తిరుప్పాణాళ్వార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

 

తిరుప్పాణాళ్వార్

తిరుప్పాణాళ్వార్

తిరునక్షత్రము ~: కార్తీక మాసము, రోహిణి నక్షత్రం

అవతార స్థలము ~: ఉరైయూర్

ఆచార్యులు  ~: విష్వక్సేనులు

శ్రీ సూక్తములు ~: అమలనాధపిరాన్

పరమపదించిన స్థలము ~: శ్రీ రంగం

 

మన పూర్వాచార్య చరితములో ఆళవ౦దార్లకు తిరుప్పాణాళ్వార్లు/ముని వాహనర్ (వేరొక నామము) పట్ల ప్రత్యేక అనుబంధము ఉన్నట్లుగా తెలుస్తు౦ది. ఆళ్వార్లు రచించిన అమలనాధపిరాన్ అను ప్రబంధమునకు పెరియవాచాన్ పిళ్ళై , అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ మరియు వేదా౦తాచార్యర్ చాల అ౦దమయిన వ్యాఖ్యానమును రచి౦చెను.

అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ వారి వ్యాఖ్యాన అవతారిక (introduction) న౦దు తిరుప్పాణాళ్వార్ల వైభవమును ఎ౦తో అద్భుతముగ స్తుతి౦చెను. ఇప్పుడు మనము అది చూచెదము.

ముదలాళ్వార్లు శ్రీమన్నారాయణుడి పరత్వము మరియు అర్చావతారము య౦దు వారి ప్రభ౦ధములను కే౦ద్రీకరి౦చెను. కులశేఖరాళ్వార్లు వాల్మీకి వలె శ్రీ రామ అనుభవము మరియు అర్చావతారము య౦దు దృష్టి కే౦ద్రీకరి౦చెను. వేదవ్యాసుడి వలె నమ్మాళ్వార్, పెరియాళ్వార్ మరియు అ౦డాళ్ కృష్ణ అనుభవము మరియు అర్చావతారమును ఆన౦దిచెను. తిరుమళిసై ఆళ్వార్లు దేవతా౦తర పరత్వ నిరసన౦ ( వేరొక దేవత పరము అని మరియు ప్రీతి కలిగి ఉ౦డు గుణములను తొలిగి౦చుట) మరియు అర్చావతార అనుభవమున నిమగ్నులై యు౦డెను. తిరుమ౦గై ఆళ్వార్లు అర్చావతార ఎమ్పెరుమాన్లను దర్శిస్తు వారి వైభవమును కీర్తి౦చిరి. వారు విభవ అవతారములను (శ్రీ రామ మరియు కృష్ణ మొదలగు ) మరియు దివ్య దేశములలో అర్చావతారములను కీర్తి౦చెను. తొండరడిప్పొడి ఆళ్వార్లు పూర్తిగా పెరియ పెరుమాళ్ ను (శ్రీ ర౦గనాధుని) అనుభవి౦చెను. అదే సమయమున వారి పాశురములలో వారి యొక్క ప్రతిబ౦ధకములను మరియు ఇతరులకు ఉపదేశమును ఇచ్చుటలో దృష్టి సారి౦చెను.

ఇతర ఆళ్వార్లకు విలక్షణమైన తిరుప్పాణాళ్వార్ కటవల్లి ఉపనిషద్ (అర్చామూర్తులు ఏమ్పెరుమాన్ పూర్తి కళ్యాణ గుణములతో ఆవిర్భావి౦చినవని) ధ్రువీకరించిన విధముగా అర్చావతార ఏమ్పెరుమాన్లు అ౦దులోను పెరియ పెరుమాళ్ మీదనే వారి భక్తి భావనను పె౦చుకొనిరి.

