అప్పన్ తిరువేంకట రామానుజ ఎమ్బార్ జీయర్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

embar-jiyar

తిరు నక్షత్రము : సింహ మాసము, రోహిణి నక్షత్రము

అవతారస్థలము ; మధుర మంగళము

ఆచార్యులు ; కోయిల్ కందాడై రంగాచార్యస్వామి (చండమారుతమ్ దొడ్డయాచార్య తిరువంశము)

శిష్యులు ; అనేక మంది ఉన్నారు

పరమపదించిన స్థలము ; శ్రీ పెరుంబుదూర్

తిరువేంగడ రామానుజ ఎంబార్ జీయర్ క్రీ.శ .1805 లో మధుర మంగళములో అవతరించారు. వీరి తల్లిదండ్రులు రాఘవాచార్యార్, జానకి అమ్మాళ్. వీరు కృష్ణుడు అవతరించిన రోహిణి లోనే అవతరించినందున వీరికి తల్లిదండ్రులు కృష్ణన్ అని పేరు పెట్టారు. అంతేకాక పెరియ వాచ్చాన్ పిళ్ళై అవతరించినది కూడా ఈ నక్షత్రములోనే అవటము ఎంతో విశేషము.

వీరి తల్లిదండ్రులు సకాలములో నిర్వర్తించవలసిన వైదిక క్రియలు నిర్వర్తించారు. బాల్యము నుండి ఎంబెరుమాన్ మీద అపార ప్రేమ కలిగి వుండేవారు. ఆటలాడినా ఎంబెరుమాన్ విగ్రహములతోనే ఆడేవారు. భగవత్ విషయములో అధిక ఉత్సాహము చూపేవారు.

యుక్త వయసులో ఒకసారి వీరు తండ్రిగారితో కలసి ఒక యాత్రకు వెళ్ళారు. ఆ యాత్రలో వీరితో పాటుగ మరొక కుటుంబము కూడ వచ్చింది. భర్త అనేక మూటలతో పాటు బిడ్డను కూడా మోస్తూ నడవగా భార్య నిరంతరము ఏదో విషయము మీద భర్తతో వాదులాడు తుండేది. ఆయన ఆ భార్య మీదున్న ప్రేమతో మారుమాట్లాడక నడిచేవారు. ఆ సంఘటన చూసాక కృష్ణన్ తండ్రి గారితో తనకు వివాహము మీద ఆసక్తి లేదని కన్యాన్వేషణ చేయనవసరము లేదని చెప్పరు. తరువాత వీరి గ్రామమైన కాప్పియమురుకు శ్రీ కోయిల్ కందాడై రంగాచార్యులు వేం చేయగా వారి వద్ద పంచ సంస్కారములు పొంది వారి కృపచే సత్సాంప్రదాయ విషయములు గ్రహించి వారితో అనేక యాత్రలు చేస్తూ ఆచార్య కైంకర్యములోనే వుండేవారు.

