాలాకారుని వద్దకు వెళ్ళి పూమాలలను అడిగాడు. స్వయంగా శ్రీకృష్ణుడు వచ్చి మాలలను అభ్యర్థించడం వల్ల ఆనందభరితుడైన ఆ మాలకారుడు శ్రీకృష్ణుడు ఆనందించేలా అందమైన పరిమళ భరిత మాలలను ఇచ్చాడు.  దీనిని  అవగ్రహణం చేసుకొనిన పెరియాళ్వార్ ప్రేమతో కట్టిన మాలలను సమర్పించుట ఉత్తమ కైంకర్యముగా భావించి ఆ రోజు నుండి శ్రీవిల్లిపుత్తూర్ లోని వటపత్రశాయి పెరుమాళ్ కు పూమాలలను సమర్పించ సాగారు.

.                       ఆ సమయాన పాండ్యవంశములో(మత్స్య పతకాన్ని మేరుపర్వతం పై స్థాపించిన రాజు)  ఉన్న రాజైన వల్లభదేవుడు పాండ్యనాడును మథురైను రాజధానిగా చేస్కొని ధర్మానుసారంగా పరిపాలించసాగాడు. ఓ నాటి రాత్రి తన రాజ్య సుపరిపాలనా  కార్యాచరణ కై తన రాజ్యమున మారువేషములో తిరగసాగాడు, ఆ సమయాన ఒక బ్రాహ్మణుడు వేరొకరి గృహం వెలుపల కూర్చుండడం చూశాడు. అతనిని  పరిచయం చేస్కొని చిరునామా కోసం అడిగాడు.  దానికి ఆ బ్రాహ్మణుడు నేను గంగా స్నానము చేసి  వస్తానన్నాడు. ఆ రాజు వాడిని బ్రాహ్మణుడిగా నిర్ణయంచేసుకొనుటకు  ఓ శ్లోకాన్ని పఠించమన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఈ శ్లోకాన్ని పఠించాడు.

వర్షర్థమస్తౌ ప్రయతేత మాసాన్ని చర్థతమర్థతం దివ్యసంయతేత |

వార్థక్య హేతోః వయసా నవేన పరార్థ హోతేరిహ జన్మనా చ||   

దీనర్థం -మానవులు  వర్షఋతువులో విశ్రాంతి కోసం మిగితా 8నెలలు శ్రమించాలి. రాత్రి సుఖనిద్రకు పొద్దున శ్రమ చేయాలి. వృద్ధ్యాపములో   విశ్రాంతి కోసం యవ్వనంలో శ్రమించాలి. శరీర అవసాన అనంతర   ఉజ్జీవనమునకై శరీరము ఉండగానే శ్రమించాలి.

ఆ మాటలు విన్న  ఆ రాజు   ఈ భౌతిక సంపదలు మరియు సుఖములతో హాయిగా ఉన్నాను కదా మరి అవసాన అనంతరం ఏమిటని ఆలోచనలో పడ్డాడు. శరీర అవసాన అనంతరం  దేనిని పొందాలి, దానిని ఎలా చేరాలి అనే విషయం తెలియలేదు. వెంటనే తమ రాజపురోహితుని దగ్గరకు వెళ్ళి పరతత్త్వ దైవము ఎవరు మరియు శరీర అవసానంతరం అతన్ని చేరుట ఎలా అని ప్రశ్నించాడు. శ్రీమన్నారాయణుని పరమ భక్తుడైన శెల్వనంబి,  వేదాంతాన్ని అనుసరించి పరతత్త్వనిరూపణకై విద్వాంసులందరిని సమావేశపరచాలని రాజుతో విన్నవించాడు. ఆ రాజు  విద్వాంసులందరిని ఆపస్తంబున్ని ప్రమాణ సూత్రమైన .” ధర్మఙ్ఞ యసమయః ప్రమాణం వేదాశ్చ”  అను దాని మీద నిజమైన పరతత్త్వ నిరూపణకై ఆహ్వానించాడు.

పరతత్వ నిరూపనకు వేద కార్యం తెలిసిన వేదఙ్ఞులు ప్రథమ ఆధారం మరియు వేదం ద్వితీయాధారం. ఆ రాజు చాలా ధనమును   వస్త్రపు మూటలో పెట్టి ఎవరైతే వేద ప్రతిపాద్యున్ని నిరూపణగా తెలుపుతారో వారికి అందడానికి  ఆధారం(ceiling)  పై వ్రేలాడ దీశాడు. వివిధ ప్రదేశములనుంచి వివిధ విద్వాంసులను వాదనకై సమావేశ పరిచాడు.

వటపత్రశాయి పెరుమాళ్(శ్రీవిల్లిపుత్తూర్), పెరియాళ్వార్ ద్వారా  తన   సిద్ధాంత(వేదం ప్రతిపాందిచినటుల)స్థాపనచేసి ఈ సంసారులను ఉజ్జీవింపచేయడానికి  వారి స్వప్నమున సాక్షాత్కరించి వల్లభదేవుని సభకెళ్ళి   శుల్కమును పొందుమని ఆఙ్ఞాపించారు. పెరియాళ్వార్  వినయంగా ఇలా సమాధాన మిచ్చారు ‘ఆ శుల్కం  వేదాంతం ద్వారా సిద్ధాంత స్థాపన చేసిన వారికి కదా, కాని  నేను తోట పని చేయడం వల్ల కఠినంగా తయారైన నాచేతుల ద్వారా దానిని  ఎలా  స్థాపించగలను?’  భగవానుడు, ఆళ్వార్ కు ఇలా సమాధానమిచ్చారు  ‘ వేదప్రతిపాదనలో దానర్థ ప్రతిపాదనలోను నేను మీకు  సహాయపడగలను’.  ‘బ్రహ్మముహూర్తే చ ఉత్థాయ’ అని  శాస్త్రంలో చెప్పిన విధంగా ఆళ్వార్, తెల్లవారుజాముననే మేల్కొన్నారు. దీనర్థం  తెల్లవారుజామున బ్రహ్మముహూర్తాన(సుమారు 4గంటలకు) విధిగా మేల్కొనాలి. ఆ స్వప్నము నుండి తేరుకొని తన నిత్యానుష్ఠానములను ముగించుకొని ఆ వల్లభరాజు ఉన్న మథురై కి బయలుదేరారు పెరియాళ్వార్ .         బ్రాహ్మణోత్తముడైన ఆ పెరియాళ్వార్  మథురకు చేరుకోగానే శెల్వనంబి మరియు ఆ రాజు ఆళ్వార్  కు వినమ్రతతో ఆహ్వానపరిచారు. స్థానిక పండితులు  రాజుకు ఈ పెరియాళ్వార్  చదువురాని వాడని తెలిపారు. ఈ  విషయము ముందే తెలిసిన వారు  వటపత్రశాయికి అంకితభావముతో కైంకర్యముచేయు  ఆ పెరియాళ్వార్ ని  గౌరవమర్యాదలతో  సత్కరించి , వేదాంతమాధారంగా తత్వప్రతిపాదనను చేయమన్నారు. ఎంపెరుమాన్ దివ్యాశీస్సులతో వేదం, వేదార్థం ,ఇతిహాసం, పురాణముల సారాన్ని గ్రహించారు పెరియాళ్వార్. ఎలాగైతే శ్రీవాళ్మీకి బ్రహ్మ అనుగ్రహంవల్ల , శ్రీ ప్రహల్లాదుడు భగవానుని శ్రీపాంచజన్య స్పర్శవల్ల ఙ్ఞానాన్ని పొందినారో అలా వీరుకూడ పొందినారు. భగవానుని నిర్హేతుక కృప వల్ల పెరియాళ్వార్ వేదసారమగు  శ్రీమన్నారాయణుడే  పరతత్వమని గ్రహించారు.

తర్క విధానంలో దీని ప్రమాణాలు.

సమస్త శబ్దమూల త్వాద్ అకారస్య స్వభావతః 

సమస్త వాచ్య మూలత్వాత్ బ్రహ్మణోపి స్వభావతః

వాచ్య వాచక సంబంధస్తయోః  అర్థాత్ ప్రదీయతే. 

అన్నీ శబ్దములు సహజంగా ‘అ’ అక్షరం నుండి జనించును. ఆ శబ్దం సమస్త అర్థములు సహజముగా బ్రహ్మం నుండి జనించును. కావున  అక్షరం మరియు బ్రహ్మం మధ్య సంబంధముకూడ సహజ సిద్ధమని తెలియును.

భగవద్గీతలో గీతాచార్యుడు  తనను తాను ఇలా నిర్ణయించుకున్నాడు” అక్షరాణామకారోస్మి” – నేను  అన్నీ అక్షరములలో అకార వాచ్యుడను.

“అకారో విష్ణువాచకః” అను ప్రమాణమును అనుసరించి అకారం  పరతత్వమగు శ్రీమన్నారయణుని  తెలుపు విష్ణు వాచక శబ్దం.

తైత్తరీయోపనిషద్ శ్రీమన్నారాయణుని విశేషగుణములను ఇలా తెలిపినది

యతో వా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతి తత్ విఙ్ఞానస్య తత్ బ్రహ్మేతి.   

సమస్త విశ్వం మరియు ప్రాణులు దేనినుండి ఉద్భవిస్తాయో , ఏ విశ్వం దేని ఆధారంగా కొనసాగుతుందో,  లయమందు దేనిలో విలీనమవుతుందో, ప్రాణులు చేరవలసిన మోక్షమును చేరునో అదే బ్రహ్మముగా తెలుపబడుతుంది. కావున జగత్తు కారణత్వం (విశ్వం సృజనకాధారం)  ముముక్షు ఉపాస్యత్వ(మోక్షమును పొందుటకు ఆరాధించవలసిన వస్తువు)  మరియు మోక్షప్రదత్వ ( జీవాత్మకు మోక్షమును అనుగ్రహించు సామర్థ్యం గల) ములు పరతత్వమునకు ఉన్న ముఖ్యమైన గుణములని తెలుపబడింది.

ఆ గుణములన్నీ శ్రీమన్నారాయణుని యందు చూడవచ్చని ప్రమాణం

 విష్ణోః సకాచాత్ ఉద్భుతం జగత్ తత్రైవ చ స్థితం|

స్థితి సమ్యకర్తాసౌ జగతోస్య జగత్ చ సః ||

విష్ణుపురాణమున తెలిపినటుల , ఈ విశ్వం  విష్ణువు నుండి సృజించబడును, ప్రళయమున(సృష్ఠి లేనప్పుడు)   విష్ణువు నందు చేరును; ఇతనే నిర్వహించును మరియు అంతమొందించును; విశ్వమునంతయు తన శరీరముగా కలవాడే శ్రీమహావిష్ణువు.

నారాయణాత్ పరో దేవో న భూతో నభవిష్యతి|

ఏతత్ రహస్యం వేదానామ్  పురాణానామ్ చ సమ్మతమ్||

వరాహపురాణములో చెప్పినటుల నారాయణునికి సమమైన లేదా  అధికమైన  దైవం భూతకాలమున లేదు భవిష్యత్ కాలమున ఉండబోదు. ఇది అతి గుహ్యమైన రహస్యంగా వేదంలో చెప్పబడింది అలాగే పురాణాల్లో కూడ.

సత్యం సత్యం పునస్సత్యం ఉద్ధృత్వ బుధముచ్యతే |

వేదాశాస్త్రం పరం నాస్తి న దైవం కేశవాత్పరం ||

నారదపురాణములో  వ్యాసభగవానుడు వివరించినటుల, “నేను ముమ్మారులు చేతులెత్తి నిర్ణయిస్తున్నాను (ఉద్ఘోషిస్తున్నాను) కేశవుని కన్న పరమైన (అధికమైన) దైవం  లేదు వేదం కన్న పరమైన  శాస్త్రం లేదు”.

ఇలా పెరియాళ్వార్ శ్రీమన్నారాయణుని పరత్వమును పైన చెప్పిన ప్రమాణాలను మరియు శ్రుతుల నుండి ఇతిహాసముల నుండి , పురాణముల నుండి ఉట్టంకిస్తు నిర్ణయించారు. పిదప ఆ సంపద ఉన్న మూట ( గెలిచిన వారి బహుమతి) దైవ సంకల్పముగా పైనుండి కిందపడగా పెరియాళ్వార్ దానిని గ్రహించారు.

ఇదంతా గమనించిన ఆ పండితులు, ఎవరైతే ఆళ్వార్ ను తిరస్కరించారో వారు మరియు  ఆ మహారాజు చాలా ఆనందముతో వారి నమస్సులను అందించారు పెరియాళ్వార్ కు . వారందరు పెరియాళ్వార్,   వేదాంత సారాన్ని విస్పష్ఠంగా విశేష ప్రభావముగా వెల్లడించారని ఆనందించారు.  వారికి ఉత్సవ గజం పై  గొప్ప ఊరేగింపును ఏర్పాటు చేశారు. మిగితా పండితులందరు ఛత్రచామరలు చేతిలో ధరించిరి. వారు ఇలా ప్రకటించసాగిరి “అత్యంత ప్రమాణముగా వేద సారమును తెలిపి కీర్తిని పొందిన వారు వేంచేస్తున్నారు”అని.     వల్లభదేవుడు ఙ్ఞానవిశేషములను అనుగ్రహించిన పెరియాళ్వార్ ను భట్టర్(గొప్ప పండితులు) లకు విశేషఉపకారకులు అనే అర్థం వచ్చే “పట్టర్ పిరాన్” అను బిరుదనామంతో సత్కరించారు. అంతటా విశేష ఉత్సముగా జరుగు ఆ  ఊరేగింపులో ఆ రాజు కూడ పాల్గొన్నారు.

pallandu

తమ సంతానానికి జరుగు విశేష కీర్తి మర్యాదలో బహు ఆనందముతో తల్లి తండ్రులు పాల్గొని నటుల పరమపదనాథుడు కూడ  ఆ విశేష ఉత్సవములో పాల్గొనదలిచారు. తమ పట్టపురాణి అగు మహాలక్ష్మి(శ్రియః పతిత్వం – పిరాట్టికి భర్త అగుటయే అతనికి ప్రథాన గుర్తింపు)  తన అభిమానమగు గరుడవాహనంపై  తమ తిరువాభరణములగు పాంచజన్యం మరియు శ్రీసుదర్శనాళ్వార్ తో ఆకాశాన  వేంచేసిరి. ఆళ్వార్ ను దర్శించుటకు ఎంపెరుమాన్ మరియు ఈ లౌకిక జగత్తుకు దేవతలైన బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు వారి వారి కుటుంబము మరియు సహచరులతో విచ్చేసిరి.  ఎంపెరుమాన్ ద్వారా కృపచేయబడ్డ  పెరియాళ్వార్, వేంచేసిన శ్రీమన్నారాయణుని మరియు ఇతరులను సేవించసాగిరి. వారు ఆ విశేష ఉత్సవమును ఆనందగర్వముతో  అనుభవించక భగవానుని చూడగానే  ఈ లౌకిక జగత్తునందు ప్రత్యక్షమైన  భగవానుని  గురించి చింతించ సాగిరి. భగవంతుని అనుగ్రహము వల్ల పెరియాళ్వార్ , శ్రీమన్నారాయణుడు సర్వఙ్ఞుడు ,సర్వరక్షకుడు అని తెలుసుకున్నారు. ఎవరి ప్రోద్భలం లేకుండానే తమంతగ తామే ఎంపెరుమాన్ మీద అనురాగంతో భగవానుని వాత్సల్యం, కోమలస్వభావంపై చింతించసాగిరి. శాస్త్రంలో   చెప్పినటుల   భగవానుని  దివ్యమంగళ విగ్రహం పంచోపనిషద్  తో తయారైనదని, అతను సదా దివ్యఋషులు, దేవతలు మరియు బ్రహ్మరుద్రాదులు కూడ చేరుకోలేని పరమపదంలో నిత్యసూరులచే నిరంతరం అనుభవింపబడతాడని తెలుసుకున్నాడు.

ఎంపెరుమాన్ తన దివ్య లోకాన్ని వదలి అఙ్ఞానము మరియు రాక్షసత్వం  కలిగిన లోకులున్న,  కలి పరిపాలిస్తున్న ఈ యుగపు భౌతిక లోకమునకు వచ్చాడు కాన   వారి దివ్యమంగళ విగ్రహానికి ఏదైన దృష్ఠిదోషం కలుగునో అని కలతచెంది వారి రక్షణ కోసం   మంగళం పాడుదామని తాను కూర్చున్న గజానికి ఉన్న గంటలను తీసుకొని భవవానునికి మంగళాశాసన రూపాన ‘ తిరుపల్లాండు’ ను పాడారు.ఎంపెరుమాన్ సర్వస్వతంత్రుడు, సర్వసమర్థుడు అనే విషయాన్ని మరియు తన స్వరూపమగు పారతంత్ర్యమును కూడ మరచిపోయాడు పెరియాళ్వార్. ప్రేమ పరాకాష్ఠచే అందరిని(ఐశ్వార్యార్థి- సంపద పై కోరిక ఉన్న వారు, కైవల్యార్థి- ఆత్మానుభవం పై కోరిక ఉన్నవారు,భాగవత శరణార్థి-ఎంపెరుమాన్  ఆంతరంగిక కైంకర్యం పై కోరిక ఉన్న వారు)తనతో సహా ‘తిరుపల్లాండు’ను పాడుటకు  ఆహ్వానిస్తున్నారు పెరియాళ్వార్ . శ్రీమన్నారాయణుడు ఉత్సవానంతరం తన దివ్యధామమునకు ఆనందముతో తిరిగి వెళ్ళాడు.

అనంతరం పెరుయాళ్వార్ రాజును ఆశీర్వదించి అతనిచే గౌర్వమర్యాదలు స్వీకరించారు. తిరిగి మళ్ళీ శ్రీవటపత్రశాయికి కైంకర్యము చేయిటకు శ్రీవిల్లిపుత్తూర్ నకు వచ్చి భగవంతుని  ద్వారా వల్లభదేవుని చే ఇవ్వబడ్డ ఆ  సంపదనంతటిని  భగవదర్పితం చేశారు.

మనుస్మృతిననుసరిచి:

త్రయేవాదన రాజన్ భార్య దాస తధా సుతః|

యత్తే సమాధి గచ్చంతి యస్యైతే తస్య తద్ధనం ||

భార్య, సుతుడు, సేవకులు స్వతాహాగా తాము ఏమి ఆర్జించేవారు కాదు,సంపదంతయు తమ సంబంధ యజమానిదే(భర్త,అధికారి మరియు తండ్రి).

దీనిననుసరించి పెరియాళ్వార్  తన సర్వస్వమును  తన స్వామియగు వటపత్రశాయికి  సమర్పించి ఇలా నివేదించారు            “ సంపాదించినదంతా మీ అనుగ్రహము వల్లనే కావున ఇదంతా మీకు చెందవలసినదే” .  పెరియాళ్వార్  తమ మీద ఉన్న ఈ కార్యమును పూర్తికాగానే  శ్రీమాలాకారుడు శ్రీకృష్ణునకు  అందమైన మాలలను సమర్పించినటుల  తానుకూడ నిత్యము చేయు మాలా కైంకర్యమును వటపత్రశాయికి ప్రేమాతిశయముచే   వివిధరకాల పూలతో రకరకాల మాలలను కట్టి  సమర్పించసాగిరి.  పెరియాళ్వార్ కు బాల్యను నుండి అంతిమము వరకు శ్రీకృష్ణుని చరితం  యందు అత్యంత అభిమానము కలిగి ఉండి తాము యశోదగా భావన చేసుకొని భగవానుని సౌశీల్యం(ఔదార్యం)  మరియు  సౌలభ్య ములను (సులభంగా లభించువాడు) అనుభవించిరి.