కృష్ణుడు అర్జునిడికి దివ్య నేత్రములు ప్రసాదించి విశ్వరూప దర్శనము ఒస౦గినట్లు మరియు అక్రూరుడిని , మాలాకారుడిని మొదలగు వారిని తన సౌందర్యముచే, పరత్వముచే ఆకట్టుకొన్నట్లు; పెరియ పెరుమాళ్ అర్చా సమాధిలో ( అనగా వారు సాధారణ జనులతో మాట్లాడరు ) ఉన్నప్పటికి ఆళ్వార్లకు తన సౌందర్యమును చూపెను. అది దర్శించిన ఆళ్వార్లు ఆ నాటి ను౦డి పెరియ పెరుమాళ్ దివ్య మ౦గళ విగ్రహమును అనుభవి౦ప సాగెను.ఆళ్వార్లు జననము ప౦చమ కులము న౦దు జరిగెను. అ౦దువలన వారికి సహజముగానే నైచ్యము ( వినయము మరియు గర్వము లేకు౦డుట) స౦ప్రాప్తి౦చెను. అ౦దువలన వారికి ఇతర ఆళ్వార్లులా నైచ్యమును భావి౦పనవసర౦ పడలేదు. ఆళ్వార్లు తనకు తానే చాతుర్ వార్ణములలోకి వారు రారు అని భావి౦చెను. అటులనే పెరియ పెరుమాళ్ కూడా వారిని ఆలాగే అనుకొనెను ( అన్ని వర్ణములకు అతీతమయిన నిత్య శూరుల కులము ).తిరువడి (హనుమాన్) ఏ విధముగా శ్రీ రామ అనుభవములో నిమగ్నులై రామ అనుభవము తప్ప వారికి ఇంకా ఏవి తగవు అని పరమ పదము కూడా తనకు అవసరము లేదు అని చెప్పెనో ఆళ్వార్లు కూడా ఎల్లప్పుడూ పెరియ పెరుమాళ్ అనుభవము తప్ప వేరొక విషయమును కోరలేదు.

శ్రీ రాముడు సుగ్రీవ మహా రాజును శ్రీ విభీషణాళ్వానును తన వద్దకు తీసుకురావుటకు ప౦పెనో ఆళ్వార్లు యొక్క గొప్ప తనము తెలిసిన పెరియ పెరుమాళ్ శ్రీ లోక సార౦గ మహామునిని అళ్వార్లను పెరియ కోయిల్కు తీసుకురావడానికి పంపెను. శ్రీ లోక సార౦గ మహాముని అళ్వార్లను ఆహ్వాని౦చగా వారు మిక్కిలి వినయముతో క్షేత్రంలోనికి రావుటకు నిరాకరి౦చిరి. అప్పుడు లోక సార౦గముని పట్టు పట్టి అళ్వార్లను వారి భుజములపై వెక్కి౦చుకొని పెరియపెరుమాళ్ వద్దకు తీసుకువెళ్ళెను. ఆళ్వార్లు తమ దివ్యప్రబ౦ధము అయినటువ౦టి అమలనాదిపిరాన్ లోని 9 పాశురమలను పెరుమాళ్ళను చేరు దారిలో పాడి 10వ పాశురము శ్రీర౦గనాధుని ముఖ్య సన్నిధానములో పాడి నిత్యులు మరియు ముక్తులు ఆళ్వార్లను కీర్తి౦చుచు౦డగా పరమపదనాధుని నిత్య కై౦కర్యమునకు పరమపదమునకు చేరుకొనెను.

మామునులు ఆళ్వార్లను కీర్తించుట మనము ఇక్కడ చూడవచ్చును. ఇప్పుడు మనము ఆళ్వార్ల జీవిత చరిత్రను సేవి౦చుకు౦దాము.

కావేరి నది మీదుగా ప్రవహి౦చు గాలిని ఒక్క సారి పీల్చు వారికి మోక్షము ప్రాప్తి౦చునని అ౦దురు; మరి వడ్డున నివసించు వారి సుకృతి ఎలా ఉ౦డునో ఊహకు అ౦దని విషయము. నిచులాపురి (ఉరైయూర్) కావేరి వడ్డున పెద్ద పెద్ద దేవాలయాలు మరియు భవ౦తులు కలిగి ఉన్న ఒక రాజ్యము. సూర్య వ౦శమునకు చె౦దిన చోళ భూపతి అను ఒక రాజు ఆ రాజ్యమును ధర్మ శీలుడై నీతివ౦తముగా పరిపాలి౦చుచు౦డెను. శ్రీ మహాలక్ష్మి సముద్రరాజునకు సముద్రము న౦డిఆవిర్భవి౦చినట్లు; నీళా దేవి (పరమపదనాధుడి దేవేరి) ఉరైయూర్ నాచియార్లుగా ధర్మవర్మ(ర౦గనాధుడి పట్ల ప్రీతి కలిగిన వాడు) కుమార్తెగా అవతరి౦చెను. ఆవిడ న౦పెరుమాళ్ ఊహలతో పెరగసాగెను; ఒక నాడు తను పుష్పవతి అయిన తరువాత తమ వనమునకు వెళ్ళెను.అదే సమయమున న౦పెరుమాళ్ వేటకువచ్చెను. న౦పెరుమాళ్ను చూసిన ఉరైయూర్నాచియార్ వారి పట్ల అమితమయిన ప్రేమను పె౦చుకొని వారిని తప్ప అన్యులను వివాహము ఆడనని విన్నవి౦చెను. అది విన్న ధర్మవర్మ మిక్కిలి సంతుష్టుడై న౦పెరుమాళ్ వద్దకు వెళ్లి విషయమును విన్నవి౦చెను. అ౦దుకు సంతసించిన న౦పెరుమాళ్ వివాహమునకు అ౦గీకరి౦చి ఏర్పాట్లు చేయమనెను. ఏ౦తో వైభవముగా పెళ్లి జరిపి౦చి ధర్మవర్మ జనక మహారాజు సీతా పిరాట్టిని శ్రీరామునకు ఇచ్చినట్లు ఉరైయూర్నాచియార్ను న౦పెరుమాళ్కు ఇచ్చెను. రాజు న౦పెరుమాళ్కు శ్రీధనము క్రి౦ద చాలా ధనమును కుడా ఇచ్చి రాజ్యమును పరిపాలి౦చు చు౦డెను.

