శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

పిళ్ళై లోకమ్ జీయర్ – తిరువల్లిక్కేని
తిరు నక్షత్రము :చైత్ర మాసము, శ్రవణ నక్షత్రము
అవతారస్థలము :కాంచీపురము
ఆచార్యులు: శఠకోపాచార్యులు
రచనలు: తనియన్ వ్యాఖ్యానములు, రామానుజ దివ్య చరిత్ర, యతీంద్ర ప్రవణ ప్రభావము, రామానుజ నూత్తందాది వ్యాఖ్యానము, కొన్ని మాముణుల శ్రీ సూక్తుల వ్యాఖ్యానము, కొన్ని రహస్య గ్రంథముల వ్యాఖ్యానము, శెయ్య తామరై తాళినై వ్యాఖ్యానము (మాముణుల వాళి తిరునామములు), శ్రీవైష్ణవ సమయాచార నిష్కర్షము.
మాముణుల అష్ట దిగ్గజములలో ఒకరైన పరవస్తు పట్టర్పిరాన్జీయర్ మునిమనవలుగా కాంచీపురములో మేష మాసములో శ్రవణా నక్షత్రము నాడు అవతరించారు. వీరికి జన్మ నామము వరదాచార్యులు. తరువాతి కాలములో పిళ్ళై లోకమ్ జీయరనీ, పిళ్ళై లోకాచార్య జీయరనీ ప్రసిద్ధి గాంచారు.
తిరుక్కడల్ మల్లై (మహా బలిపురము) లోని కోవెలను పునరుద్ధరించి నిత్య కైంకర్య పద్ధతిని పునర్వ్యవస్థీకరించారు. ఆకాలపు రాజు సంతోషముతో వీరిని సన్మానించారు. ఈనాటికి వీరి వంశస్తులకు అక్కడ ప్రత్యేక మర్యాదలు అందుతున్నాయి.
వీరి జీవిత విశేషాలు ఎక్కువగా లభ్యమవటము లేదు. కాని వీరి రచనల ద్వారా వీరు గొప్ప ఙ్ఞాని అని తెలుస్తున్నది. వీరి గ్రంథములు మన సంప్రదాయమునకు చాలా విలువైనవి.
కొన్ని శిలాశాసనముల ద్వారా దివ్య దేశాములకు వీరు అందించిన కృషిని తెలుస్తుంది
1. క్రీ.శ.1614 లో తిరుక్కడల్మల్లై దివ్యదేశాములో వేయ బడ్డ రాగి శాసనములో యతీంద్ర ప్రవణ ప్రభావము పిళ్ళై లోకమ్ జీయరని వీరి ప్రస్తావన కనపడుతుంది. (వీరు అప్పటికే రచించిన మణవాళ మాముణుల చరిత్ర ద్వారా ప్రఖ్యాతి గాంచి, అదే పేరుతో పిలవ బడుతున్నారని తెలుస్తుంది)
2. క్రీ.శ.1614 లో శ్రీ రంగము కోవెలలో రెండవ ప్రాకారములో వేయబడ్డ శిలా శాసనములో వీరిశిష్యులు ఒక్కరు ఎమ్పెరుమానార్ ఉత్సవము కొరకు చక్కర పొంగలి కోసము 120 బంగారు నాణెములు ఇచ్చినట్లు చెక్కబడినది.
చాలా దివ్య ప్రబంధ తనియన్లకు వ్యాఖ్యానములు చేసారు. తనియన్ వ్యాఖ్యానము ద్వారా ఆ ప్రబంధములో ఆళ్వార్ల మానసిక స్థితి గురించి అవగాహన అవుతుంది.

ఎమ్పెరుమానార్ – శ్రీ పెరుమ్బుదూర్
ఎమ్పెరుమానార్ జీవిత చరిత్రము సుందరముగా రామానుజార్య చరిత్ర రచించారు. వారి అనేక యాత్రలు, వారి శిష్యుల తో కూడిన వారి చరిత్రము చక్కగా రాసారు.

నమ్పెరుమాళ్ మణవాళ మామునులకు శ్రీ శైలేశ తనియన్ అందిచు దృశ్యము
యతీంద్ర ప్రవణములో మాముణుల జీవిత విశేషాలు, ఉపదేశాలతో పాటు పెరియవాచ్చాన్ పిళ్ళై, వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, తిరువాయ్మొళి పిళ్ళైల జీవిత విశేషాలను మనస్సుకు హత్తుకునేలాగ వివరించారు.
పై రెండు ప్రబంధాలలో చాలా పాశురాలను ఉదహరించారు. వాటి ద్వారా తమిళ భాషలో వారికి గల పాండిత్యము తెలుస్తుంది.
కొన్ని రహస్య గ్రంథములకు వ్యాఖ్యానము చేసారు.
విళాంచోలై పిళ్ళై అనే ఆచార్యులు రచించిన “సప్తగాథ” కు చక్కటి వ్యాఖ్యానము చేసారు. సప్తగాథ పిళ్ళై లోకాచార్యులు రచించిన శ్రీ వచన భూషణమున యొక్క సారార్థము – ఆచార్య నిష్ఠను వెలువడ చేస్తుంది.
మాముణుల “ఉపదేశరత్నమాల, తిరువాయ్మొళి నూత్తందాది, ఆర్తి ప్రబంధము సంగ్రహ వ్యాఖ్యలను రాసారు.
శ్రీ వైష్ణవ సమయాచార నిష్కర్ష అనే గ్రంథములో ఎమ్బెరుమానార్ దర్శనములోని ప్రధాన విషయాలను క్రోడీకరించారు. దీనిలో వీరు చూపిన ప్రమాణాలను చూడగా వీరి అఘాద ఙ్ఞాన సంపద ద్యోతకమవుతుంది.
పైవిషయాల ద్వారా పిళ్ళై లోకమ్ జీయరు సంప్రదాయ పరిరక్షణ కోసము చేసిన కృషి తెలుసుకున్నాము. పూర్వాచార్యుల శ్రీ సుక్తులకు వ్యాఖ్యానములు మరియు ఎమ్పెరుమానార్ , మణవాళ మాముణుల అద్భుత జీవిత చరిత్రము రచించి శ్రీ వైష్ణవ సంప్రదాయమునకు మహా ఉపకారము చేసారు. మనకు కూడా పూర్వాచార్యుల మీద భక్తి , ప్రపత్తి కలగాలని వారి శ్రీ చరణాలను ఆశ్రయించుదాము.
పిళ్ళై లోకమ్ జీయరు తనియన్ (యతీంద్ర ప్రవణము)
శ్రీ శఠారి గురోర్దివ్య శ్రీ పాదాబ్జ మధువ్రతమ్
శ్రీమత్ యతీంద్ర ప్రవణమ్ శ్రీ లోకార్య మునిమ్ భజే
అడియేన్ చక్రవర్తుల చూడామణి దాసి
మూలము: http://guruparamparai.wordpress.com/2013/04/08/pillai-lokam-jiyar/
పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/2012/08/17/introduction-contd/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu
Pingback: 2014 – Aug – Week 5 | kOyil
Pingback: అమలనాదిపిరాన్ | dhivya prabandham
Pingback: అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ | guruparamparai telugu
Pingback: తిరుప్పళ్ళి యెళిచ్చి | dhivya prabandham
Pingback: lOkArya muni (piLLai lOkam jIyar) | guruparamparai – AzhwArs/AchAryas Portal
Pingback: ఆర్తి ప్రభందం – dhivya prabandham