పొంగి పొరులుతున్న ప్రేమాతిశయ భావనలచే వారు  ‘పెరియాళ్వార్ తిరుమొజి’ అనే దివ్య ప్రంబంధాన్ని  అనుగ్రహించారు. తమ భావనలో సదా శ్రియఃపతిని స్మరించేవారు. తమను  ఆశ్రయించిన  శిష్యులను మరియు అభిమాలను  అనుగ్రహించి దిద్దుబాటు ద్వారా ఉజ్జీవింపచేసిరి.

వీరి తదుపరి  దివ్య చరితమును ఆండాళ్  చరితములో http://guruparamparai.wordpress.com/2012/12/16/andal/.  కూడ సేవించవచ్చు

వీరి తనియన్

గురుముఖ మనధీత్య ప్రాహ వేదానశేషాన్
నరపతి పరిక్లుప్తం శుల్కమాధాతుకామ: |
శ్వశురమమరవంధ్యం రంగనాథస్య సాక్షాత్
ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి ||
వీరి అర్చావతార అనుభవం క్రితమే ఇక్కడ వివరించబడింది. http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-periyazhwar.html.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

ఇవన్నీ archived in http://guruparamparai.wordpress.com, మరియు http://ponnadi.blogspot.in/,http://srivaishnava-events.blogspot.com నందు భద్ర పరచబడ్డాయి

ఆధారం : ఆరాయిరపడి వాఖ్యానం ,గురుపరంపర ప్రభావం, పెరియ తిరుముడి అడైవు.

Source:

కులశేఖర ఆళ్వార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

kulasekarazhwar

తిరునక్షత్రము: మాఘ మాసము(మాశి),పునర్వసు నక్షత్రం 

అవతార స్తలము: తిరువంజిక్కళమ్

ఆచార్యులు: విష్వక్సేనులు

శ్రీ సూక్తులు: ముకుందమాల, పెరుమాళ్ తిరుమొజి

పరమపదము చేరిన ప్రదేశము: మన్నార్ కోయిల్ (తిరునల్వేలి దగ్గర)

కులశేఖరాళ్వార్  క్షత్రియకులములో (రజోగుణ ప్రధానమైనది) జన్మించినప్పటికి భగవంతుని  మరియు భక్తుల యెడల చాలా విధేయుడై ఉండెడివారు. రాముడి యందుగల అనన్యసామాన్యమైన భక్తి వలన  ఈ ఆళ్వార్  ‘కులశేఖర పెరుమాళ్’(పెరుమాళ్ అనేది భగవంతుని సంభోధించు పదం) గా ప్రసిద్దులైరి. తమ పెరుమాళ్ తిరుమొజిలో మొదటి పదిగములో(10 పాశురముల  సమూహం) (ఇరుళిరియ  చ్చుడర్ మణిగళ్) పెరియ పెరుమాళ్(శ్రీరంగనాధునకు)కు  మంగళాశాసనము చేసిన  వెంటనే తన రెండవ పదిగములో(తేట్టరున్ తిఱల్ తేనినై) శ్రీవైష్ణవుల వైభవమును తెలిపిరి.  శ్రీవైష్ణవుల సంభందమువలన వీరు ప్రసిద్ధిపొందిరి. దీనిని వీరి  చరిత్రలో మున్ముందు తెలుసుకుందాం.

జీవాత్మ అసలు స్వరూపము శేషత్వమే అని ఆళ్వార్ నిర్ణయించుకొని తామే స్వయంగా తమ  పెరుమాళ్ తిరుమొజి చివర(10.7) ఈ విధముగా తెలిపిరి “తిల్లైనగర్ త్తిరుచిత్తిరకూడన్ తన్నుళ్ అరశఅమర్ న్దాన్ అడిశూడుమ్ అరశై అల్లాల్ అరశాగ ఎణ్ణేన్ మత్తరశు తానే” దీనర్థము: తిరుచిత్రకూటరాజు(గోవిన్దరాజ పెరుమాళ్)  శ్రీపాదపద్మములను తప్ప మరేతర దానిని ఉపాయముగా నేను భావించను.  జీవాత్మకు ఉండకూడని దేవతాంతర/విషయాంతర సంబంధములను  ఈ వాక్యం ద్వారా స్పష్టముగా  నిర్ధారించెను.

“అచిత్ వత్ పారతంత్ర్యం” వలె జీవాత్మ స్వరూపం ఉండాలని తిరువేంకటపదిగములో  4.9 లో తీర్మానించెను ,

దాని వివరణ~:

శెడియాయ వల్వినైగళ్ తీర్కుమ్ తిరుమాలే

నెడియానే వేఙ్గడవా! నిన్ కోయిలిన్ వాశల్

అడియారుమ్ వానవరుమ్ అరమ్బైయరుమ్ కిడన్దు ఇయఙ్గుమ్

పడియాయ్   క్కిడన్దు ఉన్ పవళ వాయ్ కాణ్బేనే||

“ఓ వేంకటేశా!  అనాదికాలముగా  ఆర్జించిన పాపాలను ఛేదించే వాడివై, తిరుమలలో వేంచేసి ఉండే  నీ భక్తులు, దేవతలు కలసి సంచరించే నీ దివ్యసన్నిధి  వాకిటిలో అందరు కాలితో తొక్కే గడపగా పడిఉండి  పగడము వంటి పరమభోగ్యమైన నీ అధరోష్ఠాన్ని ఎల్లప్పుడూ సేవించే భాగ్యాన్ని కలవాడను కావాలి.” అని కోరుకొనిరి.

పెరియవాచ్చాన్ పిళ్ళై జీవాత్మకు ఉండు రెండు సంబంధములను గురించి ఈ విధముగా వివరించిరి.

 • పడియై కిడందు –   అచిత్ (అచేతనములు) అను జీవాత్మ ఎల్లప్పుడూ భగవానుని ఎడల పూర్తి నియంత్రణను కలిగి ఉండవలెను. ఎలాగైతే చందనము మరియు పుష్పములు వాటి వ్యక్తిగత ఆసక్తి కాకుండా వినియోగదారుని ఆనందమును గురించి ఉంటాయో ఆ విధముగా.
 • ఉన్ పవళవాయ్ కాణ్బేనే –  చిత్(చేతనములు) ఎల్లప్పుడూ భగవానుడు మా సేవను అంగీకరించి ఆ సేవచే ఆనందమును పొందుచున్నాడని గ్రహించవలెను. ఒకవేళ మేము ఆ సత్యమును గ్రహించని యెడల మాకు అచిత్ నకు ఏవిధమైన తేడాలేదు.

ఈ సూత్రమును “అచిత్ వత్ పారతన్త్రియమ్” అని పిలుచుదురు. దీనర్థము జీవాత్మ పూర్తిగా భగవానునిచే నియంత్రించబడును. ఇది మన శ్రీవైష్ణవ సిద్దాంతములో అతి ముఖ్యమైన సూత్రము.

ఇదివరకే మామునిగళ్ తమ ‘అర్చావతార అనుభవము’ అనే సంచికలో కులశేఖరాళ్వార్  గొప్పతనమును వివరించారు. దానిని ఈ సైట్ లో చూడండి

 http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-kulasekara.html.

భాగవతులను జన్మని బట్టి వారియందు భేదమును చూపరాదని వివరించి చివరన నమ్మాళ్వార్ మరియు ఇతర మహానుభావుల గొప్పతనమును చెప్పిరి.  మానవజన్మ దుర్లభత్వమును వివరిస్తూ దానిని భగవత్ కైంకర్యము చేయుటకు అనుకూలముగా మలచుకోవాలి చెప్పిరి. వారు నిమ్నజాతిలో జన్మించిన మహాపురుషులు  ఏవిధముగా కైంకర్యమును చేసిరో ఇక్కడ దృష్టాంతములతో సహా నాయనార్ ఉదాహరించెను.  87వ చూర్ణికలోని సారమును మరియు అది ఏవిధముగా కులశేఖరాళ్వార్ నకు అన్వయమవునో చూద్దాము.

“అన్ణైయ ఊర పునైయ అడియుమ్ పొడియుమ్ పడప్ పర్వత భవణన్ఙ్గళిలే ఏతేనుమాగ జణిక్కప్ పెఱుగిఱ తిర్యక్ స్తావర జణ్మన్ఙ్గళై పెరుమక్కళుమ్ పెరియోరుమ్ పరిగ్రహిత్తుప్ ప్రార్తిప్పర్గళ్”

నిత్యసూరులైన అనంతగరుడాదులు  పానుపుగా (ఆదిశేషుడు),ఒక పక్షిలా (గరుడాళ్వార్), మొదలగు వాటిగా జన్మించుటకు అవకాశము కొరకు చూసెదరు.  భగవానునికి తిరుత్తుళాయ్(తులసి) అంటే మహాప్రీతి అందుకనే ఆ తులసిని తన దివ్య శరీరమంతయు (తన శిరస్సుపై, భుజములపై, వక్షస్థలముపై)  అలంకరించుకొందురని నమ్మాళ్వార్ వివరించిరి.   కృష్ణుడు మరియు గోపికల పాదపద్మముల స్పర్శ కలిగి దివ్యస్థలమైన బృందావనములో మట్టిగానైన ఉండవలెనని పరాశరవ్యాసశుకమహర్షులు కోరుకొనిరి. కులశేఖరాళ్వార్  కూడా తిరువేంగడకొండపై ఏదైనా ఒక వస్తువుగా పడి ఉండవలెనని కోరుకొనిరి. ఆళవందార్ కూడా ఒక శ్రీవైష్ణవుడి గృహములో పురుగానైనా జన్మించవలెనని కోరుకొనిరి. క్రింద చూర్ణికలో కులశేఖరాళ్వార్ కోరికని మామునిగళ్ ఏవిధముగా వ్యాఖ్యానించిరో  చూద్దాము.

పెరుమాళ్ తిరుమొళి 4వ పదిగములో, ఆళ్వార్ తిరువేగండముతో ఎదైనా ఒక సంభందము కలిగి ఉండవలెనని కోరుకొనిరి – వారు నిత్యము తిరువేంగడముపై ఉండవలెనని కోరుకొనేవారు.

sri-srinivasar

వారికి గల కోరికలు~:

 • కొండపై గల కొలను దగ్గర ఒక పక్షిలా –
 • కొలనులో ఒక చేపలా – ఎందుకంటే –  ఒకవేళ  పక్షినైతే తిరువేంగడం నుండి దూరంగా ఎగిరిపోవచ్చునేమో?
 • భగవానుని  కైంకర్యపరుల చేతిలో బంగారుపాత్రలా- ఎందుకనగా చేపనైతే  ఈదుతూ వెళ్ళిపోవచ్చునేమో?
 • చెట్టుపై ఒక పువ్వులా – ఎందుకంటే –    బంగారపు తత్త్వం కలిగి ఉండడముచే అహంభావము కలిగి  ఙ్ఞానము దారితప్పునేమో? .
 • ఒక పనికిరాని చెట్టులా – ఎందుకంటే –  ఒకసారి పువ్వుని వాడి, బయట పడివేయుదురు కదా.
 • ఒక నదిలా – ఎందుకంటే  –  పనికిరాని చెట్టుని ఒకరోజు తీసివేయుదురు కదా.
 • సన్నిధికి వెళ్ళు దారిలో మెట్లవలె – ఎందుకంటే- నది ఒక రోజు ఎండిపోవచ్చు కదా.
 • చివరకు గర్భగుడికి  ఎదురుగా గల మెట్టులా (దీనినే కులశేఖరపడి అని వ్యవహరించుదురు) ఎందుకంటే-   మెట్లవలె ఉండడమువలన కొన్ని రోజుల తర్వాత  దారి మార్చవచ్చు.

ఏవిధంగానైన  నిత్యము  తిరువేంకట నివాసం చేయవలెనని కోరుకొనిరి. పెరియవాచ్చాన్ పిళ్ళై తన వ్యాఖ్యానములో ఈ విధముగా చెప్పిరి-  తిరువేంకటముడైయాన్ స్వయముగా ఆ కొండతో నిత్య సంభదము కలిగి ఉండునని ఆళ్వార్ మరిచిరి.

కులశేఖరాళ్వార్లు తమ స్వలాభమును కాక్షించక పూర్తిగా భగవత్భాగవత సంభందము గురించే తపించెడివారు.

దీనిని మన మదిలో ఉంచుకొని వారి జీవిత చరిత్రను చూద్దాం.

శ్రీ కులశేఖర పెరుమాళ్ కొల్లినగర్ (తిరువన్జిక్కళమ్) అను రాజ్యములో క్షత్రియవంశములో శ్రీకౌస్తుభం అంశముతో జన్మించిరి. వీరిని కొల్లికావలన్, కొజియర్ కోన్, కూడల్ నాయకన్ మొదలగు నామములతో కూడా వ్యవహరించెదరు.

తనియన్ లో వివరించినట్టు మాఱ్ఱలరై  వీరంగెడుత్త శెంగోల్ కొల్లి కావలన్ విల్లవర్ కోన్  శేరన్ కులశేఖరన్ ముడివేందర్ శిఖామణియే” వీరు చేరరాజ్యమునకు రాజు,  శత్రువులను నిర్మూలించే గొప్ప బలము కలిగిన రథములు, గుఱ్ఱములు, ఏనుగులు మరియు శత్రువులను ప్రారదోలే సైనికులను కలిగి ఉన్నారు. ఆళ్వార్ ధర్మబద్ధంగా రాజ్యమును పరిపాలించెడివారు. శ్రీరాముని వలె బలుడైనప్పటికినీ ఎప్పుడుకూడా బలహీనులను ఇబ్బందులకు గురిచేసేవారుకాదు.

రాజైన ఆళ్వార్ సరైన నిర్ణయములతో రాజ్యమును తమ ఆధీనములో ఉంచుకొనేవారు.     శ్రీమన్నారాయణుడు మాత్రమే పరమపదమునకు మరియు సంసారమునకు సర్వాధికారి అని నమ్మేవారు. వారి  నిర్హేతుక కృపచే, అపారమైన దైవిక విషయములందు పరిఙ్ఞానమును కలిగి,  రజో/తమో గుణములను నిర్మూలించుకొని పూర్తిగా సత్వగుణముచే భగవానుని దివ్యస్వరూపము, రూపము (అవతారము), గుణము, విభూతి (సంపద/శక్తి) మరియు చేష్ఠితములు (లీలలను) పూర్తిగా తెలుసుకొనిరి. భగవద్విషయమందు ఆలోచన లేకుండా తమ శరీర అవసరములను గురించి మాత్రమే చింతించే సంసారులను చూసి  ఆళ్వార్ వేదనచెందెను. నమ్మాళ్వార్ చెప్పినట్లుగా సాంసారికవిషయాలు పెద్దఅగ్ని వంటిదని అది  మానవుని శారీరక అవసరములందు మరలా మరలా వ్యామోహమును పెంపొందిచునని గ్రహించిరి.  కులశేఖరాళ్వార్ తమ రాజ్యముతో ఎటువంటి సంభదము పెట్టుకోకుండ  శ్రీవిభీషణాళ్వాన్ వలే తమ సంపదను శ్రీ రాముని పాదాల వద్ద ఉంచి శరణువేడెను.

ప్రాపంచిక విషయములను వదిలి ఎల్లప్పుడూ శ్రీరంగనాథున్ని గుణములను కీర్తించుదురో వారి ఎడల వ్యామోహమును పెంచుకొనిరి ఆళ్వార్. అధిక సమయమును శ్రీవైష్ణవులైన సాధువులతో  గడిపెడివారు. “అన్నియరంగన్ తిరుముట్రత్తు అడియార్”(అధికముగా తమ దినచర్యను శ్రీరంగనాధుని ఆలయములో గడిపెడివారు)అన్నట్లుగా గడిపెడివారు. ‘శ్రీరంగయాత్ర చేయవలెననే కోరిక ఉంటే చాలు పరమపదము లభించునని’ అనే వాక్యముననుసరించి  సదా శ్రీరంగం గురించే ఆలోచించెడివారు.

స్వామి పుష్కరిణితో కూడిన తిరువేంగడంపై (తిరుమల) అధిక వ్యామోహమును ఏర్పరుచుకొనిరి. స్వామి పుష్కరిణి గంగాయమునాది నదులకన్నా విశేషమైనదని కీర్తించబడెను. ఆండాళ్ కూడ  “వేంకటత్తైప్ పతియాగ వాళ్వీర్గాళ్”(సదా మానసికముగా  తిరువేంకటముపై నివాసము చేయవలెను) అని చెప్పెను కదా.  అక్కడ గొప్పఋషులు  మరియు మహాత్ములు నిత్యవాసము చేయుదురు కారణం వారు కూడా అదేవిధమైన కోరికని కలిగిఉన్నారు కనుక.  పెరుమాళ్  తిరుమొజి 4వ పదిగంలో  తిరుమల దివ్యదేశములో పక్షిలా, చెట్టులా,రాయిలా, నదిలా ఉండవలెనని ఆళ్వార్ కోరికను చూసితిమి కదా ఇదివరకు. ఇది కాకుండా  దివ్యదేశములలోని అర్చావతార భగవానున్ని వారి భక్తులను సేవించవలెనని కోరికను కలిగిఉండిరి.

పురాణేతిహాసములను పరిశీలించి “ముకుందమాల” అను సంస్కృతశ్లోక గ్రంథమును వ్రాసిరి.

శ్రీరామాయణము గొప్పతనమును తెలుపు శ్లోకం:

వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే |

వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా||

వేదవేద్యుడు, వేదముచేత తెలియబడేవాడు దశరథాత్మాజుడిగా అవతరించినప్పుడు వేదము వాల్మీకి మహర్షికి ఆశువుగా రామాయణముగా అవతరించింది.

rama-pattabishekam

పై శ్లోక ప్రమాణంగా కులశేఖరాళ్వార్  ప్రతిరోజు దినచర్యగా శ్రీరామాయణాన్ని శ్రవణం చేస్తు  ప్రవచిస్తుఉండేవారు. ఆళ్వార్ ఒక్కొక్కసారి  శ్రీరామాయణంలో తన్మయత్వంగా  మునిగి తమనుతాము మరచిపోతుండేవారు.

ఒకసారి ఉపన్యాసకుడు శ్రీరామాయణంలోని ఖరదూషణాదులు మరియు పదనాల్గువేలమంది రాక్షసులు శ్రీరామునితో యుద్ధానికి సిద్ధమవుతుండగా శ్రీరాముడు ఒక గుహలో సీతాదేవిని ఇళయపెరుమాళ్ (లక్ష్మణుని) సంరక్షణలో ఉంచి  తానొక్కడే పదనాల్గువేలమంది రాక్షసులతో ఒంటి చేత్తో ఎదుర్కొనుచుండగా,   ఋషులందరు భయముతో చూస్తుండే ఘట్టం ప్రవచిస్తున్నారు. అది విన్న  ఆళ్వార్  నిష్ఫల భావోద్వేగముతో శ్రీరామునికి యుద్ధములో సహకరించుటకు తన సేనలకు  యుద్ధరంగం వైపు  వెళ్ళుటకు సిద్ధం కావల్సినదని ఆఙ్ఞాపిస్తారు.  దీనిని చూసిన మంత్రులు కొందరిని రాజు యాత్రకు ఎదురుగావచ్చేలా చేసి వారితో  “మహారాజా శ్రీరాముడు యుద్ధములో విజయాన్ని వరించాడు, సీతాదేవి అతని గాయాలకు ఉపశమన చర్యలు చేస్తున్నది కావున మీరిక వెళ్ళవలసిన పనిలేదు” అని చెప్పించారు. ఆళ్వార్ సంతుష్టి చెంది తన రాజ్యానికి వెనుదిరిగాడు.