ఒకసారి వీరు తిరువేంగడములో నుండగా ఎంబారు కలలో కనిపించి మధుర మంగళమునకు రమ్మని పిలిచారు. వస్తూ ఒక శాలువ తెమ్మని తనకు చాలా చలిగా వుందని చెప్పారు. అప్పుడు కృష్ణమాచార్యులు శ్రీ వేంకటేశ్వరుని అనుమతి కోసము వెళ్ళి విషయమును వివరించారు. స్వామి అనుమతితో పాటు తన శాలువాను కూడా అనుగ్రహించగా కృష్ణమాచార్యులు భక్తితో మధుర మంగళము చేరుకొని ఎంబారుకు సమర్పించారు. ఎంబారు అనుగ్రహముతో వీరికి సన్యాసాశ్రమము స్వీకరించాలన్న కోరిక కలిగింది. తిరువేంగడములో వేంచేసి వున్న వకుళా భరణ జీయర్ (పెరియజీయర్) ను ఆశ్రయించి తనకు సన్యాసాశ్రమము అనుగ్రహించమని ప్రార్థించగా వారు ఇంత చిన్న వయసులో తగదని చెప్పారు. అయినా వీరు తమ పట్టు వదల లేదు. తిరుమలవాసుడు అనుగ్రహిస్తే తప్పక స్వీకరించ వచ్చని చెప్పి స్వామి సన్నిదికి బయలుదేరారు జీయరు. దారిలో వారికి ఒక త్రిదండము కనపడింది. వంగి దానిని తీసుకోగానే పెరుమాళ్ళు  కృష్ణమాచార్యులకు సన్యాసాశ్రమము అనుగ్రహించమని చేప్పిన్నట్లు అనిపించింది.పెరియ జీయరు వీరికి సన్యాసాశ్రమము అనుగ్రహించారు. కృష్ణమాచార్యులకు తిరుమల వాసుడి మీద వున్న భక్తి తెలిసినవారైనందు వలన వీరికి తిరువేంకట రామానుజ జీయర్ అన్నపేరును అనుగ్రహించారు. తరువాత మధుర మంగళమునకు వెళ్ళి ఎంబారుకు కైంకర్యము చేయటము వలన వీరిని మధుర మంగళమ్ ఎంబార్ జీయర్ అని పిలిచేవారు.

1st_embArjIyar_with_thirumalai_jIyar

తిరుమల జీయర్ మఠములో ఉన్న చిత్రము తిరుమలై జీయర్ మరియు ఎంబార్ జీయర్

కృష్ణమాచార్యులకు తిరుమల వాసుడి మీద వున్న భక్తి తెలిసినవారైనందు వలన వీరికి తిరువేంకట రామానుజ జీయర్ అన్నపేరును అనుగ్రహించారు. తరువాత మధుర మంగళమునకు వెళ్ళి ఎంబారుకు కైంకర్యము చేయటము వలన వీరిని మధుర మంగళమ్ ఎంబార్ జీయర్ అని పిలిచేవారు.

అనేక దివ్య దేశములు సందర్శించిన తరవాత ఎమ్పెరుమానార్ అవతార స్థలమైన శ్రీ పెరుంబదూరులో కైంకర్యము చేసారు. వీరి శిశ్యులు అక్కడ వీరికి ఒక మఠమును ఏర్పాటు చేసారు. అక్కడే వేంచేసి కైంకర్యము చేసారు.

temple

ఆదికేశవ పెరుమాళ్ మరియు భాష్యకారర్ గుడి – శ్రీ పెరుంబదూర్

embar-jiyar-mutt

ఎంబార్ జీయర్ మఠము, మణవాళ మాముణుల కోయిల్ వీధి, శ్రీ పెరుంబదూర్

శ్రీ పెరుంబదూరులో వుండగా ఎందరో శ్రీ వైష్ణవులు సత్సాంప్రదాయములో లోతులు తెలుసు కోవటానికి వీరిని ఆశ్రయించేవారు. వీరు కూడా చాలా చక్కగా పూర్వాచార్య శ్రీ సూక్తులను వివరించేవారు. ఆకాలములో అక్కడ నుండి ఏందరో విద్వాంసులు రూపుదిద్దుకున్నారు.

వీరు లీలావి భూతిలో అతి తక్కువ కాలము (77 సం) మాత్రమే వుండి విష్ణు వర్షము కృష్ణ పక్షము త్రయోదశి తిధి నాడు నిత్య విభూతిని చేరుకున్నారు.

వీరి రచనలలో ముఖ్యమైనది పిళ్ళై లోకాచార్యుల శ్రీ వచన భూషణమునకు మాముణులు చేసిన వ్యాఖానమునకు అరుమ్పదమ్ (విస్తృత వివరణ). కేవలము గ్రంధ రచన కాక వీరు శాస్త్రములో చెప్పిన విధముగా జీవించి చూపారు. ఇదే కాక ఇంకా ఎన్నో సత్సాంప్రదాయములకు సంబంధించిన గ్రంధములను రచించారు.