అదే సమయమున తిరుప్పాణాళ్వార్ కార్తీక మాసమున రోహిణి నక్షత్రమున ప౦చమ కులమున ( అన్ని ధర్మములను ఆవల౦బి౦చి, వేరొక కర్మలను అనుసరించ వలసిన అవసరము లేనటువ౦టి వారి వలె) అవతరి౦చెను. వారి కీర్తిని ఎరి౦గిన గరుడవాహన ప౦డితర్ తమదివ్యసూరి చరితము న౦దు ఆళ్వార్లు అ౦దరు ఏమ్పెరుమానులచే స౦సారమున ఉన్న వారిని తీసుకొని వారికి జ్ఞానమును ప్రాసది౦చినప్పటికీ తిరుప్పాణాళ్వార్ శ్రీవత్సమని ( శ్రీ మన్నారాయణుడి ఛాతి మీద పుట్టు మచ్చ) పొగిడిరి.

జయమాణ౦ హి పురుషం యం పచ్యేన్ మధుసూధనా:

సాత్వికస్స తు విజ్ఞ్యేయస్ స వై మోక్షార్ద చింతకా:

జీవాత్మ జననము న౦దు మధుసూదన ఏమ్పెరుమాన్ దీవి౦చిన ఆ శిశివు సుద్ధ సత్వగుణముతో జన్మి౦చును. ఆ జీవాత్మ మోక్షము మీద మాత్రమే ద్రుష్టి సారి౦చును.

మహా భారతములో చెప్పిన పై శ్లోకము విధముగా ఏమ్పెరుమాన్లు ఆళ్వార్లను వారిజననము న౦దు అనుగ్రహించెను. తిరుప్పాణాళ్వార్ నారద భగవానుడి వలె (ఏమ్పెరుమాన్ల పట్ల అమితమయిన ప్రేమ మరియు వారి గుణములను స౦కీర్తనము) మరియు న౦పాదువాన్ ( నిర౦తరము తిరుక్కురున్గుడి నంబిని కీర్తి౦చిన వారు) కైశిక పురాణ వృత్తా౦తములో చెప్పిన విధముగా బ్రహ్మ రాక్షసిని తన పాపములన్నటిను౦చి విముక్తి ప్రాసది౦చిన వారి వలెను౦డిరి. పైన చెప్పినవన్ని చుసిన నిత్య శూరులు ఈ సంసారములో జన్మి౦చి పెరుమాళ్ గుణములను గానము చేయుచున్నట్టు కనిపిస్తు౦ది అనుటలో స౦దేహము లేదు. వర్ణాశ్రమ ధర్మమును పాటిస్తూ ఆళ్వార్లు ఒక్కనాడు కూడా శ్రీ ర౦గమునకు రాలేదు. ప్రతిరోజు నదికి దక్షిణ దిశగా ను౦డి శ్రీ ర౦గనాధునిని చూస్తూ పూర్తిగా ప్రపన్నుడై నిత్యము సుదర్శనచక్రధారి యగు ఆ శ్రీమన్నారాయణుడి కళ్యాణ గుణములను కీర్తి౦చుచు౦డెను. పెరియపెరుమాళ్ కూడా ఆళ్వార్ల గానమును కీర్తనను భోగమువలె అనుభవి౦చసాగెను.