మంత్రులందరు ఆళ్వార్ వింతప్రవర్తన గురించి ఆలోచించి శ్రీవైష్ణవుల అనుభంధ వ్యామోహము నుండి విడదీయాలని నిర్ణయించుకొన్నారు. మంత్రులందరు రాజును శ్రీవైష్ణవులనుండి దూరం చేయుటకు ఒక యుక్తిని పన్నారు. వారు ఆళ్వార్ తిరువారాధన గది నుండి ఒక వజ్రాలనగను దొంగిలించి ఆ దొంగతనాన్ని అత్యంత సన్నిహితులైన శ్రీవైష్ణవులపై మోపుతారు.  ఇది తెలసిన ఆళ్వార్ విషనాగుతో ఉన్న ఒక కుండను తెప్పించి దానిలో  తన చేతిని పెడుతూ “శ్రీవైష్ణవులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే  పాము నన్ను కాటువేయును గాక”  అనగా, వారి నిజాయితికి ఆ పాము కాటువేయలేదు. దీనిని చూసిన మంత్రులు సిగ్గుచెంది ఆ నగను తిరిగి ఇచ్చివేసి ఆళ్వార్ కు  మరియు ఆ శ్రీవైష్ణవులకు క్షమాప్రార్ధన చేసిరి.

క్రమంగా ,ఆళ్వార్  ఈ సంసారుల మధ్యన ఉండుటకు ఇష్టపడక, ‘శౌనక సంహిత’ లో చెప్పిన విధంగా “భగవంతుని కీర్తించని  సంసారుల మధ్య నివసించుట ఒక అగ్నిగోళం మధ్యన ఉండుట లాటింది” అని విచారించిరి.

ఆళ్వార్ తన రాజ్యభారాన్ని, బాధ్యతలను తన కుమారుని చేతిలో ఉంచి వానికి పట్టాభిషేకం చేసి ఇలా నిర్ణయించుకొన్నాడు “ఆనాద శెల్వతత్తు అరంబైయర్గళ్ తార్చుజ వానాళుం శెళ్వముం మన్నాన్నరశుం యాన్ వేన్నాదెన్” ( సేవకులచే పరివేష్టించబడి ఉండే వినోదాలను మరియు  సంపదను ఇక కోరను)

ఆళ్వార్  తన సన్నిహితులైన శ్రీవైష్ణవులతో  రాజ్యాన్ని వదిలి శ్రీరంగమును చేరి  బంగారపు పళ్ళెములో వజ్రమువలె ఉన్న( ఆదిశేషునిపై పవళించి ఉన్న) శ్రీరంగనాధున్ని మంగళాశాసనము చేసినారు.  తన భావ సంతృప్తి ఫలముకై ప్రతి క్షణమును ఎంపెరుమాన్ కీర్తిస్తు, “ పెరుమాళ్ తిరుమొజి” రచించి అందరి ఉన్నతికై ఆశీర్వదించినారు. కొంతకాలము ఈ సంసారములోజీవించి చివరకు దివ్యమైన పరమపదమునకు వేంచేసి పెరుమాళ్ కి నిత్య కైంకర్యమును చేసిరి.

ఆళ్వార్ తనియన్:

ఘుష్యతే  యస్య నగరే  రంగయాత్రా దినేదినే |

తమహం శిరసా వందే రాజానం కులశేఖరమ్ ||

వీరి అర్చావతార అనుభవం  క్రితమేఇక్కడ చర్చించబడినది: – http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-kulasekara.html.

అడియేన్ నల్ల శశిధర్ రామానుజదాస:

Source

తిరుమజిశై ఆళ్వార్

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్ వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః

thirumazhisaiazhwar తిరునక్షత్రము: మాఘ మాసము(తై),మఖానక్షత్రం

అవతార స్థలము: తిరుమజిశై(మహీసారపురం)

ఆచార్యులు: విష్వక్సేనులు, పేయాళ్వార్

శిష్యులు: కణికణ్ణన్, ధ్రుడవ్రతన్

శ్రీ సూక్తులు: నాన్ముగన్ తిరువందాది, తిరుచన్ద విరుత్తమ్

పరమపదము చేరిన ప్రదేశము: తిరుక్కుడందై(కుంభకోణం)

శాస్త్రసంపూర్ణఙ్ఞాన సారమును  ఈ ఆళ్వారు కలిగిఉన్నారని మామునిగళ్  కీర్తించెను (ఈ ఆళ్వార్ వివిధ మత సిద్ధాంత గ్రంథాలను లోతుగా పరిశీలించి అవన్నీ నిస్సారమని తేల్చి చివరకు శ్రీవైష్ణవసాంప్రదాయమే ఉత్తమమైనదని నిర్ణయించుకొని పేయాళ్వార్ ని ఆశ్రయించారు )  .  శ్రీమన్నారాయణుడే మనకు ఆరాధనీయుడును అన్య దేవతలను (పాక్షిక దేవతలు)లేశ మాత్రము కూడ ఆరాధనీయులు కారు అని నిర్ణయించారు. మామునిగళ్ వీరిని “తుయ్యమది” అని సంభోధించిరి. దీనర్థము ‘నిర్మలమైన మనసు’ కలిగిన ఆళ్వార్. పిళ్ళైలోకమ్ జీయర్ ఆళ్వారు యొక్క శుద్దమైన మనసును ఈ విధముగా విపులీకరించిరి-  –  శ్రీమన్నారాయణుడు దేవతలందరికి కూడా పరతత్త్వమ్ (శ్రేష్టత్వము) అనే నమ్మకమును కలిగి ఉండవలెను, దీనిని ఏ మాత్రము సంశయించరాదు.

శ్రీవైష్ణవులు అన్య దేవతలయందు ఏవిధమైన భావనను కలిగి ఉండాలో ఆళ్వార్ తమ పాశురములలో వివరించిరి.  మచ్చుకకు కొన్ని ఉదాహరణలు                                                                                                                           :

 • నాన్ముగన్ తిరువందాది– 53వ పాశురం  – తిరువిల్లాత్ తేవరైత్ తేఱేల్మిన్ తేవు  – శ్రీమహాలక్ష్మి ఆరాధనీయ దేవత కాదు అన్న వారిని లెక్కించరాదు.
 • నాన్ముగన్ తిరువందాది– 68వ పాశురం – తిరువడి తన్ నామమ్ మఱణ్దుమ్ పుఱణ్తొజా మాణ్దర్ – ఒకవేళ శ్రీవైష్ణవులు శ్రీమన్నారాయణుడే సర్వస్వామి అని మరచిననూ ఫరవాలేదు కాని ఇతర దేవతలను మాత్రము ఆరాధించరాదు.

నాన్ముగన్ తిరువందాది వ్యాఖ్యానములో  పెరియవాచ్చాన్ పిళ్ళై మరియు నమ్పిళ్ళై  ఎమ్పెరుమాన్ (భగవంతుడు) పరత్వమును మరియు ఇతర దేవతల యొక్క పరిధిని తిరుమజిశైఆళ్వార్ ప్రతిఒక్కరి మనసులోని సందేహములను తన చేష్ఠితముల ద్వారా  తమ గ్రంథముల ద్వారా నివృత్తి చేసిన విధానమును  చాలా మధురంగా వివరించిరి.

పెరియవాచ్చాన్ పిళ్ళై వివరణ~: ముదలాళ్వారులు శ్రీమన్నారాయణుడు మాత్రమే తెలుసుకొని అనిభవించ దగిన వాడని నిర్ణయించిరి. తిరుమజిశై ఆళ్వార్ ఈ  క్రమమును పరిష్కృతము చేసిరి. వారు సంసారులకు ఈ విధముగా వివరించిరి – ఎవరైతే ఇతర దేవతలను ఈశ్వరునిగా  (అధికారి)  తలుస్తారో  ఆ  ఇతర దేవతలు కూడ  క్షేత్రగ్య (జీవాత్మ – శరీరము గురించి తెలిసిన వారు) వేరొకరిచే యేలబడుదురు. వారు కూడా  శ్రీమన్నారాయణుడే ఈ ప్రపంచమునకు అధికారి అని చెప్పెను .

నమ్పిళ్ళై వివరణ~: ముదలాళ్వారులు సర్వేశ్వరుని  గురించి  లోకజ్ఞానము వలన,  శాస్త్రము వలన,  వారి భక్తి వలన మరియు ఎమ్పెరుమానుల నిర్హేతుకకృప వలన తెలుసుకొనిరి. తిరుమజిశైఆళ్వార్ కూడా ఎమ్పెరుమాన్ గురించి అదేవిధముగా తెలుసుకొని అనుభవించిరి. కాని ప్రపంచమును చూసి  వారు కలత చెందిరి.    ఎందుకనగా  చాలామందిజనాలు  శాస్త్రములో చెప్పిన విధముగా శ్రీమన్నారాయణుడే అధికారి అని మరియు అతడే సర్వనియంత అని గ్రహించడం లేదు.  అతని అత్యంత కృప వలననే  వేదరహస్యములు చెప్పబడెను.  బ్రహ్మ (ప్రధమ సృష్టికర్త) తాను కూడా సృష్టి సమయములో శ్రీమన్నారాయణుని చేత సృజించబడిన ఒక జీవాత్మయే.  శ్రీమన్నారాయణుడే సకల చరాచర జగత్తుకు  అంతర్యామిగా ఉండునునని వేదములో వివరించబడినది. శ్రీమన్నారాయణుడే  సర్వనియంత. ఈ సూత్రమే పరమ ప్రామాణికంగా నిర్ధారించు కొని  ఎన్నటికిని విడువరాదు”.

ఈ విధముగా మామునిగళ్, పెరియవాచ్చాన్ పిళ్ళై మరియు నమ్పిళ్ళై తమ తమ  శ్రీ సూక్తులలో తిరుమజిశై ఆళ్వారుల ప్రత్యేకతని వివరించిరి.

తిరుచన్ద విరుత్తమ్ తనియన్ లో  చాలా అందముగా ఆళ్వార్ గురించి వివరించబడినది –  ఒకసారి మహా ఋషులు తపమును చేయుటకు అనువైన  ప్రదేశమును గురించి తెలుసుకొనుటకై   మొత్తము ప్రపంచమును తిరుమజిశైతో (తిరుమజిశై ఆళ్వార్  అవతార  స్థలము) పోల్చిచూసి  తిరుమజిశైయే గొప్పదని నిశ్చయించిరి. అంతటి గొప్పతనము ఆళ్వార్/ఆచార్యుల యొక్క అవతార స్థలములు. దివ్యదేశముల కన్నా మేటిగా  కీర్తీంచబడెను. ఎందుకనగా ఆళ్వార్/ఆచార్యులు మనకు ఎమ్పెరుమాన్ గురించి తెలియపరచిరి. వీరులేనిచో మనకు ఎమ్పెరుమాన్ యొక్క విశేషమైన గుణములను అనుభవించ లేక పోయేవారము.

దీనిని మనసులో ఉంచుకొని ఇక మనము ఆళ్వార్ చరితమును తెలుసుకుందాము.

ఆళ్వార్  కు కృష్ణుడితో  పోలిక  – కణ్ణన్ ఎమ్పెరుమాన్ వసుదేవ/దేవకిలకు జన్మించి నన్దగోప/యశోదల వద్ద పెరిగిరి. అదేవిధముగా  ఆళ్వార్ భార్గవ ఋషి /కనకాంగికి జన్మించి  తిరువాళన్/పంగయచెల్వి ( కట్టెలు కొట్టువాడు మరియు అతని భార్య) అను వారి వద్ద పెరిగెను. వీరిని శ్రీభక్తిసారులు, మహీసారపురాధీశులు, భార్గవాత్మజులు, తిరుమజిశైయార్ మరియు అతిప్రాధాన్యముగా తిరుమజిశై పిరాన్   అనికూడా వ్యవహరించెదరు. పిరాన్ అనగా అర్థము ఒక పెద్ద ఉపకారమును చేసిన వారు, ఆళ్వార్ నారాయణ పరత్వమును స్థాపించి గొప్ప ఉపకారమును చేసెను కదా.

ఒకసారి మహర్షులైన  అత్రి, భృగు, వశిష్ట, భార్గవ మరియు అంగీరస మొదలగు వారు బ్రహ్మ (చతుర్ముఖ) వద్దకు వెళ్ళి ఈ విధముగా అడిగిరి,  “మేము భూలోకములో ఒక మంచి ప్రదేశములో నివసించదలిచినాము, దయతో ఒక అనువైన ప్రదేశమును స్థాపించండి”. బ్రహ్మదేవుడు సారవంతమైన  తిరుమజిశై స్థలమును గ్రహించి  విశ్వకర్మ సహాయముతో మొత్తము ప్రపంచమును ఒకవైపు మరియు తిరుమజిశైని మరొకవైపు వేసి తూచగా తిరుమజిశైయే సారములో(పవిత్రతలో ) నెగ్గినది. దీనిని మహీసార క్షేత్రము అని కూడా పిలుచుదురు. మహర్షులు ఇక్కడ కొంతకాలము నివసించిరి.

ఒకానొక  సమయములో భార్గవ మహర్షి శ్రీమన్నారాయణుడి గురించి దీర్ఘసత్రయాగము చేసిరి. ఆ సమయాన అతని భార్య  12 మాసముల గర్భవతిగా ఉండి ఒక పిండమునకు (మాంసము ముద్ద)జన్మనిచ్చినది. వారే తిరుమజిశై ఆళ్వార్. వారు సుదర్శన అంశగా అవతరించిరి (ఆళ్వారుల కీర్తిని చూసి కొందరు పూర్వాచార్యులు వీరిని నిత్యసూరుల అంశ అని, మరికొందరు –  అనాదియైన సంసారమునందు అకస్మాత్తుగా భగవానుని కృపచే  జన్మించిరని  ధృడంగా నిశ్చయుంచిరి). అప్పటికి పూర్తి రూపము రానందున భార్గవమహర్షి మరియు అతని భార్య ఆ శిశువును ఆదరించక పొదల  మధ్యన విడిచివెళ్ళిరి. శ్రీ భూదేవిల అనుగ్రహము వలన  ఆ పిండము కాపాడబడినది. ఆమె స్పర్శ వలన ఆ పిండము ఒక అందమైన శిశువుగా మారెను. వెంటనే ఆ శిశువు ఆకలిచే ఏడుస్తుండగా జగన్నాథభగవానుడు  ( తిరుమజిశైకి అధిపతి)  తిరుక్కుడందై ఆరావముదన్ రూపములో దర్శనమిచ్చి కృపచూపి త్వరలో పూర్తి ఙ్ఞానమును గ్రహించగలవు అని దీవించి అదృశ్యమయ్యారు. భగవానుని విరహమును తట్టుకోలేక ఆళ్వార్  దు:ఖించిరి.

ఆ సమయములో తిరువాళన్ అను ఒక కట్టెలుకొట్టేవాడు  అటునుండి వెళ్ళుచుండగా ఏడుస్తున్న ఈ బాలుడిని చూసి చాలా సంతోషముతో తీసుకొని తన భార్యకు  ఇచ్చెను. వారికి సంతానము లేకపోవడముచే ఆమె ఆ బాలుడిని పెంచసాగినది. తన మాతృవాస్తల్యముచే  ఆళ్వారునకు  స్తన్యమివ్వాలని  ప్రయత్నించినది.  కాని ఆళ్వార్  భగవత్ కల్యాణగుణములను అనుభవించుటచే ఆహారము గ్రహించుట, మాట్లాడుట, ఏడ్చుట మొదలగు వాటిని చేయలేదు, కాని భగవత్ అనుగ్రహముచే  అందముగా పెరగసాగెను.

చతుర్ధవర్ణములో జన్మించిన  ఒక వృద్ద దంపతులు ఈ ఆశ్చర్యకరమైన వార్తను విని  ఒకరోజు వెచ్చని పాలను తీసుకొని ఈ బాలుని దర్శనార్ధం ఒక ఉదయాన  వచ్చిరి. ఆ బాలుని దివ్యమైన తేజస్సును చూసి ఆ పాలను వారికి సమర్పించి స్వీకరించవలసినదిగా  అభ్యర్ధించిరి. ఆళ్వార్ వారి భక్తికి సంతోషించి ఆ పాలను స్వీకరించి మిగిలిన శేషమును వారికి ఇచ్చి ప్రసాదముగా స్వీకరించమనిరి. ఈ ప్రసాద ప్రభావము వలన వారికి ఒక సత్పుత్రుడు  త్వరలో కలుగునని దీవించిరి. ఆళ్వార్ అనుగ్రహముచే వారు తమ యవ్వనమును తిరిగిపొందిరి మరియు  అతి త్వరలోనే ఆ స్త్రీ గర్భము దాల్చినది. 10 మాసముల అనంతరం ఆమె శ్రీ విదురుని వలెనున్న (శ్రీ కృష్ణునిలో భక్తి కలిగిఉన్న) ఒక బాలుడికి  జన్మనిచ్చెను. వారు అతడికి ‘కణికణ్ణన్’ అను పేరును పెట్టి భగవద్గుణములను గురించి పూర్తిగా నేర్పించిరి.

భార్గవాత్మజుడైన ఆ బాలుడు జన్మము నుండే భగవత్ కృప ఉండుటచే  తన ఏడు సంవత్సరముల వయసులో అష్టాంగయోగమును చేయదలచిరి. దానికి మొదలు పరబ్రహ్మను పుర్తిగా తెలుసుకొనుటకు ఇతర  మతముల  గురించి తెలుసుకొనెను (కారణం వాటి లోపభూయిష్టత తెలుసుకొనుటకు) అందు వలన బాహ్యమతములను (సాంఖ్య, ఉలూక్య, అక్షపాద,  కృపణ, కపిల, పాతంజల మరియు కుదృష్టి మతములైన శైవ,మాయావాద, న్యాయ, వైశేషిక, భాట్ట మరియు ప్రభాకర మొదలైన) పూర్తిగా పరీశీలించి ఇవన్నీనిజమైన పరమాత్మ తత్త్వమును నిర్ధారించుటలేవని  చివరగా సనాతన ధర్మమైన శ్రీవైష్ణవసిద్దాంతమును అవలంభించిరి. ఇలా 700 సంవత్సరములు గడిచినవి. సర్వేశ్వరుడు ఆళ్వారులను  అపరిమితమైన ఙ్ఞానమును ప్రసాదించి వీటిని దర్శింప చేసెను.

 • తన దివ్య స్వరూపమును
 • తన కళ్యాణ గుణములను
 • తన అవతారములను (ఇవి స్వరూప గుణములను దర్శింపచేయును)
 • ఆయా అవతారములలోని అందమైన ఆభరణములను
 • తన దివ్యమైన ఆయుధములను( ఎవైతే  అనుకూలురులకు ఆభరణముల వలె గోచరిస్తాయో)
 • తన మహిషీలను (శ్రీభూనీళాదేవేరులను) మరియు నిత్యసూరులను(వీరు ఎల్లప్పుడూ భగవద్గుణములను అనగా స్వరూపము, గుణములు, అవతారములు, ఆభరణములు, దివ్యాయుధములు మొదలైన అనుభవించుదురు)
 • పరమపదము –  దివ్యనిత్య నివాస ప్రదేశమును   చివరగా
 • సంసారమును –  ప్రకృతిపురుష కాల తత్త్వములను మరియు భగవానునిచే ప్రత్యక్షముగా లేదా  పరోక్షముగా(ఇతర దేవతలచే)   జరుగు నిరంతర సృష్టి, స్థితి, సంహారములు ఉండునది.