బ్రహ్మాండము యొక్క నిర్మాణమును గురించి విష్ణు పురాణము, తత్వ త్రయము, యతీంద్ర మత దీపికల ఆధారముతో ఎంతో చక్కగా వివరించారు. దానిని ఈ మధ్య కాలములో శ్రీ రవి అనే శ్రీ వైష్ణవులు బొమ్మల ఆధారముతో పునర్ముద్రించారు.

embar-jiyar-portrait

తిరువేంకట రామానుజ ఎమ్బార్ జీయర్ స్వామి ఊహా చిత్రము

brahmandam

బ్రహండము – బ్రహ్మ యొక్క ప్రపంచమును చిత్రము ద్వారా వివరించుట

వీరి రచనలు:

 1. శ్రీ వచన భూషణమునకు అరుమ్పదమ్
 2. సిదోపాయ సుదరిశనము
 3. సద్దరిశన సుదరిశనము
 4. దుద్దరిశన కరిశనము
 5. విప్రతిపత్తి నిరసనము
 6. నమ్మాళ్వార్ శ్రీ సుక్తి అయిన “చెత్తత్తిన్ …” కు వ్యాఖ్యానము
 7. శరణాగతిక్కు అదికారి విశేషణత్వ సమర్తనము
 8. జ్యోతిశ పురాణన్గళుక్కు ఐక కన్ట్య సమర్తనము
 9. దురుపదేశదిక్కారము
 10. శరణ శబ్దార్థ విచారము
 11. శ్రుతప్రకాశికా వివరణము
 12. ముక్తిపదశక్తి వాదము
 13. బ్రహ్మపదశక్తి వాదము
 14. భూగోళ నిర్ణయము
 15. త్యాగశబ్దార్థ టిప్పణి
 16. గీతార్థ టిప్పణి
 17. కైవల్య శతదూశణి
 18. శ్రీరామానుజ అష్టపతి
 19. సిదాంత తూలికై
 20. సిద్దోపాయ మంగళ దీపికై
 21. దర్మగ్యా ప్రామాణ్య ప్రకాశికై
 22. సిద్దాన్థ పరిభాశై
 23. శ్రీ రామానుజుల దివ్య అవతారమును గురించి – తిరుమంజన కట్టియమ్ మొదలగునవి

అప్పన్ తిరువేంకట రామానుజ ఎమ్బార్ జీయర్ జీవితములోని కొన్ని విశేషాలను తెలుసుకున్నాము. వీరు తమ రచనల ద్వారా సంప్రదాయమునకు ఎంతో సేవ చేసారు. వీరి శ్రీ పాదములను ఆశ్రయించి మనము కూడా, భగవత్, భాగవత / ఆచార్య విషయములో ఙ్ఞానము, భక్తి పొందుదాము.

అప్పన్ తిరువేంకట రామానుజ ఎమ్బార్ జీయరు తనియన్:

శ్రీవాదూల రమాప్రవాళ రుచిర స్రక్సైన్య నాతాంశజ
శ్రీకుర్వీంద్రమ్ మహార్య లభ్ద నిజసత్ సత్తమ్ శ్రుతాభీష్టతమ్
శ్రీరామానుజ ముఖ్య దేశికలసత్ కైంకర్య సంస్తాపకమ్
శ్రీమత్వేంకటలక్ష్మణార్య యమినమ్ తమ్ సద్గుణమ్ భావయే

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://guruparamparai.wordpress.com/2013/08/28/sriperumbuthur-first-embar-jiyar/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/2012/08/17/introduction-contd/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

4 thoughts on “అప్పన్ తిరువేంకట రామానుజ ఎమ్బార్ జీయర్

 1. Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu

 2. Pingback: 2014 – Sep – Week 4 | kOyil

 3. srinivas

  Adiyen,
  Great information with photos and extremely happy. Small request any related to srivaishnava sampradaya stories of swamy’s ( achauyulu ) in telugu please email me at: pudathusrinivas@gmal.com

  SRIKRISHNA PAADA DHULI RENU

  p.srinivas

  Reply
 4. Pingback: appan thiruvEnkata rAmAnuja embAr jIyar | srIvaishNava guruparamparai

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s