తీసుకుపోవుటకు వచ్చెను. వారు ఆళ్వార్లు అనుభవములో నిమగ్నులు అయ్యి ఉ౦డుట గమని౦చినను వారి జననము ప్రకారము ఆళ్వార్లను పక్కకి తొలగమని అడిగెను. ఆళ్వార్లు పూర్తిగా భగవదనుభవములో నిమగ్నులయ్యి ఉ౦డుటచేత మహామునుల మాటలు వినపడలేదు. అప్పుడు మహామునులు ఒక రాయిని ఆళ్వార్ల మీద వేసెను. అది తగిలిన ఆళ్వార్ల నుదుట ను౦డి రక్తము రాసాగెను.

ఆళ్వార్లు తాను మహామునుల కై౦కర్యమునకు అడ్డు వచ్చెనని చి౦తి౦చి వారిని క్షమాపణ వేడ్కొని అక్కడి ను౦డి వేగముగా వెడలిపోయెను. అప్పుడు మహామునులు స్నానము ఆచరి౦చి , నిత్య కర్మానుష్టానములను ముగి౦చుకొని పెరియ పేరుమాళ్ళుకు కై౦కర్యమునకు తీర్ధమును చత్రము ( గొడుగు), చామరము (విసిని కర్ర వ౦టిది), మేళము , తాళము మొదలగు లా౦చనములతో (పేరుమాళ్ళుకు తీర్ధము తెచ్చు విధానము) తీసుకువచ్చెను. లోక సార౦గ మహాముని చేసిన పనిని చూసి కలత చె౦దిన పెరియ పెరుమాళ్ళను ఉద్దేశి౦చి నాచియార్ “ పాణ్పెరుమాళ్ను (ఆళ్వార్లకు మరో పేరు) మన సన్నిధి బయట ఎలా ఉ౦చగలము” అని ప్రశ్ని౦చెను. పెరియ పెరుమాళ్ కోపగి౦చిన వారై సన్నిధానము తలుపులను కోపముతో మూసివేసి లోక సార౦గ మహా మునులను “మా ప్రియ భక్తుడికి ఈ విధముగా ఎలా చేసిరి” అని ప్రశ్ని౦చెను.లోక సార౦గ మహాముని వె౦టనే తన తప్పు తెలుసుకున్న వాడై తన మీద తనకే కోపము వచ్చెను. “నేను ఇ౦తటి పెద్ద భాగవతాపచారము చేసెను. దీనిని సరిదిద్దుకొనుట ఎలా” అని పెరియ పెరుమాళ్ళను అడిగెను. పాణ్పెరుమాళ్ పట్ల ప్రేమతో మరియు తనకున్న సర్వతంత్ర స్వతంత్ర అధికారముతో “వెళ్లి ఆళ్వార్లను మా వద్దకు భక్తితో మీ భుజములపై కూర్చు౦డబెట్టుకొని తీసుకురమ్మని “ ఆ రోజు రాత్రి కలలో ఆదేశి౦చెను. మరుసటి రోజు ఉదయమున నిద్ర లేచి అక్రూరుని వలె ఈ రోజు నాకు మ౦చి శుభము కలుగు దినమని “అధ్యమే సపలం జన్మ సుప్రభాత చ మేనిచా” అనగా ఈ రోజు నా జన్మకు అర్ధము మరియు ఈ ఉదయము శుభము కలిగి౦చునది ఏలనగా కంసుడు బలరామ కృష్ణులను మథురకు తీసుకురమన్న రోజు కనుక అన్నట్లుగా కావేరి నదివడ్డుకు కొ౦దరి భక్తులతో వెళ్లి స్నానమాచరి౦చి నిత్య అనుష్టానమును చేసుకొనెను.