కళ్యాణగుణ పూర్ణుడైన భగవానుడు  ఆళ్వారునకు ఈ విధముగా చూపెను –

 • తాను బ్రహ్మను (తన మొదటి కుమారుడు)తన నాభి కమలము నుండి సృష్టించినది. శ్వేతశ్వేతారోపనిషత్తులో “యో బ్రహ్మణామ్ విదదాతి పూర్వమ్” దీని  అర్థము పరబ్రహ్మము (విష్ణువు)బ్రహ్మను(చతుర్ముఖ) సృజించుట
 • ఛాందోగ్య బ్రాహ్మణమ్ లో“బ్రహ్మణ: పుత్రాయ జ్యే ష్టాయ శ్రేష్టాయ” – దీనర్థం రుద్రుడు బ్రహ్మదేవునకు ప్రథమ సుపుత్రుడు.

ఆళ్వార్ దీనిని చూసి వెంటనే తమ నాన్ముగన్ తిరువందాది లో అదే భావమును  వ్రాసిరి “నాన్ముగనై నారాయణన్ పడైత్తాన్ నాన్ముగనుమ్ తాన్ముగమాయ్  శంకరనై త్తాన్ పడైత్తాన్” – దీని అర్థం  నారాయణుడు బ్రహ్మను సృజిస్తే , బ్రహ్మ తిరిగి రుద్రుడిని సృజించెను. ఇది సంసారులకు భగవానుని సర్వశక్తిత్వమును గురించి సందేహ నివృత్తి చేయును. తాను ఎన్నో మతములను చూసి చివరగా శ్రీమన్నారాయణుని కృపచే   వారి పాదపద్మములను చేరితినని ఆళ్వార్ భావించుకొనిరి. ఆళ్వార్  తిరువల్లిక్కేణి (బృన్దారణ్య క్షేత్రము) లోని కైరవిణి పుష్కరిణి తీరాన ఉన్న  శ్రియ:పతి కళ్యాణ గుణములను ధ్యానించుచుండిరి.

ఒకనాడు  రుద్రుడు పార్వతితో కలసి తన వాహనమైన వృషభముపై ఆకాశములో వెళ్ళుచుండెను. అప్పుడు వారి నీడ ఆళ్వారుపై  పడబోతుండగా ఆళ్వార్ ప్రక్కకు జరిగెను. అది గమనించిన పార్వతి రుద్రునితో మనము అతనిని  కలవాలని కోరినది.  మహాఙ్ఞాని, శ్రీమన్నారాయణుని భక్తుడైన అతను మనను  నిర్ల క్ష్యముచేయును అని రుద్రుడు బదులిచ్చాడు. రుద్రుడు  వారించినా పార్వతి  క్రిందికి వెళ్ళి అతనిని  తప్పక కలవాలని పట్టుబట్టెను. చేసేదేమి లేక సరేనని దంపతులు క్రిందకు దిగిరి. ఆళ్వార్ వారి రాకను కనీసము చూడనైనా చూడ లేదు.

రుద్రుడు –  “మేము మీ ముందర ఉన్నప్పటికినీ మీరు మమ్మల్ని నిర్లక్ష్యము చేయుచున్నారు?”.

ఆళ్వార్ – “నాకు మీతో చేయవలసిన పనేమీ లేదు”.

 రుద్రుడు – “మేము మీకు వరము ఇవ్వదలచితిమి”.

ఆళ్వార్ – “నాకు మీ నుండి ఎమియు అవసరము లేదు”.

రుద్రుడు – “నా వరము వృధాగా పోదు మీ కోరిక ఏమిటో చెప్పండి”.

ఆళ్వార్ – “మీరు నాకు మోక్షమును ఇస్తారా?”.

రుద్రుడు – “నాకు ఆ అధికారము లేదు కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే ప్రసాదించును”.

ఆళ్వార్ –  “ఎవరి మరణమునైనా నిలిపివేయుదురా?”

రుద్రుడు-  “అది వారి  కర్మానుగతము దానిపై నాకు అధికారము లేదు”.

ఆళ్వార్ – “కనీసము ఈ సూదిలో దారమునైన ఎక్కించగలరా?”.

రుద్రుడు కోపముతో- “ నిన్ను కామదేవుని వలె కాల్చివేయుదును”.

శివుడు తన మూడవ నేత్రమును తెరచి  అగ్నిని విడుదల చేసిరి. ఆళ్వార్ కూడా తన కుడికాలి బొటన వేలు ముందు భాగమున ఉన్న మూడవ నేత్రము నుండి అగ్నిశిఖలను ఏకధాటిగా విడుదల చేసెను. రుద్రుడు ఆళ్వారుల తిరువడి నుండి వచ్చే వేడిని తట్టుకోలేక  శ్రీమన్నారాయణుని శరణువేడెను. దేవతలు, ఋషులు మొదలగు వారు శ్రీమన్నారాయణుని ఆ ప్రళయమును ఆపమని అభ్యర్ధించిరి. శ్రీమన్నారాయణుడు  వెంటనే  మేఘములను పెద్ద వర్షమును కురిపించమని ఆఙ్ఞాపించెను. కాని అవి తమకు ఆళ్వారుల అగ్నిని ఆపే శక్తి లేదనగా శ్రీమన్నారాయణుడు వాటికి ఆ శక్తిని ప్రసాదించెను. ఒక పెద్ద వరద ఆ అగ్నిని అణిచివేయుటకు బయలుదేరెను. ఆళ్వార్ ఎలాంటి కలత చెందక శ్రీమన్నారాయణుని  ధ్యానమును చేయసాగెను. రుద్రుడు ఆళ్వారుల నిష్ఠకు ముగ్దుడై  “భక్తిసారులు” అని బిరుదును ఇచ్చి, అతడిని కీర్తిస్తు తన భార్యతో ‘దుర్వాసుడు అమ్బరీశుడికి చేసిన అపచారమునకు  ఏ విధముగా ఆ ఋషి  శిక్షించబడెనో వివరించి చివరకు దీనివలన భాగవతులు ఎప్పటికినీ అపజయమును పొందరు” అని  తమ ప్రదేశమునకు వెళ్ళిపోయిరి.

అలా ఆళ్వార్ తన ధ్యానమును కొనసాగించుచుండగా ఒక కేచరుడు (ఆకాశ సంచారకుడు) తన వాహనమైన పులిపై ఆకాశమున వెళుతు ఆళ్వారుని చూసిరి. ఆళ్వార్  యోగశక్తి వలన ఆ కేచరుడు వారిని  దాటి వెళ్ళలేకపోయినాడు. అతను క్రిందికు దిగివచ్చి ఆళ్వారునకు తన  ప్రణామములను సమర్పించి మాయచే ఒక దివ్యశాలువను సృజించి ఆళ్వార్ తో ఇలా అభ్యర్థించిరి  “మీ చిరిగిన శాలువను తీసి ఈ అందమైన శాలువను తీసుకొనవలసినది”. ఆళ్వార్ సులభముగా తమ శక్తిచే రత్నములతో పొదిగిన ఒక అందమైన శాలువాను సృజించగా కేచరుడు చికాకుపడెను. అప్పుడు అతను తన హారమును (నగ) తీసి ఆళ్వారునకు ఇచ్చిరి. ఆళ్వార్ తన తులసి మాలని తీసి వజ్రపు హారముగా చేసి చూపెను. కేచరుడు ఆళ్వార్  యోగ శక్తిని గ్రహించి  అతనిని కీర్తించి,  ప్రణామమును సమర్పించి సెలవుతీసుకొని వెళ్ళెను.

ఆళ్వారుల కీర్తిని విని కొంకణసిద్దుడు అను మంత్రగాడు ఆళ్వార్ దగ్గరికి వచ్చి ప్రణామములు సమర్పించి ఒక రసవిఙ్ఞాన రత్నమును(లోహము ను  బంగారముగా మార్పు చేయును ఒక రాయి), ఆళ్వార్  దానిని నిర్లక్ష్యము చేసి తన దివ్యమైన శరీరము నుండి కొంత మురికిని(చెవి భాగము నుండి) తీసి ఆ మంత్రగాడికి ఇచ్చి ఈ మురికి నీ రాయిని  బంగారముగా మార్పు చేయును అని అనిరి. అతను ఆ విధముగా ప్రయోగించగా తన రాయి బంగారముగా మారినది. అతను చాలా సంతోషించి ఆళ్వార్ కు తన ప్రణామములు సమర్పించి తిరిగి వెళ్ళెను.

ఆళ్వార్ అలా ఒక గుహలో ధ్యానమును చేసుకొనచుండిరి. ముదలాళ్వారులు (పొయ్ ఘై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్) భగవానున్ని కీర్తిస్తు నిత్యసంచారము చేస్తు  ఆళ్వార్ ధ్యానం చేయుచున్న గుహకు వచ్చిరి. ఆ గుహనుండి ప్రసరిస్తున్న దివ్యతేజస్సును చూసిరి. ఆ  ముదలాళ్వారులు తిరుమజిశైఆళ్వారుల  వైభవమును గ్రహించి వారి క్షేమమును గురించి విచారించిరి. ఆళ్వార్ కూడ ముదలాళ్వారుల  వైభవమును గ్రహించి వారి క్షేమమును విచారించిరి. కొంతకాలము వరకు  వారు తమతమ   భగవదనుభవములను  పరస్పరము ప్రవచించుకొనిరి. తరువాత వారు అక్కడి నుండి పేయాళ్వారుల అవతార స్థలమైన  ‘తిరుమయిలై’ (మైలాపూర్)చేరుకొనిరి. అక్కడ కైరవిణి తీరమున కొంతకాలము నివసించిరి. అలా  ముదలాళ్వారులు తమ  యాత్రను కొనసాగించగా తిరుమజిశైఆళ్వార్   మాత్రము తమ అవతారస్థలమైన తిరుమజిశైకి విళ్ళిపోయిరి.

తిరుమజిశైఆళ్వారు తిరుమణి గురించి  వెతకగా అది వారికి లభించలేదు. దానితో వారు విచారపడగా తిరువేంగడముడైయాన్(శ్రీనివాసుడు) ఆళ్వారునకు స్వప్నములో సాక్షాత్కరించి తిరుమణి లభించే ప్రదేశమును చూపించిరి. ఆళ్వార్   సంతోషముతో తిరుమణిని  స్వీకరించి ద్వాదశ ఊర్ద్వపుండ్రములను (శాస్త్రములో చెప్పిన విధముగా శరీరములోని12 ప్రదేశములలో ధరించు 12 నామములు) ధరించి తమ భగవదనుభవమును కొనసాగించిరి. తరువాత పొయ్ ఘైఆళ్వారుల అవతార స్థలమైన  తిరువె:క్కా దర్శించే కోరికతో కాంచీపురంకు చేరిరి. ఇది గొప్ప పుణ్యక్షేత్రముగా  కీర్తి క్కెక్కినది. అక్కడ శ్రీదేవి మరియు భూదేవి సపర్యలు చేయుచుండగా  ఆదిశేషునిపై అందముగా శయనించిన శ్రీమన్నారాయణుని  700 సంవత్సరములు తిరుమజిశైఆళ్వారులు  ఆరాధించిరి. పొయ్ ఘైఆళ్వార్ అవతరించిన పుష్కరిణి ఒడ్డున నివసిస్తు  పొయ్ ఘైఆళ్వారుల  ధ్యానముతో గడిపెను.

yathokthakari-swamy

                                              ఉభయదేవేరులతో యధోక్తకారి , తిరువెఃక్కా

 ఒక సమయములో కణికణ్ణన్, ఆళ్వార్  శ్రీ చరణములను ఆశ్రయించిరి. ఒక వృద్దస్త్రీ వచ్చి ప్రతిదినము ఆళ్వారునకు భక్తితో సేవలు చేయుచుండెను. ఆళ్వార్ ఆమె భక్తికి మరియు సపర్యలకు సంతోషించి  ఆమెతో ‘మీకు ఎమైనా కోరికలు  ఉన్నవా ?’ అని అడిగిరి. ఆమె దానికి తన యవ్వనమును తిరిగి పొందవలెనని  కోరినది. ఆళ్వార్ అలానే అని దీవించగా ఆమె  అందమైన యువతిగా మారినది. స్థానిక రాజైన పల్లవరాయుడు  ఆమె యందు ఆకర్షితుడై వివాహము చేసుకోమని కోరినాడు. ఆమె తన సమ్మతమును తెలుపగా ఇద్దరు వివాహమును చేసుకొని ఆనందముగా జీవించసాగిరి. ఒకరోజు, పల్లవరాయుడు తన వయసు రోజురోజుకు పెరుగుచుండగ తన భార్య యుక్తవయసులోనే (ఆళ్వార్ ఆశీస్సుతో)  ఉండడము గమనించి ఆమెను ఏవిధముగా తరగని యౌవ్వనమును పొందినదో అడిగెను. ఆమె ఆళ్వార్ ఆశీస్సుల గురించి చెప్పి ఆ రాజును ఆళ్వార్ నుండి అదే విధముగా యౌవ్వనమును పొందుటకు అనుగ్రహము లభించేలా కణికణ్ణన్ (సామాగ్రికై రాజు వద్దకు వస్తాడు)ను అభ్యర్థించవలసినదిగా చెప్పినది. ఆ రాజు కణికణ్ణన్ ను పిలిపించి ఆళ్వారును ఆరాధించుటకు తన రాజభవనమునకు తీసుకురావలసినదిగా అభ్యర్థించిరి. కణికణ్ణన్,  ఆళ్వార్ శ్రీమన్నారాయణుని కోవెలను వదలి ఇతర ప్రదేశములకు  రారని చెప్పెను. ఆ రాజు కణికణ్ణన్ తో తన గొప్పదనం గురించి చెప్పవలసినదిగా అభ్యర్థించిరి. దానికి కణికణ్ణన్ మా గురువుగారు  శిష్టాచారము ప్రకారము  శ్రీమన్నారాయణుడిని మరియు ఆయన భక్తులను తప్ప ఇతరులను ఎవ్వరిని కీర్తించననిరి. తనను కీర్తించని కారణముగా రాజు కోపముతో కణికణ్ణన్ ని  రాజ్యమును విడిచి వెళ్ళవలసినదిగా ఆఙ్ఞాపించెను. కణికణ్ణన్  రాజభవనమును వదిలి ఆళ్వార్ వద్దకి చేరి జరిగిన సంఘటనను  వివరించి తనకు సెలవును ప్రసాదించవలసినదిగా వేడెను. ఆళ్వార్ ఇలా అనెను “ ఒకవేళ మీరు వెళ్ళిపోతే మేము కూడ వెళ్ళిపోతాము, మేము వెళితే భగవానుడు కూడా వెళ్ళును , భగవానుడు వెళితే ఇక్కడి దేవతలందరు వెళ్ళిపోవుదురు”.ఆళ్వార్  కణికణ్ణన్ తో “నేను కోవెలకు వెళ్ళి భగవానుడు లేపి నాతో పాటు తీసుకువచ్చెదను చెప్పి” కోవెలకు వెళ్ళిరి. ఆళ్వార్ తిరువె:క్కా ఎమ్పెరుమాన్ ఎదురుగా ఇలా ప్రార్థించిరి:

కణికణ్ణన్  పోగిన్ఱాన్ కామరుపూ కచ్చి మణివణ్ణా నీ కిడక్క వేన్డా తున్ణివుడైయ చెణ్ణాప్పులవనుమ్ పోగిన్ఱేన్ నీయుమ్ ఉన్ఱన్ పైణ్ణాగప్పాయ్ చురుట్టిక్కొళ్

ఆహా!  అందమైన రూపును ధరించిన తిరువెఃక్కా నివాసకుడా! కణికణ్ణన్ వెళ్ళుచున్నాడు అతని వెంట నేను కూడా వెళ్ళుచున్నాను నీవు నీ ఆదిశేషుణ్ణి  చుట్టుకొని మాతో పాటు రావలెను”.

భగవానుడు, ఆళ్వార్ మాటను అంగీకరించి లేచి తన ఆదిశేషువును చుట్టుకొని వారిని  అనుసరించిరి. అందువలన వారికి యథోక్తకారి (యధా – ఎలానైతే, ఉక్త – చెప్పిన ప్రకారము,కారి – చేయువాడు) అను పేరు వచ్చినది. దేవతలందరు భగవానున్ని అనుసరించెను కావున మంగళకర ప్రధానులైన వారు లేకపోవుటచే కాంచీపురమును  తమము  ఆవరించినది. సూర్యుడు కూడా ఉదయించలేక పోయెను. ఆ రాజు అతని మంత్రులు పరిస్థితిని గ్రహించి వెంటనే  పరిగెత్తి కణికణ్ణన్ శ్రీచరణములయందు క్షమాప్రార్థన చేసిరి. అప్పుడు కణికణ్ణన్ తమ ఆచార్యులైన ఆళ్వారును వేడి తిరిగి  వెళదామని  అభ్యర్థించిరి. ఆళ్వార్ దానికి అంగీకరించి  భగవానునున్ని కూడ యదాస్థానమునకు వేంచేయవలసినదిగా ప్రార్థించిరి:

కణికణ్ణన్  పోక్కొజిణ్తాన్ కామరుపూ కచ్చి మణివణ్ణా నీ కిడక్క వేండుమ్ తుని వుడైయ చెణ్ణాప్పులవనుమ్ పోక్కొజిణ్తేన్ నీయుమ్ ఉన్ఱన్ పైణ్ణాగప్పాయ్ పడుత్తుక్కొళ్

“ఆహా!  అందమైన రూపును ధరించిన తిరువెఃక్కా నివాసకుడా! కణికణ్ణన్ తిరిగి వస్తున్నాడు నేను కూడా తిరిగివస్తున్నాను నీవు నీ ఆదిశేషుణ్ణి విప్పి  తిరిగి యథా విధముగా  శయనించుము”.

అదీ భగవానుని సౌలభ్యము- నీర్మై (నిరాడంబరత్వం) అందువలన  ఆళ్వార్ భగవానుని ఈ గుణమునకు ఈడు పడి   వెఃక్కానై క్కిడందతెన్న నీర్మైయే అని పాడిరి– నా అభ్యర్థనని మన్నించి ఈ విధముగా భగవానునుడు తిరువెఃక్కా లో శయనించి నాడో అని.

ఆళ్వార్ ఆర్తితో  తిరుక్కుడందై (కుంభకోణము) వేంచేసిఉన్న  ఆరావముదాళ్వార్/శార్ఙపాణి కి  మంగళాశాసనమును చేయుటకు వెళ్ళిరి. తిరుక్కుడందై మాహాత్మ్యము ఇలా చెప్పబడినది,  “ఎవరైతే క్షణ కాలమైనను కుంభకోణములో నివాసము చేయుదురో వారికి  శ్రీవైకుంఠ ప్రాప్తికలుగును  ఇక సంసారములోని సంపదను గురించి ఏమి చెప్పవలెను” – అదీ ఈ దివ్యదేశ వైభవము .

