విళాఞ్జోలైపిళ్ళై

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

viLAnchOlai piLLai

తిరునక్షత్రం: ఆశ్వీజ(తులామాసం) ఉత్తరాషాడ నక్షత్రం .

అవతారస్థలం : తిరువనంతపురం దగ్గర ‘ఆఱనూర్’ అనే గ్రామం.ఇది కరైమనై అనే నదీ తీరాన ఉన్నది.

ఆచార్యులు: పిళ్ళైలోకాచార్యులు

కాలక్షేప ఆచార్యులు: విళాఞ్జోళైపిళ్ళై  ఈడు ను మరియు శ్రీభాష్యమును, తత్త్వత్రయమును  మిగిలిన రయస్య గ్రంథములను శ్రీపిళ్ళైలోకాచార్యుల తమ్ముడగు శ్రీ అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనారాచార్యుల వద్ద  అధ్యయనం చేశారు.

గ్రంథరచనలు: శ్రీ వచనభూషణమునకు సారమగు  ‘ సప్తగాథై’

పరమపదించిన స్థలం: తిరువనంతపురం

పిళ్ళైలోకాచార్యుల శిష్యుల్లో  విళాఞ్జోళైపిళ్ళై ఒకరు. వీరి దాస్య నామం నలం తిఘళ్ నారాయణ దాసులు.

వీరు ఈజవ(తాటి చెట్ల నుండి మద్యం సేకరించేవారు) కులములో పుట్టారు. కావున ఆలయములోకి రావడం నిషిద్ధముగా ఉండేది. కావున తమ గ్రామం నుండి ‘విలాం’ అనే వృక్షాలను ఎక్కి  తిరువనంతపుర పద్మనాభస్వామి దేవాలయ గోపురం దర్శించి  స్వామికి మంగళాశాసనం  చేసేవారు.

 శ్రీలోకార్య పదారవింద మఖిల శ్రుత్యర్థ కోశమసతాం

గోష్ఠీం చ తదేక లీన మనసా సంచితయంతమ్ సదా|
శ్రీనారాయణ దాసమార్యమమలం సేవే సతాం సేవధిం
శ్రీవాగ్భూషణ గూడభావ వివృతిం యస్య  సప్తగాథాం వ్యాధత||

విళాఞ్జోళైపిళ్ళై ఈడు, శ్రీభాష్యమును, తత్త్వత్రయమును మరియు  మిగిలిన రహస్య గ్రంథములను శ్రీపిళ్ళైలోకాచార్యుల తమ్ముడగు శ్రీ అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనారాచార్యుల వద్ద  అధ్యయనం చేశారు.

శ్రీవచనభూషణమును తమ ఆచార్యులగు శ్రీపిళ్ళైలోకాచార్యుల వద్ద అధ్యయనం చేశారు. వీరు దాని అర్థములు తెలిసిన ఒక నిపుణుడిగా(అధికారి) భావించేవారు.

వీరు తమ ఆచార్యులకు ఒక గొప్ప కైంకర్యమును చేశారు. అది తమ ఆచార్యులు చరమదశలో ఉన్నపుడు వారు చెప్పిన నిబంధనలను పాటించారు- శ్రీపిళ్ళైలోకాచార్యులు తమ శిష్యులగు తిరువాయ్ మొళిపిళ్ళై (తిరుమలైఆళ్వార్)ను సాంప్రదాయ సిద్ధంగా తయారు చేసి తమ ఉత్తరాధికారిగా చేయాలని మరియు   శ్రీవచనభూషణ విశేషాలను తిరువాయ్ మొళి పిళ్ళైకు అందించమని విళాఞ్జోళైపిళ్ళై కు ఆదేశించారు.

విళాఞ్జోళైపిళ్ళై మరియు తిరువాయ్ మొళి పిళ్ళై:

తిరువాయ్ మొళి పిళ్ళైను తిరువనంతపుర దేవాలయ అర్చకులగు నంబూద్రిలు అనంతపద్మనాభస్వామికి మూడు ద్వారముల నుండి మంగళాశాసనములు అనుగ్రహించమని ఆహ్వానించారు. అప్పుడు తిరువాయ్ మొళిపిళ్ళై ను విళాఞ్జోళైపిళ్ళై చూశారు.