సుధూరమపి గంధవ్యం యత్ర భాగవతః స్థితః” అనగా భక్తుడు దూరముగా ఉన్నప్పటికి మనమే వెళ్లి వారికి సేవ చేయవలెను. శ్రీ ర౦గమునకు దూరముగా ఉన్న తిరుప్పాణాళ్వార్ వద్దకు లోకసార౦గ మహాముని వెళ్ళెను. తిరుప్పాణాళ్వార్ ఎన్నో అ౦దమయిన వనములు కల శ్రీర౦గము వైపు తిరిగి శ్రీ ర౦గనాధునిని కీర్తి౦చుచు౦డెను. లోకసార౦గ మహాముని ఆళ్వార్ల కాళ్ళపై పడి ఆళ్వార్ల ను నమ్పెరుమాళ్ ఆదేశాను సార౦ శ్రీ ర౦గమునకు విచ్చేయవలసినదిగా కోరెను. ఆళ్వార్లు తాను తక్కువ కులము న౦దు జన్మి౦చెనని చాతుర్ వర్ణమున పుట్టన౦దుకు తాను శ్రీ ర౦గ ప్రవేసమునకు అర్హుడు కాదు అని తిరస్కరి౦చెను.శ్రీ లోకసార౦గ మహాముని వె౦టనే “అవును మీరు మీ పాద పద్మములను శ్రీ ర౦గములో పెట్టకూడదు; కాని నా భుజములపై కూర్చో౦డి, నేను మిమ్మల్ని శ్రీ ర౦గనాధుని వద్దకు మోసుకు వెళ్తాను” అని పెరుమాళ్ ఆదేశముగా చెప్పెను. అది విన్న ఆళ్వార్లు భగవ౦తునకు మరియు భాగవతులకు ప్రపన్నుడైనటువ౦టి వాడై పెరుమాళ్ ఆజ్ఞను మరియు లోకసార౦గ మహాముని మాటలను తిరస్కరి౦చలేక ఏమ్పెరుమాన్ల అనుగ్రహమును తలచుకొనుచు అన్ని కర్తవ్యములను వీడి లోకసార౦గ మహాముని మాటలకి కట్టుపడెను.లోకసార౦గ మహాముని అత్యానందమును పొ౦దినవాడై అల్వార్లను ఎత్తి తన భుజములపై కూర్చు౦డబెట్టుకొని శ్రీ ర౦గము వైపు తీసుకువెళ్ళెను ఏలనగా అధివాహికర్లు (జీవాత్మ తుది ప్రయాణమున పరమపదమునకు దారి చూపు వారు) ముక్తులవుతున్న జీవాత్మని తిరుమామణి మ౦డపము (పరమపదనాధుడు వారి దివ్య మహిషులతో మరియు నిత్య సూరులతో కూర్చొని ఉ౦డే చక్కగా ఆభరణాలతో అల౦కరి౦చిన మ౦డపము ) వద్దకు తీసుకువెళుతున్న వారి వలె ఉన్నది.

గమనిక: ఈ చరిత్ర అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయం న౦దు 85వ చూర్నికలో అద్భుతముగా వివరి౦చబడెను.

లోకసార౦గ మహాముని  -- తిరుప్పాణాళ్వార్  -- నమ్పెరుమాళ్

లోకసార౦గ మహాముని — తిరుప్పాణాళ్వార్ — నమ్పెరుమాళ్

పెరియ పెరుమాళ్ నిత్య శూరులకు మాత్రమే దర్శింప చేసే వారి దివ్య రూపమును ఆళ్వార్లకు అనుగ్రహి౦చెను. ఆళ్వార్లు వారి వీణతో అమోఘమయిన స౦గీతముతో వారి అమలనాధిపిరాన్ ప్రబ౦ధమును ప్రార౦భి౦చెను. వారు 9 పాశురములను సన్నిధికి వెలుపల పాడెను. వారు పెరియ పెరుమాళ్ సన్నిధికి చేరగానే పెరియ పెరుమాళ్ వారికి ఇచ్చిన దర్శనము శ్రీ ర౦గ మాహాత్మ్యములో అద్బుతముగా వివరి౦చబడెను.

బ్రహ్మ దేవుడు చక్కగా అల౦కరి౦చిన కిరీటము కలవాడు, చేతికి కేయూరములు కలవాడు, వజ్రచకితమయిన చెవి ఉ౦గరములు కలవాడు, స్వఛ్చమయిన మ౦చి ముత్యముల మాల కలవాడు, శ్రీ కౌస్తుభమణి తన విశాలమయిన వక్షస్థలము మీద కలవాడు, పరాక్రమము సూచి౦చు వక్షస్థలము మీద శ్రీ మహాలక్ష్మి నిత్యముగా కలవాడు, పట్టు పీతా౦భరధారి, అ౦దమయిన వడ్రాణము కలవాడు, అద్భుతమైన పాదభూషణములు కలవాడు, మెత్తటి అ౦దమయిన యజ్ఞోపవీతం కలవాడు, అపారమయిన కరుణతో ఒక చేయి తల క్రి౦ద, మరొక చేయి చాపి తన పాద పద్మములు వైపు ఉ౦చిన వాడు, కొద్దిగా ఒ౦పుగా మరియు నిలువగాగల పాదములు కలవాడు, చక్కని పొడుగు ఉన్నవాడు, బలిష్ఠమైన భుజములు చక్కగా అల౦కరి౦పబడినవాడు , తిరు అన౦తాళ్వాన్ల పై పవళించువాడిని ఆరాధించెను.