ఒకసారి ఆళ్వార్  తన ప్రయాణంలో  పెరుమ్పులియూర్ అనే గ్రామములో  ఒక గృహ వరండాలో విశ్రమించిరి. అక్కడ కొందరు బ్రాహ్మణులు వేదాధ్యయనమును చేయుచున్నారు. ఆ సమయములో వారు ఆళ్వారు యొక్క జీర్ణమైన ఆకారమును(శూద్రుడని) చూసి తప్పుగా అర్థము చేసుకొని వేదాధ్యయనమును నిలిపివేసిరి. దీనిని ఆళ్వార్  వినమ్రతతో అర్థము చేసుకొని ఆ ప్రదేశమును విడిచి వెళ్ళిరి. ఆ బ్రాహ్మణులు ఆ వేధాద్యయనము నిలిపిన పంక్తి  గుర్తుకురాక ఇబ్బంది పడసాగిరి. ఆళ్వార్ వెంటనే ఒక వరి ధాన్యపు గింజను తీసుకొని తన గోటితో విరిచెను. ఆళ్వార్ యొక్క ఆ చర్య వారు మరచిన పంక్తిని సూచించెను. “క్రిష్ణాణామ్ వ్రిహిణామ్ నఖనిర్భిన్నమ్”  ఇది యజు: ఖండము లోనిది. అప్పుడు బ్రాహ్మణులు వెంటనే వారి  వైభవమును  గుర్తించి , ప్రణామములను సమర్పించి తమ అమర్యాదను క్షమించమని వేడుకొనిరి.

ఆళ్వార్ తమ తిరువారాధన సామగ్రి గురించి సంచరిస్తుండగా ఆ గ్రామకోవెలలోని భగవానుడు మారిమారి ఆళ్వార్ ఉన్నదిక్కుకు తిరుగుచుండెను. అర్చకులు ఆ ఆశ్చర్యకరమైన సంఘటనను కొందరి బ్రాహ్మణులకు చూపి  ఆ గ్రామములో యాగము చేయుచున్న పెరుమ్పులియూర్ అడిగళ్ వద్దకు వెళ్ళి ఆ సంఘటనను మరియు ఆళ్వార్  వైభవమును వారికి చెప్పిరి. పెరుమ్పులియూర్ అడిగళ్ యాగశాలను వదిలి నేరుగా ఆళ్వార్ వద్దకి వెళ్ళి వారి అప్రాకృత (ఆధ్యాతికతను దైవత్వమును) తిరుమేనిని (శరీరము) చూసి ప్రణామమును సమర్పించి ఆళ్వార్ ను తన యాగశాలకు వేంచేయవలసినదిగా ప్రార్థించిరి. ఆళ్వార్ యాగశాలను సందర్శించినపుడు  అడిగళ్  యాగభాగములోని అగ్రపూజని (మొదటి మర్యాద) ఆళ్వార్ కి సమర్పించెను. ధర్మరాజు  రాజసూయయాగములో  కృష్ణుడికి అగ్రపూజని ఇచ్చినప్పుడు శిశుపాలుడు అతని స్నేహితులు అడ్డుతగిలినట్లుగా ఇక్కడ కూడ కొందరు అడ్డుతగిలారు. అడిగళ్ విచారముతో ఆళ్వారునకు వారి మాటలను వినలేనని చెప్పిరి. ఆళ్వార్ తన వైభవమును తెలుపుటకు నిశ్చయించుకొని అంతర్యామి భగవానునున్ని తన  హృదయములో అందరికీ దర్శనమిచ్చేలా  ప్రత్యక్షమవ్వమని  పాశురంచే ప్రార్థించిరి. భగవానుడు తన దయాగుణముచే దివ్య మహిషీలు, ఆదిశేషుడు, గరుడాళ్వార్ మొదలగు వారితో ఆళ్వార్ హృదయములో ప్రత్యక్షమయ్యెను. ఇంతకు మునుపు ఎవరైతే   అడ్డుతగిలిరో వారు  ఆళ్వార్  వైభవమును గ్రహించి వారి శ్రీచరణముల యందు సాష్టాంగపడి తమ తప్పులను మన్నించమని వేడుకొనిరి.  ఆళ్వార్ వైభవమును  ప్రచారం గావించుటకు వారు ఆళ్వార్ కు  బ్రహ్మరథమును(ఆళ్వారును పల్లకిలో తీసుకువెళ్ళడము) పట్టెను.  ఆళ్వార్ అప్పుడు వారికి శాస్త్రసారమును విశేష వివరణలతో అనుగ్రహించిరి.

ఒకసారి ఆళ్వార్   ఆరావముదన్ ఎమ్పెరుమాన్ సేవించుటకై తిరుక్కుడందైకు  వెళ్ళిరి. తిరుక్కుడందై చేరిన తరువాత వారు తమ గ్రంథములను (తాళ పత్రములను) కావేరినదిలో విసిరివేసిరి. భగవానున్ని  కృపవలన నాన్ముగన్ తిరువందాది మరియు తిరుచ్చన్త విరుత్తమ్  తాళపత్రములు తరంగాలలో తేలుచూ ఆళ్వార్ వద్దకు తిరిగి చేరినవి. ఆళ్వార్  వాటిని తీసుకొని ఆరావముదన్ సన్నిధికి  వెళ్ళి భగవానుని   దివ్యతిరువడి (పాదము) నుండి తిరుముడి (శిరస్సు) వరకు సేవించి కీర్తించిరి.  అత్యంత ప్ర్రీతిచే  ఆళ్వార్ ఎమ్పెరుమాన్ ను ఈ విధముగా ఆదేశించిరి “కావిరిక్కారైక కుడందయుళ్ కిడంద వారెళుందిరుందు పేచ్చు”. దీనర్థము-     “ఆహా! కావేరితీరాన తిరుక్కుడందై లో శయనించి ఉన్న వాడా లేచి నిలబడి నాతో మాట్లాడు”. ఆళ్వార్ సూక్తిని ఆలకించిన భగవానుడు లేచుటకు ప్రయత్నించగా, ఆళ్వార్ భగవానుని చర్యను చూసి  వారికి మంగళాశాసనమును  చేసిరి “వాజి కేశనే” అర్థము “ఓ అందమైన కేశములను కలిగిన వాడా! నిత్య మంగళము”. ఆ దివ్య స్వరూపమును ధ్యానిస్తూ ఆళ్వార్ మరొక  2300 సంవత్సరములు తిరుక్కుడందైలో పాలను మాత్రమే స్వీకరించి  నివసించిరి. ఆ విధముగా 4700 సంవత్సరములు భూలోకములో వేంచేసిఉండి  ప్రతిఒక్కరినీ ఈ సంసారసాగరమును దాటించుటకు సకలశాస్త్రముల సారమును తన ప్రబంధముల ద్వారా  అనుగ్రహించిరి.

                                  aarAvamuthan

కోమలవల్లి తాయార్ సమేత ఆరావముదన్, తిరుక్కుడందై

ఆళ్వార్ తిరుమజిశై పిరాన్ గా వ్యవహరించబడెను ( పిరాన్ అనగా ఎవరైతే  ఈ ప్రపంచమునకు మహోపకారము చేయుదురో వారు.  సాధారణముగా ఈ వాచక శబ్దమును  భగవానుని  కీర్తిని తెలుపుటకు వాడుదురు ) – ఆళ్వార్ భగవానుని  పరతత్త్వమును తెలుపుటకు మహోపకారమును చేసిరి – ఆనాటి నుండి తిరుమజిశైఆళ్వార్ తిరుమజిశైపిరాన్ గా  తిరుక్కుడందై ఆరావముద ఎమ్పెరుమాన్ ఆరావముదాళ్వాన్  గా ప్రసిద్దికెక్కిరి ( ఆళ్వార్ అనగా ఎవరైతే ఎమ్పెరుమాన్ కల్యాణగుణములలో, దివ్య సౌందర్యములో  మునిగితేలుదురోవారు, ఈ వాచక శబ్దాన్ని భగవానుని  ప్రియభక్తులకు వాడుదురు) –  తిరుమజిశై ఆళ్వార్ భగవంతుని నామ ,రూప, గుణము మొదలగు కళ్యాణగుణములను కలిగి ఉండడముచే, ఆరావముదఎమ్పెరుమాన్ కూడా ఆరావముదాళ్వార్ గా ప్రసిద్దిగాంచిరి.

భగవానుని మరియు వారి దాసులతో మనకు అటువంటి సంభందమును  నిత్యము కలిగేలా అలాగే ఆళ్వార్ దివ్యకృప ప్రసరించేలా ఆళ్వార్ శ్రీచరణారవిందములయందు ప్రార్థిస్తాము.

తిరుమజిశై ఆళ్వార్  తనియన్:

శక్తి పంచమయ విగ్రహాత్మనే శుక్తికారజాత చిత్త హారిణే |

ముక్తిదాయక మురారి పాదయో:  భక్తిసార మునయే నమో నమ:||

అడియేన్: నల్లా శశిధర్   రామానుజదాస

Source

ముదలాళ్వార్లు

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

ముదలాళ్వార్లు

గత సంచికలో మనము పొన్నడిక్కాల్ జీయరుల వైభవమును అనుభవించాము ఇప్పుడు ఆళ్వారుల మరియు ఆచార్యుల  వైభవమును అనుభవిద్దాం. దీనిలో విశేషంగా ముదలాళ్వార్ల( పొయ్ ఘై ఆళ్వార్, భూదత్తాళ్వార్ మరియు  పేయాళ్వార్) వైభవమును  అనుభవిద్దాము.

పొయ్ ఘై ఆళ్వార్

తిరునక్షత్రము: ఆశ్వీజ మాసము(ఐప్పసి),శ్రవణాక్షత్రం (తిరువోణమ్)

అవతార స్థలము: కాంచీపురము

ఆచార్యులు: సేనముదలియార్(భగవంతుని సర్వ సైన్యాధికారి – విష్వక్సేనులు)

శ్రీ సూక్తులు: ముదల్ తిరువందాది

పొయ్ ఘై ఆళ్వార్  తిరువె:కాలోని యథోక్తకారి కోవెల సమీప కొలనులో అవతరించిరి. వీరికి కాసారయోగి మరియు సరోమునీంద్రులు అనే నామధేయములు కలవు.

వీరి తనియన్

కాంచ్యాం సరసిహేమాబ్జే జాతం కాసార యోగినమ్|
కలయే యః శ్రియఃపతి రవిమ్ దీపం అకల్పయత్||

భూదత్తాళ్వార్

తిరునక్షత్రము: ఆశ్వీజమాసము (ఐప్పసి),ధనిష్ఠా నక్షత్రం(అవిట్టమ్)

అవతార స్తలము: తిరుక్కడల్ మల్లై (మహాబలిపురం)

ఆచార్యులు: సేనముదలియార్ (భగవంతుని సర్వ సైన్యాధికారి – విష్వక్సేనులు)

శ్రీ సూక్తులు: ఇరన్డామ్ తిరువందాది

భూదత్తాళ్వార్ తిరుక్కడల్ మల్లై దివ్యదేశములోని స్థలశయనపెరుమాళ్ కోవెలలోని కొలనులో అవతరించిరి. వీరికి  భూదాహ్వయలు, మల్లాపురవరాధీశులు అనే నామధేయములు కలవు.

వీరి తనియన్:

మల్లాపుర వరాధీశం మాధవీ కుసుమోద్భవం|
భూతం నమామి యో విష్ణోర్ జ్ఞానదీపం అకల్పయత్||

పేయాళ్వార్

తిరునక్షత్రమ: ఆశ్వీజమాసము(ఐప్పసి),శతభిషా నక్షత్రం  (సదయమ్)

అవతార స్థలము: తిరుమయిలై (మయిలాపురం)

ఆచార్యులు: సేనముదలియార్ (భగవంతుని సర్వ సైన్యాధికారి – విష్వక్సేనులు)

శ్రీ సూక్తులు: మూన్ఱామ్ తిరువందాది

పేయాళ్వార్ తిరుమయిలైలోని కేశవ పెరుమాళ్ కోయిల్  వద్ద అవతరించిరి. వీరికి మహదాహ్వయులు, మయిలాపురాధీశులు అనే నామములు కలవు.

వీరి తనియన్
దృష్ట్వా హృష్టం తదా విష్ణుం రమయా మయిలాధిపం|
కూపే రక్తోత్పలే జాతం మహదాహ్వయం ఆశ్రయే||

ముదలాళ్వార్లుల /వైభవము:

ఈ ముగ్గురు ఆళ్వారులును సేర్తిగా(కలసి) కీర్తించుటకు గల కారణములు:

 • వీరు ముగ్గురు రోజు విడచి రోజు అవతరించిరి – ద్వాపరయుగము చివర మరియు కలియుగము ప్రారంభమున జన్మించిరి (యుగ సంధి – మార్పు కాలము– వివరణ గురించి క్రింద చూద్దాము).
 • ముగ్గురు అయోనిజులు – తల్లి గర్భము నుండి కాకుండా భగవానుని అనుగ్రహముచే ముగ్గురు పుష్పముల యందు అవతరించిరి.
 • పుట్టినప్పటినుండి వీరికి భగవానునితో సంబంధము ఉండెను – భగవానుని పరిపూర్ణమైన అనుగ్రహముచేత భగవద్గుణానుభవములో నిరంతరాయముగా జీవనమును గడిపిరి .
 • వీరు  ఒక సంఘటన ద్వార ఒకరినొకరు కలుసుకొనిరి.  అప్పటినుండి కలిసి జీవించి ఎన్నో దివ్యదేశములను/క్షేత్రములను దర్శించిరి. వీరిని ఈ విధముగా సంభోదించెదరు “ఓడిత్తిరియుమ్ యోగిగళ్ – ఎల్లప్పుడూ యాత్రలు చేసే యోగులు.

ముగ్గురు ఆళ్వారులు వేరు వేరు ప్రదేశములలో జన్మించి భగవానున్ని పూర్తిగా అనుభవించిరి. భగవద్దాసులను తమ సర్వస్వముగా భావించెదరు(గీతలో – జ్ఞానిత్వ ఆత్మ ఏవ మే మతమ్)కావున వారి ముగ్గురిని ఒకేచోట చూడదలచిన భగవానుడు  తిరుక్కోవలూర్ అనే దివ్యదేశములో
ఒక రాత్రి ముగ్గురు ఒకేచోట కలుసుకునేలా ఒక దైవలీలను కల్పించిరి.

చాలా పెద్ద వర్షము కురుయిచుండగా ఆ ముగ్గురు ఒకరి తరువాత ఒకరు ఒక  ఆచ్చాధన వసార క్రింద చేరుకున్నారు. అప్పుడు ఆ వసారలో  ముగ్గురు నిలబడుటకు మాత్రమే సరిపోవు స్థలము ఉండెను. పూర్తిగా భగవత్ భావముతో ఉండడముచేత ఒకరి గురించి మరియొకరు తెలుసుకొన్నారు. అప్పుడు వారు తమ దివ్యానుభవములను చెప్పుకొనుచుండగా భగవానుడు తిరుమామగళ్(లక్ష్మిదేవి) తో కూడి చీకటిగా ఉన్న  ఆ వసారలోకి ప్రవేశించిరి. అప్పుడు ఆ ముగ్గురు తమ మధ్యలోకి ఎవరు వచ్చారో  తెలుసుకొనుటకు ఇలా చేసిరి.

 • పొయ్ ఘైఆళ్వార్ ప్రపంచమనే దీపములో సముద్రమును తైలముగా చేసి సూర్యుడిని  వెలుగుగా చేసి ఆ  ప్రదేశమును కాంతిమయంగా చేసిరి.
 • భూదత్తాళ్వార్ తన యొక్క ప్రేమను దీపముగా, అనుబంధమును తైలముగా,  ఙ్ఞానమును వెలుగుగా చేసి ఆ ప్రదేశమును కాంతిమయంగా చేసిరి.
 • పేయాళ్వార్ మిగితా ఆ ఇద్దరి  ఆళ్వారుల సహాయముతో   పిరాట్టితో కూడిన భగవానుని, తిరువాళి(చక్రం)   మరియు తిరుశంఖంను దర్శించి ఆ సేర్తికి మంగళాశాసనమును చేసిరి.

ఆ విధముగా వారు ముగ్గురూ తిరుక్కోవలూర్ స్వామిని మరియు ఇతర అర్చావతార భగవానుని   వైభవమును ఈ లీలావిభూతిలో అనుభవించిరి.

నమ్పిళ్ళై  ఈడు వ్యాఖ్యానములో  ముదలాళ్వార్ల  వైభవమును  చాలా అందముగా వెలికి తీసెను. వాటిలో కొన్నింటిని  ఇక్కడ  అనుభవిద్దాము:

 • పాలేయ్ తమిళర్ (1.5.11) – నమ్పిళ్ళై ఇక్కడ  ఆళవన్దారుల నిర్వాహమును (ముగింపు/వివరణ)  ఉట్టంకించిరి.  నమ్మాళ్వార్  ఇలా వివరించెను, భగవానుని వైభవమును ముదలాళ్వారులే   మొట్ట మొదట మధురమైన తమిళ భాషలో కీర్తించిరనిరి.
 • ఇన్కవి పాడుమ్ పరమకవిగళ్ (7.9.6) – ఇక్కడ నమ్పిళ్ళై ముదలాళ్వార్లను “చెన్దమిళ్ పాడువార్” అనికూడా వ్యవహరించుదురని వివరించిరి. అలానే ఆళ్వారులు తమిళములో నిష్ణాతులని కూడా  వివరించిరి. పొయ్ ఘై ఆళ్వార్, పేయాళ్వార్లు మరియు  భూదత్తాళ్వార్లని ఎమ్పెరుమాన్ ని కీర్తించమని అడుగగా – ఎలాగైతే ఆడ ఏనుగు తేనెను కోరినవెంటనే మగఏనుగు తెచ్చునో అలా వారు వెంటనే భగవానుని కీర్తిని పాడిరి (ఈ ఏనుగుల సంఘటనను భూదత్తాళ్వార్ తన ఇరణ్డామ్ తిరువన్తాది – 75వ పాశురము “పెరుగు మదవేళమ్”లో వివరించిరి).
 • పలరడియార్ మున్బరుళియ (7.10.5) పాశురమునందు నమ్పిళ్ళై  అందముగా నమ్మాళ్వారుల  తిరువుళ్ళమును వెలికి తీసిరి.  ఈ పాశురములో నమ్మాళ్వార్ ఈ విధముగా చెప్పుచున్నారు-  భగవానుడు మహాఋషులైన శ్రీవేదవ్యాసులు, శ్రీవాల్మీకి, శ్రీపరాశరులు   సంస్కృతమున మరియు ముదలాళ్వార్లు  తమిళములో మహానిష్ణాతులైనప్పటికి వారికి తిరువాయ్ మొళిని పాడుటకు అనుగ్రహించకుండా తమకు మాత్రమే ఆ కైంకర్యమును అనుగ్రహించారని ఆనందపడిపోయారు.
 • చెన్చొర్కవికాళ్ (10.7.1) అనే పాశురములో – నమ్పిళ్ళై ముదలాళ్వార్లని గూర్చి“ఇన్కవి పాడుమ్ పరమ కవిగళ్”, “చెన్దమిళ్ పాడువార్” మొదలగు పాశురముల   ప్రమాణముననుసరించి   వారిని అనన్యప్రయోజనులు (ఎటువంటి ప్రయోజనము ఆశించకుండా భగవానుని కీర్తించేవారు)అని గుర్తించిరి.

మామునిగళ్ ‘ముదలాళ్వార్లు’  అనే సంభోధన ఎలా వచ్చినదో తన ఉపదేశరత్నమాలైలో 7వ  పాశురమున ఇలా  వివరించిరి.

మఱ్ఱుళ్ళ ఆళ్వార్గళుక్కు మున్నే వన్దుదిత్తు

నల్ తమిళాల్ నూల్ శెయ్దు నాట్టై ఉయ్ త్త –  పెఱ్ఱిమైయోర్

ఎన్ఱు ముదలాళ్వార్గళ్ ఎన్నుమ్ పేరివర్ క్కు

నిన్ఱతులగత్తే నిగలళ్ 0దు|

సాధారణ అనువాదము:

ఈ ముగ్గురు ఆళ్వారులు మిగిలిన ఏడుగురు ఆళ్వారుల కన్నా ముందే  దివ్యమైన తమిళ పాశురములతో ప్రపంచమును ఆశీర్వదించిరి. ఈ కారణముచే వీరు ముదలాళ్వార్లుగా విఖ్యాతిగాంచిరి.