వారు రాగానే  ఒక ఆశ్చర్యమును చూశారు. విళాఞ్జోళైపిళ్ళై తమ ఆచార్యులగు పిళ్ళైలోకాచార్యుల తిరుమేని మీద యోగధ్యానములో ఉన్నారు. ఆ రోజుల్లోవారి గొప్ప శిష్యులందరు శ్రీరంగములో  ఉన్నప్పుడు ఇలాంటివి జరిగేవి. విళాఞ్జోళైపిళ్ళై తిరుమేని (దివ్య శరీరం)సాలె గూడులతో కప్పబడింది.

తిరువాయ్ మొళిపిళ్ళై వారి పాదాల  పై పడి వారి ముందు మౌనంగా ఉండి పోయారు. విళాఞ్జోళైపిళ్ళై వెంటనే నేత్రాలను తెరచి తమ కృపను వారిపై అనుగ్రహించారు. విళాఞ్జోళైపిళ్ళై వీరికోసం చాలా కాలంగా ఎదురుచూడడం వల్ల వీరిని చూడగానే  చాలా ఆనందించారు.

విళాఞ్జోళైపిళ్ళై శ్రీవచనభూషణం యొక్క రహస్యార్థాలను తిరువాయ్ మొళిపిళ్ళై కి అనుగ్రహించారు. ఇంకా అదనంగా శ్రీవచనభూషణ సారమైన సప్తగాథై అను 7పాశురముల గ్రంథమును కూడ తిరువాయ్ మొళిపిళ్ళై కి ఉపదేశించారు.

ఇది తొండరడిపొడి ఆళ్వార్ అనుగ్రహించిన ‘కొడుమిన్ కొణ్మిన్’ కు ఒక ప్రముఖ ఉదాహరణ- ఈజవ  కులమునకు చెందిన విళాఞ్జోళైపిళ్ళై  అనుగ్రహంచారు, బ్రాహ్మణ కులానికి చెందిన తిరువాయ్ మొళిపిళ్ళై స్వీకరించారు. ఇదే శ్రీవైష్ణవ సిద్ధాంతపు సారతమము.

కొంతకాలం తర్వాత  తిరువాయ్ మొళిపిళ్ళై ,   విళాఞ్జోళైపిళ్ళై దగ్గర సెలవు తీసుకొని శ్రీరామానుజ దర్శనమునకు (సిద్ధాంతమునకు) దర్శనస్థాపక ఆచార్యులుగా ప్రకాశించిరి.

విళాఞ్జోళై పిళ్ళై చరమదశ

ఒక రోజు నంబూద్రీలు అనంతపద్మనాభస్వామికి తిరువారాధనం చేస్తున్నారు, ఆ సమయాన విళాఞ్జోళైపిళ్ళై  తూర్పు ద్వారం గుండా దేవాలయం లోకి ప్రవేశించారు. ధ్వజస్తంభమును దాటి, శ్రీ నరసింహున్ని దర్శించి , ఉత్తరద్వారం ద్వారా గర్భగృహం దగ్గరకు ప్రవేశించారు, ‘ఓర్రై కాల్ మండప’ మెట్లు ఎక్కారు, పెరుమాళ్ దర్శనమిచ్చు మూడు ద్వారముల స్థలములోకి వచ్చారు, దానిలో ఎంపెరుమాన్ దివ్యపాదారవిందములు దర్శనమిచ్చు   గవాక్షం దగ్గర నిల్చున్నారు.

దీనిని గమనించిన నంబూద్రీలు ,విళాఞ్జోళైపిళ్ళై కులము కారణంగా, దేవాలయ ఆచారవ్యవహారాలనుసరించి వారిని గర్భగృహములోనికి రానీయకూడదని సన్నిధి తలుపులను మూసి బయటకు వెళ్ళిపోయారు.

అదే సమయంలో విళాఞ్జోళైపిళ్ళై శిష్యులు కొందరు దేవాలయమును సమీపించి ఇలా తెలిపారు- తమ ఆచార్యులగు విళాఞ్జోళైపిళ్ళై వారి ఆచార్యులగు పిళ్ళైలోకాచార్యుల తిరువడిని చేరారు, కావున వారి చరమతిరుమేనికి అలంకరించుటకు పెరుమాళ్ ‘తిరు పరివట్టం(తలకు చుట్టు పెరుమాళ్ వస్త్రం) , శేషమాల’ ఇవ్వమని అభ్యర్థించారు. వారు దేవాలయ ముఖద్వారం వద్ద నిల్చుని రామానుజనూట్ర్రందాది ఇయళ్ ను అనుసంధించసాగారు.