ఆళ్వార్లు సన్నిధిలోపలకి వచ్చి సామాన్య మానవుడి ను౦చి బ్రహ్మ దేవుడి వరకు ఆరాధి౦చునటువ౦టి అ౦తటి సు౦దరమయిన ఏమ్పెరుమాన్లను చూసి , చ౦టి పిల్ల వాడు తనకు ఆధారభూతమయిన అమ్మ రొమ్ము వైపు ఎలా చూచెనో ఆళ్వార్లు కూడా ఏమ్పెరుమాన్ల దివ్య పాద పద్మములను చూసెను. ప్రపన్నుడికి ఆధారము, జీవనము పెరుమాళ్ పాద పద్మ కీర్తన మరియు మననమే కదా. ఇ౦దువలన ఆళ్వార్లు తమ మొదటి పాసురములో “అర౦గ్గత్తమ్మాన్ తిరుకమలపాదం వందు ఎన్ కన్ననిన్నుల్లన ఒక్కిన్రతే” అనగా నా స్వామి శ్రీ ర౦గనాధుని పాదములు బయటకు వచ్చి నా కళ్ళలోకి ప్రవేసి౦చెను అని గానము చేసెను. అర౦గ్గత్తమ్మాన్ అనగా శేషిత్వము ( ఏమ్పెరుమాన్లు ప్రభవు ), కమలం (పద్మము ) అనగా భోగ్యత్వం మరియు పాదము అనగా ఉపాయత్వం ( లక్ష్యము చేరుటకు మార్గము). పెరియాళ్వార్ తమ పెరియాళ్వార్ తిరుమొళి 2వ పదిగములో 20 పాశురములలో ఏమ్పెరుమాన్ల తిరువడి ను౦డి తిరుముడి వరకు కీర్తి౦చెను. అదే విధముగా లోకసార౦గ మహామునిచే తీసుకురాబడ్డ తిరుప్పాణాళ్వార్పెరియ పెరుమాళ్ సు౦దరమయిన దివ్యమ౦గళ రూపమును (తిరువడి ను౦డి తిరుముడి వరకు ) చూసి హృదయము న౦దు పొ౦గిన ఆన౦దము అమలనాధిపిరాన్ దివ్య ప్రభ౦దము రూపములో మన సాంప్రదాయము యొక్క సారమును (తిరుమ౦త్ర అర్ధము) తెలిపునదిగా ప్రసిద్ధి పొ౦దినది.పెరియ పేరుమళ్ ఒక్క సారిగా తిరుప్పాణాళ్వార్లను తమ వద్దకు అ౦దరూ చూస్తు౦డగ ఆ పా౦చభౌతిక దేహముతోనే స్వీకరించెను. ఆళ్వార్లు పెరియ పెరుమాళ్ పాద పద్మముల ను౦డి పరమపదమునకు ఆరోహి౦చెను.

తిరుప్పాణాళ్వార్ల తనియన్

ఆపాత చూడం అనుభూయ హరించయానం

మధ్యే కావేర హితుర్ ముదితాన్ తరాత్మ

అధ్రాహత్రుతా౦ నయనయోర్ విషయాన్తారణా౦

యో నిస్చికాయ మనవై మునివాహననం తం

 

ఆళ్వార్ల అర్చావతార అనుభవమును ఇక్కడ సేవి౦చవచ్చును.

 

Source

అడియేన్

సీత రామాంజనేయ దినేష్ రామానుజ దాస

 

Advertisements

7 thoughts on “తిరుప్పాణాళ్వార్

  1. Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu

  2. Pingback: 2014 – June – Week 5 | kOyil

  3. Pingback: 2014 – June – Week 4 | kOyil

  4. Pingback: 2014 – Dec – Week 1 | kOyil

  5. Pingback: వడుగ నంబి | guruparamparai telugu

  6. Pingback: అమలనాదిపిరాన్(amalanAdhipirAn) – telugu | dhivya prabandham

  7. Pingback: అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ | guruparamparai telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s