పిళ్ళైలోకమ్ జీయర్ తన వ్యాఖ్యానములో కొన్నిమధురమైన విషయాలు:

 • ప్రణవము ఎల్లప్పుడూ ఆరంభమును సూచించడం వల్ల ముదలాళ్వార్లలను ప్రణవముగా భావించిరి .
 • ముదలాళ్వార్లు ద్వాపర-కలియుగసంధిలో అవతరించిరని మరియు తిరుమళిశై ఆళ్వార్ కూడా ఇదే సమయములో అవతరించిరని, కలియుగం ఆరంభమైన తరువాత మిగలిన ఆళ్వారులు ఒకరి తరువాత మరొకరు అవతరించిరని చెప్పిరి.
 • వీరు దివ్య ప్రబంధమునకు ద్రావిడభాషలో ఆరంభపునాదిని వేసిరి.

మామునిగళ్ ఐప్పసి – తిరువోణమ్(శ్రవణం), అవిట్టమ్(ధనిష్ట) మరియు శదయమ్(శతభిషం) ఈ మూడు నక్షత్రాలకు  ప్రాధాన్యత  ముదలాళ్వార్లు  అవతరించిన తరువాతనే కలిగినదని చెప్పిరి.

పెరియవాచ్చాన్ పిళ్ళై తిరునెడున్తాన్డగమ్ అవతారికా వ్యాఖ్యానములో ముదలాళ్వార్లకు భగవానుడు తమ పరత్వమును చూపిరి అని చెప్పెను. అందువలన వారు మాటిమాటికి త్రివిక్రమావతారమును కీర్తించిరి. వీరికి సహజముగానే అర్చావతారముతో గొప్ప అనుబంధము కలిగి ఉండడం చేత అర్చావతార కీర్తిని పాడిరి.  వీరి  అర్చావతార అనుభవమును ఇదివరకే ఇక్కడ వివరించ బడినది .http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-azhwars-1.html.

యుగ సంధి:

యతీంద్రమతదీపిక  అను గ్రంథము  సంప్రదాయములోని ఎన్నో సాంకేతికపరమైన అంశములను వివరించినది. దీనిని మన సిద్ధాంతమునుకు పరమ ప్రామాణికమైన గ్రంథముగా పరిగణిస్తారు.

ఇందులో కాలతత్త్వము, వివిధ యుగములు మరియు వాటి సంధికాలముల గురించి వివరముగా చెప్పబడినది.

 • దేవతల 1 రోజు (స్వర్గములో) మానవుల (భూమి) 1 సంవత్సరంమునకు సమానము .
 • 1 చతుర్యుగము 12000 దేవసంవత్సరములతో కూడినది – (కృత – 4000, త్రేతా – 3000, ద్వాపర – 2000, కలి – 1000).
 • బ్రహ్మకు ఒక రోజు 1000 చతుర్యుగములకు సమానము. వారి రాత్రి సమయము కూడా ఉదయమునకు సమానమే కాని అప్పుడు సృష్టి ఉండదు. ఇలా 360 రోజులు  ఒక బ్రహ్మసంవత్సరము.  బ్రహ్మదేవుడు 100 బ్రహ్మసంవత్సరము జీవించును.
 • ఒక్కొక్క యుగములో సంధికాలము దీర్ఘముగా ఉండును. ఇక్కడ ప్రతియుగములోని సంధికాలమును చూద్దాము :
 1. కృత,త్రేతా యుగములకు సంధికాలము 700 దేవసంవత్సరములు.
 2. త్రేతా, ద్వాపర యుగములకు సంధికాలము 500 దేవసంవత్సరములు.
 3. ద్వాపర, కలియుగములకు సంధికాలము 300 దేవసంవత్సరములు.
 4. కలి తరువాత మళ్ళీ  వచ్చు కృతయుగమునకు సంధికాలం 500 దేవసంవత్సరములు.
 • అదేవిధముగా బ్రహ్మ ఒకరోజులో 14 మనువులు, 14 ఇంద్రులు మరియు 14 సప్త ఋషులు ఆయా పదవులయందు పునరావృతం అవుతారు (వారి కర్మానుసారం ఇలా ఆయా జీవాత్మలు ఈ పదవిలను పొందుతారు)

అడియేన్

రఘు వంశీ రామానుజదాస

source:

వడక్కు తిరువీధి పిళ్ళై

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలొ మనం నంపిళ్ళైల గురించి తెలుసుకున్నాం , ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

వడక్కు తిరువీధి పిళ్ళై- కాంచీపురము

తిరునక్షత్రము: స్వాతి-ఆషాడమాసము

అవతార స్థలము: శ్రీ రంగము

ఆచార్యులు: నమ్పిళ్ళై

శిశ్యులు:  పిళ్ళై లోకాచార్యర్, అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, మొద,,

పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగమ్

శ్రీ సూక్తులు: ఈడు 36000 పడి

శ్రీ క్రిష్ణ పాదరులుగా జన్మించిరి,వడక్కు తిరువీధి పిళ్ళైగా ప్రసిద్దికెక్కిరి.నమ్పిళ్ళై ముఖ్య శిశ్యులలో ఒకరు.

వడక్కు తిరువీధి పిళ్ళై గృహస్తాశ్రమములో ఉన్నప్పడికినీ పిల్లలకు జన్మనిచ్చుటకు ఇష్టంలేక పూర్తిగా ఆచార్య నిష్ఠయందు ఉండెను .వారి అమ్మగారు అది చూసి కలత చెంది నమ్పిళ్ళై వద్దకు వెళ్ళి వడక్కు తిరువీధి పిళ్ళైల స్వభావమును గూర్చి చెప్పెను.అదివిని, నమ్పిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళై మరియు అతని భార్యని రమ్మని, అతడి భార్యని తన  కృపచే దీవించి వడక్కు తిరువీధి పిళ్ళైలను పిల్లలకు జన్మనిచ్చుటకు ప్రయత్నము చేయవలెనని ఆఙ్ఞాపించిరి. ఆచార్యుల ఆఙ్ఞను అంగీకరించి వడక్కు తిరువీది పిళ్ళై అలానే చేసిరి,తొందరగానే వడక్కు తిరువీధి పిళ్ళైల భార్య ఒక శిశువుకు జన్మనిచ్చెను. వడక్కు తిరువీధి పిళ్ళై ఆ శిశువుకు పిళ్ళై లోకాచార్యన్ అనే నామమును పెట్టిరి,నమ్పిళ్ళై (లోకాచార్యన్) కరుణ వలన జన్మించాడు కావున. అదివిని, నమ్పిళ్ళై ఆ శిశువుకు అజగియ మణవాళన్ అనే పేరు పెడుదామనుకొన్నామనిరి. నమ్పెరుమాళ్ కుడా విని వడక్కు తిరువీది పిళ్ళైలకు మరియొక శిశువు జన్మించేలా దీవించిరి,వారికి అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ అనే పేరును పెట్టిరి,వీరు అజగియ మణవాళన్ (నమ్పెరుమాళ్) కృపతో జన్మించిన కారణముగా. ఆ విదముగా వడక్కు తిరువీది పిళ్ళై రెండు రత్నములను మన సంప్రదాయమునకు ఇచ్చిరి.వీరిని పెరియాళ్వార్తో పోల్చుదురు~:

 • ఆళ్వార్ మరియు వడక్కు తిరువీధి పిళ్ళై ఇద్దరూ ఆషాడమాసము స్వాతిన జన్మించిరి .
 • ఆళ్వార్ తిరుపల్లాణ్డు మరియు పెరియాళ్వార్ తిరుమొజి ఎమ్పెరుమాన్ కృపతో వ్రాసిరి. వడక్కు తిరువీది పిళ్ళై ఈడు 36000 పడి నమ్పిళ్ళై కృపతో వ్రాసెను.
 • ఆళ్వార్ ఆణ్డాళ్ ను మన సంప్రదాయమునకు ఇచ్చిరి మరియు వారు క్రిష్ణానుభవముతో ఆమెను పెంచిరి. వడక్కు తిరువీధి పిళ్ళై పిళ్ళై లోకాచార్యర్ మరియు అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లను భగవత్ అనుభవము ద్వార పెంచి ఇచ్చిరి.

వడక్కు తిరువీధి పిళ్ళై తిరువాయ్ మొజి ప్రవచనములను నమ్పిళ్ళై వద్ద వింటూ, పగటి వేళలో ఆచార్యుల వద్ద గడిపి,రాత్రి వేళలో మఱ్ఱిఆకులపై వారు చెప్పినది వ్రాసేవారు.ఆ విధముగా వారు ఈడు 36000 పడి వ్యాఖ్యానమును నమ్పిళ్ళైల ప్రవచనములు గ్రహించి నమ్పిళ్ళైలకు తెలియకుండా వ్రాసిరి. ఒకసారి వడక్కు తిరువీధి పిళ్ళై నమ్పిళ్ళైను తదియారాధనము కొరకై వారియొక్క తిరుమాళిగైకు ఆహ్వానించగా నమ్పిళ్ళై అంగీకరించి వారి యొక్క తిరుమాళిగైకు వచ్చిరి. నమ్పిళ్ళై  కోయిలాళ్వార్నందు తిరువారాధనమును చేయుటకు వెళ్ళగా, కోయిలాళ్వార్లో మఱ్ఱి ఆకులపై వ్యాఖ్యానమును చూసిరి. దానియందు ఆసక్తి కలిగి,వాటిలో కొన్ని చదివి వడక్కు తిరువీధి పిళ్ళైని ఏమిటివి అని అడిగిరి. వడక్కు తిరువీధి పిళ్ళై నమ్పిళ్ళైల ప్రవచనములను వ్రాయుచుంటిమని వివరణ ఇచ్చిరి. నమ్పిళ్ళై వడక్కు తిరువీది పిళ్ళైని తిరువారాధనము చేయమని ఆదేశించి,వారు  మిగిలినవి చదవడము ప్రారంభించిరి. వారు పెరియవాచ్చాన్ పిళ్ళై మరియు ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళను వ్రాయమని అప్పటికే చెప్పిరి, వారు పెరియవాచ్చాన్ పిళ్ళై మరియు ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళతో ఆ వ్యాఖ్యానమును చదివించిరి, వారు అది చాల వైభవముగా ఉందని ప్రశంసించారు నమ్పిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళైలను ఈ విధముగా తమ అనుమతి లేకుండా ఎందుకు వ్రాసారు, పెరియవాచాన్ పిళ్ళైల వ్యాఖ్యానమునకు పోటిగా వ్రాస్తున్నారా అని అడిగిరి . వడక్కు తిరువీది పిళ్ళై తనవలన జరిగిన దానికి అపరాధనమునకు చింతించి, నమ్పిళ్ళై పాద పద్మములందు సాష్టాంగ నమస్కారం చేసి భవిష్యత్తు కాలములో పరిశీలించుటకు వీలుగా వ్రాసెనని వివరణ ఇచ్చిరి. వారి వివరణకు సంతృప్తి చెంది, నమ్పిళ్ళై ఆ వ్యాఖ్యానమును స్తుతించి ఈ విధముగా అనిరి వడక్కు తిరువీధి పిళ్ళై అవతార విశేషముచే ఇలా నా ప్రవచనములనుండి ఏమియును తప్పకుండా వ్రాసిరి. నమ్పిళ్ళై  ఈ వ్యాఖ్యానమును ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళకు ఇవ్వమనిరి ( నంజీయరుల పూర్వాశ్రమము పేరును పెట్టుకొనిరి – మాదవర్) దానిని తన తదుపరి తరమునకు ఉపదేశించడమువలన,కడకు మణవాళ మామునిగళ్ళచే వెలువడబడుతుంది.ఎమ్పెరుమానుల కృపచే, నమ్పిళ్ళై భవిష్యత్తు కాలములో మామునిగళ్ అవతారమును ముందుగానే గుర్తించి ఆ విషయమును ఈయుణ్ణి మాదవ పెరుమాళ్ళకి చెప్పి,వారి తదుపరి తరముల ద్వారా, అది మామునిగళ్ళకి చేరి సరియగు సమయములో మొత్తము ప్రపంచమునకే తెలియునని చెప్పిరి.

నమ్పిళ్ళై పరమపదమునకు చేరిన తదుపరి వడక్కు తిరువీధి పిళ్ళై మన సంప్రదాయమునకు నాయకుడిగా ఉండెను.వారు అన్ని అర్థములను పిళ్ళై లోకాచార్యర్ మరియు అజగియ మణవాళ పెరుమాళ్ నాయనారులకు ఉపదేశించిరి. శ్రీవచన భూశణ దివ్య శాస్త్రములో పిళ్ళై లోకాచార్యులు వడక్కు తిరువీధి పిళ్ళైల ఆదేశములను కొన్ని చోట్ల ప్రస్తావించెను~:

సూత్రమ్ 77లో, ఈ విధముగా చెప్పబడెను అహంకారమును వదిలిన,ఆ ఆత్మను మాత్రమే అడియేన్ అని పిలువబడును.ఇది యతీన్ద్ర ప్రవణ ప్రభావములో వడక్కు తిరువీధి పిళ్ళై చే వివరించబడినది.

సూత్రమ్ 443లో,పిళ్ళై లోకాచార్యర్ వడక్కు తిరువీధి పిళ్ళై ఈ విధముగా వివరిస్తారని చెప్తారు,అనాదియైన కాలమునుండి స్వ స్వాతన్త్రియము నిండి ఉన్న జీవాత్మలు సంసారము నుండి బయటపడుటకు ఒకే ఒక్క దారి సదాచార్యున్ని ఆశ్రయించడమే.

తదుపరి కొంతకాలమునకు వడక్కు తిరువీధి పిళ్ళై తమ ఆచార్యులైన నమ్పిళ్ళైని తలుచుకొని తమ యొక్క చరమ తిరుమేని వదిలి పరమపదమునకు చేరిరి.

ఎమ్పెరుమానారులతో మరియు మన ఆచార్యులతో మనకూ అలాంటి అనుబంధము కలిగేలా మనము వడక్కు తిరువీధి పిళ్ళైల శ్రీ చరణములను ప్రార్థించుదాము.

వడక్కు తిరువీధి పిళ్ళైల తనియన్ :

శ్రీ క్రిష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా !
యత్ ప్రసాద ప్రభావేన సర్వ సిద్దిరభూన్మమ !!

ஸ்ரீ க்ருஷ்ண பாத பாதாப்ஜே நமாமி ஸிரஸா ஸதா
யத் ப்ரஸாதப் ப்ரபாவேந ஸர்வ ஸித்திரபூந்மம

మన తదుపరి సంచికలో పిళ్ళై లోకాచార్యుల వైభవమును చూద్దాము.

అడియేన్ :
రఘు వంశీ రామానుజ దాసన్.

source:

నమ్పిళ్ళై

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలొ మనం నంజీయరుల గురించి తెలుసుకున్నాం , ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

నమ్పిళ్ళై – తిరువల్లిక్కేణీ

తిరునక్షత్రము: కార్తీక మాసము, కృత్తిక నక్షత్రము

అవతార స్థలము: నమ్బూర్

ఆచార్యులు: నంజీయర్

శిశ్యులు: వడక్కు తిరువీధి పిళ్ళై, పెరియవాచ్చాన్ పిళ్ళై, పిన్భజగియ పెరుమాళ్ జీయర్, ఈయుణ్ణి మాధవ పెరుమాళ్, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్  మొదలగువారు.

పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగమ్

శ్రీ సూక్తులు: తిరువాయ్ మొజి 36000 పడి ఈడు వ్యాఖ్యానము, కణ్ణినున్ శిరుత్తామ్బుకు వ్యాఖ్యానము, తిరువన్దాదులకు, తిరువిరుత్తములకు వ్యాఖ్యానము.

నమ్బూర్ నందు వరదరాజన్ గా జన్మించిరి, నమ్పిళ్ళై గా ప్రసిద్దిగాంచిరి. వారికి గల మరికొన్ని నామధేయములు తిరుక్కలికన్ఱి దాసర్, కలివైరి దాసర్, లోకాచార్యర్, సూక్తి మహార్ణవర్, జగదాచార్యర్ మరియు ఉలగాశిరియర్.

పెరియ తిరుమొజి 7.10.10 ని చూస్తే కనుక,తిరుక్కణ్ణమన్గై ఎమ్పెరుమాన్ తిరుమంగై ఆళ్వారుల పాశురముల అర్థములను కలియన్ నుండే తెలుసుకోదలిచెనని –అందువల్ల కలియన్  నమ్పిళ్ళై ల యొక్క అవతారమును ధరించి ఎమ్పెరుమాన్ పెరియవాచ్చాన్ పిళ్ళై అవతారమ్ ధరించి అరుళిచెయల్ అర్థములని తెలుసుకొనిరి.

నంజీయర్ తమ యొక్క 9000పడి వ్యాఖ్యానమునకు ఒక మంచి గ్రంథమును చేయదలిచెను. అప్పుడు వారు  శ్రీ వైష్ణవగోష్ఠిలో విచారించగా, నమ్బూర్ వరదరాజర్ లను ప్రతిపాదించిరి. వరదరాజర్ నంజీయర్లతో మీ తిరువుళ్ళమ్(భావన) ప్రకారము వ్రాసెదమని చెప్పెను. నంజీయర్ మొదట వరదరాజరునకు 9000 పడి కాలక్షేపమును చెప్పి తదుపరి అసలు ప్రతిని ఇచ్చిరి. వరదరాజర్  కావేరి నదికి అటు వైపు ఒడ్డున ఉన్న తన స్వస్థలానికి చేరి అక్కడ ఎటువంటి ఇబ్బందులు  గ్రంథమును రాసి పూర్తి చేయవలెనని  సంకల్పించిరి.నది దాటే సమయములో, ఒక్కసారిగా వరద రావడముతో వరదరాజర్ ఈదుచూ దాటిరి.ఆ సమయములో, తన చేతులనుండి అసలు గ్రంథము జారి పోయెను. తిరిగి తన స్వస్థలమునకు చేరిన పిమ్మట,వారి ఆచార్యులను మరియు వారు అనుగ్రహించిన అర్థ విశేషములను ధ్యానించి , మరల 9000 పడి వ్యాఖ్యానమును వ్రాయుట మొదలు పెట్టెను. అప్పడికే వారు తమిళ భాష మరియు సాహిత్యములపై పట్టు ఉండడమువలన,వారు ఎక్కడ అందమైన అర్థములను కావలెనో అక్కడ చేర్చి ,చివరికి నంజీయరుల వద్దకి వచ్చి వారికి సమర్పించిరి . నంజీయర్ ఆ వ్యాఖ్యానమును చూసి, అసలు ప్రతికి కొన్ని మార్పులు ఉన్నవని అర్థముచేసుకొని,ఏమైనదని విచారించిరి.వరదరాజర్ జరిగిన సంఘటనను వివరించిరి,నంజీయర్ జరిగినది విని సంతోషముతో వరదరాజర్ సత్యమైన కీర్తిని అర్థము చేసుకొని వారికి నంజీయర్ “నమ్పిళ్ళై” మరియు “తిరుక్కలికన్ఱి దాసర్” అనే నామధేయమును పెట్టిరి.