విళాఞ్జోళైపిళ్ళై  అనంతపద్మనాభస్వామి తిరువడి ని చేరారు.

తిరువాయ్ మొళి పిళ్ళై ఈ వార్తను  విని ఆచార్యునికి ఒక శిష్యుడు చేయవలసిన చరమ కైంకర్యమును మరియు తిరువధ్యయనమును  సాంప్రదాయాన్ని అనుసరించి చేశారు. ఈ ఘటన మారినేరినంబిగారికి పెరియనంబిగారు చేసిన బ్రహ్మమేధాసంస్కారమును  గుర్తుచేస్తుంది.

తిరువాయ్ మొళి పిళ్ళై అంతటివారే విళాఞ్జోళైపిళ్ళై యందు ఆచార్యభావనను ఉంచేవారు. దీనిని దృష్ఠిలో ఉంచుకొని వారి శిష్యులు ఇలా చెప్పారు.

పట్ఱాద ఎంగళ్ మణవాళ యోగి పదమ్ పణిన్దోన్

నర్ఱేవరాస – నలంతిఘళ్ నారణ తాదరుడన్
కఱారెన్  కూరక్కులోత్తమ తాదన్ కళల్ పణివోన్

మఱారుమ్ ఒవ్వా తిరువాయ్ మొళి పిళ్ళై వాళియే

 తిరువాయ్ మొళిపిళ్ళై గారు అనుగ్రహించిన  విళాఞ్జోళైపిళ్ళై  వాళి తనియన్:

వాళి నలన్తికళ్ నారణతాతనరుళ్

వాళి యవనముద వాయ్ మొళికళ్, -వాళియే
ఏఱు తిరువుడైయాన్ ఎన్దై యులకారియన్ శొల్,
తేఱు తిరువుడైయాన్ శీర్

వీరి తనియన్:

తులాహిర్బుధ్న్య సంభూతం శ్రీలోకార్య పదాశ్రితం |
సప్తగాథా ప్రవక్తారం నారాయణ మహం భజే ||

తులా మాసమున ఉత్తరాషాడ నక్షత్రమున అవతరించి,  శ్రీ పిళ్ళైలోకాచార్యుల శ్రీపాదపద్మములను ఆశ్రయించి, ‘సప్తగాథై'( శ్రీ వచనభూషణ సారము)  ప్రవర్తకులైన శ్రీ నారాయణ గురువులను/ విళాఞ్జోళైపిళ్ళై ను భజిస్తున్నాను.

ఆధారములు:

1. “మన్ను పుగళ్ మణవాళమామునివన్ ” రంగరాజన్ 2011.

2. “నిత్యానుసంధానం”- శ్రీవైష్ణవశ్రీ; శ్రీసుదర్శన ట్రస్ట్.

3.. పిళ్ళైలోకం జీయర్  యతీంద్ర ప్రవణ ప్రభావం- శ్రీ ఉ.వే డా|| వి.వి.రామానుజన్ ద్వారా ముద్రితం  1992, 2000, 2006

4. మూలం సప్తగాథై – http://acharya.org/sloka/vspillai/index.html అక్టోబర్ 27, 2012.

5. శ్రీ రామానుజ E – జర్నల్ ‘http://www.docstoc.com/docs/2437367/Sri-Ramanuja-E-Journal – అక్టోబర్ 27, 2012.

6. చిత్ర రూపకల్పన   శ్రీ సారథి తోతాద్రి స్వామి.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

Note: mUlam for saptha gAThai is available in Sanskrit, English, and Thamizh at: http://acharya.org/sloka/vspillai/index.html

సూచన:  సప్తగాథై కు  శ్రీ పిళ్ళైలోకం జీయర్ అనుగ్రహించిన ద్రావిడ వ్యాఖ్యానమునకు  డా||ఉ.వే ఈ.ఏ.శింగరాచార్య స్వామి వారు తెలుగు అనువాదంతో అనుగ్రహించిన కోశము ఉన్నది . కావలసిన వారు  శ్రీరామానుజ సిద్ధాంతసభ,  సికింద్రాబాద్,     నల్లా శశిధర్ రామానుజ దాసున్ని సంప్రదించగలరు.  9885343309

Source: https://guruparamparai.wordpress.com/2015/05/29/vilancholai-pillai/ (originally from http://acharyar.wordpress.com/2012/10/26/vilancholai-pillai-vaibhavam/)

1 thought on “విళాఞ్జోలైపిళ్ళై

  1. Pingback: 2015 – May – Week 5 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s