భట్టర్-నంజీయరుల సంబంధం మరియు సంభాషణల వలె, నంజీయర్-నమ్పిళ్ళై సంబంధం మరియు సంభాషణలు కూడా ఎంతో ఆహ్లాదకరముగా మరియు చాలా అర్థవంతముగా ఉండును.వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాము:

 • నమ్పిళ్ళై,నంజీయరులని ఈ విధముగా అడిగిరి, ఆ కాలములో ఉపాయాంతరములకు (కర్మ, జ్ఞాన, భక్తి) చాలా ప్రమాణములు ఉండగా శరణాగతికి చాలా ప్రమాణములు లేవు ఎందులకు అని అడిగిరి. నంజీయర్ మొదటగా మనకు ప్రత్యక్షముగా అర్థమయ్యే వాటికి ప్రమాణము అవసరములేదని చెప్పిరి – ఏ విధముగానైతే ఒక వ్యక్తి నదిలో మునుగుచుండగా,అతను అలానే మునుగుతాడో లేక మునగని ఒక వ్యకి సహాయము కోరి శరణు వేడుతాడో – మనము సంసారము అనే సముద్రములో మునుగుచుండగా అట్లే సంసారం అనే మహా సాగరం లో మునిగే మనలను ఒడ్డున చేర్పించటానికి మునిగి తేలని ఎమ్పెరుమాన్ ని శరణు వేడటమే ఉత్తమమైన ఉపాయము ,కాని వారు శరణాగతి తత్త్వమును నిరూపించటానికి మరి కొన్ని బలమైన ప్రమాణములను శాస్త్రములో చూపుతారు. వారు అలానే -ప్రమాణముల సంఖ్యను బట్టి ఆ తత్త్వము యొక్క గొప్పతనమును నిరూపణ చేయటము సరికాదని, లోకముల లో అనేక మంది సంసారులు మరియు కొద్ది మంది మాత్రమే సన్యాసులుగా ఉన్నారని అంత మాత్రాన సంసారిగా ఉండడటమే మంచిదని అనుకోలేమని విన్నవించిరి .ఇవి విని నమ్పిళ్ళై చాలా సంతృప్తి చెందెను.
 • నమ్పిళ్ళై నంజీయర్లను ఈ విధముగా అడిగిరి “ఎప్పుడు ఒకరు శ్రీవైష్ణవత్వమును కలిగి౦దని తెలుసుకొందురు?”. నంజీయర్ సమాదానము~:ఎవరైతే పరత్వమును అర్చావతారములో చూస్తారో, ఎవరైతే ఇతర శ్రీవైష్ణవులను తమ భార్య మరియు పిల్లలుగా భావిస్తారో(అదే అనుబంధంను శ్రీవైష్ణవులందు కలిగిఉండవలెను) మరియు ఎవరైతే ఇతర శ్రీవైష్ణవులు తనను అవమానపరచినా సంతోషముగా స్వీకరించ గలుగుదురో వారు శ్రీవైష్ణవత్వమును కలిగి ఉందురు.
 • ఒక్కప్పుడు నమ్పిళ్ళై శ్రీభాశ్యమును నంజీయరుల వద్ద సేవించుచుండగా, నంజీయర్ నంపిళ్ళై ను తమ పెరుమమాళ్ళకి తిరువారాధనమును చేయమని  ఆఙ్ఞాపించిరి. నమ్పిళ్ళై ఎలా చేయాలో తెలియదు అనగా – ఆ సమయములో నంజీయర్ నమ్పిళ్ళై ని ద్వయ మహా మన్త్రమును ( ద్వయములోని మొదట మరియు రెండవ భాగముల మధ్యన “సర్వ మంగళ విగ్రహాయ” అనే వాక్యము చేర్చి తిరువారాధనం చేయటం ద్వారా అర్చావతార రూపము లో ఉన్న ఎమ్పెరుమాన్ యొక్క సౌలభ్యమును చూపుదురు)అనుసంధానం చేసి భోగమును ఎమ్పెరుమానులకు నివేదించమనిరి. ఈ విషయము ద్వారా మన పూర్వాచార్యులు దేనికైనను ద్వయ మహా మంత్రం పై ఆధార పడుదురని తెలుసుకొంటిమి.
 • నమ్పిళ్ళై అడిగిరి“ఎమ్పెరుమానుల అవతారముల ముఖ్య ఉద్దేశము ఏమిటి ?”. నంజీయర్ ఈ విదముగా చెప్పెను “ఎవరైనా భాగవత అపచారమునకు పాల్పడినచో ఎమ్పెరుమాన్ వారిని సరియైన విధముగా శిక్షించుటకు పెద్ద పనులను తీసుకొనును ” (ఉదా:ఎవరైనా భాగవత అపచారమునకు పాల్పడినచో వారిని సరియైన విధముగా శిక్షించుటకుఎమ్పెరుమాన్ ఎటువంటి అసామాన్య పనులు చేయుటకును సిద్ధముగానున్దురు. పూర్వం తన భక్తుల యెడల చాలా అపచారములు చేసినా దుర్యోధనుని సంహరించుటకై ఎన్నో వ్యయ ప్రాయసనలను ఓర్చుకొని తాను కణ్ణన్ ఎమ్పెరుమాన్ గా అవతారమును ధరించిరి).
 • అప్పుడు నమ్పిళ్ళై ఈ విదముగా అడిగెను “ భాగవత అపచారము అనగానేమి?”. నంజీయర్ సమాదానము“మనతో సమానముగా ఇతర శ్రీవైష్ణవులని భావించడము”.ఆళ్వారుల తమ పాశురములలో గొప్ప భాగవతులు వారి జన్మము , జ్ఞానము మొదలగు వాటిని పరిగణలోకి తీసుకోకుండా , భాగవతులు ఎప్పుడు మన కన్నా గొప్పవారు అనే భావన తో శ్రీ వైష్ణవులు ఉండాలని . మన పుర్వాచార్యులు ఎల్లప్పుడు భాగవతులు గొప్పతనాని అనుసంధానం చేస్తు కాలం గడిపేవారని , మనమును అట్లు ఉండుటకు ప్రయత్నం చేయవలెనని చెప్పిరి .
 • నంజీయర్ నమ్పిళ్ళై కి ఎవరైతే భగవద్ గుణానుభవమ్ లో ఉంటారో వారికి లౌకిక విషయముల యగు ఐశ్వర్య , అర్థ ,కామ మొదలగులలో రుచి కూడదని ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధ పాశురములను ఉదాహరణము గా చెప్పిరి. ఎమ్పెరుమాన్ యొక్క దివ్య స్వరూపాన్ని గుర్తించిన తిరుమంగై ఆళ్వార్లు భౌతిక విషయములలో ఆసక్తి ని ఏ విధముగా విదిచిరో తన దివ్య ప్రబంధం లోని మొదటి పాశురములో “వాడినేన్ వాడి…నారాయణ ఎన్నుమ్ నామమ్” (ఎమ్పెరుమాన్ తిరునామము లబించే వరకు మేము సంసారమునందు భాదలను అనుభవించితిమి అని తెలిపిరి) .అదివిని నమ్పిళ్ళై చాలా సంతోషముచెంది నంజీయరులను ఎప్పడికి వదలక వారికి సపర్యలను చేస్తూ కాలక్షేపములను అనుభవించేవారు.
 • నంజీయర్ తిరువాయ్ మొజి కాలక్షేపమమును 100 పర్యాయములు నిర్వహించిరి మరియు నమ్పిళ్ళై నంజీయరులకు శతాభిషేక మహోత్సవమును జరిపించిరి. నంజీయరుల కాలక్షేపముల ద్వారా పూర్వాచార్యుల రహస్యార్థములను అన్ని వారు తెలుసుకొనిరి.

నమ్పిళ్ళై చాలా ప్రత్యేక గుణములను కలిగినవారు మరియు వారి గొప్పతనమును మనము ప్రమాణించలేము. వారికి తమిళ/సంస్కృతము భాష మరియు సాహిత్యములలో మంచి పట్టు ఉండేది. తన ప్రవచనములలో వారు తిరుక్కురళ్, నన్నూల్, కంబ రామాయణము,మొద!!వాటిని మరియు వేదాంతము, విష్ణు పురాణము, శ్రీ వాల్మీకీ రామాయణము మొద!!  వాటిని ఉదహరించేవారు.వారు ఎవరికైనా ఆళ్వార్ అరుళిచ్చెయలందు సందేహము/ప్రశ్న లు తలెత్తినప్పుడు వాల్మీకీ రామాయణమును ఉపయోగించి వారి సందేహములను యుక్తితో సంతృప్తిపరిచేవారు ,కారణము రామాయణము వైదీహులచే ప్రపంచ వ్యాప్తముగా అంగీకరించబడినది. వాటిలో కొన్ని సంఘటనలు మనకు వారి యొక్క గొప్పతనమును మరియు వినయమును తెలియచేయును.

 • నమ్పిళ్ళై సాదారణముగా తమ ప్రవచనములను పెరియ కోవెలలో మూల మూర్తి సన్నిధికి ప్రదక్షిణముగా తూర్పు దిక్కున (పెరియ పెరుమాళ్ళ తిరువడి దిక్కు)చెప్పేవారు .అందువలనే ఈ రోజు కూడా మనము ప్రణామమును సన్నిధి నుండి తిరిగి వచ్చి అక్కడ సమర్పించుదుము. ఒకసారి పెరియ పెరుమాళ్ అక్కడ నుంచొని నమ్పిళ్ళై ఉపన్యాసమును వినదలచిరి. తిరువిళక్కు పిచన్ (సన్నిధిలో దీపకైంకర్యమును చూసే ఒక శ్రీవైష్ణవుడు) పెరియ పెరుమాళ్ నిలబడడము చూసి వారిని క్రిందికి పూర్వం మాదిరిగా పడుకునేలాగా నెట్టి ఈ విదముగా ఆర్చావతారములో వెళ్ళరాదు అని చెప్పిరి. ఎమ్పెరుమాన్ ఇప్పడికి నమ్పిళ్ళై ని చూస్తూ కాలక్షేపం వినాలని ఎమ్పెరుమాన్ తన అర్చావతారం ను లెక్క చేయకుండా అర్చసమాధి ని త్యజించారు.
 • ఆ తదుపరి నమ్పిళ్ళైల ప్రవచనములు చాలా ప్రసిద్దిగాంచెను,అప్పుడు ప్రతీ ఒక్కరు ఇది నమ్పెరుమాళ్ గోష్టియా లేక నమ్పిళ్ళై గోష్టియా అని అడిగేవారు.వారు తన ప్రవచనములతో ప్రజలను ఎలాగైతే నమ్పెరుమాళ్ ప్రజలను తమ పురప్పాడుకు ఆకర్షించేవారో ఆవిదముగా తన ప్రవచనములతో ఆకర్షించేవారు]
 • నమ్పిళ్ళైల వినయము పోల్చలేనిది. వారు శ్రీవైష్ణవత్వమునకు ఉదాహరణముగా జీవించిరి,వారు ఆ గుణములను నంజీయరుల వద్ద నేర్చుకొనిరి. ఒకసారి నమ్పెరుమాళ్ళ ఎదుట, కన్దాడై తోజప్పర్ (ముదలియాణ్డాన్ పరంపరనుండి వచ్చిన వారు) నమ్పిళ్ళై యొక్క కీర్తి ని ఓర్వలేక నమ్పెరుమాళ్ళ ఎదుట,కొన్ని పరుషమైన వాక్యములు పలుకుదురు ,నమ్పిళ్ళై ఆ అవమానమును అంగీకరించి ఒక్క మాటను మాట్లడక గుడిని వదిలి తన తిరుమాళిగైకు వెళ్ళిరి. అప్పుడు తోజప్పర్ వారి తిరుమాళిగకు వెళ్ళిరి, వారి ధర్మ పత్ని ఆ వార్తలను వేరే వారి ద్వారా తెలుసుకొని వారిని గట్టిగా మందలించి నమ్పిళ్ళైల కీర్తి గురించి చెప్పెను. ఆమె వారిని నమ్పిళ్ళై ల దగ్గరికి తప్పకుండా వెళ్ళి వారి పాదముల వద్ద క్షమాపణను కోరమని అడిగెను.చాలా రాత్రి గడిచిన తరువాత చివరకు అతను తన తప్పుని గ్రహించి , నమ్పిళ్ళైల తిరుమాళిగైకు వెళ్ళుదామని నిర్ణయించుకొనెను. అప్పుడు వారు ద్వారం ను తీసి చూస్తే అక్కడ ఒక వ్యక్తి వేచి ఉండడం గమనిస్తారు . పరిశీలించి చూడగా వారు నమ్పిళ్ళై,నమ్పిళ్ళై తోజప్పర్ లను చూసి,వెంటనే క్రిందపడి ప్రణామమును సమర్పించి,మేము మీ యెడల తప్పు చేయడము కారణముగా మీరు బాధపడినట్టున్నారు అని చెప్పెను . తోజప్పర్ నమ్పిళ్ళైల గొప్పతనమును చూసి భీతీల్లినవాడై – తోజప్పర్ తప్పుచేసినప్పడికినీ, నమ్పిళ్ళై ఆ తప్పును తనపై వేసుకొనే పెద్దమనసు ఉన్నవాడై క్షమాపణ చెప్పెను.తోజప్పర్ వెంటనే నమ్పిళ్ళైలకి ప్రణామములు సమర్పించి ఈ విదముగా చెప్పెను, నమ్పిళ్ళై ఈ క్షణమునుండి“లోకాచార్యర్” గా పిలవబడును కారణము – గొప్పవారైనాను వినయముగా ఉండంటం కేవలం కొద్ది మంది కి మాత్రమే సాధ్యమగును , వారిని లోకాచార్యులుగా సంభోధన చేయుదురు . నమ్పిళ్ళై ని ఈ విధముగు పిలువుటకు తగిన వారు.తోజప్పర్ నమ్పిళ్ళైపైన ఉన్న ద్వేషమును వదిలి అతని భార్యతో కూడి నమ్పిళ్ళైకి సేవలు చేయసాగిరి అలానే శాస్త్రమ్ యొక్క రహస్యములను వారి వద్ద నుండి నేర్చుకొనిరి. మామామునిగళ్ తన ఉపదేశ రత్తిన మాలైలో ఈ సన్నివేషమును ఉదహరించిరి అలానే తోజప్పర్ మరియు నమ్పిళ్ళైల ఇరువురి కీర్తిని వర్ణించిరి. దానినుండే మనము నమ్పిళ్ళై ల పవిత్రతను అర్థము చేసుకోవచ్చు. అలానే తోజప్పర్ నమ్పిళ్ళైల సహవాసముతో ఏ విధముగా పవిత్రము చెందిరో ఈ సంఘటన తదుపరి మనము అర్థము చేసుకోవచ్చును.
 • నడువిల్ తిరువీది పిళ్ళై భట్టర్ భట్టరుల తిరువంశముల నుండి వచ్చెను, వారు నమ్పిళ్ళైల కీర్తిని చూసి,నమ్పిళ్ళై పైన కొంత ద్వేషమును పెంచుకొనెను. ఒకసారి వారు రాజుగారి న్యాయస్తానమునునకు పోవుచు, పిన్భజగియ పెరుమాళ్ జీయరులను తమవెంట రమ్మని పిలిచెను. ఆ రాజు వారిరువురిని ఆహ్వానించి, సంభావనను ఇచ్చి ఉచితాసనములను సమర్పించెను.ఆ రాజు భట్టర్ వారిని శ్రీ రామాయణము నుండి ఒక ప్రశ్నను అడిగిరి.రామావతారములో పెరుమాళ్ పరత్వమును చూపను అనెను కదా,మరి ఎలా జటాయునకు “గచ్చ లోకాన్ ఉత్తమాన్” (పెద్దైన ప్రపంచమునకు వెళ్ళుము – పరమపదము)?అని చెప్పిరి,అప్పుడు భట్టర్ సరియగు సమాదానము తెలియక తన యొక్క యశస్సును గురించి కలతచెందుచుండగా,రాజు ఇతర విషములందు ధ్యాస మరిలెను . భట్టర్ జీయరులను నమ్పిళ్ళై ఏ విధముగా చెప్పును అని అడుగగా జీయర్ వేంటనే వారైతే ఈ విధముగా వివరించుదురు “సత్యేన లోకాన్ జయతి” (ఒక సత్యమైన వ్యక్తి ప్రపంచమును జయించును). భట్టర్ ఆ శ్లోకముపై దృష్టి ఉంచి అర్ధమును గ్రహించి రాజుకు ఈ విధముగా చెప్పెను,రామన్ చాలా సత్యవ్రతుడు అయినందున అతను తన యోగ్యతచే సులభముగా ఎవరినైనా ఎక్కడికైనా పంపవచ్చును. రాజు అది విని చాలా సంతోషము చెంది,భట్టరుల  ఙ్ఞానమును పొగిడి వారికి చాలా ధనమును సమర్పించెను. భట్టర్ వెంటనే నమ్పిళ్ళై వివరణ శక్తిని గ్రహించినవాడై, వారి వద్దకు వెళ్ళి మొత్తము ధనమును వారికి సమర్పించి వారి శిశ్యులైరి,అ తరువాత నమ్పిళ్ళైల సేవలో ఎప్పడికిఉండిపోయెను.

చాలా సంఘటనలు నమ్పిళ్ళైల జీవితములో తమ శిశ్యులకు విలువగు పాఠములు మరియు ఉపదేశములను నేర్పిరి. కొన్ని ఇక్కడ చూద్దాము:

 • ఒకసారి నమ్పిళ్ళై తమ శిశ్యులతో కూడి తిరువెళ్ళరై నుండి పడవలో తిరిగి వస్తుండగా, కావేరి నదికి వరదరాగా ,పడవ నడిపే వ్యక్తి గోష్టిని ఉద్దేశించి పడవ నదిలో నిలుచుటకు మరియు నమ్పిళ్ళైను కాపాడుకొనుటకు ఎవరైనా ఒకరు పడవనుండి దూకమని చెప్పెను.అదివిని ఒక వృద్ద స్త్రీ వరదలోకి దూకినది,అదిచూసి నమ్పిళ్ళై చాలా బాధ పడిరి. కాని ఒడ్డుకు చేరగానే ఆ వృద్ద స్త్రీ గొంతు పక్కనే గల దీవిలో వినబడి ఈ విధముగా చెప్పెను,నమ్పిళ్ళై తన ఎదురుగా కనబడి తనని రక్షించెనని చెప్పెను.ఆ వృద్ద స్త్రీ తన జీవితమును పణముగా పెట్టి ఏ విదముగా ఆచార్యులకు సేవ చేయవచ్చునో చూపించి, మరియు నమ్పిళ్ళై- ఆచార్యులు ఆపద సమయములో తన శిశ్యులను ఎలా కాపాడుతారో చూపించిరి.
 • ఒక శ్రీ వైష్ణవ స్త్రీ నమ్పిళ్ళై తిరుమాలిగై పక్కనే ఉండేది, ఆమె దగ్గరికి ఒక శ్రీ వైష్ణవుడు వెళ్ళి ఈ విధముగ అడిగెను ఆమె గృహము నమ్పిళ్ళైల తిరుమాళిగై కుడి పక్కనే ఉన్నమూలముగా,మీరు మీ తిరుమాళిగను నమ్పిళ్ళై వారికి ఇస్తే నమ్పిళ్ళైల తిరుమాళిగను పెద్దగా చేసే అవకాశము ఉండును మరియు శ్రీ వైష్ణవ గోష్టికి ఉపయోగముగ ఉండును. మొదట సంకోచించి తదుపరి నమ్పిళ్ళై వద్దకు వెళ్ళి తనకు పరమపదములో చోటు ఇస్తే తన గృహమును ఇస్తానని చెప్పెను. నమ్పిళ్ళై సంతోషముతో ఒక గుర్తును తను వ్రాసిఇచ్చెను, ఆమె కొన్ని దినముల తదుపరి తన చరమ శరీరమును వదిలి పరమపదమునకు చేరెను.
 • నమ్పిళ్ళై ఇద్దరు భార్యలను కలిగిఉండెను.ఒకసారి వారు తన మొదటి భార్యని నా గురించి నీ ఆలోచన ఏమిటి అని అడిగిరి.ఆమె ఈ విదముగా జవాబు చెప్పెను, మీరు ఎమ్పెరుమానుల అవతారము మరియు నాకు ఆచార్యులుగా భావించెదను . నమ్పిళ్ళై చాలా సంతోషముచెంది తమ కొరకు వచ్చే శ్రీ వైష్ణవుల కొరకై తదియారాదన కైంకర్యములో పాల్గొనమని చెప్పిరి. వారు తమ రెండవ భార్యను అదే విదముగా అడుగగా, ఆమె నమ్పిళ్ళైలను తమ భర్తగా భావించెదను అని చెప్పెను. నమ్పిళ్ళై ఆమెను మొదటి భార్యకు సహాయముగా ఉండమని మరియు శ్రీవైష్ణవుల ప్రసాదమును స్వీకరించమని చెప్పిరి.వారు ఈ విదముగా అనిరి,శ్రీవైష్ణవుల శేషము వలన తను పవిత్రమై,నిష్ట పెరగడము వలన ఆధ్యాత్మికముగా(ఆచార్య-శిశ్యురాలు) పరిణితిచెంది శరీర సంభందమైన భావనను(భర్త-భార్య) మరచిపోవును.
 • అప్పుడు మహాభాశ్య భట్టర్ నమ్పిళ్ళైలను ఒక శ్రీవైష్ణవుడు తన యొక్క చైతన్యమునును(ఙ్ఞానము) గ్రహించిన తదుపరి ఏ విదముగా ఉండును అని అడిగిరి. నమ్పిళ్ళై ఈ విధముగా సమాధానమును చెప్పిరి,ఆ శ్రీ వైష్ణవుడు ఎమ్పెరుమానులే ఉపాయము మరియు ఉపేయము అని తలుచును,సంసారము అనే అనాధియైన వ్యాది నుండి కాపాడినందుకు ఆచార్యులకు క్రృతఙ్ఞుడై ఉండును,తప్పక శ్రీ భాష్యం ద్వారా నిరుపించబడ్డ ఎమ్పెరుమానారుల సిద్ధా౦తము సత్యము అని నమ్మినవాడై ఉండును , తప్పక భగవద్ గుణానుసంధానమ్ శ్రీ రామాయణము తో నిత్యము భగవద్ గుణానుసంధానమ్ చేయు ఉండును మరియు వారి సమయమును ఆళ్వారుల అరుళిచెయల్ నందు పూర్తిగా వినియోగించుతూ ఉండును .చివరగా తప్పక ఈ జీవితము తదుపరి  పరమపదమును చూస్తామని నమ్మకమును  కలిగి ఉండును.
 • కొందరు శ్రీవైష్ణవులు  పాండ్య నాడు నుండి నమ్పిళ్ళైల దగ్గరకు వచ్చి మన సంప్రదాయము యొక్క సారమును తెలుపమని అడిగిరి. నమ్పిళ్ళై వారిని సముద్రము రేవును గురించి అలోచించమనిరి.అప్పుడు వారు దిగ్బ్రమచెంది ఎందుకు సముద్రపు రేవు గురించి ఆలోచించడము అని అడుగగా, నమ్పిళ్ళై ఈ విధముగా వివరించిరి అప్పుడు చక్రవర్తి తిరుమగన్ రావణునితో యుద్దమునకు ముందు సముద్రపు ఒడ్డున నివసించే సమయములో,వారు తమ గుడారములో విశ్రమించే సమయములో వానరములు వారి రక్షణ కొరకై చుట్టుపక్కన కాపలాగా ఉండేవి.కాని శ్రమవలన వానరములు పడుకొనినప్పుడు, ఎమ్పెరుమాన్ స్వయముగా తానే అక్కడ పరిసరములు తిరుగుతూ వారికి రక్షణగా ఉండెను.. నమ్పిళ్ళై ఈ విధముగా వివరించెను ఎమ్పెరుమాన్ మనము పడుకొనినను తానే రక్షించును మేలుకతో ఉన్నప్పడికినీ తానే రక్షించును అందువలన మనము వారి యందు పూర్తి విశ్వాసమును ఉంచవలెను, ఈ విధముగా స్వ రక్షనే స్వ అన్వయమ్  అనగా మనలని మనమే రక్షించుకోగలం అనే భావనను త్యజించ వలెను .
 • దేవతాంతర భజనముల గురించి నమ్పిళ్ళై గొప్ప వివరణమును ఇక్కడ మనము చుద్దాము .ఒక వ్యక్తి నమ్పిళ్ళై వద్దకు వచ్చి అడిగిరి“మీరు  దేవతాన్తరములను  ( ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, సూర్య,మొద,,) మీ నిత్య కర్మలందు ఎందుకు ఆరాధించుదురు,కాని గుడిలో ఎందుకు ఆరాధించరు?”. నమ్పిళ్ళై చాలా తెలివిగా సమాధానమును చెప్పిరి “మీరి అగ్నిని యాగములో ఎందుకు ఆరాధించుదురు మరియు స్మశానములో ఉండే అగ్నికి దూరముగా  ఎందుకు ఉందురు ? అదేవిధముగా, శాస్త్రము లో విధించిన నిత్య కర్మములను భగవద్ ఆరాధనముగా తప్పక చేయవలెను ఎందుకంటే ఎమ్పెరుమానులు దేవతలకు అన్తర్యామిగా ఉండి వాటిని గ్రహించుదురు ,అందువలన మేము చేస్తాము. అదే శాస్త్రమ్ ఈ విధముగా చెప్పినది,మనము ఎమ్పెరుమానులను తప్ప వేరెవరిని ఆరాధించకూడదని,అందువలన వేరే ఆలయములకు వెళ్ళము.అదేవిధముగా,ఆ దేవతాలను ఆలయములలో ప్రతిష్టించడము వలన, వారి యొక్క రజో గుణము పెరిగి మరియు వారికి వారే పరత్వులు అని ఆలోచించుదురు, మేము (శ్రీవైష్ణవులు) సత్వ గుణము కలిగి ఉండడము వలన రజో గుణములు కలిగిన దేవతలను ఆరాధించము”. దేవతాంతర భజనము మనము వదులుకొనుటకి ఈ సమాధానము చాలు కదా?.
 • ఒక శ్రీవైష్ణవుడు నమ్పిళ్ళైల దగ్గరకు వచ్చి ఈ విధముగా చెప్పెను, నేను ఇంతకు ముందుకన్నా చిక్కిపోయాను అనిరి. నమ్పిళ్ళై సమాధానము: ఆత్మ పెరిగినప్పుడు శరీరము దానికదే చిక్కిపోవును
 • అప్పుడు మరియొక శ్రీవైష్ణవుడు నమ్పిళ్ళైలను అడిగిరి,ఎందుకు మేము బలముగా లేము, నమ్పిళ్ళై సమాధానము: ఎమ్పెరుమానులను ఆరాధించే బలము మీకు ఉంది ఇంకా బలముగా ఉండుటకు మీరు యుద్దమునకు పోవుటలేదు. శ్రీవైష్ణవుడు శారీరకముగా చాలా బలముగా ఉండవలెనని చింతిచ అవసరము లేదు అన్న సత్యమును ఇది తెలియచేయును.
 • అప్పుడు నమ్పిళ్ళై అనారోగ్యముతో ఉన్నప్పుడు, ఒక శ్రీవైష్ణవుడు చింతపడుచుండగా, నమ్పిళ్ళై చెప్పిరి, మనము ఏ బాధనైనను మంచిదే అని ఆలోచించవలే,కారణము శాస్త్రము చెప్పెను“ఎవరైతే ఎమ్పెరుమానులకు శరణాగతి చేయుదురో ,వారు మృత్యు దేవతను (చావు) సంతోషముగా వచ్చుటకు  ఆహ్వానించేదురు “.
 • ఒకానొక  సమయములో కొందరు శ్రీ వైష్ణవులు ఎన్గళ్ ఆళ్వాన్ ఆదేశము మేరకు మరియు నమ్పిళ్ళైల మీద ప్రేమచే అనారోగ్యమునుండి త్వరగా కోలుకొనుటకు ఒక రక్షను కట్టదలిచిరి, నమ్పిళ్ళై అంగీకరించకపోతే,శ్రీ వైష్ణవులు  “ఒక శ్రీవైష్ణవుడు తనగురించి వదిలి ఇతరుల అనారోగ్యమును గురించి ఆలోచించుతే తప్పేమి”అని అడిగిరి. నమ్పిళ్ళై ఈ విధముగా చెప్పిరి మనము మన అనారోగ్యమును మనమే నయము చేసుకొనిన, దాని అర్థము మన స్వరూపమును మనము సరిగా అర్థముచేసుకోకపొవడమే,మనము పూర్తిగా ఎమ్పెరుమానులపై ఆదారపడినాము అంతకుమించి వేరేలేదు.అలానే  మనము ఇతరుల అనారోగ్యమును బాగుచేయదలచిన మనము ఎమ్పెరుమానుల జ్ఞానము మరియు శక్తిని అర్థము చేసుకోకపొవడమే,మరలా మనము వారి భక్తులను కాపాడుటకు వారిపై ఆధారపడవలసినదే. అదీ నమ్పిళ్ళైల నిష్ట మరియు అలానే వారి జీవించిరి. ఇంకనూ మనము ఆళవందార్లను బాధపడినపుడూ మారనేరి నమ్బి ఏ విధముగ చేసిరో మనము గ్రహించవలెను ఇతర శ్రీవైష్ణవులు బాధను నయము చేయుటకి మనము ఆ విదముగా మన కర్తవ్యమును నిర్వహించవలెను.
 • నమ్పిళ్ళై ఆ కాలములో గొప్ప శిశ్యులుగా చాలా ఆచార్య పురుష కుటుంబాలనుండి వచ్చినవారిని కలిగిఉండేవారు, వారి సమయములో శ్రీరంగమ్ ప్రతీ ఒక్కరు నల్లడిక్కాలమ్ (మంచి కాలము) అని కీర్తించెడివారు. వారి శిశ్యులు నడువిల్ తిరువీది పిళ్ళై భట్టర్ (125000 పడి) మరియు వడక్కు తిరువీది పిళ్ళై (ఈడు 36000 పడి) వారిరువురు తిరువాయ్ మొజి నకు వ్యాఖ్యానమును వ్రాసిరి కాని నమ్పిళ్ళై పూర్వపు దానిని అంతంచేసిరి కారణము అది చాలా పెద్దది మరియు వివరమైనది, తదుపరి గ్రంథమును తీసుకొని ఈయుణ్ణి మాదవ పెరుమాళ్ళకి ఇచ్చిరి .కాలాంతరములో అజగియ మణవాళ మామునిగళ్ ద్వారా అందరికి ఉపదేశించబడుటకై . అలానే వారు పెరియవాచ్చాన్ పిళ్ళైలను తిరువాయ్ మొజినకు వ్యాఖ్యానమును వ్రాయమని ఆదేశించిరి మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై వారి ఆచార్యుల కోరికను 24000 పడి వ్యాఖ్యానమును వ్రాసిరి అది నమ్పిళ్ళైలచే పొగడబడినది.
 • అప్పుడు నమ్పిళ్ళై పెరియ కోయిల్ వళ్ళలార్ లను “కులమ్ తరుమ్” అర్థము ఏమి అని అడిగిరి, వళ్ళలార్ చెప్పెను “మా కులము జన్మ కులము నుండి నమ్బూర్ కులమునకు (నమ్పిళ్ళైల కులము) మారెను, దాని అర్థమే కులమ్ తరుమ్” – ఇది పెరియాళ్వారుల శ్రీసూక్తి పాణ్డ్య కులమ్ (జన్మతొ వచ్చిన కులము) నుండి తొండ కులము (ఆచార్య సంబందము మరియు కైంకర్యమ్ శ్రీ) మాదిరి ఉండెను. అదీ నమ్పిళ్ళైల గొప్పతనము.

ముగించుటునకు చివరగా, పెరియవాచ్చాన్ పిళ్ళై  నమ్పిళ్ళైల గురించి ఏజై ఏతలన్ పదిగములో, ఓతు వాఇమైయుమ్ పాశురము (పెరియ తిరుమొజి 5.8.7) ఏమి చెప్పారో చూద్దాము. “అన్తణన్ ఒరువన్” (అసమానమైన పండితుడు) పదమును వివరించునప్పుడు, పెరియవాచాన్ తమ ఆచార్యుల కీర్తీని చెప్పుటకు [added – ఈ ] అవకాశము ఉపయోగించుకొని తమ ఆచార్యులు అసమాన పండితుడు అనుటకు ఈ పదములను వాడిరి~: “ముఱ్పడ ద్వయత్తైక్ కేట్టు, ఇతిహాస పురాన్ణన్ఙ్గళైయుమ్ అతిగరిత్తు, పరపక్శ ప్రత్క్శేపత్తుక్కుడలాగ ణ్యాయమీమామ్సైకళుమ్ అతిగరిత్తు, పోతుపోక్కుమ్ అరుళిచెయలిలేయామ్పడి పిళ్ళైయైప్పోలే అతిగరిప్పిక్క వల్లవనైయిరే ఒరువన్ ఎన్బతు” (முற்பட த்வயத்தைக் கேட்டு, இதிஹாஸ புராணங்களையும் அதிகரித்து, பரபக்ஷ ப்ரத்க்ஷேபத்துக்குடலாக ந்யாயமீமாம்ஸைகளும் அதிகரித்து, போதுபோக்கும் அருளிசெயலிலேயாம்படி பிள்ளையைப்போலே அதிகரிப்பிக்க வல்லவனையிரே ஒருவன் என்பது). సాదారణ అనువాదము~: ఎవరు ద్వయమును మొదలు విందురో,అప్పుడు పురాణములు మరియు ఇతిహాసములను నేర్చుకొనుదురు, న్యాయము మరియు మీమాంశలను నేర్చుకొని బాహ్య/కుద్రిశులను ఓడించుదురు మరియు వారి సమయము మొత్తము ఆళ్వారుల అరుళిచెయల్ మరియు అర్థములను నేర్చుకొని ఇతరులకు నేర్పుదురు నమ్పిళ్ళైలాగా అందువలన వారిని అసమాన పండితుడు అని చెప్పబడెను. ఇక్కడ పెరియవాచ్చాన్ పిళ్ళై సాంధీపని మునిని నమ్పిళ్ళై తో పోల్చిరి(నమ్పిళ్ళై సాంధీపని ముని కన్నా చాలా గొప్పవారు నమ్పిళ్ళై భగవత్ విషయమునందు పూర్తిగా మునిగిరి కాని సాంధీపని ముని కణ్ణన్ ఎమ్పెరుమానులు ముకుందుడు అని తెలిసి కూడా(వారే మోక్షమును ఇచ్చునని తెలిసి కూడా) తన చనిపోయిన కుమారుడికి ప్రాణం పోయమని కోరెను ).

తమిళ మరియు సంస్కృతముల సాహిత్యములో లోతైనా ఙ్ఞానము కలిగిఉండే కారణముచే వారి ప్రవచనములను వినుటకు వచ్చే శ్రోతలను మంత్రముగ్దులను చేసేవారు. వీరు చెప్పే అరుళిచెయల్ అర్థములు అందరికి అర్థము అయ్యే కారణముచేత తిరువాయ్ మొజి ఎంతో ఎత్తునకు విస్తరించెను . తిరువాయ్ మొజికి, 6000 పడి వ్యాఖ్యానము తప్ప, మిగిలినమిగిలిన 4 వ్యాఖ్యానములకు నమ్పిళ్ళై సంబంధము ఉంది

 • 9000 పడి అసలు పత్రి [ప్రతి]నంజీయరు వ్రాసిననూ,తిరిగి నమ్పిళ్ళైలచే కొంచెము ముఖ్యమైన అర్థములను వ్రాయబడెను.
 • 24000 పడిని పెరియవాచాన్ పిళ్ళై నమ్పిళ్ళైల ఉపదేశములను మరియు ఆఙ్ఞలచే వ్రాసెను.
 • 36000 పడిని వడక్కు తిరువీది పిళ్ళై నమ్పిళ్ళైల ప్రవచనములచే వ్రాసెను.
 • 12000 పడిని పెరియవాచాన్ పిళ్ళైల శిశ్యుడు వాది కేసరి అజగియ మణవాళ జీయర్ వ్రాసిరి వాటి అర్థములను చూసినట్టయితే మనము సులభముగా అర్థము చేసుకోగలము అది నమ్పిళ్ళైల 36000 పడికి దగ్గరగా ఉండును.

ఇది ఒకటే కాక, నమ్పిళ్ళై అపరిమితమైన కరుణచే,మన సంప్రదాయమునకు రెండు కీర్తిగల స్తంభములను నాటిరి – వారే పిళ్ళై లోకాచార్యర్ మరియు అజగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు, వారు శ్రీవచన భూషణము మరియు ఆచార్య హ్రుదయమును మన పూర్వాచార్యులచే పొందిన ఙ్ఞానముచే వ్రాసిరి .మనము వారి చరిత్రమును తదుపరి సంచికలో చూద్దాము (వడక్కు తిరువీది పిళ్ళై వైభవము).

nampillai-pinbhazakiya-perumal-jeer-srirangam

నమ్పిళ్ళై తిరువడిలో పిన్భజగరామ్ పెరుమాళ్ జీయర్, శ్రీరంగమ్

నమ్పిళ్ళై తమ చరమ తిరుమేనిని శ్రీరంగములో వదిలి పరమపదమును చేరిరి. నడువిల్ తిరువీది పిళ్ళై భట్టర్ తమ శిరోజములను ఆ సందర్భముగా తీసివేసెను(శిశ్యులు మరియు కుమారులు తండ్రి/ఆచార్యులు పరమపదమునకు చేరినపుడు ఈ విధముగ చేయుదురు) వారి సోదరులు నమ్పెరుమాళ్ కి ఈ విషయం గురించి చెబుతారు . ఆ విధంగా ప్రవర్తించుటకు కారణమేమి అని  ప్రశ్నించగా భట్టర్ తాను కూర కులం లో జన్మించుకంటెను నమ్పిళ్ళై తో తన కున్న అనుబంధమునుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వుదురని చెప్తారు.ఇది విని నమ్పెరుమాళ్ చాలా సంతోషము చెందిరి. 

ఎమ్పెరుమానులతో మరియు ఆచార్యులతో మనకు ఆ విధమైన సంబందము ఏర్పడాలని నమ్పిళ్ళై ల శ్రీ చరణములను ప్రార్థిస్తాము.

నమ్పిళ్ళైల తనియన్:

వేదాన్త వేద్య అమ్రుత వారివారిరాశే
వేదార్త సార అమ్రుత పూరమగ్ర్యమ్
ఆదాయ వర్శన్తమ్ అహమ్ ప్రపద్యే
కారుణ్య పూర్ణమ్ కలివైరిదాసమ్

வேதாந்த வேத்ய அம்ருத வாரிராஸேர்
வேதார்த்த ஸார அம்ருத பூரமக்ர்யம்
ஆதாய வர்ஷந்தம் அஹம் ப்ரபத்யே
காருண்ய பூர்ணம் கலிவைரிதாஸம்

మన తదుపరి సంచికలో వడక్కు తిరువీది పిళ్ళై వైభవమును చూద్దాము.

అడియేన్ :

రఘు వంశీ రామానుజదాసన్.

source: